
సాక్షి, ఉప్పల్: నేటి నుంచి ఐపీఎల్ సీజన్-18 ప్రారంభం కానుంది. ఇక, రేపు హైదరాబాద్ వేదికగా రాజస్థాన్, SRH మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. ఐపీఎల్ సందడి వేళ ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. మ్యాచ్ టికెట్స్ కోసం ఎగబడతారు. కానీ, కొందరు మాత్రం మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో అమ్మడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేపు జరగబోయే RR Vs SRH మ్యాచ్ టికెట్లను ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తి అమ్మడం కలకలం రేపింది.
మెట్రో స్టేషన్ వద్ద భరద్వాజ్ అనే వ్యక్తి టికెట్లను అమ్మడం కొందరు గుర్తించారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఓటీ పోలీసులు అక్కడిని చేరుకుని భరద్వాజ్‌కు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతడి వద్ద ఉన్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Comments
Please login to add a commentAdd a comment