Kedar Jadhav
-
క్రికెట్‌కు కేదార్ జాదవ్ వీడ్కోలు
పుణే: భారత క్రికెటర్ కేదార్ జాదవ్ ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన కేదార్ ... ఎమ్మెస్ ధోని శైలిలో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ‘నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. 1500 గంటల సమయం నుంచి నేను రిటైర్ అయినట్లుగా గుర్తించగలరు’ అని ట్వీట్ చేశాడు. మహారాష్ట్రకు చెందిన కేదార్ 2014లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 73 వన్డేల్లో 42.09 సగటుతో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సహా 1389 పరుగులు చేశాడు. 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. తన ‘స్లింగ్’ తరహా ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో అతను 27 వికెట్లు కూడా పడగొట్టాడు. కేదార్ అత్యుత్తమ ప్రదర్శన సొంతగడ్డ పుణేలో వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 76 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్స్‌లో అజేయంగా 120 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ ఆడిన అతను చివరిసారిగా 2020లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో కేదార్ ఢిల్లీ, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు. -
వన్డేల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కేదార్ జాదవ్.. కోహ్లితో కలిసి..!
టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జూన్ 3) ప్రకటించాడు. వైవిధ్యభరితమైన ఆటగాడిగా పేరున్న కేదార్.. టీమిండియా తరఫున పలు మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేదార్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతనాడిన ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది.2017లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ చేసిన మెరుపు శతకాన్ని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. భారత ఫుల్ టైమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి అది తొలి మ్యాచ్. పూణే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేదార్ సొంత అభిమానుల (కేదార్ స్వస్థలం పూణే) మధ్యలో పేట్రేగిపోయాడు. కేవలం 65 బంతుల్లోనే శతక్కొట్టి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో బరిలోకి దిగిన లోకల్ బాయ్ కేదార్.. ఎవరూ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. కేదార్‌కు జతగా మరో ఎండ్‌లో కోహ్లి కూడా శివాలెత్తిపోయాడు. కోహ్లి 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను విజయపు అంచుల వరకు తీసుకెళ్లారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) లాంఛనంగా మ్యాచ్‌ను ముగించాడు. కేదార్, కోహ్లి చెలరేగడంతో ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో కేదార్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. కేదార్, కోహ్లి శతక్కొట్టుడు ముందు 351 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. కేదార్ ఆడిన ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్ నెటిజన్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు.కేదార్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్‌తో పాటు మరో మరపురాని ఇన్నింగ్స్ కూడా ఉంది. 2018 ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే ఆఖర్లో వచ్చి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ఆ మ్యాచ్‌లో గాయం బారిన పడిన కేదార్.. సీఎస్కే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి మ్యాచ్‌ను ముగించాడు. కేదార్ దేశవాలీ కెరీర్లో సైతం ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు చాలా ఉన్నాయి.39 ఏళ్ల కేదార్.. టీమిండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి.ఐపీఎల్లో 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. తన కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. పూణేలో పుట్టి మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. -
కేదార్ జాదవ్ భారీ శతకం.. మరో ఇద్దరు కూడా..!
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో మహారాష్ట్ర కెప్టెన్, టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ రెచ్చిపోయాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 216 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. 38 ఏళ్ల లేటు వయసులో కేదార్ బ్యాట్ నుంచి జాలు వారిన ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా మిగిలిపోనుంది. కేదార్‌తో పాటు పవన్ షా (136), అంకిత్ బావ్నే (131) కూడా శతకాలతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మహా ఇన్నింగ్స్‌లో మూడు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదైంది. షేక్ నౌషద్ 73 పరుగులు చేశాడు. జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 2, ఆశిష్ కుమార్, ఆరోన్, విరాట్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (108) సెంచరీతో కదంతొక్కడంతో 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్‌కు జతగా కుమార్ సూరజ్ (83) రాణించాడు. షాబాజ్ నదీం (41), కుషాగ్రా (36), డియోబ్రాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో హితేశ్ వాలుంజ్ 6 వికెట్లతో జార్ణండ్ పతనాన్ని శాశించగా.. ఆషయ్ పాల్కర్ 2, ప్రదీప్ దడే, రామకృష్ణ ఘోష్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. జార్ఖండ్.. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 132 పరుగులు వెనుకపడి ఉంది. క్రీజ్‌లో ఓపెనర్లు నజీమ్ సిద్దిఖీ (20), కుమార్ సూరజ్ (42) కుదురుకున్నట్లు కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
హైదరాబాద్ ఓటమి.. కేదార్ జాదవ్ కెప్టెన్సీలో మహారాష్ట్ర గెలుపు
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌హజారే ట్రోఫీలో హైదరాబాద్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 3 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ వన్డే టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లు నెగ్గిన హైదరాబాద్ ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయంపాలైంది. మహారాష్ట్రతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (117 బంతుల్లో 103; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... కెప్టెన్ రాహుల్ సింగ్ (69), రాహుల్ బుద్ధి (58 నాటౌట్), రవితేజ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అండగా నిలిచారు. అనంతరం మహారాష్ట్ర 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 316 పరుగులు సాధించింది. అంకిత్ బావ్నే (108 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అజీమ్ కాజీ (80), కౌశల్ తాంబే (38), కెప్టెన్ కేదార్ జాదవ్ (32 నాటౌట్) రాణించి జట్టును గెలిపించారు. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ ‘డి’ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2023 విజేత రత్నగిరి జెట్స్
2023 మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ విజేతగా రత్నగిరి జెట్స్ నిలిచింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కూడా పూర్తి మ్యాచ్ సాధ్యపడకపోవడంతో, పాయింట్ల పట్టికలో టాపర్‌గా ఉన్న రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారమే (జూన్ 29) జరగాల్సి ఉండింది. అయితే ఆ రోజు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేసారు. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను ప్రకటించారు. అప్పటికీ వర్షం ఎడతెరిపి ఇచ్చిన ప్రతిసారి మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్వహకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో 16 ఓవర్ల ఆట కూడా జరిగింది. కేదార్ జాదవ్ నేతృత్వంలోని కొల్హాపూర్ టస్కర్స్ 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ ఆగలేదు. దీంతో పాయింట్ల ఆధారంగా రత్నగిరి జెట్స్‌ను విజేతగా ప్రకటించారు. టస్కర్స్‌కు కూడా జెట్స్తో సమానంగా పాయింట్లు ఉండటంతో నెట్ రన్ ఆధారంగా విజేతను డిసైడ్ చేశారు. విన్నింగ్ జట్టు కెప్టెన్ అజీమ్ ఖాజీకి 50 లక్షల చెక్ లభించగా.. రన్నరప్ టస్కర్స్‌కు 25 లక్షల చెక్ అందింది. -
లేటు వయస్సులో రీ ఎంట్రీ ఇస్తానంటున్న ఆటగాడు.. ఏకంగా కోహ్లి స్ధానానికే!
టీమిండియా వెటరన్ క్రికెట్ కేదార్ జాదవ్ దాదాపు మూడేళ్ల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జాదవ్.. తన కెరీర్ ఆరంభంలో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత తన పేలవ ఫామ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ధోనీ ఆప్తమిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న జాదవ్ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ సీజన్లో (2022-23) జాదవ్ అదరగొట్టాడు. 5 ఇన్నింగ్స్‌లలో 110.6 సగటుతో 553 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో కూడా జాదవ్ ఆడాడు. ఆనూహ్యంగా ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. ప్రస్తుతం జాదవ్ మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ లీగ్‌లో కోలాపూర్ టస్కర్స్‌కు జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేదార్ జాదవ్ భారత జట్టులోకి తన రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, అందుకు తగ్గట్టు కష్టపడతున్నాని 38 ఏళ్ల జాదవ్ తెలిపాడు. "ప్రస్తుతం నా ఆటతీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నిలకడగా రాణించి కష్టపడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. నేను భాగమైన ప్రతి టోర్నీలో మంచి ప్రదర్శన చేయడమే నా టార్గెట్. ఆ తర్వాత సెలక్టర్లు వారి నిర్ణయం తీసుకుంటారు. నేను ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాను. నాకు టాపర్డర్‌లో బ్యాటింగ్ చేయాలని ఉంది. నేను మహారాష్ట్ర తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్ చేస్తాను. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అదే నాకు సరైన స్ధానం. ఆ స్ధానంలో బ్యాటింగ్ వస్తే నేను స్వేఛ్చగా ఆడగలను" అని హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం భారత జట్టులో విరాట్ కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాదవ్ చివరగా 2020లో భారత జట్టు తరపున ఆడాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్! రింకూ సింగ్ ఎంట్రీ -
కోహ్లి టీమ్‌లో చేరిన ధోని నేస్తం.. KGFపై భారం తగ్గిస్తాడా..?
మహేంద్రసింగ్ ధోని స్నేహితుడు, మాజీ సీఎస్కే సభ్యుడు కేదార్ జాదవ్‌ను ఆర్సీబీ తమ జట్టులో చేర్చుకుంది. గత మ్యాచ్ సందర్భంగా గాయపడిన డేవిడ్ విల్లేకు రీప్లేస్‌మెంట్‌గా జాదవ్ ఆర్సీబీలోకి వచ్చాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం సోమవారం (మే 1) ప్రకటించింది. 38 ఏళ్ల జాదవ్‌ను ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. జాదవ్ సేవలను ఆర్సీబీ కోటి రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. చదవండి: సంజూ చీటింగ్ చేశాడా.. రోహిత్ శర్మకు అన్యాయం!? video 2010లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన జాదవ్.. ఢిల్లీ క్యాపిటల్స్, కొచ్చి టస్కర్స్, ఆర్సీబీ, సీఎస్కే, సన్‌రైజర్స్ తరఫున 93 మ్యాచ్‌ల్లో 123.17 స్ట్రయిక్ రేట్‌తో 1196 పరుగులు చేశాడు. జాదవ్ 2016, 2017 సీజన్లలో ఆర్సీబీ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించాడు (143.54 స్ట్రయిక్ రేట్‌తో 267 పరుగులు). జాదవ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ బలం పెరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది. జాదవ్ జట్టులో చేరడం వల్ల KGF (కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)పై భారం తగ్గుతుందని ఆర్సీబీ అంచనా వేస్తుంది. జాదవ్‌కు పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్‌గా సత్తా చాటే సామర్థ్యం కూడా ఉంది. అయితే ఐపీఎల్లో మాత్రం అతను ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. జాదవ్ మంచి వికెట్‌కీపర్ కూడా. జాదవ్‌కు ధోనికి మంచి స్నేహం ఉందని క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ ఉంది. ధోని సీఎస్కే యాజమాన్యాన్ని ఒప్పించి మరీ అప్పట్లో జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు టాక్ నడిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ (మే 1) ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: జడేజాను ట్రై చేశారు.. కానీ ఏం లాభం? కెప్టెన్‌గా అతడే సరైనోడు: పాక్ దిగ్గజం -
తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్‌కు తండ్రి మిస్సింగ్ కేసులో ఊరట లభించింది. సోమవారం తన తండ్రి మహదేవ్ జాదవ్ కనిపించడం లేదంటూ పుణేలోని అలంకార్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. కాగా మంగళవారం సాయంత్రం కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాలో ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్‌ను తమ వెంట తీసుకొచ్చి కేదార్ జాదవ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకినిలతో కలిసి పుణేలోని కొథ్రూడ్లోని సిటీప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్న మహదేవ్ జాదవ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లోని పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న మహదేవ్ ఆ తర్వాత గేట్ తీసుకొని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ జంక్షన్లో ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అలంకార్ పోలీసులను ఆశ్రయించిన కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ''కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ కొంతకాలంగా మతిమరుపు(డిమెన్షియా) వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మార్నింగ్ వాక్ కోసమని బయటికి వెళ్లిన మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాకు చేరుకున్నాడు. తాను ఎక్కడ ఉన్నానో తెలియక కాస్త అయోమయానికి గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహదేవ్ కదలికలను గుర్తించాం. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని.. కుటుంబసభ్యులకు అప్పగించామని'' సీనియర్ ఇన్స్పెక్టర్ అజిత్ లక్డే తెలిపారు. తన తండ్రిని క్షేమంగా అప్పగించినందుకు కేదార్ జాదవ్ అలంకార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక 2014లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. గతంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ 2022లో జరిగిన వేలంలో అమ్ముడిపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చదవండి: హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
లేటు వయసులో రెచ్చిపోతున్న ధోని ఫ్రెండ్.. మొన్న డబుల్ సెంచరీ, ఇప్పుడు సెంచరీ
Ranji Trophy 2022-23: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహచరుడు, ఐపీఎల్లో సీఎస్కే మాజీ సభ్యుడు, మహారాష్ట్ర వెటరన్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ లేటు వయసులో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. 37 ఏళ్ల కేదార్ జాదవ్ ప్రస్తుత రంజీ సీజన్లో (2022-23) వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతకంతో (283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు) విరుచుకుపడిన కేదార్.. ఇవాళ (జనవరి 24) ముంబైతో ప్రారంభమైన కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో (168 బంతుల్లో 128; 18 ఫోర్లు, సిక్స్) కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కేదార్ సెంచరీతో ఆదుకోకపోయుంటే మహారాష్ట్ర కనీసం 200 పరుగులు చేయడం కూడా కష్టమయ్యేది. సౌరభ్ నవాలే (56), అశయ్ పాల్కర్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై జట్టు భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఎలైట్ గ్రూప్-బిలో పోటీపడుతున్న మహారాష్ట్ర, ముంబై జట్లు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 2 (మహారాష్ట్ర, 25 పాయింట్లు), 3 (ముంబై, 23 పాయింట్లు) స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 26 పాయింట్లు) తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 19 పాయింట్లు) నాలుగో ప్లేస్‌లో ఉన్నాయి. తమిళనాడు (15 పాయింట్లు), అస్సాం (11 పాయింట్లు), ఢిల్లీ (11 పాయింట్లు), హైదరాబాద్ (1 పాయింట్) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో నిలిచాయి. క్వార్టర్స్ బెర్తు కోసం ఈ గ్రూప్ నుంచి సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ముంబై జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు గ్రూప్-సి నుంచి కర్ణాటక, గ్రూప్-ఏ నుంచి బెంగాల్ ఇదివరకే క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. -
భారీ ద్విశతకం బాదిన ధోని ఫ్రెండ్.. లేటు వయసులో 21 ఫోర్లు, 12 సిక్సర్లతో విధ్వంసం
Kedar Jadhav: టీమిండియా వెటరన్ క్రికెటర్, ఎంఎస్ ధోనికి అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్.. లేటు వయసులో వీర లెవెల్లో రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ ద్విశతకం బాదిన కేదార్ అభిమానులకు టీ20 మజాను అందించి అబ్బురపరిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేజే.. 283 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేశాడు. 37 ఏళ్ల కేదార్ జాదవ్.. ఈ మ్యాచ్‌లో మరో 17 పరుగులు చేసుంటే కెరీర్లో రెండో ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు లేటు వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కేవాడు. ఇప్పటి వరకు 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కేదార్.. 45.72 సగటున 14 సెంచరీలు, 20 అర్ధసెంచరీ సాయంతో 5166 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 327 పరుగులుగా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన కేదార్.. 73 వన్డేల్లో 42.09 సగటున 2 శతకాలు, 6 అర్ధశతకాల సాయంతో 1389 పరుగులు చేశాడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు టీ20ల్లో, ఐపీఎల్‌లోనూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. కొద్దికాలం పాటు టీమిండియాలో ధోనితో ప్రయాణం సాగించిన కేదార్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా చాలాకాలం పాటు కొనసాగాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అస్సాం.. పురకాయస్త (65), ఆకాశ్‌సేన్ గుప్త (65) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర బౌలర్లలో అశయ్ పాల్కర్, దడే తలో 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ ఇంగలే, బచ్చవ్ చెరో 2 వికెట్లు సాధించారు. అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. సిద్దేశ్ వీర్ (106) శతకంతో, కేదార్ జాదవ్ (283) భారీ ద్విశతకంతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ను 594/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 4 వికెట్లు పడగొట్టగా.. ముక్తార్ హుస్సేన్ 2, రంజిత్ మాలి ఓ వికెట్ దక్కించుకున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన మహారాష్ట్ర 320 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
ధోని కొత్త కారులో కేదార్ జాదవ్, రుతురాజ్‌ల షికారు
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి కార్లు, బైక్‌లు అంటే ఎంత పిచ్చి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాంచీలో తన నివాసంలో ఉన్న గ్యారేజీలో లెక్కలేనన్ని కార్లు, బైకులు ఉన్నాయి. తాజాగా ధోని ఇంటికి మరో కొత్త కారు వచ్చి చేరింది. ఇటీవలే ధోని కియాకు చెందిన 'EV6'(SUV) కారుని కొనుగోలు చేసాడు. కాగా ధోని గ్యారేజిలో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ధోని కొన్న కియా కంపెనీ EV6 ధర దేశీయ మార్కెట్లో రూ.59.95 లక్షలుగా ఉంది. ఇక ధోని కొన్న కొత్త కారులో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లు చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ధోనినే స్వయంగా కారును డ్రైవ్ చేయడం విశేషం. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే గుడ్‌బై చెప్పిన ధోని కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు రుతురాజ్, కేదార్ జాదవ్‌లు మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు టోర్నీలో భాగంగా జార్ఖండ్‌తో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్, కేదార్లు సరదాగా ధోని కారులో షికారుకెళ్లారు. New Car in the house babyyy @msdhoni 😎pic.twitter.com/73ZZMxF4hv — Best of MS Dhoni. (@BestOfMSD) November 17, 2022 -
ముక్కంటి సేవలో క్రికెటర్ కేదార్ జాదవ్
సాక్షి, శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని భారత క్రికెటర్, ప్రముఖ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనయుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు పసల సుమతి, మున్నారాయల్, ప్రత్యేక ఆహా్వనితులు పవన్ రాయల్ పాల్గొన్నారు. -
కేదార్ జాదవ్‌ని పెట్టుకొని ఏం చేస్తారు!
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో మరోసారి పొదుపు మంత్రాన్ని పాటించింది. గురువారం జరిగిన మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ తమ పర్స్‌లో ఉన్న రూ. 10.75 కోట్లలో కేవలం రూ.3.80 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారిలో సీఎస్కే వద్దనుకొని వదిలేసిన కేదార్ జాదవ్‌కు రూ.2 కోట్లు, బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌కు రూ.1.5 కోట్లు, జగదీశా సుచిత్‌కు రూ. 30లక్షలు వెచ్చించింది. అయితే వేలంలో ఎస్ఆర్హెచ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా కేదార్ జాదవ్ విషయంలో సన్‌రైజర్స్ అభిమానులు పెట్టిన మీమ్స్ వైరల్ అయ్యాయి.'ఫామ్‌లో లేని ఆటగాడిని తీసుకొని ఏం చేస్తుంది.. అసలు సన్‌రైజర్స్ వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టదు.. సీఎస్కే వద్దనుకుంది.. సన్‌రైజర్స్ కావాలనుకుంటుంది.' అంటూ కామెంట్స్ చేశారు. కాగా కేదార్ జాదవ్ గత సీజన్లో సీఎస్కే తరపున 8 మ్యాచ్‌లాడి 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. అందుకే కేదార్ జాదవ్ మొదటిసారి వేలంలోకి వచ్చినప్పుడు కనీసం అతన్ని పరిగణలోకి కూడా తీసుకోలేదు. కానీ రెండోసారి వేలంలోకి వచ్చిన జాదవ్‌ను అనూహ్యంగా సన్‌రైజర్స్ రూ. 2కోట్ల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. స్వదేశీ ఆటగాళ్లను తీసుకోవాలని భావించినప్పుడు ఫామ్‌లో ఉన్నకృష్ణప్ప గౌతమ్, కెఎస్ భరత్ లాంటి ఆటగాళ్లవైపు ఎస్ఆర్హెచ్ చూస్తే బాగుండేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 2016లో వార్నర్ సారథ్యంలో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ 2018లో విలియమ్సన్ కెప్టెన్సీలో చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. ఇక గత సీజన్లో వార్నర్ నాయకత్వంలో ప్లేఆఫ్‌కు చేరుకున్నా క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: 'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం' Hyderabadis reaction after SRH bought Kedar Jadhav for 2 Cr!👇👇👇 #IPLAuction2021 #IPLAuction pic.twitter.com/WEsJV52pGj — ʀᴀɢʜᴀᴠᴀ🇮🇳 (@raghava216) February 18, 2021 Kedar Jadhav sold to Sunrisers Hyderabad at 2cr... *Meanwhile, Sunrisers Hyderabad fans to the tram management after getting the out of form batsman at this prize : pic.twitter.com/vxehvrf7Yy — 𝘏𝘪𝘮𝘢𝘯𝘴𝘩𝘶 𝘚𝘦𝘵𝘩 (@tereMaalKaYaar) February 18, 2021 SRH and CSK after that Kedar Jadhav trade:#IPLAuction2021 pic.twitter.com/TCSHh9fA1d — Manya (@CSKian716) February 18, 2021 -
'అతన్ని వదులుకునేందుకు మేం సిద్ధం'
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేదార్ జాదవ్ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన మినీ వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా జనవరి 21లోపు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే క్రికెటర్ల జాబితాని టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు సమర్పించాలని బీసీసీఐ ఇటీవలే ఆదేశించింది. దాంతో.. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి కేదార్ జాదవ్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఐపీఎల్ 2021 సీజన్‌కు మొదట 10 జట్లతో లీగ్‌ను ఆడిద్దామని భావించిన బీసీసీఐ మరోసారి ఆలోచించి ఈ సారికి మాత్రం 8 జట్లతోనే లీగ్ జరుగుతుందని తెలిపింది. అయితే 2022 ఐపీఎల్ సీజన్లో మాత్రం పది జట్లతో లీగ్ ఆడించాలని బీసీసీఐ చూస్తుంది. (చదవండి: ఈ మ్యాచ్‌లో నా ఫోకస్ మొత్తం అశ్విన్‌పైనే..) ఐపీఎల్ 2020 సీజన్లో 8 మ్యాచ్‌లాడిన కేదార్ జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కలిపి కనీసం ఒక్క సిక్స్ కూడా కేదార్ జాదవ్ కొట్టలేకపోవడం గమనార్హం.ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ. 7.8 కోట్లకి కేదార్ జాదవ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 24 పరుగులతో చెన్నై టీమ్‌ని గెలిపించిన కేదార్ జాదవ్.. ఆ తర్వాత గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ 2019 సీజన్లో మొత్తంగా 162 పరుగులు మాత్రమే చేసిన జాదవ్.. ప్లేఆఫ్ మ్యాచ్‌లకి గాయంతో దూరమయ్యాడు. ఐపీఎల్ 2020 సీజన్లో కెప్టెన్ ధోనీ వరుసగా అవకాశాలిచ్చినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. దాంతో.. ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో అతనిపై వేటు పడింది. మొత్తంగా పేలవ ఫామ్, ఫిట్‌నెస్‌లేమితో నిరాశపరుస్తున్న కేదార్ జాదవ్‌ని వేలంలోకి వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేగాక కేదార్ జాదవ్‌తో పాటు పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, సురేశ్ రైనాలను కూడా వదులుకోవాలని చెన్నై భావిస్తోంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందేవ్యక్తిగత కారణాలతో రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే.(చదవండి: ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు) -
ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటున్నారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టుల్లో తనదైన శైలిలో చురకలు, చలోక్తులతో ఆకట్టుకునే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మెన్ తీరును విమర్శించాడు. మైదానంలో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ను ‘ప్రభుత్వ ఉద్యోగం’గా భావిస్తున్నారని చురక వేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్ అర్ధసెంచరీ చేశాడు. కానీ అతను అవుట్ కాగానే మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై వీరూ స్పందిస్తూ ‘అది ఛేదించాల్సిన లక్ష్యం. పీకలమీదికి వచ్చినా కూడా కేదార్ జాదవ్, జడేజా బంతుల్ని వృథాచేయడం (డాట్ బాల్స్ ఆడటం) వల్లే చెన్నై విజయానికి దూరమైంది. దీన్ని బట్టి చూస్తే కొందరి చెన్నై బ్యాట్స్‌మెన్ ప్రదర్శన తీరు ప్రభుత్వ ఉద్యోగంగా నాకనిపిస్తోంది. పని చేసినా చేయకపోయినా... నెల తిరిగేసరికి జీతం వస్తుందిలే అన్న తరహాలో ఆడినా ఆడకపోయినా పారితోషికానికి ఢోకా లేదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని విమర్శించారు. మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన సీఎస్కే ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లాడి నాలుగింట ఓడిపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో చెన్నై తలపడుతుంది. -
సీఎస్కే బ్యాట్స్‌మెన్ ప్రభుత్వ ఉద్యోగులా?!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ ముఖ్యంగా క్రీడా వార్తలపై తనదైన శైలిలో కామెంట్లతో అలరిస్తారు. తాజాగా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేశారు. కోల్‌కోతాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధోని సారథ్యంలో కొందరు బ్యాట్స్‌మెన్ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నంత తీరుబడిగా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా చెన్నై బ్యాట్స్‌మన్ పేలవ ప్రదర్శన ఆశ్చర్యానికి గురి చేసిందని తన ఫేస్బుక్ పేజీ ‘వీరు కి బైటక్’లో చెప్పుకొచ్చారు. [ చదవండి: మీ లవర్ మీ మొబైల్ వాట్సాప్ చెక్ చేస్తున్నారా? ఈ టిప్‌తో సేఫ్‌గా ఉండండి ] కేకేఆర్‌తో మ్యాచ్‌లో కేదార్ జాదవ్ ఆటతీరు జట్టుకు ఏమాత్రం ప్రయోజనం కలిగించ లేదని అన్నారు. జాదవ్ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని పేర్కొన్నారు. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిందని చురకలు వేశాడు. కాగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో వీరవిహారం చేసిన చెన్నై ఓపెనర్లు జట్టుకు సునాయాస విజయాన్ని అందించగా.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో తేలిపోయారు. మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మెన్ క్రీజులోకి దిగినా 157 పరుగులే చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీ నిర్ణయాలు కూడా మరోసారి పరిశీలనకు వచ్చాయని కొందరు క్రీడా విశ్లేషకులు అంటున్నారు. (చదవండి:‘వీళ్లిద్దరూ డాట్ బాల్స్ ఇలాగే తింటారు’) డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, జడేజాను కాదని, కెప్టెన్ ధోని జాదవ్‌ను ముందు బ్యాటింగ్‌కు పంపడమే దీనికి కారణం. ఈసారి కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 12 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తం మీద సమష్టిగా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో 10 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. ఆడిన ఆరు మ్యాచ్లలలో రెండింట మాత్రం చెన్నై విజయం సాధించింది. గత 12 ఐపీఎల్ సీజన్లలో చైన్నై జట్టు 8 సార్లు ఫైనల్ చేరింది. మూడుసార్లు విజేతగా నిలిచింది. ఇదిలాఉండగా.. చైన్నై, బెంగుళూరు మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది. (చదవండి: చెన్నైకి చేతకాలేదు) -
ఆ ఇద్దరిలో సూపర్ స్టార్ ఎవరంటే..!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్లు అంటే తనకు ఎంతో ఇష్టమని టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. వారిద్దరిలో తన సూపర్ స్టార్ ఎవరంటే చెప్పడం కష్టమన్నాడు. కాగా, ఆ ఇద్దరిలో ఎంచుకోమంటే మాత్రం అది చాలా కష్టమన్నాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పలు అంశాలపై మాట్లాడిన జాదవ్.. ధోని-సల్మాన్ ఖాన్లలో మీ ఫేవరెట్ సూపర్ స్టార్ అనే ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు. ‘ నా దృష్టిలో వారిద్దరూ సూపర్ స్టార్సే. నేను భారత్‌కు ఆడుతున్నప్పుడు ధోని భాయ్ ద్వారా సల్మాన్‌ను కలిశాను. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!) ఇద్దరూ సూపర్ స్టార్సే. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం నాకు చాలా కష్టం. మీకు నాన్న ఇష్టమా.. అమ్మ ఇష్టమా అంటే ఏం చెబుతాం. మన దగ్గర సమాధానమే ఉండదు. అలాగే ధోని-సల్మాన్లలో ఎవరు ఇష్టం అంటే చెప్పడం నా వల్ల కాదు’ అని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. ‘తాను తొలిసారి ధోనిని కలిసినప్పుడు అతను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. చాలా కచ్చితత్వంతో ఉన్నాడు. అదే సమయంలో చాలా కామ్‌గా ఉంటూ తనపని తాను చేసుకుపోతాడు. అది నాపై చాలా ప్రభావం చూపింది. నేను రిలాక్స్‌గా క్రికెట్‌ను ఆడటానికి ధోనినే కారణం. క్రికెటర్ల విషయానికి కొస్తే నా ఫేవరెట్ క్రికెటర్ ధోనినే’ అని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ గురించి జాదవ్ మాట్లాడుతూ.. దేశంలో 99 శాతం మంది క్రికెట్ అభిమానులు సచిన్ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తారు. అందులో నేను కూడా ఒకడ్ని. కానీ నేను సచిన్‌తో ఆడలేకపోయాను’ అని జాదవ్ తెలిపాడు.(‘ఈ ఏడాది వరల్డ్‌కప్ కష్టమే’) -
జాదవ్ బర్త్‌డే.. నెటిజన్లు ఫిదా!
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ తన 35వ బర్త్‌డే వేడుకలను చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు. అయితే తన బర్త్‌డే రోజు ఓ మంచి పని చేసి అభిమానుల మనసులు దోచుకున్నాడు. తన సొంత పట్టణమైన పుణేలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని ఓ ఎన్జీవో నుంచి తెలుసుకున్న జాదవ్ స్పందించాడు. వెంటనే ఆ ఎన్జీవోకు వెళ్లి రక్త దానం చేశాడు. జాదవ్ రక్త దానం చేసిన ఫోటోలను ఆ ఎన్జీవో తన ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బర్త్‌డే రోజు ఓ నిండు ప్రాణాన్ని కాపాడవని నెటిజన్లు జాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ కనీసం వారివారి పుట్టినరోజునైనా రక్త దానం చేయాలని కొందరు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కేదార్ జాదవ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, జట్టుకు అవసరమైన సమయంలో తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో టీమిండియాకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా, ఫామ్‌లో లేక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంతో వీరి నుంచి జాదవ్‌కు విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటికీ జాదవ్ టీమిండియా సెలక్షన్స్‌లో రెగ్యులర్‌గా ఉంటాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్లో రాణించి అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో చోటు దక్కించుకోవాలని తహతహలాడాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉండటంతో జాదవ్ కాస్త నిరుత్సాహపడ్డాడు. भारतीय क्रिकेट टीम के विस्फोटक बल्लेबाज @JadhavKedar जी ने इस संकट के समय में पुणे में एक बेहद जरूरतमंद इंसान के लिए रक्तदान कर मानवता की अद्भुत मिसाल पेश की है,@BloodsevaIndia परिवार आपके जज्बे को नमन करता है और आशा करता है आप दो मिनट का वीडियो संदेश रक्तदान पर हमें भेजें ।। pic.twitter.com/Eqa0Ehppam — Blood Seva Parivar (@BloodsevaIndia) March 26, 2020 -
ఇక పోజులు చాలు.. బ్యాటింగ్‌పై ఫోకస్ చేయ్!
న్యూఢిల్లీ: ఎప్పుడో భారత క్రికెట్ జట్టులో అరంగేట్రం చేసినా జాతీయ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో కేదార్ జాదవ్ విఫలమవుతూనే ఉన్నాడు. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్-2019లో జాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అతనిపై వేటు తప్పలేదు. సౌతాంప్టాన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు మినహా పెద్దగా రాణించలేదు. వన్డే కెరీర్లో ఇప్పటివరకూ రెండు సెంచరీలు, 6 అర్థ శతకాల్ని జాదవ్ సాధించాడు. ఇక 9 అంతర్జాతీయ టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులు మాత్రమే సాధించడంతో జాదవ్‌ను కనీసం పరిశీలించడం లేదు సెలక్టర్లు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో జాదవ్ నిరాశ పరిచాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ తప్పితే ఆ టోర్నీ అంతా వైఫల్యం చెందాడు. ఇదిలా ఉంచితే, తాజాగా జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాదవ్‌తో ఉన్న సాన్నిహిత్యమో ఏమో తెలీదు కానీ పోజు కొట్టడం ఆపి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్ చేశాడు. జాదవ్ పోస్ట్ చేసిన ఫోటోకు రోహిత్ శర్మ ఇలా రిప్లై ఇవ్వడంతో అభిమానుల్లో నవ్వులు పూయించింది. అదే సమయంలో ఈ పోస్ట్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ పాపులర్ కూడా అయ్యింది. View this post on Instagram Feels good to be back on the field and do what I like to do. 🏏🙂 #ranjitrophy @sareen_sports A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on Dec 3, 2019 at 10:25pm PST -
ధోని కొత్త అవతారం!
న్యూయార్క్: రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గోల్ఫ్ ఆడే క్రమంలో ముఖానికి తెల్లరంగు పూసుకుని ఉన్న ధోని ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా సహచర ఆటగాడు కేదార్ జాదవ్‌తో కలిసి ధోని గోల్ఫ్ ఆడాడు. దీనికి సంబంధించిన ఫోటోను కేదార్ జాదవ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో సభ్యుడిగా లేని జాదవ్.. ధోనితో కలిసి గోల్ఫ్ క్రీడను ఆస్వాదించాడు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు రెండు నెలల పాటు క్రికెట్ నుంచి ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సైతం ధోని అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా ప్రకటించిన జట్టులో పక్కకు పెట్టడంతో మరికొంత కాలం ధోని విశ్రాంతి తీసుకోవాలనే విషయం స్పష్టమైంది. View this post on Instagram Happy #NationalSportsDay to all of you. Remembering Dhyanchand Ji, the wizard of hockey... #nationalsportsday 🏏 🎾 ⚽️ 🏋🏻♂️ 🚲 🏃♂️ A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on Aug 28, 2019 at 7:55pm PDT -
కేదార్ జాదవ్ ఎందుకు బాస్?
న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ జట్టు ఎంపిక తీరు సరిగా లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రధానంగా కేదార్ జాదవ్‌కు అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా జాదవ్ ఎందుకు బాస్ అంటూ బీసీసీఐ సెలక్టర్లపై మండిపడుతున్నారు. అదే సమయంలో విండీస్-ఏ పర్యటనలో విశేషంగా ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్‌కు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.‘కేదార్ జాదవ్‌కు అవకాశం ఇవ్వడం అసంతృప్తికి గురి చేసింది.. అతనికి జట్టులో పదే పదే చోటివ్వడం అనవసరం’ అని ఒక నెటిజన్ విమర్శించగా, ‘కేదార్ 2023 ప్రపంచకప్ వరకు ఆడగలడా?, ఏ ప్రాతిపదికన జాదవ్‌ను ఎంపిక చేశారు. యువ క్రికెటర్ గిల్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదు’ అని మరొకరు ప్రశ్నించారు. (ఇక్కడ చదవండి: శుబ్‌మన్ గిల్ టాప్ లేపాడు..) ‘విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో ఆశ్చర్యం ఏముంది. అన్ని తెలుసున్న ముఖాలే. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కోహ్లి, రోహిత్‌లకు కూడా విశ్రాంతి ఇవ్వలేదు. ఇలా అయితే యువ క్రికెటర్ల ప్రతిభ ఎలా వెలుగులోకి వస్తుంది’ అని మరొక అభిమాని విమర్శించారు. ‘ గిల్ ఏం తప్పు చేశాడని అతన్ని బీసీసీఐ పక్కన పెట్టింది. మయాంక్ అగర్వాల్, గిల్ వంటి క్రికెటర్లకు వన్డే ఫార్మాట్లో అవకాశం కల్పించండి’ మరొకరు ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు ఎంపిక చేసిన జట్టులో మ్యాచ్ విన్నరే లేడు’ అని ఒక అభిమాని అసంతృప్తి వ్యక్తం చేశాడు.( ఇక్కడ చదవండి: విండీస్‌తో ఆడే భారత జట్టు ఇదే) -
జాదవ్‌ను ఆడించాలి.. ఎందుకంటే?
మాంచెస్టర్ : నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అవకాశం కల్పించాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాదవ్‌కు కివీస్‌పై మంచి బౌలింగ్ రికార్డు ఉందని, అది జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కివీస్ టాప్ బ్యాట్స్‌మెన్ అంతా జాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడ్డారని, జాదవ్ కివీస్‌పై 9 వికెట్లు పడగొట్టాడని గుర్తు చేస్తున్నారు. మెగాసమరానికి వేదికైన ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని, ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా జాదవ్ ఉపయోగపడుతాడంటున్నారు. ఏ లెక్కన చూసిన దినేశ్ కార్తీక్ కంటే జాదవ్‌ను తీసుకోవడమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. ఇక గణంకాలు కూడా జాదవ్‌ను ఎంపిక చేయడమే ఉత్తమమని తెలియజేస్తున్నాయి. కివీస్‌పై జాదవ్ 29 సగటు, 4.92 ఎకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ కెప్టెన్ విలియమ్సన్, బ్యాట్స్‌మెన్ టామ్లాథమ్లను రెండేసి సార్లు ఔట్ చేశాడు. జాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తెగఇబ్బంది పడ్డారు. ఈ మెంగా ఈవెంట్లో 6 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ ఒక హాఫ్ సెంచరీతో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. అప్గానిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో జాదవ్ ఆడిన బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవే అతన్ని శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లకు దూరం చేశాయి. ఈఎస్పీన్ క్రిక్ ఇన్ఫో సహకారంతో బ్యాట్స్‌మెన్ పరుగులు ఎదుర్కొన్న బంతులు వికెట్లు కేన్ విలియమ్సన్ 64 81 2 హెన్రీ నికోలస్ 32 40 1 రాస్ టేలర్ 29 40 1 టామ్ లాథమ్ 54 67 2 జిమ్మీ నీషమ్ 11 20 1 మిచెల్ సాంట్నర్ 11 15 1 జాదవ్ తీసిన 9వ వికెట్ కోరె అండర్సన్ కాగా.. ప్రస్తుతం అతను ప్రపంచకప్ కివీస్ జట్టులో లేడు. -
కేదార్ జాధవ్‌పై వేటు.. తుదిజట్టు నుంచి ఔట్!
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగే తమ ఎనిమిదో మ్యాచ్‌లో టీమిండియా తుదిజట్టులో పలు మార్పులు చేసే అవకాశముంది. ముఖ్యంగా కేదార్ జాధవ్‌ను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో కేదార్ జాధవ్‌కు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అయితే, ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ చెత్త బ్యాటింగ్‌తో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. గెలుపు కోసం 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇటు కేదార్ జాధవ్ కానీ, అటు సీనియర్ బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ కానీ.. ఆ కసిని, తపనను చూపించలేదు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలన్న ధోరణి వారి ఆటతీరులో ఏ కోశాన కనిపించలేదు. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఈ జోడీ తమకు ఉన్న 31 బంతుల్లో 20 సింగిళ్లు తీసింది. ఏడు డాట్ బాల్స్ ఆడింది. చివరి ఓవర్లో ధోనీ ఒక సిక్స్ కొట్టాడు. అప్పటికే మ్యాచ్ ఇంగ్లండ్ చేతిలో వాలిపోయింది. ఉత్కంఠభరిత క్షణాల్లో వీరోచితంగా ఆడాల్సిన సమయంలో నింపాదిగా టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ధోనీ-జాధవ్ బ్యాటింగ్ చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవైపు రిక్వైర్డ్ రన్‌రేట్ రాకేట్‌లా పైకి దూసుకుపోతుంటే... వీరు నింపాదిగా బ్యాటింగ్ చేస్తుండటం.. కామెంటేటర్లుగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీ, నాసీర్ హుస్సేన్‌ను సైతం విస్తుగొలిపింది. ఈ నేపథ్యంలో కేదార్ జాధవ్‌పై వేటు పడటం ఖాయమేనని వినిపిస్తోంది. అతన్ని తుది జట్టు నుంచి తప్పించి.. ఆ స్థానంలో రవీంద్ర జడ్డేజాను జట్టులోకి తీసుకునే అవకాశముంది. జడేజా బెస్ట్ ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలరే కాకుండా.. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల బ్యాట్స్‌మన్ కూడా. -
ధోని–జాదవ్ ఇంత చెత్తగానా?
బర్మింగ్‌హామ్: 7 డాట్ బాల్స్, 20 సింగిల్స్, 3 ఫోర్లు, 1 సిక్స్...! 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన దశలో ధోని–జాదవ్ భాగస్వామ్యం సాగిన తీరిది. కాస్త కష్టపడితే అందుకోదగ్గ లక్ష్యం కళ్లెదుట ఉండగా సీనియర్లిద్దరూ మన వల్ల కాదులే అన్నట్లు ఆడారు. విరుచుకుపడటం మాట దేవుడెరుగు? ప్రత్యర్థి పేసర్ల బౌలింగ్‌లో చాలాసార్లు బంతిని బ్యాట్‌కు కనీసం తాకించలేక పోయారు. మధ్య ఓవర్ల తరహాలో సింగిల్స్ తీస్తూ ఆగ్రహం తెప్పించారు. ధోని-జాదవ్ స్లో బ్యాటింగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. భారీ లక్ష్యాన్ని చూసి భారత ఆటగాళ్లు చేతులెత్తేశారని, ఎంతసేపు సింగిల్స్‌పైనే దృష్టిపెట్టారని, గెలవాలనే తపనతో ఆడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో ఐదు వికెట్ల ఉండి కూడా భారీ షాట్లకు ప్రయత్నించకపోవడం ఆశ్యర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసర్ హుస్సెన్ అయితే ధోని-జాదవ్‌ల బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ తరహా బ్యాటింగ్ టీమిండియాకు అవసరం లేదన్నాడు. వీరి ఆటకు వెగటుపుట్టి అభిమానులు మైదానం వీడుతున్నారని వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ సైతం నెమ్మదైన బ్యాటింగ్‌ను తప్పుబట్టాడు. తొలి 10 ఓవర్లు, చివరి 6 ఓవర్లలో భారత్ పరుగులు చేయలేకపోయిందన్నాడు. ఇక ధోని (31 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), కేదార్ జాదవ్ (13 బంతుల్లో 12 నాటౌట్)లు చివరి 31 బంతుల్లో 39 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో భారత్ 31 పరుగుల తేడాతో మెగాటోర్నీలో తొలి ఓటమి రుచి చూసింది. Disappointing finish. A run-a-ball partnership can't win games. Was exciting till Pandya was in. — Harsha Bhogle (@bhogleharsha) June 30, 2019 Terrible display of spirit by MSD & Jadhav. Didn’t even look like they were attempting to win the game. Disappointed. Also, better luck next time neighbours. #INDvsENG #Pakistan #CWC19 — Akshaye Rathi (@akshayerathi) June 30, 2019 -
పంత్, శంకర్ కాదు.. మరెవరు?
మాంచెస్టర్: టీమిండియాలో నాలుగు స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన కష్టపడి నెగ్గడంతో నాలుగో స్థానంపై చర్చ మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. రిషబ్ పంత్ లేదా విజయ్ శంకర్ సరిపోతారా అని మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్‌ను అడిగితే ఊహించని విధంగా ఆయన మరోపేరు చెప్పారు. కేదార్ జాదవ్ కరెక్టుగా సరిపోతాడని సమాధానమిచ్చారు. ‘జాదవ్ బాగా ఆడగలడు. స్టైక్ రొటేట్ చేస్తూ పరుగులు పిండుకోవడంలో సిద్ధహస్తుడు. తనదైన షాట్లతోనూ అలరిస్తాడు. నా అభిప్రాయం ప్రకారం అతడిని నాలుగో స్థానంలో ఆడించాల’ని గైక్వాడ్ పేర్కొన్నారు. రెండో ఆప్షన్‌గా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వైపు మొగ్గు చూపారు. ‘దినేశ్ కార్తీక్ అనుభవజ్ఞుడు. ఫినిషనర్గా నిరూపించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లో కుదురుకుని ఆడగల సామర్థ్యం అతడికి ఉంద’ని తెలిపారు. యువ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగున్నా నాలుగో స్థానంలో ఎలా ఆడతాడో తాను చెప్పలేనని అన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల షాట్ సెలెక్షన్‌ను గైక్వాడ్ తప్పుబట్టారు. కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ అవుటైన తీరును విమర్శించారు. (చదవండి: భారత్ అజేయభేరి) -
ఈ వానేదో అక్కడ పడొచ్చు కదా: జాదవ్
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఊహించినట్లుగానే వరుణుడు అడ్డుకున్నాడు. నాటింగ్‌హామ్‌లో బుధవారం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం చిత్తడిగా మారింది. మైదాన సిబ్బంది పిచ్ తడవకుండా తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ అవుట్ ఫీల్డ్ మాత్రం తడిసి ముద్దయింది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరోపాయింట్ ఇచ్చారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా మ్యాచ్ రద్దవడానికి కంటే ముందు టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ ప్రారంభం కోసం బాల్కనీ నుంచి ఆత్రుతగా ఎదురుచూశారు. రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్‌లు బ్రెడ్ ఆమ్లెట్ తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేశారు. అయితే కివీస్‌తో మ్యాచ్‌కు వర్షం పడటం పట్ల కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వర్షం నాటింగ్‌హామ్‌లో కాకుండా మహారాష్ట్రలో పడాలని కోరుకున్నాడు. గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరువు తాండవిస్తోన్న కారణంగానే జాదవ్ అలా కోరుకున్నాడు. ఇక మహారాష్ట్రలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. -
సినిమాకు భారత్ క్రికెటర్లు.. ఫ్యాన్స్ ఫైర్
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లి సేన గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ చిత్రాన్ని స్థానిక థియేటర్లో వీక్షించారు. ఈ విషయాన్ని సల్మాన్ వీరాభిమాని అయిన కేదార్ జాదవ్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో వెల్లడించాడు. అంతేకాకుండా చిత్రానికి వెళ్లిన సభ్యులతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. ‘భారత్’ చిత్రం వీక్షించిన వారిలో ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌తో పాటు టీమిండియా సహాయక సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం జాదవ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కివీస్‌తో రెండు రోజుల్లో మ్యాచ్ పెట్టుకుని సినిమాకు పోవడంపై కొందరు టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్ పూర్తి అయిన తర్వాతే కొందరు ఆటగాళ్లు సినిమాకు, మరికొందరు షాపింగ్‌కు వెళ్లారని మేనేజ్మెంట్ తెలిపింది. ఇక ‘భారత్’ను వీక్షించిన టీమిండియా సభ్యులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈద్ కానుకగా సల్మాన్ నటించిన 'భారత్' సినిమాని చిత్ర బృందం విడుదల చేసింది. సల్మాన్ ఐదు డిఫరెంట్ గెటప్స్ లో నటించిన ఈ చిత్రంలో టబు, జాకీ ష్రఫ్ ప్రధాన పాత్రలో నటించగా కత్రినా కైఫ్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కొరియన్ మూవీ 'ఓడే టూ మై ఫాదర్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం జూన్ 5న విడుదలయింది. మొదటి ఆట నుండే సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది. -
జాదవ్.. సినిమా ఆఫర్ వచ్చిందట కదా!
లండన్ : ప్రపంచకప్‌కు ముందు సన్నాహక సమరాన్ని పరాజయంతో ప్రారంభించిన భారత్.. రెండో వార్మప్ మ్యాచ్‌కు సిద్దమవుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌తో గాడినపడాలని కోహ్లిసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ కోసం లండన్ నుంచి కార్డిఫ్‌కు బస్సులో బయల్డేరిన టీమిండియా ఆటగాళ్లు ఈ ప్రయాణాన్ని తమదైన శైలిలో ఆస్వాదించారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం తెగ వైరల్ అయింది. సహచర ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేదార్జాదవ్లతో కబుర్లు చెబుతూ.. జోక్స్ వేసుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘హే గాయ్స్.. మేం లండన్ నుంచి కార్డిఫ్ వెళ్తున్నాం. ఒక్కసారి ఇక్కడి అందమైన లొకేషన్స్ చూడండి. నాకు కంపెనీగా ఇద్దరు జెంటిల్మెన్స్ రవీంద్ర జడేజా.. కేదార్ జాదవ్‌లు ఉన్నారు. జడ్డూ నీవు మొన్న మస్త్ ఆడినవ్ యార్.’ అని రోహిత్ అనగా.. ‘థ్యాంక్స్ రోహిత్! కఠిన పరిస్థితుల్లో రాణించడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ టోర్నీలో మన జట్టు కూడా ఇలానే రాణిస్తుందని ఆశిస్తున్నాను’ అని జడేజా సమాధానం ఇవ్వగా.. ‘అవును మనం రాణిస్తాం. ఈ ప్రపంచకప్ మనకు చాలా ముఖ్యం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అనంతరం పక్కనే ఉన్న జాదవ్‌పై రోహిత్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.. ‘జడ్డూతో కూర్చున్న ఈ వ్యక్తి రేస్ 4 యాక్టర్ కేదార్ జాదవ్. కేదార్.. నీ అందానికి, నీలోని ప్రత్యేకతకు బాలీవుడ్ మూవీ రేస్ 4 చిత్రంలో అవకాశం వచ్చిందంట కదా’ అని రోహిత్ టీజ్ చేయగా.. ‘ఇంకా అది ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రెండు నెలల తర్వాత మీరంతా ఆశ్చర్యపోవచ్చు’ అంటూ జాదవ్ అదే రీతిలో సమాధానమివ్వగా అక్కడ నవ్వులు పూసాయి. ఇక టీమిండియా ఆటగాళ్లు జూలై 14న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో నెగ్గి టైటిల్ తీసుకొస్తే తెరమీది హీరోలు కాదు.. రియల్ హీరోలు అవుతారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల్లో (మే30న) తెరలేవనున్న విషయం తెలిసిందే. View this post on Instagram Bus drives are fun! PS - listen carefully! @kedarjadhavofficial @royalnavghan A post shared by Rohit Sharma (@rohitsharma45) on May 26, 2019 at 6:54am PDT -
జాదవ్‌కు లైన్ క్లియర్
ముంబై: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు వరల్డ్ కప్‌లో ఆడడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 2019 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో సభ్యుడైన 34 ఏళ్ల జాదవ్ ఐపీల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ పర్యవేక్షణలో తిరిగి ఫిట్నెస్ సాధించాడు. గురువారం ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో జాదవ్ పాస్ అయ్యాడని పాట్రిక్ బీసీసీఐకి నివేదించాడు. దీంతో జాదవ్ మిగతా సభ్యులతో కలిసి ఈ నెల 22న ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. దాంతో జాదవ్ ఫిట్నెస్ నిరూపించుకోని పక్షంలో జట్టులో చోటు దక్కించుకోవచ్చనుకున్న స్టాండ్ బై ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషభ్ పంత్‌లకు నిరాశే ఎదురైంది. -
అంబటి రాయుడికి చిగురిస్తున్న ఆశలు..
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 12లో కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన కేదార్ జాదవ్‌కు ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉంటాడా లేడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కోచ్ రవిశాస్త్రి మాత్రం జాదవ్‌కు తగిలింది పెద్ద గాయం కాదని.. ప్రపంచకప్‌కు బయల్దేరే సమయానికి కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. దీనిపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఘమేఘాల మీద అతడిని తీసుకపోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడుతున్నారు. పూర్తి ఫిట్నెస్ సాధించని ఆటగాడిని తీసుకపోవడం వలన జట్టుకు, అతడికి చాలా నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ కూడా సమాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే జాదవ్ గాయంకు సంబంధించన విషయాలను, ఫిట్నెస్ గురించి రోజువారి రిపోర్టులను బీసీసీఐ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఐసీసీ నియామవళి ప్రకారం మే 23 వరకే ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మార్చకుంటే ఇంగ్లండ్‌కు వెళ్లిన తర్వాతే. దీంతో ఈ లోపే జాదవ్‌ను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జాదవ్‌ను పక్కకు పెడితే అంబటి రాయుడినే ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జాదవ్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా సెలక్టర్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇండియా ఏ తరుపున ఆడుతున్న పంత్.. వెస్టిండీస్ ఏతో జరుగుతున్న సిరీస్‌లో రాణించి సెలక్టర్లు దృష్టిలో పడాలని ఆశపడుతున్నాడు. -
వరల్డ్‌కప్‌కు కేదార్ జాదవ్ దూరమైతే..?
న్యూఢిల్లీ: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బౌండరీని ఆపబోయి జాదవ్ గాయపడ్డాడు. దాంతో అతన్ని మైదానం నుంచి తరలించారు. అదే సమయంలో సీఎస్కే శిబిరం నుంచి కూడా జాదవ్ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో జరుగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు జాదవ్ దూరమయ్యాడు. కాగా, వరల్డ్‌కప్‌కు ఎంపికైన జట్టులో ఉన్న కేదార్ జాదవ్ ఫిట్నెస్ అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ వేదిక వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా, జాదవ్ ముందుగానే ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇంగ్లిష్ గడ్డపై భారత జట్టు అడుగుపెట్టే సమయానికి జాదవ్ ఫిట్నెస్ను నిరూపించుకోలేకపోతే ఆ మెగాటోర్నీలో ఆడటం కష్టమే. టీమిండియా మేనేజ్మెంట్ కానీ, సెలక్టర్లు కానీ జాదవ్ గాయం అంత సీరియస్ కాదని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్పప్పటికీ, లోపల మాత్రం అతని గాయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టు మే 22వ తేదీన ఇంగ్లండ్‌కు పయనం కానున్న తరుణంలో ముందుగానే అతనికి ప్రత్యామ్నాయంగా ఎవర్ని పంపాలనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జాదవ్ అందుబాటులోకి రాకపోతే స్టాంబ్ బైలో ఉన్న అంబటి రాయుడ్ని కానీ యువ సంచలనం రిషభ్ పంత్‌ను కానీ ఇంగ్లండ్‌కు పంపే అవకాశం ఉంది. గత ఏడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో కూడా జాదవ్ గాయపడి మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పుడు ప్లేఆఫ్ ముందు జాదవ్ గాయ పడటం గమనార్హం. ఈ సీజన్లో జాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోయినప్పటికీ కీలక సమయంలో జట్టుకు ఆల్‌రౌండర్ దూరం కావడం సీఎస్కే ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. దీనిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘ కేదార్‌కి ప్రస్తుతం ఎక్స్-రే నిర్వహించాము. రేపు అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. అతను కోలుకుంటాడని కోరుకుంటున్నా. అతన్ని ఇక జట్టులోకి తీసుకోము. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం అతను ఫిట్‌గా ఉండటం ముఖ్యం. అది అంత పెద్ద గాయంలా కనిపించడం లేదు. కానీ మంచి జరగాలనే కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. -
ధోని కేదార్ జాదవ్‌ల భ్రోమాన్స్
-
కేదార్ మహిమ
237 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించడం అంటే భారత్‌లాంటి పటిష్టమైన జట్టుకు చిటికెలో పని. కానీ ఆసీస్‌పై విజయం అంత సులువుగా దక్కలేదు. ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పట్టుదలతో పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో పరుగులు చేయడంకంటే పరిస్థితికి అనుగుణంగా ఓపిగ్గా నిలబడాల్సి వచ్చింది. సరిగ్గా ఇలాంటి స్థితిలో కేదార్ జాదవ్, ధోని ద్వయం దానినే చేసి చూపించారు. టాప్–4 బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన తర్వాత వీరిద్దరు తమ విలువను చాటారు. ఐదో వికెట్‌కు అభేద్యంగా 141 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ముఖ్యంగా అసలైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆటను చూపిస్తూ ఈ స్థానాలపై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశారు. అంతకుముందు పేసర్ షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. స్వల్ప స్కోర్ల మ్యాచే అయినా... మొత్తంగా చూస్తే ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన పోరులో గెలిచి భారత్ శుభారంభం చేసింది. సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో మొదలు పెట్టింది. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (76 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. మ్యాక్స్‌వెల్ (51 బంతుల్లో 40; 5 ఫోర్లు), స్టొయినిస్ (53 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (87 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (72 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ కోహ్లి (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (66 బంతుల్లో 37; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం నాగపూర్‌లో జరుగుతుంది. రాణించిన కోహ్లి... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్ కొట్టిన ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభమైనా... ధావన్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఈ దశలో రోహిత్, కోహ్లి కలిసి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. వేగంగా పరుగులు సాధించకపోయినా, వీరిద్దరు జాగ్రత్తగా ఆడారు. ఆసీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. తన తొలి 9 బంతుల్లో ఒకే సింగిల్ తీసిన కోహ్లి కూల్టర్ నీల్ ఓవర్లో రెండు ఫోర్లతో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 42 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ ఆడమ్ జంపా భారత్‌ను దెబ్బ తీశాడు. తన మూడో ఓవర్లో అతను కోహ్లిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూలో ఆసీస్ ఫలితం సాధించింది. కొద్ది సేపటి తర్వాత రాయుడు (13)ని కూడా అతను ఔట్ చేశాడు. ఈ రెండు వికెట్ల మధ్య కూల్టర్ నీల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం.. భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిన దశలో మళ్లీ గెలుపుపై ఆశలు పెంచింది ధోని, జాదవ్ ల భాగస్వామ్యమే. రాన్రానూ కఠినంగా మారుతున్న పిచ్‌పై వీరిద్దరు ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడారు. అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి బౌండరీ కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు ఆడగా... 24వ ఓవర్లో జత కట్టిన ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఒకదశలో 46 బంతుల్లో 29 పరుగులే చేసిన ధోని... కూల్టర్ నీల్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదడంతో ఊపు వచ్చింది. ఇదే ఓవర్లో ధోని షాట్‌ను స్టొయినిస్ క్యాచ్ పట్టడంలో విఫల ప్రయత్నం చేశాడు. ఆసీస్ ఔట్ కోసం అప్పీల్ చేసినా, రీప్లేలో బంతి నేలకు తాకిందని తేలింది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన జాదవ్ ముందుగా 67 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న ధోని... 49వ ఓవర్లో తొలి రెండు బంతులను మెరుపు వేగంతో ఫోర్లుగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. తడబడుతూ... భారత పేస్, స్పిన్ బౌలర్లు సమష్టిగా చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పడుతూ లేస్తూ సాగిన ఆ జట్టుకు రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. రెండో వికెట్‌కు ఖాజా, స్టొయినిస్ 87 పరుగులు జోడించగా...ఏడో వికెట్‌కు క్యారీ, కూల్టర్ నీల్ 62 పరుగులు జత చేశారు. షమీ వేసిన మెయిడిన్ ఓవర్‌తో కంగారూల ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ ఫించ్ (0)ను ఔట్ చేసి బుమ్రా దెబ్బ కొట్టాడు. వరుసగా విఫలమవుతున్న ఆసీస్ కెప్టెన్ తన 100వ వన్డేలో కూడా డకౌట్గానే వెనుదిరిగాడు. ఈ స్థితిలో ఖాజా, స్టొయినిస్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే షమీ, బుమ్రా రెండు వైపుల నుంచి కట్టి పడేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ధోని బ్యాట్ లోగో మారింది... చాలా కాలం తర్వాత ధోని తన బ్యాట్‌పై కొత్త లోగోతో బరిలోకి దిగాడు. తొలి వన్డేలో అతను ఎస్ఎస్ (సన్రిడ్జెస్ బ్యాట్స్) స్టికర్‌తో ఆడాడు. ఇటీవలి వరకు అతనికి ఆస్ట్రేలియా కంపెనీ స్పార్టన్‌తో ఒప్పందం ఉండేది. అయితే అనూహ్యంగా మూతపడ్డ ఆ సంస్థ ధోని, గేల్, మోర్గాన్వంటి తదితర క్రికెటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఎగ్గొట్టింది. 2013 డిసెంబర్లో స్పార్టన్‌తో ధోని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటి దాకా మొత్తం అన్నీ కలిపి స్పార్టన్ నాలుగు విడతలుగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో బెంగళూరులో జరిగిన రెండో టి20లో స్పార్టన్ బ్యాట్‌ను ఆఖరిసారిగా వాడిన అనంతరం ధోని దానికి మంగళం పలికాడు. స్పార్టన్కు ముందు సుదీర్ఘ కాలం పాటు ధోని రీబాక్ లోగో బ్యాట్లు వాడాడు. మహి భాయ్ తోడుంటే... ఇటీవల ఆస్ట్రేలియాలో ఈ తరహాలోనే ఛేదించాం. అయినా, అవతలి ఎండ్‌లో మహి భాయ్ (ధోని) ఉంటే మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మిడిలార్డర్లో ఎలా ఆడాలో అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఈ విషయంలో ధోనిని మించినవారు లేరు. ఒక్కో మ్యాచ్‌పై మేం దృష్టిపెడుతున్నాం. మైదానంలో తీవ్రతతో ఎలా ఆడాలో మా కెప్టెన్‌ను చూసి తెలుసుకుంటున్నాం. బౌలింగ్ చేసేటప్పుడు నేను బౌలర్‌గా కాకుండా... వికెట్‌కు సూటిగా బంతులేస్తూ బ్యాట్స్‌మన్ ఏం చేయబోతున్నాడో ఆలోచిస్తా. – కేదార్ జాదవ్ బౌలర్ల కారణంగానే గెలిచాం బంతితో మేం బాగానే రాణించాం. ప్రత్యర్థిని కట్టిపడేస్తూ సాగిన జడేజా స్పెల్ ప్రశంసనీయం. ఫీల్డింగ్‌లోనూ అతడు జట్టుకు ఆస్తిలాంటివాడు. తెల్ల బంతితో షమీ ఇంత బాగా బౌలింగ్ చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసిన తీరు ముచ్చట గొలిపింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పిచ్‌పై బ్యాటింగ్ కష్టంగా మారింది. ధోని, జాదవ్ బాధ్యత తీసుకుని నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
ధోని భాయ్ ఉంటే.. సొంత దేశంలో ఆడినట్టే
వెల్లింగ్టన్ : టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనుక ఉంటే క్రీజు వీడవద్దని ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ ధోని వికెట్ల వెనుక ఉంటే విదేశీ పర్యటనలో కూడా సొంత దేశంలో ఆడినట్టే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా నాలుగో వన్డేలో ధోని తనకో సర్ప్రైజ్ ఇచ్చాడని ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తాను బౌలింగ్ చేస్తుండగా ధోని మరాఠీలో సలహా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడని పేర్కొన్నాడు. ఆ సలహా పాటించగా విజయవంతంగా పనిచేసిందని చెప్పుకొచ్చాడు. ఇక ధోని మరాఠీలో జాదవ్‌కు సలహా ఇస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 35 పరుగులతో నెగ్గి 4-1 సిరీస్ గెలిచి కివీస్ గడ్డపై నయాచరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. You always feel at home on foreign tours when @msdhoni is behind the stumps... But This moment came as a real surprise...#घेऊन_टाक https://t.co/AhXAwjeFiK — IamKedar (@JadhavKedar) February 3, 2019 -
లక్కీ జాదవ్..
ప్రసుత్తం భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లగా కొనసాగుతుండగా, మరికొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆటగాళ్లలో కేదార్ జాదవ్ ఒకడు. కాగా, భారత జట్టుకు జాదవ్ లక్కీగా మారడం ఇక్కడ విశేషం. భారత్ తరుఫున జాదవ్ ఆడిన చివరి 16 వన్డేల్లోనూ భారత్ పరాజయం చెందకపోవడమే అందుకు కారణం. టీమిండియా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ బ్యాట్‌తో భారీ సంఖ్యలో సెంచరీలు సాధించిందీ లేదు, అలా అని బంతితోనూ అమితంగా ఆకట్టుకున్నదీ లేదు. అయితే అతడు తుది జట్టులో ఉంటే మాత్రం జట్టు విజయాలు సాధిస్తుందనేది గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా దాదాపు గత 15 నెలలుగా కాలంగా జాదవ్ ఆడిన అన్నీ వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి చూడలేదు. అక్టోబరు 25, 2017 నుంచి కేదార్ జాదవ్ 16 వన్డేల్లో ఆడితే భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోలేదు. గత ఏడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ మాత్రమే టై ముగిసింది. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణిస్తూ తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకూ జాదవ్ ఆడిన వన్డే మ్యాచ్‌ల సంఖ్య 52. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు జాదవ్. అతని వన్డే కెరీర్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగా, 24 వికెట్లు తీశాడు. -
ధోని ఆలోచనల్ని అర్ధం చేసుకోవాలి: జాదవ్
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తా చాటింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (87నాటౌట్)తో పాటు చివరివరకు అజేయంగా నిలిచిన కేదార్ జాదవ్ ( 61 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంస్ ధోనితో పాటు క్రీజులో ఉండడం చాలా సంతోషాన్నిచ్చిందని చహల్ టీవీకి ఇచ్చిన ఎక్సుక్లూజివ్ చాట్‌లో జాదవ్ చెప్పుకొచ్చాడు. (మళ్లీ రిటైరవుతున్నా అంటారేమో: ధోని) ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్, ఆ వెంటనే వన్డే సిరీస్ గెలుపొందడం చాలా ఆనందంగా ఉందన్నాడు జాదవ్. వన్డే ప్రపంచకప్ టోర్నీ మరికొద్ది రోజుల్లోనే ఉన్నందున ఈ విజయం జట్టు సభ్యులకు జోష్‌నిస్తుందని వ్యాఖ్యానించాడు. విన్నింగ్ జట్టులో సభ్యుడినైనందుకు మరింత ఉత్సాహనిచ్చిందన్నాడు. టీమిండియా విజయంలో జట్టు సభ్యులందరూ వారి శక్తిమేరకు కృషి చేశారని ప్రశంసించాడు. (ఆసీస్ గడ్డపై కోహ్లిసేన డబుల్ ధమాకా!) ‘ఆస్ట్రేలియాలో ఇదే నా తొలి మ్యాచ్. మరొకవైపు సిరీస్‌లో చివరి మ్యాచ్ కావడంతో క్రీజులో ఎక్కువసేపు ఉండేందుకు నిశ్చయించుకున్నాను. స్ట్రయిక్ మెయింటేన్ చేస్తూ చివరివరకూ క్రీజులో ఉంటే టార్గెట్ చేరుకుంటామని అనుకున్నాను. మరో ఎండ్‌లో ధోని ఉండడంతో నా ఆలోచనలకు బలం చేకూరింది. బ్యాటింగ్ చేసే క్రమంలో నా సందేహాలను ధోని వద్ద నివృత్తి చేసుకునేవాడిని. ధోని మరో ఎండ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం ఈజీగా అనిపిస్తుంది. క్రీజులో ధోని ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న బౌలర్ అంచనాలతో పాటు మిస్టర్ కూల్ ఆలోచనలను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అతను క్రీజులో ఉంటే కొండంత బలం. ’ అని ధోని పై ఉన్న అభిమానాన్ని వెల్లడించాడు కేదార్. -
ఆస్ట్రేలియాకు ఎంఎస్ ధోని
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌లో సభ్యుడిగా ఉన్న ధోని సోమవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. ధోనితో పాటు రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, ఖలీల్ అహ్మద్‌లు సైతం ఆస్ట్రేలియాకు బయల్దేరారు. ఈ క్రమంలోనే వారు విమానం ఎక్కిన తర్వాత తీసుకున్న సెల్ఫీను కేదార్ జాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక, రోహిత్ శర్మ టెస్టు జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ కూతురు పుట్టడంతో ఆసీస్‌తో ఆఖరిదైన నాలుగో టెస్టు ముందు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ సమం అయ్యింది. ఆసీస్‌తో తలపడే భారత జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్ -
సీఎస్కేకు థాంక్స్: కేదర్ జాదవ్
చెన్నై: వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా తనను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్కే)కు కేదార్ జాదవ్ ధన్యవాదాలు తెలియజేశాడు. 2019 ఐపీఎఎల్ సీజన్‌కు సంబంధించి ప్రతీ జట్టు భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సదరు ఫ్రాంచైజీలు.. మరి కొంతమంది స్టార్ ఆటగాళ్లను సైతం విడుదల చేశాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ వుడ్‌తో సహా గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్షితిజ్ శర్మ, కనిష్క్ సేత్‌లకు ఉద్వాసన పలికింది. కాగా, గత సీజన్లో రూ. 7.80 కోట్ల ధరతో సీఎస్కేకు వచ్చిన జాదవ్‌ను రిటైన్ జాబితాలో ఉంచింది. దాంతో సీఎస్కేకు ట్వీటర్ ద్వారా జాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘నన్ను సీఎస్కే అట్టిపెట్టుకున్నందుకు చాలా రుణపడి ఉంటాను. థాంక్యూ చెన్నై. మరోసారి ఎల్లో జెర్సీ ధరించడానికి ఆతృతగా ఉన్నా’ అని జాదవ్ ట్వీట్ చేశాడు. నవంబర్ 15లోగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించారు. దాంతో కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. పంజాబ్ జట్టులోని కీలక ఆటగాళ్లైన యువరాజ్, అరోన్ ఫించ్, అక్షర్ పటేల్‌ను విడుదల చేసింది. గత ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ 11.5 కోట్లు వెచ్చించి తీసుకున్న ఎడమచేతివాటం పేసర్ ఉనాద్కత్‌ను సైతం రాజస్తాన్ రాయల్స్ విడుదల చేయగా, గౌతం గంభీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ వదులుకోవడం గమనార్హం. -
చాహల్, పంత్ ఔట్
ముంబై: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ బ్రాబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యం సాధించాలనే యోచనలో ఉంది. అదే సమయంలో మూడో వన్డేలో గెలిచిన వెస్టిండీస్ మంచి జోరు మీద ఉంది. నాల్గో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. యజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్‌లకు విశ్రాంతి నిచ్చిన టీమిండియా యాజమాన్యం.. రవీంద్ర జడేజా, కేదర్ జాదవ్‌లను తుది జట్టులోకి తీసుకుంది. గత వన్డేలో రోహిత్, ధావన్ విఫలం కావడం... మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవడంతో భారత్ పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాలు కూడా చాలా కీలకం. కాగా, ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అతను ధనాధన్ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. జాదవ్, జడేజాల రాకతో భారత్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనబడుతోంది. తుది జట్లు భారత్; విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జస్ప్రిత్ బూమ్రా వెస్టిండీస్; జాసన్ హోల్డర్(కెప్టెన్), కీరన్ పావెల్, హెమ్రాజ్, సాయ్ హోప్, మార్లోన్ శ్యామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, పాబియన్ అలెన్, ఆశ్లే నర్స్, రోచ్, కీమో పాల్ కేదర్ జాదవ్ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ -
కేదార్ జాదవ్ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదంటూ పేర్కొన్న జాదవ్.. ఇందుకు సంబంధించి ఎవరూ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఫిట్నెస్ కారణంగా పక్కకు పెట్టామన్న బీసీసీఐ సెలక్టర్లు.. ఫిట్నెస్ సాధించాక కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ బహిరంగంగా విమర్శించాడు. అయితే పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ తొలుత నచ్చచెప్పేందుకు యత్నించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్‌ను చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిన్న సవరణ అంటూ కేదార్ జాదవ్‌కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు శుక్రవారం బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు గురువారం సాయంత్రమే ప్రకటించారు. అయితే ఈ జట్టులో సెలక్టర్లు కేదార్ జాదవ్‌కు చోటు కల్పించలేదు. దీంతో పూర్తి ఫిట్నెస్ సాధించినా సెలక్టర్లు ఎందుకు జట్టులోకి ఎంపిక చేయలేదంటూ జాదవ్ ప్రశ్నించగా.. బీసీసీఐ సెలక్టర్లు దిగి రాక తప్పలేదు. ఇది ఎమ్మెస్కే మాట.. ‘కేదార్ జాదవ్ తరచుగా గాయపడతాడన్న కారణంగా మూడో వన్డేలోకి ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి పునరాగమనం చేయడం, వెంటనే గాయపడటం జరిగింది. దేశవాళీలో ఆడించేందుకు భారత-ఎ జట్టులో గురువారం చోటిచ్చాం. కేవలం అతనికి ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అతడి ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకి రాలేమని విండీస్‌తో చివరి 3 వన్డేలకు ఛాన్స్ ఇవ్వలేదని జాదవ్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ సర్ది చెప్పారు. మనసు మార్చుకున్నారు అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ... ఎమ్మెస్కే మనసు మార్చుకుని జాదవ్‌ను విండీస్‌తో చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేదార్ జాదవ్‌ను చివరి రెండు వన్డేలకు ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్ అనంతరం జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఆసీస్ పర్యటనకు సంబంధించి టెస్టు జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా, విండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. UPDATE - @JadhavKedar has been included in #TeamIndia squad for the 4th and 5th ODI against Windies.#INDvWI — BCCI (@BCCI) 26 October 2018 -
‘అందుకు కారణం ధోనినే’
దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే తన ఆటతీరు మెరుగైందని కేదార్ జాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో కేదార్ జాదవ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే.దుబాయి వేదికగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేదార్ జాదవ్ (3/23) మ్యాజిక్కు మిడిలార్డర్ చెల్లచెదురైన సంగతి తెలిసిందే. అయితే, తన విజయం వెనుక మాజీ కెప్టెన్ ధోని పాత్ర కీలకమని అన్నాడు. స్వదేశంలో 2016లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఎంఎస్ ధోని తన చేతికి బంతిని ఇవ్వడం కెరీర్‌నే మార్చివేసిందని చెప్పాడు.కేదార్ జాదవ్ మాట్లాడుతూ ‘గతంలో నా ఫోకస్ అంతా బ్యాటింగ్‌పైనే ఉండేది. నాపై నాకు అంత నమ్మకం ఉండేది కాదు. రెండేళ్ల కిందట కివీస్‌తో జరిగిన సిరీస్‌తో నా దశ తిరిగింది. బౌలింగ్ చేయాలంటూ ధోనీ బంతిని అందించడం నా జీవితాన్నే మార్చేసింది. నాపై నాకు మరింత నమ్మకం పెరిగింది’ అని అన్నాడు. ‘ఆత్మ విశ్వాసంతో ఆడుతున్నా. వికెట్ టు వికెట్ బంతులు సంధించి ఫలితాలు సాధిస్తున్నాను. ధోని ఇచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే నా ఆటతీరు మెరుగైంది. పూర్తి స్వేచ్ఛగా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. కేవలం రెండు ఓవర్లకు మించి ఎక్కువ ఓవర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేయను’ అని జాదవ్ చెప్పాడు. -
ఆసియాకప్ : 162కే పాక్ ప్యాకప్
దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగారు. బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్ (3/23), పేసర్లు భువనేశ్వర్(3/15), బుమ్రా(2/23)ల దెబ్బకు దాయాదీ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. భువనేశ్వర్ దెబ్బకు ఆదిలోనే ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(2), ఫఖర్ జమాన్(0)ల వికెట్లను కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్ (47)ను కుల్దీప్ ఔట్ చేసి విడదీశాడు. భారత అద్భుత ఫీల్డింగ్.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(6)ను మనీష్ పాండే అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ పంపించగా.. అంబటి రాయుడు సూపర్ త్రో తో షోయబ్ మాలిక్(43)ను రనౌట్ చేశాడు. దీంతో పాక్ 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ వెంటనే జాదవ్ అసిఫ్ అలీ(9), షాదాబ్‌ఖాన్ (8)లను ధోని అద్భుత కీపింగ్ సాయంతో పెవిలియన్‌కు చేర్చాడు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పాక్‌కు అష్రఫ్, మహ్మద్ అమిర్ సాయంతో వికెట్లు పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అష్రఫ్(21)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. చివర్లో భువనేశ్వర్ హసన్ అలీ(1), బుమ్రా ఉస్మాన్‌ఖాన్‌ను గోల్డెన్ డక్ చేయడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో కేదార్ జాదవ్ 3, భువనేశ్వర్ 3, కుల్దీప్ 1, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. -
జాదవ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్!
లండన్ : గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ విల్లే జట్టులోకి రానున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో యార్క్‌షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ జట్టు తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక ఈ సీజన్ ఆరంభం ముందే గాయంతో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ దూరమవ్వడంతో చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొడ నరాలు పట్టేయడంతో జాదవ్ టోర్నీ మొత్తానికి దూరం కావల్సి వచ్చింది. కీలకమైన ఇద్దరి ఆటగాళ్లను కోల్పోయిన చెన్నై డేవిడ్ విల్లేతో ఈ నష్టాన్ని పూడ్చాలని భావిస్తోంది. ఇక బిగ్ బాష్‌లో పెర్త్ స్కార్చేర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్ ఇంగ్లండ్ తరఫున మాత్రం ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించడం.. చివర్లో బంతిని హిట్ చేయగల సత్తా ఉన్న ఆటగాడు కావడంతో చెన్నై డేవిడ్‌పై మొగ్గు చూపింది. అయితే డేవిడ్ నియామకంపై చెన్నై ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం వాంఖేడే మైదానంలో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జాదవ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ చివరిలో వచ్చి కీలక షాట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా సిక్స్, ఫోర్ బాది సత్తా చాటాడు. తొడ నరాలు పట్టేయడంతో జాదవ్ ఐపీఎల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మన్ అయిన జాదవ్ గాయంతో తప్పుకోవడం తమ జట్టుకు పెద్ద నష్టమని బ్యాటింగ్ కోచ్ మైకేల్ హసీ పేర్కొన్నాడు. జనవరిలో జరిగిన వేలంలో రూ. 7.8 కోట్లకు అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. తర్వాతి మ్యాచ్‌లో జాదవ్ స్థానంలో ఎవరిని ఆడిస్తారో చూడాలి. మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సూపర్ కింగ్స్ తలపడనుంది. -
ధోనిసేన పునరాగమనం అదిరింది
ముంబై : రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను టాప్ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అంబటి రాయుడు (22) మినహా, వాట్సన్(16), రైనా(4) ధోని(5), జడేజా(12)లు తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో జాదవ్, బ్రావో (68 పరుగులు,30 బంతుల్లో)లు చెలరేగడంతో చెన్నై విజయం సాధించింది. చివర్లో బ్రావో అవుట్ కావడంతో మ్యాచ్ ఉంత్కఠంగా మారింది.చివరి ఓవర్లో కేదార్ జాదవ్ మిగిలిన పరుగుల్ని చేయడంతో చెన్నై విజయం సాధించింది. -
ధోని అలా అడగటంతోనే నా కెరీర్ ఇలా.!
సాక్షి, స్పోర్ట్స్ : అంతర్జాతీయ మ్యాచుల్లో బౌలింగ్ చేయమని సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సూచించడంతోనే తన కెరీర్ మలుపు తిరిగిందని టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వేలంలో జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ. 7.8 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కేకు ఎంపికవడంపై జాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నేను భారత్ తరుపున బౌలింగ్ చేసి వికెట్లు పడగొడుతానని కలలో కూడా అనుకోలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయమని ధోని భాయ్ అడిగినప్పటి నుంచే నేను భిన్నమైన ఆటగాడిగా మారనని అనుకుంటున్నా. ధోని ప్రతి ఆటగాడికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాడు. ప్రతి ఆటగాడు ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తాడు. ఇక ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ఇదే ధోనిలోని అత్యుత్తమ లక్షణం. చెన్నై జట్టుకు ఆడేందుకు ఏమైనా చేయొచ్చు. ధోని భాయ్ మైదానంలో ఉంటే చాలు నా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తా. గత పదేళ్లుగా సీఎస్కే ఐపీఎల్లో అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. అలాంటి జట్టుకు ఆడటం అదృష్టం. ధోని నుంచి ఎంతో నేర్చుకోవాలని అనుకుంటున్నా.’ అని జాదవ్ సీఎస్కే వెబ్సైట్లో పేర్కొన్నాడు. -
తొలి వన్డేలో నో బౌలింగ్.. ఈ వన్డే సంగతేంటి!
ఫుణే : టీమిండియాలో గత కొంత కాలంనుంచి రాణిస్తున్న ఆటగాడు కేదార్ జాదవ్. బ్యాట్ తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇవ్వగల క్రికెటర్. తొలి వన్డేలో భారత్ ఓటమిపాలుకాగా ఆ మ్యాచ్ లో జాదవ్ చేతికి బంతి అప్పగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శకులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండో వన్డేలో జాదవ్ తొలి ఓవర్లో కేవలం ఒకే పరుగు ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఆ సెషన్లో ఆరు ఓవర్లు వేసిన జాదవ్ కేవలం 16 పరుగులే ఇచ్చి కివీస్ టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేశాడు. తొలి వన్డేలోనూ జాదవ్ చేతికి బంతిని ఇచ్చి ఉంటే.. పరుగులు కట్టడి చేసేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పరుగులు రాని పక్షంలో కివీస్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకునేవారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వన్డేలో జాదవ్ బౌలింగ్ లో పరుగులు తక్కువ వస్తుండటంతో రన్ రేట్ పెంచే యత్నంలో కివీస్ కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. తాను వేసిన చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న జాదవ్.. ఓవరాల్ గా 8 ఓవర్లలో 3.87 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో జాదవ్ కంటే అతి తక్కువ ఎకానమీ (3.80)తో బౌలింగ్ చేసిన ఆటగాడు బుమ్రా మాత్రమే. నేరుగా తన బౌలింగ్ లో వికెట్లు తీయకపోయినా తొలి ఆరు ఓవర్లలో పరుగులు ఇవ్వకపోవడంతో ఇతర భారత బౌలర్లకు వికెట్లు తీయడం సులభతరం అయిందని ట్వీట్లు చేస్తున్నారు. -
'మిస్టర్ కూల్'లో ఈ తీవ్ర ఆగ్రహాన్ని చూశారా?
'మిస్టర్ కూల్' మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తన 'మ్యాజికల్ ఇన్నింగ్స్'తో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇటు ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అటు హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీల సెంచరీ కొట్టిన క్రికెటర్‌గా ధోనీ ఘనత సొంతం చేసుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తదితర భారత క్రికెటర్లు ఈ ఘనత సొంతం చేసుకున్నారు. కానీ, ధోనీని ప్రారంభంలోనే రన్నౌట్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా చేజార్చుకుంది. కేదార్ జాధవ్ అజాగ్రత్త వల్ల ధోనీ రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. కానీ, అదృష్టం బాగుండి తృటిలో బయటపడటం.. టీమిండియాకు కలిసొచ్చింది. ఈ సమయంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ధోనీ ఒక్కసారిగా తనలోని ఉగ్రరూపాన్ని చూపెట్టాడు. కేదార్ జాధవ్‌ను ఉరిముతూ చూడటం కెమెరా కంటపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. 22వ ఓవర్లో ధోనీ 7 పరుగుల వద్ద ఉండగా రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. బంతిని కవర్ దిశగా మళ్లించిన ధోనీ వెంటనే పరుగుకు ఉపక్రమించాడు. కానీ, మరో ఎండ్‌లో ఉన్న కేదార్ జాదవ్ మాత్రం స్పందించలేదు. దీంతో మైదానంలో మధ్యలోకి వెళ్లిన ధోనీ కాస్తా తడబడి.. తిరిగి వెనక్కి మళ్లే ప్రయత్నంచేశాడు. ఇంతలో బంతి అందుకున్న హిల్టన్ కార్ట్‌రిట్ హడావిడిగా వికెట్ల వైపు బంతి విసిరాడు. బంతి కాస్తా వికెట్లను తాకకుండా ఓవర్ త్రో అయింది. దీంతో ధోనీ పరుగు తీశాడు. కానీ పరుగు తీసిన అనంతరం కేదార్‌ను ధోనీ ఉరుముతూ ఆవేశంతో చూశాడు. ఇదేమీ తీరు అన్నట్టు తల పంకించాడు. ఆ వెంటనే 40 పరుగులు చేసిన కేదార్ మార్కస్ బౌలింగ్‌లో కార్ట్రిట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. కానీ, 'మిస్టర్ కూల్' ధోనీ ఇలా ఉగ్రరూపంతో చూడటం అభిమానుల దృష్టి ఆకర్షించింది. ధోనీ ఎంత కోపంగా చూశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
టీమిండియా మలింగా అతడే..!
ముంబై: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్లను బెంబెలెత్తించడంలో మలింగా స్టైలే వేరే. మరి ఆ తరహా బౌలర్ భారత జట్టులో ఉన్నాడా అంటే జస్ఫ్రిత్ బూమ్రా గురించి చెప్పుకోవాలి. తన వైవిధ్యమైన యాక్షన్ తో పాటు యార్కర్లతో భయపెట్టే ఆటగాడు బూమ్రాకు మలింగాకు పోలికలున్నాయని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కాగా, ఇక్కడ మలింగా యాక్షన్ ను పోలిన క్రికెటర్ భారత్ జట్టులో స్పిన్నర్ రూపంలో ఉన్నాడట. అతనే కేదర్ జాదవ్ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మలింగా-జాదవ్‌ల యాక్షన్ ఫోటోను పోస్ట్ చేశాడు. 'ఆందోళన వద్దు.. మనకు ఒక మలింగా ఉన్నాడు' అని ఫోటో కింద క్యాప్షన్ ను జోడించాడు. Why worry when we have one of our own @kedarjadhavofficial -
ధోని కళ్లు చెప్పేస్తాయ్!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌తో తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్‌కు కు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనినే కారణమని భారత ప్లేయర్ కేదార్ జాదవ్ తెలిపాడు. ’గతంలో ధోని సారథ్యంలో నా బౌలింగ్ లో మెరుగుదలకు బీజం పడింది. భారత జట్టులోకి వచ్చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం ధోనితోనే గడిపా. అతని నుంచి అనేక విషయాలు నేర్చుకునే వాణ్ని. ఆ క్రమంలోనే నా నుంచి ధోని ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమయ్యేది. అతని కళ్ల ద్వారా నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు తెలుసుకునే వాణ్ని. అదే రకంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా నాపై నమ్మకంతో బంతిని చేతికిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో నన్ను ఒక గేమ్ ఛేంజర్‌గా మార్చిన ఘనత కోహ్లిది. అయితే నా బౌలింగ్ మెరుగుపడటానికి మాత్రం కచ్చితంగా ధోనినే కారణం’ అని కేదర్ జాదవ్ తెలిపాడు. కాగా, మ్యాచ్‌ను మలుపుతిప్పిన జాదవ్ పై కోహ్లి ప్రశంలస వర్షం కురిపించాడు. నెట్స్ లో కేదర్ పెద్దగా బౌలింగ్ చేయకపోయినా, అతనొక స్మార్ట్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. అసలు బంగ్లాతో మ్యాచ్ లో జాదవ్ బౌలింగ్ ను దింపడానికి ధోనినే కారణమని కోహ్లి పేర్కొన్నాడు. ’ఇక్కడ మొత్తం క్రెడిట్ ను కేదర్ కు ఇవ్వడం లేదు. కేదర్ కు బౌలింగ్ కు ఇచ్చే ముందు ధోనిని సంప్రదించా. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత జాదవ్ కు బంతిని అప్పజెప్పా. ఆ సమయంలో జాదవ్ బౌలింగ్ మాకు మంచి ఆప్షన్‌గా అనిపించింది. నిజంగా అతను చాలా బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు ’అని కోహ్లి ప్రశంసించాడు. -
అందుకు ధోనినే కారణం..
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కేదర్ జాదవ్ పాత్ర వెలకట్టలేనిది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నప్పుడు కేదర్ చక్కటి బ్రేకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను బౌల్డ్ చేయడమే కాకుండా, మరో కీలక ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ను సైతం అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీలు చేసి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వారిద్దర్నీ జాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్ కు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనినే కారణమంటున్నాడు జాదవ్. 'గత ధోని సారథ్యంలో నా బౌలింగ్ లో మెరుగుదలకు బీజం పడింది. నేను భారత జట్టులోకి వచ్చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం ధోనితోనే గడిపా. అతని నుంచి అనేక విషయాలు నేర్చుకునే వాణ్ని. ఆ క్రమంలోనే నా నుంచి ధోని ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమయ్యేది. అతని కళ్ల ద్వారా నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు తెలుసుకునే వాడ్ని. అదే రకంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యే వాడిని. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా నాపై నమ్మకంతో బంతిని చేతికిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో నన్ను ఒక గేమ్ ఛేంజర్ గా మార్చిన ఘనత కోహ్లిది. అయితే నా బౌలింగ్ మెరుగుపడటానికి మాత్రం కచ్చితంగా ధోనినే కారణం' అని కేదర్ జాదవ్ తెలిపాడు. కాగా, మ్యాచ్ టర్న్ చేసిన జాదవ్ పై కోహ్లి ప్రశంలస వర్షం కురిపించాడు. నెట్స్ లో కేదర్ పెద్దగా బౌలింగ్ చేయకపోయినా, అతనొక స్మార్ట్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. అసలు నిన్నటి మ్యాచ్ లో జాదవ్ బౌలింగ్ ను దింపడానికి ధోనినే కారణమని కోహ్లి పేర్కొన్నాడు. 'ఇక్కడ మొత్తం క్రెడిట్ ను కేదర్ కు ఇవ్వడం లేదు. కేదర్ కు బౌలింగ్ కు ఇచ్చే ముందు ధోనిని సంప్రదించా. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత జాదవ్ కు బంతిని అప్పజెప్పా. ఆ సమయంలో జాదవ్ బౌలింగ్ మాకు మంచి ఆప్షన్ అనిపించింది. నిజంగా అతను చాలా బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు 'అని కోహ్లి తెలిపాడు. -
ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
లండన్: చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా బ్యాట్స్‌మన్ కేదర్ జాదవ్. ఇక్కడ అవసరమైతే రంజీ, టెస్టు తరహాల్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని జాదవ్ చెప్పుకొచ్చాడు. తొలి వార్మప్ మ్యాచ్ లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ జాదవ్ ఇంగ్లండ్ లోని పిచ్ పరిస్థితుల్ని పరిశోధించే పనిలో పడ్డాడు. ' న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో ప్రతీ పరుగు కోసం ఆటగాళ్లు కష్టపడిన విషయాన్ని గమనించాను. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో వారు నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు. 'పిచ్ పై పచ్చిక బాగా ఉంది. దాంతో పాటు బంతి కూడా బాగా స్వింగ్ అయ్యింది. వచ్చే మ్యాచ్ ల్లో పరిస్థితి ఇలా ఉన్నా దూకుడుగా ఆడేందుకు యత్నించవచ్చు. కానీ టెక్నికల్ గా చూస్తే టెస్టు మ్యాచ్ ల్లోనూ, రంజీల్లోనూ బ్యాటింగ్ చేసినట్లు చేయాలి. మంచి బంతుల్ని కచ్చితంగా వదిలేయాలి. అంటే దూకుడుకు వెళితే అవుటయ్యే ప్రమాదమే ఎక్కువ'అని కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. నిజానికి కేదర్ జాదవ్ దూకుడుగా ఆడే ఆటగాడే. అయితే ఇంగ్లండ్ లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితేనే ఆశించిన ఫలితాలుంటాయని పేర్కొన్న జాదవ్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇది తన తొలి చాంపియన్స్ ట్రోఫీ అని, సాధ్యమైనంత వరకూ జట్టు ప్రణాళికలు తగట్టు ఆడతానని తెలిపాడు. ఇందుకోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు జాదవ్ తెలిపాడు. -
ఆలస్యంగా రోహిత్, కేదర్ జాదవ్
న్యూఢిల్లీ:చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టు బృందం బుధవారం ఇంగ్లండ్ కు పయనం కాగా రోహిత్ శర్మ, కేదర్ జాదవ్‌లు కాస్త ఆలస్యంగా అక్కడికి బయల్దేరనున్నారు. కజిన్ వివాహం కారణంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ కు ఆలస్యంగా బయల్దేరుతుండగా, కేదర్ కు ఇంకా వీసా సర్దుబాటు కాలేకపోవడం వల్ల అతను అక్కడకు వెళ్లడం ఆలస్యమవుతుంది. టీమిండియా జట్టు ఇంగ్లండ్ కు బయల్దేరి సమయానికి కేదర్ జాదవ్‌కు ఇంకా క్లియరెన్స్ లభించకపోవడంతో అతని ఆలస్యంగా జట్టుతో కలవనున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. ఈ మేరకు వీరిద్దరూ ఆలస్యంగా ఇంగ్లండ్ వెళ్లనున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది. తాను ఆలస్యంగా ఇంగ్లండ్ కు పయనం కానున్న విషయాన్ని రోహిత్ ముందుగానే తెలియజేసిన్టుల బీసీసీఐ పేర్కొంది. మరొకవైపుకేదర్ జాదవ్ శుక్రవారం ఇంగ్లండ్ విమానం ఎక్కే అవకాశం ఉంది. జూన్ 1 వ తేదీ నుంచి ఆరంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతుంది. -
భళా... బెంగళూరు
-
భళా... బెంగళూరు
► కేదార్ జాదవ్ మెరుపులు ► ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 15 పరుగుల తేడాతో గెలుపు ► రిషభ్ పోరాటం వృథా బెంగళూరు: బౌలర్ల సమష్టి కృషితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్–10లో బోణీ కొట్టింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను కంగుతినిపించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (37 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. మోరిస్‌కు 3, జహీర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రిషభ్ పంత్ (36 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా తన జట్టును గట్టెక్కించలేకపోయాడు. చిన్నస్వామి స్టేడియంలో ఓ జట్టు 200 కంటే తక్కువ స్కోరు చేసి నెగ్గడం రెండేళ్లలో ఇదే తొలిసారి. జాదవ్ ఒక్కడే... టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా... క్రిస్ గేల్ (6), కెప్టెన్ వాట్సన్ (24 బంతుల్లో 24; 4 ఫోర్లు) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో భారీషాట్‌కు ప్రయత్నించిన గేల్... మిడాఫ్‌లో శామ్సన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. క్రీజులోకి వస్తూనే బౌండరీలతో జోరు చూపిన మన్దీప్ (12; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. కాసేపటికే వాట్సన్... నదీమ్ బౌలింగ్‌లో స్టంపౌటై నిష్క్రమించాడు. 55 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన దశలో కేదార్ జాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. భారీ సిక్సర్లతో బెంగళూరు ప్రేక్షకుల్ని అలరించాడు. స్టువర్ట్ బిన్నీ (16)తో కలిసి నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. జహీర్ ఖాన్... బిన్నీని ఔట్ చేయడంతో బెంగళూరు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంత్ పట్టుదల... అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచారు. ఓపెనర్లు ఆదిత్య తారే (17 బంతుల్లో 18; 3 ఫోర్లు), బిల్లింగ్స్ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఇదే స్కోరు వద్ద తారే... మిల్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డవగా, 5 పరుగుల వ్యవధిలో కరుణ్ నాయర్ (4) బిల్లీ స్టాన్లేక్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శామ్సన్ (13) కూడా విఫలమవడంతో 84 పరుగుల వద్ద 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రిషభ్ పంత్ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. భారీ సిక్సర్లతో రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే మరోవైపు మోరిస్ (4), బ్రాత్‌వైట్ (1), కమిన్స్ (6)లు విఫలమవడంతో రన్‌రేట్ ఒక్కసారిగా పడిపోయింది. ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పవన్ నేగి వేసిన ఈ ఓవర్ తొలి బంతికే రిషభ్ బౌల్డ్ కావడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. స్టాన్లేక్, ఇక్బాల్ అబ్దుల్లా, నేగి తలా 2 వికెట్లు తీశారు. విషాదాన్ని అధిగమించి ఇన్నింగ్స్‌ను నడిపించిన రిషభ్ పంత్ పట్టుదల అందర్నీ ఆకట్టుకుంది. బుధవారం రాత్రి తన తండ్రి హఠాన్మరణంతో అంత్యక్రియలకు వెళ్లిన రిషభ్ పంత్ గురువారం దహన సంస్కారాలు చేస్తుండగా స్వల్ప గాయాలయ్యాయి. దుఃఖాన్ని దిగమింగి శుక్రవారమే జట్టుతో కలిశాడు. రోజు వ్యవధిలో తొలి మ్యాచ్ ఆడి కడదాకా చేసిన పోరాటం జట్టుకు విజయాన్నివ్వకపోయినా... తన ఆటతీరుతో అందరి మనసుల్ని గెలిచాడు పంత్. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) శామ్సన్ (బి) మోరిస్ 6; వాట్సన్ (స్టంప్డ్) పంత్ (బి) నదీమ్ 24; మన్దీప్ సింగ్ (బి) కమిన్స్ 12; జాదవ్ (సి) మోరిస్ (బి) జహీర్ ఖాన్ 69; బిన్నీ (సి) బిల్లింగ్స్ (బి) జహీర్ ఖాన్ 16; విష్ణు వినోద్ (రనౌట్) 9; నేగి (బి) మోరిస్ 10; అబ్దుల్లా నాటౌట్ 5; మిల్స్ (బి) మోరిస్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–26, 2–41, 3–55, 4–121, 5–142, 6–142, 7–157, 8–157. బౌలింగ్: జహీర్ 4–0–31–2, మోరిస్ 4–0–21–3, కమిన్స్ 4–0–29–1, నదీమ్ 4–0–13–1, మిశ్రా 2–0–32–0, బ్రాత్‌వైట్ 2–0–29–0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: ఆదిత్య తారే (బి) మిల్స్ 18; బిల్లింగ్స్ (సి) స్టాన్లేక్ (బి) అబ్దుల్లా 25; కరుణ్ నాయర్ (బి) స్టాన్లేక్ 4; శామ్సన్ (సి) బిన్నీ (బి) స్టాన్లేక్ 13; రిషభ్ పంత్ (బి) నేగి 57; మోరిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అబ్దుల్లా 4; బ్రాత్‌వైట్ (బి) చహల్ 1; కమిన్స్ (బి) వాట్సన్ 6; మిశ్రా నాటౌట్ 8; నదీమ్ (సి అండ్ బి) నేగి 0; జహీర్ ఖాన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–33, 2–38, 3–55, 4–84, 5–107, 6–113, 7–125, 8–139, 9–139. బౌలింగ్: స్టాన్లేక్ 4–0–29–2, చహల్ 4–0–19–1, అబ్దుల్లా 3–0–36–2, మిల్స్ 4–0–33–1, వాట్సన్ 4–0–21–1, నేగి 1–0–3–2. -
పరిణితి చెందకపోవడం వల్లే..:జాదవ్
న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత క్రికెటర్ కేదర్ జాదవ్.పుణెలో జరిగిన తొలి వన్డేలో 76 బంతుల్లో 120 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విరాట్ తో కలిసి జాదవ్ అమూలమ్యైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదే తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని అంటున్నాడు జాదవ్. 'ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ తరువాత నా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకుంటానని ముందే అనుకున్నా.ఆపై మిగతా రెండు వన్డేల్లో కూడా రాణించడంతో అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ నా కెరీర్లో కీలక మలుపు. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నాలో విశ్వాసాన్ని పెంచితే, ఇది నా కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది' అని జాదవ్ తన పునరాగమనంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో 77.33 సగటుతో జాదవ్ 232 పరుగుల్ని సాధించాడు. ఆ క్రమంలోనే 144.09 స్ట్రైక్ రేట్‌ను జాదవ్ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో భారీ పరుగులు సాధించలేకపోయినప్పటికీ, తనలోని ఆత్మవిశ్వాసం బలపడటానికి కారణమైందన్నాడు. తనకు ఆలస్యంగా అవకాశాలు రావడం వల్ల జాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. గతంలో తాను తగినంత పరిణితి చెందకపోవడం వల్లే అవకాశాలు రాలేదన్నాడు. ఈ కారణం చేతనే తనకు జాతీయ జట్టులో అవకాశాలు ఆలస్యంగా వచ్చాయన్నాడు.తనకు అవకాశాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ సంతోషంగా ఉన్నట్లు జాదవ్ తెలిపాడు. ప్రస్తుత అవకాశాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాననే ఆశాభవం జాదవ్ వ్యక్తం చేశాడు. జయహో జాదవ్(ఇక్కడ క్లిక్ చేయండి) -
జాదవ్ అనుకున్నట్టే జరిగింది
పుణె: ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని టీమిండియా బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ అన్నాడు. ఇంగ్లండ్‌తో పుణె వన్డేలో సెంచరీ చేశాక, ఇదే జోరు కొనసాగిస్తే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంటానని భావించానని తెలిపాడు. జాదవ్ అనుకున్నట్టే ఈ సిరీస్‌లో రాణించి అవార్డు సొంతం చేసుకున్నాడు. అంతేగాక పుణె వన్డే తర్వాత ఓ రోజులోనే స్టార్ క్రికెటర్ అయిపోయాడు. ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యసాధనలో జాదవ్ కీలక సమయంలో మెరుపు సెంచరీ (76 బంతుల్లో 120) చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. శుక్రవారం పుణెలో జాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తన క్రికెట్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడుతున్న సమయంలో తనలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని, ఏ జట్టుపైనైనా పరుగులు చేయగలననే నమ్మకం వచ్చిందని చెప్పాడు. కాగా టీమిండియా తరఫున ఆడే అవకాశం ఆలస్యంగా వచ్చిందని, పరిణతి లేకపోవడమే ఇందుకు కారణమన్నాడు. జట్టులో తనకు లభించిన అవకాశాన్ని విజయంగా మార్చుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తుంటాడని, తన సహజశైలిలో ఆడేందుకు సాయపడ్డాడని వెల్లడించాడు. కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పాడు. మాజీ కెప్టెన్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, యువ ఆటగాళ్లుకు ఆదర్శమని ప్రశంసించాడు. ఒత్తిడిని అధిగమించడం, సవాళ్లను ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండగలగడం వంటి లక్షణాలు ధోనీకి ప్రత్యేకమన్నాడు. ధోనీ, కోహ్లీ నాయకత్వ లక్షణాలు, శైలి భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించడం వల్ల జట్టు సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారా అన్న ప్రశ్నకు.. తాను వర్తమానంలో జీవిస్తానని, భవిష్యత్ గురించి ఆలోచించనని అన్నాడు. కాగా మరో రెండు, మూడు సిరీస్‌లకు భారత జట్టులో చోటు లభిస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు. -
అందుకు ధోనినే కారణం: జాదవ్
-
అందుకు ధోనినే కారణం: జాదవ్
కోల్‌కతా:ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఎక్కువ సమయం గడపడం వల్ల తాను పలు విషయాలను నేర్చుకున్నట్లు సహచర ఆటగాడు కేదర్ జాదవ్ పేర్కొన్నాడు. ప్రధానంగా ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలి అనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకున్నట్లు జాదవ్ తెలిపాడు. 'నేను జట్టులోకి ఎప్పుడైతే వచ్చానో.. అప్పుడు ధోనితో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. దాంతో క్లిష్ట పరిస్థితుల్లో కూల్‌గా ఎలా ఉండాలి అనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. నేను ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేయడానికి ఇక్కడ ధోని సాయపడ్డాడనే చెప్పాలి'అని జాదవ్ తెలిపాడు. ఇదిలా ఉంచితే, చివరి ఓవర్లో పదహారు పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు బంతుల్లో 10 పరుగులు రాబట్టడంపై జాదవ్ స్పందించాడు. ఆఖరి ఆరు బంతుల్ని ఎలా ఆడాలి అనే దానిపై ముందే ఒక ప్రణాళిక రచించుకునే ఆడటానికి సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా బౌలర్ పై ఎదురుదాడికి దిగి అతనిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని అమలు చేయాలనుకునే క్రమంలోనే తొలి రెండు బంతుల్ని బౌండరీలు దాటించినట్లు జాదవ్ తెలిపాడు. దీనిలో భాగంగానే ఒక భారీ షాట్ కు యత్నించి అవుట్ కావడం నిరాశ కల్గించదన్నాడు. ఇక్కడ మ్యాచ్ ను గెలిపించి ఉంటే ఇంకా సంతోష పడేవాడినని పేర్కొన్న జాదవ్.. ప్రస్తుత తన బ్యాటింగ్ తో సంతృప్తికరంగా ఉన్నానని తెలిపాడు. ఈ సిరీస్ లో జాదవ్ 232 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
కేదార్ జాదవ్ శ్రమ వృథా
-
ఇంగ్లండ్‌కో గెలుపు
♦ ఉత్కంఠపోరులో ఓడిన భారత్ ♦ 5 పరుగులతో ఇంగ్లండ్ విజయం ♦ స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ♦ కేదార్ జాదవ్ శ్రమ వృథా భారత్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు కావాలి. అప్పటికే అలవోకగా బౌండరీలు బాది జట్టును విజయానికి చేరువ చేసిన కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉండగా, తన అంతకుముందు ఓవర్లో 16 పరుగులు ఇచ్చిన వోక్స్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి రెండు బంతులను జాదవ్ అవలీలగా 6, 4 బాదేయడంతో రెండు బంతులకే 10 పరుగులు వచ్చాయి. విజయం ఖాయమనిపించిన ఈ దశలోనూ అదృష్టం భారత్‌కు ముఖం చాటేసింది. తర్వాతి రెండు బంతులకు పరుగు తీయలేకపోయిన జాదవ్ ఐదో బంతికి క్యాచ్ ఇచ్చాడు. ఆఖరి బంతిని భువనేశ్వర్ ఆడలేకపోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంబరాలు, అటు డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా సభ్యుల్లో నిరాశ... అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దోబూచులాడి చివరకు మోర్గాన్ సేన పక్షం వహించింది. సుదీర్ఘ పర్యటనలో ఐదు టెస్టులు, రెండు వన్డేల పాటు గెలుపు రుచి చూడని ఇంగ్లండ్ ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసుకుంది. కోల్‌కతా: వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ కూడా అభిమానులకు ఫుల్ వినోదాన్ని పంచింది. గత రెండు వన్డేలలాగే భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ ఒత్తిడిని అధిగమించగలిగింది. ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ (39 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో (64 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 316 పరుగులు చేయగలిగింది. కేదార్ జాదవ్ (75 బంతుల్లో 90; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత ప్రదర్శన కనబర్చగా, పాండ్యా (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (63 బంతుల్లో 55; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఛేదనలో జాదవ్, పాండ్యా ఆరో వికెట్‌కు 7.51 రన్‌రేట్‌తో 104 పరుగులు జోడించినా గెలుపు మాత్రం దక్కలేదు. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో చేదు అనుభవాన్ని రుచి చూసిన స్టోక్స్, ఈసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం. ఓవరాల్‌గా 232 పరుగులు చేసిన జాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఈ నెల 26న ప్రారంభమవుతుంది. మూడు భాగస్వామ్యాలు... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఫామ్‌లో లేని ధావన్ స్థానంలో రహానేకు అవకాశం ఇవ్వగా, ఇంగ్లండ్ జట్టులో కూడా గాయపడిన హేల్స్, రూట్ స్థానాల్లో బిల్లింగ్స్, బెయిర్‌స్టో వచ్చారు. ఆరంభంలో అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు భువనేశ్వర్, పాండ్యా పదునైన పేస్, బౌన్స్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను కట్టడి చేశారు. దాంతో నిలదొక్కుకునేందుకు చాలా సమయం తీసుకున్న రాయ్, బిల్లింగ్స్ (58 బంతుల్లో 35; 5 ఫోర్లు) తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగూ తీయలేకపోయారు. ఆ తర్వాత రాయ్ దూకుడు కనబర్చగా... తాను ఎదుర్కొన్న 11వ బంతికి మొదటి పరుగు తీసిన బిల్లింగ్స్ అనంతరం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఈ క్రమంలో రాయ్ 41 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 98 పరుగులు జోడించిన అనంతరం జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి బిల్లింగ్స్ అవుట్ కావడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జడేజా తర్వాతి ఓవర్లోనే రాయ్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో, మోర్గాన్ (44 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కలిసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. బుమ్రా బౌలింగ్‌లో 28 పరుగుల వద్ద బెయిర్‌స్టో క్యాచ్ ఇచ్చినా, అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. మూడో వికెట్‌కు 84 పరుగులు జత చేసిన తర్వాత మోర్గాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే ఇంగ్లండ్ మరో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో స్టోక్స్, వోక్స్ (19 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. స్టోక్స్ 34 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, బుమ్రా వేసిన ఒక ఓవర్లో వోక్స్ 16 పరుగులు రాబట్టాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 40 బంతుల్లోనే 73 పరుగులు జోడించడం విశేషం. చివరి 6 ఓవర్లలో ఇంగ్లండ్ 68 పరుగులు చేసింది. జాదవ్, పాండ్యా దూకుడు... అదృష్టవశాత్తూ తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో రహానే (1) విఫలం కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన రాహుల్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో కోహ్లి, యువరాజ్ (57 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కోహ్లి తన సహజ శైలిలో దూకుడుగా ఆడగా, యువీ కొంత సమయం తీసుకున్నాడు. 35 పరుగుల వద్ద బాల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో మరో అవకాశం దక్కించుకున్న కోహ్లి, 54 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. కొద్ది సేపటికే కోహ్లిని అవుట్ చేసిన స్టోక్స్ 65 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించగా, ప్లంకెట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి యువరాజ్ అవుటయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బ్యాక్‌ఫుట్‌పైనే జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన ధోని (36 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) కూడా గత మ్యాచ్ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. అయితే జాదవ్, పాండ్యా కలిసి భారత్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. మంచు కారణంగా ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పడటంతో దీనిని వీరిద్దరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకుంది. ముందుగా జాదవ్ 46 బంతుల్లో, ఆ తర్వాత పాండ్యా 38 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నారు. అయితే కీలక సమయంలో పాండ్యా అవుట్ కాగా, జడేజా (10), అశ్విన్ (1) అతడిని అనుసరించారు. చివర్లో జాదవ్ పోరాడినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) జడేజా 65; బిల్లింగ్స్ (సి) బుమ్రా (బి) జడేజా 35; బెయిర్‌స్టో (సి) జడేజా (బి) పాండ్యా 56; మోర్గాన్ (సి) బుమ్రా (బి) పాండ్యా 43; బట్లర్ (సి) రాహుల్ (బి) పాండ్యా 11; స్టోక్స్ (నాటౌట్) 57; అలీ (సి) జడేజా (బి) బుమ్రా 2; వోక్స్ (రనౌట్) 34; ప్లంకెట్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321. వికెట్ల పతనం: 1–98; 2–110; 3–194; 4–212; 5–237; 6–246; 7–319; 8–321. బౌలింగ్: భువనేశ్వర్ 8–0–56–0; పాండ్యా 10–1–49–3; బుమ్రా 10–1–68–1; యువరాజ్ 3–0–17–0; జడేజా 10–0–62–2; అశ్విన్ 9–0–60–0. భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) విల్లీ 1; రాహుల్ (సి) బట్లర్ (బి) బాల్ 11; కోహ్లి (సి) బట్లర్ (బి) స్టోక్స్ 55; యువరాజ్ (సి) బిల్లింగ్స్ (బి) ప్లంకెట్ 45; ధోని (సి) బట్లర్ (బి) బాల్ 25; జాదవ్ (సి) బిల్లింగ్స్ (బి) వోక్స్ 90; పాండ్యా (బి) స్టోక్స్ 56; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 10; అశ్విన్ (సి) వోక్స్ (బి) స్టోక్స్ 1; భువనేశ్వర్ (నాటౌట్) 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 316. వికెట్ల పతనం: 1–13; 2–37; 3–102; 4–133; 5–173; 6–277; 7–291; 8–297; 9–316. బౌలింగ్: వోక్స్ 10–0–75–2; విల్లీ 2–0–8–1; బాల్ 10–0–56–2; ప్లంకెట్ 10–0–65–1; స్టోక్స్ 10–0–63–3; అలీ 8–0–41–0. భారత గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా వ్యవహరించిన 20 మ్యాచ్‌లలో కోహ్లికి ఇదే తొలి పరాజయం. ఇంతకు ముందు 19 మ్యాచ్‌లలో 17 విజయాలు, 2 ‘డ్రా’లు ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలోనూ 300కు పైగా స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా, ఇరు జట్లు 1000కి పైగా పరుగులు చేయడం కూడా ఇదే మొదటిసారి. మూడు మ్యాచ్‌లు కలిపి అత్యధిక పరుగులు (2,090) కూడా ఇదే సిరీస్‌లో నమోదయ్యాయి. -
జాదూ చూపించాడు!
సత్తా చాటిన కేదార్ జాదవ్ అవకాశం అందిపుచ్చుకున్న మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ దేశవాళీలో అద్భుత రికార్డు రెండేళ్ల క్రితం కేదార్ జాదవ్ తన మిత్రులతో కలిసి థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో అతనికి తొలిసారి భారత జట్టులో స్థానం లభించినట్లు ఫోన్ వచ్చింది. కానీజాదవ్కు నిజంగా గుర్తింపు దక్కేందుకు మాత్రం ఆ ఎంపిక పనికి రాలేదు. మొదటి సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశమే రాకపోగా, భారత్ తరఫున బరిలోకి దిగేందుకు అతను మరో ఆరు నెలల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్లో ధాటిగా ఆడే బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు ఉండి, రికార్డు సంఖ్యలో పరుగులు కొల్లగొట్టిన తర్వాత కూడా జాదవ్ టీమిండియా సభ్యుడిగా మారేందుకు చాలా సమయం పట్టింది. స్థిరమైన చోటు లభించని వేళ, దక్కిన కొన్ని అవకాశాలను కూడా రెండు చేతులతో ఒడిసి పట్టుకోవాల్సిన స్థితిలో పుణే వన్డే అతని కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. కోహ్లిని మరిపించిన బ్యాటింగ్ కేదార్‌ను అందరూ గుర్తించేలా చేసింది. సాక్షి క్రీడా విభాగం ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా బౌలింగ్‌కు దిగి కేదార్ జాదవ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. బయటివాళ్ల సంగతేమో కానీ... భారత బౌలింగ్ మాజీ కోచ్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా విస్మయానికి లోనయ్యారు. ‘నేను నెట్స్‌లో కూడా ఎప్పుడూ జాదవ్ బౌలింగ్ చేయడం చూడలేదు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ మాత్రమే సాధన చేయడం నాకు తెలుసు’ అని ఆయన చెప్పారు. అయితే జాదవ్ అండర్–19 రోజుల నుంచి కూడా కోచ్‌గా పని చేసిన సురేంద్ర భావే మాత్రం కేదార్ అపార ప్రతిభావంతుడని ప్రశంసించారు. ఆలస్యంగా అవకాశం దక్కినా అతను తనను తాను నిరూపించుకోగలడని భావే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో సొంతగడ్డపై కుటుంబ సభ్యుల సమక్షంలో జాదవ్ ఆడిన ఇన్నింగ్స్ కోచ్ మాటలను నిజం చేసింది. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన కేదార్, తన ఎంపిక సరైందేనని నిరూపించాడు. రంజీల్లో దూకుడు... ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌తోనే, ఒక మెరుపు ప్రదర్శనతోనే భారత జట్టులోకి ఎంపికైన ఆటగాడు కాదు కేదార్. రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సీజన్లో నిలకడగా రాణిస్తూ భారీగా పరుగులు చేసిన అతను మహారాష్ట్ర జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా బాధ్యత నిర్వర్తించాడు. 2013–14 సీజన్లో 1,233 పరుగులు చేసి తమ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది ఆరు సెంచరీలు కూడా బాదాడు. అంతకుముందు సీజన్లోనే ట్రిపుల్ సెంచరీతో జాదవ్ సత్తా చాటాడు. మొదటినుంచీ దూకుడైన ఆటకు మారుపేరైన జాదవ్ 105 స్ట్రైక్ రేట్‌తో దేశవాళీ వన్డేల్లో పరుగులు సాధించడం విశేషం. 2014 ఐపీఎల్లో ఢిల్లీ జట్టు మొత్తం విఫలమైనా, అతను ఒక్కడే తనపై ఉంచిన రూ. 2 కోట్ల నమ్మకాన్ని నిలబెడుతూ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియాలో నాలుగు జట్ల టోర్నీని గెలుచుకోవడంలో కూడా జాదవ్‌దే కీలక పాత్ర. అవకాశం దక్కగానే... ఏడాదిన్నర క్రితం రహానే నేతృత్వంలో జింబాబ్వే పర్యటించిన జట్టులోకి ఎంపికైన కేదార్, అక్కడే తొలి సెంచరీని నమోదు చేశాడు. అయితే దాదాపు సంవత్సరం తర్వాత మరో జింబాబ్వే సిరీస్ వరకు అతనికి చాన్స్ రాలేదు. దురదృష్టవశాత్తూ అక్కడ మూడు వన్డేల్లో భారత్ తొందరగా లక్ష్యాన్ని ఛేదించడంతో ఒక్కసారి కూడా బ్యాటింగ్ రాలేదు. మొదటిసారి న్యూజిలాండ్‌తో పూర్తి స్థాయి సిరీస్ (ఐదు వన్డేలు) ఆడిన జాదవ్ ‘జాదూ’ ఏమిటో క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. ఈ సిరీస్‌లో తన బౌలింగ్ మెరుపులకు తోడు ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో 37 బంతుల్లో 41 పరుగులు చేసి బ్యాటింగ్ పదును కూడా చూపించాడు. కానీ ఇప్పుడు పుణే మ్యాచ్‌తో కేదార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 2016 ఐపీఎల్లో కోహ్లితో ఏర్పడిన సాన్నిహిత్యం అతని ఆటను మరింత తీర్చిదిద్దింది. ఇప్పుడు కోహ్లి అండతోనే అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వచ్చే మార్చిలో 32 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న కేదార్, మున్ముందు మరిన్ని గొప్ప మ్యాచ్‌లలో భాగం కావాలని పట్టుదలగా ఉన్నాడు. ‘జాదవ్ ఇన్నింగ్స్ గురించి అద్భుతం అనే మాట తప్ప మరొకటి చెప్పను. అతను కొట్టిన కొన్ని షాట్లను నేను నిజంగా నమ్మలేకపోయాను. ఏదో గుడ్డిగా బ్యాట్ ఊపినట్లు కాకుండా అతను చాలా బాగా ఆడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ గెలవగలమనే పట్టుదల ఉన్న ఇలాంటి బ్యాట్స్‌మన్ లభించడం ఆనందంగా ఉంది’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
‘జాదవ్ రెచ్చిపోతాడనుకోలేదు’
పుణె: మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియాను ఓడించాలన్న తమ వ్యూహాలను కేదార్ జాదవ్ చిత్తు చేశాడని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వాపోయాడు. జాదవ్ చెలరేగుతాడని తాము ఊహించలేదని అన్నాడు. ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో జాదవ్ విజృభించి సెంచరీ చేయడంతో కోహ్లి సేన శుభారంభం చేసింది. ‘భారత్ 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మా కష్టాలు మొదలయ్యాయి. మిడిలార్డర్ లో మేము బ్యాటింగ్ బాగానే చేశాం కానీ బౌలింగ్ లో మాత్రం తడబడ్డాం. జాదవ్ విజృభించి ఆడతాడని మేము ఊహించలేదు. టీమిండియా విజయం ఘనత 65 బంతుల్లో సెంచరీ చేసిన అతడికే దక్కుతుంది. మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బాదాడం మొదలు పెట్టాడు. మాకు అసలు అవకాశం ఇవ్వలేద’ని మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ కు ముందు జాదవ్ ఆటతీరును అధ్యయం చేశామని, అయితే సీరియస్ గా తీసుకోలేదని వెల్లడించాడు. ‘అంతర్జాతీయ మ్యాచుల్లో జాదవ్ ఆడిన మ్యాచ్‌లను చూశాం. అతడిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. జాదవ్ ను కట్టడి చేసేందుకు మరింత కసరత్తు చేయాల్సిందని మ్యాచ్ ముగిసిన తర్వాత అనిపించింద’ని మోర్గాన్ చెప్పాడు. కోహ్లిని కట్టికి చేసేందుకు తమ వ్యూహాలు ఫలించలేదని అన్నాడు. -
పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్
పుణె:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన కేదర్ జాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ యువ క్రికెటర్‌పై పలువురు మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపించగా, మన ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కేదర్ జాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ గెలవడం ఒకేసారి పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుందని సెహ్వాగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. భారత్ విజయం తరువాత తొలి ట్వీట్ లో జై జాదవ్ అని పేర్కొన్న సెహ్వాగ్.. ఆ తరువాత 'దస్ గుణ లగాన్ వసూల్' అంటూ మరో ట్వీట్ చేశాడు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి(122;105 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు), జాదవ్(120;76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ప్రధాన పాత్ర పోషించి భారత్ కు గెలుపు అందించారు. ఈ ఏడాదిని భారత క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించడంపై సచిన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారత జైత్రయాత్రకు తొలి అడుగు అంటూ వారు కొనియాడారు. Jai Kedar ! — Virender Sehwag (@virendersehwag) 15 January 2017 Hahahahahaha ! Dus Guna Lagaan Vasool.#INDvENG — Virender Sehwag (@virendersehwag) 15 January 2017 -
విరాట్ కోహ్లి కంటే..
పుణె:ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కేదర్ జాదవ్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అద్బుతమైన ఇన్నింగ్స్ తో భారత్ కు చారిత్రక విజయాన్ని అందించాడంటూ జాదవ్‌ను గంగూలీ కొనియాడాడు. ప్రత్యేకంగా కెప్టెన్ విరాట్ కొహ్లి ఆడిన ఇన్నింగ్స్ కంటే జాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అత్యుద్భుతంగా ఉందని ప్రశంసించాడు.' జాదవ్ ప్రదర్శన నిజంగా అసాధారణం. భారీ పరుగుల ఛేజింగ్ లో జాదవ్ చూడ చక్కటైన ఇన్నింగ్స్ ఆడాడు. నా దృష్టిలో కోహ్లి కంటే జాదవ్‌నే మెరుగ్గా ఆడాడు. మన విజయాల్లో ఎప్పుడూ విరాట్ కోహ్లి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం జాదవ్ గురించి కచ్చితంగా మాట్లాడిల్సిన అవసరం ఉంది. భారత జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో జాదవ్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతోనే భారత్‌కు విజయం సాధ్యమైంది. ఇక్కడ మొత్తం క్రెడిట్ జాదవ్ కు ఇవ్వాల్సిందే'అని గంగూలీ తెలిపాడు. ఇదిలా ఉంచితే, భారత్ విజయంలో తన పాత్ర ఉండటంపై జాదవ్ హర్హం వ్యక్తం చేశాడు. భారత విజయాల్లో తన పాత్ర ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, అందులోనూ సొంత గ్రౌండ్లో సెంచరీ చేసి జట్టుకు చక్కటి విజయాన్ని అందివ్వడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులు సమక్షంలో కీలక ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉందన్నాడు. తాను చాలాసార్లు విరాట్ కోహ్లి కలిసి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయానని, ఈ మ్యాచ్ ద్వారా అది తీరిందని మ్యాచ్ ముగిసిన తరువాత జాదవ్ పేర్కొన్నాడు. -
కలిసి కొట్టారు
► జాదవ్, కోహ్లి సెంచరీలు ► 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ► 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పరాజయం ► వన్డే సిరీస్‌లో 1–0 ఆధిక్యం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి ఎదురుగా ఉండగా, అతడిని మించి ఆడటం మరో బ్యాట్స్‌మన్‌కు సాధ్యమా? కోహ్లి తర్వాత వచ్చి అతనికంటే వేగంగా పరుగులు చేసి అతడిని దాటేయడం మరొకరి వల్ల జరిగే పనేనా? కానీ కేదార్ జాదవ్ దీనిని చేసి చూపించాడు. తనకు అందివచ్చిన అతి స్వల్ప అవకాశాల్లోనే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్న జాదవ్, ఇప్పుడు కెరీర్‌ను మలుపు తిప్పే చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 200 పరుగుల భాగస్వామ్యంలో కోహ్లి 80 బంతుల్లో 95 పరుగులు చేస్తే... మరోవైపు జాదవ్ 67 బంతుల్లోనే 102 పరుగులు బాదేశాడు. బాధ్యత పెరిగినా అది భారం కాదని నిరూపిస్తూ కోహ్లి తనదైన రీతిలో ఛేదనలో మరో సెంచరీతో చెలరేగితే... సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో జాదవ్ మరాఠీ మాయను చూపించాడు. 63 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. 351 పరుగుల ఛేదనలో ఇది మంచి ఆరంభం మాత్రం కాదు. కోహ్లి క్రీజ్‌లో ఉన్నా, మరో ఎండ్‌లో సహకరించే భాగస్వామి అవసరమయ్యాడు. ఆ బాధ్యత కేదార్ తీసుకున్నాడు. కండరాలు పట్టేయడంతో ఇబ్బందిగా కదిలినా కెప్టెన్‌కు అండగా నిలిచాడు. టి20 తరహాలో వీరిద్దరు ఏకంగా 8.16 రన్‌రేట్‌తో పాతిక ఓవర్ల పాటు ఆగకుండా పరుగులు బాదడం ఇంగ్లండ్‌ను నివ్వెరపోయేలా చేసింది. ఫలితంగా అసాధ్యం అనుకున్న చోట కూడా 11 బంతులు మిగిలి ఉండగానే గెలుపు దక్కించుకున్న భారత్ సగర్వంగా నిలబడింది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో దక్కిన అద్భుత విజయం కోహ్లి మోముపై చిరునవ్వులు పూయించింది. పుణే: టెస్టు సిరీస్‌లో ఘన విజయం తర్వాత ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ కోహ్లి సేన శుభారంభం చేసింది. భారీ స్కోరును ఛేదించి తన స్థాయికి తగ్గ ఆటతీరును మరోసారి ప్రదర్శించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు సాధించింది. జో రూట్ (95 బంతుల్లో 78; 4 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (61 బంతుల్లో 73; 12 ఫోర్లు), స్టోక్స్ (40 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 7 వికెట్లకు 356 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 19న (గురువారం) కటక్‌లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... తొలి పది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 67 పరుగులు... ఇందులో జేసన్ రాయ్ చేసినవే 52 ఉన్నాయంటే అతను ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. బుమ్రా విసిరిన డైరెక్ట్ త్రోకు హేల్స్ (9) ఆరంభంలోనే రనౌటైనా... రాయ్ చెలరేగడంతో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. ముఖ్యంగా పేసర్ ఉమేశ్ బౌలింగ్‌లో చెలరేగిపోయిన అతను 6 బౌండరీలు బాదాడు. 18 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీగా అవుట్ ఇచ్చినా... రివ్యూకు వెళ్లిన రాయ్ బతికిపోయాడు. బుమ్రా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జడేజా బౌలింగ్‌లో రాయ్ స్టంపౌట్ కావడంతో 69 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రూట్, మోర్గాన్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును నడిపించారు. తనదైన శైలిలో కళాత్మక షాట్లతో ఆకట్టుకున్న రూట్ 72 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మోర్గాన్ వెనుదిరిగిన తర్వాత రూట్, బట్లర్ (36 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) మధ్య కూడా మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో మరో భారీషాట్‌కు ప్రయత్నించి రూట్ నిష్క్రమించాడు. 42 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 245. అంతే... తర్వాతి ఎనిమిది ఓవర్ల పాటు ఇంగ్లండ్ విధ్వంసం కొనసాగింది. ముఖ్యంగా స్టోక్స్ భారీ సిక్సర్లతో చెలరేగిపోవడంతో పరుగుల వరద పారింది. అతనికి మొయిన్ అలీ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో 16 పరుగులు రాగా, ఉమేశ్ వేసిన ఓవర్లో ఇంగ్లండ్ 20 పరుగులు పిండుకుంది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 105 పరుగులు చేసింది. కోహ్లి, జాదవ్ జుగల్బందీ... భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుగైన ఆరంభం లభించలేదు. విల్లీ తన వరుస ఓవర్లలో ధావన్ (1), లోకేశ్ రాహుల్ (8)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ తీశాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్ బాదిన యువరాజ్ సింగ్ (15) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, కోహ్లి కెప్టెన్సీలో తొలి మ్యాచ్ ఆడుతున్న ధోని (6) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో జత కలిసిన కోహ్లి, జాదవ్ అద్భుత భాగస్వామ్యంతో చెలరేగారు. చూస్తుండగానే కోహ్లిని దాటిపోయిన జాదవ్, 29 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి జోడీని అడ్డుకునేందుకు ఇంగ్లండ్ ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఇద్దరి జోరు కొనసాగడంతో భారత్ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఈ క్రమంలో ముందుగా కోహ్లి 93 బంతుల్లో (కెరీర్లో 27వ), ఆ తర్వాత జాదవ్ 65 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఒత్తిడికి లోను కాకుండా హార్దిక్ పాండ్యా (37 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ►17 ఛేదనలో చేసిన సెంచరీల సంఖ్యలో సచిన్ (17)తో కోహ్లి సమంగా నిలిచాడు. వీటిలో 15 సార్లు భారత్ గెలిచింది. ఈ విషయంలో అతను సచిన్ (14)ను అధిగమించాడు. ► 3 భారత్ 350కి పైగా పరుగులు ఛేదించడం ఇది మూడోసారి.మూడు సందర్భాల్లోనూ కోహ్లి సెంచరీ చేశాడు. ► 1 భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో డీఆర్ఎస్ ఉపయోగించడం ఇదే తొలిసారి. -
బౌలర్ గా మారి అతుక్కుపోయాడు!
మొహాలీ:ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లు తమకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపెట్టడం లేదు. ప్రస్తుతం భారత క్రికెట్లో కీలకంగా మారిన జస్ప్రిత్ బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమకు ఇచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకుని జట్టులో సెటిల్ అయిపోయారు. మరోవైపు మరో్ యువ క్రికెటర్ మనీష్ పాండే కూడా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దాంతో జట్టులో స్థానం ఆశిస్తున్న పలువురు వెటరన్స్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్ మరోసారి ఊహించని విధంగా జట్టులోకి వచ్చి అతుక్కుపోయాడు. 2014 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత వన్డే జట్టులో అరంగేట్రం చేసిన కేదర్ జాదవ్‌కు ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. తన అరంగేట్రం తరువాత ఇప్పటివరకూ 10 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కేదర్ జాదవ్.. తొలుత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. దానిలో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వికెట్ కీపర్ గా పూర్తి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు కూడా. అయితే మారుతున్న పరిస్థుతుల దృష్ట్యా న్యూజిలాండ్ తో సిరీస్ లో అతను ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా మారాడు. ఇప్పుడు అదే ఆ క్రికెటర్ కు వరంలా మారింది. ఈ వన్డే సిరీస్‌లో అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్న జాదవ్.. అటు బ్యాట్స్తోనూ, ఇటు బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకూ జరిగిన మూడు వన్డేల్లో జాదవ్ ఆరు వికెట్లు సాధించాడు. తొలి వన్డేలో రెండు వికెట్లు తీసిన ఈ క్రికెటర్.. రెండో వన్డేలో 11 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. కాగా, కీలకమైన మూడో వన్డేలో మూడు వికెట్లు తీసి కివీస్ టాపార్డర్‌కు షాకిచ్చాడు. న్యూజిలాండ్ 12.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసి పటిష్టంగా ఉన్న స్థితిలో కెప్టెన్ విలియమ్సన్ ను ఎల్బీగా పెవిలియన్ కు పంపడంతో వికెట్ల వేటను ఆరంభించిన కేదర్.. ఆ తరువాత రాస్ టేలర్, టామ్ లాధమ్లను అవుట్ అవుట్ చేసి అతనిలో బౌలింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. అయితే ఈ వికెట్లను తీసే క్రమంలో అతను వేసిన ఓవర్లు 10 మాత్రమే కావడం విశేషం. కేవలం మూడు వన్డేల్లో 60 బంతులు మాత్రమే వేసిన కేదర్.. 10.0 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. మరోవైపు తొలి వన్డేలో 10 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కేదర్.. రెండో వన్డేలో 41 పరుగులు చేశాడు. దాంతో తాను కూడా ఆల్ రౌండర్ గా సరిపోతాననే సంకేతాల్ని పంపాడు ఈ 31 ఏళ్ల క్రికెటర్. -
'అతని బ్యాటింగ్ ఆర్డర్ లోమార్పు అనవసరం'
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అనవరసమని ఆ జట్టు ఆటగాడు కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు. రేపటి మ్యాచ్‌లో సర్ఫరాజ్ బ్యాటింగ్ స్థానాన్ని ఏమైనా మారుస్తారా?అన్న ప్రశ్నకు జాదవ్ బదులిచ్చాడు. 'సర్పరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పైకి తీసుకురావాల్సి అవసరం లేదు. ఐదో స్థానంలోసర్పరాజ్ మెరుగ్గా ఆడుతున్నాడు. అటువంటప్పుడు మార్పులు అనవసరం'అని కేదర్ స్పష్టం చేశాడు. తమ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఆటపై ఎటువంటి ఆందోళనా లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతి గేల్ ప్యాడ్లను తాకి వికెట్లను నేలకూల్చిందని, అది నిజంగా అతని బ్యాడ్‌లక్ మాత్రమేనని కేదర్ తెలిపాడు. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
♦ రాణించిన కేదార్ జాదవ్ ♦ దేవధర్ ట్రోఫీ కాన్పూర్ కేదార్ జాదవ్ (61 బంతుల్లో 91 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి తిరుపతి రాయుడు (89 బంతుల్లో 75; 9 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు... దేవధర్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’.. 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 49.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగినా... మిగతా వారు నిరాశపర్చారు. అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.2 ఓవర్లలో 4 వికెట్లకు 273 పరుగులు చేసింది. ఓపెనర్ ఫజల్ (53) అర్ధసెంచరీతో శుభారంభం ఇచ్చాడు. మెహుల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. గురువారం జరిగే ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు... భారత్ ‘బి’తో తలపడుతుంది. -
ఈసారి ఆర్సీబీకి కేదర్ జాదవ్!
న్యూఢిల్లీ:గత మూడు సీజన్ల నుంచి వరుసగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడుతున్నమహరాష్ట్ర ఆటగాడు కేదర్ జాదవ్.. రాబోవు సీజన్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు జాదవ్ ను ఆర్సీబీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇటీవల పుణె, రాజ్ కోట్ జట్లుకు జరిగిన వేలం అనంతరం జాదవ్ జట్టు మార్పే మొదటిదిగా ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. దీనిపై ఆర్సీబీ ఓనర్ విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ట్వంటీ 20ల్లో జాదవ్ చాలా విలువైన ఆటగాడని పేర్కొన్నారు. జాదవ్ తమ జట్టుతో కలవడంతో రాయల్ చాలెంజర్స్ మిడిల్ ఆర్డర్ మరింత బలపడుతుందన్నారు. 2016 సీజన్ లో జాదవ్ రాణిస్తాడని మాల్యా ఆశాభావం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రముఖ క్రికెటర్లు ఉన్న తమ జట్టులో జాదవ్ కలవడం నిజంగానే తమకు అదనపు బలమని మాల్యా తెలిపారు. -
రాణించిన రాయుడు, జాదవ్
డార్విన్: తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా-ఎ జట్టును భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ మనోజ్ కుమార్ తివారి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాయుడు 77, జాదవ్ 42, శామ్సన్ 49, పర్వేజ్ రసూల్ 20, ఊతప్ప 13 పరుగులు చేశారు. -
జాదవ్, శామ్సన్ అర్థ సెంచరీలు
డార్విన్: కేదార్ జాదవ్, సంజూ శామ్సన్ రాణించడంతో ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ పెర్మారెన్స్ స్క్వాడ్(ఎన్పీఎస్)పై భారత్ 'ఎ' జట్టు విజయం సాధించింది. మంగళవారమిక్కడ జరిగిన వన్డేలో 3 వికెట్ల తేడాతో ఎన్పీఎస్ ను ఓడించింది. ఎన్పీఎస్ నిర్దేశించిన 235 పరుగుల లక్ష్యాన్ని 61 బంతులు మిగులుండానే అధిగమించింది. 39.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. జాదవ్(87), శామ్సన్(55) అర్థ సెంచరీలు సాధించారు. జాదవ్ 53 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. ఊతప్ప 17, వోహ్రా 25, ఆర్ ధావన్ 22 పరుగులు చేశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఎన్పీఎస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.