'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు' | Kamal Haasan, Mohanlal save Priyadarshan-Lissy's marriage | Sakshi
Sakshi News home page

'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు'

Published Mon, Feb 24 2014 12:51 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు'

'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు'

చెన్నై: నటుడు కమల్ హాసన్ మా దంపతులను మళ్లీ కలిపారని నటి లిజి తెలిపారు. దర్శకుడు ప్రియదర్శన్ను ఆమె 1996లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు విదేశాలలో చదువుకుంటున్నారు.

ఇటీవల లిజికి ప్రియదర్శిన్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని, అవి విడాకులకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రియదర్శన్కు దూరం కావాలని నిర్ణయించుకున్న లిజీ ఆయన నుంచి జీవన భృతిగా రూ.80 కోట్లు కోరినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగినట్లు సమాచారం.

అయితే ఎట్టకేలకు చర్చలు ఫలవంతమై లిజీ, ప్రియదర్శన్ మళ్లీ ఒకటయ్యారట. ఈ దంపతులను మళ్లీ ఒకటి చేయటంలో నటుడు కమల్ హాసన్ ముఖ్యపాత్ర వహించారట. ఈ విషయమై లిజి స్పందిస్తూ ప్రియదర్శన్కు తనకు మధ్య చిన్న విభేదాలు చోటుచేసుకున్న సంగతి నిజమేనన్నారు. దీంతో తాము కొంతకాలం దూరంగా ఉన్నట్లు తెలిపారు. తమ మధ్య మనస్పర్థలకు కొందరు స్నేహితులే కారణమని ఆమె ఆరోపించారు.

 ప్రియదర్శన్ తాను మనసు విప్పి మాట్లాడుకోలేకపోవటం వల్లే ఈ పరిణామాలకు కారణంగా లిజి పేర్కొన్నారు. ఇప్పడవన్నీ సమసిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తమ మధ్య పొరపొచ్చాలు తొలగిపోవటానికి కమల్, గౌతమి కారణం అని తెలిపారు. అదేవిధంగా నటుడు మోహన్ లాల్, ఆయన భార్య కూడా వివాద పరిష్కారానికి ప్రయత్నించారని లిజీ పేర్కొన్నారు.

కొద్దిరోజుల క్రితం ఈ విషయమై ప్రియదర్శిన్ స్పందిస్తూ తమ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం నిజమేనని, అది విడాకులు తీసుకునేంత పెద్దది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా లిజి తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఆశించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. తమ మధ్య చోటుచేసుకున్న చిన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement