
Mickey Arthur To Resign As Sri Lanka Head Coach.. శ్రీలంక కోచ్ పదవి బాధ్యతల నుంచి నుంచి మికీ ఆర్థర్ తప్పుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ మికీ ఆర్థర్‌కు లంక కోచ్‌గా చివరిది కానుంది. కాగా ఆర్థర్ డెర్బీషైర్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆర్థర్ తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలిసింది. కాగా లంక బోర్డు ఆర్థర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆర్థర్ తన ఈమెయిల్‌లో రాజీనామా విషయాన్ని ప్రకటించాడు.
''లంక క్రికెట్‌తో నా బంధం త్వరలో ముగియనుంది. డెర్బిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు డైరెక్టర్‌గా కొనసాగేందుకు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నా. వెస్టిండీస్‌తో జగరనున్న రెండు టెస్టుల సిరీస్ లంక్ కోచ్‌గా నాకు ఆఖరిది కానుంది. ఇంతకాలం నాకు సహకరించిన లంక క్రికెట్ బోర్డుతో పాటు సపోర్ట్ స్టాప్‌కు నా కృతజ‍్క్షతలు. ఇక లంక క్రికెటర్లతో నాకు మంచి అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో శ్రీలంకకు కోచ్‌గా పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మికీ ఆర్థర్ ఫిబ్రవరి 2020న లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.