కోహ్లి- గంభీర్ మధ్య వాగ్వాదంతో రచ్చ రచ్చ (PC: IPL)
IPL 2023- Virat Kohli: ఐపీఎల్-2023లో తొలిసారి ఎదురుపడిన సందర్భంలో రాయల్ చాలెంజర్స్‌ను ఓడించింది లక్నో సూపర్ జెయింట్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై గెలుపొంది గత సీజన్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. ఈ క్రమంలో లక్నో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.
అలా మొదలైంది
ఆఖర్లో బై రూపంలో వచ్చిన పరుగుతో లక్నో గెలుపు ఖరారు కాగా.. ఆవేశ్ ఖాన్ హెల్మెట్ కిందపడేసి వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తానేదో బ్యాటింగ్ చేసి పరుగులు సాధించినట్లు రెచ్చిపోయాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆవేశ్ ఓవరాక్షన్ సహించలేక మందలించి వదిలేశారు.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి లక్నో మెంటార్ గౌతం గంభీర్.. ‘‘ష్’’ అంటూ నోరు మూసుకోవాలంటూ సైగ చేశాడు. అయితే, దూకుడైన ఆటకు మారుపేరైన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లికి ‘ఎవరైనా.. ఏదైనా.. స్వీట్ గిఫ్ట్’’ ఇస్తే తిరిగి ఇవ్వడం అలవాటు.
సీన్ రివర్స్
లక్నోలో సీన్ రివర్స్ అయింది. సొంతమైదానంలో రాహుల్ సేన ఫాఫ్ డుప్లెసిస్ బృందం చేతిలో చిత్తైంది. మరి కోహ్లి ఊరుకుంటాడా? తమ అభిమానులను అవమానించినందుకు ఇంతకు ఇంతా బదులు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లి- నవీన్ ఉల్ హక్, కోహ్లి- గంభీర్ మధ్య వాగ్వాదం వివాదానికి దారితీసింది.
ఇచ్చినపుడు తిరిగి తీసుకోవాలి
ఇక డ్రెసింగ్ రూం సెలబ్రేషన్స్ టైమ్‌లోనూ కోహ్లి.. ‘‘మీరు ఒకళ్లకు ఇచ్చినపుడు తిరిగి తీసుకునే అలవాటు కూడా ఉండాలి’’ అంటూ ముందుగా తమను కవ్వించినందుకే ఇలా కౌంటర్ ఇచ్చానన్నట్లు గంభీర్ అండ్ కోకు చెప్పాడు. అయితే, గొడవ అంతటితో సమసిపోలేదు.
పరస్పర కౌంటర్లతో కొనసా..గింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023 నుంచి ఆర్సీబీ అవుటైన నేపథ్యంలో లక్నో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘ఇస్తారా? తీసుకుంటారా? వదిలేయండబ్బా! ఆర్సీబీ గెలుపు కోసం అద్భుత పోరాటం చేసింది. ఏదేమైనా వచ్చే సీజన్‌లో మిమ్మల్ని కలుస్తాం’’ అని పేర్కొంది.
ఉత్తి పుణ్యానికి పాయింట్లు
అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం లక్నో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వర్షం కారణంగా ఒక పాయింట్! సన్‌రైజర్స్ అభిషేక్ పుణ్యమా అని రెండు పాయింట్లు.. కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో గెలుపు.. చావు తప్పి కన్నులొట్టబోయి.. లక్ ఉండట్టి ప్లే ఆఫ్స్ చేరారు. మీకు ఆర్సీబీ గురించి మాట్లాడే అర్హత లేదు’’ అంటూ మండిపడుతున్నారు.
స్నేహ హస్తం చాచినందుకు
మరికొందరు మాత్రం ఆ ఎమోజీ చూస్తుంటే వివాదానికి స్వస్తి పలుకుతూ స్నేహ హస్తం చాచినట్లు అనిపిస్తోందని తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా సీఎస్‌కేతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా లక్నోకు ఒక పాయింట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న లక్నో.. ముంబైతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే!
మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి అజేయ శతకం వృథాగా పోయింది. శుబ్‌మన్ గిల్ అజేయ సెంచరీ కారణంగా ఓటమి పాలైన బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చదవండి: IPL 2023: ధోనితో విభేదాలు.. మధ్యలో రవీంద్ర జడేజా భార్య..!
Give it? Take it? Let's leave it. 🤝
— Lucknow Super Giants (@LucknowIPL) May 21, 2023
Well fought, @RCBTweets. See you next season. 🤙
Comments
Please login to add a commentAdd a comment