
బ్రిస్టల్: యార్కర్ల కింగ్, శ్రీలంక సీనియర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్వదేశానికి పయనమయ్యాడు. తన అత్త మరణించడంతో ఆమె అంతిమ సంస్కారంలో పాల్గొనడానికి మంగళవారం బంగ్లాతో మ్యాచ్ అనంతరం శ్రీలంకకు బయలుదేరాడు. 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ‘ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లో లసిత్ మలింగ ఆడటం లేదు. అతడి అత్త మరణించారు. తర్వాత మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. జూన్ 15న ఆసీస్‌తో పోరుకు జట్టుతో కలుస్తాడు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
ప్రస్తుతం శ్రీలంక జట్టులో మలింగ అత్యంత కీలక ఆటగాడు. ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. అఫ్గాన్‌పై గెలిచి, కివీస్ చేతిలో ఓడింది. పాక్, బంగ్లాతో మ్యాచ్‌లు రద్దయ్యాయి. దీంతో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక లంక సెమీఫైనల్ చేరుకోవాలంటై ప్రతీ మ్యాచ్‌లో సవాల్‌తో కూడుకున్నదే.
Comments
Please login to add a commentAdd a comment