
కార్డిఫ్ : ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మరో ఆసక్తికర సమయంలో అఫ్గానిస్తాన్‌పై శ్రీలంకనే పైచేయి సాధించింది. వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 34 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై జయభేరి మోగించింది. సవరించిన లక్ష్యం ప్రకారం అఫ్గాన్ 41 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 32.4 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. హజ‍్రతుల్లా(30), నజీబుల్లా(43) మినహా ఎవరూ రాణించలేకపోయారు. లంక బౌలర్లలో ప్రదీప్ నాలుగు వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. మలింగ మూడు వికెట్లతో రాణించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకను 36.5 ఓవర్లకు 201 పరుగులకు పరిమితం చేసింది అఫ్గానిస్థాన్. కుశాల్ పెరీరా(78) హాఫ్ సెంచరీ సాధించగా, కెప్టెన్ దిముత కరుణరత్నే(30), లహిరు తిరుమన్నే(25)లు మాత్రమే ఫర్వాలేదనిపించడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ నబీ నాలుగు వికెట్లు సాధించగా, రషీద్ ఖాన్, దావ్లాత్ జద్రాన్‌లు తలో రెండు వికెట్లు తీశారు. హమిద్ హసన్‌కు వికెట్ దక్కింది. అయితే లంక ఇన్నింగ్స్‌లో మూడు గంటల సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. దీంతో సవరించిన లక్ష్యం ప్రకారం అఫ్గాన్‌కు 41 ఓవర్లలో 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.