RR
-
KKR vs RR: రాయల్స్ జట్టును ముంచేసిన వర్షం
-
RR vs PBKS: రాజస్తాన్ ఇలా అయితే.. ఎలా?
-
RR vs PBKS: పంజాబ్‌పై రాజస్తాన్ గెలిస్తే!
-
CSK vs RR: గెలిచేదెవరు?
-
వాటే మ్యాచ్.. ఆఖరి బంతికి రాయల్స్‌పై రైజర్స్ గెలుపు
-
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
-
రాయల్స్ రాజసమా? లక్నో సూపర్ షోనా.
-
రోలర్ కోస్టర్: ఆఖరి బంతికి కేకేఆర్‌పై రాజస్తాన్ గెలుపు
-
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
SRH పై వార్నర్ పాజిటివ్ ట్వీట్..కావ్య మారన్ పై ఫ్యాన్స్ ఫైర్
-
IPL 2023: ఇదొక్కటి! బ్యాటర్‌కు దిమ్మతిరిగింది.. అంతేనా ఆఖర్లో రెండు సిక్సర్లు!
IPL 2023- Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్-2023లో తొలి మ్యాచ్‌లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానంలో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ రాజస్తాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల మెరుపులు పెద్దగా లేకపోయినా.. రైజర్స్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మాత్రం అదరగొట్టాడు. ఈ టీమిండియా స్పీడ్‌స్టర్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 32 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజస్తాన్ బ్యాటర్లు దేవ్‌దత్ పడిక్కల్(2)ను అద్భుత డెలివరీతో బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పదిహేనో ఓవర్లో సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన ఉమ్రాన్ దెబ్బకు వికెట్ ఎగిరి పడింది. దీంతో బ్యాటర్ పడిక్కల్ విస్మయానికి లోనుకగా.. ఉమ్రాన్ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఇక బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఉమ్రాన్.. ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఐపీఎల్-2023 సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ స్కోర్లు: టాస్: సన్‌రైజర్స్- బౌలింగ్ రాజస్తాన్ రాయల్స్- 203/5 (20) ఎస్ఆర్హెచ్- 131/8 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(22 బంతుల్లో 54 పరుగులు) చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి.. .@umran_malik_01 doing Umran Malik things! 👍 Relive how he picked his first wicket of the #TATAIPL 2023 👇#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF — IndianPremierLeague (@IPL) April 2, 2023 -
IPL 2023: హౌస్ ఫుల్.. జోష్ నిల్.. చీర్ గర్ల్స్‌కు పెద్దగా పనేలేకుండా పోయింది!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యనగరంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇరు జట్లలోనూ భారత స్టార్ ఆటగాళ్లెవరూ లేకపోయినా స్టేడియం దాదాపుగా నిండిపోవడం విశేషం. హెచ్‌సీఏ అధికారిక లెక్క ప్రకారం 37,731 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆదివారం కావడం, నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో మైదానానికి తీసుకొచ్చాయి. మిట్టమధ్యాహ్నం తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా వారంతా స్టేడియంలోకి అడుగు పెట్టారు. కాగా.. సన్‌రైజర్స్ అభిమానులకు మాత్రం సరైన ఆనందం దక్కలేదు. పేలవమైన ఆట తీరుతో భారీ పరాజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ తగిన వినోదాన్ని అందించలేకపోయింది. అందుకే చాలా మంది అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపించింది. ఇన్నింగ్స్ మొత్తంలో రైజర్స్ బ్యాటర్లు 8 ఫోర్లు, 5 సిక్స్‌లు మాత్రమే కొట్టడంతో ఫ్యాన్స్‌కే కాదు, చీర్ గర్ల్స్‌కు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆరంభంలో రాజస్తాన్ ప్లేయర్లు కొట్టిన మెరుపు షాట్లే కాస్త చప్పట్లు కొట్టేలా చేశాయి. వచ్చే ఆదివారం కూడా మరో మ్యాచ్ హైదరాబాద్‌లోనే ఉంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆ పోరులోనైనా లోకల్ ఫ్యాన్స్ సంబరపడే క్షణాలు వస్తాయేమో చూడాలి. -
SRHvsRR : హైదరాబాద్‌పై రాజస్థాన్ ఘన విజయం (ఫొటోలు)
-
IPL 2023: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
రైనాకు హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. కారణం ఇదే అంటున్న కుమార సంగక్కర
జైపూర్: భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా.. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనాకు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం హ్యాండిచ్చింది. అయితే, ఐపీఎల్‌కు రైనాకు సూపర్ రికార్డుల ఉన్నప్పటికీ వేలంలో మాత్రం అమ్ముడుపోకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, రైనా 2020 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఇక 2021 సీజన్లో మొదటి మ్యాచ్ ఆడిన రైనా ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో వేలంలో ఆ ప్రభావం కనిపించింది. రైనాను కొనుగోలు చేయకపోవడంపై రాజస్థాన్ జట్టు కోచ్ కుమార సంగక్కర స్పందిస్తూ.. రైనాపై ఆసక్తి చూపించకపోవడంపై ఎన్నో కారణాలు ఉండొచ్చన్నాడు. సుదీర్ఘ కేరీర్లో కాలం గడిచే కొద్ది ప్లేయర్స్ ఆటలో మార్పులు వస్తాయన్నారు. యువ ఆటగాళ్లు సైతం రాణించడంతో ఫ్రాంచైజీలు వారిపై ఫోకస్ పెడుతున్నాయని అన్నాడు. రైనాకి ఐపీఎల్లో మంచి రికార్డులు ఉన్నాయన్నాడు. అతను లెంజడరీ క్రికెటర్ అయినప్పటికీ సీజన్లో అతని ఆటతీరును బట్టే కొనుగోలు చేయలేదన్నాడు. మంచి ప్రదర్శన చేసిన వారిపైనే కోచ్‌లు, ఫ్రాంచైజీల ఫోకస్ ఉంటుదన్నారు. -
కమిన్స్ నాపై సులభంగా గెలిచాడు : స్మిత్
దుబాయ్ : క్రికెట్లో ఒక జట్టులో ఉండే ఆటగాళ్లు ప్రత్యర్థులుగా కనబడితే ఆ మజా వేరుగా ఉంటుంది. అది అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సాధ్యం కాదు గాని.. ఐపీఎల్ లాంటి లీగ్‌లో మాత్రం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. మన టీమిండియా జట్టుగా ఉన్నప్పుడు అందరిని ఒకే దృష్టితో చూసే మనం ఐపీఎల్‌కు వచ్చేసరికి మాత్రం ఎవరికి వారు తమకు నచ్చిన ఆటగాడిని ఇష్టపడుతూ మిగతావారిని ప్రత్యర్థులుగానే చూస్తాం. ఈ విధంగా చూస్తే ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూశాం. ఉదాహరణకు బుమ్రా కోహ్లికి బౌలింగ్ చేయడం.. అశ్విన్ క్యారమ్ బాల్స్‌తో రోహిత్‌ను కట్టడి చేయడం.. వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇది ఒక్క భారత ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. (చదవండి : నిబంధన ఉల్లంఘించిన రాబిన్ ఊతప్ప) ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌లు కొన్నేళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో ఇప్పుడు కేకేఆర్, రాజస్తాన్‌కు ఆడుతున్నారు. తాజాగా బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ లక్ష్య చేధనలో తడబడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కమిన్స్ తాను వేసిన తొలి ఓవర్లోనే స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాట్ కమిన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. 'మ్యాచ్‌లో కమిన్స్‌తో జరిగిన యుద్ధంలో అతను నాపై చాలా సులభంగా గెలిచాడు. నా ఔట్‌పై ఇంతకముందే కమిన్స్‌తో మాట్లాడా.. ప్రాక్టీస్‌లో అన్ని మంచి బంతులే ఉండొచ్చు.. కానీ అందులో నిన్ను అవుట్ చేసే బంతి కూడా ఒకటి ఉంటుందని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రతీ మ్యాచ్ గెలవాలని లేదు కదా.. ఇలా ఎదురుదెబ్బలు తిన్నప్పుడే.. మా లోపాలు ఏంటనేవి బయటపడుతాయి. మా బ్యాటింగ్‌లో కొన్ని చోట్ల ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకొని కేకేఆర్‌ను మా బౌలింగ్‌తో కట్టడి చేద్దామని అనుకున్నాం.. అప్పటికీ మా బౌలర్లు దానిలో కొంచెం సఫలీకృతంగానే కనిపించారు. కానీ చేధనలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఓడిపోవాల్సి వచ్చింది. మాలో కొంతమంది ఇప్పటికీ మేము షార్జాలో ఆడుతున్నామని అనుకున్నాము. కానీ దుబాయ్‌లో మైదానం ఇరువైపులా ఒకేలా లేదు. ఒకవైపై బౌండరీ కాస్త దూరంగా.. మరోవైపు కొంచెం దగ్గరగా అనిపించాయి. మ్యాచ్‌లో కీలక క్యాచ్‌లను విడవడం కూడా మా ఆటతీరుపై ప్రభావం చూపిందంటూ ' తెలిపాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 3న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. (చదవండి : ఐపీఎల్ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?) -
రాజస్తాన్ పై చెన్నై‘సూపర్’ విజయం
-
నైట్‌రైడర్స్ నాలుగో విజయం
-
రాజస్తాన్ రాయల్స్ ఓటమి
-
చావ్లా సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో అదరగొట్టాడు
-
రాజస్తాన్‌పై కోల్‌కతా విజయం
-
చెన్నైపై తడాఖా.. ఇదే నా బెస్ట్: బట్లర్
జైపూర్: ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగే అంటున్నాడు జోస్ బట్లర్. ఐపీఎల్ 2018లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్ఫెక్ట్ ఇన్నింగ్స్(60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు.. 95 పరుగులు) ఆడి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్అని, భార్య చూస్తుండగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. (చదవండి: ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ) నమ్మకాన్ని నిలబెట్టా: బేసిగ్గా నేను మిడిలార్డర్లో వచ్చేవాడిని. ఇప్పుడు ఓపెనర్ పాత్రను బాగా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను పైకి పంపాలన్న నిర్ణయం కోచ్ షేన్ వార్న్‌దే. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. చెన్నైపై ఆడటం అంతసులువేమీకాదు. చివరిదాకా నిలబడి, జట్టును గెలిపించడం ఆనందంగా ఉంది. ఇది(60 బంతుల్లో 95) నా బెస్ట్ ఇన్నింగ్స్’’ అని బట్లర్ చెప్పాడు. (బట్లర్ వీరబాదుడు హైలైట్స వీడియో కింద చూడొచ్చు) ఆమె ముందుర..: ‘‘ప్రస్తుతం నా భర్య ఇండియాలోనే ఉంది. అత్తమామలు, కజిన్ కూడా తనతో మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఆమె ముందర బెస్ట్ ఇన్నింగ్స ఆడటం, గెలవడం మర్చిపోలేని అనుభూతి. ప్రపంచంలోనే బెస్ట్ టోర్నీ ఐపీఎల్. ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో దొరుకుతుంది..’’ అని పేర్కొన్నాడు. మ్యాచ్ రిపోర్ట్: వరుసగా రెండో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్... ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసును రసవత్తరంగా మార్చింది. పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (60 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సురేశ్ రైనా (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు ఓపెనర్ వాట్సన్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (23 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. -
ధోనీ ఆగ్రహం.. ఓటమిపై వివరణ
జైపూర్: తప్పంతా బౌలర్లదేనని మండిపడ్డాడు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. బౌలింగ్‌కు సంబంధించి పక్కాగా వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫలమయ్యారని, అందుకే ఓడిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఐపీఎల్ 2018లో భాగంగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకోవాలన్న కెప్టెన్ అభీష్టానికి వ్యతిరేకంగా చెన్నై యాజమాన్యం బ్యాంటింగ్‌కు మెగ్గుచూపడంపైనా పలురకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకటి చెబితే.. ఇంకోటి చేశారు: ‘‘ఖచ్చితంగా బౌలర్ల వల్లే ఓడిపోయాం. పర్టికులర్ లెన్త్‌లో బౌలింగ్ చేస్తే ఫలితం దక్కేది. కానీ అలా జరగలేదు. ఫలానా ఏరియాలోనే బంతులు విసరాలని చెబితే మా వాళ్లు ఇంకోటి చేశారు. వ్యూహాన్ని అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యాం. నిజానికి ఇది(176) డిఫెండబుల్ స్కోరే. విజయాన్ని మా నుంచి దూరం చేసింది బౌలర్లే’’ అని ధోనీ అన్నాడు. చివర్లో ధోనీ తీవ్ర అసహనం: మిస్టర్ కూల్‌గా పేరున్న కెప్టెన్ ధోని... రాజస్తాన్ ఇన్నింగ్స్ చివర్లో ఆగ్రహానికి గురయ్యాడు. 19వ ఓవర్లో విల్లీ 2 సిక్స్‌లు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశాడు. 20వ ఓవర్లో బట్లర్ షాట్ కొట్టగా బంతి చాలాసేపు గాల్లో నిలిచింది. అయినా ఫీల్డర్లెవరూ అందుకోవడానికి రాకపోవడంతో ధోని ‘ఏంటిది?’ అన్నట్లు చూశాడు. రాయల్స్ గెలుపు పరుగును నియంత్రించడంలోనూ ఫీల్డర్లు స్పందించిన తీరు అతడికి ఆగ్రహం తెప్పించింది. (లాస్ట్ ఓవర్ వీడియోను కింద చూడొచ్చు) అంతకు ముందు బట్లర్ ఇచ్చిన మూడు క్యాచ్‌లనూ బౌలర్లు నేలపాలు చేశారు. అయితే మ్యాచ్ అనంతరం మాత్రం ధోనీ ఫీల్డింగ్ వైఫల్యాలపై పెద్దగా మాట్లాడలేదు. బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా: టాస్ గెలిచిన తర్వాత కామెంటేటర్‌తో ధోనీ మాట్లాడుతూ.. ‘‘మాకొక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, కోచ్ సూచనల ప్రకారం తొలుత బ్యాటింగ్ చేస్తాం’’ అని చెప్పాడు. కాగా, టాస్ నెగ్గితే ఫీల్డింగ్ ఎంచుకుందామని ధోనీ వాదించినట్లు, సీఎస్కే ఎగ్జిక్యూటివ్ కమిటీ ధోనీ వాదనతో విబేధించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. టాస్ సమయంలో ధోనీ వ్యాఖ్యలను బట్టి వాగ్వాదం నిజమై ఉంటుందని, తొలుత బ్యాటింగ్ దిగడం తప్పేనని సీఎస్కే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ రిపోర్ట్: వరుసగా రెండో గెలుపుతో రాజస్తాన్ రాయల్స్... ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసును రసవత్తరంగా మార్చింది. పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంతగడ్డపై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (60 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సురేశ్ రైనా (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకానికి తోడు ఓపెనర్ వాట్సన్ (31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (23 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. -
చివర్లో ధోనీ తీవ్ర అసహనం
-
మొండి బకాయిలపై వాణిజ్య కొరడా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించే క్రమంలో మొండి బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ సిద్ధమవుతోంది. జిల్లాలో కోటి రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో వీటి వసూలుకు అవసరమైతే కఠిన చర్యల కొరడా ఝుళిపించేందుకు.. రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్టు ద్వారా ఆస్తుల జప్తునకు సైతం సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ పద్ధతి ఎప్పటినుంచో అమల్లో ఉన్నా వ్యాపారుల పట్ల మానవతా దృక్పథంతో ఇన్నాళ్లూ వేచి చూసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖకు శ్రీకాకుళం, రాజాం, కాశీబుగ్గ (పలాస), నరసన్నపేటల్లో నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని శ్రీకాకుళం, గార ప్రాంతాల్లో 20 నుంచి 30 ఏళ్ల క్రితం వివిధ వర్గాల వ్యాపారులు సుమారు రూ.30 లక్షల పన్నులు బకాయి పడ్డారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. కోటి వరకు బకాయి ఉన్నట్టు తెలిసింది. బకాయిదారుల జాబితా లో నష్టాలబాట పట్టి పన్ను ఎగ్గొట్టిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయిన వారూ ఉన్నారు. విచిత్రమేమిటంటే పన్ను ఎగ్గొట్టినవారిలో బడా కాంట్రాక్టర్లతో పాటు సినిమా థియేటర్ల యజమానులు కూడా ఉన్నారు. అప్పట్లో ‘నిల్ రిటర్న్స్’ చూపించినా ఎప్పటికైనా పన్ను కట్టకపోతారా అని అధికారులు ఎదురుచూశారు. 2005కు ముందు వార్షిక టర్నోవర్ పేరిట ఏడాది కాలానికి ఒకసారే అసెస్మెంట్ సమర్పించేవారు. దీనివల్ల వ్యాపారులు పన్ను ఎగ్గొట్టినా మరుసటి ఏడాది మార్చి అంతానికి మాత్రమే అధికారులకు తెలిసేది. ఇలా చాలా కాలంగా జరుగుతుండడంతో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. ఆర్ఆర్ అస్త్రం ప్రయోగం పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసుకునేందుకు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను తెరమీదకు తెచ్చారు. వ్యాపారులు ఏ ప్రాంతానికి చెందినవారో చూసి ఆ ప్రాంత రెవెన్యూ, పోలీస్, సబ్ రిజిస్ట్రార్లకు వారిపై ఫిర్యాదులిస్తున్నారు. విచారణ అనంతరం వ్యాపారుల ఆస్తులను జప్తు చేసుకునేందుకు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపారం చేసి పన్ను ఎగ్గొట్టి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయిన వ్యాపారుల వివరాలు కూడా సేకరిస్తున్నామని, నిబంధనల ప్రకారం చ ర్యలు తప్పవని వాణిజ్యపన్నులశాఖ శ్రీకాకుళం సర్కిల్ సీటీవో డా.పి.శైలజారాణి ‘సాక్షి’కి వివరించారు. వ్యాపారుల నుంచి సెక్యూరిటీ బాండ్లు డిపాజిట్ కింద తీసుకున్నప్పటికీ.. వారు బకాయి పడ్డ మొత్తాని కంటే ఈ బాండ్ల విలువ తక్కువగా ఉందని అంటూ, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామన్నారు. భారీ లక్ష్యం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖపై భారీగా లక్ష్యాలను మోపుతోంది. రెవెన్యూ విభాగం ఉన్న ఈ శాఖకు గత ఏడాది మీద 20 నుంచి 30 శాతం ఎక్కువ ఆదాయం లక్ష్యంగా నిర్దేశించిందని అధికారులు తెలిపారు. గత ఏడాది జూలైలో రూ.1.95 కోట్ల రెవెన్యూ సాధించగా శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఈ డాది జూలై 31నాటికి రూ.2.30 కోట్లు సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రూ.7.5 లక్షల నుంచి రూ.50 లక్షల వ్యాపారం చేసే వారిపై టర్నోవర్ టాక్స్ (టీవోటీ), ఏడాదికి సగటున రూ.7.5 లక్షలు చేసే వ్యాపారులు వ్యాట్ పరిధిలోకి వస్తారు. అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న వారిని అసలు పన్ను చెల్లింపు పరిధిలోనే లేకుండా ప్రభుత్వం చట్టం తెచ్చింది. గతంలో ఉన్న ఏపీజీఎస్టీ స్థానంలో ఏపీ వ్యాట్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 300 మంది కాంట్రాక్టర్లు, 100మంది ధాన్యం/బియ్యం వ్యాపారులు సహా మొత్తం 1300 మంది వ్యాపారులు గుర్తింపు పొందారు. వాస్తవానికి ప్రస్తుతం అన్ని వ్యాపార లావాదేవీలను ప్రభుత్వం ఆన్లైన్ చేసేసింది. జూన్ రెండో తేదీన నుంచి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడటంతో ఇరు రాష్ట్రాల పరిధిలో కొనుగోలు/అమ్మకాలు జరిపిన వ్యా పారుల సంఖ్య తక్కువే. ఇటువంటి వారిని ‘స్టేట్ సేల్ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్’ కింద పరిగణించే అవకాశం ఉంది. విజయవాడ వంటి పెద్ద నగరాల్లోనే ఈ తరహా వ్యాపారులుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ఏడాది పన్ను వసూళ్లు కాస్త తగ్గుతాయని భావిం చినా అందుకు భిన్నంగా రూ.2.30 కోట్లు సాధించడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే ఊపుతో గత ఆగస్టులో సాధించిన రూ.3కోట్ల రెవెన్యూను మించి ఈ ఏడా ది రూ.4కోట్లయినా వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. జోరందుకున్న ఆకస్మిక తనిఖీలు అక్రమ మార్గంలో సరుకులు తరలించే వ్యాపారులపై అధికారులు కన్నేశారు. చిలకపాలెం జంక్షన్ సహా మరికొన్ని చోట్ల తనిఖీలకు సిద్ధమయ్యారు. వే బిల్లులు లేకపోవడం, తక్కువ మొత్తంలో సరుకును చూపించడం లాంటి అక్రమాలపై కేసు లు నమోదు చేస్తున్నారు. నెలకు రూ.30 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఓ సీటీవో, ఓ డీసీటీవో, నలుగురు ఏసీటీవోలు రొటేషన్ పద్ధతిలో తనిఖీలు చేస్తున్నారు. సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నామని, అదనపు ఆదాయ సాధనపై ఇది ప్రభావం చూపిస్తోందని వాపోతున్నారు.