హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీ డాక్టర్‌ లేడని నర్సులే.. | Hyderabad: Infant Baby Dies While Nurse Delivers Pregnant Lady | Sakshi
Sakshi News home page

Hyderabad: జీడిమెట్లలో దారుణం.. డ్యూటీ డాక్టర్‌ లేడని నర్సులే..

Published Sun, Jan 23 2022 8:42 AM | Last Updated on Sun, Jan 23 2022 2:07 PM

Hyderabad: Infant Baby Dies While Nurse Delivers Pregnant Lady - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి నర్స్‌లు శస్త్ర చికిత్స చేయడంతో శిశువు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌ డివిజన్‌ అపురూపా కాలనీకి చెందిన జగదీష్, భార్గవిలు భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్‌లోని లయన్స్‌క్లబ్‌ ఆస్పత్రిలో చేరింది. రాత్రి 7 గంటల సమయంలో పురి టి నొప్పులు తీవ్రమయ్యాయి.

అయితే ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు జ్యోత్సా్న, రాణిలు ఆపరేషన్‌ థియేటర్‌లో ఆపరేషన్‌ చేయగా శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ప్రస్తుతం భార్గవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి భర్త జగదీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement