Uppal Stadium Black Tickets
-
ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
-
భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ : హైదరాబాద్ లో బ్లాక్ టిక్కెట్ల దందా
-
India Vs Australia: బ్లాక్ దందా.. రూ.850 టికెట్ రూ.11,000
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం సమీపంలో బ్లాక్ టికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో టికెట్లను విక్రయిస్తున్న గగులోత్ వెంకటేష్, ఇస్లావత్ దయాకర్, గగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.850 విలువ చేసే టికెట్‌ను రూ.11,000కి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు టికెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఉప్పల్ పోలీసులు వాటికి ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారు. ఆదివారం సెలవు దినం కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్ కావడం.. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం రావడంతో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని అభిమానులు మ్యాచ్‌ను ఎలాగైనా చూసేందుకు తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తుండటంతో బ్లాక్ ముఠా తమ దందాను కొనసాగిస్తోంది. చదవండి: (భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా) -
HCA రాజకీయాలు ప్రభుత్వం పై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండో టీ20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్ వేదికగా.. మూడో టీ20 సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో జరగనుంది. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలనుకున్న అభిమానులుకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌కు కోసం టికెట్ సేల్స్‌ను హెచ్‌సీఏ ఆన్లైన్లో సెప్టెంబర్ 15న ప్రారంభించగా.. నిమిషాల్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే సెకెండ్ ఫేజ్ టిక్కెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు అయితే ఎటువంటి సేల్‌ను ప్రారంభించలేదు. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం టికెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో జింఖానా గ్రౌండ్లో విక్రయిస్తామని ముందుగా హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే టికెట్స్ కొనుగోలు చేసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. కానీ.. జింఖానా గ్రౌండ్లో టికెట్స్‌కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియషన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ టికెట్స్ విషయంలో హెచ్‌సీఏ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవతవకలు జరిగాయి అని హెచ్‌సీఏపై హెచ్ఆర్సీలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక టికెట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ హెచ్‌సీఏ స్పందించకపోవడం గమానార్హం. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
పోలీస్ .... అభిమానులు
బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారని అదుపులోకి తీసుకోబోయిన పోలీసులు ఖాకీలపై దాడి చేసిన ఆదిలాబాద్ యువకులు ముగ్గురు పోలీసులకు గాయాలు అదుపులో నిందితులు ఉప్పల్: ఇండియా, శ్రీలంక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు, అభిమానులు మధ్య ‘బ్లాక్టికెట్ల’ విషయమై ఘర్షణ జరిగింది. బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారనే అనుమానంతో మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా .. పోలీసులపై వారు దాడి చేశారు. పోలీసులు అతికష్టం మీద వారిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ స్టేడియం వద్ద కొందరు బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఉప్పల్ క్రై పార్టీ పోలీసులు మఫ్టీలో వెళ్లారు. గేట్ నంబర్ -3 వద్ద ఆదిలాబాద్‌కు చెందిన దాదాపు 12 మంది యువకులు పెద్ద మొత్తంలో టికెట్లు చేత్తో పట్టుకొని పోలీసులకు కనిపించారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకోబోగా ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసులపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. అక్కడే యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు అడ్డుకున్నా.. ఆగకుండా వారిపై కూడా దాడి చేసి చితకబాదారు. ఇంతలో మరికొంత మంది పోలీసు సిబ్బంది వచ్చి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఉప్పల్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ మోతీలాల్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స చేసి పంపేశారు. బాధిత పోలీసులు ఫిర్యాదు మేరకు నిందితులు లక్ష్మణ్(22), వాసు(28), ఆదిత్య(28), శంకర్(27), అనిష్ (28), సూర్యాకాంత్(32), ప్రఫూల్(32), ప్రవీణ్(29), అరవింద్(26), సంతోష్ (27)లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన వీరంతా క్రికెట్ బెట్టింగ్స్ పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. సెల్ఫోన్లో సమాచారం చేరవేస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులని తెలియక ఎదురు తిరిగాం.... యువకుల వాదన మరోలా ఉంది. తామంతా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేశామని, వాటిని పంచుకుంటుండగా కొందరు వచ్చిలాక్కొన్నారని చెప్పారు. పెనుగులాటతో టికెట్లు చిరిగిపోయాయని, వచ్చిన వారు పోలీసులని తెలియక ఎదురు తిరిగామని చెప్పి వాపోయారు.