
ఓ చైనా నర్స్ తన పేషెంట్‌కు రాసిన నోట్ సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సర్జరీకి రెడీ అవుతున్న తన పేషెంట్‌కు ఓ చైనా నర్స్ కొన్ని సూచనలు ఇవ్వాలనుకున్నారు. అయితే నర్స్‌కు కొద్దిపాటి ఇంగ్లీష్
మాత్రమే రావడం, పేషెంట్ విదేశీ విద్యార్థి కావడంతో, ఎలాగైనా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అతనికి చెప్పాలనుకున్నారు. దీంతో తనకున్న డ్రాయింగ్ పరిజ్ఞానాన్ని వాడి కొద్దిపాటి ఇంగ్లీష్ పదాలతో ఓ నోట్ తయారు చేసి పేషెంట్‌కి ఇచ్చారు.
మరుసటి రోజు ఉదయం సర్జరీ ఉండటంతో, ముందు రోజు రాత్రి పదిదాటిన తర్వాత తినడం, తాగడం చేయొద్దని పేషెంట్‌తో నర్స్ చెప్పాలనుకున్నారు. ఇదే విషయాన్ని విదేశీ విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పడానికి కొద్దిపాటి ఇంగ్లీష్‌లో రాస్తూనే, ఏకంగా మూడు బొమ్మలు డ్రా చేశారు. ఆహారాన్ని సూచించేలా ఓ బౌల్ స్పూన్‌లు, నీరు తాగొద్దు అనడానికి ట్యాప్ నీటి చుక్కులు, గ్లాస్ బొమ్మలను, సర్జరీని ప్రతిబింబించేలా ఓ కత్తి, రక్తం చుక్కను డ్రా చేశారు. నర్స్ రాసిన ఈ నోట్ కొందరునెటిజన్లకి నవ్వు తెప్పిస్తుంటే, మరికొందరు మాత్రం ఏంటీ డ్రాయింగ్, సర్జరీకి రెడీ అవుతున్న పేషెంట్‌కు జాగ్రత్తలు ఇలానా చెప్పేది అంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment