టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు.
కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది.
2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్‌కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
దేశవాలీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు.
Thank you all For your love and support throughout my Career from 1500 hrs
Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 2024
2020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్‌లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment