
టీమిండియా మలింగా అతడే..!
ముంబై: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్లను బెంబెలెత్తించడంలో మలింగా స్టైలే వేరే. మరి ఆ తరహా బౌలర్ భారత జట్టులో ఉన్నాడా అంటే జస్ఫ్రిత్ బూమ్రా గురించి చెప్పుకోవాలి. తన వైవిధ్యమైన యాక్షన్ తో పాటు యార్కర్లతో భయపెట్టే ఆటగాడు బూమ్రాకు మలింగాకు పోలికలున్నాయని అభిమానులు అభిప్రాయపడుతుంటారు.
కాగా, ఇక్కడ మలింగా యాక్షన్ ను పోలిన క్రికెటర్ భారత్ జట్టులో స్పిన్నర్ రూపంలో ఉన్నాడట. అతనే కేదర్ జాదవ్ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మలింగా-జాదవ్ల యాక్షన్ ఫోటోను పోస్ట్ చేశాడు. 'ఆందోళన వద్దు.. మనకు ఒక మలింగా ఉన్నాడు' అని ఫోటో కింద క్యాప్షన్ ను జోడించాడు.