Elon Musk Ex Girlfriend Auctioning Her Relationship Gifts And Photos, Details Inside - Sakshi
Sakshi News home page

మాజీ ప్రేయసితో ఎలాన్‌ మస్క్‌  ఫోటోలు, గిఫ్ట్స్‌ వేలం: వైరల్

Published Wed, Aug 24 2022 12:31 PM | Last Updated on Wed, Aug 24 2022 1:28 PM

Elon Musk Ex Girlfriend Auctions Off Relationship Mementos and gifts - Sakshi

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, ఎలాన్‌ మస్క్‌ ఫోటోలు, బహుమతుల వేలం అంశం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్  పాత బహుమతులను, ఫోటోలను వేలానికిపెట్టింది. జంటగా ఇద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, కార్డులు, ఇతర  దాదాపు 20 అంశాలను  అమ్మకానికి పెట్టడం గమనార్హం. RR వేలం వెబ్‌సైట్‌లో  లిస్ట్‌ అయిన ఈ వేలం సెప్టెంబర్ 14న ముగియనుంది.

ఫోటోలతో పాటు, తన మాజీ ప్రియుడు, బిలియనీర్‌ మస్క్ సంతకం చేసిన పుట్టినరోజు కార్డును కూడా విక్రయిస్తోంది, 'హ్యాపీ బర్త్ డే బూ-బూ' లవ్ ఎలోన్" అని రాసి  కార్డును ఆక్షన్‌కిపెట్టింది. మస్క్  20 ఏళ్ల వయసులో  జంటగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, మస్క్ సంతకం చేసిన 1 డాలర్‌  బిల్లుఈ వేలంలో అమ్మకానికి ఉన్నాయి.  అలాగే పుట్టిన రోజున గ్విన్‌కి  మస్క్ ఇచ్చిన  14కే గోల్డ్ నెక్లెస్‌ను కూడా విక్రయిస్తోంది. అలాగే మస్క్‌ రూంలో  స్నేహితులతో కలిసినవి,  పెన్సిల్వేనియా  విశ్వవిద్యాలయ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. 

ముఖ్యంగా 1995లో గ్విన్‌కి మస్క్ ఇచ్చిన పుట్టినరోజు కార్డు వేలం ఇప్పటికే 1,300 డాలర్లకు చేరుకుంది. దీని అంచనా విలువ 10వేల డాలర్లు. ప్రస్తుతం డాలర్‌ బిల్‌పై వేలం జోరుగానే నడుస్తోంది.  ఇది  5వేల డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మస్క్‌ ఈ వేలం  వ్యవహారంపై ఇంకా స్పందించలేదు.

కాగా గ్విన్ తన సవతి కొడుకు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించడానికి ఈ వస్తువులను వేలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో అతనితో కలిసి నివసిస్తోంది. మస్క్ 1994 చివరిలో గ్విన్‌కి ఈ కార్డుతోపాటు  బంగారు హారాన్ని ఇచ్చాడు. మస్క్ , గ్విన్ 1994-1995లో డేటింగ్ చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement