ఆన్‌లైన్‌లో నగ్నఫొటో: పోస్ట్ చేసింది మరో మహిళే! | woman posts nude photos of ex girlfriend online, arrested | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో నగ్నఫొటో: పోస్ట్ చేసింది మరో మహిళే!

Feb 28 2017 11:54 AM | Updated on Sep 5 2017 4:51 AM

ఆన్‌లైన్‌లో నగ్నఫొటో: పోస్ట్ చేసింది మరో మహిళే!

ఆన్‌లైన్‌లో నగ్నఫొటో: పోస్ట్ చేసింది మరో మహిళే!

ఇద్దరు మహిళలు.. ఇద్దరి వయసూ ఇప్పుడు 45 ఏళ్లే. వాళ్లిద్దరూ కలిసి గతంలో సహజీవనం చేశారు. కానీ ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత వాళ్లలో ఒక మహిళ మరొకరి నగ్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు!

ఇద్దరు మహిళలు.. ఇద్దరి వయసూ ఇప్పుడు 45 ఏళ్లే. వాళ్లిద్దరూ కలిసి గతంలో సహజీవనం చేశారు. కానీ ఇప్పుడు విడిపోయారు. ఆ తర్వాత వాళ్లలో ఒక మహిళ మరొకరి నగ్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు! ఆ రెండో మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేరానికి పాల్పడిన మహిళకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఇద్దరు మహిళలూ ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రిలోని పాథాలజీ విభాగంలో పనిచేసేవారు. దాదాపు దశాబ్దం పాటు ఇద్దరి మధ్య సంబంధం ఉండేది. ఇలాంటి కేసు తమ వద్ద నమోదు కావడం ఇదే మొదటిసారిన ముంబై పోలీసు విభాగానికి చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరిలో ఒక మహిళకు ముందే పెళ్లయిందని, అయితే భర్తతో విడిపోయిన తర్వాత వీళ్లిద్దరూ దగ్గరయ్యారని చెప్పారు. ఆరు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత.. గత రెండేళ్లుగా ఆమె ఫేస్‌బుక్ పేజీ ద్వారా తన నగ్న ఫొటోలను పంపుతున్నట్లు బాధితురాలు గుర్తించారు. 
 
చివరకు ఆమె వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా తన నగ్నఫొటోలే వాడుతున్నట్లు గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించారు. దానిపై తాను ఆమెతో గొడవ పడ్డానని, అయితే దానికి బాత్రూంలో ఉన్నప్పుడు ఆ ఫొటోలు తీసుకున్నట్లు చెప్పిందని అన్నారు. దానిపై ఇద్దరి మధ్య గొడవ అయ్యిందని, ఆ తర్వాత ఆమె తన ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇంత చేసినా తాను ఎలాంటి నేరం చేయలేదనే చెబుతోందని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు తీసుకెళ్లగా, అక్కడ నిందితురాలికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement