
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్‌గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు.
మస్క్ 2022లో ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్‌ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చారు. ట్విట్టర్‌కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్‌తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్‌ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది.
Comments
Please login to add a commentAdd a comment