gouthami
-
అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం
ఆ పిల్లలకు అమ్మ చేతి ముద్ద ఇక అందదు. ఆ బిడ్డలకు అమ్మ ముద్దు మరి లేదు. కన్నతల్లుల క్షణికావేశం వారి పేగు తెంచుకుని పుట్టిన పిల్లలకు జీవితకాల శాపమైంది. కష్టాలకు తాళలేక, సమస్యలను ఎదుర్కోలేక, వేధింపులు భరించలేక ఇద్దరు అమ్మలు తమ జీవితాలను అర్ధంతరంగా ముగించారు. కానీ పిల్లలను అనాథలను చేశారు. తల్లిదండ్రుల మధ్య గొడవలకు చిన్నారులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలలుగా వచ్చిన విభేదాలు ఆమె ప్రాణాన్ని బలికొన్నాయి. మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన చిత్తిరి గౌతమి (25) ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌతమికి చిత్తిరి సత్యనారాయణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడే ళ్ల కుమార్తె తేజశ్విని, ఐదేళ్ల కుమారుడు షణ్ముఖనాయుడు ఉన్నారు. అయితే ఈ దంపతుల మధ్య రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటిలో ఎవ రూ లేని సమయం చూసి గౌతమి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అత్త, బావ, తోడి కోడళ్లు ఉరికి వేలాడుతున్న గౌతమిని చూసి వెంటనే పొలం పనికి వెళ్లిన సత్యనారాయణకు స మాచారం అందజేశారు. గౌతమి అమ్మానాన్నలకు కూడా విషయం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు రమణ, అప్పలసూరమ్మ ఇంటికి చేరుకొని భోరున విలపించారు. భర్త వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెతో తరచూ గొడవలకు దిగేవాడని, అనవసరంగా హింసించేవాడని తెలిపారు. గౌతమి ఆత్మహత్యపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సామంతుల రామారావు తన సిబ్బంది, శ్రీకాకుళం క్లూస్ టీమ్‌తో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త స త్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ రా మారావు కేసు నమోదు చేశారు. జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా.. లే అంటూ.. తల్లి గౌతమి మృతిచెందడం, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమ్మా..లే అంటూ చిన్నారులు పిలవడం అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది. పెట్రోల్ పోసుకుని.. టెక్కలి రూరల్, వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పూండిలో శుక్రవారం ఓ వివాహిత తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం సూర్యమణిపురం గ్రామానికి చెందిన పైల దేవిక(29) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన కామేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు ఇది మూడో వివాహం. ఈ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది. దేవికకు మరో అమ్మా యి కూడా ఉంది. కామేశ్వరరావు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నారు. ఆమె భర్తతో కలిసి పూండీలో నివాసం ఉంటున్నారు. దేవిక (ఫైల్) అయితే తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆమె నిత్యం అనుమానిస్తూ ఉండేవారు. దీనిపైనే ఆ మహిళతో గొడవలు కూడా పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెతో గొడవకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు మంటలను ఆపి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఈ ఘటనపై జూనియర్ సివిల్ జడ్జి తేజా చక్రవర్తి మల్ల బాధితురాలి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. వజ్రపుకొత్తూరు పోలీసులు వివరాలు సేకరించారు. అయితే ఆమె శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
కమల్ హాసన్‌పై గౌతమి ఫైర్
తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రధాన పార్టీలు పరస్పర విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సవాళ్లు.. ప్రతి సవాళ్లకు దిగుతున్నాయి. ముఖ్యంగా సీఎం ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య మాటల తూటాలను పేలుతున్నాయి. మహిళలను అవమానించిన డీఎంకే నేతలకు బుద్ధి చెప్పాలని ఎడపాడి పిలుపునిస్తే.. అవినీతి అన్నాడీఎంకేను ఓడించాలని స్టాలిన్ కోరుతున్నారు. అమ్మ పాలన కొనసాగాలంటే రెండాకులకే ఓటెయ్యాలని పళనిస్వామి విన్నవిస్తుంటే.. ఉదయ సూర్యుడిని గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం తరఫున కమల్‌హాసన్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో నేతలు తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధిస్తున్నారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పరస్పరం ఘాటు విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మహిళా ద్రోహి డీఎంకేకు బుద్ధి చెప్పండి : ఎడపాడి మహిళలను కించపరుస్తూ దుర్భాషలాడిన డీఎంకే నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి పిలుపునిచ్చారు. సోమవారం చెన్నై మైలాపూర్, అశోక్‌నగర్, టీ నగర్ నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. చెన్నై మేయర్‌గా, మంత్రిగా ఏళ్ల తరబడి పనిచేసిన స్టాలిన్ ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మహిళలను చులకనగా చూసే డీఎంకేను ఓడించాలని కోరారు. రెండాకులకు ఓటేసి గెలిపిస్తే ఇంటి వద్దకే రేషన్ సరుకులు చేరుస్తామని హామీ ఇచ్చారు. అమ్మ జయలలిత ఆశయాలను నెరవేర్చేలా పాలన సాగిస్తామన్నారు. ఆరు నెలల వంట గ్యాస్ ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. మనీ కోసమే ‘మణి’ల ఆరాటం : స్టాలిన్ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు ‘మణి’లు మనీ కోసం ప్రజలను యథేచ్ఛగా దోచుకున్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఎడపాడి పళనిస్వామి కేబినెట్లోని మంత్రులు వేలుమణి, తంగమణి, కేసీ వీరమణి ప్రజాధనం లూటీ చేశారని మండిపడ్డారు. కేసీ వీరమణి, అతని బినామీల ఇళ్లపై నాలుగేళ్ల క్రితం ఐటీ దాడులు జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఉదయ సూర్యుడికి ఓటేసి డీఎంకేను గెలిపిస్తే ప్రజా హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. డీఎంకే నేత, ఎంపీ కనిమోళి తిరుచెందూరులో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అన్నాడీఎంకేకు తగిన గుణపాఠం నేర్పా లని పిలుపునిచ్చారు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కమల్ మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గ ప్రజలతో ఆన్లైన్లో ముచ్చటించారు. రమ్య అనే అభిమాని మిమ్మల్ని నేరుగా చూడాలని ఉందన్నారు. ఆదివారం రాత్రి కామరాజపురంలో ప్రచారానికి వచ్చిన కమల్ ప్రసంగం మధ్యలో ఆమె పేరును పేర్కొంటూ ఆహ్వానించారు. ప్రచార వాహనం వద్దకు వచ్చిన నిండు గర్భిణి అయిన రమ్యకు డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆనందపరిచారు. కమల్‌పై గౌతమి ఫైర్ కమల్‌కు హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించిన గౌతమి.. కొన్నేళ్లపాటు ఆయనకు సన్నిహితరాలిగా మెలిగారు. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో కమల్‌పై గౌతమి పలు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని కమల్ చెబుతున్నారని, అయితే ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారో.. లేదో మే 2న తెలిసిపోతుందని చెప్పారు. మార్కెటింగ్ మాయాజాలంలో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. -
అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించొద్దు
హాలహర్వి: గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించొద్దని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. మంగళవారం హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆమె పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు గ్రామాలు, రహదారుల వివరాలను పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఈనెల ఆఖరు వరకు లాక్డౌన్ విధించిందన్నారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని, ఇతర రాష్ట్రాల వాహనాలు వస్తే వాటి వివరాలు నిశితంగా పరిశీలించాలని చెప్పారు. ముఖ్యంగా కర్ణాటక మధ్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా కర్ణాటక మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే వేదావతి నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులు కూడా సరిహద్దు పల్లెలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం మెదేహాల్, చింతకుంట గ్రామాల్లో అడిషనల్ ఎస్పీ పర్యటించి ప్రజలతో మాట్లాడారు. గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే 7993822444 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట ఆలూరు సీఐ భాస్కర్, హాలహర్వి ఎస్ఐ బాల నరసింహులు ఉన్నారు. -
కమల్‌కు ‘గౌతమి’తో చెక్
సాక్షి, చెన్నై: సినీ నటి గౌతమి ద్వారా మక్కల్ నీది మయ్యం నేత కమల్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేసింది. తమపై ఇష్టానుసారంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న కమల్ వ్యాఖ్యలపై ప్రతి దాడికి గౌతమి ద్వారా తూటాల్ని పేల్చేందుకు కసరత్తులు సాగుతున్నాయి. ఆమెకు అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టి, ఆమె సేవల్ని వినియోగించుకునేందుకు తగ్గ పరిశీలన జరుగుతోంది. ఇక, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక నిమిత్తం ఈనెల 5న కమలనాథుల వద్ద ఢిల్లీ పెద్ద అభిప్రాయ సేకరణ సాగనుంది. విశ్వనటుడు కమల్, నటి గౌతమిల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిప్రాయబేధాలతో ప్రస్తుతం ఈ ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. కమల్ మక్కల్ నీది మయ్యం ఏర్పాటుతో రాజకీయ పయనంలో బిజీ అయ్యారు. ఇక, గౌతమి టీవీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటూ ముందుకు సాగుతూ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావడం చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా బీజేపీపై కమల్ వ్యాఖ్యల తూటాల్ని , విమర్శల స్వరాన్ని పెంచి ఉండడంతో ఆయనకు సరిగ్గా సమాధానం అన్నది గౌతమి మాత్రమే ఇవ్వగలరన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చారు. దీంతో ఆమెకు తగ్గ పదవి ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఆమె సేవల్ని వినియోగించుకోవచ్చన్న సూచన రాష్ట్ర పార్టీ నుంచి బీజేపీ అధిష్టానానికి చేరింది. ఈ దృష్ట్యా, గౌతమికి అధికార ప్రతినిధి పదవి అప్పగించేందుకు తగ్గ పరిశీలన సాగుతున్నట్టు సమాచారం. చక్కటి వాక్ చాతుర్యం, సందర్భానుచిత వ్యాఖ్యలు చేయడంలో గౌతమి నేర్పరి కావడంతో ఆ పదవికి ఆమె అన్ని రకాల అర్హురాలే అన్న చర్చ కమలాలయంలో సాగుతోంది. ఇక, రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత సమరం ముగిసిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, పార్టీ అధ్యక్ష ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి పెద్దలు 5న చెన్నైకు రానున్నారు. ఇక్కడి నేతల అభిప్రాయాల్ని స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గౌతమి తన వంతు సేవలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు కొందరికి మంగళవారం కానుకల్ని అందించారు. -
‘కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’
సత్యనారాయణపురం(విజయవాడ సెంట్రల్): ‘ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నాం.. మా పెళ్లిని సమాజం హర్షించదు. కలసి బతకలేం.. విడిచి ఉండలేం..’ అని ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌లోని ఓ హోటల్లో చోటుచేసుకుంది. ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గన్నవరం మండలం తెంపల్లికి చెందిన నాగబోయిన గౌతమి (28), వెంట్రప్రగడకు చెందిన లోకేశ్(19) ఇద్దరు సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గౌతమి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, లోకేశ్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరి మధ్య వయసు తేడా ఉన్నా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా క్రిస్మస్కి దుస్తులు కోసమని చెప్పి గురువారం ఉదయం గాంధీనగర్‌లో ఒక హోటల్లో రూం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్ వెళతామని హోటల్ నిర్వాహకులకు చెప్పి ఆ సమయంలో కాలింగ్ బెల్ పెట్టాలని కోరారు. రాత్రి అయినా వారు గదిలో నుంచి బయటికి రాకపోవడంతో నిర్వాహకులు అనుమానంతో సత్యనారాయణపురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐలు సత్యనారాయణ, విమల ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలకొట్టారు. లోపల వారు మంచంపై గౌతమి విగతాజీవిగా పడిఉండగా, యువకుడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలం నుంచి యువతిని పోస్టుమార్టానికి తరలించగా లోకేశ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గౌతమి అంత్యక్రియలు పూర్తి తెంపల్లె (గన్నవరం రూరల్): మండలంలోని తెంపల్లెలో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామానికి చెందిన నాగబోయిన గౌతమి (28) విజయవాడలోని లాడ్జిలో విషం తీసుకుని మృతి చెందటం గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన రైతు నాగనబోయిన వెంకటరావు కుమార్తె గౌతమి చిన్నతనం నుంచి అందరితో ఎంతో మర్యాదగా నడుచుకునేదని స్థానికులు బెబుతున్నారు. ఎంటెక్ చదివి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో వినయంగా ఉండే గౌతమి మృతి చెందటాన్ని బంధువులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంకటరావుకు ఇద్దరు సంతానం కాగా గౌతమి కుమార్తె. ఆమెకు అన్నయ్య ఉన్నాడు. గత నవంబరు నెలలో ఆమెకు నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల వివాహం చేసేందుకు నిర్ణయించారు. ఇంతలో ఈ విధంగా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గౌతమి విషం తీసుకుని చనిపోయిందని పోలీసుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు నివ్వెరపోయారు. హుటాహుటిన విజయవాడకు వెళ్లారు. తెంపల్లెకు సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. అయితే వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు నచ్చకపోవటమే గౌతమి మృతికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. గౌతమి మృతదేహానికి శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. -
నాలుగేళ్లకు మళ్లీ!
నాలుగేళ్లు కావొస్తోంది నటి గౌతమి తమిళ స్క్రీన్‌పై కనిపించి. 2015లో వచ్చిన ‘పాపనాశం’ సినిమాలో చివరిసారి కనిపించారు గౌతమి. ఈ మధ్యకాలంలో తెలుగులో ‘మనమంతా’, మలయాళంలో ‘ఈ’ అనే సినిమాల్లో కనిపించారామె. నాలుగేళ్ల బ్రేక్ తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీరించారట గౌతమి. హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పరివాలన్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ‘తుప్పరివాలన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆశ్య కథానాయిక. ఈ సినిమాలో గౌతమి కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అవుతారు గౌతమి. ‘తు ప్పరివాలన్’ ఫస్ట్ పార్ట్‌లో సిమ్రాన్ అతిథి పాత్రలో కనిపించారు. బహుశా ఇప్పుడు గౌతమి అతిథి అయ్యుండొచ్చు. -
గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రసవం
సాక్షి, మధిర : సికింద్రాబాద్ నుంచి బిహార్ వైపు వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. షాజాన్‌బీ అనే నిండు గర్భిణి సికింద్రాబాద్‌నుంచి బిహార్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళుతోంది. మధిర రైల్వేస్టేషన్ సమీపంలోకి రైలుబండి వచ్చిన తర్వాత పురిటి నొప్పులు ఎక్కువై ఆమె ప్రసవించింది. తోటి ప్రయాణికులు మధిర రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్ సూపరింటెండెంట్ కాశిరెడ్డి ద్వారా తెలుసుకున్న 108సిబ్బంది అంబులెన్స్ వాహనంలో హుటాహుటిన మధిర రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధిరలో రైలు ఆగాక..ఆ తల్లీబిడ్డను మధిర సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. 108లో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినవారిలో ఈఎంటీ సురేష్, పైలట్ రామారావు ఉన్నారు. -
యూట్యూబ్ సెలబ్స్
ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ కొలువులు దక్కించుకుని హ్యాపీ లైఫ్ గడిపేద్దామనే ఆలోచనలు ఆధునిక అమ్మాయిలవి కాదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కాలపు యువతులవి అసలే కావు. వీటన్నింటికీ మించి ఏదో సాధించాలి. నలుగురినీ మెప్పించడంతో పాటు ప్రతిభతో తమకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి. వైవిధ్యభరిత విజయాలు లిఖించాలి అని ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. వాటి సాధన కోసం కృషి చేసి సాధిస్తున్నారు కూడా. తమ ఆశయాల ఆలోచనలను నిజం చేసుకునేందుకు సోషల్ మీడియానే వేదికవుతోంది. సాక్షి, సిటీబ్యూరో: ఒకరు తెలంగాణ అమ్మాయి హారిక అలేఖ్య. మరొకరు అనంతపూరం వాసి గౌతమిచిత్ర. వీరిద్దరూ వేర్వేరు వెబ్ సిరీస్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిది నిమిషాల నిడివి గల వీడియోస్‌ను రూపొందించి సోషల్ మీడియాలో వదులుతుంటే వాటికి వ్యూవర్స్ నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. అగ్ర కథానాయకులకు సైతం సాధ్యం గాని లక్షల వ్యూస్ వీరిద్దరి వీడియోస్‌కు రావాడం గమనార్హం. ఖాళీ సమయంలో సరదా కావాలన్నా.. ఒత్తిడిని దూరం చేయాలన్నా వీరి వీడియోస్ చూస్తే చాలు.. కావాల్సినంత రిలీఫ్ దొరుకుతుంది. వారి డైలాగ్‌లకు కడుపుబ్బా నవ్వుకోవాల్సిదే. విభిన్న ఆలోచనలతో.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్యకి చిన్నప్పటి నుంచి రేడియో జాకీ అవ్వాలనేది కోరిక. గౌతమి చిత్రకు మంచి ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష. బీబీఏ పూర్తి చేసి అమెజాన్‌లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది హారిక. ఎంసీఏ పూర్తి చేసి ఓ ఉన్నతమైన ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో గౌతమి చిత్ర అనుకోకుండా ఓ వీడియోలో కనిపించింది. హారిక ‘చిత్ర విచిత్రం’తో నెటిజన్లకు పరిచయమైతే.. గౌతమి చిత్ర ‘లాఫింగ్టైమ్’తో యూట్యూబ్ ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం ఏడాదిన్నర్రలో వీరిద్దరూ అనూహ్య క్రేజ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. చదువు.. ఉద్యోగం వంటివే ప్రధానమనుకునే కుటుంబాల్లో సోషల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారంటే వ్యతిరేకత వస్తుంది. కానీ హారికకు ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్‌నిచ్చింది. గౌతమి చిత్రకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా సిటీకి వచ్చి సెటిలై నేడు లక్షలాది మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకోగలిగింది. ఒత్తిడి పరార్ ఐటీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, ఇంట్లో ఉండేవారు.. ఏ వర్గానికి చెందినవారైనా ఒత్తిడికి గురైతే వీరిద్దరి వీడియోలనే చూడడం విశేషం. హారిక అలేఖ్య నటించిన ‘హుషార్ పిల్ల, బేరమాడితే, కళాశాల, ఫస్ట్రేటెడ్ తెలంగాణ పిల్ల, ఎంబీబీఎస్ స్టూడెంట్, సర్పంచ్, లేడీడాన్’ వంటి వాటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చెబుతున్న డైలాగ్స్‌కి, నవ్విస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వుకోవడం విశేషం. ఇక గౌతమి చిత్ర విషయానికొస్తే..‘ఫన్‌బకెట్’లో హేమంత్‌కు టీచర్‌గా, ‘పెళ్లాం వంట–గుండెల్లో మంట, రిలేటివ్స్ ఇంటికెళ్తే, ది లేట్ కామర్, అటు క్లాస్..ఇటు మాస్, సమంత పెళ్లిచూపులు’ వంటి ఎన్నో వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. భార్యగా నటించాలన్నా.. గయ్యాళిగా మెప్పించాలన్నా.. ఇన్నోసెంట్‌గా మార్కులు పడాలన్నా గౌతమి చిత్రనే బెస్ట్ అనే స్థాయికి చేరుకుంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్ వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నయూట్యూబ్ చానల్స్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హారిక ప్రాతినిధ్యం వహిస్తున్న‘దేత్తడి’ చానల్ ఏడాదిన్నరలో పదిలక్షల బ్స్క్రైబర్స్ని చేరుకోబోతుంది.గౌతమిచిత్ర ప్రాతినిధ్యం వహిస్తున్నచానల్కు ఐదు లక్షల సబ్‌స్రైబర్స్ ఉన్నారు.సినీరంగాన్ని ఏలుతున్న తారలుసమంత, రకుల్ ప్రీత్‌సింగ్, శృతిహాసన్వంటి వారు నటించిన వీడియోస్ సోషల్ మీడియా, యూట్యూబ్ చానల్స్‌లో ఐదు నుంచి పది లక్షలు వ్యూస్ ఉంటున్నాయి. హారిక, గౌతమి తమ పొట్టి వీడియోలతోఏడాదిన్నరలోనే ముప్పై, నలబై లక్షల వ్యూస్ సొంతం చేసుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న క్రేజ్ ఏంటనేది స్పెషల్గాచెప్పక్కర్లేదు. -
తోట బావి వద్ద...
యాంకర్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తోట బావి’. గౌతమి హీరోయిన్గా నటించారు. అంజి దేవండ్ల దర్శకత్వం వహించారు. గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని డ్యాన్స్ మాస్టర్ శేఖర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘తోటబావి’ టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్‌లుక్ బావుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. అంజి దేవండ్ల మాట్లాడుతూ– ‘‘యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో కొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. రవిగారు ఇచ్చిన సపోర్ట్‌తో సినిమాను బాగా తీయగలిగాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీపడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కథ, కథనాలను దర్శకుడు చాలా ఆసక్తిగా రాసుకుని, అదే తరహాలో సినిమా రూపొందించాడు. సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు ఆలూర్ ప్రకాష్ గౌడ్. ‘‘టైటిల్ లాగే సినిమా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నారు రవి. శివశంకర్ మాస్టర్, ఈ చిత్రానికి కెమెరా: చిడతల నవీన్, సంగీతం: దిలీప్ బండారి, సహనిర్మాతలు: దౌలు (విష్ణుప్రియ హోటల్), చిన్న స్వామి, అభినేష్ .బి. ∙గౌతమి, రవి -
మనోనిబ్బరంతో క్యాన్సర్‌పై విజయం
రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆ«ధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి టి. గౌతమి మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని, మనోనిబ్బరం ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనని సినీనటి టి.గౌతమి పేర్కొన్నారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా 1800 అడుగుల క్లాత్‌పై పలువురు మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు పెయింటింగ్స్ వేసారు. ఈ కార్యక్రయాన్ని ప్రారంభించిన గౌతమి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం చెప్పిరాదని, అలాగే క్యాన్సర్ కూడా ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేమన్నారు. పాజిటివ్ థింకింగ్‌తో ఉంటే సగం వ్యాధిని జయించినట్లేనన్నారు. మహిళలకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారని, కానీ పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. క్యాన్సర్ నివారణకు నేడు అత్యాధునిక వైద్యవిధానం అందుబాటులోకి వచ్చిందని, కొంత మంది నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. రూట్స్ సంస్థ బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్, అన్నే శివనాగేశ్వరరావు, చందు, కె.మధవి పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్రికార్ట్స్లో స్థానం.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేలా తైలవర్ణ చిత్రాలతో 1800 అడుగుల పెయింటింగ్స్ వేసినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం పొందింది. ఈ సందర్బంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రతినిధులు, రూట్స్ ఫౌండేషన్‌కు సర్టిఫికెట్ అందజేసారు. -
ఎన్నికల ప్రచారానికి సిద్ధం
పెరంబూరు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి తాను సిద్ధమని నటి గౌతమి పేర్కొన్నారు. నటుడు కమలహాసన్ నుంచి దూరం అయిన తరువాత ఈమె సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తరచూ తనదైన బాణీలో స్పందిస్తున్నారు. ఆ మధ్య ప్రధాని మోదిని కలిశారు. దీంతో గౌతమి బీజేపీ తీర్థం పుచ్చుకోనుందనే ప్రచారం వైరల్ అయ్యింది. అయితే ఆ విషయం గురించి గౌతమి స్పందించలేదు. బుధవారం విరుదునగర్‌లోని విద్యార్థులతో సమావేశం అయిన గౌతమి ప్రజల ఆహారపు అలవా ట్లపై మాట్లాడారు. అదే విధంగా సమాజంలో మధ్య తరగతి ప్రజలు చాలా మంది ప్రభుత్వ రేషన్ షాపుల్లో ఉప్పు, చక్కెర వంటి నిత్యావసరం వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్నారు. అయితే వాటిలో నాణ్యత కొరవడుతోందని ఆరోపించారు. అలాంటి వాటి వాడకం ద్వారా వివిధ రకాల వ్యాధులకు ప్రజలు గురవుతున్నారన్నారు. అదే విధంగా పొగత్రాగడం వంటి అలవాట్లలో కేన్సర్ వ్యాధికి గురవుతున్న వారిని చూస్తున్నామన్నారు. ఇక మద్యం మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై ఉదాసీనత చూపిస్తే అంగీకరించేది లేదన్నారు. చక్కెర, ఉప్పు, మైదా వంటి నిత్యావసర వస్తువుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం అయితే తాను ప్రచారం చేస్తానని గౌతమి పేర్కొన్నారు. అయితే ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్న విషయాన్ని ఆమె తెలపలేదన్నది గమనార్హం. -
పెళ్లైన ఆనందం తీరక ముందే..
శ్రీకాకుళం, నరసన్నపేట: పెళ్లైన ఆనందం తీరకముందే ఓ యువకుడ్ని డెంగీ మహమ్మారి బలితీసుకుంది. కట్టుకున్న యువతిని కన్నీరు పాల్జేసింది. వివరాల్లోకి వెళితే.. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లికి చెందిన బూరాడ గణేష్ (26) నరసన్నపేట గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన లుకలాం గ్రామానికి చెందిన గౌతమితో వివాహం అయింది. ప్రస్తుతం గౌతమి గర్భిణి. గడిచిన వారం రోజులుగా గణేష్ జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుల వద్ద చికిత్స పొందాడు. అయితే జ్వరం తగ్గక పోగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గణేష్ తన వైవాహిక జీవతంపై ఎన్నో కలలు కన్నాడు. పుట్టిన పిల్లలను బాగా చదివించాలని, ఆదర్శంగా పెంచాలని భార్యతో అంటుండేవాడు. గణేష్‌ది వ్యవసాయక కుటుంబం. స్వశక్తితో జీవనం సాగించాలనే ఆశయంతో వెల్డింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ తన భార్యను అపురూపంగా చూసుకొంటూ వస్తున్నాడు. ఈ దశలో అతన్ని డెంగీ వ్యాధి బలితీసుకుంది. భర్త ఆకస్మిక మృతితో భార్య గౌతమి కన్నీరు మున్నీరవుతోంది. విధివంచితురాలు.. కాగా పదేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో గౌతమి తండ్రి రామారావు మృతి చెందారు. వివాహానికి కొద్దిరోజుల ముందు తల్లి రాజేశ్వరి కిడ్నీ వ్యాధితో మరణించింది. తాజాగా భర్త గణేష్ మృతితో గౌతమి తీవ్ర విషాదంలో ఉంది. -
గౌతమి మరణం వెనుక మిస్టరీలెన్నో?
చీరాల: నాలుగేళ్ల క్రితమే వివాహమైన గౌతమి (27) రామాపురం వద్ద తీరంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోపణలు సైతం తమ కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. చీరాలకు చెందిన గౌతమి గురువారం సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు కూడా ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. 7నెలలుగా భర్త కోటా వెంకటరామకృస్ణ మణికంఠ పవన్‌కుమార్, గౌతమి మధ్య విభేదాలు ఉన్నాయి. కట్నం విషయంలో కూడా వీరి మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంట్లో భార్యభర్తల మధ్య జరుగుతున్న వివాదాలను గౌతమి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఇది ఇలా ఉంటే ఎంజీసీ మార్కెట్లో వస్త్రదుకాణం మూసేసి ఇంటికి వచ్చిన పవన్‌కుమార్ తెల్లవారే సరికి తమ భార్య లేకపోవటంతో గమనించి ఆమె రామాపురం బీచ్‌లో వికటజీవిగా పడి ఉందని సమాచారం తెలుసుకుని వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళ లేదా తెల్లవారు జామున గౌతమి ఒంటరిగా రామాపురం బీచ్‌కు వెళ్లి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సముద్రంలో మునిగి అదే ప్రాంతంలో కొట్టుకురావడం అసాధ్యం. అలలు, గాలి తాకిడికి ఒకచోట మునిగితే శవమైన తర్వాత మరో ప్రాంతంలో శవం ఒడ్డుకు కొట్టుకొస్తుంది. గౌతమి మృతదేహం మాత్రం మునిగిన ప్రాంతంలోనే శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది -
మహిళా దినోత్సవం నాడు ఇంత దారుణమా?
సాక్షి, చెన్నై : ఓ వైపు ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల దాష్టికానికి ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడును దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ నటి గౌతమి గురువారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. గర్భిణీ మృతి ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచ్చిలో పోలీసుల తీరుతో నిండు గర్భిణి మృతి చెందడం తనను కలిచి వేసిందని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం రోజునే ఇలాంటి దారుణం జరగడం సమాజానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచ్చిలోని గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా తాకడంతో దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. -
కమల్ నా పారితోషికం చెల్లించలేదు!
టీ.నగర్: తనకు అందాల్సిన పారితోషికం నటుడు కమలహాసన్ చెల్లించలేదని నటి గౌతమి ఆరోపించారు. నటుడు కమలహాసన్ తన భార్య సారికను విడిచి జీవిస్తుండగా నటి గౌతమి కమల్‌తో పదేళ్లుగా కలిసి జీవించారు. 2016 అక్టోబర్‌లో ఆమె కమల్‌ను విడిచి బయటికి వచ్చారు. ఆ తర్వాత ఇరువురూ ఒకటిగా చేరలేదు. ప్రస్తుతం కమలహాసన్ రాజకీయ ప్రవేశం చేసి ప్రత్యేక పార్టీ ప్రారంభించడంతో కమల్, గౌతమిలు కలిసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. దీన్ని నటి గౌతమి ఖండించారు. దీనిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తామిరువురం కలిసి జీవించనున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తెలిపారు. 2016లో ఆయనను విడిచి వచ్చిన తర్వాత ఎలాంటి సంబంధాలు లేవన్నారు. తాను, తన కుమార్తె భద్రంగా జీవించాలనే ఉద్దేశానికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆర్థిక భద్రత కోసం తగిన చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కమల్ రాజ్‌కమల్ సంస్థలో కాస్ట్యూమర్‌గా పనిచేశానని, కమల్ నటించిన విశ్వరూపం, దశావతారం చిత్రాలకు వివిధ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు ఆయన చెల్లించాల్సిన పారితోషికం ఇంకా చెల్లించలేదని, దీన్ని అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పారితోషికం ఇవ్వనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాను, కమల్ విడిపోవడానికి ఆయన కుమార్తెలు శ్రుతి, అక్షర కారకులుగా చెప్పడం సరికాదని, ఇందులో వారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇకపై అన్నింటినీ భరించి కలిసి జీవించడం కష్టమని, ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో బయటికి వచ్చానని, ఇక కలిసి జీవించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కమల్ పార్టీలోకి 2 లక్షల మంది తన పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకులు, నటుడు కమలహాసన్ తెలిపారు. కమలహాసన్ ప్రారంభించిన అధికారపూర్వక వెబ్సైట్లో ఆ పార్టీలో చేరేందుకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అందింది. తిరుచ్చిలో ఏప్రిల్ 4న సభ: కమల్ తిరుచ్చిలో ఏప్రిల్ నాలుగో తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కమలహాసన్ ప్రకటించారు. అదే సమయంలో నెడువాసల్ వెళ్లేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. -
ఘోరం
శ్రీకాకుళం , భామిని: పట్టపగలు.. అందరూ తిరుగాడుతున్న రోడ్డు పక్కనే ఘోరం చోటు చేసుకుంది. ఓ అమాయిక గిరిజన వివాహిత దారుణ హత్యకు గురైంది. ఓ కామాంధుడి చేతిలో లైంగికదాడికి గురై, ఆపై ప్రాణాలు కోల్పోయిందని సంఘటన తీరుబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం... భామిని మండలం వడ్డంగిగూడకు చెందిన తాడంగి మనోహర్‌కు రాయగడకు చెందిన గౌతమి(25)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు కలగకపోయినను అన్యోన్యంగా ఉంటూ జీవిస్తున్నారు. గ్రామానికి సమీపంలో జీడితోట వద్ద పశువుల పాక నిర్మించి ఆవులు, మేకలు పెంచుకొంటున్నారు. పగలంతా పశువులను మేపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గౌతమి భర్త మనోహర్ అటవీ హక్కుల పుస్తకం కోసం భామినిలోని తహసీల్దార్ కార్యాలయానికి గురువారం వెళ్లాడు. అయితే మధ్యాహ్న సమయంలో గౌతమి ఒక్కదాయే శాల వద్ద పశువులను మేపిస్తుంది. ఎవరూ లేకపోవడాన్ని గమనించిన ఓ కామాంధుడు గౌతమిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ప్రతిఘటించిన ఆమెను తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెను బలంగా కొట్టి హత్యకు పాల్పడ్డాడు. వడ్డంగిగూడ నుంచి మూలగూడకు వెళ్లే రోడ్డు పక్కనే ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అటువైపుగా వెళ్లిన ఆదివాసీలు కొందరు గౌతమి పరిస్థితిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతురాలి తలపై గాయాలు ఉండడం, చెవుల నుంచి రక్తం కారడం, దుస్తులు నిండా రక్తపు మరకలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు. ఎవరో లైంగికదాడి చేసిన తర్వాత హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌతమి మృతితో భర్త మనోహర్, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గౌతమి వడ్డంగిగూడలోనే బంధువుల ఇంటి వద్ద ఉంటూ పదవ తరగతి వరకు చదువుకుంది. పెళ్లైన తర్వాత భర్తతో కొన్నాళ్లు వలస వెళ్లింది. తిరిగి భార్యాభర్తలు వచ్చి స్థానికంగా స్థిరపడినట్టు మృతురాలి అత్త రవణమ్మ విలపిస్తుంది. ఈ ఘటనపై స్థానిక వీఆర్ఏ నిమ్మల కర్ణ ఫిర్యాదు మేరకు వీఆర్ఓ సీహెచ్ భారతి, బత్తిలి ఎస్సై ఎం.ముకుందరావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేశారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుబంధానికి మతం అడ్డు కాదు..
హైదరాబాద్: నేను తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను.కామన్ ఫ్రెండ్ ద్వారా జలాల్ఖాన్ ఫోన్లో పరిచయమయ్యారు. ఆరు నెలలు కనీసం కలుసుకోలేదు. సంవత్సరం తర్వాత ప్రపోజ్ చేశాడు. అప్పటికే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. తర్వాత ఓ రోజు ఇంటికి వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడాడు. కానీ.. ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ఏడాది పట్టింది. ఇప్పుడు మాకో పాప. ఇప్పటివరకు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగింది. మతాలు వేరైనా సంప్రదాయాలను గౌరవించుకుంటాం. ఆయన ప్రతిరోజు నమాజ్ చేస్తారు. నేను పూజ చేసి దీపం పెడతాను. అలా మా ఇంట్లో రంజాన్, సంక్రాంతి రెండూ జరుపుకుంటాం. అలవాట్లు, ఆలోచనలు, పద్ధతులను ఇబ్బంది పెట్టనంత కాలం.. ప్రేమ ప్రియంగానే ఉంటుందని నా అభిప్రాయం. పాప పుట్టాక మా బంధం ఇంకా బలపడింది. ఈసారి వాచ్ గిఫ్ట్‌గా ఇస్తున్నాను. బిజినెస్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే తనకు.. ఆ వాచ్ చూసినప్పుడు నేను, పాప ఇంట్లో వేచిచూస్తున్నామని గుర్తు చేసేందుకే ఈ ప్లాన్. – గౌతమి, యాంకర్ -
శ్రీగౌతమిది రోడ్డు ప్రమాదమే, కాదు.. హత్యే
నరసాపురం : ‘మా అక్కది ముమ్మాటికీ హత్యే. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని కుటుంబ సభ్యులు పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నేను ఎంత చెప్పినా.. పట్టించుకోకుండా పోలీసులు రోడ్డు ప్రమాదమని కేసు మూసేశారు’ అని శ్రీ గౌతమి చెల్లెలు దంగేటి పావని ఆరోపించింది. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందని ఆక్రోశించింది. (శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదమే) తన అక్క కేసులో అన్ని వివరాలూ పోలీసులకు చెప్పానని, తన అక్క హత్యలో టీడీపీ నేత సజ్జాబుజ్జి, అతని భార్య శిరీష, అతని అనుచరుడు బొల్లంపల్లి రమేష్, కారు డ్రైవర్ రాంబాబు పాత్ర ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా అధికారపార్టీకి దాసోహమయ్యారని తీవ్రంగా విమర్శించింది. ఎఫ్ఐఆర్లో తన స్టేట్మెంట్ కాపీని కూడా మార్చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. స్టేట్మెంట్ కాపీపై తన సోదరుడు పెట్టిన సాక్షి సంతకం లేదని, అసలు తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపించింది. నా ఇంటి చుట్టూ పోలీసుల నిఘా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఘటన తర్వాత ఘాతుకానికి పాల్పడిన బుజ్జి కుటుంబం హాయిగా ఉందని, అధికార పార్టీ నాయకుడు, డబ్బున్నవాడు కావడం వల్లే అతని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పావని మండిపడింది. అదే సామాన్యుడైతే ఈ పాటికే అరెస్ట్ చేసేవారు కాదా? అని ప్రశ్నించింది. ఎవర్నో తీసుకొచ్చి ఈ కేసులో నిందితులుగా చూపించారని, వారిపై ఈవ్‌టీజింగ్ కేసు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మరోమారు పాలకొల్లు రూరల్ స్టేషన్లో కేసు పెట్టామని పేర్కొంది. శనివారం తన తల్లి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదని, తర్వాత విలేకరుల సాయం అడిగితే అప్పుడు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేసింది. లేకుంటే పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించింది. పోరాటంలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనని స్పష్టం చేసింది. నీచ ప్రచారంపై ఆగ్రహం కొందరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, రూ.30 లక్షలకు కేసు రాజీ అయిపోయిందంటూ నీచ ప్రచారం చేస్తున్నారని పావని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళన సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసుపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ మాట్లాడుతూ మన దేశంలో బహుభార్యత్వం లేదు కదా, మరి బుజ్జి శ్రీగౌతమిని మభ్యపెట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటే, ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారపార్టీ వారికి ఏమైనా వెలుసుబాటు ఇచ్చారేమో అని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ ఇంత ఘోరం జరిగినా జిల్లాలో మంత్రులు నోరు మెదపకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తల్లి తల్లడిల్లింది విలేకరుల సమావేశంలో శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి కన్నీరుమున్నీరైంది. కర్కోటకంగా తన కూతురి ప్రాణాలు తీశారని తల్లడిల్లింది. సమాజంలో ఆడపిల్లకు రక్షణ లేదని, అందుకే కాబోలు కొందరు ఆడపిల్లలను పురిటిలోనే చంపేసుకుంటున్నారని విలపించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. పెద్ద కూతురు పోయింది. రెండో కూతరు భవిష్యత్ ఏమిటో అర్ధంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
నిజం చావకూడదు!
గౌతమి ఆవేదన ఏంటి? తను రాజకీయాల్లోకి రావాలనుకుంటోందా? కమల్‌హాసన్‌తో తెగతెంపుల తర్వాత ఈ సడన్ బరస్ట్ ఏంటి? గౌతమి మాట్లాడుతోందా? ఎవరైనా మాట్లాడిస్తున్నారా? జయలలితకీ, గౌతమికీ కనెక్షన్ ఏంటి? ‘పురట్చి తలైవి’ సమాధి అయిపోయింది కానీ, నిజం సమాధి కాకూడదు గౌతమితో వన్ టు వన్ ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... ⇔ జయలలిత చికిత్స వెనక ఉన్న రహస్యం తెలుసుకోవాలని చాలామందికి ఉంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరూ రాలేదు. మొదటి గంట మీరు కట్టారు. ఏమిటా ధైర్యం? మన కళ్ల ముందు ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు తట్టుకోవడం కష్టమవుతుంది. భరించలేని బాధ ఉంటుంది. ఆ బాధ మనల్ని మాట్లాడేలా చేస్తుంది. ఇక్కడ నా ధైర్యం గురించి మాట్లాడే ముందు నా బాధ గురించి మాట్లాడాలి. ఒక సామాన్య పౌరురాలిగా ‘అసలు జయలలితగారి ఇన్నాళ్ల చికిత్స వెనక ఏం జరిగింది?’ అని తెలుసుకునే హక్కు నాకు ఉందనిపించింది. అందుకే మాట్లాడాను. ⇔ జయలలిత గారికి దగ్గరుండి చికిత్స చేయించినవాళ్ల బ్యాక్‌గ్రౌండ్ మామూలుది కాదు... వాళ్లను ఎదుర్కోవడం కష్టాలు కోరి తెచ్చుకోవడమేనని కొందరి ఫీలింగ్!! ఏమోనండి. అవతలివాళ్లు ఏంటి అనేది నేను ఆలోచించలేదు. కళ్ల ముందు జరిగిన ఘటనకు çసరైన సమాధానం లేదు. జయలలితగారిని కోట్ల మంది అభిమానిస్తున్నారు. వాళ్లందరూ చివరి రోజుల్లో ఆమెకు ఎటువంటి చికిత్స అందించారోననే విషయం గురించి ఓ క్లారిటీ కావాలనుకుంటున్నారు. పర్సనల్‌గా నాకు ఆవిడంటే చాలా అభిమానం. గడచిన 20 ఏళ్లల్లో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ సమయాల్లో ఆవిణ్ణి తలుచుకునేదాన్ని. జయలలితగారిని ఆదర్శంగా తీసుకుని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇతరులు ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి జీవితానికి సంబంధించిన బోలెడన్ని ప్రశ్నలు మిగిలిపోయినప్పుడు సమాధానం ఆశించడం తప్పు కాదు. ఆవిడ ఏమైనా... సాదాసీదా వ్యక్తా? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇవాళ ఇండియాలో చాలా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అలాగే జయలలితగారు ‘రేసీ’ పొలిటికల్ లీడర్. ఆవిడ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోకూడదు. ⇔ జయలలిత ఆప్తురాలు శశికళపై చాలామందికి అనుమానాలున్నాయి. రహస్య చికిత్సలో కుట్ర ఉందని నమ్ముతున్నారా? ఇక్కడ ఒకరి నమ్మకం.. మరొకరి అపనమ్మకంతో∙ఏదీ నిర్ణయించలేం. నమ్మకాలు నిజం కావొచ్చు. అపనమ్మకాలు అబద్ధం కావొచ్చు. ప్రధాన మంత్రిని నేను కోరిందేంటంటే.. ముందు ‘ఫ్యాక్ట్’ ఏంటో తెలుసుకోమని. అది తెలిశాక ప్రోసీడ్ అవ్వాలి. అలా చేయడమే మర్యాద. వాళ్లన్నారనీ, వీళ్లన్నారనీ కొందరిని అనుమానించి, ఆ దిశగా అడుగులు వేయకూడదు. నిజం తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయాలి. ⇔ మీరు స్పందించిన తర్వాత మరికొన్ని గొంతులు బయటికొచ్చాయ్. కానీ, జయలలితగారు ఆస్పత్రిలో ఉన్నప్పుడు మీరు స్పందించి ఉంటే ఉపయోగం ఉండి ఉండేదేమో? జయలలితగారు అడ్మిట్ అయిన తర్వాత ఆవిడ పరిస్థితి తెలుసుకోవాలని, చూడాలని ఆస్పత్రికి వెళ్లినవాళ్లను అనుమతించకపోవడం ఏంటి? అసలెందుకంత రహస్యం? ఆవిడ రికవర్ అవుతున్నారని, ఫిజియోథెరపీ చేస్తున్నామని అప్పుడప్పుడూ కొంత సమాచారం ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. సరే... ఎవర్నీ ఆస్పత్రి లోపలికి అనుమతించకపోయినా... ఆవిడ బాగానే ఉన్నారనుకున్నాను. ఇంకో రోజులో డిశ్చార్జ్ అవుతారనే వార్త వచ్చాక ‘ఏం ఫర్వాలేదు’ అనుకున్నాను. నేనే కాదు, జయలలితగారు ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి ‘ఇదిగో వస్తారు.. అదిగో వస్తారు’ అని అందరం అనుకుంటూ వచ్చాం. సడన్‌గా గుండెపోటు వచ్చిందని ప్రకటించారు. ఆ తర్వాత ‘ఇక లేరు’ అని వార్త విని షాకయ్యాను. ఆవిడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పలేదు. ఐసీయూలోనూ లేరు. మరి, సడన్‌గా చనిపోవడమేంటి అనేది చాలామందిలోని ప్రశ్న. ⇔ జయలలిత విషయంలో మీరు స్పందించడం వెనక రాజకీయ నేతల అండదండలు ఉండి ఉంటాయని ఊహాగానం! భలేవారే! నాకెవరి అండదండలూ లేవండి. అంత సపోర్ట్ ఉండి ఉంటే.. నేను ఈ మధ్య ఓ పెద్ద నిర్ణయం తీసుకుని బయటికొచ్చినప్పుడు.. ఎక్కడ ఉండాలో తెలియక ఓ నెల రోజులు నా ఆఫీసులో ఉన్నాను. ఆ తర్వాత ఇల్లు చూసుకున్నాను. ఓ ఎమోషనల్ మూమెంట్ నుంచి నన్ను నేను బయటకు లాక్కుని మామూలు మనిషి కాగలిగాను. ఒకసారి నా జీవితం గురించి ఎనలైజ్ చేసుకున్నాను. ‘మనం ఎలాంటి హ్యుమన్ బీయింగ్? ఇన్నేళ్లు లైఫ్‌ని ఎలా లీడ్ చేశాం? ఇక మీద ఎలా ఉండాలి?’ అని ఆలోచించుకుని, ధైర్యంగా నిలబడ్డాను. అండదండలు మెండుగా ఉండి ఉంటే ఇంతలా ఎందుకు ఆలోచిస్తాను? ⇔జయలలిత అంటే మీకెందుకంత అభిమానం? ఆవిడకూ, మీకూ కనెక్షన్ ఏంటి? మృతదేహాన్ని చూసి అంతలా ఎమోషన్ అయ్యారెందుకని? ఆమె నా పెళ్లికి వచ్చి, ఆశీర్వదించారు. ఆ తర్వాత ఓసారి కలిశాను. మూడు నాలుగు నిమిషాలు మాట్లాడి ఉంటానేమో. అప్పుడూ ఆవిడంటే ఇష్టమని చెప్పలేదు. ‘ఆడవాళ్లు ధైర్యంగా బతకాలి’ అని ఆవిడ తన లైఫ్ ద్వారా చూపించారు. ధైర్యాన్ని వెతుక్కునే ప్రతి స్త్రీకీ జయలలితగారు గొప్ప ఆదర్శం. ఆవిడ జీవితం అందరికీ తెలిసిందే. జయలలితగారు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరు నాకిష్టం. అందుకే ఆవిడంటే చాలా అభిమానం. ⇔ ఆ మధ్య మోదీగారిని కలిశారు కాబట్టి జయలలితగారి గురించి ఆయనే మీతో ట్విట్టర్లో లెటర్ పెట్టించి ఉంటారనీ... అస్సలు లేదండి. ఈ విషయంలో వేరే విధంగా ఆలోచించొద్దు. హుందాగా బతకాలనుకునే ఓ మహిళగా సాటి మహిళ.. అందులోనూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకున్నాను. జయలలితగారు చాలా హుందాగా బతికారు. ఆవిడ చివరి రోజుల గురించి తెలుసుకోవాలనే తపన ఓ పౌరురాలిగా, ఆవిణ్ణి అభిమానించే వ్యక్తిగా నాకుంది. నేను నడుపుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’ గురించి మోదీగారితో మాట్లాడి, ఆయన సలహాలు తీసుకోవడానికే కలిశా. అంతే! అంత మాత్రానికే ఆయన మనోభావాలను నా భావాలుగా ట్విట్టర్లో పెట్టించేస్తారా? ⇔ ట్విట్టర్లో మీరు లెటర్ పెట్టాక వచ్చిన స్పందన? ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. జయలలితగారి చుట్టూ ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఎంతమందికి ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘మీరెందుకు స్పందించారు?’ అని ఒక్కరు కూడా అడగలేదు. ⇔ మీ ఉత్తరానికి మోదీగారి నుంచి సరైన స్పందన వస్తుందనే అనుకుంటున్నారా? 99 శాతం వస్తుంది. ఆ విషయంలో డౌటే లేదు. మోదీగారు ప్రతిభావంతులు. దేశం కోసం ఆలోచించే వ్యక్తి. అందరి ప్రశ్నలకూ సమాధానం దొరుకుతుందనే నమ్మకం ఉంది. ⇔ ట్విట్టర్లో మీ లేఖ చూశాక ప్రభుత్వం వేగంగా కదిలిందనుకోవచ్చా? అందుకు ఓ ఉదాహరణ టీటీడీ బోర్డ్ మెంబర్, అన్నాడీఎంకేలో ఒక వర్గానికి సన్నిహితుడని భావిస్తున్న శేఖర్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు.. ఓ సామాన్య పౌరురాలి ఆవేదనకు ప్రభుత్వం ఇంత చురుకుగా కదిలిందంటే అది హ్యాపీయే. కానీ, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐటీ దాడులనేవి ఇప్పటికిప్పుడు జరపలేరు. కొన్ని రోజులుగా పథకం వేసి, ఆ తర్వాత చేస్తారు. ⇔ ∙రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఇది తొలి అడుగా? అస్సల్లేదండి. ఇంతకు ముందు చెప్పినట్లు నా ప్రస్తుత లక్ష్యం మా అమ్మాయి. వేరే దేని గురించీ ఆలోచించట్లేదు. ⇔ ∙‘విశ్వరూపం’ టైమ్‌లో జయలలితకీ, కమలహాసన్కీ మధ్య మనస్పర్థలొచ్చాయి. కమల్ నుంచి విడిపోయాక ఆయనపై కోపంతోనే ఇప్పుడు మీరు జయలలితపై స్పందించారని... ప్రపంచంలో ఇంతకన్నా అమానుషం మరోటి ఉండదు. నా మనసులో ఫీలింగ్‌కి ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ముడిపెట్టడం సరి కాదు. పనీపాటా లేనివాళ్లు ఒక గదిలో కూర్చుని ఇలాంటివి మాట్లాడతారనుకుంటా. ఏదో విషయానికి మరేదో విషయంతో పోలిక పెడితే ఈ ప్రపంచంలో బతకడం కష్టం. ఇలాంటి పోలికలు పెట్టి, ‘మేం తెలివిగలవాళ్లం’ అని ఫీలైపోతుంటారేమో. అసలు నా వ్యక్తిగత విషయానికీ, జయ విషయానికీ పోలికేంటి? ⇔ అంటే... కమల్ మీద మీకెలాంటి కోపం లేదంటారు? ఆ వ్యక్తి మీద కోపం, కక్ష ఉంటే అంత హుందాగా ఆ ఇంటి నుంచి బయటకు రాను. ఆయన కూడా డిగ్నిఫైడ్ పర్సన్. మేమిద్దరం మా డిగ్నిటీని కాపాడుకున్నాం. విడిపోవాలన్నది ఇద్దరి నిర్ణయం. అది నేను స్పష్టంగా ఆ రోజు నా లెటర్ ద్వారా అందరికీ చెప్పా ను. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకిలా చేస్తాను? నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా హుందాగా బతికాను. డబ్బు సంపాదన కూడా ముఖ్యం అనుకోలేదు. జీవితంలో హుందాగా బతకాలనుకున్నాను. ⇔ దాదాపు పదిహేనేళ్లు కమల్‌గారితో కలిసి ఉన్నారు. సడన్‌గా బయటికొచ్చేశారు. యాభై ఏళ్ల వయసుకు దగ్గరవుతున్నప్పుడు ఇలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం...? నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అది అని ఆ రోజే ట్విట్టర్లో చెప్పాను. నా వయసులో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం. కానీ, తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ‘పరిస్థితిలో మార్పు వస్తుంది’ అని కొన్ని చాన్సులు ఇచ్చి చూసుకున్నాను. ‘ఇక ఇలానే ఉంటుంది’ అని ఇద్దరికీ తెలిసిపోయింది. అందుకే ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం. ఉదయం లేచినప్పుడు ‘ఈ రోజు బాగుంటుంది. భవిష్యత్తు బాగుంటుంది’ అనే ఆలోచనతో నిద్ర లేవాలి. ఈరోజు ఎలా ఉంటుందో? ఎంత భారంగా గడుస్తుందో అనుకోకూడదు. ⇔ మీ టీనేజమ్మాయి సుబ్బలక్ష్మి ఈ మార్పునెలా తీసుకుంది? ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్’. వెరీ మెచ్యూర్డ్. మొత్తం అర్థం చేసుకుంది. ⇔ ‘నా జీవితంలో తొలి ప్రాధాన్యం నా కూతురు’ అని గతంలో అన్నారు. ఆమె ఎలా స్థిరపడాలనుకుంటున్నారు ఇప్పుడు చదువుకుంటోంది. ఏం చేయాలి? ఎలా సెటిల్ కావాలనే నిర్ణయాలు తీసుకోవడం చాలా తొందరపాటు అవుతుంది. కానీ, ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతాను. ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యం నా కూతురే. పిల్లలు తమను ఈ ప్రపంచంలో తీసుకురమ్మని అడగరు. తల్లితండ్రులు కంటారు. భూమ్మీదకు తీసుకురావడంతో పనైపోయిందనుకోకూడదు. వాళ్ల కోసమే బతకాలి. మన మీద ఆధారపడ్డ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. అప్పుడే ఆ మాతృత్వానికి ఓ అర్థం ఉంటుంది. ⇔ ప్రస్తుతం మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ మధ్య రెండు సినిమాల్లో నటించారు. కంటిన్యూ అవుతారా? సినిమాల్లో నటించాలనుకుంటున్నా. సీరియల్స్ కూడా చేయాలనుకుంటున్నా. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేస్తా. నిర్మాతగానూ చేయాలనుంది. చూద్దాం. – డి.జి. భవాని -
అమ్మ మృతి పై అనుమానాలున్నాయి
-
ఆకతాయిల వేధింపులతో బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: పోకిరీల వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఆల్వాల్‌లోని కేఎంఆర్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న గౌతమి(16)ను కొందరు వేధిస్తున్నారు. వారి చేష్టలను తట్టుకోలేని బాలిక గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు ఆమె తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, నాని, ఘని అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'మమ్మల్ని కమల్ హాసన్ కలిపారు'
చెన్నై: నటుడు కమల్ హాసన్ మా దంపతులను మళ్లీ కలిపారని నటి లిజి తెలిపారు. దర్శకుడు ప్రియదర్శన్‌ను ఆమె 1996లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కల్యాణి అనే కూతురు, సిద్దార్థ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు విదేశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల లిజికి ప్రియదర్శిన్కు మధ్య విభేదాలు తలెత్తాయని, అవి విడాకులకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రియదర్శన్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్న లిజీ ఆయన నుంచి జీవన భృతిగా రూ.80 కోట్లు కోరినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు చర్చలు ఫలవంతమై లిజీ, ప్రియదర్శన్ మళ్లీ ఒకటయ్యారట. ఈ దంపతులను మళ్లీ ఒకటి చేయటంలో నటుడు కమల్ హాసన్ ముఖ్యపాత్ర వహించారట. ఈ విషయమై లిజి స్పందిస్తూ ప్రియదర్శన్‌కు తనకు మధ్య చిన్న విభేదాలు చోటుచేసుకున్న సంగతి నిజమేనన్నారు. దీంతో తాము కొంతకాలం దూరంగా ఉన్నట్లు తెలిపారు. తమ మధ్య మనస్పర్థలకు కొందరు స్నేహితులే కారణమని ఆమె ఆరోపించారు. ప్రియదర్శన్ తాను మనసు విప్పి మాట్లాడుకోలేకపోవటం వల్లే ఈ పరిణామాలకు కారణంగా లిజి పేర్కొన్నారు. ఇప్పడవన్నీ సమసిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తమ మధ్య పొరపొచ్చాలు తొలగిపోవటానికి కమల్, గౌతమి కారణం అని తెలిపారు. అదేవిధంగా నటుడు మోహన్ లాల్, ఆయన భార్య కూడా వివాద పరిష్కారానికి ప్రయత్నించారని లిజీ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఈ విషయమై ప్రియదర్శిన్ స్పందిస్తూ తమ మధ్య చిన్న గొడవ జరిగిన విషయం నిజమేనని, అది విడాకులు తీసుకునేంత పెద్దది కాదని స్పష్టం చేశారు. అదేవిధంగా లిజి తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఆశించినట్లు జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. తమ మధ్య చోటుచేసుకున్న చిన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. -
సహజీవనం సాగించడంలో తప్పేముంది?
నటి గౌతమికి ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నట్లు ప్రఖ్యాత నటుడు పద్మశ్రీ కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. కమల్ హాసన్, సారికలు మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే. నటి సారిక ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు. కమల్ మాత్రం గౌతమితో సహజీవనం చేస్తున్నారు. అయితే కమల్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అలాంటిది ఇటీవల మలయాళ పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూలో నటి గౌతమితో సహజీవనం గురించి వివరించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- గౌతమి తనతోనే ఉంటున్నారని తెలిపారు. ఆమె భయాందోళనలు తాను అర్థం చేసుకున్నానని, ఆమెకు కావలసిన ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నానని చెప్పారు. కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే బంధం బలపడుతుందన్నారు. మనసుకు నచ్చిన ఆడ, మగ కలిసి జీవించడంలో తప్పేముందంటూ ప్రశ్నించారు. విమర్శకులు ఎలాగో విమర్శిస్తూనే ఉంటారన్నారు. ‘మనసులు కలిసిన వాళ్ళు సహజీవనం సాగించడాన్ని ఇతరులెందుకు వ్యతిరేకించాలి?’ అంటూ తనదైన శైలిలో కమల్ స్పందించారు.