Lasith Malinga
-
యార్కర్ కింగ్ లసిత్ మలింగా పాడిన ఈ పాట విన్నారా?
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. దశాబ్దన్నర పాటు క్రికెట్లో తన కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. సింగర్‌గా సరికొత్త అవతారం ఎత్తారు. సాంగ్ రైటర్‌గా ఇప్పటికే ఎంటర్టైన్ చేస్తున్న ఈ స్పీడ్ స్టర్ ఈసారి మరో సాంగ్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శ్రీలంక సింగర్లతో గొంతు కలిపారు. ఆయన పాడిన పాటలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఓ సాంగ్‌ను పాడారు. ఇప్పుడా ఆ సాంగ్ సంగీత ప్రియుల్ని అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట ఎలా ఉందో మీరూ వినేయండి.From Slinga Malinga to Singer Malinga!One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్‌ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు) ఉన్నారు. స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్‌కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హసరంగకు ముందు ఈ రికార్డు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో హసరంగ.. మలింగ రికార్డును అధిగమించాడు.మలింగ 84 అంతర్జాతీయ టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. హసరంగ తన 67వ టీ20 మ్యాచ్‌లోనే ఈ మార్కును దాటాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తౌహిద్ హ్రిదోయ్ వికెట్ పడగొట్టడం ద్వారా హసరంగ (108 వికెట్లు) శ్రీలంక తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో హసరంగ హ్రిదోయ్ వికెట్‌తో పాటు మరో వికెట్ (లిట్టన్ దాస్) కూడా పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో హసరంగతో పాటు నువాన్ తుషార (4-0-18-4), మతీశ పతిరణ (4-0-27-1), ధనంజయ డిసిల్వ (2-0-11-1) సత్తా చాటినా శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అత్యంత పేలవంగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (47) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ 2, తంజిమ్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు ప్రతిఘటించినప్పటికీ మరో ఓవర్ మిగిలుండగానే (8 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. లిటన్ దాస్ (36), తౌహిద్ హ్రిదోయ్ (40), మహ్మదుల్లా (16 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్నందించారు.టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-108 వికెట్లుమలింగ- 107కులశేఖర- 66అజంత మెండిస్-66దుష్మంత చమీరా-55 -
#MI: హార్దిక్ రాగానే కోపంగా వెళ్లిపోయిన మలింగ! పొలార్డ్ సైతం..
ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే ట్రెండింగ్‌లోకి వస్తున్నాడు. సారథిగా తప్పిదాలు చేయడమే గాకుండా.. సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఐపీఎల్-2024లో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడినపుడు.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. ప్రధాన పేసర్, ఎంఐ సీనియర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ ఏడో స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఆరు పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో 31 రన్స్ తేడాతో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడ కూడా పాండ్యా.. అరంగేట్ర క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్ ఎటాక్‌ను ఆరంభించాడు. మరోసారి.. బుమ్రాను పక్కనపెట్టి మూల్యం చెల్లించాడు. Hardik didn't even tried to stop Malinga from getting up and leaving the chair for him. Look at the face of Pollard even he is not comfortable. Pandya doesn't know how to respect seniors. He could have brought new chair 😡😡#MIvsSRH #SRHvMI #RohitSharma𓃵 #klaasen #HardikPandya pic.twitter.com/araISohypL — Rishabh (@iamrishabhNP) March 27, 2024 ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో పాండ్యా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అనంతరం మరో వీడియో కూడా తెరమీదకు వచ్చింది. ఇందులో బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మలింగ కుర్చీల్లో కూర్చుని ఉండగా.. హార్దిక్ అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పొలార్డ్‌ను చెయ్యిపట్టి ఆపిన మలింగ.. కుర్చీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఆ తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న పాండ్యా పొలార్డ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా.. ముంబై ఇండియన్స్‌లో ఇప్పుడు పాండ్యా పెత్తనమే నడుస్తోందని.. ఇది ఎవరికీ మింగుడుపడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Im the captain 💙 HARDIK 😎 Give me my chair 🪑 #HardikPandya #pollard#malinga#SRHvMI #MIvsSRH pic.twitter.com/gixxZFj7Qn — கீரிபுள்ள 2.0❤️🔥MSD 💛CSK 💛AMARAN🤓 (@ssv__remo) March 27, 2024 -
IPL 2024 SRH Vs MI: మలింగ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన రోజురోజుకు మితిమీరిపోతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించలేకపోయిన పాండ్యా.. తన ఓవరాక్షన్ కారణంగా సొంత అభిమానులకు కూడా బద్ద శత్రువుగా మారిపోయాడు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తనకంటే చాలా సీనియర్ అయిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల అమర్యాదగా (ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద రోహిత్‌ను అటు ఇటు తిప్పాడు) ప్రవర్తించిన హార్దిక్.. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టు బౌలింగ్ కోచ్, పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ పట్ల కూడా అంతే అగౌరవంగా ప్రవర్తించాడు. సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం బృంద సభ్యులతో కరచాలనం చేస్తుండగా హార్దిక్ మలింగను అయిష్టంగా తోసేసినంత పని చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న హార్దిక్.. తన ప్రవర్తన కారణంగా మరిన్ని చిక్కులు తెచ్చుకునేలా ఉన్నాడు. hardik pandya is clearly hurt💔 (See how he met malinga)#TATAIPL #SRHvsMi #IPL2024live pic.twitter.com/tOrfG1rbYI — 𝔸𝕪𝕒𝕒𝕟 (@Retired__hurt) March 27, 2024 హార్దిక్ సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తాడని ఇదివరకే చాలా సందర్భాల్లో నిరూపితమైనప్పటికీ.. ఎంఐ యాజమాన్యం అండదండలు ఉండటంతో అతని ఆటలు సాగుతున్నాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనంతరం మలింగను అవమానించిన సందర్భానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. హార్దిక్‌పై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న రోహిత్ అభిమానులు ఈ వీడియోను చూసి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. హార్దిక్‌ను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్‌కు జట్టులో సహచర ఆటగాళ్లతో సఖ్యత లేదన్న విషయాలను హైలైట్ చేస్తున్నారు. ప్రస్తుత జట్టులో హార్దిక్, ఇషాన్ కిషన్ ఒకవైపు.. మిగతా ఆటగాళ్లంతా మరోవైపు ఉన్నారని అంటున్నారు. ఈ విషయాన్ని దైనిక్ జాగ్రన్ అనే వెబ్సైట్ కూడా వెల్లడించింది. కాగా, సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైకు ఇది వరసగా రెండో ఓటమి. -
చరిత్ర సృష్టించిన ధోని శిష్యుడు..
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరన అదగొట్టాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఆఖరి టీ20లో కూడా రెండు వికెట్లతో సత్తాచాటాడు. ఓవరాల్‌గా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పతిరన 8 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్‌గా మతీషా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో తన ఆరాధ్య బౌలర్, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. అదే ఏడాది మరో శ్రీలంక పేసర్ తుషారా పాకిస్తాన్‌పై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత 2022లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి మలింగతో పాటు సంయుక్తంగా నిలిచాడు. కానీ వీరివ్వరూ కూడా మలింగను అధిగమించలేకపోయారు. తాజా మ్యాచ్‌తో 5 ఏళ్ల మలింగ ఆల్‌టైమ్ రికార్డును పతిరన బ్రేక్ చేశాడు. కాగా పతిరన ఐపీఎల్లో ధోని సారథ్యంలోని సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అతడిని ధోని శిష్యుడంటూ పిలుస్తుంటారు. -
Aus Vs Pak: చెత్త బౌలింగ్.. అయినా వరల్డ్‌కప్‌లో అరుదైన ఘనత!
ICC ODI WC 2023: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ లెజెండరీ పేస్ బౌలర్ వసీం అక్రం పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆసీస్ శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్‌కు.. కంగారూ ఓపెనర్లు చుక్కలు చూపించారు. డేవిడ్ వార్నర్- మిచెల్ మార్ష్ కలిసి మొదటి వికెట్‌కు రికార్డు స్థాయిలో 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 367 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే పరిమితం కావడంతో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం(18), మహ్మద్ రిజ్వాన్(46), ఇఫ్తికార్ అహ్మద్(26) రూపంలో కీలక వికెట్లు తీయడంతో పాటు మహ్మద్ నవాజ్(14) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్టార్క్ మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 65 పరుగులు సమర్పించుకుని.. ఒక (హసన్ అలీ(8)) వికెట్ తీయగలిగాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వసీం అక్రంతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు ►గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా)- 39 మ్యాచ్‌లలో 71 వికెట్లు ►ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)- 40 మ్యాచ్‌లలో 68 వికెట్లు ►లసిత్ మలింగ(శ్రీలంక)- 29 మ్యాచ్‌లలో 56 వికెట్లు ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 22 మ్యాచ్‌లలో 55 వికెట్లు ►వసీం అక్రం(పాకిస్తాన్)- 38 మ్యాచ్‌లలో 55 వికెట్లు. ►►వసీం అక్రం కంటే వేగంగా స్టార్క్ 55 వికెట్లు తీయడం గమనార్హం. చదవండి: WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024: ముంబై ఇండియన్స్ ప్రకటన.. అతడితో తెగదెంపులు! కొత్త కోచ్‌గా..
IPL 2024- Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2024 సీజన్లో తమ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడినవారే కావడం విశేషం. బ్యాటింగ్ కోచ్‌గా విండీస్ దిగ్గజం కాగా తమ బ్యాటింగ్ కోచ్‌గా ముంబై ఫ్రాంఛైజీ ఇప్పటికే వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగను తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలిపింది. నాకు దక్కిన గౌరవం: బౌలింగ్ కోచ్ మలింగ ఇక తన నియామకంపై స్పందించిన మలింగ.. ‘‘ఇప్పటికే ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్టౌన్లతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడిని కావడం గొప్పగా అనిపిస్తోంది. పోలీ, రోహిత్, మార్క్‌లతో పాటు జట్టు మొత్తానికి మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం వస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంతో నాకు కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ప్రతిభావంతులైన యువ బౌలర్లకు మార్గదర్శనం చేయడం నాకు దక్కిన గౌరవం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. షేన్ బాండ్‌తో తెగదెంపులు కాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ షేన్ బాండ్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. తొమ్మిదేళ్లపాటు ముంబై ఇండియన్స్ కోచ్‌గా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌తో ఫ్రాంఛైజీ తెగదెంపులు చేసుకున్న తరుణంలో మలింగకు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్లలో సభ్యుడు ఇక ఆటగాడిగా మలింగ ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచి 2020 వరకు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో భాగంగా 122 మ్యాచ్‌లు ఆడి రికార్డు స్థాయిలో 170 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడైన మలింగ ఖాతాలో నాలుగు టైటిళ్లు ఉన్నాయి. ఇక ప్లేయర్‌గా 2021లో రిటైరైన తర్వాత మలింగ బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు 2022, 2023 సీజన్లలో పేస్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముంబై క్యాంపులో పునరాగమనం చేయనున్నాడు. చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి 𝗕𝗔𝗧𝗧𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄿🄾🄻🄻🄰🅁🄳 𝗕𝗢𝗪𝗟𝗜𝗡𝗚 𝗖𝗢𝗔𝗖𝗛 - 🄼🄰🄻🄸🄽🄶🄰 Paltan, आता कसं वाटतय? 🤩#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan @malinga_ninety9 @KieronPollard55 pic.twitter.com/bdPWVrfuDy — Mumbai Indians (@mipaltan) October 20, 2023 -
CWC 2023: పాపం మతీష పతిరణ! జూనియర్ మలింగగా పేరొచ్చినా...
శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్‌లలోనూ చెరో వికెట్ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డికాక్, డస్సెన్, మార్క్రమ్ పతిరణకు బౌలింగ్‌లో పరుగుల వరద పారిస్తే... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ అతని బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్ యాక్షన్ ద్వారా జూనియర్ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్‌ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు. యువ బౌలర్.... ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113)లు తమ సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. -
IPL 2024: ముంబై ఇండియన్స్‌లో మలింగ రీఎంట్రీ! అతడి స్థానంలో..
Lasith Malinga returns to MI?: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగ ముంబై ఇండియన్స్‌లో పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఎంఐ బౌలింగ్ కోచ్‌గా మలింగ తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. షేన్ బాండ్ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో వికెట్లు కాగా 2008 నుంచి 2020 వరకు మలింగ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. మొత్తంగా 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ పేసర్ రికార్డు స్థాయిలో 170 వికెట్లు పడగొట్టాడు. 2021లో రిటైరైన తర్వాత బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తిన మలింగ రాజస్తాన్ రాయల్స్ క్యాంపులో చేరాడు. రాజస్తాన్ రాయల్స్‌తో 2022, 2023 సీజన్లలో రాయల్స్ పేస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన రాజస్తాన్.. ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. యుజీ చహల్‌తో మలింగ (PC: IPL) ఈ నేపథ్యంలో లసిత్ మలింగ రాయల్స్‌ను వీడి ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఎంఐతో తొమ్మిదేళ్లుగా అనుబంధం కొనసాగిస్తున్న షేన్ బాండ్.. ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకుంటున్న తరుణంలో అతడి స్థానాన్ని మలింగ భర్తీ చేయనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో కథనంలో పేర్కొంది. నాలుగుసార్లు ట్రోఫీ గెలిచి లసిత్ మలింగ ఖాతాలో నాలుగు ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. 2013, 2015, 2017, 2019లో ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో అతడు సభ్యుడు. ఇదిలా ఉంటే.. తాజా ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి విజేతగా అవతరించి ముంబై రికార్డును సమం చేసింది. చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం Lasith Malinga has replaced Shane Bond as Mumbai Indians' bowling coach for IPL 2024. (Espncricinfo). pic.twitter.com/5fgHDEkHpI — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
Ind Vs WI: భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. అదే జరిగితే
West Indies vs India, 4th T20I: వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్‌తో టీ20లలో అడుగుపెట్టాడు. హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేయగలిగాడు. ఊరిస్తున్న భారీ రికార్డు టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్‌ను భారీ రికార్డు ఊరిస్తోంది. సెంచరీ వికెట్ల క్లబ్లో చేరేందుకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు. పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా? కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్‌పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్‌లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140 టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134 రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130 ఇష్ సోధి- న్యూజిలాండ్-118 లసిత్ మలింగ- శ్రీలంక- 107 షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104 ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు -
పాక్ నుంచి పుట్టుకొచ్చిన బౌలర్.. మలింగను గుర్తుచేస్తూ
పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు. Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52— Vitality Blast (@VitalityBlast) July 4, 2023 చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
పతిరణపై ధోని కామెంట్లు! మండిపడ్డ మలింగ.. ఎంఎస్ కరెక్ట్ అన్న లంక మరో పేసర్!
IPL 2023- Matheesa Pathirana- CSK: మతీశ పతిరణ.. ‘బేబీ మలింగ’గా పేరొందిన ఈ శ్రీలంక బౌలర్.. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనడంలో సందేహం లేదు. తన వైవిధ్యమైన టెక్నిక్‌తో బ్యాటర్లను తిప్పలు పెట్టే 20 ఏళ్ల పతిరణ.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. ముఖ్యంగా జట్టుకు అవసరమైన సమయంలో డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. వరుస అవకాశాలు ఇచ్చిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో పతిరణను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలను.. లంక మాజీ స్టార్ లసిత్ మలింగ ఖండించగా.. మరో లంక పేసర్ చమిందా వాస్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టెస్టులు ఆడొద్దు బేబీ మలింగ గురించి ధోని మాట్లాడుతూ.. పతిరణ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కావాలని.. టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించాడు. వన్డేలు, టీ20లకు మాత్రమే లంక అతడి సేవలను ఉపయోగించుకోవాలని సూచన చేశాడు. గాయాల బారిన పడితే కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ధోని వ్యాఖ్యలు ఖండించిన మలింగ అయితే, మలింగ మాత్రం ఈ విషయంలో ధోనిని వ్యతిరేకించాడు. గాయాలకు భయపడి టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని.. సంప్రదాయ క్రికెట్ ఆడితేనే టెక్నిక్ మెరుగుపడుతుందని పేర్కొన్నాడు. తాను కూడా టెస్టులు ఆడిన వాడినేనని.. ధోని గనుక సీరియస్‌గానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అవి ఆమోదనీయం కాదంటూ ఖండించాడు. కానీ, చమింద వాస్ మాత్రం ధోని వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. ‘‘పతిరణ లాంటి బౌలర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అతడి లాంటి వైవిధ్యమైన, ప్రత్యేకమైన యాక్షన్ కలిగిన బౌలర్ ఒకవేళ అన్ని ఫార్మాట్లలో ఆడితే ఫిట్నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తే పెద్దగా భారం పడదు. అంతకంటే ఎక్కువసేపు రోజుల తరబడి బౌల్ చేయాలంటే సమస్యలు తప్పవు. ధోని మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరిన టీమిండియా.. కోహ్లి, అశ్విన్ లేకుండానే..! -
KKR VS RR: గురువు రికార్డును సమం చేసిన చహల్
రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్‌కు ఐపీఎల్-2023 సీజన్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఈ సీజన్లో రికార్డులు బద్దలు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న చహల్.. నిన్న (మే 11) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అత్యుత్తమ రికార్డును తన పేరిట లిఖించుకోవడంతో పాటు పలు సాధారణ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన చహల్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించడంతో పాటు ఈ సీజన్ టాప్ వికెట్ టేకర్‌గా (12 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. ఈ క్రమంలో చహల్ మరో అన్ నోటీస్డ్ రికార్డును సైతం సమం చేశాడు. తన ఐపీఎల్ గురువైన లసిత్ మలింగ పేరిట ఉండిన ఓ రికార్డును చహల్ సమం చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు (7) నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ రెండో స్థానంలో ఉండగా.. నిన్నటి ప్రదర్శనతో చహల్ (7) గురువు సరసన చేరాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు నాలుగు వికెట్లు పడగొట్టిన రికార్డు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (8) పేరిట ఉంది. ఈ సీజన్లో అన్ని అనుకూలిస్తే చహల్ మరో 5 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. దీంతో చహల్ మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాలి. చహల్ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే, ఈ సీజన్లోనే ఎవరికీ సాధ్యం కాని 200 వికెట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. చహల్ (4/25) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగా.. యశస్వి (47 బంతుల్లో 98 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (29 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బీభత్సం సృష్టించడంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: KKR VS RR: ఆ రికార్డును ఎవరూ పట్టించుకోలేదు.. కోహ్లి తర్వాత యశస్వి ఒక్కడే..! -
ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు
ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 6, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే పేసర్ మతీష పతిరణ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన పతిరణ.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగింగ్ యార్కర్లతో ముంబై బ్యాటర్లను బెంబేలెత్తించి, 3 వికెట్లు కీలక పడగొట్టాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన పతిరణ.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. చదవండి: నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ video తన కోటా ఓవర్లలో పతిరణ ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో స్పెల్‌తో పతిరణ మరోసారి తాను మలింగకు అసలుసిసలు వారసుడని నిరూపించుకున్నాడు. పతిరణతో పాటు దీపక్ చాహర్ (3-0-18-2), తుషార్ దేశ్‌పాండే (4-0-26-2) విజృంభించడంతో ముంబై ఇండియన్స్ కేవలం 139 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో నేహల్ వధేరా (64) ఒక్కడే రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేకు ఓపెనర్లు డెవాన్ కాన్వే (25 నాటౌట్), రుతురాజ్ (30) మెరుపు ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న రుతురాజ్ ఐదో ఓవర్ తొలి బంతికి పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లో వచ్చిన రహానే (21) సైతం ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. దీంతో సీఎస్కే 8.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. చదవండి: రోహిత్ డకౌట్ వెనుక ధోని మాస్టర్‌మైండ్!video -
WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్ టెండుల్కర్
Sachin Tendulkar- Virat Kohli- ICC World Cup 2011 Final: భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్-2011 ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా ముద్దాడిన దృశ్యాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక.. భారత్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెహ్వాగ్, సచిన్ త్వరత్వరగా ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండ్కులర్(18)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గౌతం గంభీర్(97), ధోని(91) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి భారత్‌కు రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందించారు. నాడు కోహ్లికి ఏం చెప్పారు? ఇదిలా ఉంటే.. సచిన్ పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బ్యాటింగ్‌కు వస్తున్న విరాట్ కోహ్లితో ముచ్చటించిన విషయం క్రికెట్ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆనాటి ఆ ఘటన గురించి చెప్పమని ఓ నెటిజన్ సచిన్ టెండుల్కర్‌ను ఆడిగాడు. బంతి కాస్త స్వింగ్ అవుతోంది ఆస్క్ సచిన్ సెషన్లో భాగంగా శుక్రవారం ఈ మేరకు ప్రశ్న ఎదురుకాగా.. "బంతి కొద్దిగా స్వింగ్ అవుతోంది, జాగ్రత్త" అని చెప్పానంటూ సచిన్ బదులిచ్చాడు. ఇక సచిన్ అవుటైన తర్వాత నాడు క్రీజులోకి వచ్చిన కోహ్లి గంభీర్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక యువరాజ్ సింగ్‌తో కలిసి ధోని ఫినిషింగ్ టచ్ ఇచ్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సుదీర్ఘ నిరీక్షణకు ఆరోజుతో తెర ఇక 2011, ఏప్రిల్ 2న భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవడంతో తన సుదీర్ఘ కెరీర్లో ఐసీసీ టైటిల్ లేదన్న సచిన్ టెండుల్కర్ నిరీక్షణకు తెరపడింది. ఆరోసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన అతడి ఖాతాలో టైటిల్ చేరింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా అవతరించిన అనంతరం ఈ టీమిండియా దిగ్గజాన్ని భుజాలపై ఊరేగిస్తూ సహచర ఆటగాళ్లు అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. నాటి ఆ దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల మనసులో మెదలుతూనే ఉంటాయి. చదవండి: పంజాబ్‌తో మ్యాచ్..ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్! మరి రోహిత్? నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని -
చహల్ చరిత్ర.. మలింగను దాటి రెండో స్థానంలోకి
రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో జితేశ్ శర్మ వికెట్ తీయడం ద్వారా చహల్ ఐపీఎల్లో 171 వ వికెట్ సాధించాడు ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 133 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టి.. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. తాజాగా చహల్ మలింగను దాటి రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. ఇక ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా..
Asia Cup 2022 India Vs Hong Kong- Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో భాగంగా.. హాంగ్ కాంగ్‌తో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో బాబర్ హయత్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బద్దలు కొట్టాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జడేజా ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 2010 నుంచి ఆసియా కప్ టోర్నీలో ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ తాజాగా సాధించిన ఘనతతో దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ, అజంతా మెండిస్, సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో 2010 నుంచి 2022లో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ వరకు రవీంద్ర జడేజా తీసిన వికెట్లు: ►2010- నాలుగు వికెట్లు ►2012- ఒక వికెట్ ►2014- ఏడు వికెట్లు ►2016- మూడు వికెట్లు ►2018- ఏడు వికెట్లు ►2022 హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ నాటికి- ఒకటి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లు(ఇప్పటి వరకు) 1. మురళీధరన్(శ్రీలంక)- 30 2. లసిత్ మలింగ(శ్రీలంక)- 29 3. అజంతా మెండిస్(శ్రీలంక)- 26 4. సయీద్ అజ్మల్(పాకిస్తాన్)- 25 5. రవీంద్ర జడేజా(ఇండియా)- 23 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
మలింగ, బుమ్రాను మించిపోయాడు.. ఎవరీ 'గోలీ' క్రికెటర్!
లసిత్ మలింగ నుంచి పాల్ ఆడమ్స్ వరకు చూసుకుంటే వింతైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొత్తలో మలింగ బౌలింగ్ యాక్షన్‌ను క్రీడా ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. కానీ అదే మలింగ శ్రీలంక తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు 12 ఏళ్ల పాటు సేవలందించిన మలింగ ఆ జట్టు టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మ్యాచ్‌లో బౌలర్ తన బౌలింగ్ యాక్షన్‌తో మలింగనే మించిపోయాడు. మలింగ ఒక్కడే కాదు టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు జూనియర్ మలింగ.. శ్రీలంక బౌలర్ మతీషా పతీరాణాల బౌలింగ్‌ను కలగలిపి మరీ బౌలింగ్ చేయడం ఆసక్తికరంగా నిలిచింది. లైనప్ తీసుకున్నప్పుడు తన కుడిచేతిని పలుమార్లు తిప్పి బంతిని రిలీజ్ చేయడం.. బ్యాట్స్‌మన్ అతని బౌలింగ్‌కు కన్ప్యూజ్ అయ్యి క్లీన్‌బౌల్డ్ అవ్వడం జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక 2001లో బాలీవుడ్లో వచ్చిన 'లగాన్' చిత్రం గుర్తుంది కదా. ఆ సినిమాలో గోలీ పాత్ర పోషించిన దయా శంకర్ పాండే క్లైమాక్స్‌లో తన గోలీ బౌలింగ్‌తో బ్రిటీషర్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న బౌలర్ కూడా అచ్చం అదే తరహాలో బౌలింగ్ చేయడం ఆసక్తిని రేపింది. అది సినిమా కాబట్టి రియాలిటీకి దూరంగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడంతో క్రికెట్ ఫ్యాన్స్ లగాన్‌లోని గోలీ క్రికెటర్‌ను గుర్తుకు తెచ్చాడంటూ కామెంట్స్ చేశారు. చదవండి: ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు! This puts @alricho21 double twirl to shame. Love it! pic.twitter.com/EHfLvOo9sc — Charles Dagnall (@CharlesDagnall) June 6, 2022 -
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా మలింగ
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్‌గా ఆ దేశ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ వ్యవహరిస్తాడు. ఇటీవల ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మలింగ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. లంక, ఆసీస్ జట్ల మధ్య 7, 8, 11 తేదీల్లో 3 టి20లు... 14, 16, 19, 21, 24 తేదీల్లో 5 వన్డేలు ఉన్నాయి. అదే విధంగా జూన్ 29 నుంచి రెండు మ్యాచ్‌ల రెండు టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దాదాపు నెలరోజులు ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటించనుంది. మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడనుంది. కొలంబో, పల్లకెలె, గాలే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: IPL 2022: అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్ Australia's T20 squad hits the nets in Colombo ahead of the first T20 against Sri Lanka on Tuesday 🇱🇰 🇦🇺 #SLvAUS 📸 @ClancySinnamon pic.twitter.com/zWSaQgg8Qb — cricket.com.au (@cricketcomau) June 3, 2022 WATCH: Australia's first training session ahead of T20I series. 📽️#SLvAUS https://t.co/5i8eGSn4JN — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 3, 2022 -
'అతడు అద్భుతమైన ఫీల్డర్... ఫీల్డింగ్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను'
రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌పై ఆ జట్టు బౌలింగ్ కోచ్, శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ అద్భుతమైన ఫీల్డింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని మలింగ తెలిపాడు. కాగా ఈ ఏడాది సీజన్లో పరాగ్ ఇప్పటివరకు 16 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్(వికెట్ కీపర్ కాకుండా) గా పరాగ్ రికార్డు సాధించాడు. గత 15 మ్యాచ్‌లలో రియాన్ ఫీల్డింగ్‌ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అతడికి చాలా ఎనర్జీ ఉంది. అతడు మంచి అథ్లెటిక్. అతడికి బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఫీల్డ్‌లో మాత్రం తన ఫీల్డింగ్‌తో అద్భుతం చేస్తున్నాడు. మరే ఇతర జట్టులో కూడా ఇటువంటి ఫీల్డింగ్‌ను మీరు చూసిఉండరు" అని మలింగ పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. చదవండి: IPL 2022: ఫైనల్‌కు 6000 మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా? -
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ..
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక యార్కర్ల కింగ్ లసిత్ మలింగను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా గత ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి మలింగ తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా మలింగ పనిచేశాడు. అయితే ఈ సిరీస్‌లో బౌలింగ్ పరంగా శ్రీలంక జట్టు అద్భుతంగా రాణించింది. ఇక ఐపీఎల్లో 11 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మలింగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 122 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇప్పటికీ కొనసాగుతోన్నాడు. ఇటువంటి అద్భుతమైన బౌలర్ జట్టుకు కోచ్‌గా రావడం రాజస్తాన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లకు మలింగ్ తన అనుభవాన్ని పంచనున్నాడు. ఇక శ్రీలంక దిగ్గజం, రాజస్తాన్ ఫ్రాంచైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ కూమార సంగర్కాకరతో కలిసి మలింగ పనిచేయనున్నాడు. మరో వైపు మెగా వేలంలో రాజస్తాన్.. దేవదత్ పడిక్కల్, బౌల్ట్, హెట్‌మైర్, అశ్విన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చదవండి: IPL 2022- CSK: అలా కాదు.. ఇలా.. ! నెట్ సెషన్లో పాల్గొన్న యువ ప్లేయర్‌కు ధోని సూచనలు! -
ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా!
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరున్న విదేశీ క్రికెటర్లలో లసిత్ మలింగ ఒకడు. ముంబై ఇండియన్స్ తరపున 12 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మలింగ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే.. అందులో నాలుగుసార్లు మలింగ భాగస్వామిగా ఉన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను బౌలింగ్‌లో లీడ్ చేసిన మలింగ ఓవరాల్‌గా 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో దాదాపు పుష్కరకాలం పాటు ఒకే జట్టుకు ఆడిన తొలి ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. కాగా 2020లో వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకున్న మలింగ ఆ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. చదవండి: IPL 2022: అత్యధిక ధరకు అమ్ముడుపోయేది అతడే... ఈ విషయం పక్కనబెడితే.. శ్రీలంకకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు మతీషా పతీరాణా.. జూనియర్ లసిత్ మలింగలాగా కనిపిస్తున్నాడు. మలింగ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు గుద్దినట్లుగా దింపిన పతీరాణా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో తన దేశ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి ఐదు వికెట్లు తీశాడు. కాగా మతీషా పతీరాణా ఐపీఎల్ 2022 మెగావేలంలో తన పేరును కనీస ధర రూ.20 లక్షలతో రిజిస్టర్ చేసుకున్నాడు. మంగళవారం బీసీసీఐ రిలీజ్ చేసిన ఫైనల్ లిస్టులో 23 మంది శ్రీలంక క్రికెటర్ల పేర్లు ఉండగా.. అందులో పతీరాణా కూడా చోటు దక్కించుకున్నాడు. కాగా పతీరాణా ఇంతకముందే ఐపీఎల్ సీజన్లో పాల్గొన్నాడు. అయితే ఆటగాడిగా కాకుండా రిజర్వ్ ప్లేయర్‌గా అందుబాటులో ఉన్నాడు. గతేడాది ఎంఎస్ ధోని నేతృత్వంలోని సీఎస్కే టీమ్ రిజర్వ్ కోటాలో మతీషా పతీరాణాను పిలిపించుకుంది. మహీష్ తీక్షణతో పాటు పతీరాణా కూడా సీఎస్కేకు రిజర్వ్ ప్లేయర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పతీరాణా సీఎస్కే ఆటగాళ్లకు తన వైవిధ్యమైన బంతులు విసిరి తొలిసారి దృష్టిలో పడ్డాడు. ధోని కూడా పతీరాణా బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. దీంతో ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో నాలుగుసార్లు చాంపియన్ సీఎస్కే పతీరాణాను కనీస ధరకు(రూ.20 లక్షలు) కొనుగోలు చేస్తుందేమో చూడాలి.. లేదంటే ముంబై ఇండియన్స్ అతన్ని దక్కించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. -
శ్రీలంక జట్టులో కీలక పరిణామం.. కోచ్‌గా లసిత్ మలింగ!
శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆ జట్టు దిగ్గజం లసిత్ మలింగ ఎంపికయ్యే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు మలింగని కన్సల్టెంట్ కోచ్‌గా నియమించాలని హై-ప్రొఫైల్ క్రికెట్ అడ్వైజరీ కమిటీ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సిఫార్సు చేసింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక గత ఏడాదిలో అన్ని ఫార్మాట్ల నుంచి మలింగను తప్పుకున్న సంగతి తెలిసిందే. తన టీ20 కేరిర్‌లో 390 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా తొమ్మిది వన్డేల్లో శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించిన మలింగ ఒక్క సారి కూడా జట్టును గెలిపించ లేకపోయాడు. అదే విధంగా 24 టీ20ల్లో సారధ్యం వహించిన మలింగకు 15 సార్లు పరాజయం ఎదురైంది. ఇక అతడితో పాటు మహేల జయవర్ధనే కూడా కన్సల్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. చదవండి: Ind Vs WI: 458 పరుగులు.. 17 వికెట్లు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. ఆ ఇద్దరికి బంపర్ ఛాన్స్.. ఏకంగా విండీస్‌తో సిరీస్‌తో.. -
శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!
Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. “మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్
Shakib Al Hasan Breaks Lasith Malinga Record: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో ప్రపంచ రికార్డు బద్దలైంది. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్(108) అధిగమించాడు. నిన్నటి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మలింగ 84 టీ20 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. షకిబ్ 89 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. మరోవైపు ఈ ఫార్మాట్లో వందకుపైగా వికెట్లు తీసి వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా షకీబ్ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-బీ పోటీల్లో భాగంగా నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు సంచలన విజయం సాధించింది. పసికూన స్కాట్లాండ్ 6 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్కాట్లాండ్ ఆటగాడు క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో స్కాట్లాండ్కు చారిత్రక విజయాన్ని అందించాడు. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనతంరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా 20 ఓవర్లలో 134/7 స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్‌కు చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా మెహిదీ హసన్ (13), సైఫుద్దీన్ (5) రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది మొత్తం 17 పరుగులు రాబట్టారు. చివరి బంతికి ఏడు పరుగులు అవసరం కాగా మెహిది సింగిల్ తీయడంతో స్కాట్లాండ్ విజయం సాధించింది. చదవండి: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్.. -
T20 World Cup: పొలార్డ్ టాప్-5 ఫేవరెట్ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!
Kieron Pollard Top Five T20 Players: టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పొట్టి ఫార్మాట్లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో ఓ విధ్వంసకర ఓపెనర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, ఆల్‌రౌండర్, మాజీ స్పిన్నర్, మాజీ పేసర్‌కు చోటిచ్చాడు. మరి.. కీరన్ పొలార్డ్ ఫేవరెట్ టాప్-5 టీ20 క్రికెటర్స్ ఎవరంటే..! క్రిస్ గేల్(వెస్టిండీస్), లసిత్ మలింగ(శ్రీలంక), సునిల్ నరైన్(వెస్టిండీస్), ఎంఎస్ ధోని(ఇండియా), కీరన్ పొలార్డ్(వెస్టిండీస్). అవును.. తనకు ఇష్టమైన జాబితాలో ముగ్గురూ విండీస్ ఆటగాళ్లు.. ముఖ్యంగా అందులో తన పేరును కూడా పొలార్డ్ పేర్కొనడం విశేషం. క్రిస్‌గేల్(Chris Gayle) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో యూనివర్స్ బాస్‌గా పేరొందిన క్రిస్ గేల్.. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 446 మ్యాచ్‌లు ఆడి... 14261 పరుగులు చేశాడు. సగటు 36.94. స్ట్రైక్‌రేటు.. 145.87. ఇందులో 22 శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175(నాటౌట్). రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్(2012, 2016) గెలిచిన విండీస్ జట్టులో ఈ సిక్సర్ల వీరుడు సభ్యుడిగా ఉన్నాడు. లసిత్ మలింగ(Lasith Malinga) యార్కర్ల కింగ్‌గా పేరొందిన లసిత్ మలింగ... తనదైన శైలిలో బంతులు సంధించి ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీ20 ఫార్మాట్లో 295 మ్యాచ్‌లలో 390 వికెట్లు తీసిన మలింగ.. 2014లో టైటిల్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు. ఇక ఆటకు స్వస్తి పలికిన మలింగ.. తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగుతున్నట్లు సెప్టెంబరు 15న ప్రకటించాడు. సునిల్ నరైన్(Sunil Narine) స్పిన్ మాయాజాలంతో ఎంతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన విండీస్ ఆటగాడు సునిల్ నరైన్... పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవలి కాలంలో బ్యాటర్(లీగ్)గా కూడా సత్తా చాటుతున్నాడు. ఇక విండీస్ 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో నరైన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో 5.63 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఎంఎస్ ధోని(MS Dhoni) టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్, అత్యుత్తమ వికెట్ కీపర్.. ఇలా ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు సాధించిపెట్టిన సారథి. ముఖ్యంగా తొట్టతొలి టీ20 వరల్డ్‌కప్-2007 గెలిచిన జట్టుకు కెప్టెన్. అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా తనదైన ముద్ర వేసిన ధోని... టీ20 క్రికెట్లో 185 క్యాచ్‌లు, 84 స్టంపింగ్‌లు చేసిన వికెట్‌కీపర్‌గా పేరొందాడు. 6861 పరుగులు(స్ట్రైక్ రేటు- 134.82) చేసి బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. కీరన్ పొలార్డ్(Kieron Pollard) ఆరంభంలో తడబడినా.. రానురాను తనదైన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌కే పర్యాయపదంగా మారాడు పొలార్డ్. గేల్ తర్వాత అంతటి హిట్టర్‌గా పేరొందాడు. టీ20 ఫార్మాట్లో 298 వికెట్లు తీసిన ఈ ఆల్‌రౌండర్.. 2012లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగనున్న వెస్టిండీస్ జట్టుకు అతడే సారథి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విండీస్ టీ20 జట్టు ఇదే: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్ స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్. -వెబ్‌డెస్క్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
IPL 2021 2nd Phase: 'మలి'.. నిజంగా నువ్వు చాంపియన్‌వి
దుబాయ్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లంక మాజీ స్టార్ క్రికెటర్ లసిత్ మలింగపై ప్రశంసల వర్షం కురిపించాడు. మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మలింగకు ముంబై ఇండియన్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. చదవండి: Lasit Malinga: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం ''మలి నిజంగా నువ్వు ఒక చాంపియన్‌వి.. నీ క్రికెట్ కెరీర్ ఆధ్యంతం అద్భుతంగా సాగింది. ముంబై ఇండియన్స్‌తో 12 ఏళ్ల అనుబంధం నీది.. జట్టు విజయాల్లో నీ పాత్ర మరువలేనిది.. నాలుగు సార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించావు. క్రికెట్ అనంతరం కూడా నీ జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ముంబై ఇండియర్స్ మరో క్రికెటర్ సూర్యకుమార్ కూడా మలింగ రిటైర్మెంట్పై ట్వీట్ చేశాడు.'' ఒక బౌలర్‌గా నీ కెరీర్ అద్భుతంగా సాగింది.. ఆటకు వీడ్కోలు తర్వాత మొదలుపెట్టనున్న కొత్త జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నా'' అని తెలిపాడు. శ్రీలంక తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన మలింగ భారత అభిమానులకు ఐపీఎల్ ద్వారా మరింత చేరువయ్యాడు. ముంబై ఇండియన్స్ 4 సార్లు (2013, 2015, 2017, 2019) ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఈ లీగ్‌లో 2009 నుంచి 11 సీజన్ల పాటు అతను ఒకే ఒక జట్టు ముంబైకే ప్రాతినిధ్యం వహించాడు. 122 ఐపీఎల్లో మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు Mali, you have been a champion cricketer. Well done on your wonderful career. Best wishes ahead @ninety9sl https://t.co/fDGOg1ZBT7 — Rohit Sharma (@ImRo45) September 14, 2021 -
నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం
Lasit Malinga Retirement.. శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మలింగ సాధించిన రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక రికార్డు మాత్రం ఇప్పటివరకు పదిలంగానే ఉంది. అదే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు.. అందునా ఒకే రికార్డును రెండుసార్లు సాధించడం ఒక్క మలింగకే చెల్లింది. మరి ఆ రికార్డు ఇక ఎవరికి సాధ్యమవుతుందో చూడాలి. ఇక మలింగ సాధించిన 'నాలుగు బంతుల్లో.. నాలుగు వికెట్ల' రికార్డును ఒకసారి పరిశీలిద్దాం. 2007 వన్డే ప్రపంచకప్ .. 2019లో మలింగ చదవండి: మలింగ తరహాలో అరుదైన ఫీట్.. అయినా ఓడిపోయారు 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై 2007 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ప్రొవిడెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45వ ఓవర్ చివరి రెండు బంతుల్లో పొలాక్, హాల్‌లను అవుట్ చేసిన అతను, 47వ ఓవర్ తొలి రెండు బంతుల్లో కలిస్, ఎన్తినిలను పెవిలియన్ పంపించాడు. అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును దాదాపు 12 ఏళ్ల పాటు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మరోసారి అదే రిపీట్ చేశాడు. 2019లో పల్లెకెలెలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ మూడో ఓవర్లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను అవుట్ చేయడం విశేషం. మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి20లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20లలో 107 వికెట్లు కలిపి మొత్తం 546 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతడిదే పైచేయి. అంతేకాదు, పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ కూడా అతడే. చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు 4️⃣ in 4️⃣ v SA, 2007 (ODI) 4️⃣ in 4️⃣ v NZ, 2019 (T20I) Lasith Malinga is the only bowler to have taken four wickets in four balls twice! On his birthday, relive his spell against South Africa at the 2007 @CricketWorldCup 📹 pic.twitter.com/ofPAI9YjPM — ICC (@ICC) August 28, 2020 -
Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు
కొలంబో: ‘యార్కర్ కింగ్’ లసిత్ మలింగ తన ఆటను ముగించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. ఈ శ్రీలంక స్టార్ బౌలర్ వన్డేల నుంచి గతంలోనే తప్పుకొని టి20ల్లో మాత్రమే కొనసాగుతూ రాగా, ఇప్పుడు పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వెల్లడించాడు. నిజానికి గత ఏడాదే టి20 ప్రపంచకప్‌లో లంక తరఫున ఆడిన అనంతరం వీడ్కోలు పలకాలని భావించినా... కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడటంతో ఆ అవకాశం రాలేదు. తమ జాతీయ జట్టు తరఫున మలింగ 2020 మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. వ్యక్తిగత కారణాలతో 2020 సీజన్ నుంచే అతను ఐపీఎల్‌కూ దూరమయ్యాడు. 2004లో టెస్టు క్రికెట్‌తో అరంగేట్రం చేసిన మలింగను వరుస గాయాలు బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో 2011లోనే అతను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పూర్తిగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లపైనే దృష్టి పెట్టాడు. ప్రత్యేక శైలితో... భిన్న రంగులతో రింగులు తిరిగిన జుట్టు, బంతిని ముద్దాడిన తర్వాతే మొదలయ్యే రనప్, గతంలో ఎన్నడూ చూడని ‘రౌండ్ ఆర్మ్’ బౌలింగ్ యాక్షన్ మలింగను సగటు క్రికెట్ అభిమాని భిన్నంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. ముఖ్యంగా ‘45 డిగ్రీల’ యాక్షన్ కారణంగా మలింగ వేసే యార్కర్లు బుల్లెట్లలా దూసుకొస్తుంటే ఆడలేక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం లెక్కలేనన్ని సార్లు జరిగింది. వాటికి వేగం తోడైతే అవి మరింత ప్రమాదకరంగా మారి మలింగ స్థాయి ఏమిటో చూపించాయి. యార్కర్లు మాత్రమే కాకుండా తర్వాతి రోజుల్లో మలింగ స్లో బాల్, స్లో బౌన్సర్లను అద్భుతంగా వేయడం నేర్చుకొని ప్రత్యర్థులను పడగొట్టాడు. డెత్ ఓవర్లలో అతనికంటే మెరుగైన రికార్డు మరే బౌలర్‌కు లేదు. గత దశాబ్ద కాలంలో పరిమిత ఓవర్లలో శ్రీలంక జట్టుకు అతని అనేక విజయాలు అందించాడు. 2009, 2012 టి20 ప్రపంచకప్ జట్లలో భాగంగా ఉన్న మలింగ కెప్టెన్సీలోనే 2014లో శ్రీలంక టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలవడం విశేషం. సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్‌లాంటి స్టార్లు ఉన్నా ... 2007 నుంచి 2014 మధ్య లంక జట్టు ఐసీసీ టోర్నీ లో మంచి ప్రదర్శన కనబర్చడంలో అతనిదే కీలకపాత్ర. అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా ఐదు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన అరుదైన రికార్డు అతని పేరిటే ఉంది. ఐపీఎల్లో సూపర్... శ్రీలంక తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన మలింగ భారత అభిమానులకు ఐపీఎల్ ద్వారా మరింత చేరువయ్యాడు. ముంబై ఇండియన్స్ 4 సార్లు (2013, 2015, 2017, 2019) ఐపీఎల్ చాంపియన్‌గా నిలవడంలో అతను ప్రధాన భూమిక పోషించాడు. ఈ లీగ్‌లో 2009 నుంచి 11 సీజన్ల పాటు అతను ఒకే ఒక జట్టు ముంబైకే ప్రాతినిధ్యం వహించాడు. 122 ఐపీఎల్లో మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఓవరాల్‌గా 295 టి20ల్లో అతను 7.07 ఎకానమీతో 390 వికెట్లు తీశాడు. కెరీర్ విశేషాలు ►వన్డేల్లో 3 హ్యాట్రిక్‌లు ►టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (107) తీసిన బౌలర్ ►2014 టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్ ►4 వరుస బంతుల్లో 4 వికెట్లు రెండు సార్లు తీసిన అరుదైన ఘనత -
అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యార్కర్ కింగ్
Lasith Malinga Retirement From All Forms of Cricket: శ్రీలంక యార్కర్ కింగ్ లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు ఫార్మట్ల నుంచి ఇదివరకే మలింగ తప్పుకున్నాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నట్లు అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం పేర్కొన్నాడు. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను ప్రోత్సహించిన వారందరికి ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా‘అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు . కాగా 2019లో వన్డేలనుంచి తప్పుకోగా, 2011లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రికార్డుల మలింగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసి అరుదైన ఘనత సాధించిన బౌలర్ కూడా మలింగానే. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్ లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. శ్రీలంక తరుపున 84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగా 107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్‌లో 546 వికెట్లు సాధించాడు. అంతేకాదు122 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా లసిత్ మలింగ ఆడాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. చదవండి: T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు... "Today I decided I want to give 100% rest to my T20 bowling shoes." Lasith Malinga has called time on his playing career 🌟 — ICC (@ICC) September 14, 2021 -
80ల నాటి హెయిర్ స్టైల్.. ధోని, మలింగలకు 10 పాయింట్లు
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలిరోజు వర్షార్పణమైంది. ఒక్క బంతి కూడా పడకుండానే తొలిరోజు ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక రెండోరోజుకు వరుణుడు ఏ మేరకు సహకరిస్తాడో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఫైనల్ మ్యాచ్‌కు 80లకాలం నాటి ముల్లెట్ హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఐసీసీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ను అతని హెయిర్‌స్టైల్‌పై ఇంటర్య్వూ నిర్వహించింది. పాతతరం, కొత్తతరం క్రికెటర్లలో ఆటగాళ్ల హెయిర్‌స్టైల్‌కు సంబంధించి ఎన్ని పాయింట్లు ఇస్తారని అడగ్గా గ్రాండ్‌హోమ్ స్పందించాడు. మొదట ఇషాంత్ శర్మ హెయిర్‌స్టైల్‌కు 10కి ఆరు పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని జులపాల జట్టుకు పదికి పది పాయింట్లు ఇచ్చాడు. ధోని హెయిర్‌స్టైల్ తనను ఆకట్టుకుందన్నాడు. అతనిలా తనది ఫర్ఫెక్ట్ హెయిర్స్టల్ కాదని.. ఇకపై ఎవరు చేయలేరని పేర్కొన్నాడు. అందుకే ధోని హెయిర్ స్టైల్‌కు మొత్తం పాయింట్లు ఇచ్చేశా. ఇక లసిత్ మలింగ హెయిర్‌స్టైల్ డిఫెరెంట్ షేడ్స్‌లో ఉంటుంది.. అతనికి 10 మార్కులు ఇవ్వకుండా ఎలా ఉంటానని తెలిపాడు. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హెయిర్‌స్టైల్‌కు 9 పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా మెక్కల్లమ్, డానియెల్ వెటోరి ఫోటోలు చూపించగా.. వాటికి 8, 9 మార్కులు ఇచ్చాడు. తన హెయిర్‌స్టైల్‌పై గ్రాండ్‌హోమ్ స్పందిస్తూ..' నా హెయిర్ స్టైల్ నా భార్యకు బాగా నచ్చింది. అది ఎందుకని మాత్రం తను చెప్పలేదు కాని 80ల కాలం నాటి స్టైల్‌ను మళ్లీ చూపించారంటూ మెచ్చకుంది. నా జట్టుపై సహచర ఆటగాళ్లు కామెంట్స్ చేసినా నాకు సంతోషమే కలిగింది. అంటూ తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొలిన్ డి గ్రాండ్‌హోమ్ కివీస్ తరపున 25 టెస్టుల్లో 1,194 పరుగులు.. 47 వికెట్లు, 42 వన్డేల్లో 722 పరుగులు.. 27, 36 టీ20ల్లో 487 పరుగులు.. 11 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో జరుగుతున్న టెస్టుచాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ తరపున ఆల్‌రౌండర్ కోటాలో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చదవండి: WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే Long locks? Short locks? Coloured? Straightened? 💇♂️ Watch Colin ‘mullet’ de Grandhomme evaluate some interesting hairstyles 😄#WTC21 | #INDvNZ pic.twitter.com/UbA0UmKHbw — ICC (@ICC) June 19, 2021 -
'రికార్డుల కోసం నేను ఎదురుచూడను'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం వెనుక సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలకంగా వ్యవహరించాడు. 4 ఓవర్లు వేసిన మిశ్రా 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మలింగ తొలి స్థానంలో ఉండగా.. అమిత్ మిశ్రా రెండో స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. అమిత్ మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇంకా ఢిల్లీ చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మిశ్రా ఈ రికార్డును తొందరగానే బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే తాను రికార్డులు సాధించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఫోకస్ పెట్టినట్లు మిశ్రా తెలిపాడు. మ్యాచ్ విజయం అనంతరం పృథ్వీ షాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ''నేనెప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. అసలు లసిత్ మలింగ రికార్డు బ్రేక్ చేయబోతున్నానే విషయం నాకు తెలియదు. రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్ చేసినంత మాత్రానా నాకు వచ్చేది ఏం లేదు.. కేవలం ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పేరు తప్ప.. ప్రస్తుతం నా దృష్టంతా వికెట్లు తీసి ఢిల్లీ జట్టును గెలిపించడమే..'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్‌శర్మను ఐపీఎల్లో 7సార్లు ఔట్ చేయడంపై మిశ్రాను అడగ్గా.. '' రోహిత్‌కు బౌలింగ్ వేసేటప్పుడు అతను హిట్టింగ్ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్ డెలివరీలు ఉండడంతో రోహిత్ అవుటవుతున్నాడు. అయితే రోహిత్ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు.'' అంటూ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. చదవండి: మిశ్రా నువ్వు తోపు.. వచ్చీ రావడంతోనే ఐపీఎల్ 2021: అతను వండర్స్ చేయగలడు -
మలింగ తరహాలో అరుదైన ఫీట్.. అయినా ఓడిపోయారు
కోల్‌కత: అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ తీయడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడం అసాధారణం. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి బౌలర్‌గా శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ రికార్డు సృష్టించాడు. అతను ఈ ఫీట్‌ను రెండుసార్లు అందుకోవడం మరో విశేషం. తొలిసారి మలింగ 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీట్‌ను సాధించగా ఆ మ్యాచ్‌లో లంక ఓడిపోవడం విశేషం.. రెండోసారి 2019లో కివీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో మరోసారి అందుకున్నాడు. మలింగతో పాటు ఆప్ఘన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ కూడా 2019లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. తాజాగా బెంగాల్ క్లబ్ క్రికెట్లో మరోసారి ఆ ఫీట్ ఆవిష్కృతమైంది. ఎన్సీ చటర్జీ ట్రోపీలో భాగంగా మోహున్‌లాల్ క్లబ్, హౌరా యూనియన్ మధ్య ఆదివారం కోల్‌కతాలో మ్యాచ్ జరిగింది. మోహున్‌లాల్ క్లబ్ బౌలర్ మసూమ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో అబ్దుల్ హదీ(32 పరుగులు), దీప్తా నారాయన్ అడక్(38 పరుగులు), సాయికత్ సంజా(0), దిపాన్యన్ రాహా(0)లను ఔట్ చేశాడు. దీంతో పాటు ఓపెనర్ ఎండీ షానవాజ్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మొత్తం నాలుగు ఓవర్ల కోటాలో 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అతని దాటికి హౌరా యూనియన్ 7వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. అయితే మసూమ్ ఇంత మంచి ప్రదర్శన చేసినా మెహురూన్ క్లబ్ 114 పరుగులకే ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. తన ప్రదర్శనకు మాత్రం మసూమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. చదవండి: 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై 'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా' -
12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై
ముంబై: శ్రీలంక మాజీ స్టార్ బౌలర్ లసిత్ మలింగను వదులుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది. మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ఈరోజుతో గుడ్‌బై చెబుతున్నట్లు ఉద్వేగంతో పేర్కొంది. ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి వేలానికి సిద్ధమవుతున్న తరుణంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ మలింగతో పాటు ఆసీస్‌కు చెందిన జేమ్స్ పాటిన్సన్, నాథన్ కౌల్టర్‌నీల్, మిచెల్ మెక్లీగన్లతో పాటు షెర్ఫన్ రూథర్‌ఫర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లసిత్ మలింగ గురించి ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చింది. 'మలింగ.. థ్యాంక్యూ ఫర్ ఎవర్.. నీలాంటి ఆటగాడు 12 ఏళ్లు మా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్ను వదులుకున్నా..నీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. మిస్ యూ లాట్.. మలింగ. మలింగతో పాటు మేము వదులుకున్న ఆటగాళల్లందరికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్పటికి ఒక భాగంగా ఉంటారంటూ' కామెంట్స్ జత చేసింది. చదవండి: స్మిత్‌కు గుడ్‌బై.. శాంసన్‌కు కెప్టెన్సీ 2008 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా జట్టుకు సేవలు అందించాడు. కాగా వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మలింగ ఆడలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసని ఆటగాడిగా మలింగ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీశాడు. 2013,2015,2017,2019లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో మలింగ ప్రధానపాత్ర పోషించాడు. కాగా 2020లోనూ మలింగ లేకుండానే ముంబై ఇండియన్స్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. మలింగ గైర్హాజరీలో ప్రధాన పేసర్‌గా బాధ్యతలు నిర్వహించిన బుమ్రా 27 వికెట్లతో టాప్ లేపగా.. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 25 వికెట్లతో దుమ్మురేపాడు. చదవండి: థ్యాంక్యూ బీసీసీఐ.. మంచి గిఫ్ట్ ఇచ్చారు Thank you for everything! There will always be a special place for you all in MI’s #OneFamily! 💙#MumbaiIndians pic.twitter.com/qjhMLHPTLc — Mumbai Indians (@mipaltan) January 20, 2021 -
టీ20లో టాప్ 5 బౌలర్లు వీళ్లే !
ఢిల్లీ: షేన్ వాట్సన్.. క్రికెట్ ప్రపంచంలో ఒక్క గొప్ప ఆల్‌రౌండర్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా తన బ్యాట్‌తో విజృంభించగల ఆటగాడు. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ తన సత్తా చూపగలడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, ఫ్రాంచైజీల్లో ఇంకా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటికీ ప్రత్యర్థి జట్లకు తను ఒక టార్గెట్ బ్యాట్స్‌మెన్. తన కెరీర్లో ఎంతో మంది మేటి బౌలర్ల్‌ను ఎదుర్కున్నాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌కు టీ20లో టాప్ 5 బౌలర్లు ఎవరో తెలుసా... వాట్సన్ తన టాప్-5 టీ20 బౌలర్ల జాబితాలో లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు. టీ20లో అతడు అత్యుత్తమ బౌలర్ అని వాట్సన్ అన్నాడు. మలింగ వేసే 'యార్కర్స్' ఏ బౌలర్ వేయలేడని, భవిష్యత్తులో కూడా అలాంటి బౌలర్‌ను చూడకపోవచ్చని కితాబిచ్చాడు. ఇక రెండో బౌలర్ షాహిద్ అఫ్రిది పేరు చెప్పాడు. షాహిద్ ఒక విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయినా, టీ20లో అతడు మంచి బౌలర్ అని పేర్కొన్నాడు. వికెట్లు తీయడకమే కాకుండా పరుగులు ఇవ్వకుండా కట్టడిచేయగల సత్తా ఉన్న బౌలర్ అని అన్నాడు. ప్రతి జట్టులో అలాంటి ఒక బౌలర్ ఉండాలని కోరుకుంటారని తెలిపాడు. ఇక మూడో స్థానంలో జస్ప్రిత్ బుమ్రా పేరు చెప్పాడు. ప్రస్తుత కాలంలో అతడు అత్యుత్తమ బౌలర్ అని, అద్భుతమైన యార్కర్స్ వేస్తాడని తెలిపాడు. బంతి వేగంతో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలరని...అతడి బౌలింగ్‌లో ఆడడం 'ఛాలెంజింగ్'గా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వెస్టిండీస్ ఆటగాళ్లు డ్వైన్ బ్రావో, సునిల్ నరైన్ పేర్లను తెలిపాడు. (ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా వారిదే: డుప్లెసిస్) -
‘ఆ యార్కర్లను ఫ్యాన్స్ మిస్సవనున్నారు’
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్‌కు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా షాకిచ్చాడు. యూఎఈ వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 సీజన్లో మలింగా యార్కర్లను క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించలేరు. ఈ ఐపీఎల్లో పాల్గోనడం లేదని లసిత్ మలింగా బుధవారం ప్రకటించాడు. ముంబై ఇండియన్స్ తరపున లసిత్ మలింగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా లసిత్ మలింగా స్థానంలో ఆసీస్ పేసర్ జేమ్స్ పాటిన్సన్ ఆడనున్నాడు. అయితే ఈ అంశంపై ముంబై ఇండియన్స్ యజమాని ఆకాశ్ అంబానీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ జట్టుకు మలింగా లెజెండ్ అని, ఈ ఐపీఎల్లో మలింగ్ ఆడకపోవడం జట్టుకు ఇబ్బందేనని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా కొన్ని వ్యక్తిగత సమస్యలతో మలింగా అతని కుటుంబంతో గడపడం అత్యవసరమని పేర్కొన్నాడు. కాగా మలింగా స్థానంలో జట్టులో ఆడనున్న జేమ్స్ పాటిన్సన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ కుటుంబం వలె మేనేజ్మెంట్, జట్టు ఆటగాళ్లంతా సంతోషంగా ఉంటామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నాడు. కాగా గత ఐపీఎల్లో చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన మలింగ, మెరుపు బౌలింగ్‌తో కేవలం ఒక పరుగు తేడాతో ముంబయి ఇండియన్స్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు. కాగా ఇప్పటి వరకూ 122 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ 19.80 సగటుతో ఏకంగా 170 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2019 సీజన్లో 12 మ్యాచ్‌లాడిన లసిత్ మలింగ,16 వికెట్లు పడగొట్టి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. (చదవండి: నేను ఎందుకిలా?: లసిత్ మలింగా) -
‘జూనియర్ మలింగా’ వరల్డ్ రికార్డు
బ్లోమ్‌ఫొంటెన్: సుమారు నాలుగు నెలల క్రితం శ్రీలంక కాలేజ్ క్రికెట్ స్థాయిలో ఎక్కువగా వినిపించిన పేరు మతీషా పతిరాణా. అచ్చం లసిత్ మలింగా తరహా యాక్షన్‌ను పోలి ఉండే పతిరాణా.. ఇప్పుడు అండర్-19 క్రికెట్ ఆడేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఒక కాలేజ్ మ్యాచ్‌లో పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా చేసుకుని బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు పతిరాణా అండర్-19 వరల్డ్‌కప్ ఆడటానికి కారణమైంది. అయితే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరాణా వికెట్ సాధించకపోయినప్పటికీ ఒక వరల్డ్ రికార్డును మాత్రం లిఖించాడు. పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును పతిరాణా బ్రేక్ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో పతిరాణా 175 కి.మీ వేగంతో బంతిని సంధించి కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ స్థాయిలోనైనా ఇదే ఫాస్టెస్ట్ బాల్. భారత్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సంధించిన బంతి రికార్డు పుస్తకాల్లో లిఖించబడింది. అయితే ఆ బంతి వైడ్ బాల్ కావడంతో ఎక్స్ట్రా రూపంలో భారత్‌కు పరుగు వచ్చింది. 2003 వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ 161.3కి.మీ వేగంతో వేసిన బంతి ఫాస్టెస్ట్ బాల్‌గా ఇప్పటివరకూ ఉండగా దాన్ని పతిరాణా బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: యువ భారత్ శుభారంభం) -
నేను ఎందుకిలా?: లసిత్ మలింగా
పుణె: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కనీసం పోరాడకుండానే కోల్పోవడంపై శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాకపోవడం కారణంగానే భారత్ ముందు ఘోరంగా చతికిలబడ్డామన్నాడు. ఇక్కడ ప్రధానంగా తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగా విమర్శించుకున్నాడు. ‘ నేను చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌ను. నాకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉంది. వికెట్ టేకింగ్ బౌలర్‌నే కానీ భారత్‌తో కనీసం వికెట్ తీయలేకపోయా. వికెట్లు సాధించలేక ఒత్తిడిలో పడ్డా. ఫ్రాంచైజీ క్రికెట్లో చాలా మ్యాచ్‌లో ఆడినా భారత్‌తో సిరీస్ ఆఖరి రోజు ముగిసే సరికి నేను ఉపయోగపడలేదు’ అని మలింగా ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి వరల్డ్ రికార్డు.. సిరీస్ భారత్ కైవసం) ప్రధానంగా కెప్టెన్సీ కూడా తనపై భారం చూపిందన్నాడు. ఇక్కడ జట్టు పరంగా శ్రీలంక ఆశించిన స్థాయిలో లేకపోవడమే కెప్టెన్‌గా తనపై ఒత్తిడి పడిందన్నాడు. 2014లో తాను కెప్టెన్‌గా చేసిన సమయంలో తనకు పెద్దగా భారం అనిపించకపోవడానికి కారణం జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటమేనన్నాడు. కుమార సంగక్కరా, జయవర్ధనే, దిల్షాన్ వంటి క్రికెటర్లు తమ జట్టులో ఉండటం వల్ల కెప్టెన్సీ భారం అనిపించేది కాదన్నాడు.ఇక టీ20ల్లో భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనది మలింగా స్పష్టం చేశాడు. ఒకవైపు భారత ఆటగాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు సాధిస్తే, తమ జట్టు మాత్రం విఫలమైందన్నాడు. టీ20ల్లో ప్రతీ బంతి విలువైనదేనని, కనీసం ప్రతీ బంతికి సింగిల్ అయినా తీయాలన్నాడు. మరొకవైపు టీమిండియా బ్యాటింగ్ అమోఘం అంటూ కొనియాడాడు. వారు షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి తమ ప్రదర్శన మెరుగపడిన దాఖలాలు లేవని మలింగా అంగీకరించాడు. గతంలో శ్రీలంక అంటే పటిష్టంగా ఉండేదని సంగతిని గుర్తు చేసుకున్నాడు. కుమార సంగక్కరా-మహేలా జయవర్ధననే, దిల్షాన్‌లు ఇన్నింగ్స్‌లు నిర్మించి లంక విజయాల్లో కీలక పాత్ర పోషించే వారన్నాడు. ప్రస్తుతం తమ జట్టులో అది కొరవడిందనే విషయం ఒప్పుకోవాల్సిందేనన్నాడు. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లు యువ క్రికెటర్లే కాకుండా టాలెంట్ కూడా ఉందన్నాడు. కాకపోతే పరిస్థితులన్ని బట్టి ఆడటంలో వారు విఫలమవుతున్నారన్నాడు. భవిష్యత్తులోనైనా పరిస్థితిని అర్థం చేసుకుని క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నట్లు మలింగా తెలిపాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) -
‘అది ఎలా సాధ్యమవుతుందో.. నేనే నమ్మలేకున్నా’
కొలంబో: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో యార్కర్లు, స్లోబాల్స్ సంధించడంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాది ప్రత్యేక స్థానం. ఆట ఆరంభంలో కానీ, చివర్లో కానీ మ్యాచ్‌ను శాసించడంలో బుమ్రా దిట్ట. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించడంలో బుమ్రా ఎంతో పరిణితి సాధించాడు. దాంతోనే భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ బౌలర్‌గా మారిపోయాడు. తన అరంగేట్రం మొదలుకొని ఇప్పటివరకూ బుమ్రా బౌలింగ్‌ను విమర్శించిన దాఖలాలు దాదాపు లేవంటేనే అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగా నుంచి యార్కర్ల టిప్స్‌ను ఒక్కొక్కటిగా తెలుసుకున్న బుమ్రా.. ఇప్పుడు ‘ముదురు’ బౌలర్ అయిపోయాడు. ఎంతలా అంటే అసలు అంత కచ్చితమైన యార్కర్లు ఎలా వేస్తున్నాడో గురువు మలింగాకు తెలియనంతగా బుమ్రా రాటుదేలిపోయాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు మలింగ్ సైతం ఒప్పుకున్నాడు. ‘ అతని బౌలింగ్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బుమ్రా అంత కఠినమైన యార్కర్లను ఎలా సంధిస్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుందో.. దాన్ని నేనే నమ్మలేకున్నా. నేను బుమ్రా బౌలింగ్ మెరుగు పడటానికి కొన్ని సలహాలు ఇచ్చా. అందుకు చాలా సంతోషంగా ఉంది. తన బుర్రతో నేనిచ్చిన టిప్స్‌కు మరింత పదును పెట్టాడు. బుమ్రా ఏ విషయాన్నైనా తొందరగానే నేర్చుకుంటాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఇద్దరం కలిసి ఆడటంతో బౌలింగ్ మెళకువలను నాతో షేర్ చేసుకునే వాడు. ఏదైనా చెబితే దాన్ని వెంటనే అమలు చేసేవాడు. నా కంటే మంచి ఫలితాల్ని రాబట్టడంలో బుమ్రా సక్సెస్ అయ్యాడు’ అని మలింగా కొనియాడాడు. ఇక సీనియర్ క్రికెటర్లు యువ క్రికెటర్లకు సూచనలు ఇవ్వాల్సిన అవరసం ఉందని మలింగా తెలిపాడు. యువ క్రికెటర్లలోని సత్తాను బయటకు తీయాలంటే సీనియర్ క్రికెటర్లు వారికి తగిన సూచనలు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండాలన్నాడు. 2008లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ వస్తున్న బుమ్రా.. 2018లో అదే ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు. 2019లో ఆటగాడిగా మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగాడు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌ను చివరి వికెట్‌గా మలింగా ఔట్ చేయడంతో ముంబై ట్రోఫీని గెలిచింది. ఇక 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ వస్తున్నాడు. దాంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో కూడా మలింగా-బుమ్రాలు ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ముంబై ఇండియన్స్ వీరిని జట్టుతో పాటు అంటిపెట్టుకుంది. -
మరో మలింగా దొరికాడోచ్
కొలంబో: లసిత్ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యార్కర్లను సంధించడంలో సిద్ధహస్తుడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్ టైమ్ దిగ్గజాల్లో మలింగా ఒకడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2006 నుంచి 2013 వరకూ మలింగా శకం నడిచిందంటే అతిశయోక్తి కాదు. ఈ కాలంలో మలింగా 267 వికెట్లు సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్ మలింగా. తన వన్డే కెరీర్లో 338 వికెట్లు సాధించాడు. ఇటీవల వన్డేలకు గుడ్ బై చెప్పిన మలింగా.. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించి తనలోని పవర్‌ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. అయితే ఇప్పుడు మరో మలింగా దొరికాడు. ఆ యువ క్రికెటర్ కూడా శ్రీలంకకు చెందిన వాడే. మలింగాలు శ్రీలంకలోనే పుడతారా అనేంతగా తన బౌలింగ్‌లోని పంచ్‌ను విసురుతున్నాడు. 17 ఏళ్ల మతీషా పతిరాణా ప్రస్తుతం కాలేజ్ మ్యాచ్‌ల్లో ఇరగదీస్తున్నాడు. మలింగాను స్పూర్తిగా తీసుకున్న పతిరాణా.. అదే శైలిని అవలంభిస్తూ యార్కర్లతో రెచ్చిపోతున్నాడు. ఇటీవల ఓ కాలేజ్ గేమ్‌లో ఆడిన పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా వేస్తూ బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టిస్తున్నాడు. అచ్చం మలింగానే గుర్తు చేస్తుండటంతో జాతీయ జట్టులోకి రావడం అంతగా కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం పతిరాణాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఎవరొచ్చారనేది కాదు.. గెలిచామా? లేదా?
ఇస్లామాబాద్ : ఆటగాళ్లు ఎవరొచ్చినా సిరీస్ గెలవడంపైనే దృష్టిపెట్టాలని పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ సూచించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా లసిత్ మలింగతో సహా పది మంది రెగ్యులర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఆ దేశ క్రీడా మంత్రి ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడినప్పటికీ పాక్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని లంక బోర్డు కోరగా పాక్ సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఈ సిరీస్‌పై సందిగ్దత నెలకొంది. అయితే టాప్ ప్లేయర్స్‌ను కాకుండా జూనియర్ ఆటగాళ్లను పాక్‌కు పంపించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. దీనిపై మియాందాద్ స్పందించాడు. ‘ఆటగాళ్లు ఎవరొచ్చినా పాక్ ఆటగాళ్లు సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టండి. ప్రత్యర్థి జట్టు బలంగా, బలహీనంగా ఉన్నా మన ఆట మనం ఆడాలి. గెలవాలి. సిరీస్ ఉందంటే ఆటగాళ్లు వెళ్లాలి ఆడాలి. అంతేగానీ మేం వెళ్లం అనడం సరైనది కాదు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా’అంటూ మియాందాద్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ కూడా పాక్‌లో ప్రస్తుత క్రికెట్ పరిస్థితుల, భద్రతా చర్యలపైనా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక 2009లో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుపై దాడులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై అగంతుకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్ క్రికెట్ ఆడుతూ వస్తోంది. శ్రీలంక సిరీస్‌తో పాక్‌లో క్రికెట్ పునర్వైభం తీసుకరావాలని భావిస్తున్న పాక్‌కు నిరాశ తప్పేలా లేదు. -
టీ ‘20’ స్థానాలు ఎగబాకాడు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా ఒకేసారి 20స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో మలింగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ద్వారా ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. ప్రస్తుతం మలింగా 21వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు 41 స్థానంలో ఉన్న మలింగా.. కివీస్‌పై అద్భుత ప్రదర్శన తర్వాత తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు.నిన్న కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో వన్డేల్లోనూ టీ20ల్లోనూ ఆ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా మలింగా రికార్డు నెలకొల్పాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మార్కును చేరి తొలి బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ తన టాప్ ర్యాంకును కాపాడుకున్నాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంత్నార్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో నిలిచిన ఏకైక బౌలర్ కుల్దీప్. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్ టాప్‌ను కాపాడుకున్నాడు. అతని తర్వాత స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెండో స్థానానికి చేరగా, కొలిన్ మున్రో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు టాప్-10లో నిలిచారు. రాహుల్7వ స్థానంలో రోహిత్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు. -
4 బంతుల్లో 4 వికెట్లు
పుష్కర కాలం క్రితం 2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లుతీసి అరుదైన సంచలనాన్ని నమోదు చేశాడు. ‘హ్యాట్రిక్’తోనే సరిపెట్టకుండా తర్వాతి బంతికి మరో వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని అద్భుతం చేసి చూపించాడు. ఇప్పుడు అదే ఫీట్‌ను అతను పునరావృతం చేశాడు. ఈసారి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో తన సత్తా చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 4 వరుస బంతుల్లో 4 వికెట్లు తీసి మరెవరికీ సాధ్యం కాని రీతిలో చరిత్రకెక్కాడు. మలింగ దెబ్బకు కివీస్ చిత్తుగా ఓడగా... సొంతగడ్డపై తన కెప్టెన్సీలో సిరీస్ క్లీన్‌స్వీప్ కాకుండా అతను కాపాడుకోగలిగాడు. పల్లెకెలె: న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి ఇప్పటికే టి20 సిరీస్ కోల్పోయిన శ్రీలంక మూడో మ్యాచ్‌లో కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమికి సిద్ధమైనట్లు కనిపించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి 2 ఓవర్లలో కివీస్ 15 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోవచ్చని అనిపించిన సమయంలో అసలు తుఫాన్ మొదలైంది. మూడో ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు ఇవ్వని మలింగ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 4 బంతుల్లో 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ కూడా వెనుదిరగడంతో అతని బౌలింగ్ విశ్లేషణ 5/5గా నిలిచింది. ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ వేసి మరో పరుగు ఇచ్చిన మలింగ మ్యాచ్‌ను 4–1–6–5తో ముగించాడు. కివీస్ 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 4 వికెట్లు పడ్డాయిలా... 2.3: మున్రో (బి) మలింగ 2.4: రూథర్‌ఫోర్డ్ (ఎల్బీ) మలింగ– రివ్యూలోనూ అవుట్ 2.5: గ్రాండ్‌హోమ్ (బి) మలింగ – హ్యాట్రిక్ పూర్తి 2.6: టేలర్ (ఎల్బీ) మలింగ పాపం రూథర్‌ఫోర్డ్... కివీస్ ప్లేయర్ హామిష్ రూథర్‌ఫోర్డ్ 2013లో ఇదే మైదానంలో తన చివరి టి20 మ్యాచ్ ఆడాడు. మూడో మ్యాచ్‌కు ముందు గప్టిల్ గాయపడటంతో ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న అతడిని హడావిడిగా బుధవారమే జట్టులోకి ఎంపిక చేశా రు. అదే రోజు సాయంత్రం బయల్దేరి దాదాపు 9 వేల కిలోమీటర్లు ప్రయాణించి బరిలోకి దిగిన రూథర్‌ఫోర్డ్ తొలి బంతికే అవుటయ్యాడు పాపం. 5: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ మలింగ. అతను వన్డేల్లో 3, టి20ల్లో 2 హ్యాట్రిక్‌లు సాధించాడు. 1: అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్ మలింగ (మొత్తం 104) 100: అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో ఇది 100వ హ్యాట్రిక్ 2: టి20ల్లో మలింగకు ముందు రషీద్ ఖాన్ (అఫ్గాన్) కూడా 4 బంతుల్లో 4 వికెట్లు (ఐర్లాండ్‌పై) తీశాడు. -
‘మ్యాచ్ విన్నర్లలో అతనిదే టాప్ ప్లేస్’
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత 50 ఓవర్ల ఫార్మెట్కు మలింగ వీడ్కోలు ప్రకటించాడు. మలింగ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. (ఇక్కడ చదవండి: అగ్గి రాజేసిన రోహిత్ ‘అన్‌ఫాలో’ వివాదం!) ‘గత దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్ తరపున ఒక మ్యాచ్ విన్నర్‌ను ఎంపిక చేయమంటే.. మలింగ ముందు వరుసలో ఉంటాడు. ఓ కెప్టెన్‌గా ఉత్కంఠ పరిస్థితుల్లో తేలిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి మలింగనే కారణం. భవిష్యత్తులో మలింగకు మరింత మంచి జరగాలి’ అంటూ ట్వీట్ చేశాడు. (ఇక్కడ చదవండి: మలింగకు ఘనంగా వీడ్కోలు) If I had to pick one match winner among many others for @mipaltan in the last decade, this man will be on the top for sure. As a captain he give me breather during tense situation and he never failed to deliver, such was his presence within the team. Best wishes LM for the future pic.twitter.com/gJJJKy8gL3 — Rohit Sharma (@ImRo45) July 26, 2019 -
మలింగకు ఘనంగా వీడ్కోలు
కొలంబో: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ వీడ్కోలు వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా తమ వెటరన్ పేసర్‌కు మంచి బహుమతి ఇచ్చింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో లంక 91 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ పెరీరా (99 బంతుల్లో 111; 17 ఫోర్లు, సిక్స్) సెంచరీకి తోడు, కుశాల్ మెండిస్ (49 బంతుల్లో 43; 4 ఫోర్లు), ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (52 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. భారీ స్కోరు ఛేదనలో బంగ్లాను మలింగ (3/38) వరుస యార్కర్లతో కంగారుపెట్టాడు. ఓపెనర్లు, కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ (0), సౌమ్య సర్కార్ (15)లను అతడు ఈ విధంగానే బౌల్డ్ చేశాడు. మొదట్లోనే కష్టాల్లో పడిన జట్టును ముష్ఫికర్ రహీమ్ (86 బంతుల్లో 67; 5 ఫోర్లు), షబ్బీర్ రెహ్మాన్ (56 బంతుల్లో 60; 7 ఫోర్లు)లు ఐదో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు వెనుదిరిగాక బంగ్లా పోరాటం ఎంతోసేపు సాగలేదు. తన చివరి ఓవర్లో ముస్తఫిజుర్ (18)ను ఔట్ చేసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించి మ్యాచ్‌తో పాటు వన్డేలకు మలింగ సగర్వంగా బై బై చెప్పాడు. మలింగ వన్డే కెరీర్ 226 వన్డేల్లో 338 వికెట్లు బౌలింగ్ సగటు 28.87 అత్యధిక వికెట్ల జాబితాలో 9వ స్థానం అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/38 -
ఆఖరి వన్డేలోనూ అదుర్స్
కొలొంబో : ‘శుక్రవారం నేను ఆఖరి వన్డే ఆడబోతున్నాను. మీకు వీలైతే వచ్చి మ్యాచ్ చూడండి’... అంటూ తన అభిమానులను ప్రేమదాస స్టేడియానికి ఆహ్వానించిన లసిత్ మలింగ అన్నట్లుగానే తన చివరి మ్యాచ్‌లో సత్తా చాటాడు. బంగ్లాదేశ్ చివరి వికెట్‌ను తీసి శ్రీలంకను గెలిపించాడు. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజర్‌ను ఔట్ చేయడంద్వారా మొత్తంగా 338 వికెట్లు తన ఖాతాలో వేసుకొని అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. కాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు సాధించింది. చేజింగ్‌లో బంగ్లాదేశ్ 41.4 ఓవర్లకు 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మలింగ 9.4 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మ్యాచ్ తర్వాత మలింగ మాట్లాడుతూ ‘ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయంగా భావించా. 15 సంవత్సరాలుగా శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందని, నా కెరీర్‌ను ఘనంగానే ముగించానని అనుకుంటున్నానని’ పేర్కొన్నాడు. టి20 క్రికెట్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. -
సింగమలింగై
ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో స్టార్క్, బుమ్రా, బౌల్ట్‌లు యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డారు. కానీ ఫలితం వద్దకు వచ్చేసరికి మాత్రం యార్కర్లకు ‘తాత’లాంటివాడే అగ్రస్థానంలో నిలిచాడు. అవును, ఈ మెగా టోర్నీలో యార్కర్ల ద్వారా ఎక్కువ (ఐదు) వికెట్లు తీసిన బౌలర్ 38 ఏళ్ల లసిత్ మలింగ. ఎక్కడా తగ్గని వేగం, కొంచెం కూడా అటూ ఇటూ కాకుండా ‘బ్లాక్‌హోల్’లో బంతిని విసరగల కచ్చితత్వం, తనకే సాధ్యమైన ప్రత్యేక యాక్షన్‌తో కలిసొచ్చే అదనపు ప్రయోజనంతో మలింగ యార్కర్లు బ్యాట్స్‌మెన్‌ను ప్రమాద స్థితిలోకి పడేశాయి. ఇప్పుడు ఈ యార్కర్లకు వన్డే వేదికపై విశ్రాంతినిచ్చే సమయం వచ్చింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మలింగ ప్రకటించడంతో ఒక అధ్యాయం ముగుస్తున్నట్లయింది. సాక్షి క్రీడా విభాగం ‘శుక్రవారం నేను ఆఖరి వన్డే ఆడబోతున్నాను. మీకు వీలైతే వచ్చి మ్యాచ్ చూడండి’... అంటూ లసిత్ మలింగ తన అభిమానులను ప్రేమదాస స్టేడియానికి ఆహ్వానించాడు. వన్డేల్లో శ్రీలంక తరఫున మురళీధరన్ (523 వికెట్లు), చమిందా వాస్ (399 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మలింగ తన కెరీర్‌ను ముగించబోతున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ మొత్తానికి అతడిని ఎంపిక చేసినా ఒక్క వన్డేకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి వరల్డ్‌కప్‌తోనే రిటైర్ అవుతాడని అంతా భావించినా... 13 వికెట్లతో అతను లంక జట్టు టాపర్‌గా నిలవడంతో సెలక్టర్లు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. టి20 క్రికెట్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు మలింగ చెప్పాడు. టెస్టులతో మొదలు... బౌలర్ వేస్తున్న బంతి అర్థం కాక అంపైర్ల టై, ప్యాంట్లు మార్చమని ఆటగాళ్లు అడిగే పరిస్థితి మైదానంలో తలెత్తిందంటే అందుకు మలింగనే కారణం! 2005లో స్వదేశంలో లంకతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌కు ఈ సమస్య ఎదురైంది. మలింగకే సొంతమైన ‘రౌండ్ ఆర్మ్ యాక్షన్’లో బంతి మరీ కిందనుంచి వస్తుంది. అది అంపైర్ల దుస్తుల్లో కలిసిపోయి బ్యాట్స్‌మెన్‌కు కనిపించకపోయేది. దాంతో వారు ఒకసారి టై రంగు మార్చమని, రెండోసారి ప్యాంట్లనే మార్చమని కూడా కోరారు. ఈ టెస్టులో మలింగ తీసిన 9 వికెట్లలో 7 బౌల్డ్ లేదా ఎల్బీ కావడం విశేషం. అప్పుడే తొలిసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టి మలింగపై పడింది. అతని ఇన్‌స్వింగింగ్ యార్కర్లు, స్లో బాల్, బౌన్సర్లు ప్రమాదకరంగా మారి బ్యాట్స్‌మెన్‌ను వణికించాయి. గాయాలతో టెస్టు కెరీర్ 30 మ్యాచ్‌లకే పరిమితం కాగా, అతనిలోని అసలు ప్రతిభ వన్డే క్రికెట్లో పదునెక్కింది. ఒంటి చేత్తో... సరిగ్గా 15 ఏళ్ల క్రితం తొలి వన్డే ఆడిన మలింగ వచ్చీ రాగానే అద్భుతాలేమీ చేయలేదు. అయితే 2006లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించడంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 2007 ప్రపంచ కప్ నుంచి 2015 ప్రపంచ కప్ వరకు శ్రీలంక జట్టు నిలకడగా సాధించిన విజయాల్లో బౌలర్‌గా మలింగదే కీలక పాత్ర. సంగక్కర, జయవర్ధనేవంటి దిగ్గజాలతో పాటు దిల్షాన్ ఎక్కువ భాగం బ్యాటింగ్ భారం మోయగా... మ్యాచ్ ఆరంభంలోనే మలింగ అందించిన వికెట్లు లంక విజయానికి బాటలు వేసేవి. మలింగ వన్డే ప్రదర్శన అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్. ఇందులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్ ప్లస్’ నమోదు చేసిన అతను క్రికెట్ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. 2007, 2011 రెండు ప్రపంచ కప్ ఫైనల్‌లు కూడా ఆడి ఓటమి పక్షానే నిలిచిన మలింగ 2015 వరల్డ్ కప్‌కు వచ్చేసరికి ఫిట్నెస్ కోల్పోయి రాణించలేకపోయాడు. ఆ తర్వాతా కొనసాగిన ఫిట్నెస్ సమస్యలు, బోర్డుతో వివాదం నేపథ్యంలో చాలా రోజుల క్రితమే మలింగ కెరీర్ ముగిసినట్లే అనిపిం చింది. అయితే లంక జట్టులో అనుభవలేమి, వరుస వైఫల్యాల తర్వాత సీనియర్ మార్గనిర్దేశనం అవసరమై అతను మరో ప్రపంచ కప్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించగలిగాడు. కెప్టెన్‌గా శ్రీలంకకు 2014 టి20 ప్రపంచ కప్‌ను అందించిన ‘స్లింగ’పొట్టి ఫార్మాట్లో కూడా ఎంత కాలం ఆడగలడో చూడాలి. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. చాలా సంతోషంగా నిష్క్రమిస్తున్నా. కుర్రాళ్లకు ఇది చక్కని అవకాశంగా భావిస్తున్నా. నా వీడ్కోలుపై రెండేళ్లక్రితం సెలక్టర్లకు సమాచారమిచ్చాను. ఈ ప్రపంచకప్ కోసమే కష్టపడ్డాను. వన్డేలకు గుడ్‌బై చెబుతున్నప్పటికీ పొట్టి ఫార్మాట్లో కొనసాగుతాను. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ దాకా క్రికెట్ ఆడతా’ – మలింగ -
ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు
టీమిండియాతో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు.శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు.ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. -
ఆ మ్యాచ్ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై
కొలంబో : శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఈ నెల 26న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్ తర్వాత వన్డేలకు మలింగ గుడ్‌బై చెబుతున్నట్లు లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ప్రకటించాడు. ఈ విషయం మలింగ తనకు చెప్పాడని కరుణరత్నే వెల్లడించాడు. 36 ఏళ్ల మలింగ 15 ఏళ్ల కెరీర్లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు. మురళీధరన్ (523), చమిందా వాస్ (399) తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్‌గా అతను నిలిచాడు. -
మలింగా అరుదైన ఘనత
లీడ్స్: తన క్రికెట్ కెరీర్లో చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడేసిన శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ వేదికలో అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా మలింగా నిలిచాడు. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో మలింగా సాధించిన వికెట్లు 56. దాంతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే వసీం అక్రమ్(పాకిస్తాన్)ను అధిగమించాడు. వసీం అక్రమ్ 55 వరల్డ్‌కప్ వికెట్లను సాధించి ఇప్పటివరకూ మూడో స్థానంలో ఉండగా దాన్ని మలింగా బ్రేక్ చేశాడు. శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీసిన మలింగా.. మూడో ప్లేస్‌కు వచ్చాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మలింగా మొత్తం 12 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ మెగా టోర్నీలో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ వన్డే ఫార్మాట్లో మలింగా 219 ఇన్నింగ్స్‌లు ఆడి 335 వికెట్లు సాధించాడు. ఈ వికెట్లు సాధించే క్రమంలో 11 సార్లు నాలుగు వికెట్లను సాధించగా, 8 సందర్భాల్లో ఐదేసి వికెట్లు తీశాడు. ఇక శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ మలింగా. ఈ జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్(523), చమిందా వాస్(399)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
‘ధోని బెస్ట్ ఫినిషర్.. మరో రెండేళ్లు ఆడాలి’
ప్రపంచకప్‌లో స్లో బ్యాటింగ్ కారణంగా మిస్టర్ కూల్ ధోనిపై విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాటోర్నీ తర్వాత ధోనీ ఆటకు స్వస్తి చెబుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ ధోనికి అండగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ తనే బెస్ట్ ఫినిషర్ అని కితాబిచ్చాడు. ధోని మరో రెండేళ్ల పాటు క్రికెట్లో కొనసాగాలని ఈ ఫాస్ట్ బౌలర్ ఆకాంక్షించాడు. ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు వచ్చే అవకాశమైతే లేదు గానీ.. యువ ఆటగాళ్లు అతడి ఆట నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. చదవండి : ఈ ఫొటో చూశాకైనా ధోనీ అంటే ఏంటో అర్థమైందా?! ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన సహచర ఆటగాడు, ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాపై కూడా మలింగ ప్రశంసలు కురిపించాడు. ఆత్మవిశ్వాసం ఉండటమే బుమ్రా ప్రధాన బలమని.. ఈ కారణంగానే ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడని పేర్కొన్నాడు. ‘ నైపుణ్యం ఉన్న ఆటగాడు ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యానికి... ఏ ప్రాంతంలో బంతులు విసరాలనే కచ్చితత్వం తోడైతే ప్రతీ బౌలర్ విజయవంతమవుతాడు. బుమ్రా కూడా అలాంటి వాడే. యార్కర్లు ఎవరైనా సంధించగలరు. కానీ దానిని అమలు చేసే విధానంలో తేడా ఉంటుంది. అలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు బుమ్రా. 2013లో తనను చూసినపుడు నేర్చుకోవాలనే కసి కనిపించింది. ఫలితంగా ఇప్పుడు ఓ స్టార్ బౌలర్‌గా ఎదిగాడు’ అని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి : కోహ్లి సేనకు ఇంగ్లండ్ గండం తప్పాలంటే... టీమిండియాకే అర్హత! ప్రపంచకప్ ట్రోఫీ సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయని మలింగ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి ఆటగాళ్లతో నిండి ఉన్న ప్రస్తుత జట్టు.. నాడు ధోని సారథ్యంలోని 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేస్తుందని జోస్యం చెప్పాడు. మెగాటోర్నీ అనంతరం బోర్డుతో మాట్లాడి.. 2020 టీ20 వరల్డ్ కప్‌నకు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నానని తన భవిష్యత్ ప్రణాళికలను మలింగ వెల్లడించాడు. -
లంక గెలిచే.. ఆనందం విరిసె
చెస్టర్ లీ స్ట్రీట్ : ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. ఈ టోర్నీలో తొలి సారి బ్యాటింగ్‌లో అదరగొట్టిన లంకేయులు ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న లంకేయులకు ఈ విజయం ఆనందం కలిగించేదే. సోమవారం రివర్సైడ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో కరేబియన్ జట్టుపై 23 పరుగుల తేడాతో లంక జయభేరి మోగించింది. సింహళీయులు నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఆటగాళ్లలో నికోలస్ పూరన్(118; 103 బంతుల్లో 11ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో రాణించినప్పటికీ కీలక సమయంలో అవుటై తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్‌కు తోడుగా ఫాబియన్ అలెన్(51) అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లతో రాణించాడ. తన శతకంతో లంక భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన అవిష్క ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. నికోలస్ ఒక్కడే.. లక్ష్యఛేదనలో విండీస్ తడబడింది. విజయానికి అవసరమయ్యే భారీ భాగస్వామ్యాలను నమోదు చేయడంలో విండీస్ టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. దీంతో 199 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ ఓటమికి విండీస్ దగ్గర్లో నిలిచింది. అయితే నికోలస్ పూరన్- అలెన్ జోడి ఎనిమిదో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కరేబియన్ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అర్దసెంచరీ సాధించిన అనంతరం అనవసరంగా అలెన్ రనౌట్ అవ్వడం, శతకం పూర్తయిన వెంటనే నికోలస్ వెనుదిరగడంతో విండీస్ ఓటమి ఖాయం అయింది. అంతకుముందు శ్రీలంక ఆటగాళ్లు అవిష్క ఫెర్నాండో (104;103 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు కుశాల్ పెరీరా (64; 51 బంతుల్లో 8 ఫోర్లు), తిరుమన్నే(45 నాటౌట్; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు సాధించగా, కాట్రెల్, థామస్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ తీశారు. తలో చేయి వేశారు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(32: 48 బంతుల్లో 4 ఫోర్లు), కుశాల్ పెరీరా జోడీ తొలి వికెట్‌కు 93 పరుగులు జతచేసింది. ఈ తరుణంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటయ్యాక అవిష్క, కుశాల్ మెండిస్(39: 41 బంతుల్లో 4 ఫోర్లు) మరో ఉపయుక్త భాగస్వామ్యం(85) ఏర్పరిచింది. దీంతో లంక భారీ స్కోరు దిశగా పయనిం చింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్(26)తో కలసి ఫెర్నాండో మరో 55 పరుగులు జత చేశాడు. ఉదాన(3) నిరాశపరిచాడు. చివర్లో తిరిమన్నే స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సమయోచితంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో స్కోరు 300 దాటింది. -
ఇంగ్లండ్‌పై ఎలా గెలిచామంటే..
లీడ్స్: ప్రపంచకప్‌లో భాగంగా బలమైన ఇంగ్లండ్‌ను ఓడించి శ్రీలంక అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ వీరంగంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. గత కొన్నాళ్లుగా 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్ 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఇంగ్లండ్ టాపార్డర్‌ను మలింగ కూల్చగా.. స్పిన్నర్ ధనుంజయ్ డిసిల్వా లోయార్డర్ పనిపట్టాడు. దీంతో విజయం లంక వాకిట నిలిచింది. మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మలింగ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడానికి పక్కా వ్యూహాలు రచించి అమలుచేశామని తెలిపాడు. ‘గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్ అవలీలగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ విజయాలను నమోదు చేస్తున్నారు. అయితే మేం నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కాపాడు కోవాలంటే బౌలింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని నిశ్చయించుకున్నాం. లైన్ అండ్ లెంగ్త్ తప్పకూడదు.. అదే విధంగా చెత్త బంతులు వేయకూడదనే బేసిక్ ప్రణాళికను అమలు చేశాం. అంతేకాకుండా బౌన్సర్లను కూడా వివిధ వేరియేషన్స్‌తో వేయాలనుకున్నాం. స్టోక్స్ ఓ ఎండ్‌లో రెచ్చిపోతుండటంతో స్టాక్ బాల్స్‌తో అతడిని బోల్తా కొట్టించాలనుకున్నాం. కానీ స్టోక్స్ అద్బుతంగా ఆడాడు. ఇక బట్లర్‌ను ఆరంభంలోనే ఔట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే కుదురుకుంటే రెచ్చిపోతాడు. అందుకే అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించాం. అన్ని పక్కాగా అమలు చేయడంతో ఇంగ్లండ్‌పై విజయం సాధించాం’అంటూ మలింగ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మలింగ నాలుగు వికెట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. -
ఇప్పుడు చెప్పండ్రా.. మలింగా హేటర్స్!
లండన్ : లసిత్ మలింగా.. ఇప్పుడు శ్రీలంక అభిమానులకు ఆరాధ్య దైవం. శుక్రవారం ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఒంటి చేత్తో గెలిపించిన సీనియర్ ఆటగాడు. 300 పైచిలుకు స్కోర్లను అవలీలగా సాధిస్తున్న ఇంగ్లండ్‌ను 233 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించకుండా మట్టికరిపించిన బౌలర్. ప్రపంచకప్ టైటిల్ ఆశలను సజీవంగా నిలిపిన సూపర్ బౌలర్. కానీ వారం రోజుల క్రితం.. ఇదే మలింగా అభిమానుల దృష్టిలో అన్‌ఫిట్ ఆటగాడు. పొట్ట ఉన్న క్రికెటర్. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన ఆటగాడు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీకెప్టెన్ మహేల జయవర్థనే ‘ఇప్పుడు చెప్పండ్రా మలింగా హేటర్స్’ అంటున్నాడు. ‘ఓ పుస్తకం కవర్ పేజీ చూసి దానిపై ఓ నిర్ణయానికి రాకుడదూ.. మలింగా నీ బౌలింగ్ అద్భుతం’ అంటూ మలింగా షర్ట్‌లెస్ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితం ఈ షర్ట్‌లెస్ ఫొటోపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని శరీరాకృతిని ప్రస్తావిస్తూ అభిమానులు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు మలింగా తన ఆటతోనే బదులిచ్చాడు. తాను ఎంత కీలకమైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. ఇక మలింగా బౌలింగ్ వీరంగానికి బెయిర్‌స్టో డకౌట్ కాగా.. విన్స్ (14), కెప్టెన్ మోర్గాన్ (21), బట్లర్ (10)లు పెవిలియన్ బాటపట్టారు. టాపర్డర్‌ను మలింగా దెబ్బతీయగా.. ధనంజయ డిసిల్వా (3/32) లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. మరోవైపు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా.. శ్రీలంక పక్కా ప్రణాళికతో అతన్నికట్టడి చేసింది. స్టోక్స్ బ్యాటింగ్ గురించి మ్యాచ్ అనంతరం మలింగా మాట్లాడుతూ.. స్టోక్స్ ఎంత దాటిగా ఆడగలడో మాకు తెలుసు. అప్పటికే అతను వరుస బౌండరీలతో జోరు ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో అతన్ని స్టాక్‌బాల్స్ వ్యూహంతో కట్టడి చేశాం. లూస్ బంతులు వేయకుండా.. లైన్ అండ్ లెంగ్త్‌కు బౌన్సర్లతో కూడిన వైవిధ్యమైన బంతులు వేశాం. పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడమే మా ప్రణాళిక. దాన్ని విజయవంతంగా అమలు చేశాం.’ అని మలింగా చెప్పుకొచ్చాడు. ఇక మలింగా దిగ్గజమంటూ (4/43) ప్రదర్శనను శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే కొనియాడాడు. View this post on Instagram Well bowled Mali!!! Thought i would share the most talked about picture last week for all you fans..😉👍👊 A post shared by Mahela Jayawardena (@mahela27) on Jun 21, 2019 at 10:54am PDT -
20 పరుగుల తేడాతో లంక ఘన విజయం
-
ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
లీడ్స్ : ఆతిథ్య ఇంగ్లండ్‌కు శ్రీలంక దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు బ్యాటింగ్‌లో పరుగుల ప్రవాహం సృష్టించిన మోర్గాన్ సేన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 20 పరుగులు తేడాతో అధ్బుతమైన విజయాన్ని సాధించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జట్టును కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో యార్కర్ల కింగ్ లసిత్ మలింగ(4/43) ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. మలింగకు తోడు డిసిల్వా(3/32), ఉదానా(2/41)లు రాణించారు. లంక విజయంలో కీలకపాత్ర పోషించిన మలింగక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లంక నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47 ఓవర్లకు 212 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(82 నాటౌట్; 89బంతుల్లో 7ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జో రూట్(57) అర్దసెంచరీతో రాణించినప్పటికీ కీలక సమయంలో ఔటయ్యాడు. ఇక బెయిర్ స్టో(0), మోర్గాన్(21), బట్లర్(10), విన్సే(14)లు పూర్తిగా నిరాశపరిచారు. స్టోక్స్‌కు అండగా ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. మలింగ మొదలెట్టాడు.. డిసిల్వా కొనసాగించాడు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మలింగ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. స్టార్ ఓపెనర్ బెయిర్ స్టోను గోల్డెన్ డక్‌గా వెనక్కి పంపిస్తాడు. అనంతరం విన్సేను కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువనియ్యలేదు. ఈ క్రమంలో రూట్, మోర్గాన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే మోర్గాన్‌ను ఉదానా బోల్తాకొట్టించి పెవిలియన్‌కు పంపించాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించిన అనంతరం రూట్‌ను మలింగ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు మరోసారి షాక్ ఇస్తాడు. ఇక స్పిన్నర్ డిసిల్వా కూడా కీలక సమయంలో మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, రషీద్‌లను ఔట్ చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. మాథ్యూస్ మెరిశాడు.. అంతకుముందు మ్యాథ్యూస్ (85 నాటౌట్: 115 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న లంకకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. 3 పరుగులకే ఓపెనర్లు దిముత్ కరుణరత్నే((1), కుశాల్ పెరీరా(2) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అవిష్కా ఫెర్నాండో(49: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్(46: 68 బంతుల్లో 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఫెర్నాండో అవుటయ్యాక కుశాల్ మెండిస్– మాథ్యూస్ జోడీ 71 పరుగులు జోడించింది. అనంతరం కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్ ఇలా వచ్చి అలా నిష్క్రమించాడు. మిగిలిన వారిలో ధనంజయ డిసిల్వా (29) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ చెరో మూడు వికెట్లు, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించారు. క్రిస్ వోక్స్ వికెట్ తీశాడు. -
స్వదేశానికి మలింగ
బ్రిస్టల్: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. మలింగ అత్త మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి మంగళవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం శ్రీలంకకు బయలుదేరాడు. 15న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న శ్రీలంక జట్టులో మలింగ అత్యంత కీలకమైన ఆటగాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు శ్రీలంక ప్రపంచ కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడగా అఫ్గానిస్తాన్‌పై గెల వగా, న్యూజిలాండ్ చేతిలో ఓడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. -
శ్రీలంకకు పయనమైన మలింగ
బ్రిస్టల్: యార్కర్ల కింగ్, శ్రీలంక సీనియర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. తన అత్త మరణించడంతో ఆమె అంతిమ సంస్కారంలో పాల్గొనడానికి మంగళవారం బంగ్లాతో మ్యాచ్ అనంతరం శ్రీలంకకు బయలుదేరాడు. 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ‘ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లో లసిత్ మలింగ ఆడటం లేదు. అతడి అత్త మరణించారు. తర్వాత మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. జూన్ 15న ఆసీస్‌తో పోరుకు జట్టుతో కలుస్తాడు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం శ్రీలంక జట్టులో మలింగ అత్యంత కీలక ఆటగాడు. ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. అఫ్గాన్‌పై గెలిచి, కివీస్ చేతిలో ఓడింది. పాక్, బంగ్లాతో మ్యాచ్‌లు రద్దయ్యాయి. దీంతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక లంక సెమీఫైనల్ చేరుకోవాలంటై ప్రతీ మ్యాచ్‌లో సవాల్‌తో కూడుకున్నదే. -
శ్రీలంకదే విజయం
-
శ్రీలంకదే విజయం
కార్డిఫ్ : ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మరో ఆసక్తికర సమయంలో అఫ్గానిస్తాన్‌పై శ్రీలంకనే పైచేయి సాధించింది. వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 34 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై జయభేరి మోగించింది. సవరించిన లక్ష్యం ప్రకారం అఫ్గాన్ 41 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 32.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. హజ్రతుల్లా(30), నజీబుల్లా(43) మినహా ఎవరూ రాణించలేకపోయారు. లంక బౌలర్లలో ప్రదీప్ నాలుగు వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. మలింగ మూడు వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకను 36.5 ఓవర్లకు 201 పరుగులకు పరిమితం చేసింది అఫ్గానిస్థాన్. కుశాల్ పెరీరా(78) హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత కరుణరత్నే(30), లహిరు తిరుమన్నే(25)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హమిద్ హసన్‌కు వికెట్ దక్కింది. అయితే లంక ఇన్నింగ్స్‌లో మూడు గంటల సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. దీంతో సవరించిన లక్ష్యం ప్రకారం అఫ్గాన్‌కు 41 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. -
‘మళ్లీ హ్యాట్రిక్ నమోదు చేస్తానేమో’
లండన్: యార్కర్ల కింగ్ లసిత్ మలింగ 2007 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్‌తోసహా వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లోనూ తాను మరోసారి హ్యాట్రిక్ నమోదు చేయొచ్చంటున్నాడు మలింగ. ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలింగ మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకోవాల్సిందే. అప్పుడే మన సామర్థ్యానికి అసలు పరీక్ష ఎదురవుతుంది. ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడాన్ని నేను ఆస్వాదిస్తా. ఈసారి ఐపీఎల్లో విజయవంతం అవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపేదే. వికెట్లు తీయగలిగే నైపుణ్యం నాకుందని నేను నమ్ముతా. అదే నాకు కావాల్సిన శక్తిని ఇస్తుంది’ అని పేర్కొన్నాడు. కాగా, మరొక్క వికెట్ తీస్తే వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన వారి జాబితాలో తమ దేశానికే చెందిన సనత్ జయసూర్యను మలింగ అధిగమించి టాప్–10లోకి చేరతాడు. ఇక కరుణరత్నే సారథ్యంలోని శ్రీలంక జట్టు తన తొలి ప్రపంచకప్ పోరులో న్యూజిలాండ్‌తో జూన్ 1న తలపడనుంది. సీనియర్ ఆటగాళ్లు లసిత్ మలింగ, మాథ్యూస్లపైనే ఆజట్టు ఆధారపడి ఉంది. మలింగకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది. -
శ్రీలంకకు సవాల్!
దిముత్ కరుణరత్నే... కెరీర్లో 17 వన్డేలు మాత్రమే ఆడితే 2015లో జరిగిన వరల్డ్ కప్‌లో లంక తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు. అతను ఇప్పుడు శ్రీలంక జట్టుకు ప్రపంచ కప్‌లో కెప్టెన్. లంక జట్టులో నాయకత్వ లోటు ఎలా ఉందో చెప్పేందుకు ఇది పెద్ద ఉదాహరణ. వరుసగా ఎనిమిది వన్డేలు ఓడిన లంక ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. 2016 జూన్ తర్వాత ఆ జట్టు ఒక్క వన్డే ద్వైపాక్షిక సిరీస్ కూడా నెగ్గలేదు. 2017 నుంచి చూస్తే ఆ జట్టు 41 వన్డేలు ఓడి, 11 మాత్రమే గెలవగలిగింది. ఆటగాళ్లు, కోచ్‌కు మధ్య విభేదాలు, బోర్డులో సమస్యలు, వివాదాలు... వరల్డ్ కప్‌కు ముందు మాజీ చాంపియన్ శ్రీలంక తాజా పరిస్థితి ఇది. ఇన్ని ప్రతికూలతల మధ్య లంక మరోసారి విశ్వ సమరానికి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు కూడా రెండో పర్యాయం విశ్వ విజేత కాలేకపోయిన ద్వీప దేశం ఇప్పుడు యువ ఆటగాళ్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. మరో 7 రోజుల్లో... బలాలు: ఆటపరంగా, అనుభవం పరంగా చూస్తే లసిత్ మలింగ శ్రీలంకకు పెద్ద దిక్కు. 322 వన్డే వికెట్లు తీసిన ఈ సీనియర్... ఇంగ్లండ్ గడ్డపై ఒక్క స్పెల్‌తో ఫలితాన్ని ప్రభావితం చేయగల నేర్పరి. 2007, 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడిన మలింగ తన చివరి టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. మిడిలార్డర్లో మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ లంకకు వెన్నెముకలాంటివాడు. 203 వన్డేల అనుభవం ఉన్న మాథ్యూస్‌కు తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగల సత్తా ఉంది. గాయంతో చాలా కాలంగా బౌలింగ్‌కు దూరమైన తర్వాత అతని బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. కుశాల్ పెరీరా వేగంగా ఆడటంలో నేర్పరి కాగా... వన్డేల్లో వందకు పైగా స్ట్రయిక్ రేట్ ఉన్న తిసారా పెరీరా దూకుడు లోయర్ ఆర్డర్లో లంకకు అదనపు బలం కాగలదు. అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కించుకున్న కరుణరత్నే ఇప్పుడు వన్డేలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల లంక దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడి పరుగుల వరద పారించాడు. చెప్పుకోదగ్గ అనుభవం లేకపోయినా తనను తాను నిరూపించుకునే పట్టుదలతో ఉన్న కరుణరత్నే టాపార్డర్‌లో రాణిస్తే లంక విజయావకాశాలు మెరుగవుతాయి. బలహీనతలు: ఫలానా బ్యాట్స్‌మన్ అంటే ప్రత్యర్థి జట్లకు కొంత ఆందోళన... అతని కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించాల్సి ఉంది! ఇలా చెప్పుకోగలిగే అవకాశం ఉన్న, ఒంటి చేత్తో విధ్వంసం సృష్టించగల ఒక్కడంటే ఒక్క ఆటగాడు కూడా శ్రీలంక టీమ్‌లో లేడు. ఇటీవలి లంక ప్రదర్శనకు, ఇతర జట్లు లంకను సీరియస్‌గా తీసుకోకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ట్రెండ్ మారిన నేటి వన్డేల్లో ఇది పెద్ద బలహీనత కాగలదు. ఆల్రౌండర్లను పక్కన పెడితే 15 మంది సభ్యుల జట్టులో నలుగురు మాత్రమే రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తిసారా మినహా ఇతర ఆల్‌రౌండర్ల ప్రదర్శన ఇప్పటి వరకు అంతంత మాత్రమే. ఇక మలింగ తప్ప లంక బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. రెగ్యులర్ స్పిన్నర్ ఒక్కరు కూడా టీమ్‌లో లేరు. లెగ్‌స్పిన్నర్ జీవన్ మెండిస్ కూడా వన్డే ఆడి నాలుగేళ్లయింది! ఈ నేపథ్యంలో లంకకు అంత సులువు కాదు. జట్టు వివరాలు దిముత్ కరుణరత్నే (కెప్టెన్), ధనంజయ డిసిల్వా, నువాన్ ప్రదీప్, అవిష్క ఫెర్నాండో, సురంగ లక్మల్, లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్, కుశాల్ పెరీరా, తిసారా పెరీరా, మిలింద సిరివర్ధన, లహిరు తిరిమన్నె, ఇసురు ఉడాన, జెఫ్రే వాండర్సే. -
చివరి ఓవర్ హర్దిక్‌కు ఇద్దామనుకున్నా: రోహిత్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 ఫైనల్ పోరులో అంతిమ విజయం ముంబే ఇండియన్స్‌కే దక్కింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. దీంతో ముంబై ఖాతాలో నాలుగో టైటిల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై.. ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది. కాగా మ్యాచ్ అనంతరం ముంబై సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కప్‌ను నాలుగో సారి ముంబై అందుకోవడం చాలా గర్వంగా, అనందరంగా ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో వెటరన్ బౌలర్ మలింగనే చాంపియన్ అంటూ పేర్కొన్నాడు. ‘ముంబై విజయం అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. ఒక ఛాంపియన్ బౌలర్ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే. మలింగ తన మూడో ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. దీంతో 20 ఓవర్ హార్దిక్ పాండ్యాతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపాను’ అని రోహిత్ వివరించాడు. -
ముంబైదే ఐపీఎల్ టైటిల్
-
థ్రిల్లింగ్ ఫైనల్లో ముంబై విండియన్స్
ఒక్క పరుగు... ఒక్క పరుగు... ముంబై ఇండియన్స్ ఇకపై ఉచ్ఛరించే మంత్రమిది... రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్ ఫైనల్లో స్వల్ప స్కోరును నమోదు చేసి ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు మళ్లీ అదే అద్భుతాన్ని చేసి చూపించింది. బ్యాటింగ్ వైఫల్యంతో 149 పరుగులకే పరిమితమై... చెత్త ఫీల్డింగ్, క్యాచ్‌లు, రనౌట్లు వదిలేసి కూడా చివరకు చిరకాల ప్రత్యర్థి చెన్నైపై పైచేయి సాధించగలిగింది. చార్మినార్ కోటలో ‘చార్ మార్’ చేస్తూ నాలుగోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. అనూహ్య పరిణామాలతో, మలుపులతో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తుది పోరులో ముంబై విజయజెండా ఎగరవేసింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం పట్టు కొనసాగించిన ధోని వ్యూహానికే ఇక టైటిల్ ఖాయమనిపించగా... రోహిత్ చివరి ఓవర్ ప్లాన్ అద్భుతంగా పని చేసింది. సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. వాట్సన్ మినహా... సింగిల్ తీయడంలో తడబాటు... త్రుటిలో తప్పించుకున్న రనౌట్... ఇలా చెన్నై తొలి మూడు ఓవర్ల ఇన్నింగ్స్ గందరగోళంగా సాగింది. ఆ తర్వాత కృనాల్ వేసిన నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన డు ప్లెసిస్ (13 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మలింగ ఓవర్లో వాట్సన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్ ఇచ్చిన క్యాచ్‌ను మలింగ వదిలేయడంతో చెన్నైకి లైఫ్ లభించింది. అతి కష్టమ్మీద పరుగులు తీస్తూ, అప్పటికే అంపైర్ రివ్యూలో ఒకసారి బతికిపోయిన రైనా (8) ఈసారి నిలవలేకపోయాడు. రాహుల్ చహర్ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు. ఇప్పుడు రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. రాయుడు (1) తన వైఫల్యం కొనసాగిస్తూ బుమ్రా బౌన్సర్‌కు ఔటయ్యాడు. వరుసగా వికెట్లు పోతుండగా, మరో ఎండ్‌లో నిలిచిన వాట్సన్‌లో కూడా జోరు తగ్గింది. మళ్లీ జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత ధోని (2) పైనే పడింది. అయితే అతను అనూహ్యంగా రనౌట్ అయిన్పటికీ, ఆ తర్వాత వాట్సన్ జోరుతో చెన్నై గెలుపునకు చేరువగా రాగలిగింది. ధోని రనౌట్‌తో... ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధోని కీలక సమయంలో రనౌట్ కావడం చెన్నై శిబిరాన్ని ఒక్కసారిగా ఆందోళనలో పడేసింది. హార్దిక్ బౌలింగ్‌లో వాట్సన్ ఫైన్‌లెగ్ వైపు ఆడగా సింగిల్ వచ్చింది. బంతిని ఆపి మలింగ విసిరిన త్రో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కు దూరంగా వెళుతుండటంతో ధోని రెండో పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా దూసుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లపైకి కొట్టాడు. బంతి స్టంప్స్‌కు తగిలే సమయంలో బ్యాట్ క్రీజ్ గీతపైనే ఉంది. నిజానికి ధోని తనే ఔట్‌గా భావించి ముందే నడవటం మొదలు పెట్టినా ఫీల్డ్ అంపైర్లు అతడిని ఆపారు. సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసిన అనంతరం చివరకు అంపైర్ నైజేల్ లాంజ్ ధోనిని ఔట్‌గా ప్రకటించాడు. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. చివరి 5 ఓవర్లలో... ధోని వికెట్ పడ్డాక వాట్సన్‌తో పాటు పెద్దగా ఫామ్‌లో లేని బ్రేవో క్రీజ్‌లో ఉన్నాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేయాల్సిన స్థితి చెన్నైకి కష్టంగానే కనిపిస్తోంది. అయితే 16వ ఓవర్లో మళ్లీ ఆట మారిపోయింది. మలింగ వేసిన ఈ ఓవర్లో బ్రేవో సిక్స్ బాదగా, వాట్సన్ 3 ఫోర్లు కొట్టాడు. దాంతో 20 పరుగులు వచ్చాయి. అప్పటి వరకు అద్భుత బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న రాహుల్ చహర్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వాట్సన్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి మరో అవకాశం కల్పించాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్లో వరుసగా 6, 6, 6 బాది వాట్సన్ చెలరేగిపోయాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ చెన్నై వైపు తిరిగింది. బ్రేవో (15) ఔటైనా, వాట్సన్ గెలిపించే స్థితిలో నిలిచాడు. అయితే చివరకు అదృష్టం సూపర్ కింగ్స్ మొహం చాటేసింది. రోహిత్ విఫలం... ఆరంభంలో డి కాక్, ఆ తర్వాత పొలార్డ్ మినహా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో జోష్ కనిపించలేదు. జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 ఫోర్లే ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి రెండు ఓవర్లలో ఒక సిక్సర్ సహా ముంబై పది పరుగులే చేసింది. అనంతరం డి కాక్ దూకుడైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. దీపక్ చహర్ వేసిన మూడో ఓవర్లో డి కాక్ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత శార్దుల్ బౌలింగ్‌లోనూ అతను మరో సిక్స్ బాదాడు. అయితే తర్వాతి బంతికే డి కాక్‌ను ఔట్ చేసి శార్దుల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పవర్‌ప్లే చివరి ఓవర్ చెన్నైకి మరింతగా కలిసొచ్చింది. అంతకుముందు ఓవర్లో భారీగా పరుగులిచ్చినా దీపక్ చహర్‌తో మళ్లీ బౌలింగ్ వేయించిన ధోని వ్యూహం పని చేసింది. చక్కటి బంతిని డ్రైవ్ చేయబోయి కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఓవర్ మెయిడిన్‌గా కూడా ముగిసింది. క్వాలిఫయర్ హీరో సూర్య కుమార్ (17 బంతుల్లో 15; ఫోర్) తడబడుతూ ఆడగా, కృనాల్ పాండ్యా (7 బంతుల్లో 7) విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) కొద్దిగా నిలిచినా వేగంగా ఆడలేకపోవడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. పొలార్డ్ మెరుపులు... ఆదివారం ఫైనల్ రోజునే పుట్టిన రోజు జరుపుకున్న పొలార్డ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గతంలో చెన్నైపై మూడు ఫైనల్స్‌లో కలిపి 60 బంతుల్లో 123 పరుగులు చేసిన రికార్డు ఉన్న అతను మరోసారి ఆకట్టుకున్నాడు. తాహిర్ వరుస ఓవర్లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. మరోవైపు 4 పరుగుల వద్ద రైనా క్యాచ్ వదిలేసినా హార్దిక్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. దీపక్ చహర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన హార్దిక్ రివ్యూకు వెళ్లినా లాభం లేకపోయింది. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ ఆట ముగించాడు. పొలార్డ్ నిరసన... ఐపీఎల్లో గతంలో ఒకసారి తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో నోటికి ప్లాస్టర్ వేసుకొని మైదానంలోకి దిగిన పొలార్డ్ మరోసారి తనదైన తరహాలో నిరసన తెలిపాడు. బ్రేవో వేసిన చివరి ఓవర్ మూడో బంతి క్రీజ్‌కు దూరంగా వెళుతుండటంతో అతను వైడ్‌గా భావించి వదిలేశాడు. అయితే అంపైర్ నితిన్ మీనన్ మాత్రం వైడ్ ఇవ్వలేదు. దాంతో ఆగ్రహించిన పొలార్డ్ తర్వాతి బంతికి వికెట్లకు పూర్తిగా పక్కకు జరిగి, అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్‌లైన్స్) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. దాంతో బౌలింగ్ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరకు అంపైర్ గౌల్డ్, మీనన్ కలిసి సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. లాంజ్‌ను పక్కన పెట్టారు... ఐపీఎల్ మ్యాచ్‌లో కోహ్లితో వాదన తర్వాత గది అద్దాలపై తన ప్రతాపం చూపించిన అంపైర్ నైజేల్ లాంజ్‌పై ఎలాంటి చర్య ఉండదని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. పైగా ఈ సీజన్లో భారత అంపైర్ల ప్రమాణాలు సరిగ్గా లేవని, లాంజ్ అత్యుత్తమ అంపైర్లలో ఒకడని కితాబు కూడా ఇచ్చింది. ఫైనల్‌కు నాలుగు రోజుల ముందు ప్రకటించిన ఫీల్డ్ అంపైర్ల జాబితాలో నైజేల్ లాంజ్ పేరు ఉంది. తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్‌లాంటి కీలక మ్యాచ్‌కు అలాంటి అంపైర్ అవసరం ఉందని కూడా బోర్డు ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో, లేక ఎవరినుంచైనా అభ్యంతరం వచ్చిందో తెలీదు కానీ అతడిని ఫీల్డ్ అంపైరింగ్ నుంచి పక్కన పెట్టారు. చివరకు థర్డ్ అంపైర్ స్థానానికి పరిమితం చేశారు. అతని స్థానంలో వచ్చిన నితిన్ మీనన్ బోర్డు భయపడినట్లు పేలవ అంపైరింగ్ చేశాడు. పొలార్డ్‌కు వైడ్ నిరాకరించడం అందులో ఒకటి. ►1 ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిల్స్ విజయాల్లో పాలుపంచుకున్న ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2009 చాంపియన్ డెక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉండగా... 2013, 2015, 2017, 2019లలో ముంబై జట్టుకు రోహిత్ సారథ్యం వహించాడు. ►4 ముంబై జట్టు నెగ్గిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లో (2013, 2015, 2017, 2019) తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం. ►4 ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం విశేషం. 2010లో చెన్నై 22 పరుగుల తేడాతో... 2013లో ముంబై 23 పరుగుల తేడాతో... 2015లో ముంబై 41 పరుగుల తేడాతో... 2019లో ముంబై ఒక పరుగు తేడాతో గెలిచాయి. ఐపీఎల్ అవార్డులు ►ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్) డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) 692 పరుగులు ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ ►పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) ఇమ్రాన్ తాహిర్ (చెన్నై) 26 వికెట్లు ప్రైజ్‌మనీ రూ.10లక్షలు, ట్రోఫీ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు: ►పంజాబ్, హైదరాబాద్ ప్రైజ్‌మనీ: రూ. 25 లక్షలు చొప్పున ►పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ, ►సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్ ఆండ్రీ రసెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ట్రోఫీ, టాటా మోటార్స్ హారియర్ ఎస్యువీ కారు ►స్టయిలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ లోకేశ్ రాహుల్ (పంజాబ్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►డ్రీమ్–11 గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డు రాహుల్ చహర్ (ముంబై ఇండియన్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ ►ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు శుబ్‌మన్ గిల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు ►ఫెయిర్ ప్లే అవార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ ►మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ (కోల్‌కతా) ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు, ట్రోఫీ -
దేశం కోసం మలింగ ఆడాలి
కొలొంబో: ప్రపంచకప్‌నకు ముందు వన్డే జట్టు సారథ్యాన్ని దిముత్ కరుణరత్నెకు కోల్పోయిన పేసర్ లసిత్ మలింగ... నిరాశను పక్కనపెట్టి దేశం కోసం ఆడాలని శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మీ సిల్వా కోరారు. గురువారం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి మలింగను పేసర్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు వ్యక్తిగతంగా రాణిస్తున్న మలింగ... కెప్టెన్సీలో అంచనాలను అందుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లంక సెలక్షన్ కమిటీ చైర్మన్ అషంత డి మెల్ మాట్లాడుతూ అసలే అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న లంక క్రికెట్‌ను రక్షించుకోవాలంటే ఆటగాళ్లంతా ఏకమై దేశం కోసం ఆడాలని ఆకాంక్షించారు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో చివరిసారిగా వన్డే ఆడిన జీవన్ మెండిస్‌తో పాటు గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మిలింద సిరివర్దెన, జెఫ్రీ వండెర్‌సీ ప్రపంచకప్‌తో పునరాగమనం చేయనున్నారు. శ్రీలంక ప్రపంచ కప్ జట్టు: దిముత్ కరుణరత్నె (కెప్టెన్), లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, తిసారా పెరీరా, కుషాల్ జనిత్ పెరీరా, ధనంజయ డి సిల్వా, కుషాల్ మెండిస్, ఇసురు ఉదాన, మిలింద సిరివర్దెన, అవిష్క ఫెర్నాండో, జీవన్ మెండిస్, లహిరు తిరిమన్నె, జెఫ్రీ వండెర్‌సీ, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్. -
ముంబైలో 3 వికెట్లు...కాండీలో 7 వికెట్లు!
ముంబై/కాండీ: మ్యాచ్ ఆడిన తర్వాత కనీసం ఒక రోజు విశ్రాంతి ఉంటే తప్ప ప్రాక్టీస్‌కు కూడా ఆటగాళ్లు హాజరు కాకపోవడం ఐపీఎల్లో తరచుగా కనిపిస్తుంది. ఒత్తిడి, ప్రయాణాలు క్రికెటర్లపై అంతటి ప్ర భావం చూపిస్తాయి. అయితే లంక స్టార్ మలింగ మాత్రం అటు తన లీగ్ ఫ్రాంచైజీకి, బోర్డు దేశ వాళీ టోర్నీకి సమన్యాయం చేశాడు! బుధవారం వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ అర్ధరాత్రి దాకా సాగింది. 4 ఓవర్లలో అతను 3 కీలక వికెట్లు తీశాడు. ఆ తర్వాత రాత్రి 1.40కి బయల్దేరిన అతను గురువారం ఉదయం 4.30కి శ్రీలంక చేరుకొని ఉదయం 7కు వన్డే సూపర్ ఫోర్ ప్రొవిన్షియల్ టోర్నీ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కాండీతో జరిగిన ఈ మ్యాచ్‌లో గాలే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మలింగ... 49 పరుగులకే 7 వికెట్లు తీసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఒక ఆటగాడు వరుసగా రెండు రోజుల్లో రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడటం అరుదైన విషయంగానే చెప్పవచ్చు. -
బెంగళూరు వ్యథ
ఐపీఎల్ చరిత్రలో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఏబీ డివిలియర్స్ 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇన్ని సందర్భాల్లో ఒక్కసారి కూడా అతని జట్టు ఓడిపోలేదు. కానీ గురువారం ముంబైతో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి బెంగళూరును విజయానికి చేరువగా తెచ్చినా గెలుపు దక్కలేదు. చివరి 5 బంతుల్లో 11 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో... తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మలింగ 4 పరుగులే ఇచ్చి ముంబైని గట్టెక్కించాడు. అయితే ఆఖరి బంతి ‘నోబాల్’ కాగా... అంపైర్లు గుర్తించడంలో పొరపాటు చేశారు. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. బెంగళూరు: ఐపీఎల్ తాజా సీజన్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రాత మారలేదు. చిన్నస్వామి స్టేడియంలో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (32 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రోహిత్ దూకుడు... ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ తొలిరెండు ఓవర్లలో నాలుగు బౌండరీలు బాదిరోహిత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. మరో బంతిని సిక్సర్‌గా మలిచి ప్రేక్షకుల్లో జోష్ పెంచాడు. అనంతరం మరో రెండు బౌండరీలు బాదిన రోహిత్... ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యువీ హ్యాట్రిక్ సిక్సర్ల జోరు యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. కేవలం 12 బంతులే ఆడిన యువీ... తొలి 8 బంతుల్లో కేవలం 5 పరుగులే చేశాడు. తర్వాతి మూడు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. చహల్ వేసిన తొలి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా, బౌలర్ తల మీదుగా రెండో సిక్స్ కొట్టిన తీరు అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. వెంటనే లాంగాన్ మీదుగా మరో సిక్సర్ బాది అసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు పంచాడు. అనంతరం చహల్ వేసిన గుగ్లీకి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చాడు. హార్దిక్ విధ్వంసం 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 145/5. ఈ దశలో హార్దిక్ పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. సైనీ వేసిన 19వ ఓవర్లో 6, 4 సహాయంతో హార్దిక్ 15 పరుగులు రాబట్టాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మరో రెండు సిక్సర్లతో మరో 15 పరుగులు పిండుకున్నాడు. దీంతో ముంబై మంచి లక్ష్యాన్ని బెంగళూరుకు నిర్దేశించగలిగింది. శుభారంభం దక్కినా... లక్ష్యఛేదనను బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఓపెనర్లు పార్థివ్ పటేల్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్), మొయిన్ అలీ (13) ఆచితూచి ఆడారు. కోహ్లి రాకతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బతికిపోయిన డివిలియర్స్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే స్లిప్‌లో యువరాజ్ క్యాచ్ వదిలేయడంతో డివిలియర్స్ ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. 11, 12 ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన ఏబీ... 15వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో జోరు కనబరిచాడు. పేసర్ మలింగ వేసిన 16వ ఓవర్లో ఏబీ మరింతగా రెచ్చిపోయాడు. 4, 1, 6, 6తో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఒత్తిడిలోనూ స్వేచ్ఛగా ఆడిన డివిలియర్స్... హార్దిక్ బౌలింగ్‌లో 4, 6, 6తో 18 పరుగులు రాబట్టాడు. ఈ స్థితిలో బుమ్రా మరోసారి తన స్థాయిని ప్రదర్శిస్తూ... గ్రాండ్‌హోమ్ (2) వికెట్ తీయడంతో పాటు 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా వర్సెస్ కోహ్లి ముఖాముఖి మ్యాచ్‌లో తొలుత కోహ్లి జోరు ముందు బుమ్రా తేలిపోయినా... చివరకు తన కెప్టెన్‌ను ఔట్ చేసి బుమ్రా తన మాటను నెగ్గించుకున్నాడు. క్రీజులోకి వస్తూనే బుమ్రా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో కోహ్లి 3 ఫోర్లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే బుమ్రా వేసిన షార్ట్ బంతిని ఆడబోయి మిడ్వికెట్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ►‘మేం ఐపీఎల్ ఆడుతున్నాం. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవటం దుర్మార్గం. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది’ – కోహ్లి -
ఐపీఎల్లో లసిత్ మలింగ... మనసు మార్చుకున్న లంక బోర్డు
ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే శ్రీలంక పేసర్ లసిత్ మలింగ... దేశవాళీ వన్డే టోర్నీ సూపర్ ప్రొవిన్షియల్ టోర్నీలో ఆడాల్సిందేనంటూ పంతం పట్టిన శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) మనసు మార్చుకుంది. ఐపీఎల్లో ఆడేందుకు మలింగకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తన అధికారిక ట్వీటర్ పేర్కొంది. సూపర్ ప్రొవిన్షియల్ వన్డే టోర్నీలో ఆడటం కన్నా ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొనే ఐపీఎల్లో ఆడితే మలింగకు ఉపకరిస్తుందని బోర్డు ప్రకటించింది. మరోవైపు బీసీసీఐ జోక్యంతోనే శ్రీలంక బోర్డు తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్?
కొలంబో: ముంబై ఇండియన్స్‌కు ఊరటనిచ్చే వార్త. శ్రీలంక పేసర్ లసిత్ మలింగా మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. వరల్డ్‌కప్ సెలెక్షన్ కోసం ఈ నెల 30 నుంచి జరిగే దేశవాళీ ప్రొవెన్షియన్ వన్డే టోర్నీలో తప్పనిసరిగా ఆడాలని లంక బోర్డు నిబంధన విధించడంతో.. మలింగ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వేలం సమయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడమేంటని లంక బోర్డుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు ఫోన్ చేసిన బీసీసీఐ.. మలింగా విషయంలో స్పష్టత కోరినట్లు తెలిసింది. దాంతో చేసేదిలేక మలింగాకు ఎస్ఎల్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇక్కడ చదవండి: ఢిల్లీకి ఘనమైన ‘ఆరంభం’) ‘ఐపీఎల్లో మలింగా ఆడటానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇప్పటికే అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేశాం. అతను స్వేచ్ఛగా ఐపీఎల్ ఆడవచ్చు. వన్డేల్లో అతను మాకు ప్రధాన బౌలర్. అతనికి జట్టులో చోటు కల్పించే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్ ఆడినా.. వరల్డ్‌కప్‌కు వెళ్లే మా జట్టులో మలింగా స్థానంపై ఢోకా ఉండదు’ అని ఎస్ఎల్సీ చీఫ్ సెలక్టర్ అశంతా డి మెల్ పేర్కొన్నట్లు సమాచారం. -
అదే నాకు చివరి టోర్నీ: మలింగా
ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగా స్పష్టం చేశాడు. అదే తనకు చివరి టోర్నీ అంటూ మలింగా పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా గాయాలతో సతమతమవుతూ పరిమితమైన క్రికెట్ మాత్రమే మలింగా ఆడుతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న మలింగా మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్పై ఒక స్పష్టతనిచ్చాడు. టీ20 వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్ ఆడి క్రికెట్‌కు ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సఫారీలతో శనివారం జరిగిన రెండో టీ20లో హ్యాండ్రిక్స్ వికెట్‌ను మలింగా తీశాడు. దాంతో తన అంతర్జాతీయ కెరీర్లో 97 టీ20 వికెట్‌ను మలింగా ఖాతాలో వేసుకున్నాడు. మలింగా మరో వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో షాహిద్ ఆఫ్రిది సరసన నిలుస్తాడు. ప్రస్తుతం ఆఫ్రిది 98 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ లసిత్ మలింగ టోర్నీకి దూరమయ్యాడు. శ్రీలంక దేశవాళీ వన్డే టోర్నీ ‘సూపర్ ప్రొవిన్షియల్ టోర్నమెంట్’లో ఆడితేనే ప్రపంచ కప్ జట్టుకు పరిగణలోకి తీసుకుంటామని లంక బోర్డు ఆటగాళ్లకు హుకుం జారీ చేసింది. దాంతో అందులో పాల్గొనేందుకు మలింగ సిద్ధమయ్యాడు. -
మళ్లీ మలింగాకు పగ్గాలు
కొలంబో: సుదీర్ఘ విరామం తర్వాత లసిత్ మలింగా మరొకసారి శ్రీలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జనవరి3వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్‌కు మలింగాను సారథిగా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 17 మందితో కూడిన జట్టును శ్రీలంక బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అనంతరం మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఏకైక టీ20 ఆడనుంది. 2014 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుకు మలింగ నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 2016లో మరోసారి శ్రీలంక జట్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. ఆ తర్వాత గాయల కారణంగా మలింగకు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ఇటీవల మళ్లీ ఫిట్నెస్ను నిరూపించుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న మలింగాను తిరిగి కెప్టెన్‌గా నియమించడం విశేషం. ప్రస్తుతం 35వ ఒడిలో ఉన్న మలింగా.. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో జట్టును ఎంతవరకూ ముందుకు తీసుకెళతాడో చూడాలి. శ్రీలంక జట్టు లసిత్ మలింగ(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా (వైస్ కెప్టెన్), ఏంజెలో మ్యాథ్యూస్, ధనుష్క గుణతిలక, కుషాల్ జనితే పెరీరా, దినేశ్ చండిమాల్, ఆషేలా గుణరత్న, కుశాల్ మెండిస్, ధనుంజయ డిసెల్వా, తిషారా పెరీరా, దాసన్ షణక, లక్ష్మణ్ సందకన్, ప్రసన్న, ధుష్మంత ఛమీరా, కాసున్ రంజిత, నువాన్ ప్రదీప్, లాహిరు కుమార -
#మీటూ : మలింగా నాతో అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్: మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల వ్యక్తిత్వం బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. నిన్ననే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్‌హోస్టెస్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ మరో స్టార్ క్రికెటర్ లసిత్ మలింగాపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల గొంతుకగా నిలుస్తున్న టాలీవుడ్ సింగర్ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది. మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును చిన్మయికి షేర్ చేయగా ఆమె ట్వీటర్ వేదికగా బయటి ప్రపంచానికి తెలియజేసింది. ‘కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్ సీజన్ కావడంతో శ్రీలంక ఫేమస్ క్రికెటర్ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు. ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే మలింగా తన రూంలో ఉందని చెప్పాడు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం వెనుక నుంచి నన్ను బెడ్‌పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను. అప్పుడు హోటల్ సిబ్బంది డోర్ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్ రూంకు వెళ్లి నా ఫేస్‌ను కడుక్కున్నాను. హోటల్ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్ క్రికెటరని, కావాలనే ఇలాచేశావంటారని తెలిపారు’ అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది. Cricketer Lasith Malinga. pic.twitter.com/Y1lhbF5VSK — Chinmayi Sripaada (@Chinmayi) October 11, 2018 చదవండి: #మీటూ : ‘ఆ మాజీ క్రికెటర్ నీచుడు’ -
ఆసియా కప్: బంగ్లాదేశ్ బోణీ
-
లసిత్ మలింగా పునరాగమనం
కొలంబో: దాదాపు ఏడాది కాలంగా శ్రీలంక క్రికెట్ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ లసిత్ మలింగా పునరాగమనం చేయబోతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భాగంగా ప్రకటించిన శ్రీలంక జట్టులో మలింగా చోటు కల్పించారు. ఈ మేరకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం లంక సెలక్టర్లు ప్రకటించారు. 2017లో భారత్‌పై చివరిసారిగా మలింగ తన వన్డే మ్యాచ్‌ని ఆడాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రీడల మంత్రి పెదవి విరిచారు. ఆటగాళ్లకి కనీస ఫిట్నెస్ ప్రమాణాలు కూడా లేవని ఆ సమయంలో మంత్రి విమర్శించడంతో లసిత్ మలింగ క్రీడల మంత్రిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీలంక జట్టులో చోటు కోల్పోయాడు. 2018 ఐపీఎల్ సీజన్లో కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో మలింగ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ప్రకటించిన వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో శ్రీలంక జట్టుకి ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. -
అంతర్జాతీయ క్రికెట్‌కు మలింగా గుడ్‌బై?
సాక్షి, ముంబై : శ్రీలంక పేసర్ లసిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు చెప్పనున్నాడా అంటే, అవుననే అంటున్నాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా నియామకం అనంతరం మలింగ తన రిటైర్మెంట్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. 'నేను క్రికెట్ ఆడటం పూర్తయ్యిందని అనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో నేను ఆడతానని అనుకోవట్లేదు. నేను నా రిటైర్మెంట్ను త్వరలోనే ప్రకటించేందుకు సిద్దమౌతున్నాను. అయితే ఈ విషయం గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుతో నేను చర్చించలేదు. ఒకవేళ నేను తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చేమో.. దానికైనా నా శరీరం సహకరించాలి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా నా కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ఇక భవిష్యత్తులో క్రికెట్ ఆడకపోవచ్చు' అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తనకు 34ఏళ్లని తెలిపిన మలింగ, తానేమీ యువకుడిని కాదని తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని పేర్కొన్నాడు. రాబోయే యువ పేసర్లకు తనకు తెలిసిన విషయాలను, క్రికెట్ నాలెడ్జ్‌ను పంచుతానని అన్నాడు. బూమ్రా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఆటగాడిగా ఎదిగాడని పొగడ్తలు గుప్పించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో విడిదీయలేని అనుబంధం ఏర్పడిందని ఈ పదేళ్లలో నేను చాలా నేర్చుకున్నానని, సాధించానని తెలిపాడు. 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు. -
కోచ్‌గా కనిపించనున్న మలింగా!
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్-11 సీజన్లో కోచ్‌గా కనిపించనున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ సీనియర్ బౌలర్‌పై ఆసక్తి కనబర్చలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టులో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగాను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే, బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరితోపాటు సహాక సిబ్బంది టీంలో మలింగా చేరనున్నాడు. తనను బౌలింగ్ కోచ్‌గా నియమించడంపై మలింగా స్పందిస్తూ.. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది. ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్‌గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్‌గా కొత్త పని చేబట్టపోతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. -
'నాకు స్థానం ఎందుకు లేదో తెలీదు'
కొలంబో:గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శన కారణంగా శ్రీలంక స్పీడ్‌స్టార్ లసిత్ మలింగాను జట్టులో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌తో జరిగిన ఓ టీ20లో మలింగ చివరిసారిగా ఆడాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరస్‌కు మలింగకు సెలక్టర్లు స్థానం కల్పించలేదు.అయితే తనను ఎంపిక చేయకపోవడం మలింగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'సెలక్టర్లు నన్ను జట్టులోకి తీసుకుంటే ఆడేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. వారు నాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో కారణం తెలియట్లేదు. ఆ కారణం కోసం ఎదురుచూస్తున్నా. 25, 26 ఏళ్ల వయసులో ఆటగాడికి విశ్రాంతి అవసరం. ఎందుకంటే అతడు భవిష్యత్తులో ఇంకా క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. నా వయసు వారికి విశ్రాంతి అవసరం లేదు. వీలైనంత ఎక్కువ క్రికెట్ ఆడాలని మాకు ఉంటుంది. 2019 వరల్డ్ కప్ ఆడటమే నా ముందున్న లక్ష్యం' అని మలింగా పేర్కొన్నాడు. -
మలింగాకు ఉద్వాసన..
కొలంబో: గాయం కారణంగా సుదీర్ఘ కాలం జట్టుకు దూరమై గత నెల్లో భారత్ తో జరిగిన సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగాపై తాజాగా వేటు పడింది. టీమిండియాతో సిరీస్ లో ఏ మాత్రం ఆకట్టుకోని మలింగాకు ఉద్వాసన పలుకుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో త్వరలో యూఏఈలో పాకిస్తాన్ తో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో అతన్ని దూరం పెట్టారు. మరొకవైపు ప్రస్తుత పాక్ తో టెస్టు సిరీస్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ను కూడా వన్డేలకు ఎంపిక చేయలేదు. అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో విశ్రాంతినిచ్చారు. మాథ్యూస్ ఇంకా కుడి పిక్క గాయం నుంచి తేరుకోలేదని శ్రీలంక క్రికెట్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు 15 మంది కూడిన వన్డే జట్టును ప్రకటించారు. శ్రీలంక జట్టు: ఉపుల్ తరంగా(కెప్టెన్), దినేశ్ చండిమాల్, నిరోషాన్ డిక్ వెల్లా, లహిరు తిరుమన్నే, కుశాల్ మెండిస్, మిలిందా సిరివర్ధనే, చమర కపుగదెరా, తిషారా పెరీరా, సీక్కుజ్ ప్రసన్న, నువాన్ ప్రదీప్, సురంగా లక్మల్, దుస్మంత చమీరా, విశ్వ ఫెర్నెండో, అకిలా దనంజయ, జెఫ్రీ వాండ్రాసె -
'టీమిండియాతో సిరీస్ తరువాత చూద్దాం'
కొలంబో:టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగా. తన ప్రదర్శన పెద్దగా సంతృప్తి కల్గించకపోతే కెరీర్ ను వీడ్కోలు చెప్పడం ఖాయమనే సంకేతాలిచ్చాడు. 'కాలి గాయం కారణంగా 19 నెలల విరామం తరువాత శ్రీలంక జట్టులో ఆడుతున్నా. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్ తో పాటు ప్రస్తుత భారత్ తో సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ సిరీస్ తరువాత నేను ఎక్కడ ఉంటానో చూద్దాం. ఒకవేళ నా శరీరం సహకరిస్తే మాత్రం కొంతకాలం క్రికెట్ కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఇక్కడ అనుభవం అనేది సమస్య కాదు. నేను మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన చేయలేనప్పుడు జట్టులో ఉండి ఉపయోగం ఏమి ఉంది. ఫామ్ ను అందుపుచ్చుకునే యత్నం చేస్తా. అది కూడా నా శరీరం సాధ్యమైనన్ని ఎక్కువ గేమ్ లకు సహకరిస్తేనే. నేను సరిగా బంతిని విసరలేకపోతే సంతోషంగా వీడ్కోలు చెబుతా'అని మలింగా తెలిపాడు. -
కోహ్లీ ఔట్: మలింగకు రోహిత్ కంగ్రాట్స్
కొలంబో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 బంతుల్లో మెరుపు శతకం సాధించాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో లంక కెప్టెన్ లసిత్ మలింగ చేతికి కోహ్లీ చిక్కాడు. అయితే కోహ్లీని మలింగ ఔట్ చేయగానే భారత ఓపెనర్ రోహిత్ శర్మ, మలింగ వద్దకు వచ్చి కౌగిలించుకుని అభినందించాడు. అదేంటని అశ్చర్యపోతున్నారా.. నేటి మ్యాచ్‌లో మలింగ, కోహ్లీని ఔట్ చేయగానే లంక కెప్టెన్ ఖాతాలో 300వ వన్డే వికెట్ చేరింది. తద్వారా అతి తక్కువ వన్డేల్లో ఈ ఫీట్ నమోదు చేసిన బౌలర్లలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. మలింగ వేసిన 30వ ఓవర్లో మూడో బంతిని కోహ్లీ స్వీపర్ కవర్ వైపుగా భారీ షాట్ ఆడగా అదే స్థానంలో ఉన్న మునవీర ఏ ఇబ్బంది లేకుండా క్యాచ్ పట్టాడు. దీంతో సెంచరీ హీరో కోహ్లీ (131: 96 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (104: 88 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఏంజెలో మాథ్యూస్ ఔట్ చేశాడు. వరుసగా రెండు వన్డేల్లో శతకాలతో రోహిత్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. -
మలింగా అరుదైన ఘనత
కొలంబో: భారత్ తో నాల్గో వన్డేలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా అరుదైన ఘనతను అందుకున్నారు. వన్డేల్లో మూడొందల వికెట్ ను సాధించడం ద్వారా ఈ ఘనతను అతి తక్కువ మ్యాచ్ లో సాధించిన ఐదో బౌలర్ గా మలింగా నిలిచారు. భారత కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసి మలింగా 300 వికెట్ల మార్కును అందుకోవడం ఇక్కడ మరో విశేషం. మలింగా 203 మ్యాచ్ ల్లో మూడొందల వన్డే వికెట్ల మార్కును చేరుకున్నారు. దాంతో వసీం అక్రమ్(208)ను మలింగా వెనక్కునెట్టారు. వన్డే ఫార్మాట్ లో అతి తక్కువ మ్యాచ్ ల్లో మూడొందల వికెట్లను సాధించిన వారిలో బ్రెట్ లీ(171) తొలి స్థానంలో ఉండగా, వకార్ యూనిస్(186) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మెక్ గ్రాత్(200), మురళీ ధరన్ (202)లు తరువాతి స్థానాల్లో నిలిచారు. -
ఒక్క సిరీస్.. లంకకు ముగ్గురు కెప్టెన్లు!
దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్ధనే, సనత్ జయసూర్య, మురళీధరన్‌ల రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఓ వైపు వరుస ఓటములకు తోడు మరోవైపు ఆటగాళ్లకు గాయాలు.. ఈ రెండింటితో లంక జట్టు ప్రతి సిరీస్ లోనూ ఓటములను చవిచూడాల్సి వస్తోంది. భారత్‌తో 3-0తో టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న లంక, ఐదే వన్డేల సిరీస్‌లో మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో వన్డే సిరీస్‌నూ టీమిండియాకు కోల్పోయింది. నాలుగో వన్డే గురువారం జరగనుంది. అయితే మ్యాచ్‌కి బౌలర్ లసిత్ మలింగ లంక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే వన్డే సిరీస్‌లో జరిగిన మూడు వన్డేలకు ఇద్దరు కెప్టెన్సీ చేయగా, నాలుగో వన్డేకు మలింగ సారథిగా ఉంటాడు. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఉపుల్ తరంగపై ఐసీసీ రెండు మ్యాచ్ ల నిషేధం విధించగా.. మూడో వన్డేకి కెప్టెన్ గా వ్యవహరించిన కపుగెదెర గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నాలుగో వన్డేకు కొత్త కెప్టెన్ వచ్చాడు. 202 వన్డేలాడిన మలింగ 196 ఇన్నింగ్స్‌ల్లో 299 వికెట్లు తీశాడు. తాను కెప్టెన్‌గా వ్యవహరించే గురువారం నాటి వన్డేలో ఒక్క వికెట్ తీస్తే వన్డేల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మలింగ చేరతాడు. వరుస పరాజయాలతో ఉన్న లంక తదుపరి రెండు వన్డేల్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఆ రెండు వన్డేలు నెగ్గితేనే లంక జట్టు 2019 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తోంది. లేనిపక్షంలో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సెప్టెంబరు 30 నాటికి ఐసీసీ ప్రకటించే ర్యాంకింగ్స్‌లో టాప్-8 జట్లే వరల్డ్ కప్‌నకు నేరుగా అర్హత సాధిస్తాయి. దీంతో వెస్టిండీస్-లంక జట్లు నేరుగా క్వాలిఫై కావడానికి యత్నిస్తున్నాయి. -
క్రికెట్: శ్రీలంకకు ఎదురుదెబ్బ!
సాక్షి, కొలంబో: ఇప్పటికే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేలు ఓడిపోయి.. సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ చామరా కపుగెదరా వెన్నుగాయం కారణంగా నాలుగో వన్డేకు దూరమయ్యారు. దీంతో నాలుగో వన్డేలో ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా లంక జట్టుకు నాయకత్వం వహించనున్నారు. వరుసగా రెండు వన్డేల్లోనూ స్లో ఓవర్‌రేట్ నమోదుకావడంతో శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు మ్యాచుల సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో మూడో వన్డేలో నాయకత్వం వహించిన కపుగెదరా మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో వైద్య పరీక్షల అనంతరం మిగతా వన్డేల్లో అతను అందుబాటులో ఉండే పరిస్థితి లేదని లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక రెండో వన్డేలో గాయపడిన లంక ఓపెనర్ ధనుష్క గుణతిలక మిగతా వన్డేలకు అందుబాటులో ఉండేది లేనిది ఇంకా స్పష్టం కాలేదు. అతను బుధవారం ఫిట్నెస్ టెస్టులకు హాజరుకాబోతున్నాడు. ఈ నేపథ్యంలో లంక జట్టులోకి ప్రత్యామ్నాయంగా ధనుంజయ డిసిల్వా, దిల్షాన్ మునవీరాలను తీసుకున్నారు. -
మలింగా 200 నాటౌట్!
దంబుల్లా: దశాబ్దకాలానికి పైగా శ్రీలంక క్రికెట్ లో ప్రధాన బౌలర్ గా కొనసాగుతున్న లసిత్ మలింగా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా నిలిచే మలింగా తన కెరీర్ లో 200 వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే ఆడుతున్న మలింగా.. శ్రీలంక తరపున 200వ వన్డే ఆడుతున్న 13వ క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అయితే బౌలర్ల విభాగంలో మురళీధరన్, చమిందా వాస్‌లు తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు మలింగా. ప్రస్తుతం 298 వన్డే వికెట్లతో ఉన్న మలింగా మరోఅరుదైన ఘనతకు స్వల్ప దూరంలో ఉన్నాడు. లంక తరపున మూడొందల వన్డే వికెట్లను సాధించడానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో మలింగా ఉన్నాడు. అంతకుముందు మురళీధరన్(534 వికెట్లు), చామిందా వాస్(400)లు మాత్రమే మూడొందలకు పైగా వికెట్లు సాధించిన లంక బౌలర్లు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే మలింగా కొనసాగుతున్నాడు. ఫిట్ నెస్ కారణంగా ఇటీవల టెస్టులకు మలింగా గుడ్ బై చెప్పేశాడు. -
టీమిండియా మలింగా అతడే..!
ముంబై: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మన్లను బెంబెలెత్తించడంలో మలింగా స్టైలే వేరే. మరి ఆ తరహా బౌలర్ భారత జట్టులో ఉన్నాడా అంటే జస్ఫ్రిత్ బూమ్రా గురించి చెప్పుకోవాలి. తన వైవిధ్యమైన యాక్షన్ తో పాటు యార్కర్లతో భయపెట్టే ఆటగాడు బూమ్రాకు మలింగాకు పోలికలున్నాయని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. కాగా, ఇక్కడ మలింగా యాక్షన్ ను పోలిన క్రికెటర్ భారత్ జట్టులో స్పిన్నర్ రూపంలో ఉన్నాడట. అతనే కేదర్ జాదవ్ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మలింగా-జాదవ్‌ల యాక్షన్ ఫోటోను పోస్ట్ చేశాడు. 'ఆందోళన వద్దు.. మనకు ఒక మలింగా ఉన్నాడు' అని ఫోటో కింద క్యాప్షన్ ను జోడించాడు. Why worry when we have one of our own @kedarjadhavofficial -
చిక్కుల్లో క్రికెటర్ మలింగా
కొలంబో:శ్రీలంక క్రీడామంత్రి దయసిరి జయసెకెరాను ఆ దేశ వెటరన్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా కోతితో పోల్చి చిక్కుల్లో పడ్డాడు. అసలు క్రికెట్ గురించి ఏమీ తెలియని మంత్రిని కోతితో పోల్చిన మలింగా కొత్త వివాదాన్ని కొనితెచ్చుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు టీమిండియాపై గెలిచిన శ్రీలంక.. కీలకమైన పాక్ తో మ్యాచ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు మలింగా వింతగా సమాధానం ఇచ్చాడు. ఏ మాత్రం ఫిట్ గా లేని క్రికెటర్లను ఎంపిక చేయడంతోనే తాము ఓటమి పాలైనట్లు మలింగా పేర్కొన్నాడు. తమ జట్టులో అధిక బరువుగల క్రికెటర్లను ఎంపిక చేయడంలో క్రీడామంత్రి దయసిరే కారణమన్నాడు. పనిలో పనిగా క్రీడామంత్రి దయసిరి జయసెకెరాను కోతితో పోల్చాడు. ఒక గూడులో ఉన్న చిలకల గురించి కోతికి ఎలా తెలుస్తుందంటూ సదరు మంత్రిని విమర్శించాడు. అదే సమయంలో ఆ వ్యాఖ్యలపై ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని మలింగా తనను సమర్ధించుకునే యత్నం చేశాడు. కాగా, తనపై మలింగా చేసిన 'కోతి' వ్యాఖ్యలపై దయసిరి జయసెకెరా విచారణకు ఆదేశించాడు. మలింగా చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తరువాత అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి దయసిరి హెచ్చరించాడు. -
అతను మ్యాజిక్ చేస్తాడని తెలుసు: సచిన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఫైనల్లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. ఒకనొక దశలో 71/1 తో పటిష్టంగా కనిపించిన రైజింగ్ పుణెను ముంబై కట్టడి చేసి టైటిల్ ను ఎగురేసుకుపోయింది. ఈ టైటిల్ సాధించడంలో ముంబై ఇండియన్స్ పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా, మిచెల్ జాన్సన్ లు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి పుణెకు గట్టి షాక్ తగిలింది. ప్రధానంగా చివరి మూడు ఓవర్లలో పుణె 30 పరుగులు చేయాల్సిన తరుణంలో మలింగాకు బంతి ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆ ఓవర్లో అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న స్టీవ్ స్మిత్ బంతిని హిట్ చేయడానికి యత్నించినా సఫలం కాలేదు. ఆ ఓవర్ లో మలింగా యార్కర్లతో హడలెత్తించడంతో కేవలం ఏడు పరుగులే వచ్చాయి. దాంతో చివరి రెండు ఓవర్లలో విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. . అయితే మలింగా ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది. గత కొన్నేళ్లుగా మలింగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కీలక ఫైనల్లో మలింగా మ్యాజిక్ చేస్తాడని నేను ముందే బలంగా నమ్మా. ఒక ఓవర్ లో పూర్తిగా పరిస్థితుల్ని మార్చేసి శక్తి మలింగాకు ఉంది. ఆ అంచనాల్ని అందుకుని ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు'అని సచిన్ తెలిపాడు. మరొకవైపు జట్టు విజయంలో కోచ్ మహేలా జయవర్ధనే పాత్రను సచిన్ గుర్తు చేశాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించిన తరుణంలో జయవర్ధనే ఆటగాళ్లలో ధైర్యం నింపిన తీరు అమోఘం అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం వరిస్తుందని చెప్పడంతో పాటు ఒకసారి చాంపియన్ ఎప్పుడూ చాంపియన్ అనేది గుర్తించుకుని పోరాడాలంటూ జయవర్దనే ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన విధానం చాలా బాగుందని సచిన్ తెలిపాడు. -
మలింగ ఖాతాలో అరుదైన ఫీట్
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ అన్ని సీజన్లలో కలిసి 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 10లో భాగంగా నిన్న (శనివారం) ఢిల్లీ సొంతగడ్డ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మలింగ.. ఆ ఓవర్లో ఐదో బంతికి ఢిల్లీ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్(3)ను ఔట చేయడంతో ఈ ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు మలింగ. మలింగ బంతిని అయ్యర్ షాట్ కొట్టగా ముంబై ప్లేయర్ హర్బజన్ క్యాచ్ పట్టడంతో ముంబై క్రికెటర్ కళ్లల్లో చెప్పలేనంత సంబరం మొదలైంది. ఆ తర్వాత కోరే అండర్సన్ ను ఔట్ చేసి మరో వికెట్ తీశాడు. ఐపీఎల్ లో ఓవరాల్ గా 105 మ్యాచ్ లాడిన మలింగ ఉత్తమ ప్రదర్శన 5/13గా ఉంది. వంద వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో 18.47 సగటుతో అందరికంటే ముందున్నాడు. ఢిల్లీతో మ్యాచ్ లో కరణ్ శర్మ, హర్భజన్లు మూడేసి వికెట్లు తీయగా, మలింగ రెండు వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 66 పరుగులకే చాపచుట్టేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. -
మలింగ హ్యాట్రిక్ సాధించినా...
రెండో టి20లో బంగ్లా విజయం కొలంబో: శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ‘హ్యా్టట్రిక్’ సాధించినా బంగ్లా చేతిలో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. గురువారం ఇక్కడ జరిగిన రెండో టి20లో బంగ్లాదేశ్ 45 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. మొదట బంగ్లా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది. షకీబుల్ హసన్ (38), ఇమ్రుల్ కైస్ (36), సౌమ్య సర్కార్ (34) ధాటిగా ఆడారు. ముష్ఫికర్, మొర్తజా, మిరాజ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసిన మలింగ టి20ల్లో తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. మలింగ గతంలో వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లంక 18 ఓవర్లలో 131 పరుగుల వద్ద ఆలౌటైంది. కపుగెడెర (35 బంతుల్లో 50; 5ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ముస్తఫిజుర్ 4 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తాజా ఫలితంతో రెండు టి20ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఈ మ్యాచ్‌తో బంగ్లా కెప్టెన్ మొర్తజా టి20 క్రికెట్‌నుంచి రిటైర్ అయ్యాడు. -
మలింగాను అనుకరించబోయి.. !!
శ్రీలంక బౌలర్ లసిత్ మలింగా బౌలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అతనిది చాలా విలక్షణమైన బౌలింగ్. విలక్షణమైన బాడీలాంగ్వెజ్తో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మన్ ను తికమకపెట్టడం మలింగా స్టైల్.. నిన్నటి వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మలింగాను ఈసారి అతని అభిమానులు చాలా మిస్సయ్యరనే చెప్పాలి. ఇప్పుడు మిచేల్ మెక్‌క్లెనఘన్, టిమ్ సౌథీ అతడు లేని లోటును పూడుస్తూ.. ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా తాజాగా మలింగాను గుర్తుకుతెచ్చాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చాలా విలక్షణమైన బాడీ లాంగ్వెజ్తో బౌలింగ్ చేశాడు. అచ్చం మలింగాను తలపిస్తూ వేసిన ఈ బంతి వైడ్ కావడమే కాకుండా ఏకంగా కీపర్ ప్రయత్నించినా అందకుండా ఫోర్ వెళ్లింది. దీంతో రోహిత్ సేన ఇదేమీ బౌలింగో అర్థం కాక కాస్త తికమక పడింది. Krunal Pandya does a Malinga sans the result #MIvRCB #VIVOIPLhttps://t.co/VelT0DEpCi — IndianPremierLeague (@IPL) April 20, 2016 -
మలింగా అవుట్: స్టెయిన్ ఇన్
బ్రిడ్జిటౌన్(బార్బోడాస్): త్వరలో ఆరంభం కానున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) నుంచి శ్రీలంక పేస్ బౌలర్ లషిత్ మలింగా తప్పుకున్నాడు. సీపీఎల్ లో భాగంగా జమైకా తల్లావాస్ జట్టుకు మలింగా ఆడాల్సిఉంది. ఇటీవల కాలంలో తరచు గాయాల బారిన పడుతున్న మలింగా టోర్నీ నుంచి ముందుగానే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. దీంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ కు అవకాశం కల్పించారు. సీపీఎల్‌లో తొలిసారి పాల్గొంటున్న స్టెయిన్ కు ఇది ఆరో టీ 20 ప్రాంఛైజీ కావడం విశేషం. జూన్ 30 నుంచి ఆగస్టు 7వరకూ జరిగే సీపీఎల్‌లో పలువురు సఫారీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వీరిలో హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్,డేవిడ్ మిల్లర్, మోర్నీ మోర్కెల్‌లు ఉన్నారు. ఇదిలా ఉండగా గత నవంబర్ నుంచి గాయాలతో సతమతమవుతున్న మలింగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)9 సీజన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మలింగా ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో చేరినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతకుముందు ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన మలింగా.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనలేదు. -
ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్
ఐపీఎల్లో గాయాలబారిన పడిన తమ ఆటగాళ్ల స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు వేరే ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లసిత్ మలింగ స్థానంలో విండీస్ పేసర్ జెరోమ్ టేలర్‌ను ముంబై ఎంచుకోగా... మిషెల్ స్టార్క్‌కు బదులుగా ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను బెంగళూరు తీసుకుంది. గాయాల కారణంగా మలింగ, స్టార్క్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. -
ఐపీఎల్-9 నుంచి మలింగా అవుట్
ముంబై: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మలింగా ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో చేరినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీలో సగం మ్యాచ్‌లకు మలింగ దూరంగా ఉండవచ్చని ముంబై కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. అయితే వైద్యుల సలహా మేరకు అతను టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ముంబై జట్టులో మలింగా స్థానంలో మరొకరిని తీసుకోవాల్సివుంది. గత నవంబర్ నుంచి మలింగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న లంక పేసర్ ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనలేదు. మరోవైపు ఐపీఎల్లో ఆడేందుకుగాను మలింగాకు ఎన్ఓసీ ఇచ్చే ముందు అతడి ఫిట్నెస్ను పరిశీలించాల్సివుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల తెలిపింది. తమ అనుమతి లేకుండా వెళ్తే బెంచ్‌పై కూర్చోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలింగా ఐపీఎల్‌కు దూరంకావాల్సి వచ్చింది. -
ముంబై జట్టులో మలింగా చేరాడు కానీ..
ముంబై: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌తో చేరినా వెంటనే టోర్నీలో ఆడేది సందేహంగా మారింది. మోకాలి నొప్పితో బాధపడుతున్న మలింగ సెలెక్షన్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఫిట్నెస్ కారణంగా ముంబై తొలి రెండు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడు. టోర్నీలో సగం మ్యాచ్‌లకు మలింగ దూరంగా ఉండవచ్చని ముంబై కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. గత నవంబర్ నుంచి మలింగా గాయాలతో బాధపడుతున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న లంక పేసర్ ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనలేదు. మరోవైపు ఐపీఎల్లో ఆడేందుకుగాను మలింగాకు ఎన్ఓసీ ఇచ్చే ముందు అతడి ఫిట్నెస్ను పరిశీలించాల్సివుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల తెలిపింది. తమ అనుమతి లేకుండా వెళ్తే బెంచ్‌పై కూర్చోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలింగా ఎప్పటి నుంచి ఐపీఎల్లో ఆడుతాడన్న విషయంపై అనిశ్చితి ఏర్పడింది. -
మలింగాకు లంక బోర్డు నో పర్మిషన్
కొలంబో: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా ఐపీఎల్లో ఆడే అవకాశాలు లేనట్టే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడేందుకుగాను మలింగాకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తిరస్కరించింది. మలింగా ప్రస్తుత ఫిట్నెస్ పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాతే ఎన్ఓసీ ఇచ్చే విషయాన్ని నిర్ణయిస్తామని లంక క్రికెట్ బోర్డు చీఫ్ తిలంగ సుమతిపాల చెప్పారు. తమ అనుమతి లేకుండా మలింగా ఐపీఎల్లో ఆడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తిలంగ సుమతిపాలకు, మలింగాకు మధ్య ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నట్టు సమాచారం. టి-20 ప్రపంచ కప్‌నకు ముందు లంక కెప్టెన్ పదవి నుంచి మలింగాను తప్పించారు. ఈ టోర్నీకి మలింగా ఎంపికైనా ఫిట్నెస్ సమస్యలు చూపి జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో ప్రధాన బౌలర్ లేకుండానే లంక ప్రపంచ కప్‌లో బరిలో దిగాల్సివచ్చింది. లంక ఓటమికి ఇది కూడా ఓ కారణం. -
ప్రపంచ కప్ నుంచి మలింగ అవుట్
టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో మలింగ ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
వరల్డ్ కప్ నుంచి మలింగ ఔట్
ముంబై: టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మోకాలి గాయంతో జట్టకు దూరమయ్యాడు. గురువారం అప్ఘనిస్తాన్తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో దిల్షాన్ గాయపడ్డాడని జట్టు మేనేజర్ వెల్లడించారు. దీంతో ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో మలింగ లేకుండానే శ్రీలంక బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు టోర్నీ మొత్తానికి మలింగ అందుబాటులో ఉండటం లేదని శ్రీలంక జట్టు స్పోక్స్ పర్సన్ శుక్రవారం వెల్లడించారు. మలింగ లేకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుడంతో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 155 పరుగులు చేసిన విషయం తెలిసిందే. -
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మలింగ
టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు షాక్ తగిలింది. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు లసిత్ మలింగ బోర్డుకు లేఖ రాశాడు. మోకాలి గాయం కారణంగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేదీ లేనిదీ తెలియనందున, కెప్టెన్ విషయంలో స్పష్టత ఉండాలని భావించి మలింగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంకకు మ్యాథ్యూస్ సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. -
శ్రీలంక కెప్టెన్‌గా మలింగా
కొలంబో: వచ్చే నెలలో భారత్‌లో జరిగే వరల్డ్ టీ 20లోడిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగే శ్రీలంక క్రికెట్ జట్టుకు లషిత్ మలింగా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ సెలక్షన్ కమిటీ ఆసియా కప్ తో పాటు, వరల్డ్ ట్వంటీ 20 జట్టును తాజాగా ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మలింగానే కెప్టెన్ గా ఉండనున్నాడు. గత కొంతకాలంగా గాయంతో జట్టుకు దూరమైన మలింగా.. ప్రధాన సిరీస్‌లైన న్యూజిలాండ్ సిరీస్ తో పాటు భారత్ పర్యటనలో పాల్గొనలేదు. కాగా, గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మలింగా ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మలింగాతో పాటు నువాన్ కులశేఖర, రంగనా హెరాత్‌లు కూడా జట్టులో స్థానం సంపాదించారు. శ్రీలంక వరల్డ్ ట్వంటీ 20 జట్టు ఇదే; లషిత్ మలింగా(కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్(వైస్ కెప్టెన్), దినేష్ చండిమాల్, తిలకరత్న దిల్షాన్, నిరోషన్ డిక్వెల్, షెహన్ జయసూరియా, మిలిందా సిరివర్దనే, దాసున్ షనాకా, చమర కపుగెదరా, నువాన్ కులశేఖర, దుష్మంత్ చమీరా, తిషారా పెరీరా, సేననాయకే, రంగనా హెరెత్, జెఫ్రీ వాండర్సే -
మలింగా దూరం:టీ20 కెప్టెన్‌గా చండీమాల్
క్రైస్ట్‌చర్చ్: త్వరలో న్యూజిలాండ్ తో జరుగనున్న ట్వంటీ 20 సిరీస్ కు దినేష్ చండీమాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న లషిత్ మలింగా ట్వంటీ 20 సిరీస్ కు దూరం కావడంతో అతని స్థానంలో కెప్టెన్‌గా చండీమాల్ను నియమించారు. అంతకుముందు 2013 లో తొలిసారి చండీమాల్ ట్వంటీ 20 కెప్టెన్ గా వ్యవహరించాడు. చండీమాల్ నేతృత్వంలోని శ్రీలంక 12 ట్వంటీ -20 మ్యాచ్ లు ఆడగా ఎనిమిదింట గెలిచింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. చండీమాల్ కు మరోసారి ట్వంటీ 20 సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఇదిలాఉండగా మలింగా స్థానంలో బౌలర్‌గా సురంగా లక్మల్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్నఐదు వన్డేల సిరీస్‌లో 2-0 తేడాతో వెనుకబడి ఉన్న శ్రీలంకకు మలింగా లేకపోవడం ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. గత నవంబర్‌లో శ్రీలంకలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి ట్వంటీ 20లో మలింగా చివరిసారి కన్పించాడు. -
మలింగ మ్యాజిక్
ఆసియా కప్‌లో శ్రీలంక బోణి 12 పరుగులతో పాక్‌పై విజయం ఫతుల్లా: లసిత్ మలింగ (5/52) అద్భుత బౌలింగ్‌తో ఆసియా కప్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక దశలో ఓటమికి చేరువైనా...స్ఫూర్తిదాయక ఆటతీరుతో లంక మ్యాచ్ నిలబెట్టుకుంది. ఇక్కడి ఖాన్ ఉస్మాన్ అలీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 12 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లాహిరు తిరుమన్నె (110 బంతుల్లో 102; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం సాధించగా...సంగక్కర (65 బంతుల్లో 67; 8 ఫోర్లు), మాథ్యూస్ (50 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం పాక్ 48.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బావుల్ హక్ (84 బంతుల్లో 73; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉమర్ అక్మల్ (72 బంతుల్లో 74; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. మిస్బా, అక్మల్ జోరుతో పాక్ పటిష్టంగా కనిపించినా...మలింగ చెలరేగి లంకకు విజయాన్నందించాడు. టర్నింగ్ పాయింట్ లక్ష్యఛేదనలో పాకిస్థాన్ తొలుత కాస్త తడబడ్డా... మిస్బా, అక్మల్ 19 ఓవర్ల వ్యవధిలో 121 పరుగులు జోడించడంతో విజయానికి చేరువైంది. అయితే మలింగ ఒకే ఓవర్లో ఆఫ్రిది, మిస్బాలను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివర్లో కాస్త ఉత్కంఠపెరిగినా మలింగ మ్యాజిక్‌తో మ్యాచ్ లంక వశమైంది. పాక్ చివరి ఐదు వికెట్లను 42 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: కుషాల్ పెరీరా (సి) అక్మల్ (బి) గుల్ 14; తిరిమన్నె (బి) అజ్మల్ 102; సంగక్కర (సి) షెహజాద్ (బి) గుల్ 67; జయవర్ధనే (బి) ఆఫ్రిది 13; మాథ్యూస్ (నాటౌట్) 55; తిసార పెరీరా (సి) షెహజాద్ (బి) ఆఫ్రిది 6; డిసిల్వ (రనౌట్) 2; చండీమల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 296. వికెట్ల పతనం: 1-28; 2-189; 3-204; 4-224; 5-245; 6-251. బౌలింగ్: హఫీజ్ 9-0-54-0; గుల్ 8-0-38-2; జునేద్ 9-0-61-0; భట్టీ 4-0-27-0; అజ్మల్ 10-0-50-1; ఆఫ్రిది 10-0-56-2. పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) మాథ్యూస్ (బి) లక్మల్ 26; షెహజాద్ (బి) డిసిల్వ 28; హఫీజ్ (ఎల్బీ) (బి) మాథ్యూస్ 18; మఖ్సూద్ (సి) డిసిల్వ (బి) సేనా నాయకే 17; మిస్బా (సి) సేనా నాయకే (బి) మలింగ 73; అక్మల్ (సి) సంగక్కర (బి) లక్మల్ 74; ఆఫ్రిది (సి) చండీమల్ (బి) మలింగ 4; భట్టీ (బి) మలింగ 18; గుల్ (సి) డిసిల్వ (బి) మలింగ 2; అజ్మల్ (ఎల్బీ) (బి) మలింగ 10; జునేద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1-28; 2-77; 3-83; 4-121; 5-242; 6-252; 7-254; 8-262; 9-281; 10-284. బౌలింగ్: మలింగ 9.5-0-52-5; లక్మల్ 9-1-65-2; సేనా నాయకే 9-0-47-1; డిసిల్వ 10-1-56-1; పెరీరా 6-0-36-0; మాథ్యూస్ 5-1-25-1. 2 అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి మహేల జయవర్ధనే 600 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. సచిన్ (664) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్.