
బ్రిస్టల్: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. మలింగ అత్త మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడానికి మంగళవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం శ్రీలంకకు బయలుదేరాడు. 15న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న శ్రీలంక జట్టులో మలింగ అత్యంత కీలకమైన ఆటగాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు శ్రీలంక ప్రపంచ కప్‌లో 4 మ్యాచ్‌లు ఆడగా అఫ్గానిస్తాన్‌పై గెల వగా, న్యూజిలాండ్ చేతిలో ఓడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి.