టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం(సెప్టెంబర్ 20) మోహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక రెండో టీ20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్ వేదికగా.. మూడో టీ20 సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో జరగనుంది. కాగా దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.
ఈ క్రమంలో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలనుకున్న అభిమానులుకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌కు కోసం టికెట్ సేల్స్‌ను హెచ్‌సీఏ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15న ప్రారంభించగా.. నిమిషాల్లో టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే సెకెండ్ ఫేజ్ టిక్కెట్లు త్వరలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు అయితే ఎటువంటి సేల్‌ను ప్రారంభించలేదు.
అదే విధంగా ఈ మ్యాచ్ కోసం టికెట్స్‌ను ఆఫ్‌లైన్‌లో జింఖానా గ్రౌండ్‌లో విక్రయిస్తామని ముందుగా హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే టికెట్స్ కొనుగోలు చేసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. కానీ.. జింఖానా గ్రౌండ్‌లో టికెట్స్‌కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియషన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ టికెట్స్ విషయంలో హెచ్‌సీఏ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అవతవకలు జరిగాయి అని హెచ్‌సీఏపై హెచ్‌ఆర్‌సీలో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇక టికెట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ హెచ్‌సీఏ స్పందించకపోవడం గమానార్హం.
చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే..
Comments
Please login to add a commentAdd a comment