జైపూర్: భారత క్రికెట్ ప్లేయర్ సురేష్ రైనా.. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనాకు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం హ్యాండిచ్చింది. అయితే, ఐపీఎల్‌కు రైనాకు సూపర్ రికార్డుల ఉన్నప్పటికీ వేలంలో మాత్రం అమ్ముడుపోకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే, రైనా 2020 ఐపీఎల్ ఎడిషన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడలేదు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఇక 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడిన రైనా ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రమే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో వేలంలో ఆ ప్రభావం కనిపించింది.
రైనాను కొనుగోలు చేయకపోవడంపై రాజస్థాన్ జట్టు కోచ్ కుమార సంగక్కర స్పందిస్తూ.. రైనాపై ఆసక్తి చూపించకపోవడంపై ఎన్నో కారణాలు ఉండొచ్చన్నాడు. సుదీర్ఘ కేరీర్‌లో కాలం గడిచే కొద్ది ప్లేయర్స్ ఆటలో మార్పులు వస్తాయన్నారు. యువ ఆటగాళ్లు సైతం రాణించడంతో ఫ్రాంచైజీలు వారిపై ఫోకస్ పెడుతున్నాయని అన్నాడు. రైనాకి ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్నాయన్నాడు. అతను లెంజడరీ క్రికెటర్ అయినప్పటికీ సీజన్‌లో అతని ఆటతీరును బట్టే కొనుగోలు చేయలేదన్నాడు. మంచి ప్రదర్శన చేసిన వారిపైనే కోచ్‌లు, ఫ్రాంచైజీల ఫోకస్ ఉంటుదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment