pregnant lady
-
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
చిన్న వయసులోనే గర్భం..తల్లీ, బిడ్డకు ప్రాణపాయం
ఓ వైపు బాగా చదువుకున్న అమ్మాయిలు 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. దీనికారణంగా 40 దాటే వరకూ పిల్లలు కలగక ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు పదహారేళ్లు నిండకముందే కొందరు అమ్మాయిలు తల్లులవుతున్నారు. పరస్పర ఈ వైరుధ్యం పలువురు వైద్యులు, నిపుణులను విస్మయపరుస్తున్న అంశం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వస్తున్న గర్భిణుల్లో 3 శాతానికి పైగా మైనర్ అమ్మాయిలు వస్తున్నట్టు తేలింది. బాల్యవివాహాల్లో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాలుగు నెలల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 458 మంది మైనర్ అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో 16 ఏళ్లలోపు అమ్మాయిలు 107 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది.శ్రీసత్యసాయి జిల్లాలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. మొత్తం ప్రసవాల్లో 3.23 శాతం మైనర్లవే కావడం గమనార్హం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో మైనార్టీ తీరని అమ్మాయిలు ప్రేమ– పెళ్లి బాట పడుతున్నారు. ప్రతిబంధకంగా బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయి అంటేనే భారంగా భావిస్తున్నారు. అందుకే 15 ఏళ్లకే పెళ్లి చేస్తున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పదో తరగతి చదువుతూండగానే పెళ్లి చేస్తున్నారు. బాగా చదువుకుని కెరీర్లో స్థిరపడాల్సిన సమయంలో వారికి పెళ్లి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. నిఘా పెట్టినా ఆగడం లేదు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాలను అడ్డుకుంటున్నా మరోవైపు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాహాలు కుదిర్చిన పెద్దలు, ఇరువురు తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడే అవకాశమున్నా కొన్ని ప్రాంతాల్లో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చైల్డ్‌లైన్ 1098, హెల్ప్‌లైన్ 181, డయల్ 100కు ఫోన్ చేస్తే పెళ్లిళ్లు ఆపేస్తారు. దీన్ని వినియోగించుకోవాలని ఐసీడీఎస్ అధికారులు కోరుతున్నారు. = ‘అనంత’ జిల్లాలో 4 మాసాల్లో 458 ‘మైనర్’ ప్రెగ్నెన్సీలు = ఇందులో పదహారేళ్లలోపు అమ్మాయిలు 107 మంది = శ్రీసత్యసాయి జిల్లాలో మరింత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు = చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్న యువతులు 3.23 శాతం = అమ్మాయిలను వెంటాడుతున్న సామాజిక మాధ్యమాల దు్రష్పభావం బాల్యవివాహాలతో భారీ నష్టం = చదువు ఆగిపోయి కెరీర్ అర్ధంతరంగా ముగుస్తుంది = చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టే అవకాశం = చిన్న వయసులో తల్లి కావడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది = ప్రీ మెచ్యూర్ అంటే 9 నెలలకు ముందే పిల్లలు పుట్టే అవకాశం = దీనివల్ల కాన్పు సమయంలో తల్లికీ బిడ్డకూ ఇద్దరికీ ప్రాణాపాయం కౌన్సెలింగ్ ఇస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో 15 ఏళ్లు దాటగానే అమ్మాయిలను తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. ముందస్తుగా పెళ్లి చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై యువతీ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ల ప్రభావం ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. –శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ -
రివర్స్ గేర్‌లో 2 కి.మీ.లు
మైసూరు: అటవీ ప్రాంతంలో ప్రసవం కోసం గర్భిణిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవి ఏనుగు అడ్డువచ్చి దాడికి యతి్నంచింది. అంబులెన్స్ డ్రైవర్ చాకచక్యంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కు తీసుకెళ్లి గర్భిణిని కాపాడాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటెలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. జీఎం హళ్ళి గ్రామానికి చెందిన లంబాడి మహిళ సుచిత్ర నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అంబులెన్స్ వచ్చి హెచ్డికోటె ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ఒక అడవి ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది. సుమారు 15 నిమిషాల పాటు గజరాజు కదలకుండా అలాగే ఉంది. డ్రైవర్ శరత్ అంబులెన్స్‌ను ముందుకు పోనివ్వగా ఏనుగు అంబులెన్స్ మీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రివర్స్ గేర్ వేసి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెనక్కు ప్రయాణించాడు. ఏనుగు కొంతదూరం వెంబడించి నిలిచిపోయింది. అంబులెన్స్‌లో ఉన్న ఆశా కార్యకర్త సావిత్రిబాయి గర్భిణికి కాన్పు చేసింది. తరువాత మరో మార్గంలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
అమానుషం.. ఆస్పత్రి బాత్రూమ్లో ప్రసవించిన మహిళ
సాక్షి,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ.. ఆస్పత్రి బాత్రూమ్లోనే ప్రసవించింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ తన భర్త లింగయ్యతో కలిసి నాలుగు రోజుల కిందట రెండో కాన్పు కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి వచి్చంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. అయితే, పార్వతమ్మకు బుధవారం ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆమె బాత్రూమ్లోకి వెళ్లింది. నొప్పులు ఎక్కువ కావడంతో పార్వతమ్మ అక్కడే ప్రసవించింది. ఆస్పత్రి సిబ్బంది శిశువును ఐసీయూకు తరలించి తల్లీబిడ్డలకు చికిత్స అందిస్తున్నారు. నొప్పులు వచ్చిన సమయంలో సరైన విధంగా వైద్యులు స్పందించి చికిత్స చేసి ఉంటే బాత్రూమ్లో ప్రసవించేదికాదని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని పార్వతమ్మ కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నార్మల్ డెలివరీ కోసం ప్రయతి్నస్తుండగా అకస్మాత్తుగా నొప్పులు రావడంతో ప్రసవించిందని వైద్యులు చెబుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ!
సాక్షి,బళ్లారి(బెంగళూరు): సర్కార్ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు అంటూ వైద్యాధికారులు, వైద్యులు నిత్యం చెబుతుండే మాటలు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కళ్లెదుటే ఆస్పత్రులు ఉన్నా రోగులకు వైద్యం అందడం లేదు. ఒక మహిళ పురిటినొప్పులతో కాన్పు కోసం రాగా ఆస్పత్రిమూసి ఉంది. దీంతో ఆమె ఆస్పత్రి ముందే ప్రసవమైంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఈఘటన అద్దం పట్టింది. వివరాలు.. విజయపుర జిల్లా నాగఠాణలోని చౌహాన్‌దొడ్డికి చెందిన మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆస్పత్రిని మూసివేశారు. అప్పటికే నొప్పులు అధికంగా ఉన్న ఆ గర్భిణి ఆస్పత్రి ముందే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరు, నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి ఫుల్ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్ సేల్స్! -
ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి..
మైసూరు(బెంగళూరు): ఓ వివాహిత మృతదేహం చెరువులో అనుమానాస్పద స్థితిలో బయటపడిన ఘటన మైసూరు నగరంలోని కలకలం రేగింది. వివరాలు...నగరంలోని విజయనగర్‌కు చెందిన అశ్వినీ (23), మైదనహళ్లికి చెందిన ప్రమోద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అశ్వినీ ఏడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అశ్వినీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం ప్రమోద్ అత్తింటికి వచ్చి అశ్వినీని తీసుకుని బైక్‌పై వెళ్లాడు. సాయంత్రమైనా వారు రాకపోవడంతో అశ్వినీ తండ్రి కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేశాడు. వారు స్పందించలేదు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం బిళికెరె చెరువులో అశ్వినీ మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. దోపిడీ దొంగల అరెస్ట్ శివాజీనగర: ఆటోలో తిరుగుతూ దోపీడీలకు పాల్పడుతున్న ఇద్దరిని సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.15 లక్షలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ దొంగలను శివాజీనగరకు చెందిన మహమ్మద్ ఆర్బాజ్, థణిసంద్రకు చెందిన సయ్యద్ ఆర్బాజ్గా గుర్తించారు. ఈనెల 5న రాత్రి ఆటోలో అమరజ్యోతి లేఔట్‌కు ఆటోల వచ్చిన వీరు ఓ వ్యక్తి మెడలో గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేయగా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తేలింది. వాహన దొంగలు అరెస్ట్: ఇళ్ల ముందు, పార్కింగ్ స్థలాల్లో ఆపి ఉంచిన బైక్‌లను ఎత్తుకెళ్తున్న షేక్ ముదాసీర్ అహమ్మద్, సయ్యద్ నాజీమ్లను సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రేమ పెళ్లి.. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని అనడంతో..
సాక్షి,జడ్చర్ల: కట్టుకున్న భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని భర్త అనుమానించ సాగాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఆల్వాన్పల్లికి చెందిన కృష్ణమ్మ (28), కృష్ణయ్య సుమారు ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం భార్య నాలుగు నెలల గర్భిణి. ( చదవండి: వివాహేతర సంబంధం అనుమానం.. పలుసార్లు ఇల్లు కూడా మార్చాడు.. చివరికి ) అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డపై అనుమానం పెంచుకున్న భర్త కొన్ని రోజులుగా తాగొచ్చి ఆమెను కొడుతుండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి గొడవపడ్డాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మంగళవారం మృతురాలి సోదరుడు మల్లన్న ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజేందర్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీ డాక్టర్ లేడని నర్సులే..
సాక్షి, హైదరాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి నర్స్‌లు శస్త్ర చికిత్స చేయడంతో శిశువు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ డివిజన్ అపురూపా కాలనీకి చెందిన జగదీష్, భార్గవిలు భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్‌లోని లయన్స్‌క్లబ్ ఆస్పత్రిలో చేరింది. రాత్రి 7 గంటల సమయంలో పురి టి నొప్పులు తీవ్రమయ్యాయి. అయితే ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు జ్యోత్సా్న, రాణిలు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయగా శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ప్రస్తుతం భార్గవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి భర్త జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య
పట్నా: వారసత్వ భూమి తగాదాల కారణంగా ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతని భార్యను బంధువులు కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం వైశాలి పోలీస్ స్టేషన్‌లోని బేలార్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లోని జరాంగ్ రాంపూర్ గ్రామంలో ఈ జంట హత్య జరిగింది. మృతులు శశి ఠాకూర్, అతని భార్య సంగీత దేవి ఐదు నెలల గర్భిణి. ఈ దంపతులకు రెండు, మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శశి ఠాకూర్‌కు తన బంధువులతో వారసత్వ భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయంపై తన బంధువులతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో శశి ఠాకూర్, అతని భార్య సంగీతా దేవిని వారి బంధువులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆపై పదునైన కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను ఒక నిందితుడి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ ఘర్షణలో మృతుడికి చెందిన ముగ్గురు బంధువులకు గాయాలు కాగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యకు గురైన గర్భిణీ సంగీతా దేవి తల్లి అహల్య దేవి 17 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సన్నీ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య -
గర్భిణీకి తీవ్ర రక్తస్రావం.. ప్రాణం పోసిన మేయర్
సాక్షి,రామగుండం(కరీంనగర్): ప్రజాపాలనలో నిత్యం బిజీగా ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్ సకాలంలో స్పందించి గర్భిణీకి మంగళవారం ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన దుస్స రమ్యకృష్ణ అనే గర్భిణికి పురుటి నొప్పులు ఎక్కువకావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రెండోకాన్పుకోసం తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసవంకోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయింది. వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. కంట్రోల్ కాలేదు. వెంటనే విషయాన్ని సీనియర్ జనరల్ సర్జన్ అయిన నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్‌కు తెలిపారు. సకాలంలో స్పందించిన మేయర్ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు చేరుకుని, సదరు గర్భిణికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్‌కావడంతో పండంటి బాబుకు రమ్మకృష్ణ జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్‌కుమార్, కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్‌ను ఆస్పత్రి వైద్యులతోపాటు రమ్యకృష్ణ కుటుంబసభ్యులు అభినందించారు. డాక్టర్లు శౌరయ్య, శ్రవంతి, కళావతితోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం -
అందరికీ గుర్తుండి పోయేలా.. ‘గులాబ్’ పేరు పెట్టి మురిసిపోయిన తల్లులు
భువనేశ్వర్: గులాబ్ తుపాన్ తీరం దాటుతూ భారీ నష్టంతో పాటు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావాన్ని అంత సులువుగా మర్చిపోలేము కూడా. అందుకే ఇద్దరు మహిళలు ఈ తుపాను ప్రళయ కాలంలో పుట్టిన తమ శిశువులకు గులాబ్ అని పేరు పెట్టుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ విశేషం చోటుచేసుకుంది. కుని రైట్, నందిని సబర్ ఇద్దరు మహిళలు ఆదివారం గులాబ్ తుపాన్ ప్రతాపాన్ని చూపిస్తుండగా వేరువేరు ప్రభుత్వ ఆస్పత్రులలో కుమార్తెలకు జన్మనిచ్చారు. సోరడపల్లి గ్రామానికి చెందిన సబర్ అనే వ్యక్తి సుమండల ఆరోగ్య కేంద్రంలో, అంకులి పంచాయతీకి చెందిన రైట్ పాత్రాపూర్ కమ్యునిటీ ఆస్పత్రిలో చిన్నారులకు జన్మనిచ్చారు. అయితే వారు తమ పిల్లల పేర్లు అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని భావించి గులాబ్ అని పేర్లు పెట్టుకున్నారు. దీనిపై సబర్ మాట్లాడుతూ.. తన బిడ్డ అందరికి గుర్తుండిపోయే రోజున ప్రపంచంలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఈ తుపాను ప్రభావం చూపగా ఆంధ్రాలో తీర ప్రాంతాల్లో అధికంగా చూపింది. కాగా ఈ తుపాన్‌కు గులాబ్ అనే పేరు పాకిస్తాన్ సూచించింది. గులాబ్ అంటే ఉర్దూలో గులాబీ పువ్వు అని అర్థం. చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా.. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యూఎస్ అమర సైనికుని భార్య
కాబూల్ ఉగ్రవాద పేలుడులో మరణించిన ఓ సైనికుడి భార్య ఇటీవల ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తన భర్త జ్ఞాపకార్థం తన కూతురుకి అతని పేరు పెట్టుకుంది. దురదృష్టవశాత్తు బేబీ లెవీ రైలీ రోజ్ పుట్టినప్పటి నుంచి తన వీరోచిత తండ్రి రైలీ మెక్‌కొల్లమ్‌ని చూడలేదు. ఆగస్టు 26న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన భయానక బాంబు దాడిలో రైలీ మరణించాడు. ఆ ఘటనలో 170 మంది స్థానికులు, 13 మంది యూఎస్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఆ పేలుడుకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ఐసిస్-కే ప్రకటించింది. ఆఫ్గన్ నుంచి తరలింపు ప్రారంభమైన కారణంగా రైలీని యూఎస్ ప్రభుత్వం అక్కడికి పంపింది. ఘటన జరిగిన రోజు విమానాశ్రయ తనిఖీ కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు ఈ విషాదం చోటు చేసుకుని ఉండొచ్చని అధికారులు తెలిపారు. రైలీ మెక్‌కొల్లమ్‌కి ఈ ఫిబ్రవరిలో వివాహం జరిగింది. రైలీ దేశ సేవలో ప్రాణాలు కోల్పోయినందుకు తాను చాలా గర్వపడుతున్నానని అతని తల్లి తెలిపింది. అనంతరం ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసింది. 15 సంవత్సరాల క్రితం, తొమ్మిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త మరణించాడని, దురదృష్టవశాత్తు అదే చరిత్ర పునరావృతమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..! -
తాలిబన్ల అరాచకం.. గర్భవతని కనికరం కూడా లేకుండా..
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అరాచకాలు మొదలెట్టారు. పైకి మాత్రం తాలిబన్ల నాయకులు మారిపోయినట్లు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వారు గతంలో మాదిరిగానే తమ సహజ ప్రవర్తనను బయటపెడుతున్నారు. తాజాగా 6 నెలల గర్భవతిగా ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారిణిని దారుణంగా హత్యచేశారు. ఆమెను కుటుంబసభ్యుల ఎదుటే ఆమెను కిరాతకంగా తుపాకితో కాల్చిచంపారు. ఘోర్ ప్రావిన్సుల రాజధాని ఫిరోజ్కొ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యగావించబడ్డ మహిళ జైలు అధికారిణి బాను నెగర్గా స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే అఫ్గన్ మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతుండగా తాజాగా ఈ హత్య కలకలం రేపింది. బుర్ఖాలు లేకుండా కనిపిస్తే తాలిబాన్లు వేటాడతారని, కొడతారనే భయంతో మహిళలు ఇప్పటికే వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ప్రభుత్వ ఏర్పాటులో హక్కులు, మహిళా ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు హెరాత్‌లో నిరసన ప్రదర్శనలు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసి అధికారులు తాలిబన్లు ఎక్కడ చంపుతారోనని బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతున్నారు. చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా? -
అలా నటిద్దామనుకున్న టిక్‌టాకర్ పాట్లు చూడాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం కవితలు రాసినంత, పాటలు పాడుకున్నంత ఈజీకాదు. మహిళల జీవితంలో అదొక ఉద్విగ్న సందర్భమే అయినా, ఆ నవమోసాలు పడే అవస్తలు సవాళ్లు, ప్రసవ వేదన, తదనంతర బాధలు అన్నీఇన్నీ కావు. అందుకే ‘‘రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ’’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘లేబర్‌రూం’ అనే కవితలో వర్ణిస్తారు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే దీన్ని స్వయంగా అనుభవిద్దామనుకున్న ఒక యువకుడికి ఎదురైన చేదు అనుభవం ఇపుడు వైరల్‌గా మారింది. అంతేకాదు పలువురిని ఆలోచింప చేస్తోంది. గర్భిణీలు పడే మానసిక, శారీరక కష్టాలను, స్వతహాగా అనుభవించాలనుకున్నాడు మెయిట్లాండ్ పాపులర్ టిక్‌టాకర్ హాన్లీ. ప్రెగ్నెంట్ లేడీగా కనిపించేలా పొట్టపై భారీ వాటర్ మిలన్‌ను, అలాగే ఛాతీ వద్ద కూడా రెండు చిన్న వాటర్ మిలన్లన అమర్చుకున్నాడు. అలా మొత్తం నిండు గర్భిణీలా తన అవతారాన్ని మార్చుకున్నాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అబ్బాయిగారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. వేషం అయితే వేసుకున్నాడు కానీ, అంత బరువుతో లేచి తిరగడం మాత్రం అతని వల్ల కాలేదు. కనీసం మంచం మీద నుంచి కాలు కిందపెట్టలేకపోయాడు. నిజమైన గర్భధారణను అనుకరించడం అసాధ్యమైనప్పటికీ, ఒక ప్రయోగం చేయాలనుకున్నా... అదంత పెద్ద కష్టమేమీ కాదనుకున్నాను కానీ మంచం నుండి లేవడానికి చాలా కష్టపడ్డానని హాన్లీ చెప్పాడు. ఈ ఘటనకు సంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! ‘తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, జన్మనివ్వడం అషామాషీ కాదు.. ఫన్నీ అసలే కాదు. ఇదే వాస్తవం.. కావాలంటే మీరూ ట్రై చేయండి’ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం సవాళ్లను తేలిగ్గా కొట్టిపారేశే వాళ్లకి ఇదొక గుణపాఠం అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వీడియో కోటి 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. చదవండి: చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో -
ప్రసవ వేదన.. జోలెకట్టి 8 కిలోమీటర్ల దూరం వరకు..
బర్వానీ: అటవీ ప్రాంతం..కనీసం రహదారి సౌకర్యం కూడా లేని గ్రామం..గర్భిణీని అత్యవసరంగా తరలించాల్సిన పరిస్థితి.. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి వెదురు కర్రకు జోలెను కట్టి, తాత్కాలిక స్ట్రెచర్‌గా మార్చారు. అందులో గర్భవతిని పడుకోబెట్టి 8 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ బురదమయమైన మార్గంలో రాణికాజల్ అనే చోటుకు చేరుకున్నారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సులో 20 కిలోమీటర్ల దూరంలోని పన్సేమల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లా ఖామ్‌ఫట్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రావనికి చెందిన సునీత నిండు గర్భిణీ. గురువారం ప్రసవ వేదన పడుతుండటంతో వెదురు కర్రకు దుప్పటిని కట్టి తయారు చేసిన తాత్కాలిక స్ట్రెచర్‌లో వెసుకెళ్తున్న ఈ వీడియోపై అధికారులు స్పందించారు. ఆ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో గర్భిణీని మోసుకురావాల్సి వచ్చిందని పన్సేమల్ బ్లాక్ డెవలప్మెంట్ అధికారి(బీడీవో) అర్వింద్ కిరాడే తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఆమె ప్రసవింంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ సీఈవో రితురాజ్ సింగ్ మాట్లాడుతూ..ఖామ్‌ఫట్ గ్రావనికి రహదారి నిర్మాణం విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధిత శాఖల నుంచి అవసరమైన ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ పొందడం కష్టంగా మారిందని చెప్పారు. -
ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..
సాక్షి, భువనేశ్వర్: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణిని స్థానికులు మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆపై ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాసీపూర్ సమితి కీరాఅంబొ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కీరాఅంబొ గ్రామానికి చెందిన కొసేయి మజ్జి భార్య బాసంతికి పురిటి నొప్పులు రావడంతో.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, సరైన రహదారి లేకపోవడంతో ఆంబులెన్స్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. దీంతో గర్భిణిని గ్రామస్తులు మోసుకుంటూ ఆంబులెన్స్ వద్దకు చేర్చారు. టకిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, బాసంతి ఆడశిశువుకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామీణ రహదారులను మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: డెల్టా ప్లస్ డేంజర్ కాదు -
ఒకే కాన్పులో పది మంది: అసలు బిడ్డలెక్కడ?
దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పుట్టిన బిడ్డలతో సహా ఆ తల్లి ఫొటోలను ఇంతవరకు బయటకు రిలీజ్ చేయకపోగా, ఆ తల్లీబిడ్డల ఆచూకీని ఇప్పటికీ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ వ్యహారంలో ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ పెయిట్ ర్యామ్‌పెడి అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిటోరియా: టెంబిసా పట్టణంలో గోసియామె తమార సిత్హోల్ అనే 37 ఏళ్ల మహిళ.. నెలలు నిండకముందే పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది ప్రిటోరియా న్యూస్ కథనం. ఈ రికార్డు జననాల కథనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌజ్‌లన్నీ ఆ కథనాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని టెంబిసా అధికారులుగానీ, ఏ ఆస్పత్రి వర్గాలుగానీ ప్రకటించలేదు. ఇక వారం గడుస్తున్నా ఆ తల్లీబిడ్డలు మీడియా ముందుకు రాకపోవడంతో ఇది అసలు ఉత్త కథే అని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీనికితోడు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించిన స్టేట్మెంట్ ప్రకారం చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్టీవ్ బికో అకాడమిక్ హస్పిటల్లో తాను పది మందికి జన్మనిచ్చానని సిత్హోల్, ‘క్లెమెంట్ మన్యాతెల షో’లో ఆమె స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ హాస్పిటల్ సీఈవో మథాబో మాథ్యుబెలా స్పందించారు. అసలు అలాంటి డెలివరీ కేసు తమ హాస్పిటల్ రికార్డుల్లో నమోదుకాలేదని ఆయన తేల్చేశారు. స్టీవ్ బికో ఆస్పత్రిపాటుతో పాటు ఇలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసును డీల్ చేసే లూయిస్ పాస్టూర్, మెడిక్లినిక్ మెడ్‌ఫోరం హాస్పిటల్స్ కూడా అలాంటి డెలివరీ తమ దగ్గర రికార్డు కాలేదని వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ బిడ్డల తండ్రి టెబెహో సోటెట్సి తాజా స్టేట్మెంట్తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎక్కడున్నారో తెలియదు తాను చాలా పేదరికంలో ఉన్నానని, బిడ్డలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గోసియామె సిత్హోల్ ప్రజలను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు దక్షిణాప్రికా దేశవ్యాప్తంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో విరాళాల్ని ఇవ్వొద్దంటూ ఇప్పుడు స్వయంగా టెబెహో కోరుతున్నాడు. అసలు పిల్లలెక్కడ ఉన్నారో? నాక్కుడా తెలియదు. వాళ్లు ఇంటికి వచ్చేదాకా ఎవరూవిరాళాలు ఇవ్వకండి అంటూ ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా ప్రిటోరియా న్యూస్‌కి సమాచారం అందించింది టెబెహోనే కావడం విశేషం. మరోవైపు సోటెట్సి కుటుంబ సభ్యులు గోసియామో సిత్‌హోల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిందని ఆమె ప్రకటించుకుందని, ఆ బిడ్డలు మాత్రం జాడలేరని వాళ్లు మీడియాకు తెలిపారు. నన్ను బద్నాం చేయొద్దు కాగా, పది మంది పిల్లల వ్యవహారంలో దక్షిణాఫ్రికా మీడియా నైతికతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పేద మహిళ జీవితంలోకి తొంగిచూసి.. అనుమానాలు, ఆరోపణలు చేయడం సరికాదని మీడియాను హెచ్చరించారు కొందరు. అయితే ఆ కొందరే ఇప్పుడు అనుమానాల నేపథ్యంలో ఫేక్ కథనాలతో ప్రజల్ని తప్పుబట్టారంటూ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇక మంగళవారం ప్రిటోరియా న్యూస్ రూంలో ప్రత్యక్షమైన గోసియామో సిత్హోల్.. తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, టెబెహో ఫ్యామిలీకి తన మీద మొదటి నుంచి ప్రేమ లేదని, అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బిడ్డల ఐడెంటిటీని పబ్లిక్‌గా ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్నకు ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో అనుమానాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. #Tembisa10 Two babies: twins Three babies: triplets Four babies: quadruplets Ten babies: missing pic.twitter.com/cEYbrtX81L — Birthmark Pearson ⛴ (@Kai_WithNoX) June 15, 2021 Piet, trying to sort out the Tembisa 10 equation in front of during South Africans. 🙆🏽♂️ 😂😂😂#Tembisa10 pic.twitter.com/wTaZxANKmM — MOSS™🇿🇦🏳️🌈 (@_officialMoss) June 15, 2021 -
ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..
చెన్నె: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్ ప్రమాదానికి గురయ్యింది. చెట్టును ఢీకొట్టడంతో తొమ్మిది నెలల నిండు గర్భిణితో పాటు ఆమె అత్తి, వదిన దుర్మరణం పాలయ్యారు. పురుటినొప్పులతో బాధపడుతుండడంతో తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కొన్ని గంటల్లో మరో ప్రాణానికి జన్మనిచ్చే మహిళ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జరిగింది. సొరపట్టు గ్రామానికి చెందిన సెల్వీ తన కోడలు జయలక్ష్మికి తొమ్మిది నెలలు నిండడంతో బుధవారం తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. వెంటనే కుమార్తె అంబికతో కలిసి అంబులెన్స్ తీసుకుని ఆస్ప్రతకి బయల్దేరారు. అయితే తెల్లవారుజామున 4.45 గంటలకు మార్గమధ్యలో అంబులెన్స్ టైర్ పేలి వాహనం అదుపు తప్పింది. వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో వాహనంలోని అత్తాకోడళ్లతోపాటు ఆమె కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము కావడంతో ఈ ప్రమాదం వార్త ఎవరికీ తెలియలేదు. దీంతో కొన ప్రాణం మీద ఉన్నవారిని ఎవరూ కాపాడలేకపోయారు. గాయాలతో బాధపడుతూ అక్కడికక్కడే మృతి చెందారు. కొన్ని గంటల తర్వాత అటుగా వెళ్లేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. జయలక్ష్మి కుటుంబానికి రూ.5 లక్షలు, సెల్వీ, అంబిక కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బీమా పరిహారం వెంటనే కుటుంబాలకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చదవండి: పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త
న్యూఢిల్లీ: ఓ ఎనిమిది నెలల గర్భిణిని ఎటువంటి కనికరం లేకుండా పట్టపగలే ఆమెను తన నాలుగో భర్త దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఏప్రిల్ 27 ఉదయం 10:30 గంటలకు జరిగింది. నేరం జరిగిన వెంటనే ఆ ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు, కానీ అప్పటికే సైనా చనిపోయింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కామెరాలో రికార్డు అయ్యాయి. చనిపోయిన 29 ఏళ్ల మహిళా పేరు సైనా, ఆమె దేశ రాజధానిలో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తుంది. వివరాలలోకి వెళ్తే.. డ్రగ్ క్వీన్‌గా పేరున్న సైనా అనే మహిళ ఢిల్లీలోని హజ్రాత్ నిజమాముద్దీన్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. సైనా సంవత్సరం క్రితం వసీమ్ అనే వ్యక్తిని నాలుగో వివాహం చేసుకుంది. పెళ్లైనా కొద్ది రోజులకే మాదకద్రవ్యాల వ్యవహారంలో పాల్గొన్నందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉండటంతో కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది. ఆమె మొదటి ఇద్దరు భర్తలు ఆమెను విడిచిపెట్టి బంగ్లాదేశ్ కు వెళ్లారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 'డ్రగ్ లార్డ్' అని పిలువబడే షరాఫత్ షేక్ అనే మాదకద్రవ్యాల వ్యాపారితో ఆమె మూడవ వివాహం చేసుకుంది. షేక్ ఒక గ్యాంగ్ స్టర్, మాదకద్రవ్యాల వ్యాపారి కావడంతో అతన్ని ఎన్పీడీఎస్ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వసీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన అయిన కొద్దీ రోజులకు సైనాను అరెస్టు చేయడంతో వసీమ్ ఆమె సోదరి రెహానాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సైనా జైలు నుంచి విడుదలైన తర్వాత రెహానాతో ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ఈ విషయంలో తరచుగా సైనాతో వసీమ్ గొడవ పడేవాడు. ఆమె సోదరితో కలిసి ఉండటానికి సైనాను చంపాలని వసీమ్ నిర్ణయించుకున్నాడు. అతను సైనాను హత్య చేయడానికి వేసుకున్న ప్లాన్ లో భాగంగా అతని వెంట రెండు పిస్టల్స్ తెచ్చుకకున్నాడు. సైనా ఇంటికి చేరుకున్న వెంటనే వసీమ్ పలుసార్లు ఆమెపై కాల్చడంతో ఆమె అక్కడే చనిపోయింది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన సర్వెంట్ పై కూడా కాల్పులు జరిపాడు. ఆమె సర్వెంట్‌ను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. హత్య తరువాత, వసీమ్ తన వద్ద ఉన్న రెండు పిస్టల్స్‌తో సహ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే వసీమ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో.. ఈ ప్లాన్‌ను సైనా సోదరి రెహానా రూపొందించి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సైనా డ్రగ్స్ వ్యాపారంలో కీలక సభ్యురాలు కావడంతో.. ఈ హత్య వెనక ఏమైనా కుట్ర ఉందా అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య -
గర్భిణిని పొట్టన పెట్టుకున్న కరోనా
సాక్షి, భట్టిప్రోలు (వేమూరు): కరోనా మహమ్మారి ఓ గర్భిణిని పొట్టన పెట్టుకుంది. సూరేపల్లికి చెందిన అంజమ్మ (29)కు భట్టిప్రోలు వాసి మేడిద ఏడుకొండలుతో వివాహం జరిగింది. కూలీనాలీ చేసుకుంటూ జీవించే వీరికి మొదటి సంతానంగా ఒక బాబు ఉన్నాడు. ఇటీవల ఆమె రెండవ కాన్పు పరీక్షల నిమిత్తం భట్టిప్రోలు పీహెచ్సీలో ఈనెల 7వ తేదీన కరోనా టెస్టు చేయించుకోగా 10వ తేదీన నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 11వ తేదీ రేపల్లె ప్రైవేట్ వైద్యశాలలో సీటీ స్కాన్ తీయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను తెనాలి డీహెచ్‌కు.. ఆ తరువాత జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి నచ్చక భర్త గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. ఆమె పరిస్థితి క్షీణించి 14వ తేదీ ఆక్సిజన్ అందకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. దీంతో వైద్యులు తల్లీ బిడ్డలలో ఎవరో ఒకరిని కాపాడే ప్రయత్నంలో భాగంగా.. 19వ తేదీన ఫోర్సెప్స్ విధానం ద్వారా ఆమెకు డెలివరీ చేసి బాబును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. గురువారం ఆమె తుది శ్వాస విడిచింది. పుట్టిన బాబును చూసుకోకుండానే ఆ తల్లి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే డాక్టర్‌ను కలవాల్సిందే... ఎందుకంటే?
గర్భధారణకు ప్లాన్ చేసుకోవడానికి ముందుగా ఒకసారి ఆ దంపతులు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. చాలామంది ఈ పని చేయరు. కానీ డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. అంతకు మునుపు తాము ఏవైనా మందులు వాడుతున్నామా అన్న విషయాలను డాక్టర్‌కు చెప్పాలి. ఎందుకంటే ఏదైనా జబ్బు కోసం వాడుతున్న మందులను కాబోయే తల్లి వాడితే అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఉదాహరణకు గుండెజబ్బుల కోసం వాడే కొన్ని మందులు గర్భధారణ సమయంలో కాబోయే మాతృమూర్తికి అవి సరిపడినా... వాటి వల్ల బిడ్డకు హాని జరగవచ్చు. అలాగని బిడ్డకు ప్రమాదకరమనే నిర్ణయాన్ని తామే తీసుకుని తమంతట తామే మందులు మానేస్తే అది కాబోయే తల్లికి మరింత హాని చేకూర్చవచ్చు. ఇక థైరాయిడ్, హైబీపీ, డయాబెటిస్, ఆర్థరైటిస్, ఫిట్స్ వంటి జబ్బులకోసం వాడే మందులను గర్భవతిగా ఉన్న సమయంలో వారికి (అంటే తల్లికీ, బిడ్డకూ ఇద్దరకీ) పూర్తిగా సురక్షితమైనవే వాడాల్సి ఉంటుంది. అవి సురక్షితమైనవే అని తెలియాంటే పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భం రాకముందుగా పై జబ్బుల కోసం వాడే మందులను గర్భం వచ్చాక తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ పై మందులు వాడుతూనే గర్భం కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు... కాబోయే తల్లికి గర్భం వచ్చిందన్న విషయమే రెండో మాసం వరకు (మొదటి నెల గడిచేవరకు) తెలియకపోవచ్చు. అందుకే గర్భధారణ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు తమకు ఉన్న వైద్య చరిత్రను (ప్రీ–మెడికల్ హిస్టరీని) డాక్టర్‌కు తప్పనిసరిగా చెప్పాలి. ( చదవండి : ఫేషియల్ పెరాలసిస్‌కు భయపడకండి! ) -
వరకట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య
-
దారుణం: అదృశ్యమైన మహిళ.. మృతదేహంగా
సాక్షి, చెన్నూర్: చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అదృశ్యమైన బాలింత.. మృతదేహంగా(చెట్టుకు ఉరేసుకొని) మారి లభ్యమైంది. సదరు మహిళ పట్టణ సమీపంలోని ముళ్లపొదల్లో అస్థిపంజరంగా లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైన హత్య చేసి ముళ్లపొదల్లో ఉరి వేశారా అనే అనుమానాలు లెవనెత్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లా దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన దాదా మానస(36)కు చెన్నూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. గత నెల 13 చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కాని అదే నెల 17న ఆసుపత్రి నుంచి అదృశ్యమైంది. మానస భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సోమవారం పట్టణ సమీపంలో లంబాడిపల్లి గ్రామస్తులు రహదారి పక్కన ముళ్లపొదల్లో అస్థిపంజరం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈమేరకు ట్రెయినీ ఏసీపీ అశోక్‌కుమార్, చెన్నూర్ సీఐ ప్రమోద్‌రావు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం పరిశీలించారు. మహిళ చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఆనవాళ్లతోపాటు ఆమె చున్నీ, చెవి రింగు, వెంట్రుకల ఆధారంగా మృతదేహం మానసదిగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటన స్థలంలోనే వైద్యులు సత్యనారాయణ పోస్టుమార్టం నిర్వహించారు. ఆనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. పసిబిడ్డ ఏం పాపం చేసింది.. వివాహమైన 15 ఏళ్లకు సంతానం కలిగితే మానస(తల్లి) పురిట్లోనే బిడ్డను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని.. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాలి్సన తల్లి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పసి బిడ్డ ఏం పాపం చేసిందని.. వెళ్లిపోయావు మానస.. అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు కోసి..
లక్నో: ఎన్ని శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఆడ పిల్లపై చిన్న చూపు మాత్రం పోవడం లేదు. అవసాన దశలో కొడుకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే ఘటనలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. అయినా మార్పు రాదు. నేటికి కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడ పిల్ల అయితే అబార్షన్లు చేపిస్తున్నారు. ఎంత కఠిన చట్టాలు వచ్చినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉంది ఆడపిల్లో, మగ పిల్లాడో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె పొట్టని చీల్చాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్‌లో చోటు చేసుకుంది. పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకును కనాలనేది అతడి కోరిక. ఈ క్రమంలో అతడి భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలాగని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు. (చదవండి: కొట్టి చంపి.. గోతంలో వేసి..!) పొట్టలో ఉంది ఆడో, మగో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చర్యకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను బరేలీలోని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‌ను అరెస్ట్ చేశారు. -
శభాష్ వలంటీర్
సాక్షి, ముంచంగిపుట్టు (అరకు): ఆమె నిండు గర్భిణి. పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేదు.. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో భగవంతుడిలా ప్రత్యక్షమయ్యాడు.. ఆ గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణభిక్ష పెట్టాడు. ఆస్పత్రికి చేరడం ఆలస్యం కావడంతో మృత శిశువు జన్మించింది. ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన బుద్రి అనే నిండు గర్భిణికి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సౌకర్యం లేని ఆ గ్రామం నుంచి ఆమెను ఎలా ఆస్పత్రికి తరలించాలో తెలియక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. (వైజాగ్‌ని చాలా మిస్ అవుతున్నా..) విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్ సుబ్బారావు ముందుకొచ్చి డోలీ కట్టించి కుటుంబ సభ్యులతో బయల్దేరాదు. పన్నెండు కిలోమీటర్ల అటవీ కొండ ప్రాంతాన్ని దాటుకొని.. జోరు వానలో గర్భిణి తడిసి పోకుండా కవర్లు కప్పి లక్ష్మీపురం వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సదుపాయం ఉండటంతో అక్కడి నుంచి 108లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమై మృత శిశువుకు జన్మనిచ్చింది. కొండ మార్గంలో మైళ్ల దూరం ప్రయాణం చేసి ఆస్పత్రికి సకాలంలో చేరకపోవడం వల్లే బిడ్డను పోగొట్టుకున్నామని బుద్రి కుటుంబ సభ్యులు వాపోయారు. ముందుగానే ఆస్పత్రిలో చేరాలని సూచించినా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వలంటీర్ సుబ్బారావు అన్నాడు. (మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉన్నాం ) -
15 గంటల నరకయాతన తర్వాత..
లక్నో: ఆస్పత్రి యాజమాన్యాల నిర్లక్షానికి ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నొప్పులు రావడంతో గర్భిణీని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే, ఆస్పత్రి యాజమాన్యాలు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించాయి. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిది. అలా దాదాపు 15గంటలపాటు అంబులెన్స్‌లోనే నరకయాతన అనుభవించిన ఆ మహిళ చివరకు మరణించింది. ఈ విషాదకర సంఘటన వివరాలు.. గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని కోడా కాలనీలో నివాసముంటున్న విజేందర్ సింగ్, నీలమ్ భార్యాభర్తలు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన నీలమ్(30)కు అనుకోకుండా నొప్పులు రావడంతో.. భర్త విజేందర్ సింగ్ ఆమెను అంబులెన్స్‌లో మొదట ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే నీలమ్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఈఎస్ఐ వైద్యులు సరిపడా బెడ్స్ లేవని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో సెక్టార్ 30లోని చైల్డ్ పీజీఐ ఆస్పత్రికి, అక్కడి నుంచి షర్దా, జిమ్స్(గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్)లకు వెళ్లారు. కానీ ఎవరు వారిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రులైన జేయ్‌పీ, ఫోర్టీస్, మ్యాక్స్ ఇన్ వైశాలికి వెళ్లామని.. వారూ నిరాకరించారని విజేందరన్ తెలిపాడు. ఇలా మొత్తం 15 గంటలపాటు 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరకు నొప్పులు భరించలేక నీలమ్ అంబులెన్స్‌లోనే మరణించింది. విజేందర్ మాట్లాడుతూ.. ఎనిమిది ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని.. వైద్యులు నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనే ఒకటి ఈ జిల్లాలో చోటు చేసుకుంది. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో మే 25న పుట్టిన శిశువు మరణించాడు. -
ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు
భోపాల్: కరోనా.. దేశాన్ని ఇంట్లో బంధించింది.. వలస కూలీలను రోడ్డున పడేసింది. మహమ్మారి కట్టడిలో భాగంగా మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే ఈ చర్యలు వలస కూలీల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక సొంతూర్ల బాట పట్టారు వలస కూలీలు. లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు స్తంభించిపోవడంతో చేసేదిలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. వీరిలో గర్భిణులు, చిన్న పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వీరిని ఇంటికి చేర్చడం కోసం కుటుంబ సభ్యులు చేస్తోన్న ప్రయత్నాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 8 నెలల గర్భవతి అయిన భార్య, రెండేళ్ల కూతురుతో ఓ వ్యక్తి చేస్తోన్న ప్రయాణం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, గర్భవతి అయిన తన భార్య ధన్వంత భాయితో కలిసి ఉపాధి కోసం ఈ ఏడాది మార్చి 17న హైదరాబాద్‌కు వచ్చారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వారం రోజుల వ్యవధిలోనే లాక్డౌన్ ప్రకటించారు. చేతిలో డబ్బు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు. ఇక్కడే ఉండి ఆకలితో అలమటించే కంటే.. సొంత ఊరు వెళ్లి అయిన వారి మధ్య ఉండాలనుకున్నారు. దాంతో భార్య ధన్వంతి, రెండేళ్ల కూతురు అనురాగిణితో కలిసి స్వస్థలానికి పయనమయ్యాడు రాము.(మూడ్ లేదు.. ఇక తెగతెంపులే) అయితే అంత దూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు రాము. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టి వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.(కరోనా గ్యాంగ్స్టర్స్) ‘తొలుత నా కూతుర్ని ఎత్తుకొని వెళ్లాలని భావించాను. కానీ అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లాలంటే కష్టం. పైగా నా భార్య నిండు గర్భిణి. దాంతో మార్గమధ్యలో దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేసి, వారిద్దర్నీ దానిపై కూర్చోబెట్టి లాక్కుంటూ ముందుకెళ్లాను’ అంటూ రామూ తన అనుభవాన్ని వివరించాడు. కాగా, మార్గమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి పరిస్థితిని చూసి సహాయం చేశారు. నితేశ్ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు.(సారూ.. పొయొస్తం..) -
నిండు గర్భిణి పురిటి కష్టాలు
కొందుర్గు: కరోనా వైరస్ విజృంభణతో ఓ వైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో బాధ్యతతో ఓ వైపు ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది...మరోవైపు నిండు గర్భిణికి పురిటినొప్పులొస్తే రిపోర్టులు లేవన్న సాకుతో వైద్య సిబ్బంది వైద్యం చేసేందుకు నిరాకరించి ఆమెను రాత్రంతా ఆరుబయటే జాగారం చేయించింది. కొందుర్గు మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్న వడ్డె స్వప్న ఉగాది పండుగ కోసం జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ఎదిర గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. నిండు గర్భిణి అయిన ఆమెకు శనివారం రాత్రి 12 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబీకులు తరలించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏఎన్సీ రిపోర్టులు చూపించాలని స్వప్నను అడుగగా తమ వద్ద లేవని చెప్పింది. రిపోర్టులు తన అత్తగారింట్లో ఉన్నాయని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది కనికరించలేదు. రిపోర్టులు లేకుంటే వైద్యం చేయమని చెప్పి కనీసం ఆస్పత్రిలోనికి కూడా అనుమతించకపోవటంతో చేసేదేమీలేక స్వప్న తన మూడేళ్ల కుమారుడు, తల్లి యాదమ్మతో కలిసి పీహెచ్సీ వద్ద ఉన్న ఓ దుకాణం ఎదుట రాత్రంతా జాగరణ చేసింది. ఆదివారం ఈ విషయమై స్థానికులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా..స్వప్న ప్రసవానికి ఇంకా సమయం ఉందని, పీహెచ్సీలో పేషెంట్‌తోపాటు మరొకరు మాత్రమే ఉండాలని సూచించగా గర్భిణితోపాటు కుటుంబీకులు బయటకు వెళ్లారని స్టాఫ్‌నర్స్ సలోమి తెలిపారు. అనంతరం కుటుంబీకులు స్వప్నను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. -
గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రసవం
సాక్షి, మధిర : సికింద్రాబాద్ నుంచి బిహార్ వైపు వెళుతున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన ఆదివారం మధిర రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. షాజాన్‌బీ అనే నిండు గర్భిణి సికింద్రాబాద్‌నుంచి బిహార్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళుతోంది. మధిర రైల్వేస్టేషన్ సమీపంలోకి రైలుబండి వచ్చిన తర్వాత పురిటి నొప్పులు ఎక్కువై ఆమె ప్రసవించింది. తోటి ప్రయాణికులు మధిర రైల్వేస్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. స్టేషన్ సూపరింటెండెంట్ కాశిరెడ్డి ద్వారా తెలుసుకున్న 108సిబ్బంది అంబులెన్స్ వాహనంలో హుటాహుటిన మధిర రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. మధిరలో రైలు ఆగాక..ఆ తల్లీబిడ్డను మధిర సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. 108లో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించినవారిలో ఈఎంటీ సురేష్, పైలట్ రామారావు ఉన్నారు. -
గర్భిణి అని చెప్పినా వినకుండా..
సాక్షి, శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ వేదనతో చేరిన గర్భిణిని రెండు రోజుల వరకు ఉంచుకుని, ఆ తర్వాత వైద్యులు వెనక్కి పంపేయడంతో బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు గత్యంతరం లేక స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం చేయించారు. జలుమూరు మండలం కామునాయుడుపేటకు చెందిన కింజరాపు నీలవేణికి నెలలు నిండటంతో 108 వాహనంలో శుక్రవారం ఉదయం నరసన్నపేట ఆసుపత్రికి ఆశావర్కరు తిరుపతమ్మ సహాయంతో తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్సకు వైద్యులు లేరంటూ సాధారణ తనిఖీలు చేసి ఉంచారు. శనివారం ఉదయం గర్భిణికి ప్రసవం చేసేందుకు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే ఎనస్థీషియా డాక్టర్ వచ్చి తనిఖీ చేసి నీలవేణికి గుండె జబ్బు ఉందని, ఇక్కడ ఆపరేషన్ చేయలేమని వెళ్లిపోయారని భర్త అప్పలనాయుడు, కుటుంబ సభ్యులు పీ భారతి, ఎం నిర్మల, సత్యవతి వాపోయారు. ఈ విషయం చివరి నిమషంలో చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. మొదటి కాన్పు ఇక్కడే చేశారని, రెండో కాన్పునకు ఈ విధంగా చెప్పడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా, అక్కడ వైద్యులు ఎటువంటి కారణాలు చూపలేదని ఆపరేషన్ చేస్తామని హామీ ఇచ్చారని భర్త అప్పలనాయుడు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఎనస్థీషియా డాక్టర్ ప్రసాదరావును వివరణ కోరగా నీలవేణికి థైరాయిడ్ ఉందని, గుండెకు సంబంధించిన జబ్బు ఉందని, రిస్క్ చేయలేక శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలని సూచించామన్నారు. అంతే తప్ప బలవంతంగా పంపలేదన్నారు. -
పెద్దాస్పత్రిలో మరో వివాదం
ఖమ్మంవైద్యవిభాగం: పెద్దాసుపత్రిలో తరచు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరికలు చేస్తున్నా వివాదాలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో ప్రసవ దృశ్యాలు చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడం, సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ పెట్టిన ఘటనలు వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయకుండా తిప్పి పంపటంతో మరో వివాదానికి తెరలేపారు ఇక్కడి వైద్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఇనపనూరి అశ్విని(20)కి పురుటి నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్లు 5 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గర్భిణికి రక్తస్రావమైంది. ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగకపోవటంతో డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. ఆందోళనకు గురైన అశ్విని తండ్రి పగడాల లక్ష్మయ్య(మున్సిపల్ వర్కర్) సీఐటీయూ నాయకులను సంప్రదించాడు. సీఐటీయు నాయకులు విష్ణు తదితరులు వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను డెలివరీ చేయాలని విజ్జప్తి చేశారు. చికిత్స అందించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు గర్భిణిని 108 వాహనం ద్వారా వైరారోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఆస్పత్రిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయిస్తే రూ.30 వేలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు , ఆర్ఎంఓ కృపాఉషశ్రీ సముదాయించి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పడంతో సీఐటీయు నాయకులు శాంతించారు. ఎంసీహెచ్ భవనం ఎదుట డాక్టర్ల ధర్నా సీఐటీయూ నాయకుడు విష్ణు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గైనిక్ సేవలందించే డాక్టర్లు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, పెరుగుతున్న ఓపీ సేవలకు అనుగుణంగా గైనిక్ వైద్యులు నియమించాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు వైద్య సేవలు లేక వెనుతిరిగారు. కాగా ఇరు వర్గాలు పరస్సరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. డాక్టర్లను ఇబ్బంది పెడితే వైద్య సేవలు ఎలా అందిస్తారు..? డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీ సేవలు నిలిపివేసి సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమైన డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తానని, కలెక్టర్‌కు కూడా లేఖ అందజేస్తామని తెలిపారు. - వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్. -
విమానంలో ప్రసవం.. అత్యవసరంగా..
ముంబై : విమానంలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ ఇండినేషియా మహిళ. బుధవారం ఉయయం అబుదాబి నుంచి జకర్తా వెళ్తున్న ఎతిహడ్ ఎయిర్వేస్ విమానంలో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటల ఆలస్యంగా జకర్తాకు చేరుకుందని ఎతిహాడ్ ఎయిర్వేస్ విమాన ప్రతినిధి తెలిపారు. -
కాన్పుకోసం వస్తే కాదుపొమ్మన్నారు..
అనంతగిరి : నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరిగాయి. కాని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు హైద్రాబాద్‌లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇది వికారాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎదురవుతున్న దుస్థితి. వికారాబాద్‌లోని వెంకటపూర్ తండాకు చెందిన గర్భిణి రెండు రోజుల కిందట ప్రసవం కోసం వచ్చింది. ఆమె ప్రతి నెలా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చెక్ చేయించుకుంది. అక్కడికి వచ్చిన ఆమెకు నీవు ఇక్కడ కాన్పు చేయించుకోవడం కష్టం అవుతుంది. వెంటనే హైదరాబాద్‌లోని ప్రసూతి ఆస్పత్రికి (జజ్గిఖానా)కు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె కుటుంబీకులు భయపడి వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం డాక్టర్లు పరిక్షించి ఇక్కడికి ఎందుకు వచ్చారు. వికారాబాద్‌కే వెళ్లండి నార్మల్ డెలివరీ అవుతుంది. ఎలాంటి సమస్య లేదనడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి గురువారం వచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందితో డాక్టర్లు చెప్పిన విషయాన్ని వివరించారు. అయినా ఆమె మాటలు పట్టించుకోకుండా డాక్టర్లు లేరు బయట ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోమని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో సదరు గర్భిణి బంధువులు ఇదేం పద్ధతి ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, శివారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్ వచ్చి ఇదేం పద్ధతి దవాఖానకు వచ్చేది పేదవాళ్లు, వాళ్లను బయటకు వెళ్లమంటే వారి వద్ద అన్ని డబ్బులు ఉంటాయా అని సిబ్బందిని ప్రశ్నించారు. డ్యూటీలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నిరాక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో వచ్చిన రోగులను సిబ్బంది సముదాయించి చెప్పాలి తప్ప కోపగించుకోకూడదని సూచించారు. ఈ విషయమై వారు కలెక్టర్‌కు ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేయగా వెంటనే ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్‌కు ఫోన్ చేశారు. ఆయన అక్కడికి వచ్చి డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు అందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. కాగా గురువారం బాధితురాలితో పాటు రావులపల్లికి చెందిన మరో గర్భిణి కూడా కాన్పుకోసం వస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే వారినుంచి డబ్బులు సైతం డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పలువురు జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈమధ్యలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆస్పత్రి పనితీరు సక్రమంగా కొనసాగడంలేదని రోగులు, వారి కుటుంబీకులు పేర్కొంటున్నారు. -
టెక్కలి ఆస్పత్రిలో ఉద్రిక్తత
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు. బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు. బాధితులకు అందించే సౌకర్యాలు మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు. -
విదారక ఘటన
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది. నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
పూడ్చిపెట్టాక.. బిడ్డకు జన్మ ఇచ్చింది
రోమ్ : ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అధ్భుత విషయాన్ని వెలికితీశారు. చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మధ్య యుగ కాలానికి చెందిన 25 ఏళ్ల యువతి గర్భంతో ఉండగానే చనిపోయింది. దీంతో ఆమెను సమాధి చేశారు. ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుంచి బిడ్డ జన్మించినట్లుగా ఉన్న అవశేషాలను పురా నిపుణులు కనుగొన్నారు. మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బట్టి ఆమెకు మెదడు సంబంధిత వైద్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్లో ఈ విషయాలను ప్రచురించారు. క్రీస్తు పూర్వం 7 లేదా 8 శతాబ్దానికి చెందిన మహిళ అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు. దాంతో 38 వారాల నిండు గర్భిణీ అయిన ఆమెకు వైద్యం చేశారని చెప్పారు. గర్భధారణ జరిగి 20 వారాల తర్వాత సంభవించే ఆ వ్యాధి కారణంగా శరీరంలో రక్తపోటు అధికం అవుతుందని వివరించారు. వ్యాధి నివారణకు మరో మార్గం లేకపోవడంతో బలవంతపు ప్రసవానికి అప్పటి వైద్యులు యత్నించగా.. సదరు మహిళ మరణించిందని వివరించారు. -
గర్భిణీని ముక్కలుగా చేసింది వీళ్లే...!
-
అయ్యో పాపం
నరసరావుపేట టౌన్: పురిటి నొప్పులతో బాధపడుతూ ఏరియా వైద్యశాలకు వచ్చిన ఓ గర్భిణిని గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రసవించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధితురాలి బంధువుల కథనం ప్రకారం.. మాచవరానికి చెందిన పి.అంజలీదేవి పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆదివారం తెల్లవారుజామున బంధువులు పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చారు. అక్కడ çపరిక్షించిన వైద్యులు గర్భంలో బిడ్డ మృతి చెందిందని చెప్పి... బాధితురాలిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్లమని సూచించారు. డీజిల్ లేకపోవడంతో 108 వాహనం సేవలు నిలిచి పోవడంతో అంజలీదేవిని ఆటోలో పేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, నరసరావుపేటలో కూడా వాహనం అదే పరిస్థితిలో ఉండి కదలకపోవడంతో పాటు వైద్యశాలలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఆటోలో గుంటూరుకు పయనమయ్యారు. మార్గంమధ్యలో జొన్నలగడ్డ గ్రామ çసమీపానికి చేరగానే ఆటోలోనే మృతి చెందిన శిశువు ప్రసవం జరిగింది. అధిక రక్తస్రావం జరుగుతుండటంతో బాధితురాల్ని తిరిగి ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం అంజలీ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 108 వాహనం అందుబాటులో ఉంటే ప్రథమ చికిత్స అంది బిడ్డ బతికే అవకాశం ఉండేదని రోగి బంధువులు వాపోయారు. సకాలంలో వైద్యం అంది అదృష్టవశాత్తు తల్లి ప్రాణాలైనా నిలుపుకోగలిగామని వారు తెలిపారు. -
వైద్యం అందక గర్భిణి మృతి
సీలేరు: సీలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతిచెందింది. కొమ్మలవాడకు చెందిన గిరిజన మహిళ పొయితకు పురిటినొప్పులు రావడంతో శనివారం మధ్యాహ్నం అంబులెన్సులో సీలేరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు లేకపోవడం, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పొయిత మృతిచెందింది. కడుపులో బిడ్డ కూడా మృతిచెందింది. వైద్యులు లేక సకాలంలో వైద్యం అందనందువల్లే నిండు గర్భిణి మృతిచెందిందని బంధువులు ఆరోపించారు. ఇక్కడ తరుచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని, వైద్యులు సరిగా విధులు నిర్వహించడంలేదని స్థానికులు చెబుతున్నారు. -
మంత్రికి వాట్సప్ మెసేజ్.. టెన్షన్ ఖతమ్
ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన సోదరికి అత్యవరంగా ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా యశోద ఆస్పత్రిలో. ఖర్చు సుమారు నాలుగు లక్షల వరకు వస్తుందని అన్నారు. తనది అంత పెట్టుకోగల ఆర్థిక స్థోమత కాదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల రాజు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వాట్సప్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. అందులో తన పరిస్థితిని వివరించి, ఆస్పత్రి వాళ్లతో ఏమైనా మాట్లాడే వీలుంటే చూడాలని కోరాడు. ఒక అరగంటలో స్పందించిన కేటీఆర్.. తాను తప్పకుండా చూస్తానని రెండే రెండు ముక్కలతో సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించేది కూడా రాజన్న జిల్లా సిరిసిల్లకే కావడంతో రాజు ధైర్యం చేసి మెసేజ్ పెట్టాడు. ఆయన ఏం చేశారో ఏమో తెలియదు గానీ, తమ వద్ద రూపాయి కూడా తీసుకోకుండా ఆస్పత్రి వర్గాలు తమ సోదరికి ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారని రాజు తెలిపాడు. బహుశా కేటీఆర్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి ఫోన్ చేసి ఉంటారని, డబ్బుల గురించి అడగకుండా ఆపరేషన్ చేయమని చెప్పి ఉండొచ్చని రాజు భావిస్తున్నాడు. తర్వాతి రోజు ఉదయం తనను సచివాలయానికి వచ్చి కలవమన్నారని, ఖర్చుల విషయం తాము చూసుకుంటామని అధికారులు చెప్పారని వివరించాడు. తనకు వేరే అవకాశం ఏమీ లేకపోవడం వల్లే తాను కేటీఆర్‌కు వాట్సప్‌లో సందేశం పంపానని, ఇప్పుడు తన సోదరి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని రాజు ఆనందబాష్పాలతో చెప్పాడు. -
తల్లి ఒత్తిడితో పుట్టబోయే పిల్లలకు ముప్పు!
న్యూయార్క్: గర్భంతో ఉన్న మహిళ ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందట. తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. అందుకే గర్బంతో ఉన్న మహిళలను ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఆ సమయంలో అనవసర విషయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారని ఓహియో వర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. -
అనుమానాస్పదస్థితిలో గర్భిణీ మృతి
-
108లో గర్భిణీ మృతి
పాలకొండ (శ్రీకాకుళం) : 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణి పరిస్థితి విషమించి కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం సాంబం పంచాయతీ బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ(22) ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు శ్రీకాకుళం రెఫర్ చేశారు. అక్కడి నుంచి 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద గర్భిణీ కన్నుమూసింది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలుజారి బావిలో పడి గర్భిణీ మృతి
యర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా): బావి దగ్గర బట్టలు ఉతుకుతున్న తొమ్మిది నెలల గర్భిణీ ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పాతగోపులాపురం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాతగోపులాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగేశ్వరి(22)లకు ఏడాది క్రితం వివాహమైంది. ఆంజనేయులు గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. కాగా శనివారం నాగేశ్వరి బట్టలు ఉతికేందుకు గ్రామంలోని బావి దగ్గరకు వెళ్లింది. ఈ క్రమంలోనే కాలు జారి బావిలో పడి మృతి చెందింది. నిండు గ ర్భిణీ కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భిణీ ఆత్మహత్యాయత్నం
గద్వాల : ఓ గర్భిణీ నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండల పరిధిలోని పూడూరు ఎర్రవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూడూరు ఎర్రవల్లి గ్రామానికి చెందిన జయశ్రీ, పరశురాముడు భార్యాభర్తలు. జయశ్రీ శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్త పరశురాముడు వెంటనే తేరుకొని మంటలను ఆర్పేశాడు. 108 ద్వారా జయశ్రీని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చిన సర్వే
మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిలో రోడ్డుమీదే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివంపేట ప్రాంతానికి చెందిన జ్యోతి అనే గర్భిణి పురిటి నొప్పులతో నరసాపూర్ ఆస్ప్తత్రికి వచ్చింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే ఆమె ఆస్పత్రికి చేరుకున్నా, సిబ్బంది ఎవరూ లేరంటూ ఆమెను తిప్పి పంపారు. 9.30 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు. సమగ్ర కుటుంబ సర్వే ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ రారని చెప్పారు. వాస్తవానికి వైద్యసేవల లాంటి అత్యవసర సేవలకు సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా, ఇక్కడి ప్రభుత్వ వైద్యులకు కూడా సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కనీసం ఆస్పత్రిలో నర్సులు, హెడ్ నర్సు ఉండాల్సి ఉన్నా, సర్వే కోసం వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. కనీసం ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఏవీ తెరవకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి నడిరోడ్డుమీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమెకు తక్షణం చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ముప్పు ఉందని స్థానికులు అంటున్నారు. -
గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చిన సర్వే
-
నిండు గర్భిణిపై అత్యాచారయత్నం
-
నిండు గర్భిణిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం జరిగింది.నిర్భయ చట్టం రేప్ నిందితులకు భయాన్ని కలిగించడం లేదు. మహిళలపై రేపిస్టులు తమ దురాగతాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా కన్నుమిన్ను కానకుండా ఓ నిండు గర్భిణిపై అయిదుగురు దుండగులు అత్యాచారయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మూసీనది సమీపంలో చోటుచేసుకుంది. అడ్డుకోబోయిన భర్తను దుండగులు దాడి చేసి విచక్షణారహితంగా కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు రామకృష్ణ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా ముంగనూరు నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వచ్చిన దంపతులకు ఈ సంఘటన ఎదురైంది. బాధితురాలు కొత్తకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు వచ్చారు. అయితే ఆస్పత్రిలో బహిర్భూమికి వెళ్లే సదుపాయం లేకుండటంతో వారు మూసీనది సమీపానికి వెళ్లగా ....దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకునేందుకు తాత్సరం చేస్తున్నారు. ఆ ఘటన తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రసవాని వెళ్లితే... సీఎం రికమండేషన్ అడిగారు
ప్రసవ వేదనతో వెళ్లిన గర్భిణికి మనోవేదన కొత్తపేట ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది హేళన కొత్తపేట : ప్రతి మనిషీ ఓ తల్లి ప్రసవవేదన అనంతరం కన్ను తెరిచిన వాడే. అయితే కళ్లు నెత్తికెక్కిన ఆ ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ మాటే మరిచారు. పురిటి నొప్పులతో వచ్చిన ఓ నిండు గర్భిణిని తమ వెటకారపు మాటలతో అంత కన్నా నొప్పించారు. ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆమెను పరిహసించారు. పోనీ, సూటీపోటీ మాటలంటే అన్నారు, అసలు ఆ నిండు చూలాలిని ఆస్పత్రిలో చేర్చుకున్నారా అంటే అదీ లేదు. దాంతో ఆమె ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం బాధితురాలి చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన నాగా సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె యర్రంశెట్టి సత్య అత్తవారి ఊరైన కేదారిలంక నుంచి రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ఆమెకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె చెల్లెలు జనిపిరెడ్డి నాగలక్ష్మి సాయంతో కొత్తపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డ్యూటీలో ఇద్దరు నర్సులు ఉన్నారు. వీరిలో ఓ నర్సు ‘ఇప్పుడు డాక్టరు ఉండరు, ఉదయం తీసుకురండి’ అని చెప్పింది. పురిటినొప్పులు వస్తున్నాయని, వెంటనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని నాగలక్ష్మి ప్రాధేయపడింది. దాంతో ‘సీఎం రికమండేషన్ ఉందా, ఎమ్మెల్యే రికమండేషన్ ఉందా’ అంటూ ఆ నర్సు హేళనగా మాట్లాడారు. త మకు తెలిసిన నాయకులతో ఫోన్ చేయిస్తామని నాగలక్ష్మి చెప్పింది. విషయం తెలుసుకున్న డ్యూటీ డాక్టర్ వచ్చి గర్భిణిని పరీక్షించాడు. బిడ్డ అడ్డం తిరిగిందని, రాజమండ్రి తీసుకువెళితే ఆపరేషన్ చేస్తారని చెప్పారు. అంతే కాక గర్భిణితో పాటు తోడుగా ఉన్నవారికి కూడా భోజనం పెడతారని హేళనగా మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన వాళ్లను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించుకోవాల్సిందిపోయి, ఎగతాళిగా మాట్లాడారని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసిం ది. గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని పేర్కొంది. ఈ సంఘటనపై విచారణ జరిపి, కొత్తపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విచారణ చేస్తాం : వైద్యాధికారి దీనిపై ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ ఎం.ప్రసాదరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, శుక్రవారం సాయంత్రం 4.30 వరకు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నానని చెప్పారు. ఎనిమిది మంది గర్భిణులకు ఆపరేషన్లు చేశానన్నారు. ఆ తర్వాత ఓ కేసు రాగా, రాజమండ్రి ఆస్పత్రికి తీసుకుని వెళ్లమన్నట్టు తెలిపారన్నారు. వారితో హేళనగా మాట్లాడి ఉంటే అది తప్పేనని, దీనిపై విచారణ జరిపి.. ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.