సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో హీరో మోకాళ్లపై కూర్చోవడం చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో అలా కుదరదు. అంతగా అవసరమైతే నాలుగైదు సార్లు బతిమాలడం లేదా పెద్దవాళ్లను ఎవరినైనా పిలిపించి మాట్లాడించటం వంటివి చేస్తారు చాలామంది. కానీ ఇక్కడొక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బ్రేక్‌అప్ చెప్పి వెళ్లొద్దు అంటూ ఎంతగా వేడుకున్నాడంటే సినిమాలోని సీన్లను మించిపోయేలా చేశాడు. ఏకంగా ఆమె కోసం వర్షంలో 21 గంటల పాటు మెకాళ్ల పైనే ఉండిపోయాడు. ఎవరూ ఎంతగా చెప్పినా వినకుండా అలానే ఆమె కోసం వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు.
అసలేం జరిగిందంటే.. చైనాలోని ఓ వ్యక్తికి ప్రియురాలు బ్రేక్ అప్ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నిన్ను వదులుకోలేనంటూ ఆమెను ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆమె ప్రేమను ఎలాగైనా తిరిగి పొందాలనుకుని ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లి.. చేతిలో పూల బొకేతో లవ్ ప్రపోజ్ చేసే భంగిమలో (మోకాళ్లపై) నుంచొని ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూశాడు. ఇలా అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటకు అనగా నిలబడ్డ వ్యక్తి ఆ మరుసటి రోజు ఉదయ 10 గంటల వరకు జోరు వానలో అలానే మోకాళ్లపై ఉండిపోయాడు.
ఎవరూ ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. ఆఖరికి పోలీసులు రంగంలోకి దిగినా.. విరమించి లేవడానికి అస్సలు ఒప్పుకోకపోగా, ఇది చట్ట విరుద్ధం కాకపోతే నన్ను వదిలేయండి అని పోలీసులను అభ్యర్థించాడు. తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, క్షమాపణలు కోరుతూ ఇలా ఉన్నాని వారికి చెప్పాడు. అతడు ఇంత హంగామా చేసినా.. అక్కడ ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడం విచిత్రం.
పాపం ఆ వ్యక్తి ప్రేమ ఫలించిందా? లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉండిపోయింది. అందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీరు ఆమె కోసం మోకరిల్లి ఉండాల్సిన అవసరం లేదని కొందరూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, మరికొందరు ఆమెకు నీ ప్రేమను పొందే అర్హత లేదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: తీరు మార్చుకోని చైనా! అది మా సార్వభౌమాధికారం అంటూ మంకుపట్టు)
Comments
Please login to add a commentAdd a comment