ఐపీఎల్-2023లో ఓవరాక్షన్ చేసి (కోహ్లితో వివాదం) వార్తల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌ను ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అనామక బ్యాటర్లు ఉతికి ఆరేశారు. లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ను నిన్న (జూన్ 1) జరిగిన మ్యాచ్‌లో డెర్బిషైర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన నవీన్.. ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు.
నవీన్‌ను ముఖ్యంగా సెంచరీ హీరో వేన్ మ్యాడ్‌సన్ (61 బంతుల్లో 109 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉతికి ఆరేశాడు. ఎడాపెడా బౌండరీలు బాది నవీన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. మ్యాడ్‌సన్‌తో పాటు థామస్ వుడ్ (24 బంతుల్లో 37; 7 ఫోర్లు), బ్రూక్ గెస్ట్ (20 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లీసెస్టర్‌షైర్ బౌలరల్లో నవీన్‌తో పాటు ముల్దర్ (3-0-34-0), విల్ డేవిస్ (3-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. పార్కిన్సన్ (2/36), రెహాన్ అహ్మద్ (2/20), అకెర్‌మన్ (1/16) వికెట్లు పడగొట్టారు.
అనంతరం 190 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లీసెస్టర్‌షైర్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. నిక్ వెల్చ్ (20 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్), రిషి పటేల్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ అకెర్‌మన్ (38 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), రెహాన్ అహ్మద్ (14 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) లీసెస్టర్‌షైర్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. డెర్బీ బౌలర్లలో జాక్ చాపెల్ 2, మార్క్ వ్యాట్, జార్జ్ స్క్రిమ్‌షా, లూయిస్ రీత్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment