ex girlfriend
-
ప్రియునిపై తుపాకీ కాల్పులు
బనశంకరి: ప్రియడు మరో మహిళ మాయలో పడి తనకు దూరమయ్యాడనే కసితో ఓ యువతి తుపాకీతో కాల్పులు జరిపించింది. సినిమా రేంజ్లో జరిగిన సంఘటన బెళగావిలోనిది. ప్రేమికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.వివరాలు.. బెళగావి తిళకవాడి ద్వారకనగరవాసి ప్రణీత్‌కుమార్ (31), మెడికల్ రెప్‌గా పనిచేస్తాడు. బుధవారం రాత్రి మహంతేశనగర కేఎంఎఫ్ డైరీ వద్ద గల స్నేహితురాలు స్మిత ఇంటికి భోజనానికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా, మాజీ ప్రియురాలు అక్కడికి వచ్చింది. రాగానే ప్రణీత్‌తో గొడవకు దిగింది, స్మిత ఇద్దరికి సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. కానీ మాజీ ప్రియురాలు వెంట వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రణీత్‌ను కొట్టి, తుపాకీతో కాల్పులకు దిగారు. మొదట బుల్లెట్లు ప్రణీత్ చెవిపక్క నుంచి దూసుకెళ్లడంతో ఏమీ కాలేదు. దీంతో దుండగులు మళ్లీ కాల్పులకు అతని తొడలోకి తూటా దూసుకెళ్లింది. మళ్లీ కాల్చడానికి యత్నించగా తుపాకీ జామ్ కావడంతో నలుగురూ వెళ్లిపోయారు.పోలీసు కమిషనర్ ఆరారక్తపు మడుగులో పడిఉన్న ప్రణీత్‌ను స్మిత బిమ్స్ ఆసుపత్రికి తరలించి మాళమారుతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ప్రణీత్ నుంచి సమాచారం సేకరించారు. నగర పోలీస్ కమిషనర్ యడా మార్టీన్ ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. డీసీపీ రోహన్ జగదీశ్ ఘటనాస్థలిని పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. త్వరగా దుండగులను పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు. దుండగులు వాడిన గన్ గురించి దర్యాప్తు చేపడుతున్నామని, ప్రేమ గొడవలే కారణమని చెప్పారు. ప్రేమ గొడవ, తుపాకీ కాల్పుల వ్యవహారం నగరంలో కలకలం రేపింది. చిన్న చిన్న విషయాలకే తుపాకులను వాడడంపై నగరవాసులు సంభ్రమం వ్యక్తంచేశారు. -
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్‌తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్‌స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్‌తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్‌తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
ప్రేమించకపోతే దాడి చేస్తావా? ఇదేం పిచ్చి..?
ఇటీవల ప్రేమించకపోయినా లేదా ఏ కారణాల చేత ప్రేమ జంటలు విడిపోతే ఆ కథలు చివరికి చంపుకోవడంతో ముగింపు పలుకుతున్నాయి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్ చిన్న మనస్పర్థలకు వేరైతే ఎవ్వరి వారు ఉండాలి. లేదా ఆ వ్యక్తికి మనమనుసులో చోటు లేదని లైట్ తీసుకునేలా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ కక్ష పెంచుకుని ఏదో క్రిమినల్ మాదిరి స్పాట్ పెట్టి చంపేంత స్థాయికి దిగజారి కటకటలా పాలవ్వతున్నారు. దీనివల్ల ఇరువురు జీవితాలు కోల్పోవడమే గానీ ఏం యూజ్ ఉండుదు. అలాంటి దారుణ ఘటనే స్వీడిష్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అల్జరీయన్ వలసదారు 26 ఏళ్ల మహమ్మద్ అమనా, స్వీడిష్ గర్లఫ్రెండ్‌తో ఉండేవాడు. ఏమయ్యింది ఏమో కొన్నాళ్లుగా ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. దీన్ని అంగీకరించని మహమ్మద్ అమనా కక్షతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేసి మరీ మాజీ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఓ నిచ్చెన సాయంతో ఆమె అపార్ట్మెంట్లోకి నేరుగా వచ్చేశాడు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆ అపార్ట్మెంట్లో ఓ స్నేహితుడితో కలిసి ఉంటోంది. అక్కడ ఉన్న ఆమె స్నేహితుడి అమనాని రావద్దని అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో అమనా కోపంతో అతడిపైకి రాయితోటి, కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. ఈ మొత్తాన్ని అమనా మాజీ ప్రియురాలే రికార్డు చేసింది. ఈ దుశ్చర్య కారణంగా మహ్మద్ అమనాకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా స్వీడన్‌కి తిరిగి రాకుండా పదేళ్ల నిషేధంతో బహిష్కరించింది. అమనాకి ఈ శిక్ష మొదటిసారేం కాదు. ఐతే ఆ బహిష్కరణ అమనా విషయంలో అమలు కాకపోగా అతడు మళ్లీ ఇలాంటి అనేక కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవలే కోర్టు మళ్లీ అతనికి ఇదే తరహా శిక్ష విధించింది. మరీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..
సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో హీరో మోకాళ్లపై కూర్చోవడం చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో అలా కుదరదు. అంతగా అవసరమైతే నాలుగైదు సార్లు బతిమాలడం లేదా పెద్దవాళ్లను ఎవరినైనా పిలిపించి మాట్లాడించటం వంటివి చేస్తారు చాలామంది. కానీ ఇక్కడొక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బ్రేక్అప్ చెప్పి వెళ్లొద్దు అంటూ ఎంతగా వేడుకున్నాడంటే సినిమాలోని సీన్లను మించిపోయేలా చేశాడు. ఏకంగా ఆమె కోసం వర్షంలో 21 గంటల పాటు మెకాళ్ల పైనే ఉండిపోయాడు. ఎవరూ ఎంతగా చెప్పినా వినకుండా అలానే ఆమె కోసం వర్షంలో తడుస్తూ ఉండిపోయాడు. అసలేం జరిగిందంటే.. చైనాలోని ఓ వ్యక్తికి ప్రియురాలు బ్రేక్ అప్ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నిన్ను వదులుకోలేనంటూ ఆమెను ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆమె ప్రేమను ఎలాగైనా తిరిగి పొందాలనుకుని ఆమె పనిచేసే కార్యాలయానికి వెళ్లి.. చేతిలో పూల బొకేతో లవ్ ప్రపోజ్ చేసే భంగిమలో (మోకాళ్లపై) నుంచొని ఆమె కోసం ఆత్రంగా ఎదురు చూశాడు. ఇలా అతను మార్చి 28 మధ్యాహ్నం 1 గంటకు అనగా నిలబడ్డ వ్యక్తి ఆ మరుసటి రోజు ఉదయ 10 గంటల వరకు జోరు వానలో అలానే మోకాళ్లపై ఉండిపోయాడు. ఎవరూ ఎంత చెప్పినా ససేమిరా అన్నాడు. ఆఖరికి పోలీసులు రంగంలోకి దిగినా.. విరమించి లేవడానికి అస్సలు ఒప్పుకోకపోగా, ఇది చట్ట విరుద్ధం కాకపోతే నన్ను వదిలేయండి అని పోలీసులను అభ్యర్థించాడు. తన మాజీ ప్రియురాలు తనతో విడిపోయిందని, క్షమాపణలు కోరుతూ ఇలా ఉన్నాని వారికి చెప్పాడు. అతడు ఇంత హంగామా చేసినా.. అక్కడ ఎక్కడా ఆమె జాడ కనిపించకపోవడం విచిత్రం. పాపం ఆ వ్యక్తి ప్రేమ ఫలించిందా? లేదా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉండిపోయింది. అందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు మీరు ఆమె కోసం మోకరిల్లి ఉండాల్సిన అవసరం లేదని కొందరూ అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు, మరికొందరు ఆమెకు నీ ప్రేమను పొందే అర్హత లేదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: తీరు మార్చుకోని చైనా! అది మా సార్వభౌమాధికారం అంటూ మంకుపట్టు) -
మాజీ ప్రేయసితో ఎలాన్ మస్క్ ఫోటోలు, గిఫ్ట్స్ వేలం: వైరల్
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ఎలాన్ మస్క్ ఫోటోలు, బహుమతుల వేలం అంశం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్ పాత బహుమతులను, ఫోటోలను వేలానికిపెట్టింది. జంటగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, కార్డులు, ఇతర దాదాపు 20 అంశాలను అమ్మకానికి పెట్టడం గమనార్హం. RR వేలం వెబ్సైట్లో లిస్ట్ అయిన ఈ వేలం సెప్టెంబర్ 14న ముగియనుంది. ఫోటోలతో పాటు, తన మాజీ ప్రియుడు, బిలియనీర్ మస్క్ సంతకం చేసిన పుట్టినరోజు కార్డును కూడా విక్రయిస్తోంది, 'హ్యాపీ బర్త్ డే బూ-బూ' లవ్ ఎలోన్" అని రాసి కార్డును ఆక్షన్కిపెట్టింది. మస్క్ 20 ఏళ్ల వయసులో జంటగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్ బిల్లుఈ వేలంలో అమ్మకానికి ఉన్నాయి. అలాగే పుట్టిన రోజున గ్విన్‌కి మస్క్ ఇచ్చిన 14కే గోల్డ్ నెక్లెస్‌ను కూడా విక్రయిస్తోంది. అలాగే మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా 1995లో గ్విన్‌కి మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ఇప్పటికే 1,300 డాలర్లకు చేరుకుంది. దీని అంచనా విలువ 10వేల డాలర్లు. ప్రస్తుతం డాలర్ బిల్‌పై వేలం జోరుగానే నడుస్తోంది. ఇది 5వేల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మస్క్ ఈ వేలం వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. కాగా గ్విన్ తన సవతి కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈ వస్తువులను వేలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో అతనితో కలిసి నివసిస్తోంది. మస్క్ 1994 చివరిలో గ్విన్‌కి ఈ కార్డుతోపాటు బంగారు హారాన్ని ఇచ్చాడు. మస్క్ , గ్విన్ 1994-1995లో డేటింగ్ చేశారు. -
పెళ్లైన రెండో రోజే.. మాజీ ప్రియురాలి చేతిలో ప్రియుడి హత్య.. ఎందుకంటే?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఓ 26 ఏళ్ల యువకుడిని తన మాజీ ప్రియురాలు హత్య చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సిహోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్జీ గ్రామంలో నివసిస్తున్న సోను పటేల్‌కు మే 14న వివాహం జరిగింది. అయితే పెళ్లైన రెండు రోజుల తరువాత సెల్‌ఫోన్ బాగుచేయించడానికి వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.’’ అని పోలీసులు తెలిపారు. కాగా విచారణ చేపట్టిన పోలీసులు మధు అనే అమ్మాయితో అతడికి ఎఫైర్ ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. మే 16న సోనుని రాళ్లతో కొట్టి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. సోను తనకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను చిత్రీకరించాడని, దానిని తన కుటుంబ సభ్యులకు చూపించడంతో ఆమె పెళ్లి చెడిపోయినట్టు పేర్కొన్నారు. ఇక సోనును వివాహం చేసుకోవాలి అనుకున్నట్టు మధు తెలిపిందని అన్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది వెల్లడించారు. చదవండి: వైరల్: ఫుట్‌బాల్ ఆట మధ్యలో పారాచూట్‌తో దూకేసిన వ్యక్తి.. ఆపై చదవండి: కురుక్షేత్ర యుద్ధంలో ఈటల పాత్ర ఏంటో చెప్పాలి? -
ప్రతి ఏటా మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో బిల్ గేట్స్ టూర్
వాషింగ్టన్: నాలుగు రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ ఆశ్చర్యకరమైన వార్త ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. ఏంటంటే బిల్ గేట్స్ ఏటా తన మాజీ గర్ల్ ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్తారట. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దీని గురించి మిలిందా గేట్స్‌కు కూడా తెలుసట. ఆ వివరాలు.. మిలిందాతో వివాహానికి ముందు బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ అనే మహిళను ప్రేమించారట. కానీ ఆ తర్వాత మిలిందాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిల్ గేట్స్ వివాహానికి ముందే దీని గురించి మిలిందాతో చెప్పాడట. ప్రతి ఏటా వసంత కాలంలో తాను అన్ విన్‌బ్లాడ్‌తో టూర్ వెళ్తానని తెలిపాడట. అందుకు మిలిందా కూడా అంగీకరించింది అని సమాచారం. ఇక బిల్ గేట్స్, అన్ విన్‌బ్లాడ్ ప్రతి ఏటా వసంత కాలంలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని బీచ్ కాటేజ్‌లో ప్రైవేట్ సమయాన్ని గడపడానికి వెళ్తారు. దీనిపై విన్‌బ్లాడ్ స్పందిస్తూ "మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయోటెక్నాలజీ మీద ఆసక్తి ఉన్న ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం లాంటిది. ఈ టూర్లో మేం మా గురించి, ప్రపంచం గురించి చర్చించుకునేవాళ్లం. ఇక మిలిందా బిల్‌గేట్స్‌కు అన్ని విధాల తగిన భార్య" అన్నారు. ది పోస్ట్ ప్రకారం, ఆన్ విన్‌బ్లాడ్, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ ప్రైవేట్ పరిశోధకుడైన ఎడ్వర్డ్ అలెక్స్ క్లీన్ను వివాహం చేసుకుంది. అతను నేరాలు, మోసం, పౌర హక్కుల కేసులను విచారించే ‘అలెక్స్ క్లైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ సర్వీస్’ యజమాని. విన్‌బ్లాడ్ ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థాపకురాలు. 1997లో టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. "విన్‌బ్లాడ్ నా కన్న ఐదేళ్లు పెద్దది. మిలిందాతో నా వివాహం గురించి ముందుగా విన్బ్లాడ్కే చెప్పాను. తన అంగీకరంతోనే నేను మిలిందాను వివాహం చేసుకున్నాను. విన్‌బ్లాడ్‌ను ప్రతి ఏటా ఒక్కసారి కలుస్తానని వివాహానికి ముందే మిలిందాకు చెప్పాను. తను కూడా అంగీకరించిది" అని బిల్‌గేట్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: బిల్ గేట్స్ సంచలన ప్రకటన: భార్యతో విడాకులు! -
బాక్సర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ అనుమానాస్పద మృతి..
లాస్ఏంజెల్స్ : మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మెవెదర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జోసీ హారిస్ సబర్బన్ లాస్ఏంజెల్స్లోని తన నివాసంలో మరణించారు. మెవెదర్తో ముగ్గురు సంతానం కలిగిన జోసీ హారిస్ (40) తన ఇంట్లోనే వాక్వేలోని ఓ వాహనంలో విగతజీవిగా పడిఉన్నారని లాస్ఏంజెల్స్ కౌంటీ షరీఫ్ అలెక్స్ విలెనువా వెల్లడించారు. ఆమె మృతిపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. 2010లో మెవెదర్ హారిస్‌ను తీవ్రంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. తాను హారిస్‌పై చేయిచేసుకున్నానని, ఆమె చేతిని మెలితిప్పానని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించాడు. గృహ హింస ఆరోపణలపై రెండు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో డ్రగ్స్ తీసుకున్న హారిస్‌ను నియంత్రించేందుకే తానలా చేశానని వివరణ ఇచ్చుకున్నాడు. ఇక హారిస్ 2015లో మెవెదర్పై పరువునష్టం దావా వేశారు. చదవండి : షరపోవా.. అన్‌స్టాపబుల్ -
ఆన్లైన్లో నగ్నఫొటో: పోస్ట్ చేసింది మరో మహిళే!
ఇద్దరు మహిళలు.. ఇద్దరి వయసూ ఇప్పుడు 45 ఏళ్లే. వాళ్లిద్దరూ కలిసి గతంలో సహజీవనం చేశారు. కానీ ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత వాళ్లలో ఒక మహిళ మరొకరి నగ్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! ఆ రెండో మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేరానికి పాల్పడిన మహిళకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇద్దరు మహిళలూ ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలోని పాథాలజీ విభాగంలో పనిచేసేవారు. దాదాపు దశాబ్దం పాటు ఇద్దరి మధ్య సంబంధం ఉండేది. ఇలాంటి కేసు తమ వద్ద నమోదు కావడం ఇదే మొదటిసారిన ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరిలో ఒక మహిళకు ముందే పెళ్లయిందని, అయితే భర్తతో విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ దగ్గరయ్యారని చెప్పారు. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత.. గత రెండేళ్లుగా ఆమె ఫేస్బుక్ పేజీ ద్వారా తన నగ్న ఫొటోలను పంపుతున్నట్లు బాధితురాలు గుర్తించారు. చివరకు ఆమె వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా తన నగ్నఫొటోలే వాడుతున్నట్లు గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించారు. దానిపై తాను ఆమెతో గొడవ పడ్డానని, అయితే దానికి బాత్రూంలో ఉన్నప్పుడు ఆ ఫొటోలు తీసుకున్నట్లు చెప్పిందని అన్నారు. దానిపై ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని, ఆ తర్వాత ఆమె తన ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇంత చేసినా తాను ఎలాంటి నేరం చేయలేదనే చెబుతోందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు తీసుకెళ్లగా, అక్కడ నిందితురాలికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.