nurse
-
కేరళ నర్సుకు మరణశిక్ష..భారత ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ:యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియ(36)కు మరణశిక్ష విధించిన అంశంలో భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. నిమిష కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.యెమెన్ జాతీయుడి హత్య కేసులో కేరకు చెందిన నర్సు నిమిష ప్రియ నిందితురాలిగా ఉన్నారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఇటీవలే నిమిష మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజులలోపు అమలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిమిష మరణశిక్ష రద్దు చేయించేందుకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన శ్రమంతా అధ్యక్షుడి నిర్ణయంతో వృథా అయింది.ఈ ఏడాది మొదట్లోనే యెమెన్ వెళ్లిన నిమిష తల్లి అప్పటినుంచి ఇదే పని మీద అక్కడే ఉంటున్నారు. ఇక నిమిషను శిక్ష నుంచి కాపాడే శక్తి ఆమె చేతిలో హత్యకు గురైన కుటుంబ సభ్యులు, గిరిజన నేతల చేతిలోనే ఉంది. వారు క్షమాభిక్ష పెడితేనే నిమిష మరణశిక్ష నుంచి బయటపడుతుంది.నిమిషప్రియ 2017లో జరిగిన యెమెన్ జాతీయుడు అబ్దో మెహదీ హత్య కేసులో యెమెన్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి ఆమెను ఈ కేసులో దోషిగా తేల్చిన కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం సుప్రీంకోర్టు నిమిష అప్పీల్‌ను తిరస్కరించింది. తాజాగా అధ్యక్షుడు ఆమె మరణశిక్షను ధృవీకరించారు.ఇదీ చదండి: క్లాస్‌మేట్‌ను చంపిన టీనేజర్‌కు జీవితఖైదు -
మనిషి చనిపోయాక ఏమవుతుంది? కీలక విషయాలు చెప్పిన సీనియర్ నర్సు
మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఇంటెన్సివ్ కేర్‌లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్‌ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుందిమరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.ఎవరికీ తెలియని విషయంనర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.శరీరం గట్టిపడుతుందిజీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్‌మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.బాడీ చల్లగా అయిపోతుంది దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది. -
అమ్మలకు అమ్మలు
‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్వైఫ్. ‘మిడ్వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్ నాజ్ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్వైఫరీ నర్స్‌లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్ నాజ్ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్‌లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ప్రోగ్రామ్లో వీరు పాల్గొంటున్నారు.తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ను ఎంచుకుంది. యూనిసెఫ్ సహకారంతో హైదరాబాద్‌లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్ మిడ్వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.భద్రాచలం ఏజెన్సీలో...డిప్లొమా ఇన్ మిడ్‌వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్ పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెంముఖ కవళికలతోనే...భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కుని బెడ్ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్ వస్తున్నాయి. హై రిస్క్ కేసు. బయటకు రిఫర్ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్ సాయంతో నార్మల్ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.– సూర్ణపు స్వప్నమరచిపోలేని జ్ఞాపకాలుహైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాస్‌లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్‌లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్ తొలి రెండు కాన్పులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.– నౌషీన్ నాజ్‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్ నాజ్‌లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్‌లోని లీడర్షిప్ప్రోగ్రామ్ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్ వారీజ్ బేగ్ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్ నాజ్ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్ ఎంట్రెన్స్ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్‌లోని ‘మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో జీఎన్ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్‌లో నిర్వహించిన ఆబ్స్టెక్టిక్స్ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్) వర్క్‌షాప్‌లో యూకే నుంచి వచ్చిన మిడ్ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ‘నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్. మిడ్వైఫరీ కోర్సులో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌లోని నీలోఫర్, కింగ్ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. వాటర్ బర్త్, బ్రీచ్ బర్త్ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్బర్త్ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
బెంగాల్లో మరో దారుణం.. నర్సుపై వేధింపులు, అనుచిత ప్రవర్తన!
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవకముందే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్‌షిఫ్టులో ఉన్న నర్సు వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. వివరాలు.. బీర్భం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఛోటోచక్ గ్రామానికి చెందిన అబ్బాస్ ఉద్దిన్ అనే వ్యక్తికి జ్వరం రావటంతో అతడిని కుటుంబసభ్యులు నిన్న రాత్రి 8.30 గంటలకు హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని పరీక్షించిన డాక్టర్లు సెలైన్ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు రోగికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సెలైన్ ఎక్కిస్తున్న సమయంలో ఆ వ్యక్తి.. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు నర్సు ఆరోపించారు. ఆ రోగి అసభ్య ప్రవర్తనతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ చేరుకున్న ఇలంబజార్ పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో చోటు చేసుకున్న హత్యాచార ఘటన తర్వాత వైద్యులు, సిబ్బంది నైట్ షిఫ్ట్‌లో పనిచేయడానికి వెనకాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌కి ఇటీవల పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై బెంగాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. డాక్టర్లు రక్షణ కోసం ఇటీవల సుప్రీం కోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో.. అధిక బరువుకి చెక్‌పెట్టిన నర్సు!
ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు దగ్గర నుంచి పురుషుల వరకు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకునేందుకు జిమ్ సెంటర్ల్, డైటింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అయినా బరువు అదుపులోకి రాకపోవడంతో ఎలా తగ్గాలో తెలియక చాలా సతమవుతున్నారు. కానీ కొందరూ మాత్రం కొద్దిపాటి వ్యాయామాలతో అధిక బరువుకి చెక్‌పెట్టి ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ నర్సు. అందరిక తెలిసిన సాధారణ వ్యాయామంతో అధిక బరువుకి చెక్‌పెట్టి ఆశ్చర్యపరచింది ఈ నర్సు. ఆ ఎక్స్ర్సైజుతో అంత పవర్‌ఫులా ఈజీగా బరువుత తగ్గిపోవచ్చా అంటే.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 25 ఏళ్ల నర్సు సమంతా అబ్రూ బరువుతో పలు సమస్యలు ఎదుర్కొంది. సుదీర్ఘ నర్సు షిప్ట్‌లతో శరీరం అలసిపోవడంతో తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునేది. అమె ఏ మాత్ర కదలడానికి ఇష్టపడేది కాదు. దీంతో ఆమె ఏకంగా 119 కిలోల బరువుకి చేరుకుంది. ఆస్పత్రుల్లో అధిక బరువుతో ఎదుర్కొంటున్న సమస్యలు చూశాక ఈమెలో అనూహ్యంగా మార్పు వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి ఏ మాత్రం శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడేది కాదు. చిన్నప్పుడూ తన తల్లిదండ్రులు పనిపై బయటికివెళ్తే..ఇదే అదనుగా పిజ్జాలు, బర్గ్‌లు వంటివి ఆర్డర్ చేసుకుని హాయిగా తినేసిది. చెప్పాలంటే ఆమె మంచి ఫుడ్ లవర్. తినకుండా ఉండలేదు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం అంటే మరింత ఇష్టం. ఇలాంటి ఆమె బరువు తగ్గాలను అనుకుంది. అయితే అప్పుడే కోవిడ్ టైం, లాక్డౌన్ ఆంక్షలు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆమె మానసికంగా ధైర్యంగా ఉండేందుకు వాకింగ్ ప్రారంభించింది. ఇది ఆమె బరువు తగ్గడంలో కీలకంగా పనిచేసింది. శరీరాన్ని కష్టపెట్టడం అంటే బయపడే సమంతా అబ్రూ ఈ వాకింగ్ తనకి సులభంగా ఉండే ఈజీ వ్యాయామంగా తోచింది. దీంతో క్రమ తప్పకుండా సుమారు 5 మైళ్లు వాకింగ్ చేసేది. ఆ తర్వాత నెమ్మదిగా వారానికి నాలుగుసార్లు జిమ్‌లో గడపడం మొదలు పెట్టింది అప్పుడప్పుడూ మూడ్ బాగుంటే పరుగు కూడా పెట్టేది. ఇవి ఆమె దినచర్యలో భాగమయ్యాయి. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 42 కిలోల మేర బరువు అనుహ్యంగా తగ్గిపోయింది. రోజువారీ వాకింగ్, మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు తగ్గడం సులభమేనని ధీమాగా చెబుతోంది నర్సు సమంతా అబ్రు. అంతేగాదు ఇప్పుడూ తన శరీరం తనకు మంచి సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. (చదవండి: మనదేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే! కిచెన్ క్వీన్స్‌గా సత్తా చాటుతున్నారు) -
పెళ్లి తర్వాత మహిళా ఉద్యోగి తొలగింపు.. కేంద్రానికి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: వివాహాన్ని సాకుగా చూపి మహిళను ఉద్యోగంలో నుంచి తొలగించడం లింగ వివక్షత చూపించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్షాపూరితంగా వ్యవహరించే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమంతించబోదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత మహిను ఉద్యోగంలో నుంచి తొలగించినందుకు ఆమెకు రూ. 60లక్షల బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశ సైన్యంలో నర్సుగా పనిచేసిన ఓ మహిళను వివాహం అనంతరం తొలగించిన కేసుపై జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, దిపాంకర్ దత్తా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వివాహం అనంతరం సెలినా జాన్ అనే నర్సును 1988లో విధుల నుంచి తొలగించారు. అప్పుడు ఆమె సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను తొలగించడంపై 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను 2019లో సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం సవాలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పులో ఎలాంటి జోక్యం అవసరం లేదని ఫిబ్రవరి 14 నాటి ఉత్తర్వులో ధర్మాసనం పేర్కొంది. వివాహ కారణాలతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనను 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే బాధితురాలు ప్రైవేటుగా కొంతకాలం నర్స్‌గా పనిచేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. సదరు ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ, వేతనాన్ని ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమెకు బకాయిల రూపంలో రూ .60లక్షలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలు అందిన ఎనిమిది వారాల్లోగా ప్రభుత్వం ఈ పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది. చదవండి: కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
శిబిరంలో 50,000 మందికి నాలుగే టాయిలెట్లు... గాజాలో దుర్భర పరిస్థితులు
న్యూయార్క్: గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్ తెలిపింది. అక్కడ సురక్షితమైన ప్రదేశమంటూ లేదని వెల్లడించింది. యుద్ధభూమి నుంచి బయటపడి అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ ఆమె చూసిన భయానక విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంది. గాజాలో 50,000 మంది ఒకే సహయక శిబిరంలో తలదాచుకున్నామని కల్లహన్ తెలిపింది. అక్కడ కేవలం నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండగా.. కేవలం నాలుగు గంటలే నీరు అందుబాటులో ఉండేదని తాము అనుభవించిన దుర్భర పరిస్థితులను బయటపెట్టింది. అమెరికాకు చేరి తన కుటుంబాన్ని కలుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన ఎమిలీ కల్లాహన్.. గాజాలో గాయపడిన వారికి చికిత్స చేస్తున్న పాలస్తీనా డాక్టర్లు నిజమైన హీరోలని కొనియాడింది. "26 రోజుల్లో ఐదుసార్లు మకాం మారాల్సి వచ్చింది. కమ్యూనిస్టు ట్రైనింగ్ సెంటర్లో 35,000 మందిమి తలదాచుకున్నాం. అక్కడ కొంతమంది పిల్లలకు చర్మం కాలిపోయి ఉంది. ఆస్పత్రులు నిండిపోయాయి. బంధువులు కోల్పోయిన బాధలో డాక్టర్లపైనే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను అమెరికన్ అని గుర్తిస్తూ అరబ్‌లా నటిస్తున్నావని అరిచారు. మా బృందాన్ని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పాలస్తీనా సిబ్బంది నిత్యం మా వెంటే ఉన్నారు. స్థానిక స్టాఫ్ మమ్మల్ని రక్షించకపోతే ఖచ్చితంగా చనిపోయేవాళ్లం." అని అక్కడి భయనక విషయాలను కల్లాహన్ బయటపెట్టారు. మా సిబ్బంది అక్కడి అధికారులతో మాట్లాడి రఫా సరిహద్దు గుండా ఈజిప్టుకు బస్సుల్లో తరలించారని కల్లాహన్ వెల్లడించింది. అక్కడ సిబ్బంది మాకోసం ఎంతో త్యాగం చేశారని ఆమె తెలిపారు. దేశం విడిచి రావడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదని.. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం కోసమే వారు ప్రధాన్యతనిచ్చారని తెలిపింది. ఇదీ చదవండి: Israel-Palestine War Updates: గాజాలో ఆగని వేట -
కిరాతక నర్సు లూసీకి జీవిత ఖైదు..?
లండన్: వాయువ్య ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నియోనైటల్ విభాగంలో పనిచేస్తున్న లూసీ లెట్బీ(35)కి ఏడుగురు పసి పిల్లలను చంపిన నేరంలో జీవితకల జైలుశిక్షపడింది. కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్, నియోనైటల్ విభాగంలో జూన్ 2015 నుండి జోన్ 2016 వ్యవధిలో పసిపిల్లలను చంపిన కేసులో లూసీ లెట్బీని అరెస్టు చేసారు బ్రిటీష్ పోలీసులు. బ్రిటీష్ మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో ఈ కేసుపై వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ వారు తెలిపిన వివరాల ప్రకారం లూసీ నర్సుగా పనిచేస్తున్న సమయంలో ఏడుగురు పిల్లలను చంపగా మరో ఆరుగురిపై హత్యాయత్నానికి పాల్పడింది. పసిపిల్లల శరీరంలోకి ఇంజక్షన్ ద్వారా గాలిని పంపించడం, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, పాలు ఎక్కువగా పట్టించడం ద్వారా ఈ హత్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఈ కేసుపై మాంచెస్టర్ క్రౌన్ కోర్టులో సుమారు 110 గంటలు వాదనలు జరగగా సోమవారం ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం తీవ్రత పెద్దది కాబట్టి ఆమెకు జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముందంటున్నాయి కోర్టు వర్గాలు. లూసీకి జీవితఖైదు పడే అవకాశముందని బాధిత కుటుంబాలకు తెలిసిన తర్వాత వారిలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేయగా మరికొంతమంది ఆమెకు ఇంకా పెద్ద శిక్ష పడాలని ఈ శిక్ష సరిపోదని అన్నారు. శుక్రవారం నాడు చివరి రోజు వాదనలు జరిగిన సమయంలో లూసీ కన్నీటి పర్యంతమై సానుభూతి పొందే ప్రత్యత్నం చేసినా కూడా ఆమెను ఎవ్వరూ కనికరించలేదు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
ఆ నరరూప రాక్షసికి ఎలాంటి శిక్ష?
లండన్: విధి నిర్వహణలో భాగంగా.. కంటికి రెప్పలా నవజాత శిశువుల్ని చూసుకోవాల్సిన నర్సు మానవత్వాన్ని సైతం మరిచి ఉన్మాదిగా మారింది. ఆసుపత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. బ్రిటన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం, శ్వాసనాళాలకు అంతరాయం కలిగించడం.. పసికందుల్ని ఆ నరరూప రాక్షసి చేసిన పనులు. మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించినట్లు వెల్లడైంది. ఇంగ్లండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) ఈ దారుణాలకు ఒడిగట్టింది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది. ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ విధుల్లో ఉన్నట్లు తేలింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఆమెను మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేలింది. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఈ నరరూప రాక్షసికి ఎలాంటి శిక్షలు పడతాయో అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. ‘నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు’ అని రాసి ఉన్న కాగితాలు ఆమె ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే, లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్ వాదించారు.పసిగుడ్డుల ప్రాణం తీయడానికి ఆమె ఎంచుకున్న మార్గాలు మానవత్వానికి మచ్చలా నిలిచాయనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. -
నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్ భార్యను..
పతనంథిట్ట: ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హత్య చేయాలనుకుంది. అందుకు నర్సు వేషాన్ని వేసింది. ఇంజెక్షన్‌ను వేసి చంపేయాలని వ్యూహం పన్నింది. మనిషికి ఇంజెక్షన్ చేయడం అంత సులువు అనుకుందో.. ఏమో? కానీ తీరా అక్కడికి వెళ్లాక తటపటాయించింది. అనుమానం వచ్చిన బాధితులు యాజమాన్యాన్ని పిలవగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పతకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనుష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అంతమొందించాలనుకుంది అనూష. గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. నర్సుగా స్నేహ గదిలోకి వెళ్లి మరో ఇంజెక్షన్ వేసుకోవాలని తెలిపింది. బాధితురాలి శరీరంలోకి మందు ఇంజెక్ట్ చేసే క్రమంలో తటపటాయించింది. అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లి డాక్టర్లను పిలిచింది. దీంతో అనూష బండారం బయటపడింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. అనూషను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: Madhya Pradesh: గిరిజనునిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు.. -
చికిత్స కోసం వచ్చిన బాధితునితో నర్సు రిలేషన్.. ఆసుపత్రి బయట కూడా!
ఆ విషయం తెలియగానే ఆసుపత్రి యాజమాన్యంలో కలకలం చెలరేగింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేయడంతో, యాజమాన్యం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దర్యాప్తులో ఆమె ఆ బాధితుడు డయాలసిస్ కోసం వస్తుంటాడని చెప్పింది. ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా.. చికిత్స కోసం వచ్చిన బాధితునితో ఒక నర్సు రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆసుపత్రి బయట కూడా ఆ బాధితుడిని కలుస్తూ వచ్చింది. ఈ వ్యవహారం ఆసుపత్రి యాజమాన్యం కంటపడకుండా గుట్టుగా సాగింది. అయితే ఒక రోజు ఆ బాధితుడు చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కన్నుమూశాడు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయం పోలీసుల వరకూ చేరింది. పోలీసులు ఆ నర్సుపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా సాయంతో.. డెయిలీ స్టార్ రిపోర్టులోని కథనం ప్రకారం ఈ ఉదంతం ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. పెనెలోప్ విలియం అనే మహిళ 2019 నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది.ఈ నేపధ్యంలో ఆమెకు ఒక పేషెంట్‌తో సంబంధం ఏర్పడింది. వారు రహస్యంగా కాల్ చేసుకోవడం, కలుసుకోవడం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా సాయంతో ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఆసుపత్రి బయట తరచూ కలుసుకునేవారు. అయితే ఒక రోజు అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. కారులో వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో ఆ పేషెంట్‌కు గుండెపోటు వచ్చింది. సహోద్యోగికి ఫోను చేసి.. వెంటనే పెనెలోప్ అంబులెన్స్‌కు కాల్ చేసింది. ఇంతలో వారుంటున్న కారులోనే ఆ బాధితుడు మృతి చెందాడు. అయితే పెనెలోప్ తన సహోద్యోగినికి ఫోను చేసి, సీపీఆర్ అందించేందుకు పిలిచింది. అయితే అప్పటికే సమయం మించిపోయింది. విషయం ఆసుపత్రివర్గాలకు తెలియగానే కలకలం చెలరేగింది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం పెనెలోప్‌ను విధుల నుంచి తొలగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆమెను ప్రశ్నించగా, అతను ఆరోజు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వచ్చాడని తెలిపింది. అయితే ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక మెసేజ్‌లో అతనికి చెస్ట్ పెయిన్ వచ్చినట్లు ఉంది. దీంతో పెనెలోప్ అబద్దం చెబుతున్నదని యాజమాన్యానికి స్పష్టమైంది. ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందంటూ.. ఆమె అతనికి ఫోను చేసి, ఉద్దేశ పూర్వకంగానే పిలిచిందని దర్యాప్తులో తేలింది. అతను రాగానే వారిద్దరూ కారులో సరససల్లాపాల్లో తేలారు. సరిగ్గా అదే సమయంలో ఆ బాధితునికి గుండెపోటు వచ్చి, మృతి చెందాడు. ఆ నర్సు, బాధితునికి మధ్య గత రెండేళ్లుగా ఈ ఎఫైర్ ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆ బాధితుని పేరు వెల్లడించలేదు. ఈ విషయమై ఆసుపత్రి దర్యాప్తు కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ పెనెలోప్ విలియమ్స్ ఆ బాధితునితో తనకు ఎటువంటి సంబంధం లేదని, బాధితునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, మృతి చెందాడని తెలిపిందన్నారు. ఇది కూడా చదవండి: తండ్రి మృతుని తట్టుకోలేని చిన్నారి.. సమాధి దగ్గరకు వెళ్లి.. -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
దూరమవుతుందనే దారుణం
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న బి.చంద్ర మోహన్ చేతిలో దారుణంగా హతమైన మాజీ హెడ్ నర్సు వై.అనురాధ కేసులో స్పష్టత వచ్చింది. కొన్నేళ్లుగా చంద్రమోహన్‌తో సన్నిహితంగా ఉంటున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించడంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తేలింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మలక్‌పేట ఏసీపీ శ్యామ్‌సుందర్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, డీఐ ఎల్.భాస్కర్‌రెడ్డిలను కొత్వాల్ సీవీ ఆనంద్ మంగళవారం అభినందించారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారికి సర్టిఫికెట్లు, నగదు పురస్కారం అందించారు. అనురాధ, చంద్ర మోహన్ 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇతడు అనురాధ నుంచి 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు తీసుకున్నాడు. చాన్నాళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకున్న అనురాధ ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని భావించి ఓ మాట్రిమోనియల్ సైట్లో పేరు రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే కాల్స్‌ను ఆమె రహస్యంగా మాట్లాడుతోంది. దీంతో చంద్రమోహన్‌కు అనుమానం వచ్చింది. ఈ నెల 12న అనురాధ గదికి అతను వచ్చిన సందర్భంలో ఆమె తన ఫోన్ వదిలి స్నానానికి వెళ్లింది. అప్పుడే ఆ ఫోన్ చూసిన చంద్రమోహన్‌కు ఆమె రెండో పెళ్లి ప్రయత్నాల విషయం తెలిసింది. అప్పటికే ఆమె వద్ద ఉన్న రూ.30 లక్షలు తనకే దక్కాలని భావించిన చంద్రమోహన్ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తే ఆమె తనకు దూరమవుతుందని అనుకున్నాడు. దీంతో అనురాధతో ఘర్షణకు దిగి దారుణంగా హత్య చేశాడు. -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్‌తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్‌కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్‌లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్‌లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
‘నీకేం కాదు, ధైర్యంగా ఉండు’ అని నర్సు చెప్పే ఒక్క మాట చాలు! వీరికి సలాం..
సేవకు విశ్రాంతి లేదు.. రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలూ అంతే ముఖ్యం. ‘నీకేం కాదు, ధైర్యంగా ఉండు’ అని నర్సు చెప్పే మాట రోగిలో భవిష్యత్తుపైన ఆశలు చిగురింపజేస్తుంది. విధుల్లో ఉన్నా, లేకపోయినా తమ చుట్టూ ఉన్నవారికి నర్సమ్మగా సేవలు అందిస్తూనే ఉంటుంది. తన సేవాగుణాన్ని చాటుకుంటూనే ఉంటుంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ముప్పై, నలభై ఏళ్లుగా రోగులకు సేవలు అందించిన వారిని కలిస్తే వారు పంచుకున్న విషయాలు ఇవి. దేవుడిచ్చిన అవకాశం ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్‌లో .. దాదాపు నలభై ఏళ్లు నర్సుగా, నర్సింగ్ టీచర్‌గా విధులు నిర్వర్తించాను. కర్నూల్లోనూ చీఫ్ నర్సింగ్ సూపరిండెంట్‌గా వర్క్ చేశాను. ఏడాది క్రితం రిటైర్ అయ్యాను. కొంత కాలం క్రితం మాకు తెలిసిన వారి అమ్మాయికి హార్ట్‌లో హోల్ ఉందని తెలిసింది. ఏ డాక్టర్‌ను కలిస్తే ఎలాంటి చికిత్స అందుతుంది, ఎలాంటి గైడెన్స్ అవసరం అనే విషయాలు చెప్పడంతో పాటు కొన్ని నెలలు వారింట్లోనే ఉన్నాను. టైమ్‌కు మందులు, ఫుడ్ చార్ట్ ప్రకారం ఫాలో అవడంలాంటి జాగ్రత్తల మూలంగా ఆ అమ్మాయి సేవ్ అయ్యింది. ఇదొక్కటే కాదు హైదరాబాద్, రాం కోఠిలోని మా కాంప్లెక్స్, కాలనీలలో తెలిసిన వారు ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా, ఏ డాక్టర్ని కలవాలి అని అడగడంతో పాటు, జాగ్రత్తలు చెప్పమని కోరుతారు. ప్రెగ్నెంట్ ఉమన్ కనిపిస్తే చాలు – వారు అడగకపోయినా వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కనుక్కుంటాను. ఇన్నేళ్లపాటు వర్క్‌లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినవారి జాబితా ఎక్కువ. ఇతర రాష్ట్రాలలోనూ ఉన్నారు. వారు కూడా ఏ రాత్రి ఏ వైద్య సలహా అవసరం వచ్చినా అడుగుతుంటారు. సేవ అనేది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. అదే ఎంతో మంది రోగులకు స్వస్థత చేకూర్చేలా చేసిందనుకుంటాను. సేవకు ఎప్పుడూ రిటైర్మెంట్ ఉండదని నాకు ప్రతిరోజూ ఒక్క సంఘటనైనా రుజువు చేస్తుంటుంది. – పంకజ రుతు, రాంకోటి, హైదరాబాద్ విధుల్లోలేని సమయాల్లోనూ.. నిమ్స్‌లో విధులను నిర్వర్తిస్తున్నాను. మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ఉంది. అయితే, హాస్పిటల్ వరకే మా సేవలు ఉండవు. నర్సింగ్ సేవకు రోజుకు ఇన్ని గంటలే అనే నియమం ఉండదు. స్వచ్ఛందంగానూ మా కాలనీలోనూ, కాంప్లెక్స్‌లోనూ, తెలిసినవారికి అవసరమైన వారికి సేవలు ఇస్తుంటాను. ఈ మధ్య కాలంలో మా కాంప్లెక్స్‌లో ఒక పెద్దాయనకు పక్షవాతం వచ్చింది. పూర్తిగా బెడ్‌కే పరిమితం అయ్యాడు. ప్రతిరోజూ డ్యూటీకి వెళ్లడానికి ముందు వారింటికి వెళ్లి, ఆ రోజు అతని పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని, ఆ రోజు షెడ్యూల్‌ను కచ్చితంగా ఫాలో అయ్యారో లేదో అడిగి తెలుసుకుంటాను. ఆ రోజు ఎలాంటి కేర్ తీసుకోవాలో చెబుతాను. మిగతావాళ్లూ తమ ఆరోగ్యస్థితి గురించి అడిగితే చెబుతుంటారు. అలాంటప్పుడు వారికి డాక్టర్ ప్రిస్కిప్షన్ చూసి ఇంజక్షన్స్ వంటివి అవసరం ఉన్నవారికి చేస్తుంటాను. ఎవరికి ఆరోగ్యసమస్య వచ్చి, సాయం కోరినా అందుబాటులో ఉండటం కూడా సేవగా భావిస్తాను. – అరుణ పాల్వాయి, మియాపూర్, హైదరాబాద్ ఊరటనివ్వడమే ఆనందం గాంధీలో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో ట్యూటర్‌గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగుల ఆరోగ్య సలహాల కోసం ఆరేళ్లు వర్క్ చేశాను. మూడేళ్లుగా ఇంటి వద్దే ఉంటున్నాను. కానీ, ఉద్యోగంలో లేను అనే ఆలోచన ఎప్పుడూ రాదు. మా ఏరియాలో నేను అందరికీ తెలుసు. నాకు దాదాపుగా అందరూ పరిచయమే. ఆ విధంగా మా ఏరియాలో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా పిలుస్తారు. సలహాలు అడుగుతారు. హాస్పిటల్ నుంచి వారు వచ్చాక వెళ్లి కలుస్తాను. ఏ మందులు ఎలా వాడాలో చెబుతుంటాను. మా ఏరియాలో ఎవరికైనా చంటిపిల్లలు పుడితే, వారు పిలవకపోయినా వెళతాను. ప్రసవం అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చంటిపిల్లలను ఎలా చూసుకోవాలో సూచనలు ఇస్తుంటాను. ఎవరైనా చనిపోతే వెళ్లి, డెడ్‌బాడీని ఎలా కేర్ చేయాలో, ఎందుకు అవసరమో చెబుతుంటాను. మా ఏరియాలో ఈ మధ్య ఒక అన్నకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. హాస్పిటల్ నుంచి వచ్చాక నెల రోజుల పాటు రోజూ వారి ఇంటికి వెళ్లడం, కాలుకు వాపు రాకుండా జాగ్రత్తలు చెప్పడం, డ్రెస్సింగ్ చేయడం, మందులు వాడటం గురించి చెబుతుండేదాన్ని. ఇప్పుడు ఆ ఆన్న నడుస్తున్నారు. సమస్య నుంచి తేరుకున్నాక వారి మొహాల్లో కనిపించే రిలీఫ్ నాకు ఎంతో ఆనందానిస్తుంది. – నీరజాక్షి, వికారాబాద్ చదవండి: అందమైన ప్యాకింగ్‌తో ఆదాయం.. తొమ్మిదేళ్లుగా.. -
వైరల్ వీడియో: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
-
Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి ఇంక్యుబేటర్‌లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్ అనే రాజకీయవేత్త ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే. Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı? 🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb — Fatma Şahin (@FatmaSahin) February 11, 2023 (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి.. 429 హోటళ్లపై రైడ్..
తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను మూసివేసింది. కొట్టాయంలో ఓ ఈవెంట్‌కు హాజరైన నర్సు అక్కడ ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆహార భద్రత శాఖ అప్రమత్తమై హోటళ్లపై మంగళవారం దాడులు చేసింది. మూసివేసిన 43లో 21 హోటళ్లకు లెసెన్సులు లేవని అధికారులు తెలిపారు. మిగతా 22 హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 29న ఓ ఈవెంట్‌కు హాజరైన 100 మంది అస్వస్థకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. ఓ హోటల్ నుంచి వచ్చిన ఆహారం తిని వీరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని హోటళ్లపై రైడ్లు చేయాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి? -
5,204 స్టాఫ్ నర్సు పోస్టులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వైద్యారోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారు తమ వెబ్సైట్ (https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అనుభవమున్న వ్యక్తులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. అనుభవ ధ్రువీకరణతో.. స్టాఫ్ నర్సు పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్నవారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. ఉదాహరణకు స్టాఫ్ నర్స్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గతంలో కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నర్స్‌గా చేసిన కాలానికి సంబంధించిన పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏఎన్ఎంగా, ఇతర సేవలు అందించి ఉన్నా దానిని పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ నర్సు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95% పోస్టులను కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తా రు.జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు.. జోన్–2లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువన గిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ►అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ►ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ►దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2022 జూలై ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ►అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ►ఆధార్ కార్డ్, పదో తరగతి సర్టిఫికెట్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సదరు కుల ధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ’ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్’, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫి కెట్, ఎన్సీసీ ధ్రువపత్రం వంటివి అవస రాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. ►దరఖాస్తు రుసుము రూ.120, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ►ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. రాతపరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. ►ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్‌లో నిర్వహించే రాతపరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ►హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. -
నర్సు నిర్వాకం.. ఊహించని రీతిలో పట్టించిన 13 ఏళ్ల కూతురు
భర్తను చంపి ఏమి ఎరుగనట్టు ఆస్పత్రికి తీసుకవచ్చింది ఓ నర్సు. ఆత్యహత్య చేసుకుని చనిపోయాడంటూ వైద్యులను నమ్మించేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కవిత అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమె నవంబర్ 29న భర్తతో గోడవ పడి ఆవేశంలో చంపేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తాను పనిచేసే ఆస్పత్రికే తీసుకువచ్చింది. వైద్యులకు భర్త దుప్పటితో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు చెప్పింది. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో సదరు వ్యక్తి గొంతుపై ఊపిరాడకుండా చేసిన గుర్తులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానంతో కవితను గట్టిగా విచారించగా...తన భర్త మహేశ్ తాగి వచ్చి తరుచు కొడుతూ ఉండేవాడని చెప్పింది. ఇలానే నవంబర్29న ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో తన భర్త నిద్రపోతున్నప్పుడూ గొంతు నులిమి చంపినట్లు పేర్కొంది. అంతేగాదు ఆమె 13 ఏళ్ల కూతుర్ని కూడా విచారించగా...వాళ్ల అమ్మ కవిత తన తండ్రి నోటిని మూసి చంపుతుండటం చూసినట్లు తెలిపింది. విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ని కూడా తనిఖీ చేయగా ఆమె ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వినయ్ శర్మతో ఆమెకు సంబంధం ఉందని తేలింది. ఈ హత్యలో వినయ్ ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పే.. వాట్సప్ చాట్లు, ఆడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇల్లరికపు అల్లుడు షాకింగ్ ట్విస్ట్.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..) -
బరితెగించిన మేల్ నర్స్.. సన్నిహితంగా ఉంటూ బ్లాక్‌మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు. అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్‌ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్‌గూడకు తరలించారు. పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ.. ►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్‌కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత -
ఆస్ట్రేలియాలో ఢిల్లీ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్ 21న క్వీన్స్లాండ్ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్ మర్డర్ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్విందర్ సింగ్ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫైల్ టౌన్లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్విందర్ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్ అందుకు అంగీకరించింది. కొన్ని వారాల క్రితం రాజ్ విందర్పై క్వీన్స్లాండ్ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు( భారత్ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్లాండ్ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు. చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష -
Aastha Arora: బిలియన్త్ బేబీ ఏం చేస్తోంది!?
ఆస్తా అరోరా ఎవరో మీకు గుర్తుందా ? పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ భారత్ బిలియంత్ బేబి అంటే టక్కున గుర్తొస్తుంది. ఆమె పుట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2000 సంవత్సరం మే 11న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉదయం 5 గంటల 5 నిమిషాలకు భూమ్మీదకు వచ్చిన పసికందును చూడడానికి ఆ నాటి ఎన్డీయే ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులు తరలివచ్చారు. గులాబీ రంగు దుప్పట్లో ఆ పసికందుని చుట్టి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ బిడ్డ పుట్టుక ప్రపంచ దేశాల పత్రికల్లో పతాక శీర్షికగా మారింది. ఆ పాప రాకతో మన దేశ జనాభా 100 కోట్లకు చేరుకుంది. భారత్ జనాభా నియంత్రణపై మరింతగా దృష్టి పెట్టాలని ఐరాస గట్టిగా హెచ్చరించింది కూడా. చైనా తర్వాత 100 కోట్ల జనాభా క్లబ్లో నిలిచిన రెండో దేశంగా రికార్డులకెక్కింది. నాటి కేంద్ర మహిళా శిశు మంత్రి సుమిత్రా మహాజన్ ఉచిత విద్య, వైద్యం, రైళ్లలో ఉచిత ప్రయాణం వంటివి కల్పిస్తామని ఆ కుటుంబంలో ఆశలు పెంచారు. అమ్మాయి తండ్రికి మంచి ఉద్యోగం ఇస్తామని, ఆమె పెంపకం బాధ్యత తమదేనని హామీలు గుప్పించారు. రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆస్తా ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలిస్తే నిర్ఘాంతపోతాం. తండ్రి ఒక షాపులో సేల్స్‌మన్‌గా ఉద్యోగం చేసేవారు. నెలకి రూ.4,000 జీతంతో ఇద్దరు పిల్లల్పి పోషించాల్సి వచ్చింది. స్కూలు ఫీజులు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లేవు. ఆస్తా స్వశక్తితో ఎదిగి 22 ఏళ్ల వయసులో నర్సు ఉద్యోగాన్ని సంపాదించుకుంది. డాక్టర్ కావాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ‘‘డాక్టర్ కావాలని చాలా ఉండేది. కానీ మా తల్లిదండ్రులకు శక్తి లేకపోవడంతో ప్రైవేటు స్కూలుకు పంపలేకపోయారు. దాంతో నేను రాజీపడి నర్సుగా శిక్షణ తీసుకున్నాను’’ అని వివరించింది. యూఎన్ ఆర్థిక సాయంతో నర్సు కోర్సు యూఎన్ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం మాత్రమే ఆ కుటుంబానికి దక్కింది. దానిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆస్తాకు 18 ఏళ్లు వచ్చిననాటికి రూ.7 లక్షలొé్చయి. ఆ డబ్బులతోనే కాలేజీ, నర్సు కోర్సు చేసింది. ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రిలో బిడ్డను కన్నప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని తన కూతురుకి బంగారు భవిష్యత్ ఉందని తల్లి అంజన మురిసిపోయింది. కానీ ఎంత మంది చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. నర్సుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే అధిక జనాభా దేశానికి భారం అని ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను కూడా ఈ బిలియన్త్ బేబి తీసుకుంది. వివిధ సంస్థలు ఏర్పాటు చేసే చర్చల్లో పాల్గొంటూ జనాభా నియంత్రణపై ప్రసంగాలిస్తోంది. త్వరలో భారత జనాభా 140 కోట్లకు చేరుకోనుంది. నిరుపేదల బతుకుల్లో మాత్రం ఇప్పటికీ మార్పు రాకపోవడం విషాదమని ఆస్తా నిట్టూరుస్తోంది. స్కూల్లో సెలబ్రిటీయే ఆస్తా చిన్నతనంలో సెలబ్రిటీ హోదాయే అనుభవించింది. బిలియన్త్ బేబీ ఏం చేస్తోందంటూ మీడియా ఎన్నో కథనాలు చేసింది. ఏడాది వయసులో ఐరాస పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ), కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ప్రారంభోత్సవానికి బుల్లి అతిథిగా హాజరైంది. చిన్నారి ఆస్తా తన అన్నయ్య పాఠ్య పుస్తకాలను చించేసి ఆడుకోవడమూ పేపర్లవారికి వార్తే అయింది. అప్పట్లో పేపర్లో వచ్చిన వార్తలన్నీ చూసుకొని మురిసిపోవడమే తప్ప ఆమె ఒరిగిందేమీ లేదు. తన పుట్టుక ప్రపంచానికే ప్రత్యేకమైనదని ఆస్తాకు స్కూలుకెళ్లే సమయంలోనే అర్థమైంది ‘‘నాకు నాలుగైదేళ్లు ఉంటాయి. మా స్కూలుకు మీడియా కెమెరాలతో రావడంతో ఆశ్చర్యపోయా. టీవీల్లో కనిపించడం, అందరూ నా గురించి మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఫీలయ్యా’ అంటూ ఆ సంగతుల్ని నెమరేసుకుంది. ఆస్తా చదువులో చురుగ్గా ఉండేది. చర్చల్లో పాల్గొనేది. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేది. కానీ ఇంటర్‌కు వచ్చాక ఆమె తన ఆశల్ని చంపేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల చుట్టూ తిరిగినా ముఖం చాటేయడంతో ప్రభుత్వ కాలేజీలో చేరాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జుట్టు పట్టుకుని ఈడ్చేసిన నర్సు.. వీడియో దుమారం
లక్నో: ఒక మహిళా పేషంట్‌కి ఇంజక్షన్ ఇచ్చేందుకు ఒక నర్సు చాలా దురుసుగా ప్రవర్తించింది. ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా బెడ్‌పై పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మాధ్యమంలో వైరల్ కాగా, నర్సు తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ఆస్పత్రి అధికారి స్పందించారు. రోగిని అక్టోబర్ 18న ఆమె బంధువులు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆ పేషంట్ ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా హింసాత్మకంగా ప్రవర్తించడం ప్రారంభించింది. తన గాజులు పగలు కొట్టుకుని, బట్టలు చించేసుకుంది. దీంతో అదే వార్డులో ఉన్న ఇతర మహిళా పేషంట్లు భయాందోళనలకు గురయ్యారు. సదరు పేషంట్ని కంట్రోల్ చేసే నిమిత్తం అలా నర్సు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆ తదనంతరమే పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. ఆమెను అదుపుచేయడానికి నర్సు అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నర్సు దురుసుగా ప్రవర్తించిందంటూ వస్తున్న ఆరోపణలను డాక్టర్ సింగ్ తోసిపుచ్చారు. सीतापुर जिला अस्पताल से हैरान करने वाला वीडियो आया सामने,स्टॉफ नर्स एक महिला मरीज की चोटी पकड़कर बेड पर पटकती नजर आई,वीडियो वायरल.@dm_sitapur @myogiadityanath @CMOfficeUP @brajeshpathakup#UttarPradesh #Sitapur#सीतापुर @abcnewsmedia pic.twitter.com/WhPaZUHbpx — ASHISH YADAV (@AshishYadavknp) October 28, 2022 (చదవండి: -
ఘోరం: నర్సుపై సాముహిక అఘాయిత్యం
భోపాల్: ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మైనర్‌తో సహా నలుగురు సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితులు భాధితురాలి పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉండటం గమనించి ఈ దారుణానికి తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి ఈ ఆరోగ్య కేంద్రంలోకి చోరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే గాక హత్య చేసేందుకు కూడా యత్నించారు. దీంతో బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు 17 ఏళ్ల మైనర్‌తో సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తల బృందం మారుమూల ప్రాంతాల్లో విధుల నిర్వర్తించడంపై ఆందోళన వ్యక్తం చేయడమే గాక చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తమకు భద్రత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఆరోగ్య కేంద్రం ఛీఫ్ అధికారి ప్రతిమ సింగ్ మాట్లాడుతూ..తమకు భద్రత కావాలని, అలాగే ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తాము విధులు నిర్వర్తించమని కరాఖండిగా చెప్పారు. (చదవండి: విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య) -
వైరల్ వీడియో: ‘మీ అమ్మనో.. అక్కనో.. వీడియోలు తీయండ్రా!’.. అసలు కథ వేరే ఉంది!
-
చాటుగా వీడియోలు తీస్తూ దొరికారు.. అంతే!
వైరల్: ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి గదిలో ఒకరోజంతా బంధించి మరీ ఇద్దరు యువకులను కర్రలతో చితకబాదింది స్టాఫ్ నర్స్. వద్దని వేడుకుంటున్న ఆమె వాళ్లను వదల్లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది. బీహార్ సరన్ జిల్లాలోని ఛప్రా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెడికల్ సర్టిఫికెట్ కావాలంటూ ఇద్దరు కుర్రాళ్లు ఆస్పత్రికి వచ్చారు. అయితే ప్రభుత్వాసుపత్రిలో నిర్వాహణ సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును యువకులిద్దరూ చాటుగా వీడియో తీసే యత్నం చేశారని తెలుస్తోంది. ఇది గమనించిన సిబ్బంది వారిద్దరినీ అడ్డుకున్నారు. ఆపై వాళ్లను ఓ గదిలో బంధించి హింసించడం మొదలుపెట్టారు. ఓ నర్సు వాళ్లిద్దరినీ కర్రలతో చితకబాదగా.. మరో నర్స్ ఆమె వెంట ఉంది. ‘‘ఫొటోలు, వీడియోలు తీస్తార్రా? ఇంటికి వెళ్లి మీ అక్కనో.. అమ్మనో.. వీడియో తీయండ్రా. ముందు ఆ ఫోన్లోని వీడియో తీసేయండ్రా’’ అంటూ ఆమె వాళ్ల మీద అరుస్తూ ఉంది. ఒకరోజంతా వాళ్లకు అలా బడిత పూజ జరుగుతూనే ఉంది. చివరకు ఆస్పత్రి సూపరిండెంట్ జోక్యం చేసుకోవడంతో ఆ కుర్రాళ్లను సిబ్బంది విడిచిపెట్టారు. అయితే స్టాఫ్ నర్స్ దాడి చేసిన దృశ్యాలు ఎలాగోలా బయటకు వచ్చాయి. దీంతో ఆరోగ్య శాఖను చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కుర్రాళ్లు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటారని, అందుకే నర్సులు అలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగింది అనేది.. ఈ ఘటనపై బీహార్ ఆరోగ్య శాఖ స్పందిస్తేనే తెలుస్తుంది. हंटर वाली नर्स,सुई नही डंडे लगाती है। वीडियो छपरा का बताया जा रहा है दोनों लड़का अस्पताल में फैला कुव्यवस्था का वीडियो बना रहा था तभी इन दो नर्सो के हत्थे चढ़ गया।#Bihar #BiharNews #chhapra pic.twitter.com/ikrhZIviwC — Chandra Times (@chandratimes1) October 17, 2022 ఇదీ చదవండి: అబ్బా.. ఏం చావురా ఇది! -
పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): నర్సుపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు రాంనగర్‌కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. గత నెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన నారాయణగూడ పోలీసులు వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ లోగా అతడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం సోమవారం నిందితుడు కోటం సందీప్ భరద్వాజ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పేపర్లతో నిందితుడు, అతడి తండ్రి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. హిమాయత్‌నగర్‌లోని మ్యానికైండ్ ఆసుపత్రిలో బాధితురాలు నర్సుగా, సందీప్ భరద్వాజ్ వైద్యుడిగా చేసేవారు. నైట్‌షిఫ్ట్‌లో ఉన్న నర్సును పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో దాడి చేయడంతో ఆమె గత ఏడాదిలో రెండు సార్లు నారాయణగూడ పోలీసుల్ని ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: నైట్ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి) అప్పట్లో పోలీసు అధికారి అతడికి వార్నింగ్ ఇవ్వడంతో పోలీసుల ఎదుటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్య సమాజ్‌కు వెళ్లి వెనక్కి తీసుకొచ్చాడు. ఇటీవల మరోమారు పెళ్లి ప్రస్తావన తేవడంతో తన రాజకీయ పలుకుబడితో ఆమెను బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భరద్వాజ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేశారు. సుమారు 25 రోజుల పాటు నిందితుడి ఆచూకీ తెలియలేదు. పరారీలో ఉన్నట్లు పోలీసులు కాలయాపన చేశారు. అతడిని అరెస్టు చేయకుండా, ముందస్తు బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
నైట్ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి
హిమాయత్‌నగర్(హైదరాబాద్): ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై వైద్యుడి కన్ను పడింది. మాయ మాటలు చెప్పాడు, నీ జీతం, ఆస్తి, రంగుతో సంబంధం లేదన్నాడు. ఓకే అంటే పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ తేనె మాటలు చెప్పి నర్సును శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లిమాట ఎత్తిన నర్సును నోరు మూపించేందుకు పలు ప్రయత్నాలు చేసి, భౌతిక దాడికి సైతం దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ నారాయణగూడ పోలీస్ స్టేషన్ మెట్లిక్కిందో నర్సు. చదవండి: పాతిపెట్టిన మహిళా మృతదేహం మాయం.. అసలేం జరిగింది? పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్–1 వద్ద ఉన్న మ్యానికైండ్ ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. ఇదే ఆసుపత్రిలో రాంనగర్‌కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్ అనే యువకుడు వైద్యుడిగా చేస్తున్నాడు. నర్సును ప్రేమిస్తున్నానంటూ డ్యూటీలో ఉన్నప్పుడే వేధిస్తుండేవాడు. 2020 ఫిబ్రవరి నెలలో ఇద్దరూ ఓ నాలుగు రోజుల పాటు నైట్ డ్యూటీ చేశారు. ఆ సమయంలో ఒకరోజు తన చాంబర్‌కు పిలిచిన వైద్యుడు కోటం సందీప్ భరద్వాజ్ తనని బలవంతం చేశాడు. నర్సును పెళ్లి చేసుకుంటానన్నాడు. తక్కువ కులమైనా.. ఉద్యోగం తక్కువదైనా.. కలర్ లేకపోయినా.. ఆస్తి లేకపోయినా తనకేమీ పట్టింపులు లేవని మాయ మాటలు చెపి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో బ్లీడింగ్ అధికంగా అవ్వడంతో సమీపంలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేర్పించాడు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయిన నర్సును గాంధీనగర్‌లోని తన ఫ్లాట్‌కు తీసికెళ్లాడు. బ్లీడింగ్ సమయంలో కూడా నర్సుపై వైద్యుడు బలవంతంగా అత్యాచారం చేశాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్సు వారం తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లింది. ఇంటివద్ద ఉన్న నర్సుకు వైద్యుడు పదే పదే ఫోన్లు చేసి విసిగించేవాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి నగరానికి రప్పించాడు. గాందీనగర్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో ఎవరికీ తెలియకుండా నర్సును ఉంచాడు. ఇదే సమయంలో మూడు పర్యాయాలు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెండ్లి చేసుకోవాలని గట్టిగా అడగడంతో మీ కులం తక్కువ, నేను అడిగినంత కట్నం ఇవ్వలేవు, మా తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదని చెప్పి భౌతికంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మేల్ నర్సులకు పెరుగుతున్న డిమాండ్.. ఆ ఒక్కటి మినహా అన్ని విభాగాల్లోనూ..
సాక్షి, కరీంనగర్: ‘నర్స్’... ఈ పదం వినగానే ఆస్పత్రుల్లో తెల్లని దుస్తులు ధరించి, నెట్టిన టోపి పెట్టుకున్న సిస్టర్సే అందరికీ గుర్తుకొస్తారు. కానీ, నర్స్ అంటే సిస్టర్స్ మాత్రమే కాదు... బ్రదర్స్ కూడా ఉంటారని చాలా తక్కువ మందికి తెలుసు. స్త్రీలకే ప్రత్యేకమనిపించే నర్సింగ్ రంగంలో పురుషులు కూడా రాణిస్తున్నారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా నర్సింగ్ కళాశాల్లో ప్రభుత్వం పురుషులకు అడ్మిషన్లు కల్పిస్తోంది. దీంతో ఆస్పత్రుల్లో మేల్నర్సుల సేవలు విస్తరిస్తున్నాయి. మెటర్నిటీ మినహా అన్ని విభాగాల్లో బ్రదర్స్ సేవలందిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వీరిని నర్సింగ్ ఆఫీసర్స్ అని కూడా పిలుస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం బ్రదర్ అంటూ పిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విశేష సేవలందిస్తున్న నర్సింగ్ బ్రదర్స్‌పై సండే స్పెషల్..!! అన్ని ఆస్పత్రుల్లో మేల్ నర్సులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 500 వరకు ప్రయివేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో మూడు వేల మంది వరకు ఫిమేల్ నర్సులు పనిచేస్తుండగా.. 450మంది వరకు మేల్ నర్సులు ఉన్నారు. వీరు ఎమర్జెన్సీ విభాగంలో, అత్యవసర పేషెంట్ల వద్ద విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి డ్యూటీల్లో ఎక్కువగా బ్రదర్సే ఉంటారు. కరోనా సమయంలో ఐసోలేషన్ వార్డుల్లో ఫిమేల్ నర్సులతో పాటు మేల్నర్సులు తప్పనిసరి డ్యూటీలు చేయడం కనిపించింది. కరీంనగర్ జిల్లాలో 320మంది బ్రదర్స్ పనిచేస్తుండగా.. మేల్ నర్సింగ్ విద్యార్థులు 380 మంది చదువుతున్నారు. రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐదుగురు బ్రదర్స్ సేవలందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మరో 50మంది, జగిత్యాల జిల్లాలో 15మంది, సిరిసిల్లలో 25 మంది వరకు సేవలందిస్తున్నారు. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లలో సహాయకులుగా ఎక్కువశాతం మేల్ నర్సులనే వైద్యులు ఉపయోగిస్తుంటారు. ఇటీవల వీఐపీల కాన్వాయ్ల్లోనూ మేల్నర్సులకే ప్రాధాన్యం ఉంటోంది. నర్సింగ్ వృత్తికి విదేశాలలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డిమాండ్ కారణంగా పురుషులను నియమించుకోవడం మరింత కీలకంగా మారింది. దీంతో ఎక్కువమంది ఈ కోర్సు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మామయ్య సూచనతో మాది ములుగు జిల్లా యేసునగర్ గ్రామం. ఇంటర్ తరువాత నర్సింగ్ కోర్సు చేస్తే బాగుంటుందని మా మేనమామ సూచించాడు. తానూ పర్కాలలోని సివిల్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. జీఎన్ఎం కోర్సు 2021 వరకు చదివాను. జీఎన్ఎం కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూ కేంద్రంలో పనిచేస్తున్నా. నవజాత శిశువులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నెలరోజులపాటు నిలోఫర్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు. – లంకదాసరి నవీన్‌కుమార్, జీఎన్ఎం, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సివిల్స్ కొట్టాలనుకున్నా మాది వరంగల్. నాన్న సత్యనారాయణ పరకాలలో ఏఎస్సై. సివిల్స్ జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయ్యా. జాబ్స్ ప్రకటించకపోవడంతో నాన్న సూచనల మేరకు హైదరాబాద్‌లో 2013 బ్యాచ్‌లో నాలుగున్నరేళ్లు బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేశా. అక్కడే ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండున్నరేళ్లు స్టాఫ్‌నర్స్‌గా చేశా. ప్రభుత్వం నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడంతో స్టాఫ్‌నర్స్‌గా 2021లో ఉద్యోగం సాధించా. సిరిసిల్లలోని పీహెచ్సీలో తొలిపోస్టింగ్. బదిలీపై వచ్చి ప్రస్తుతం గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తున్నా. – టి. సతీశ్‌కుమార్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ఫ్రెండ్ ప్రోత్సాహంతో మాది జమ్మికుంట మండలం పోతిరెడ్డిపల్లి. ఇంటర్ తర్వాత నా ఫ్రెండ్ రాజు ప్రోత్సాహంతో నర్సింగ్ వైపు వచ్చా. ఇద్దరం కలిసి గుంటూరులోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాం. 2010 బ్యాచ్‌లో కోర్సు పూర్తిచేశాం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులు, హనుమకొండలోని రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 10 ఏళ్లు పనిచేశా. 2018లో ప్రభుత్వ స్టాఫ్ నర్సింగ్ పోస్టుకు ఎంపికయ్యా. ప్రభుత్వం 2021లో పోస్టింగ్ ఇచ్చింది. తొలుత ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆరు నెలలు పనిచేశా. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బదిలీపై వచ్చాను. – తాళ్లపల్లి కిరణ్, స్టాఫ్‌నర్స్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సంతోషంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో మొదటి బ్యాచ్‌లో మేల్ నర్సుగా వచ్చాను. 12 ఏళ్లుగా రోగులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కోవిడ్ కష్టకాలంలో పూర్తిస్థాయి ఐసోలేషన్‌లో సేవలు అందించాను. ఆపరేషన్ థియేటర్లో, క్యాజువాలిటీల్లో ఎక్కువ సర్వీసు చేశాను. ఇప్పుడిప్పుడే మేల్నర్సు ప్రాధాన్యత పెరుగుతోంది. – ఎండీ ఖలీద్, మేల్ నర్సు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కరీంనగర్ నర్సింగ్పై గౌరవంతో మాది ఖమ్మం జిల్లా. పదేళ్లుగా నర్సింగ్ వృత్తిలో ఉన్నాను. నా భార్య కూడా నర్సు. నర్సింగ్ వృత్తిలో రాణించాలనే బలమైన కోరికతోనే హైదరాబాద్‌లో నర్సింగ్ పూర్తిచేశాను. థియేటర్ అసిస్టెంట్‌గా పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నాను. రోగికి నయమై వెళ్తుంటే ఆనందంగా ఉంటుంది. వృత్తి మీద గౌరవంతో సంతోషంగా చేస్తున్నా. – పి.నాగరాజు, మేల్నర్సు, మెడికవర్ ఆసుపత్రి అత్యవసర సేవలు మేల్ నర్సింగ్ అవసరం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో అండగా ఉంటాం. హార్ట్ ఎటాక్ వచ్చిన వారు గానీ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స మేమే చేస్తుంటాం. నైట్ డ్యూటీలు, పేషెంట్ కేర్ తీసుకుంటాం. కానీ కోర్సు చేసేందుకు సీట్లు తక్కువగా ఉన్నాయి. – సురేందర్, జగిత్యాల -
బేబీ బూమ్.. 'వాట్ ఏ కో ఇన్సిడెన్స్'
ఇంట్లోకి ఒక్క పసిబిడ్డ వస్తేనే సందడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ హాస్పిటల్లో 14 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. వారంతా ఒకే నెలలో పిల్లల్ని కననున్నారు. కాన్సాస్ సిటీలోని సెయింట్ ల్యూక్స్ ఈస్ట్ హాస్పిటల్ ఈ విషయాన్ని తమ ఫేస్బుక్ పేజ్‌లో షేర్ చేసింది. అది చూసినవారంతా ‘వాట్ ఏ కో ఇన్సిడెన్స్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది మొదటిదేం కాదు. అచ్చు ఇలాంటి సంఘటనే 2019లో యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్ మయినే మెడికల్ సెంటర్లో జరిగింది. అక్కడ 9 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. ఆగస్టులోనే అందరూ పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలతో కలిసి 9 మంది తల్లులు దిగిన ఫొటో ‘బేబీబూమ్’ అప్పట్లో వైరల్ అయ్యింది. మళ్లీ.. ఇప్పుడు మిస్సోరిలోని ల్యూక్ హాస్పిటల్ వంతయ్యింది. 14 మందిలో ఒకరు జూన్ 3న బిడ్డకు జన్మనివ్వగా.. 13 మంది డెలివరీ మంత్ డిసెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి డెలివరీలో తల్లీబిడ్డల సంతోషం కోసం చూసినట్టే.. ఈ 13 మంది పిల్లలకోసం ఎదురుచూస్తున్నామని హాస్పిటల్ వర్గాలు ఫేస్బుక్లో తమ ఆనందాన్ని పంచుకున్నాయి. చదవండి: (భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం) -
అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు. అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్ చదువుతోన్న సమయంలో ‘మిస్ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది. అందరూ తనలా చదవాలని... అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది. ఖబాలే దుబా ఫౌండేషన్.. మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది. ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. బెస్ట్ నర్స్‌గా.. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ సంస్థ గ్లోబల్ బెస్ట్ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్ నర్సింగ్ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది. -
బిల్డింగ్‌కు వేలాడుతూ నర్సు డెడ్‌బాడీ.. అత్యాచారం చేసి ఆ తర్వాత..?
Nurse Suicide.. ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్న నర్సు.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతున్న మహిళ మృతదేహం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లోని న్యూ జీవన్ హాస్పిటల్లో ఓ మహిళా నర్సు శుక్రవారమే విధుల్లో చేరింది. తర్వాత రోజు శనివారమే నర్సింగ్ హోమ్ గోడకు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆమె మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్న తర్వాత వారు షాకింగ్ విషయాలు చెప్పారు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఇలా హత్య చేశారని ఆరోపించారు. నర్సింగ్‌హోమ్ నిర్వాహకుడితో సహా మరో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఉన్నావ్ అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా..? లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. Very Disturbing Visuals : In #UttarPradesh's #Unnao, a 19-year-old girl was found hanging from a hospital terrace. She was employed as a nurse in the newly inaugurated hospital in the #Bangarmau area. A case under IPC sections of murder and gangrape has been registered. pic.twitter.com/JQ1NkNVAw0 — Hate Detector 🔍 (@HateDetectors) April 30, 2022 ఇది కూడా చదవండి: విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని.. -
ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది.. కానీ
సాక్షి, గుడిహత్నూర్(ములుగు): తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ ఆమెను ఉన్నత చదువు చదివించారు. డయాలసిస్ ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేసింది. ఇటీవల ఆర్మీలో నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకుంది. పరీక్ష కోసం కష్టపడి చదివింది. రెండు నెలల క్రితం పరీక్ష రాసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇంకా ఫలితాలు వెలువడలేదు. ఫలితాలు వస్తే తనకు జాబ్ వస్తుందో రాదో అని మనస్తాపం చెందింది. (చదవండి: వారసుడొచ్చాడని ఆనందపడ్డారు.. కానీ వారం రోజుల తర్వాత.. ) ఒత్తిడి భరించలేక సోమవారం ఉరేసుకుంది. ఈ ఘటన గుడిహత్నూర్ మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్ కాలనీకి జరిగింది. ఏఎస్సై రెహమాన్‌ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ముస్కాన్(21) తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముస్కాన్‌కు చదువుపై ఆసక్తి ఉండడంతో ఇంటర్ పూర్తయిన వెంటనే డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు చదివించారు. ఇటీవల ఆర్మీలో నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకుని పరీక్ష కూడా రాసింది. ఫలితాలు రావడం ఆలస్యం అవుతుండడంతో కొన్ని రోజులుగా దిగాలుగా ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. బంధువులు వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే తండ్రి షేక్ హరూన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హరూన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
రోగికి డ్యాన్స్ స్టెప్లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!: వైరల్ వీడియో!
రోగులు తమ అనారోగ్యాన్ని మరిచిపోయేలా డాకర్లు కౌన్సిలింగ్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. పేషంట్ మరీ నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్లకు ప్రత్యేకంగా మానసికనిపుణుల పరివేక్షణలో ఉంచి చికిత్స అందిచడం వంటివి చేస్తారు. కానీ వాటన్నింటికి భిన్నంగా పక్షవాతం వచ్చిన రోగిని ఉత్సాహపరిచేందుకు నర్సు డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే... ఆ వీడియోలో నర్సు పక్షవాత రోగికి వినూత్న పద్ధతిలో కొన్ని ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసేలా సహాయం చేసింది. నర్సు అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపుతున్నప్పుడు రోగి మంచం మీద పడుకుని ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా ప్లే అవుతుంటుంది. అయితే పేషంట్ నర్సు స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నించాడు. వీడియో చివర్లో ఆమె రోగికి తన చేతులతో చేతి కదలిక వ్యాయామాలు చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఆ పేషంట్ ముఖంలో నవ్వు చిగురించడమే కాకుండా తను కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే చచ్చుబడిన అవయవాలను కదిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఫిజియోథెరపీ సెషన్లో రోగికి సహాయం చేస్తున్న నర్సును ఆయన ప్రశంసించారు. नर्स ने बड़ी चतुराई से डांस करते हुए लकवाग्रस्त मरीज़ में उमंग और उत्साह भरकर फिजियोथेरेपी एक्सरसाइज करवा दी. मरीज़ जब ठीक हो जाते हैं, तो सभी डॉक्टर्स को धन्यवाद देते हैं. लेकिन नर्सेस और अन्य मेडिकल स्टाफ अपने प्रेम से जो इलाज करते हैं, उसके लिए 'धन्यवाद' बेहद छोटा शब्द है... pic.twitter.com/dLvXZVgfgh — Dipanshu Kabra (@ipskabra) January 24, 2022 -
నర్సు ఆత్మహత్య.. ఆమె చాటింగ్ పరిశీలిస్తే..!
హైదరాబాద్: ప్రేమ విఫ లం కావడంతో ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడకు చెందిన రజని(27) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ అక్క అనిత, తమ్ముడు అబెంజర్తో కలిసి కొండాపూర్‌లో నివాసం ఉంటోంది. కిమ్స్ ఆస్పత్రిలో పని చేసే సోదరి అనిత రాత్రి 9 గంటలకు రాగా లోపలి తలుపు గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి గడియ తీసి చూడగా చెల్లెలు రజని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పక్కింటి వారి సహాయంతో కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆమె చాటింగ్‌ను పరిశీలించిన పోలీసులు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. సోదరుడు సతి అబెంజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో దారుణం.. డ్యూటీ డాక్టర్ లేడని నర్సులే..
సాక్షి, హైదరాబాద్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి నర్స్‌లు శస్త్ర చికిత్స చేయడంతో శిశువు మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ డివిజన్ అపురూపా కాలనీకి చెందిన జగదీష్, భార్గవిలు భార్యాభర్తలు. నిండు గర్భిణి అయిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్‌లోని లయన్స్‌క్లబ్ ఆస్పత్రిలో చేరింది. రాత్రి 7 గంటల సమయంలో పురి టి నొప్పులు తీవ్రమయ్యాయి. అయితే ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు జ్యోత్సా్న, రాణిలు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయగా శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ప్రస్తుతం భార్గవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి భర్త జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!
ఇంతవరకు మనం చాలారకాలు దోపిడీల గురించి విన్నాం. అంతేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా రోగుల పై పెద్ద మొత్తంలో బిల్లు వేసి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడొక నర్సు మాత్రం సరికొత్త విధానంలో రోగిని దోచుకునేందుకు యత్నించి జైలుపాలైంది. (చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..) అసలు విషయలోకెళ్లితే...పోలీసుల కథనం ప్రకారం...పుణేకి చెందిన ఒక డయాలసిస్ రోగి చికిత్స నిమిత్తం డయాలసిస్ సెంటర్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆ డయాలసిస్ సెంటర్లోని నర్సుతో పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత వాళ్లిద్దరూ చాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఓ రోజు ఆమె నువ్వు గనుక రూ. 20 లక్షలు ఇవ్వకపోతే మన చాటింగ్ మెసేజ్‌లను పబ్లిక్‌లో పెట్టడమే కాక ఒక మహిళను మోసం చేశావంటూ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తాను అని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో సదరు వ్యక్తి తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల ముందస్తు పథకం ప్రకారం పోలీసులు డబ్బులిస్తానని నర్సుకి చెప్పమని ఫిర్యాదు దారుడికే చెప్పారు. అలా ఆ నర్సు డబ్బులు వసూలు చేసేందుకు పుణేలోని రహత్నీలోని శివర్ చౌక్ వద్దకు రాగా వకాడ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...
కొన్ని ప్రమాదాలు చాలా భయానకంగా ఉంటాయి. కొంతమంది అలాంటి అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో సైతం వారు ఏమాత్రం తమ ధైర్యాన్ని కోల్పోకుండా ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలానే యూఎస్‌లోని ఒక మహిళ కారు యాక్సిండెట్ అయ్యి ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో జీవచ్ఛవంలా పడి ఉన్నప్పటికీ ఏమాత్రం తన స్థైర్యాన్ని కోల్పోకుండా అత్యంత తెగువను ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: 200 ఏళ్ల చర్రిత.. పిండి, కోడి గుడ్లతోనే ఎందుకంటే..) అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన 65 ఏళ్ల లిన్నెల్ మెక్‌ఫార్లాండ్ రిటైర్డ్ నర్సు. ఆమె ఒక రోజు తన బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా వాషింగ్టన్ పాస్ సమీపంలోని యాక్సిడెంట్ అయ్యింది. అయితే ఒక పక్క వర్షం కారణంగా సరిగా కనిపించడకపోవడంతో మంచు మీద టైర్లు జారిపోయి సుమారు 100 అడుగుల గుంటలో కారు తలకిందులుగా పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు గాయాలైయ్యాయి.అంతేకాదు ఆమె ఒంటరిగా గడ్డకట్టే మంచు ఉష్టోగ్రతోలో ఐదురోజులగా కారులోనే పడి ఉంటుంది. ఈ మేరకు ఆమె నర్సు కావడంతో ఆమె తన గాయాలకు ప్రథమ చికిత్స చేసుకోవడమే కాక వర్షపు నీటితో దాహాన్ని తీర్చకుంటూ తన శరీరం డీహైడేట్ కాకుండా చూసుకుంది. పైగా ఎవరైన తనను రక్షించికపోదురా అనుకుంటూ కారు వెనుక సీటులో ఉండి ఆశగా చూడసాగింది. అయితే మరోవైపు మెక్‌ఫార్లాండ్ కూతురు వాళ్ల అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోగా రాష్ట్ర రవాణా శాఖ సిబ్బంది ఆ కారు యాక్సిడెంట్‌ని గుర్తించి రక్షించేందుకు యత్నించారు. హైపోథర్మియా సంకేతాలతో ఆమె స్పృహలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెను శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట తెగవైరల్ అవుతుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) -
నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..
సాక్షి, హైదరాబాద్: నర్సుని రూమ్‌లో బంధించి అత్యాచారం చేసిన యువకుడ్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బాధితురాలికి 2012 లో వివాహం జరిగింది. ఆమెకు 6 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొన్ని కారణాలవల్ల భర్తకు విడాకులు ఇచ్చి.. పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో హిల్ మై ఫ్యామిలీ హోమ్‌కేర్ సర్వీస్‌లో నర్సుగా పనిచేస్తోంది. సంస్థ తరపున రోగుల కేరింగ్ కోసం వెళ్తుంటుంది. సంస్థ నిర్వాహకుడు నాగోల్‌కు చెందిన మల్లెల సాయి (28) నవంబర్ 7వ తేదీ సాయంత్రం బాధితురాలికి ఫోన్ చేసి విజయవాడలో ఓ పేషెంట్ కేర్‌కు హాజరుకావడానికి అత్యవసరంగా కార్యాలయానికి రావాలని ఆదేశించాడు. బాధితురాలు ఆఫీస్‌కు వెల్లగానే మేడమీద ఉన్న తన గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి బలవంతంగా అత్యాచారం చేశాడు. చదవండి: (హైదరాబాద్‌లో దారుణం.. భార్య తలనరికి పోలీస్ స్టేషన్‌కు..) జరిగిన విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించి అదే రోజు ఎంజీబీఎస్ బస్‌స్టాండ్‌లో విజయవాడ బస్సు ఎక్కించాడు. గత కొద్దిరోజులుగా బాధితురాలు రక్తస్రావంతో బాధపడుతుండడంతో.. నగరానికి చేరుకుని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మల్లెల సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (భార్యపై అనుమానం.. గూడ్స్ షెడ్లో దారుణహత్య) -
చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం..
చనిపోయేముందు వ్యక్తుల ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందట.. అంతేకాదు ఓ మాటను పదేపదే ఉచ్చరిస్తారట కూడా. ఇంకా అనేక విషయాల గురించి అమెరికాలోని ఓ నర్సు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. జూలీకి దాదాపుగా 14 యేళ్లు నర్సుగా పనిచేసిన అనుభవం ఉంది. అందులో 9 యేళ్లు ఐసీయూ నర్సుగా పనిచేసింది. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలలో కూడా 5 యేళ్లు నర్సుగా పనిచేసింది. అమె తన సర్వీసులో అనేక మంది మరణించడం చూసింది. ఐతే చనిపోయేముందు అనేక మంది ప్రవర్తన దాదాపుగా ఒకేలా ఉంటుందని జూలీ చెబుతోంది. ఇంకాసేపట్లో మరణించే అవకాశం ఉన్న వ్యక్తుల్లో అనేక మంది ఒకే విధమైన విషయం చెప్పడం గమనించిందట! జూలీ మరణించేముందు శరీర రంగు మారడం, జ్వరం, తమకి అత్యంత ప్రియమైన వారి పేరును పదే పదే తలచుకోవడం చేస్తారట. ఎక్కువ మంది ‘ఐ లవ్ యూ’ అని అనడమో, గతంలో మరణించిన తల్లిదండ్రులకు ఫోన్ చేయడం వంటి పనులు చేస్తారట. అంతేకాకుండా రోగుల్లో చాలా మంది చనిపోయే ముందు నీడలను చూడటం ప్రారంభిస్తారని పేర్కొంది. తమకి అత్యంత ప్రియమైన (అప్పటికే మరణించిన) వారి నీడలను చూడటం, ఇంటికి వస్తున్నానని చెప్పడం చేస్తారట. చాలా మందికి మరణం గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు తనకు తెలుసని టిక్‌టాక్ ద్వారా ఓ వీడియోను ఆరు నెలల క్రితం పోస్ట్ చేసింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. పుట్టిన వారందరూ ఏదో ఓ రోజు మరణించక తప్పదు. అయినా మరణం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుందనే విషయాలపై కూడా ఆసక్తి చూపడం నిజంగా ఓ వింతే! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. -
నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే..
సాక్షి,బంజారాహిల్స్: నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించడంతో పాటు యువతి పరువుకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఫిలింనగర్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఆమె పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేయడంతో పాటు ఫొటోను పెట్టి అసభ్యకరమైన సందేశాలు పెడుతున్నట్లు గుర్తించిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: విజిలెన్స్ వలలో రెవెన్యూ అధికారి -
Lara Wies: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్
కొలరాడోకు చెందిన లారా వీస్ బౌల్డర్‌లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఒక నర్సు. కరోనా విజృంభించడంతో ఉద్యోగ విరమణ చేసిన వారిని సైతం విధుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లారాను కూడా కోవిడ్–19 వ్యాక్సిన్లు వేయడంలో సహాయం చేయడానికి మళ్లీ విధులకు ఆహ్వనించారు. దీంతో గత ఏడు నెలలుగా లారా తన సహోద్యోగులతో కలిసి వేలమందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భంగా అందరిని గౌరవించేలా ఆమె ఏదైనా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేశాక చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్ తయారు చేశారు. అలా తయారు చేసిన వ్యాక్సిన్ బాటిళ్ల షాండ్లియర్‌ను ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’ పేరున హెల్త్ కమ్యూనిటీలో షేర్ చేసింది. అది చూసిన హెల్త్ కమ్యూనిటీ వారు ఎంతో సంతోషంతో ‘‘ఈ ఫోటోను మా ప్రతిభావంతులైన పబ్లిక్ హెల్త్ నర్సుల కోసం మా సిబ్బందిలో ఒకరైన లారావీస్, ఈ అందమైన కళాకృతిని సృష్టించారు. ఆమెకు మా అందరి తరపున కృతజ్ఞతలు’’ అంటూ బౌల్డర్ కౌంటీ పబ్లిక్ హెల్త్ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దాంతో ఈ షాండ్లియర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యాక్సిన్లు వేశాక వేల సంఖ్యలో ఖాళీ బాటిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని ఏం చేస్తారో ఇప్పటిదాకా సరైన ప్రణాళిక లేకపోవడంతో ఆ బాటిల్స్‌తో ఏదైనా చేయాలనుకుంది. బాటిల్స్‌ను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న రంధ్రాలు చేసి క్రిస్టల్స్ అతికించి అందమైన షాండ్లియర్‌గా మార్చేసింది. ఈ షాండ్లియర్ కోసం దాదాపు 300ల మోడ్రనా వ్యాక్సీన్ సీసాలు, అడుగు భాగంలో అందంగా అలంకరించేందుకు పది జాన్సన్ అండ్ జాన్సన్ బాటిల్స్ వాడింది. ఈ షాండ్లియర్‌ను చూసిన వారంతా ఆమె ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే గౌరవ మర్యాదలను, వ్యాక్సిన్ బాటిళ్లు వృథా కాకుండా కళాఖండాన్ని రూపొందించడాన్నీ అభినందిస్తున్నారు. ‘‘కోవిడ్ విజృంభణ నుంచి ఆరోగ్య కార్యకర్తలు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యం అందించడం, టీకాలు వేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ దీర్ఘకాల మహా యజ్ఞంలో అలుపూ సలుపూ లేకుండా కృషి చేస్తోన్న వారిని గౌరవించడంతోపాటు వినూత్న రీతిలో ప్రశంసించాలనుకున్నాను. ఈ క్రమంలోనే ఒక కళాకృతి చేయాలనుకున్నాను. కరోనా గతేడాది అంతా చీకటిలో గడిచింది. అందుకే వెలుగులోకి తీసుకు వచ్చే ఐడియాతో... టీకా సీసాలు వృథా కాకుండా వాటితో షాండ్లియర్ రూపొందించాను. బంధాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ఎంతో కోల్పోయినప్పటికీ భవిష్యత్తును కాంతిమంతంగా మార్చేందుకు ‘లైట్ ఆఫ్ అప్రిసియేషన్’గా దీని రూపొందించాను’’ అని లారా చెప్పింది. చదవండి: Maitri Patel: ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్.. ఇంకా -
నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక..
సాక్షి, చెన్నై: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ నర్సు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కరోనా టీకా వేయడంతో ఓ వృద్ధురాలు స్పృహ తప్పింది. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నాడం ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి (55) సోమవారం వచ్చారు. తొలుత ఆమెకు నర్సు వ్యాక్సిన్ వేశారు. వెనువెంటనే సహచర నర్సుతో మాట్లాడుతూ మరో టీకా కూడా వేశారు. ఒకే సమయంలో తనకు రెండు సార్లు టీకా ఎందుకు వేస్తున్నారని లక్ష్మి ప్రశ్నించినా ఆ నర్సు ఖాతరు చేయలేదు. దీంతో లక్ష్మి స్పహ తప్పింది. ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. ఓ టీకా మాత్రమే వేసినట్టుగా నర్సు వాదించినా, బాధితురాలి చేతి నుంచి రెండు చోట్ల రక్తం వస్తుండడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మిని ఉంచారు. ఈఘటనపై ఆరోగ్య శాఖ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. చదవండి: Tamilnadu: తల్లికి రెండో పెళ్లి చేసిన కుమారుడు -
బుల్లెట్టు బండి పాటతో పక్షవాతం వచ్చిన రోగికి ట్రీట్మెంట్
-
పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్టు బండి పాటతో చికిత్స
Paralysis Patient Dance on Bullettu Bandi Song: ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటలు, దానికి జనాలు వేస్తున్న స్టెప్పులే కనిపిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాటకు తెగ కనెక్ట్ అయ్యారు. ప్రతీ ఫంక్షన్లోనూ ఈ పాటే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తున్న ఈ సాంగ్ ఇప్పుడు ఓ ప్రత్యేక కారణంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్పత్రిలో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు నర్సు విన్నూత్న ఆలోచన చేసింది. స్పర్శ కోల్పోయిన అతడి చేతికి సంగీతంతో చలనం వచ్చేలా చేయాలనుకుంది. ఇందుకోసం బుల్లెట్టు బండి పాట పెట్టి తను డ్యాన్స్ చేస్తూ అతడిని కూడా చేయమని ప్రోత్సహించింది. ఆ రోగి కూడా నర్సును అనుకరిస్తూ సంతోషంగా చేయి ఊపసాగాడు. ఈ క్రమంలో చలనం లేకుండా పడి ఉన్న ఎడమ చేతిని పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోగికి పాటతో ట్రీట్మెంట్ అందించిన నర్సును నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రోగి ముఖంలో చిరునవ్వును తీసుకొచ్చినందుకు ఆమెను అభినందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. How a nurse uses the famous #bulletbandi song to make a paralysis patient move hand!!! (WhatsApp forward) pic.twitter.com/VlhiSzjJgZ — P Pavan (@PavanJourno) September 3, 2021 -
వైరల్: రాహుల్ గాంధీ నా కొడుకు.. నర్సు భావోద్వేగం!
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో రెండు రోజులు(సోమ, మంగళవారం) పర్యటించిన విషయం తెలసిందే. కేరళ పర్యటనలో భాగంగా గాంధీపార్కెలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన బోధనలను, జీవన విధానాన్ని స్మరించారు. అనంతరం కోజిక్కోడ్‌లో రాహుల్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్(సిఎల్ఎటి)లో ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులతో కలసి భోజనం చేశారు. నియోజవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం వయనాడ్‌లో నర్సు రాజమ్మ వవతిల్ను రాహుల్ కలిశారు. రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హస్పిటల్లో నర్సుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 1970 జూన్ 19 రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో రాజమ్మనే అక్కడ నర్సుగా పనిచేస్తున్నారు. మొదటగా రాహుల్ తన చేతుల్లోకి తీసుకుంది రాజమ్మనే. తాజాగా రాహుల్ వయనాడ్ వచ్చారని తెలిసి ఆయన్ను కలిసిందేకు వచ్చారు. రాహుల్ కారులో కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చి రాజమ్మ పలకరించారు. రాహుల్‌ను చూసిన వెంటనే అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించారు. అలాగే ఓ స్వీట్ బాక్స్‌ను బహుకరించారు. రాజమ్మ తన కూడుకును రాహుల్ గాంధీకి పరిచయం చేస్తూ.. ఇతను నా కొడుకులాంటి వాడు. నా కళ్ల ముందే పుట్టాడు. మీరందరూ తనను చూడకముందే నేను చూశాను అంటూ సంబరపడ్డారు.తల్లి సోనియా గాంధీని కుశల ప్రశ్నలు అడిగినట్లు చెప్పమని అన్నారు. ‘నేను మా ఇంటి నుంచి మీకు ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీకు అంత సమయం లేదు, నాకు అర్థమైంది. ఒకవేళ ఇబ్బంది పెడితే క్షమించాలి’ అని అన్నారు. దీంతో వెంటనే అలాంటిదేం లేదంటూ ఆమెను అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. దీనికి సంబంధిన వీడియోను కేరళ కాంగ్రెస్ ట్విటర్లో షేర్ చేయడంతో నర్సను కలిసి రాహుల్ మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The wholesome love and affection from Rajamma Amma who was a nurse at Delhi’s holy family hospital where Shri @RahulGandhi was born. pic.twitter.com/fMCDNIsUio — Congress Kerala (@INCKerala) August 17, 2021 -
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా; విలువైన కానుకలు పంపిస్తున్నా
బనశంకరి: నిత్యజీవితంలో డిజిటల్ సాంకేతికత పాత్ర పెరిగేకొద్దీ సైబర్ మోసగాళ్ల పని సులువవుతోంది. అమాయకులను ఎంచుకుని లక్షలాది రూపాయలు దోచుకోవడం సిలికాన్ సిటీలో పరిపాటైంది. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ నేరాల బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నర్సుకు రూ.2 లక్షల నష్టం మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఆగంతకుడు, యువతికి రూ.2.07 లక్షలు టోపీ వేశాడు. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 30 ఏళ్లు యువతి బెంగాలీ షాదీ డాట్‌కామ్‌లో ఖాతా తెరిచింది. ఓ వ్యక్తి పరిచయమై విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని, మీకు ఢిల్లీకి ఖరీదైన కానుకలు పంపించానని చెప్పాడు. కస్టమ్స్ ఫీజుల కింద ఆమె నుంచి రూ.2.07 లక్షలు ఆన్లైన్లో లాగేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలు దక్షిణ విభాగ సైబర్‌క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేవైసీ అని రూ.27 లక్షలు స్వాహా ఓ వృద్దుడు సిమ్‌కార్డు కేవైసీ అనివచ్చిన కాల్‌ను నమ్మి రూ.27 లక్షలు పోగొట్టుకున్నాడు. బాణసవాడిలోని 80 ఏళ్ల రిటైర్డు ఉద్యోగికి ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ మొబైల్ సిమ్‌కార్డు కేవైసీ చేసుకోవాలని, లేకపోతే బ్లాక్ అవుతుందని తెలిపాడు. నిజమేననుకున్న వృద్ధుడు అతడు అడిగిన డెబిట్‌కార్డు సమాచారం ఇవ్వగా, బ్యాంకు ఖాతాలో నుంచి రూ.27 లక్షల నగదు కాజేశాడు. బాధితుడు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రుణం పేరుతో రూ.5.17 లక్షలు ఓ వ్యాపారికి ఫోన్ చేసిన మోసగాడు ముద్రా రుణ విభాగం నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. అతన్ని నమ్మిన వ్యాపారిని రుణ మంజూరు పేరుతో దశలవారీగా రూ.5.17 లక్షలు తమ అకౌంట్లు జమచేసుకున్నారు. రుణం మంజూరు కాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నగదు రెట్టింపు అని రూ.7.30 లక్షలు కంపెనీలో పెట్టుబడి పెడితే నిర్ణీత అవధిలోగా రెట్టింపు ఇస్తామని ఆశచూపించిన వంచకులు రూ.7.30 లక్షలు కైంకర్యం చేశారు. దేవనహళ్లి కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి అల్టా ఎంపైర్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధినని ఫోన్ వచ్చింది. తమ కంపెనీలు పెట్టుబడి పెడితే త్వరలోనే రెట్టింపు చేసి ఇస్తామని తెలిపారు. నిజమేననుకుని అతడు రూ.1.80 లక్షలు, స్నేహితుల ద్వారా రూ.5.40 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. తరువాత ఫోన్ కంపెనీ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించారు. -
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
అలకు ఎదురు‘గీత’
నర్సు గీత గురించి వింటే ఒకటే అనిపిస్తుంది. రిటైర్మెంట్ అనేది ఎవరో ఇచ్చేస్తే పూలదండతో పాటు ఇంటికి తెచ్చేసుకునేది కాదని. గీత వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. సర్వీస్ రూల్స్ ఆమెను రిటైర్ చేశాయి తప్పితే, సర్వీస్ చేయాలనే ఆమె తపనను ‘రిటైర్మెంట్ మోడ్’ లోకి నెట్టేయలేకపోయాయి. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో గీత చిన్నా చితక సేవల్ని అందించడం కాదు, లోకల్ యూత్ ని కలుపుకుని ఆపదలో ఉన్నవారి కోసం ఏకంగా పరుగులే పెడుతోంది. మైసూర్ లో ఇప్పుడు ‘అల’కు ఎదురీదుతున్న గీత.. ఆమె! మైసూరుకు, చామరాజనగర్‌కు మధ్య పెద్ద దూరం ఉండదు. అరవై కి.మీ. దూరం. లేదా గంటన్నర ప్రయాణం. అయితే ఈ సెకండ్ వేవ్‌లో అది క్షణాలతో సహా లెక్కించవలసిన అత్యవసర దూరం అయింది. చామరాజనగర్ జిల్లాలోని కొల్లేగల్లు, హనూర్ తాలూకాల గ్రామాల్లో ఎంతోమంది కోవిడ్ బాధితులు మైసూర్ నుంచి వచ్చే ఆక్సిజన్ సిలెండర్ల కోసం, వైద్యసేవల కోసం ఎదురు చూస్తుండటం వల్ల ఇటీవల ఏర్పడిన అత్యవసర స్థితి. ఈ స్థితిలో గీత అనే రిటైర్డ్ నర్సు తన విశ్రాంత జీవితానికి స్వస్తి చెప్పి, విధులకు పునరంకితం అయిన విధంగా లేచి, గత రెండు నెలలుగా బాధితులకు అవసరమైన సిలెండర్లను, వైద్యసేవలను తనే స్వయంగా అందించి వస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ‘భయపడాల్సిందేమీ లేదు’ అని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గీతకు తెలిసిన వాళ్లిద్దరు ఇటీవల ఆక్సిజన్ అందుబాటులో లేక మరణించడం ఆమెను కదలించింది. ఆ కదలికే ఆమెను ఈ మార్గంలోకి రప్పించింది. ‘రిటైర్ అయి ఇంట్లో ఉంటే మాత్రం! నేనేమీ చేయలేనా..’ అని అనుకుంటున్న సమయంలో ‘స్వామీ వివేకానంద యూత్ మూవ్మెంట్’ (ఎస్వీవైఎం) గురించి ఆమెకు తెలిసింది. ఆ టీమ్ ఆక్సిజన్ అవసరం అయిన పేషెంట్ల వివరాలు తెలుసుకుని వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను సమకూర్చుతోంది. వెళ్లి వెంటనే వారిని కలిశారు గీత. నర్సుగా ఎమర్జెన్సీ సేవల్ని అందించడంలో తనకున్న అనుభవం గురించి వారికి చెప్పారు. ‘‘నేనూ మీతో కలిసి పని చేస్తాను’’ అన్నారు. ‘‘మీరు మాతో కలిసి పని చేయడం కాదు, మేమే మీతో కలిసి పనిచేస్తాం మేడమ్’’ అన్నారు వారు! అన్నమాట ప్రకారమే పేషెంట్ల సమాచారాన్ని వారు తెచ్చేవారు. వారికి ఏర్పరచవలసిన సదుపాయాలేమిటో గీత సూచించేవారు. మందులు, ఆహారం ఇవ్వడం వరకు మాత్రమే గీత అండ్ టీమ్ పరిమితం కాలేదు. గీత స్వయంగా పేషెంట్లను కలుసుకుని వారికి సేవలు చేసేవారు. ఆమె సేవాభావాన్ని, నిర్వహణ బలాన్ని గమనించిన ఎస్వీవైఎం మైసూరులోని ఆమె ఇంట్లోనే ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల బ్యాంక్‌ను నెలకొల్పింది! ఇంటి నుంచి గీతే ఇప్పుడు వాటిని బట్వాడా చేస్తున్నారు. ‘‘కరోనా పేషెంట్లకు అంత సమీపంగా వెళ్లి సేవ చేస్తున్నారు.. మీకేమీ భయంగా ఉండదా?’’ అని ఆమెను అడిగితే.. ‘‘అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాను’’ అని నవ్వుతూ చెప్తారు. గీత ఇంట్లో ఆమెతో పాటు 96 ఏళ్ల ఆమె తల్లి కూడా ఉంటారు. ఆమెను సంరక్షించుకుంటూనే, ఎంతోమందికి తల్లిలా తను సేవలు అందిస్తున్నారు. -
ఫోన్ మాట్లాడుతూ.. రెండు డోసులు?
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఓ యువతికి నర్సు ఫోన్లో మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్‌లోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న (21) ఈ నెల 17న పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌కు టీకా తీసుకునేందుకు వెళ్లింది. ఆమెకు వ్యాక్సిన్ వేస్తుండగానే నర్సుకు ఫోన్ రావడంతో ఆమె ఫోన్లో మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నను అక్కడే కూర్చోమని చెప్పింది. ఫోన్ మాట్లాడిన అనంతరం తిరిగొచ్చిన నర్సు మరోసారి వ్యాక్సిన్ ఇచ్చింది. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న అక్కడున్న వారికి తెలుపడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచి వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలోనే నర్సుకు ఫోన్ వచ్చిందని, ఫోన్ మాట్లాడిన అనంతరం రెండో డోసు వేసిందని, ఆందోళన చేయడంతోనే తనను ఏరియా ఆస్పత్రికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. కాగా, లక్ష్మీ ప్రసన్నకు రెండు డోసులు వేశామన్నది అవాస్తవమని, యువతి ఆందోళన చేయడం వల్లనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించామని వైద్యాధికారులు అంటున్నారు. -
ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి డబుల్ డోస్ వ్యాక్సిన్
సాక్షి, రంగారెడ్డి: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అదే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం రేపుతోంది. ఓ నర్స్ నిర్లక్ష్యంతో ఓ యువతికి ఓకేసారి డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ఎస్లో చోటు చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న(21) అనే ఓ యువతి కరోనా టీకా కోసం జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లింది. దీంతో ఆ యువతికి నర్స్ పద్మ.. ఫోన్ మాట్లాడుకుంటూ రెండు డోసుల కరోనా టీకా ఇచ్చింది. వ్యాక్సిన్ అనంతరం ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. చదవండి: COVID-19: గణనీయంగా తగ్గుతున్న రోజువారీ కేసులు -
‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’
బ్వేనోస్ ఎయిరెస్: ఫుట్ బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దివంగత ఆటగాడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు సంచలన ఆరోపణలు చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా మృతి చెందాడని, చివరి రోజుల్లో డాక్టర్లు అతన్ని అస్సలు పట్టించుకోలేదని మారడోనా అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న దహియానా గిసెలా మాడ్రిడ్ అనే నర్సు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన లాయర్ ద్వారా వెల్లడించింది. కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు నర్సు తరపు న్యాయవాది స్పందిస్తూ.. మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తన క్లయింటు చెప్పినట్లు పేర్కొన్నాడు. హాస్పిటల్లో మారడోనా కింద పడిపోయినప్పుడు తన క్లయింట్ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్ స్పందించలేదని, ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చ చేస్తారని సదరు డాక్టర్ తన క్లయింట్‌తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని, అయన చివరి రోజుల్లో తన క్లయింటే అతని బాగోగులు చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, మారడోనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, అతని సంతానం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మారడోనా వ్యక్తిగత వైద్యునితో సహా ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వారిలో మాడ్రిడ్ అనే నర్సు కూడా ఒకరు. మారడోనా గతేడాది నవంబరులో 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మృతి చెందారు. చదవండి: గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్.. -
కరోనా రోగులకు సేవలందించనున్న "గ్రేస్ రోబో నర్స్"
మానవ స్పర్శ కోసం దీనంగా దేవలోకం వైపు చూస్తూ ఉన్న ప్రపంచానికి ‘గ్రేస్’ అనే ఒక హ్యూమనాయిడ్ నర్సు వెచ్చని టచ్‌ని ఇచ్చి, కోవిడ్ కలవరం నుంచి సాంత్వన కలిగించనుంది! బ్లూ డ్రెస్ ధరించి ఉండే ఈ కరుణామయి.. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు దగ్గరగా వెళ్లి, చేతిలో చెయ్యి వేసి.. ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంది. ‘తప్పక నయం అవుతుంది’ అని చిరునవ్వు కళ్ల తో ధైర్యం చెబుతుంది. ఇంకా.. వేళకు మందులు గుర్తు చేస్తుంది. సున్నితంగా సూది మందు గుచ్చుతుంది. హాంగ్ కాంగ్ ల్యాబ్‌లోంచి త్వరలోనే బయటికి రానున్న ఈ దయాళువులో మానవులు సృష్టించిన దైవాంశ ఏదో ఉన్నట్లే ఉంది! చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వస్తే వచ్చి ఉండొచ్చు గాక.. కరోనా వైద్య సేవలు అందించడం కోసం హాంకాంగ్‌లోని హాన్సన్ ల్యాబ్ నుంచి గ్రేస్ అనే ఒక రోబో నర్సు రాబోతున్నారు! కేవలం సేవలే కాదు, కరోనా వార్డులోని రోగులతో ఆమె ‘సిస్టర్’లా సాంత్వన వచనాలు పలుకుతారు. ‘మీకేమీ కాదు. త్వరగా కోలుకుంటారు’ అని ధైర్యం చెబుతారు. అయితే ఇదంతా కూడా ఇంగ్లిష్‌లో. మరికొన్ని రోజుల తర్వాత ఒకటీ రెండు అంతర్జాతీయ భాషలలో కూడా. అయినా మనసును నెమ్మది పరిచే స్పర్శ అనే ‘అమ్మ భాష’ ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. గ్రేస్ తాకి మాట్లాడతారు. హృదయాన్ని టచ్ చేస్తారు. గ్రేస్ ఒక హ్యూమనాయిడ్ రోబో. స్త్రీ రూపంలోని మర మనిషి. Meet Grace, the humanoid robot designed to interact with the elderly and those isolated by the global health crisis https://t.co/QmICTkKsti pic.twitter.com/nclTArYIrl — Reuters (@Reuters) June 10, 2021 హాంకాగ్లోని హాన్సన్ రోబోటిక్స్ ల్యాబ్‌లో ‘జీవం’ పోసుకున్న గ్రేస్ ప్రస్తుతం తుది శిక్షణలో ఉంది. ప్రధానంగా కోవిడ్ వార్డుల ఐసోలేషన్ లో ఉన్న వృద్ధులకు సేవలను అందించడం కోసం ఆసుపత్రులలోని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి చేయూతగా హాన్సన్ కంపెనీ ఈ రోబోను రూపొందించింది. గ్రేస్ శుభ్రమైన నీలం రంగు యూనిఫామ్ ధరించి ఉంటుంది. ఆసియా అమ్మాయిల రూపురేఖలు ఉంటాయి. పేషెంట్ ల శరీర ఉష్ణోగ్రత కొలవడం కోసం ఆమె కంఠానికి దిగువ భాగంలో కెమెరా ఉంటుంది. తల వెనుక భాగంలో అమర్చి ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్‌తో ఆమె రోగులకు అవసరమైన అన్ని సేవలూ అందిస్తుంది. మందులివ్వడం, ఇంజెక్షన్ చేయడం మాత్రమే కాకుండా.. మానసికమైన కుంగుబాటులో ఉన్న రోగిని గుర్తించి మాటలు కలుపుతుంది. టాక్ థెరపీ ఇచ్చి ఒంటరితనాన్ని పోగొడుతుంది! రోగి కన్నీళ్లు పెట్టుకుంటే... ‘కమ్మాన్.. ’ అంటూ కళ్లు తుడుస్తుంది. రోగితో సహానుభూతి పొందడం కోసం ల్యాబ్ వాళ్లు 48 రకాల ముఖ వ్యక్తీకరణ లు గ్రేస్‌కి ‘ఫీడ్’ చేశారు. సంతోషానికి సంతోషం. విచారానికి విచారం. నవ్వుకు నవ్వు. ఇలా.. ముఖాముఖిలా సాగుతుంది. గ్రేస్ మనిషిలా మాట్లాడుతుంటే.. రోగులు మంత్రముగ్ధులై రోబోలా మారిపోతారు. ‘‘గ్రేస్‌లో ఇదెంతో మంచి విషయం’’ అని హవాయి యూనివర్శిటీలో కమ్యూనికాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న మిన్–సున్ అంటున్నారు. గ్రేస్ తయారీకి ఆమె సహకారాన్ని కూడా హాన్సన్ ల్యాబ్ తీసుకుంది. గ్రేస్‌ను ముందుగా భారత్‌లోనే ‘లాంచ్’ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్డర్లని బట్టి వేల సంఖ్యలో గ్రేస్‌లను ప్రపంచమంతటా ఉత్పతి చేస్తారు. -
'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే'
ఢిల్లీ: ఢిల్లీలోని గోవింద్ బల్లబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్) వ్యవహరించిన తీరుపై ఢిల్లీ మలయాళీ నర్సుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిప్మర్లో పనిచేసే మలయాళీ నర్సులు మలయాళం మాట్లాడకూడదని.. కేవలం ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ సర్య్కులర్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నర్సుల సంఘం ఇలా చేయడం మా భాషను అవమానించడం అవుతుందని.. ఇది తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ వెంటనే లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక జూన్ 5న(శనివారం)జిప్మర్ ఆసుపత్రి ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. మలయాళం మాట్లాడేందుకు వీల్లేదని.. కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాలని సర్య్కులర్‌లో పేర్కొన్నారు. అయితే జిప్మర్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి ముందస్తు సూచన ఇవ్వకుండానే సర్య్కులర్ బయటికి వచ్చిందని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ సర్క్యులర్‌ను విత్ డ్రా చేశామని వివరించారు. ఇదే విషయమై ఢిల్లీ యాక్షన్ కమిటీ ఆఫ్ మలయాళీ నర్సర్ ప్రతినిధి సీకే ఫమీర్ స్పందించాడు. " ఈ విషయం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. జిప్మర్ జారీ చేసిన సర్క్యులర్ చూస్తుంటే మా భాషా స్వేచ్ఛకు ముప్పు ఉన్నట్లు భావిస్తున్నాము. వారు భాషను కించపరిచి మా రాష్ట్రాన్ని అవమానించారు. వెంటనే సర్క్యులర్ జారీ చేసిన సంబంధిత వ్యక్తి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది . అయితే జిప్మర్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ విషయం మాకు తెలియడం అనేది విషయాన్ని మరింత సీరయస్‌గా తయారు చేసింది. అధికారులకు కనీస సూచనలు లేదా వారి అనుమతి లేకుండానే సర్క్యులర్ జారీ చేసిన వ్యక్తిపై సీరియస్ యాక్షన్ తీసుకునే వరకు తాము ధర్నాను కొనసాగిస్తాం.'' అని చెప్పుకొచ్చారు. కాగా నర్సుల యూనియన్ ఆందోళనపై స్పందించిన జిప్మర్ మెడికల్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. '' మాకు తెలియకుండా ఇచ్చిన సర్య్కులర్‌ను విత్‌డ్రా చేసుకున్నాం. ఆ సర్క్యులర్ జారీ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీ ఆందోళనను విరమించి విధుల్లో చేరాలని కోరుతున్నాం'' అంటూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చదవండి: Mumbai: తెలుగువారి కోసం కరోనా టీకా -
భారతీయ అమెరికన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష
హూస్టన్: హెల్త్ కేర్ స్కామ్‌కు పాల్పడిన భారతీయ అమెరికన్, నర్సింగ్ ప్రాక్టిషనర్ త్రివిక్రమ్ రెడ్డికి అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, 5.2 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 376 కోట్లు) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హెల్త్‌కేర్ ఫ్రాడ్ స్కీమ్‌లో తన పాత్రను త్రివిక్రమ్ రెడ్డి (39) కోర్టు ముందు అంగీకరించారని టెక్సాస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రేరక్ షా వెల్లడించారు. మెడికేర్, ప్రైవేట్ బీమా సంస్థలను మోసం చేసే పథకానికి రెడ్డి రూపకల్పన చేశారని నిర్ధారణ అయిందన్నారు. పేషెంట్ల చికిత్సకు సంబంధించిన తప్పుడు బిల్లులను రూపొందించి బీమా సంస్థలను భారీ మొత్తాలకు మోసం చేశారన్నారు. అందుకు, ఆరుగురు డాక్టర్ల వివరాలను వాడుకున్నాడని తెలిపారు. ఈ ఆరుగురి డాక్టర్ల ఐడీ నెంబర్లు, ఇతర వివరాలను దొంగిలించి... త్రివిక్రమ్ వీరు తన క్లినిక్‌లలో పేషెంట్లకు చికిత్స చేసినట్లు బిల్లులు సృష్టించి... బీమా సంస్థల నుంచి తప్పుడు క్లెయిమ్‌లు పొందాడు. త్రివిక్రమ్ రెడ్డి మోసం గురించి మొదట 2019 జూన్‌లో వెల్లడయింది. 2020 అక్టోబర్‌లో ఆయన తన నేరాన్ని అంగీకరించారు. ఈనెల 25న కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేసింది. వాక్సహాచీ మెడికల్, టెక్సాస్ కేర్ క్లినిక్స్, వీ– కేర్ హెల్త్ సర్వీసెస్ల పేరిట త్రివిక్రమ్ మూడు క్లినిక్‌లను నిర్వహించేవారు. చదవండి: మాజీ భార్యపై జానీ డెప్ తప్పుడు ప్రచారం! -
కరోనా రోగిపై నర్సు అత్యాచారం: బాధితురాలు మృతి
భోపాల్ : నర్సు చేతిలో అత్యాచారానికి గురైన 24 గంటల్లోనే మహిళ మృతి చెందిన దారుణ ఘటన మధ్యప్రదశ్లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్6న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటరులో చేరింది. ఆ సమయంలోనే తనపై నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్‌గా గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే తన ఉనికిని రహస్యంగా ఉంచాలని, అందువ్ల కేవలం దర్యాప్తు బృందంతో తప్పా మరెవరితోనూ సమాచారం పంచుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఇర్షాద్ వాలి తెలిపారు. గతంలోనూ నిందితుడు మద్యం సేవించి 24 ఏళ్ల స్టాఫ్ నర్సుపై కూడా అత్యాచారం చేసి సస్పెండ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన మహిళ 1984 భోపాల్ గ్యాస్ విషాదంలో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఇక హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ఏంటని దర్యాప్తు బృందం ప్రశ్నించింది. భద్రతా పరమైన లోపాలున్నాయని పేర్కొంటూ హాస్పిటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసింది. చదవండి : వ్యాక్సిన్ కోసం వెళ్తే రూ.25 లక్షలు, నగలు దోచుకెళ్లిన దొంగలు దారుణం: యువతిపై సామూహిక లైంగిక దాడి -
బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు
భోపాల్: భారత్‌లో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక భాగం ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరో పక్క కరోనా వచ్చిందనే భయంతోనే.. కొందరు ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనల ఉన్నాయి. కానీ ధైర్యం, నమ్మకం ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిరూపించింది ఓ మహిళ. ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్ జయించింది. అది కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి 14 రోజుల్లోనే తరిమేసింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నర్సు. కంగారు పడక.. కరోనాను జయించింది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలో నర్సుగా కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒక్క ఊపిరితిత్తితోనే బతుకుతున్న ప్రఫులిత్ పీటర్ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భయపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ.. కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. అలాగే ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు తన ధైర్యమే కరోనా మీద విజయం సాధించేలా చేసిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. ( చదవండి: విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్ మృతి ) -
వైరలవుతోన్న ఫేక్ వ్యాక్సినేషన్ వీడియో.. ఛీ ఇదేం బుద్ది!
కరోనా రెండో దశ సునామీలా దూసుకొస్తుంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహమ్మారి కట్టడికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరుచూ శుభ్రపరుచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితోపాటు అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తప్పనిసరి వేసుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మొదట్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు భయంతో కాస్తా వెనకడుగు వేసినా.. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతోంది. తాజాగా ఫేక్ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఓవార్త నెట్టింట్లో వైరలవుతోంది. ఓ వ్యక్తి కోవిడ్ టీకా కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అయితే ఓ నర్సు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు నాటకమడింది. వ్యాక్సిన్ కోసం కూర్చున్న వ్యక్తికి ముందుగా కాటన్‌తో క్లీన్ చేసింది. తరువాత సూదిని వ్యక్తి భుజానికి గుచ్చింది కానీ వ్యాక్సిన్ ఇంజెక్ట్ మాత్రం చేయకుండానే సిరంజ్‌ను తీసేసింది. నర్సు ఇలా చేసిన విషయం సదరు వ్యక్తికి తెలియదు. టీకా తీసుకున్నట్లే భావించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దీనిని చూసిన జనాలంతా వైద్య సిబ్బందిపై మండిపడ్డుతున్నారు. ‘ఛీ.. ఓ వైపు కరోనాతో చస్తుంటే టీకా విషయంలో ఇలాంటి మోసాలేంటి’ అని విరుచుకుపడుతున్నారు. అయితే ఇది జరిగింది భారత్‌లో కాదు.. మెక్సీకో దేశంలో. చదవండి: గుడ్‌న్యూస్.. కోవాగ్జిన్తోనే సెకండ్ వేవ్ కట్టడి -
ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి.. ‘నాకిద్దరు సిస్టర్స్ ఉన్నారు’
ఫ్లోరిడా: మధ్య వయస్కురాలైన ఓ నర్సు ఉబర్ డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అతడి గొంతు పట్టుకుని చితకబాదింది. మహిళ తనను ఇంతలా బాధపెడుతున్న సదరు డ్రైవర్ ఆమె మీద చేయి చేసుకోలేదు. అందుకు అతడు చెప్పిన కారణం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ‘‘నాకు ఇద్దరు సోదరీమణలు ఉన్నారు. ఆడవారికి గౌరవం ఇవ్వాలని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి బోధించింది. అవే నేను పాటించాను’’ అన్నాడు. ఇంతకు సదరు నర్స్ అతడిపై ఎందుకు దాడి చేసింది అనేది మాత్ర తెలియలేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో ఈ నెల 17న చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మైఖెల్ స్టిల్విల్ అనే లేడీ నర్స్ ఏప్రిల్ 17న సాయంత్రం ఐదు గంటలకు ఉబర్ కారు బుక్ చేసుకుంది. హస్సీ జూనియర్ అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత మైఖెల్ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చిన తర్వాత సడెన్‌గా హస్సీపై దాడి చేయడం ప్రారంభించింది. వెనక ప్యాసింజర్ సీటులో కూర్చున్న మైఖెల్ నిద్ర నుంచి లేచి.. వెనక నుంచి హస్సీ మెడ పట్టుకుని అతడిని కొట్టడం ప్రారంభించింది. ‘నా కూతురు’ అంటూ అరుస్తూ.. అతడిపై పిడి గుద్దులు కురిపించింది. హస్సీ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఇంతలో మైఖెల్ ముందుకు వచ్చి అతని ఛాతీపై గోళ్లతో గీరింది.. లోతైన గాయం చేసింది. అతడికి ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేసింది. దారిన పోయే వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సదరు నర్స్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హస్పీ మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగితే అదే జరుగుతుంది.. నేను మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పైగా చిన్నతనం నుంచి ఆడవారిపై చేయి చేసుకోకూడదు అనే వాతావరణంలో నేను పెరిగాను. అందుకే ఆమెపై ప్రతి దాడి చేయలేదు’’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో నర్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి ఈమె 8 మంది శిశువులను చంపారట! -
నర్సు నిర్లక్ష్యం: ఫోన్ మాట్లాడుతూ రెండు సార్లు వ్యాక్సిన్
లక్నో: కరోనా వ్యాక్సిన్ వేయడంలో అలసత్వం వద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ నర్సు ఫోన్లో మాట్లాడుతూ ఓ మహిళలకు రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది. తప్పు చేసిందే గాక ఆమె దబాయింపుకు పాల్పడడం గమనార్హం. దీంతో టీకా వేసుకున్న మహిళ ఆందోళన చెందుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకుంది. కాన్పూర్ దేహత్ జిల్లా అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన మహిళ కమలేశ్ కుమారి (50) కరోనా టీకా వేసుకునేందుకు మర్హౌలీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఏఎన్ఎం విధులు నిర్వహిస్తోంది. టీకాలు వేస్తున్న సందర్భంలో అర్చన ఫోన్లో మాట్లాడుతోంది. ఆ విధంగా ఫోన్లో మాట్లాడుతూనే ఆమెకు ఒకసారి టీకా వేసింది. అనంతరం ఆ ఫోన్లోనే మునిగి మరొకసారి కూడా వ్యాక్సిన్ వేసింది. దీంతో అర్చన తీరుపై కమలేశ్‌కుమారికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకేసారి రెండు టీకాలు వేయడంపై నిలదీసింది. అయితే అర్చన తప్పు చేసిందే గాక ఆమెనే దబాయించి తిట్టి పోసింది. వెంటనే ఈ విషయాన్ని కమలేశ్ కుమారి తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. రెండు టీకాలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై వైద్య అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కలెక్టర్, వైద్య ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో నిర్లక్క్ష్యం వహించిన అర్చనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఒకేసారి రెండు టీకాలు ఇవ్వడంతో తనకేమన్నా అవుతుందేమోనని కమలేశ్ కుమారి ఆందోళన చెందుతున్నారు. -
ప్రేమ వ్యవహారం: చపాతీ కర్రతో నర్సు హత్య
టీ.నగర్(తమిళనాడు): మదురై సమీపంలో ఓ ఆస్పత్రి నర్సును కన్నతండ్రి దారుణంగా హతమార్చాడు. మదురై వండియూరు సంగునగర్‌కు చెందిన ఆశైతంబి ఆటోడ్రైవర్. ఇతని కుమార్తె మీనాక్షి దేవి (26) అవివాహిత. ఈమె జైహింద్‌పురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. మీనాక్షి దేవి ఒకరిని ప్రేమిస్తున్నట్లు తెలియడంతో తండ్రి తీవ్రంగా మందలించాడు. అయినప్పటికీ మీనాక్షి దేవి ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించడంతో ఆశైతంబికి ఆగ్రహం తెప్పించింది. మీనాక్షిదేవి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఆశైతంబి చపాతి కర్రతో ఆమెపై తీవ్రంగా దాడిచేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మీనాక్షి దేవి అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్నేహ అబ్బాయిలతో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని.. ఘోరం: అందరూ చూస్తుండగానే... -
కరోనా వ్యాక్సిన్‌కు ఇద్దరు నర్సులు బలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న ఊరటపై ఇద్దరు నర్సులు మరణించారన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత పోర్చుగీసుకు చెందిన నర్సు కన్ను మూసిందన్న భయంనుంచి ఇంకా కోలుకోకముందే మరో నర్సు ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నార్వేలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత వీరు హఠాత్తుగా కన్నుమూసారు. దీనిపై మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ద నార్వేజియన్ ఏజెన్సీ, నార్వే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈమరణానికి వ్యాక్సినే కారణమా లేక యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందా అన్నదానిపై విచారణ జరుపుతామని నార్వేజియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మెడికల్ డైరెక్టర్ స్టీనర్ మాడ్సెన్ వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద వయసు ఉన్న వ్యక్తులు మొదట వ్యాక్సిన్ తీసుకుంటుడం వల్ల మరణాలు యాదృచ్చికంగా సంభవించే అవకాశం ఉందని, ఎక్కువగా ఉందని మాడ్సెన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ వల్ల తాము కూడా ఇబ్బంది పడినట్లు గతంలో కొంతమంది వలంటీర్లు చెప్పినట్టు సమాచారం. కాగా పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) అనూహ్యంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మరో ఘనటలో ఫైజర్ వ్యాక్సిన్ అందుకున్న 32 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో చేరినట్టు మెక్సికన్ అధికారులు ఇటీవల వెల్లడించారు. -
బెట్టింగ్ కోసం ఏకంగా ఐపీఎల్ ఆటగాడికే ఫోన్?
న్యూఢిల్లీ: ఎంటర్టైన్మెంట్ ఈవెంట్‌గా పాపులర్ అయిన క్యాష్ రిచ్ టోర్నీ ఐపీఎల్ అదే స్థాయిలో వివాదాలకు కేంద్రంగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, శ్రీశాంత్, అంకిత్ చవాన్ బెట్టింగ్ ఆరోపణలతో నిషేదానికి గురికాగా, తాజాగా మరోసారి బెట్టింగ్‌కు సంబంధించిన విషయమొకటి వెలుగు చూసింది. ఐపీఎల్లో బెట్టింగ్ ఎలా పెట్టాలి? ఏ జట్టుపై డబ్బులు పెడితే బాగుటుంది, అంతర్గతంగా టీమ్ విషయాలు తెలపాలంటూ ఢిల్లీకి చెందిన ఓ నర్స్ ఐపీఎల్ ఆటగాడిని సంప్రదించినట్టు ఓ స్టడీ రిపోర్టు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ధ్రువీకరించారు. ఐపీఎల్ 2020 జరుగుతున్న క్రమంలో ఢిల్లీలో నర్స్‌గా పనిచేస్తున్న ఓ మహిళ బెట్టింగ్ పెట్టేందుకు సహాయం చేయాలని, వివరాలు చెప్పాలని ఒక ఆటగాడిని ఫోన్ ద్వారా సంప్రదించిన మాట వాస్తమేనని అజిత్ సింగ్ అన్నారు. అయితే, ఆ విషయాన్ని సదరు ఆటగాడు తమ దృష్టికి తేగా విచారణ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఆటగాడికి ఆ నర్స్ ఎవరో, ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. అవగాహన లేకే ఆమె అలా ప్రవర్తించిందని, ఆమెకు బెట్టింగ్ ముఠాలతో ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలిందని అజిత్ సింగ్ స్పష్టం చేశారు. దాంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేశామని తెలిపారు. కాగా, ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ట్రోఫీని చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్, ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. (చదవండి: టెస్టు సిరీస్: కేఎల్ రాహుల్ అవుట్) -
తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి..
బెంగళూరు : ప్రియుడితో బంధాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో తప్పుదారి పట్టిందో నర్సు. తోటి ఉద్యోగుల బాత్రూం వీడియోలను తీసి ప్రియుడికి పంపింది. గుట్టురట్టయి చివరకు జైలు పాలైంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన అశ్వినికి ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడు వేల్లూర్కు చెందిన ప్రభు అనే చెఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఓ రెండు మూడు సార్లు కలుసుకున్నారు. అయితే ఆమెకు ఇది వరకే రెండు సార్లు పెళ్లైందని, విడాకులు కూడా తీసుకుందని ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టసాగాడు. బంధంలో రెండు సార్లు విఫలమైన ఆమె, అతడ్ని వదులుకోవటనానికి ఇష్టపడలేదు. అతడు చెప్పినట్లుగా నడుచుకునేది. (దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్!) ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని అడిగాడు. ఆమె అలాగే పంపేది. అతడికి అవి బోర్ కొడుతున్నాయని చెప్పటంతో హాస్టల్ గదిలో తనతో పాటు ఉంటున్న తోటి ఉద్యోగులు స్నానం చేస్తునపుడు తీసిన వీడియోలను అతడికి పంపేది. ఓ రోజు బాత్రూంలో స్నానం చేయటానికి వెళ్లిన ఓ సిబ్బంది అక్కడ కిటికీ దగ్గర సెల్‌ఫోన్ ఉండటం గమనించింది. దీనిపై అశ్వినిని ప్రశ్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు చాలా వరకు నర్సుల బాత్రూం వీడియోలను ఆన్లైన్లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
నర్స్ నం.1
తాజా చిత్రం ‘కూలీ నెం.1’ కోసం కూలీగా మారారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. ఈ సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్‌ను ప్రేమలో పడేయడానికి చాలా వేషాలే వేశారట. అందులో నర్స్ వేషం ఒకటి. సినిమాలో కొద్దిసేపు ఈ నర్స్ గెటప్‌లో కనిపిస్తారు వరుణ్. ఈ సీన్స్ చిత్రీకరించే ముందు వరుణ్ నర్స్ గెటప్ మేకప్ చేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రా మ్లో పంచుకున్నారు సారా. ‘హాటెస్ట్ నర్స్ వరుణ్’ అని క్యాప్షన్ చేశారామె. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. -
అమెరికాలో నర్సుకు తొలి టీకా
న్యూయార్క్: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్ ఐలాండ్ జ్యుయిష్ మెడికల్ సెంటర్ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కావడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫైజర్–బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డోసును సాండ్రా లిండ్సేకు ఇచ్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగిసిపోవడానికి ఇదొక ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పూర్తి రక్షణ ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. చీకటిలో వెలుగు రేఖ కనిపించినప్పటికీ ప్రజలు కరోనా నియంత్రణ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సాండ్రా సూచించారు. మాస్కులు ధరించాలని కోరారు. కరోనా టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ‘అమెరికాకు శుభాకాంక్షలు, ప్రపంచానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ గవర్నర్ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఆయుధం వ్యాక్సిన్ అని చెప్పారు. పుస్తకంలోని చివరి అధ్యాయం ఇప్పుడు మొదలైందని పేర్కొన్నారు. తాను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ తెలిపారు. -
సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..
సాక్షి, బెంగళూరు: సహ ఉద్యోగిని బాత్రూమ్లో స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి అప్లోడ్ చేసిన నర్సును ఆదివారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్ ఇన్చార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నర్సు అశ్వినినీ అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది. అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్ వసతి కల్పించారు. ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్రూమ్లో మొబైల్ కనిపించడంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్ ఇన్చార్జ్కు ఫిర్యాదు చేసింది. ఫోన్ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై) (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) -
డాక్టర్ల తప్పు: పాపం నర్సు
లండన్ : డాక్టర్ల తప్పు ఓ నిండు ప్రాణం బలికొంది. తాను పనిచేస్తున్న ఆసుపత్రి వైద్యుల కారణంగానే ఓ నర్సు మరణించింది. భార్య మరణానికి నిజమైన కారణాలను అన్వేషిస్తూ పోరాటం చేసిన నర్సు భర్త ఎట్టకేలకు విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని నార్త్ వేల్స్‌కు చెందిన క్యాథరిన్ జోన్స్ 35 అనే నర్సు 2013లో తాను పనిచేస్తున్న వ్రేక్సహామ్ మేలర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. క్యాన్సర్ కణితిని తొలిగించిన వైద్యులు ఇకపై ఎలాంటి సమస్య రాదని చెప్పారు. అయితే మూడు సంవత్సరాల తర్వాత 2016లో క్యాన్సర్ కణితి మరింత పెద్దదైంది. (2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..) అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించగా కణితి పెద్దదైన విషయం బయటపడింది. ఆ ఏడాది నవంబర్ నెలలోనే క్యాథరిన్ మరణించారు. అయితే తన భార్య చావుకు గల నిజమైన కారణాలను చెప్పాలంటూ క్యాథరిన్ భర్త డేవిడ్.. ‘‘బెట్సీ కాడ్వలర్డర్ యూనివర్శిటీ హెల్త్ బోర్డు’’పై పోరాటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఆసుపత్రి యజమాన్యం తమ తప్పును ఒప్పుకుంది. ఆమెకు సరైన చికిత్స అంది ఉంటే బ్రతికుండేదని పేర్కొంది. -
ఈమె 8 మంది శిశువులను చంపారట!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమె ఎప్పుడూ ముఖంపై చెరగని చిరు నవ్వుతో నిజమైన మాతమూర్తిలా కనిపిస్తుంది. ఆమె ఆ ఆస్పత్రిలో శిశువుల బాగోగులు చూసుకుంటుంటే దివి నుంచి దిగిన దేవ కన్యలా కనిపిస్తుంది. ఆమెలో అభం శుభం తెలియని శిశువులను నిర్ధాక్షిణ్యంగా చంపేసే రాక్షసి దాగుందంటే ఎవరూ నమ్మరు. ఆమె పేరే లూసీ లెట్‌బై. ఆమెకు 30 ఏళ్లు. ఇంగ్లండ్‌లోని చెస్టర్ యూనివర్శిటీ గ్రాడ్యువేట్. ఎన్హెఎస్ ఆధ్వర్యంలో చెస్టర్ నగరంలో నడుస్తున్న ‘కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో శిశువుల సంరక్షణ బాధ్యతలను చూసుకునే నర్సుగా ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. 2015, మార్చి నెల నుంచి 2016 జూలై నెల మధ్య ఆ ఆస్పత్రిలో పురుడు పోసుకున్న శిశువుల మరణాలు హఠాత్తుగా పెరిగాయి. ప్రసవం సందర్భంగా, నెలలు నిండకుండానే సాధారణంగా సంభవించే శిశు మరణాలకంటే ఆ ఏడాది కాలంలో ఆ మరణాలు 10,11 శాతం పెరిగాయి. ఆస్పత్రి ఉన్నతాధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేయగా, అనుమానాలన్నీ లూసీ లెట్‌బై వైపే దారితీశాయి. అంతకుముందు లివర్‌పూల్ ఆస్పత్రిలో పని చేయడమే కాకుండా, వైద్య సేవల కోసం మూడు మిలియన్ పౌండ్లు (దాదాపు 29.5 కోట్ల రూపాయలు) విరాళాలుగా వసూలు చేసిన ఘన చరిత్ర ఆమెకుంది. తోటి నర్సులు కూడా లూసీ అలాంటి నేరాలకు పాల్పడుతుందని కలలో కూడా ఊహించలేదు. చెస్టర్ ఆస్పత్రిలో అసహజంగా కనిపించిన శిశు మరణాలలో, వారి వద్దకు ఆఖరి సారి వెళ్లిందీ లూసీయేనని తేలడంతో ఆస్పత్రి అధికార వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆస్పత్రిలో అంతుచిక్కని శిశు మరణాలపై దర్యాప్తు జరిపిన చెషైర్ పోలీసులు 2018లో ఒకసారి, 2019లో ఒకసారి లూసీని అరెస్ట్ చేశారు. ఆమెపై ఎనిమిది మంది శిశువుల హత్య, ఆరుగురు శిశువులపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. అదే కేసులో తాజాగా ఆమెను మూడోసారి మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. లూసీపై కొత్తగా మరో నాలుగు హత్యాయత్నం కేసులు అదనంగా నమోదు చేశారు. మొత్తం ఆమెపై దాఖలైన కేసులు ఎనిమిది హత్య కేసులుకాగా, పది హత్యాయత్నం కేసులు. ఇంతకుముందు రెండుసార్లు లూసీని చెస్టర్ ఆస్పత్రిలోనే అరెస్ట్ చేయగా, ఈసారి ఆమె నివసిస్తున్న వెస్ట్బోర్న్ రోడ్డులోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు ఇంకా ముగియనందున మొదట రెండుసార్లు లూసీ బెయిల్‌పై విడుదలయ్యారు. అత్యంత సంక్లిష్టమైన, సున్నితమైన ఈ కేసును గత మూడేళ్లుగా దర్యాప్తు చేస్తున్నామని డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఫాల్ హగెస్ తెలిపారు. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల ఆ శిశువులు గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో చనిపోయారని లూసీ చెబుతూ వస్తున్నారు. ఆయన చనిపోయిన శిశువుల కాళ్లు, చేతులపై ఒక విధమైన గాయాలుండడం అటు ఆస్పత్రి వర్గాలను, ఇటు పోలీసులను ఆశ్యర్య పరుస్తోంది. లూసీ ఇలాంటి నేరాలు చేశారంటే తాము ఇప్పటికీ నమ్మలేక పోతున్నామని, ఆమె తనకెంతో ఇష్టమని నర్సు వత్తిలో ఇప్పటికీ కొనసాగుతున్నారని మిత్రులు తెలిపారు. అభియోగాలు ఎదుర్కొంటున్న లూసీ మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు మొదటి నుంచి నిరాకరిస్తూ వస్తున్నారు. ఇంగ్లండ్ స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు లూసీని అక్కడి కోర్టు ముందు హాజరపర్చాల్సి ఉంది. -
ఆమె కథలో వ్యథలెన్నో..!
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్. ఎందరో రోగులకు సేవ చేసి ప్రాణాలు నిలిపిన ఆమె ఇప్పుడు అనారోగ్యంపాౖలై మంచం పట్టింది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. లివర్ పాడైంది. వైద్యానికి డబ్బులు లేక దాతలే తనను బతికించాలంటూ దీనంగా వేడుకుంటోంది. తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదంటూ బోరున విలపిస్తోంది. కష్టాలు వెంటాడుతున్న ఓ గర్భిణి కథ ఇది.. దాతలు, ప్రభుత్వం ఆదుకుంటే గానీ తీరని వ్యథ ఇది... కంచరపాలెంలో నివాసముంటున్న బి.రాణి నర్సింగ్ విద్యనభ్యసించింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా చేరింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రకాష్ అనే వ్యక్తిని వివాహమాడింది. భర్త రోజువారి కూలి. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నా ఫెయిల్ కావడంతో మళ్లీ గర్భం దాలి్చంది. ప్రస్తుతం రాణి ఆరు నెలల గర్భిణి. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని, లివర్ పాడైందని వైద్యులు నిర్థారించారు. దీంతో కేజీహెచ్‌లో చేరేందుకు వెళితే అక్కడ ఎవరూ జాయిన్ చేసుకోలేదు. కేజీహెచ్ గైనకాలజీ విభాగం ముందున్న చెట్టు వద్దనే రోజంతా కూర్చుంది. విషయం తెలుసుకున్న తోటి నర్సింగ్ ఉద్యోగులు తలోకొంత వేసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ డబ్బులతో వైద్యం సాధ్యం కాదని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో.. రాణి పుస్తెలు తాకట్టు పెట్టి కొంత నగదు, అలాగే మరో కొంతమంది స్నేహితులు కలిసి కొంత నగదు సేకరించి ఆస్పత్రికి కట్టారు. అలా చెల్లించిన డబ్బులు కేవలం రెండు రోజుల వైద్యానికే సరిపోయాయి. ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదని రాణి కన్నీటిపర్యంతమవుతోంది. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది. తన కడుపులో పెరుగుతున్న పసికందు భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన చెందుతోంది. దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. సహాయం చేసే దాతలు ఆంధ్రాబ్యాంకు, అకౌంట్ నంబరు 179610100043093, ఐఎఫ్ఎస్సీ కోడ్ ANDB0001796కు జమ చేయాలని విజ్ఞప్తి చేసింది. లేదా 93982 94998, 63095 41731 నంబర్లకు ఫోన్ చేసి ఆర్థిక సాయం చేయాలని రాణి వేడుకుంటోంది. -
నర్సులకు ఆఫర్లే ఆఫర్లు!
‘అర్జంట్... అర్జంట్... స్టాఫ్ నర్సులు కావలెను’ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన ప్రకటన ఇది. ‘నెలకు రూ.50 వేల జీతం, ఉచిత వసతి, కేరళ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచిత విమాన ప్రయాణం, చార్జీలు భరిస్తాం’ ఇది ప్రకటన సారాంశం. బీఎస్సీ, జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు చదివినవారు ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు కావాలని కోరింది. సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా కాలం.. రోగుల తాకిడి కూడా బాగానే ఉంది.. కాసులను దండిగా దండుకోవచ్చనుకున్నారు.. కానీ, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేరు. తగిన వైద్యసేవలందించే పరిస్థితి లేక పడకలు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆదాయానికి భారీగా గండి పడింది. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఇప్పుడు వేధిస్తున్న ప్రధానసమస్య నర్సుల కొరత. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా సరిపడాలేరు. ఈ నేపథ్యంలో నర్సులకు ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రూ.50 వేల జీతం, ఉచిత వసతి కల్పిస్తామంటూ ప్రకటనలిస్తున్నాయి. గురువారం సర్కారు విడుదల చేసిన లెక్కల ప్రకారమే 95 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5,494 పడకలు కరోనా కోసం కేటాయించగా, అందులో 2,197 ఖాళీగా ఉన్నాయి. రోగులు భారీగా వస్తున్నా పడకలు లేవంటున్నాయి. సిబ్బంది కొరతతోనే తాము అలా చెప్పాల్సి వస్తుందని ఆసుపత్రుల పేర్కొంటున్నాయి. వెయ్యిమంది నర్సులకు కరోనా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారమే దాదాపు వెయ్యి మంది నర్సులు కరోనా బారినపడ్డారు. నర్సింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రతీ పదిమంది నర్సుల్లో ముగ్గురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వంద మంది పనిచేసే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 మంది అనారోగ్యంతో ఉంటున్నారు. దీంతో వారంతా సెలవులు పెడుతున్నారు. చాలామంది భయాందోళనకు గురవుతూ తక్కువ జీతాలకు పనిచేయబోమని రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు నర్సులు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు వేసి రప్పించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఒక గుంపుగా ఎక్కువమంది వచ్చేట్లయితే వారికోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేసేందుకూ కార్పొరేట్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అత్యంత పేరొందిన ఒక ఆసుపత్రికి చెందిన ఓ బ్రాంచిలో 40కిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. అదేస్థాయి కలిగిన మరో ఆసుపత్రికి చెందిన ఒక బ్రాంచిలో 50, మరో ప్రముఖ ఆసుపత్రికి చెందిన రెండు బ్రాంచీల్లో 160, ఇంకో కార్పొరేట్ ఆసుపత్రిలో 170కు పైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. 40కి పడకలు ఖాళీగా ఉన్న ఆసుపత్రి సరాసరి ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినా పది రోజుల్లో రూ.4 కోట్లు కోల్పోయే పరిస్థితి యాజమాన్యాలకు ఏర్పడింది. ఇలా భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఇటీవల ఓ ఆసుపత్రి కేరళ నుంచి కొందరు నర్సులను ఆగమేఘాల మీద చార్టర్డ్ ఫ్లైట్‌లో తెప్పించింది. వారి అనుభవం, డిమాండ్‌ను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. అలా కొందరిని ఇటీవల రిక్రూట్ చేసుకుంది. ఇంకా కొందరు కావాలంటూ తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రూ.45 వేల వేతనం, మెడికల్ కవరేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. నర్సింగ్ కోర్సు అయిపోయి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోనివారైనా ఫర్వాలేదని ఆహ్వానించింది. -
దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో...
వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్ (26)అనే యువతి అమెరికాలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యింది. మెరిన్ ఒక హాస్పటల్లో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమె మంగళవారం ఆసుపత్రిలో విధులు ముగించుకొని వెళుతుండగా ఆమె భర్త ఫిలిప్ మ్యాథ్యు (34) వెనుక నుంచి వచ్చి ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచాడు. అంతే కాకుండా రోడ్డుపై పడిపోయిన ఆమె మీద నుంచి కారును పోనిచ్చాడు. మెరిన్‌ను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే ఆమె చనిపోయింది. నిందుతుడి కోసం పోలీసులు గాలించగా అప్పటికే అతను తనకు తాను గాయాలు చేసుకొని హాస్పటల్లో చేరాడు. మెరిన్, మాథ్యులకు ఒక పిల్లాడు ఉన్నాడు. స్థానికంగా వారు కేరళకు చెందిన వారు. బాబును కేరళలోనే వదిలేయాలని మ్యాథ్యు, మెరిన్తో గొడవపడ్డాడు. దీంతో ఆమె బాబును వదిలేసి భర్తతో కలిసి అమెరికాకు వెళ్లింది. అక్కడ కూడా వారిద్దరికి గొడవలు అయ్యాయి. తరువాత మెరిన్ 2018లో నర్సుగా ఆసుపత్రిలో చేరింది. కుటుంబ కలహాలు ముదరడంతో మ్యాథ్యు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: భార్యను హతమార్చి.. ఆత్మహత్యగా -
నర్సుకు కరోనా సిబ్బంది రోగుల్లో ఆందోళన
కంటోన్మెంట్: భయపడినంతా అయింది. యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్ టెస్టులు వద్దంటూ ప్రభుత్వ పాఠశాల ఆవరణకు మార్చినా ప్రమాదం తప్పలేదు. బోయిన్పల్లి యూపీహెచ్‌సీలో పనిచేసే నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ ఆరోగ్య కేంద్రంలో ఇటీవల వ్యాక్సిన్లు, ఇతరత్రా చికిత్స కోసం వచ్చిన బాలింతలు, చిన్నారుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తక్షణమే యూపీహెచ్‌సీని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా కంటోన్మెంట్ అధికారులు సూచిస్తున్నప్పటికీ, సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే కానీ, యూపీహెచ్‌సీని మూసివేయలేమని పేర్కొంటున్నారు. వ్యాప్తి ప్రమాదముందనే... బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆనుకుని ఉండే యూపీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్ టెస్టులకు ఏర్పాట్లు చేయగా, ఇక్కడ కరోనా పరీక్షలు నిర్వహించకూడదంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా యూపీహెచ్సీకి ప్రతి బుధ, శనివారం వ్యాక్సినైజేషన్ కోసం వచ్చే వందలాది మంది మహిళలు, చిన్నారులతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై వచ్చేవారికి సోకే ప్రమాదముంటుందని స్థానికులు అభ్యంతరం చెప్పారు. దీంతో పాటు యూపీహెచ్‌సీని ఆనుకునే ఉండే రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలోని మెటర్నిటీ క్లినిక్‌కు వచ్చే గర్బిణీలకూ ఇబ్బంది కలుగుతుందని సదరు నిర్వాహకులు పేర్కొన్నారు. సర్కిల్ కార్యాలయం సిబ్బంది, డిస్పెన్సరీ ఆవరణలోనే ఉన్న ప్లే గ్రౌండ్‌కు వచ్చే క్రీడాకారులు తదితరులూ కరోనా ర్యాపిడ్ టెస్టుల నిర్వహణను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తాడ్బంద్ చౌర స్తా సమీపంలో జనావాసాలకు దూరంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో టెస్టులు నిర్వహిస్తున్నారు. తాత్కాలికంగా మూసేయాల్సిందే... ఊహించిన ప్రమాదం ముంచుకొచ్చినప్పటికీ యూపీహెచ్‌సీలో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించడం ప్రమాదకరం అని బోర్డు సిబ్బంది సైతం అభిప్రాయపడుతున్నారు. యూపీహెచ్సీ నర్సుకు కరోనా సోకినట్లు తేలడంతో వెంటనే సంబంధిత ప్రాంగణాన్ని కంటైన్మెంట్ చేసేందుకు యత్నించగా, క్లినిక్ సిబ్బంది అడ్డుకున్నారు. తమ శాఖ ఉన్నతాధికారులు చెబితేనే తాము క్లినిక్ మూసేస్తామంటున్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. తాము సొంత నిధులతోనే క్లినిక్‌ను శుభ్రం చేయించుకుంటామని పేర్కొనడం గమనార్హం. మేడ్చల్‌లో 28 కరోనా కేసులు మేడ్చల్: మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 28 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధాకారి డాక్టర్ మంజుల తెలిపారు. 150 మందికి పరీక్షలు నిర్వహించగా... 28 మందికి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని తెలిపారు. మేడ్చల్‌లో గడచిన వారంలో రోజుల్లో కరోనా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 60కి చేరిందన్నారు. కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో... మూసాపేట: జీహెచ్ఎంసీ కూకట్పల్లి జంట సర్కిళ్ల పరిధిలో మంగళవారం 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మూసాపేట సర్కిల్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయన్నారు. మూసాపేటలో 4, ఫతేనగర్‌లో 2, జింకలవాడలో 1, బాలాజీనగర్ 2, బోరబండ 4 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో 10 కేసులు నమోదవగా శంషీగూడలో 2, హెచ్ఎంటీ హిల్స్‌లో 2, ఎల్లమ్మబండలో 3, ఆల్విన్‌కాలనీ, సుమ్రితానగర్, బోయిన్‌పల్లిలలో ఒక్కో కేసు ప్రకారం నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో... సూరారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా కేసులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. మంగళవారం నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌ల్లో 51 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. షాపూర్‌నగర్ పీహెచ్సీలో 38 టెస్టులు చేయగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కుత్బుల్లాపూర్ పీహెచ్సీలో 42 మందికి టెస్టులు చేయగా 16 మందికి, సూరారం పీహెచ్సీలో 70 టెస్టులు చేయగా 23 మందికి, గాజులరామారం పీహెచ్సీలో 40 మందికి టెస్ట్‌లు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. ప్లాస్మాను డొనేట్ చేసిన పోలీస్ గోల్కొండ: కరోనాను జయించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్లాస్మాను డొనేట్ చేశారు. వివరాలివీ... గోల్కొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బి.అనిల్ ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారిని జయంచి పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన అనిల్ మంగళవారం అపోలో ఆస్పత్రిలో ప్లాస్మా డొనేట్ చేశారు. తన వృత్తి ధర్మంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేసిన అనిల్‌ను గోల్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు. -
సైకో సైకియాట్రిస్ట్ : చితక్కొట్టిన నర్సులు
సాక్షి, చండీగఢ్ : ఒకవైపు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మరోవైపు కరోనా కట్టడిలో అనేకమంది వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. అయితే వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొంతమంది డాక్టర్లు ప్రవర్తిస్తున్నారు. హర్యానాలోని సివిల్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు. ఈ కేసు విచారణలో ఆసుపత్రి వైఖరిపై మండిపడిన నర్సులు డాక్టరుపై దాడి చేసిన ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది. పంచకుల సెక్టార్ 6 లోని సివిల్ హాస్పిటల్లో కోవిడ్-19 డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు వేధింపులకు తెగబడ్డాడు. దీనిపై నర్సుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడి పట్ల కఠినంగా వ్యహరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సులు మనోజ్కుమార్పై దాడి చేసి చితక్కొట్టారు. మంగళవారం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కేసు పూర్వాపరాలు నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ సమాచారం ప్రకారం కోవిడ్-19 ఐసోలేషన్ విధుల్లో ఉండగా శనివారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మద్యం సేవించి ఉన్న కుమార్ వార్డుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు. ఆమె గది లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు వేసి, ఆమెపై దాడి చేశాడు. మాస్క్‌ను తొలగించి లైంగికంగా వేధించాడు. దీన్ని ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడు. అయితే ఎలాగోలా తప్పించుకున్న ఆమె తన సహచరులకు, నర్సింగ్ ఇన్‌ఛార్జిలతోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ), ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ (పీఎంఓ)లకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం నిందితుడిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కౌర్ ఆరోపించారు. అధికారుల చర్యల కోసం తాము రెండు రోజులు వేచి ఉన్నామని తెలిపారు. ఆసుపత్రి సీనియర్ అధికారులు చాలా మంది మహిళలే ఉన్నారు కాబట్టి తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని కౌర్ వాపోయారు. పైగా బాధితురాలిని మూడు రోజుల సెలవుపై పంపారన్నారు. సోమవారం మధ్యాహ్నం కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళితే, మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లమంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాని ఆరోపించారు. దీంతో తాము మహిళా కమిషన్‌ను ఆశ్రయించా మన్నారు. నిందితుడిపై ఎటువంటి చర్య తీసుకోకపోగా, విధులను యధావిధిగా నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైద్యుడిపై (మహిళల పోలీస్ స్టేషన్లో) ఎఫ్ఐఆర్ నమోదు చేశామనీ, కేసును దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నూపూర్ బిష్ణోయ్ చెప్పారు. వైద్యుడిని అదుపులోకి తీసుకోలేదనీ, అతని స్టేట్మెంట్ ఇంకా నమోదు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ విషయంపై పంచకుల సీఎంఓ డాక్టర్ జస్జీత్ కౌర్ మాట్లాడుతూ అంతర్గత కమిటీ నివేదికను డైరెక్టర్ జనరల్, హెల్త్ సర్వీసెస్ (డిజిహెచ్ఎస్) తో పాటు, మహిళా కమిషన్‌కు కూడా పంపినట్లు తెలిపారు. వైద్యుడిని డిప్యుటేషన్‌పై పంపించామనీ, పోలీసుల విచారణ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు. అలాగే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, డాక్టరుపై దాడి చేసిన వారిపై కూడా విచారణ జరుగుతుందని డిజిహెచ్ఎస్ డా. కాంభోజీ ప్రకటించడం గమనార్హం. మహిళా కమిషన్ అసంతృప్తి: మరోవైపు ఆసుపత్రి యాజమాన్య దర్యాప్తుపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుపై ఆసుపత్రి అధికారులు సమర్పించిన నివేదికపై ప్యానెల్ సంతృప్తి చెందలేదని మహిళా కమిషన్ వైస్ చైర్మన్ ప్రీతి భరద్వాజ్ ప్రకటించారు. Panchkula: A staff nurse was allegedly eve teased by a doctor at civil hospital Sector-6 Panchkula. Nurses protested against the doctor and also thrashed him in his office. pic.twitter.com/bpX98nTn7P — PRITAM THAKUR (@pritamt2707) July 14, 2020 -
గాంధీ నర్సులకు వేతనాల పెంపు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 212 మంది ఔట్సోర్సింగ్ నర్సులు పనిచేస్తున్నారు. జీవో 14 ప్రకారం ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ అయిన వీరందరికీ రూ.17,500 జీతం ఇస్తున్నా రు. అయితే ఇటీవల కోవిడ్–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జీతాలు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన జీతాలు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే అవకాశాలు న్నాయి. జీవో 14 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులయ్యారు. వారంతా కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో పెంచిన వేతనాల ను ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇన్సెంటివ్‌గా వేతనంతో పాటు ఇన్ పేషెంట్ వద్ద సేవలందించే స్టాఫ్ నర్సులకు రోజుకు రూ.300–500 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదు. కరోనా విధుల్లో ఉన్నవారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా 5 రోజులు పనిచేస్తే మరో 5 రోజులు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ భయంతో కొంతమంది నర్సులు విధులకు హాజరుకావడం లేదు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. బయట నర్సులకు 12 గంటల డ్యూటీలకే రూ.3–4 వేల వరకు ఇస్తున్నారు. అందుకే కోవిడ్ సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ నర్సులకు ఈ మేరకు వేతనాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓమేగా హాస్పిటల్ నర్సు మృతి
నిజాంపేట్: కోకకోలా చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నర్సు మృతి చెందింది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే గురువారం మరొకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. జూబ్లీహిల్స్ ఓమేగా హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న బేగరి ప్రమీల (24)జూబీహిల్స్‌లో ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. లాక్డౌన్ కారణంగా బొల్లారంలో ఉండే బంధువుల ఇంట్లో ఉంటూ ప్రతిరోజు డ్యూటీకి బొల్లారం నుండి జూబ్లీహిల్స్ ఆస్పత్రికి వెళ్తోంది. (నర్సుగా సేవలందించిన తనకే..) గురువారం ఉదయం 7.15గంటలకు బావ బేతయ్యతో కలిసి ప్రమీల బొల్లారం నుంచి జూబ్లీహిల్స్‌కు మోటార్ బైక్ (టీఎస్ 15 ఇజెడ్ 9335) పై వెళుతోంది. కోకకోలా చౌరస్తా దాటిన తరువాత లహరి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 07 యూడి 0003) బైక్ ను కుడి వైపు తగిలించగా బైక్‌పై ఉన్న ప్రమీల, బేతయ్యలు రోడ్డుపై పడ్డారు. ట్రావెల్స్ బస్సు ప్రమీద తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బేతయ్యకు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమీల తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం బాచుపల్లి నుంచి మల్లంపేట్‌కు ద్విచక్ర వాహనంపై తన బావతో కలిసి వెనక కూర్చున్న మహిళ నాగ సృజన బైక్ స్కిడ్ కావడంతో కింద పడింది. దీంతో పక్కనుంచి వెళ్తున్న టప్పిర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో మృతి చెందింది. వరుస ప్రమాదాలు.. గత రెండు రోజులుగా బాచుపల్లి, మేడ్చల్, పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదాలు భారీ వాహనాలు ఢీకొట్టడం మూలంగా, బైక్‌లు జారి పడి, సడెన్ బ్రేక్‌లు వేయడం వల్లనే జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటనలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.