Naveen-ul-Haq Does As Gambhir After Being Brutally Mocked With 'Kohli, Kohli' Chants Goes Viral - Sakshi
Sakshi News home page

#Naveen-ul-Haq: ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్‌కు తెలిసొచ్చింది! కానీ తగ్గేదేలే అంటూ గంభీర్‌లా..

Published Sun, May 21 2023 9:55 AM | Last Updated on Sun, May 21 2023 10:25 AM

Naveen ul Haq Does Gambhir After Being Brutally Mocked With Kohli Chants Viral - Sakshi

నవీన్‌కు కోల్‌కతాలో చుక్కలు చూపించిన కోహ్లి ఫ్యాన్స్‌ (PC: IPL)

IPL 2023 Virat Kohli vs Naveen-ul-Haq- LSG In Play Offs: లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌, అఫ్గనిస్తాన్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుత ఆట తీరుతో అనుకునేరు! కానే కాదు.. ప్రేక్షకులు నోళ్లు మూయాలంటూ దుందుడుకు వైఖరితో! ఐపీఎల్‌-2023లో ఆర్సీబీ- లక్నో రివేంజ్‌ మ్యాచ్‌ సందర్భంగా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి- అఫ్గన్‌ యువ పేసర్‌ నవీన్‌ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.

కొనసా.. గించారు
నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం తర్వాత కరచాలనం చేసుకునే సమయంలోనూ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. మైదానం వెలుపల కూడా వీరి మధ్య వార్‌ కొనసాగింది. తర్వాత సోషల్‌ మీడియాలోనూ కౌంటర్‌ పోస్టులతో కోహ్లి- నవీన్‌ పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు.

అయితే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి త్వరగా అవుట్‌ కావడంతో నవీన్‌.. ‘‘తియ్యటి మామిడి పండ్లు’’ అని, ఆర్సీబీ ఓటమి నేపథ్యంలో రౌండ్‌ 2 అంటూ ఇన్‌స్టా స్టోరీతో మరోసారి కోహ్లిని, అతడి ఫ్యాన్స్‌ను కవ్వించాడు.

కోహ్లి నామస్మరణతో హోరెత్తించి
ఇంకేముంది టీమిండియా ముఖచిత్రం, స్టార్‌ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లితో గొడవ పడితే ఎలా ఉంటుందో ట్రోల్స్‌ రూపంలో నవీన్‌కు అర్థమయ్యేలా చేశారు ఫ్యాన్స్‌. అంతేకాదు, నవీన్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలో మైదానంలోనూ కోహ్లి.. కోహ్లి అంటూ కింగ్‌ నామస్మరణతో హోరెత్తించారు. 

కానీ తగ్గేదేలే అంటూ గంభీర్‌లా
ప్లే ఆఫ్స్‌ రేసులో కీలక పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లోనూ నవీన్‌కు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. అయితే, నవీన్‌ సైతం మైదానంలోని ప్రేక్షకులను ఉద్దేశించి నోరు మూయాలంటూ నోటిపై వేలును ఉంచి వారిని మరింత రెచ్చగొట్టాడు. బెంగళూరులో ఆర్సీబీ- లక్నో మ్యాచ్‌లో లక్నో మెంటార్‌ గౌతం గంభీర్‌ తరహాలో ‘ష్’ అంటూ సైగ చేశాడు.

ఆర్సీబీ పోటీలో ఉండాలంటే గెలవాల్సిందే
కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్లో రహ్మనుల్లా గుర్బాజ్‌ క్యాచ్‌ను రవి బిష్ణోయి పట్టుకున్న సమయంలో ఈ మేరకు తన చర్యతో వైరల్‌గా మారాడు. ఇదిలా ఉంటే.. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ చేరుకుంది. ఇక నాలుగో స్థానం కోసం ముంబై, ఆర్సీబీ పోటీలో నిలిచాయి. తమ తదుపరి మ్యాచ్‌లలో ఈ రెండూ ఓడితే రాజస్తాన్‌కు అవకాశాలు ఉంటాయి.

చుక్కలు చూపిస్తాం
ఇక ఈ మ్యాచ్‌లో నవీన్‌ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 46 పరుగులు ఇచ్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో 8 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

దీంతో.. ‘‘మా కింగ్‌ బ్యాటింగ్‌ గురించి చెత్త కామెంట్లు చేయడం కాదు. ముందు నీ ఆట మీద దృష్టి పెట్టు. మా హీరో మొన్న సెంచరీ చేస్తే నువ్వు ఒక్క వికెట్‌ కూడా తీయలే​క చతికిలపడ్డావు’’ అని ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ఇకనైనా మారు.. కోహ్లి అభిమానులతో పెట్టుకుంటే నీకు చుక్కలే.. ఖబడ్దార్‌’’ అంటూ హెచ్చరిస్తున్నారు.  

చదవండి: కావాలనే యశ్‌ చేతికి బంతినిచ్చా! అతడు క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి వణికిపోవాల్సిందే!
ఇది క్రికెట్‌ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement