Derbyshire
-
పాక్ నుంచి పుట్టుకొచ్చిన బౌలర్.. మలింగను గుర్తుచేస్తూ
పాకిస్తాన్‌కు చెందిన కొత్త ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. డెర్బీషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న జమాన్ ఖాన్ లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ బౌలింగ్‌ను పోలి ఉంది. అతని శైలిలోనే పదునైన యార్కర్లు సంధిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. తాజాగా జమాన్ ఖాన్ ప్రత్యర్థి బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా సోమవారం డెర్బీషైర్, వోర్సెష్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్సెష్టర్‌షైర్ దూకుడుగా ఆడింది. తొలి 3.4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జాక్ చాపెల్ బౌలింగ్‌లో ఒలివిరియా ఔట్ అయ్యాడు అనంతరం న్యూజిలాండ్ స్టార్ మిచెల్ సాంట్నర్, హెయిన్స్‌కు జత కలిశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన జమాన్ ఖాన్ ఈ జోడిని విడదీశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతికి అద్భుత యార్కర్ సంధించగా.. సాంట్నర్ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. బంతి సూపర్‌స్పీడ్‌తో రావడంతో రెండు స్టంప్‌లు గాలిలో ఎగిరిపడ్డాయి. ఇక ఈ యంగ్ బౌలర్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మిగతా బౌలర్లు విఫలం కావడంతో వోర్సెష్టర్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ సాంట్నర్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్ మొదటి పది ఓవర్లు దూకుడు కనబరిచినప్పటికి అదే టెంపోను చివరి వరకు కొనసాగించలేకపోయింది. దీంతో 19.4 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అవడంతో వోర్సెష్టర్‌షైర్ 28 పరుగుల తేడాతో విజయం అందుకుంది. వేన్ మాడ్సన్ 63, హ్యారీ కేమ్ 43 పరుగులతో రాణించారు. Zaman Khan with an elite yorker 😍 #Blast23 pic.twitter.com/NiBPxfHK52— Vitality Blast (@VitalityBlast) July 4, 2023 చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత
టీ20 బ్లాస్ట్‌లో భాగంగా డెర్బీషైర్‌తో నిన్న (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్, లాంకాషైర్ ఆటగాడు జోస్ బట్లర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్‌కు మరో ఎండ్‌లో లియామ్ లవింగ్‌స్టోన్ (30 బంతుల్లో 47 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సహకరించడంతో లాంకాషైర్ 15 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 4 వికెట్ల నష్టానికి 177 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో వెల్స్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడాడు. డెర్బీషైర్ బౌలర్లలో జాక్ ఛాపెల్ 2, జమాన్ ఖాన్, మెక్ కీయెర్నన్ తలో వికెట్ పడగొట్టారు. చెలరేగిన లివింగ్‌స్టోన్.. బట్లర్ ఊచకోత టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లాంకాషైర్.. ఆది నుంచే దూకుడుగా ఆడింది. సాల్ట్ (11 బంతుల్లో 16; 2 ఫోర్లు) వికెట్ పడిపోయాక బట్లర్ గేర్ మార్చి ధాటిగా ఆడటం ప్రారంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది డెర్బీషర్ బౌలర్లను ఊచకోత కోశాడు. బట్లర్ ఔటయ్యాక లివింగ్‌స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఆదిలో లవింగ్‌స్టోన్ కాస్త నిదానంగా ఆడినప్పటికీ.. ఆఖర్లో రెచ్చిపోయాడు. 3 భారీ సిక్సర్లు బాదాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన డెర్బీషైర్.. 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెర్బీషైర్.. ఆది నుంచే తడబడుతూ వచ్చింది. లాంకాషైర్ బౌలర్లు టామ్ బెయిలీ (2/16), డారిల్ మిచెల్ (2/13), లూక్ వెల్స్ (2/32), టామ్ హార్ట్లీ ధాటికి ఆ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో హ్యారీ కేన్ (45), బ్రూక్ గెస్ట్ (31 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. -
T20 Blast: నవీన్ ఉల్ హక్‌ను చెడుగుడు ఆడుకున్న అనామక బ్యాటర్లు
ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్సన్తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్మన్ (1/16) వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్షైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు. -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్‌వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!
భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన లివింగ్‌స్టోన్ సీజన్ మొత్తం భారీ సిక్సర్లతో అలరించాడు. తాజాగా అదే టెంపోను టి20 బ్లాస్ట్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ వేదికగ జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా భారీ సిక్సర్లు బాదుతు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యంత భారీ సిక్స్ లివింగ్‌స్టోన్ పేరిటే ఉంది. తాజాగా బుధవారం రాత్రి లంకాషైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరపడింది. అయితే బంతి ఎక్కడ పడింతో తెలియకపోడంతో ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్క్‌లో ఉన్న బిల్డర్లు కూడా పని ఆపేసి బంతికోసం వెతికారు. చివరకు ఒక గుంత పక్కడ కనిపించడంతో బంతిని అందుకొని గ్రౌండ్లోకి విసిరేశారు. అప్పటికే కాచుకు కూర్చొన్న అంపైర్ పరిగెత్తుకెళ్లి బాల్‌ను తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్ విధ్వంసం దాటికి లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో లూస్ డూ ప్లూయ్ 59, లుయిస్ రీస్ 55 పరుగులు చేశారు. చదవండి: Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది' T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Liam Livingstone is starting to tee off! 💥 Watch him bat LIVE ➡️ https://t.co/fvUbVrnZuz#Blast22 pic.twitter.com/tl6iEYZzZN — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 Shoutout to the builders who helped retrieve the match ball 🤣#Blast22 https://t.co/1cKEDkFWVQ pic.twitter.com/wWGKexREW0 — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
చతేశ్వర్ పుజారా అజేయ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు), టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సస్సెక్స్ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. -
లంక కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మికీ ఆర్థర్
Mickey Arthur To Resign As Sri Lanka Head Coach.. శ్రీలంక కోచ్ పదవి బాధ్యతల నుంచి నుంచి మికీ ఆర్థర్ తప్పుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ మికీ ఆర్థర్‌కు లంక కోచ్‌గా చివరిది కానుంది. కాగా ఆర్థర్ డెర్బీషైర్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆర్థర్ తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలిసింది. కాగా లంక బోర్డు ఆర్థర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆర్థర్ తన ఈమెయిల్లో రాజీనామా విషయాన్ని ప్రకటించాడు. ''లంక క్రికెట్‌తో నా బంధం త్వరలో ముగియనుంది. డెర్బిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు డైరెక్టర్‌గా కొనసాగేందుకు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నా. వెస్టిండీస్‌తో జగరనున్న రెండు టెస్టుల సిరీస్ లంక్ కోచ్‌గా నాకు ఆఖరిది కానుంది. ఇంతకాలం నాకు సహకరించిన లంక క్రికెట్ బోర్డుతో పాటు సపోర్ట్ స్టాప్‌కు నా కృతజ్క్షతలు. ఇక లంక క్రికెటర్లతో నాకు మంచి అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో శ్రీలంకకు కోచ్‌గా పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మికీ ఆర్థర్ ఫిబ్రవరి 2020న లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
భారత బౌలర్లు మళ్లీ విఫలం
డెర్బీషైర్ 326/5 డెర్బీ: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత బౌలింగ్ బలగానికి ఇంకా పట్టు చిక్కడం లేదు. ఫలితంగా మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి డెర్బీషైర్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. డర్స్టన్ (95), గాడెల్మాన్ (67), స్లేటర్ (54), హొసీన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. టీమిండియా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మరోసారి విఫలమయ్యారు. ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం ఉన్న ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ వైఫల్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత మ్యాచ్‌లో 7 నోబాల్స్ వేసిన ఇషాంత్... ఈ సారి కూడా భారీగా పరుగులిచ్చి 9 నోబాల్స్ వేయడం చూస్తే అతని బౌలింగ్ గతి తప్పిందని అర్థమవుతోంది. అయితే రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. -
టెస్టుకు ముందు పరీక్ష!
- మరో ప్రాక్టీస్ మ్యాచ్‌కు భారత్ సిద్ధం - నేటినుంచి డెర్బీషైర్‌తో పోరు డెర్బీషైర్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జట్టు బలాబలాలను అంచనా వేసేందుకు భారత జట్టుకు ఇదే చివరి అవకాశం. మంగళవారంనుంచి ఇక్కడ జరిగే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్, డెర్బీషైర్‌తో తలపడుతుంది. ఈ మూడు రోజుల మ్యాచ్‌కు ఫస్ట్‌క్లాస్ గుర్తింపు లేకపోవడంతో భారత్ అందుబాటులో ఉన్న 18 మంది ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌నుంచి పెద్దగా ప్రయోజనం పొందని టీమిండియా ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. మరో వైపు ప్రత్యర్థి డెర్బీషైర్ పెద్దగా బలంగా ఏమీ లేదు. ఈ జట్టు కూడా తమ దేశవాళీలో వరుసగా విఫలమవుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం భారత్‌ను ఇబ్బంది పెట్టే అంశం. బౌలింగే కీలకం తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆకట్టుకున్నా...బౌలింగ్ ఎప్పటిలాగే బలహీనంగా కనిపించింది. ధావన్, గంభీర్, పుజారా, రహానే, రోహిత్...ఇలా అంతా గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. అయితే రాబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు అవకాశాలు మెరుగు పడాలంటే ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలింగ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ధోని తన బౌలింగ్ వనరులను పూర్తిగా ఉపయోగించడంపై దృష్టి పెట్టాడు. గత మ్యాచ్‌లో విఫలమైన ఇషాంత్ శర్మను మినహాయిస్తే జట్టులో ఐదుగురు ప్రధాన పేసర్లు ఉన్నారు. వీరిలో ఎంతో కొంత అంతర్జాతీయ అనుభవం ఉన్న మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఆరోన్‌లు ఈ మ్యాచ్‌లో రాణించడాన్ని బట్టి టెస్టు జట్టు కూర్పును నిర్ణయించవచ్చు. ఇక ఈశ్వర్ పాండే, పంకజ్ సింగ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.