IPL 2023: కొద్ది రోజుల క్రితం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో గొడవపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్, తాజాగా సహచరుడు ఆవేశ్ ఖాన్‌తో జరిగిన ఓ చాట్ షోలో (ఎక్‌దమ్ టైట్, ఎక్‌దమ్ రైట్ బై బాండ్ టైట్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సరదాగా సాగిన ఆవేశ్-నవీన్ ఉల్ హక్ మధ్య సంభాషణను ఎల్‌ఎస్‌జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది.
Avesh. Naveen. Too much fun 😂
— Lucknow Super Giants (@LucknowIPL) May 12, 2023
Also, wait till 1.39 👀@AstralAdhesives | #bondtite pic.twitter.com/QlKnyZSgHu
ఆవేశ్-నవీన్ ఒకరినొకరు ప్రశ్నలు సంధించుకున్న ఈ షోలో స్లెడ్జింగ్ గురించిన ఓ ప్రశ్నను ఆవేశ్.. నవీన్‌ను అడిగాడు. ఫీల్డ్‌లో నువ్వు చేసిన లేదా ఎదుర్కొన్న ఫేవరెట్ స్లెడ్జ్ ఏంటని ఆవేశ్..నవీన్‌ను అడిగాడు. దీనికి నవీన్ ఠక్కున స్పందిస్తూ.. నేనెవరిని ముందుగా స్లెడ్జింగ్ చేయను.. అది నా అలవాటు కాదు అని అన్నాడు. దీనికి ఆవేశ్ కచ్చితంగా సమాధానం చెప్పాలన్నట్లుగా పట్టుబట్టడంతో నవీన్ ఏదో సొల్లు చెప్పే ప్రయత్నం చేశాడు.
ఓ ఫస్ట్ క్లాస్ గేమ్ సందర్భంగా నాతో పాటు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఫీల్డర్ స్లెడ్జ్ చేశాడని, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ ఫీల్డర్.. ఇదే లాస్ట్ వికెట్, త్వరగా ఔట్ చేస్తే నేను ఇంటికి వెళ్లాలి, నాకు నిన్ననే పెళ్లైంది అని స్లెడ్జ్ చేశాడంటూ పస లేని విషయాన్ని స్లెడ్జింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్యలో ఆవేశ్ కలగజేసుకుని.. ఇది ఫన్నీ ఇన్సిడెంట్, సీరియస్‌గా జరిగిన స్లెడ్జింగ్ గురించి చెప్పు అంటూ పట్టుబట్టాడు.
దీనికి నవీస్ స్పందిస్తూ.. సీరియస్‌గా జరిగినవి ఏవీ లేవని బదులిచ్చాడు. నవీన్.. కోహ్లితో జరిగిన వివాదం ప్రస్తావన తేకపోవడంతో వీరి మధ్య సంధి కుదిరిందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే కోహ్లి-నవీన్-గంభీర్‌ల మధ్య గొడవ పూర్తయ్యాక చాలా రోజుల పాటు ఈ ముగ్గురి మధ్య (కోహ్లితో గంభీర్, నవీన్) సోషల్‌మీడియా వార్ జరిగిన విషయం తెలిసిందే. దూకుడుగా ఉండే కోహ్లి, గంభీర్‌లు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో లక్నో, ఆర్సీబీల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తదుపరి ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో (3) గెలవాల్సి ఉంది. ప్రస్తుతం లక్నో, ఆర్సీబీ 11, 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్, కోహ్లి పనైపోయింది: టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment