పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు.
Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52
— Vitality Blast (@VitalityBlast) July 4, 2023
చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
#PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
Comments
Please login to add a commentAdd a comment