ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ విజయం | IPL 2025: Delhi Capitals vs Mumbai Indians Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025 MI vs DC: ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌ విజయం

Published Sun, Apr 13 2025 7:08 PM | Last Updated on Sun, Apr 13 2025 11:33 PM

IPL 2025: Delhi Capitals vs Mumbai Indians Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 MI vs DC Live Updates: ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.

ముంబై ఇండియన్స్‌ విజయం
అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై స్కోరింగ్‌ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన కరుణ్‌ నాయర్‌(40 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్స్‌లతో 89) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు అభిషేక్‌ పోరెల్‌(33) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో కరణ్‌ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌ రెండు , బుమ్రా, చాహర్‌ తలా వికెట్‌ సాధించారు. 

ఢిల్లీ రెండో వికెట్ డౌన్‌..
అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 33 ప‌రుగులు చేసిన పోరెల్‌.. క‌రుణ్ శ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగులు చేసింది.
కరుణ్ నాయ‌ర్ ఫిప్టీ..
ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ కరుణ్ నాయ‌ర్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. కేవ‌లం 22 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను నాయ‌ర్ అందుకున్నాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 72 ప‌రుగులు చేసింది.క్రీజులో క‌రుణ్ నాయ‌ర్‌(50), అభిషేక్ పోరెల్‌(16) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న క‌రుణ్ నాయ‌ర్‌..
5 ఓవ‌ర్లు మ‌గిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 54 ప‌రుగులు చేసింది. క్రీజులో క‌రుణ్ నాయ‌ర్‌(32), అభిషేక్ పోరెల్‌(16) ఉన్నారు.
తొలి వికెట్ డౌన్‌..
206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. జాక్ ఫ్రేజ‌ర్ మెక్‌గ‌ర్క్.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు.
చెల‌రేగిన ముంబై బ్యాట‌ర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌
అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌(59) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర్యాన్ రికెల్ట‌న్‌(41), సూర్య‌కుమార్‌(40), న‌మాన్ ధీర్‌(38) ప‌రుగుల‌తో రాణించారు.
ఔటైన సూర్య‌, హార్దిక్‌
ముంబై ఇండియ‌న్స్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయింది. 40 ప‌రుగులు చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత హార్దిక్ పాండ్యా(2) విప్ర‌జ్ నిగ‌మ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న తిల‌క్‌, సూర్య‌
13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ 2 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో సూర్య‌కుమార్ యాద‌వ్‌(40), తిల‌క్ వ‌ర్మ‌(30) ఉన్నారు.

ముంబై రెండో వికెట్ డౌన్‌. 
ర్యాన్ రికెల్ట‌న్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది.  41 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. క్రీజులో తిల‌క్ వ‌ర్మ‌(4), సూర్య‌కుమార్ యాద‌వ్‌(14) ఉన్నారు.

ముంబై తొలి వికెట్ డౌన్‌..
రోహిత్ శ‌ర్మ రూపంలో ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విప్ర‌జ్ నిగ‌మ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది.

దూకుడుగా ఆడుతున్న ముంబై..
3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 39 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(16), ర్యాన్ రికెల్ట‌న్‌(22) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ స్టార్ ఓపెన‌ర్‌ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. మ‌రోవైపు ముంబై ఇండియ‌న్స్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement