
మధిర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాజాన్‌బీ
సాక్షి, మధిర : సికింద్రాబాద్ నుంచి బిహార్ వైపు వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. షాజాన్‌బీ అనే నిండు గర్భిణి సికింద్రాబాద్‌నుంచి బిహార్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళుతోంది. మధిర రైల్వేస్టేషన్ సమీపంలోకి రైలుబండి వచ్చిన తర్వాత పురిటి నొప్పులు ఎక్కువై ఆమె ప్రసవించింది. తోటి ప్రయాణికులు మధిర రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్ సూపరింటెండెంట్ కాశిరెడ్డి ద్వారా తెలుసుకున్న 108సిబ్బంది అంబులెన్స్ వాహనంలో హుటాహుటిన మధిర రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధిరలో రైలు ఆగాక..ఆ తల్లీబిడ్డను మధిర సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. 108లో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినవారిలో ఈఎంటీ సురేష్, పైలట్ రామారావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment