Sri Lanka Team
-
ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక
ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 2022కు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. 20 మందితో కూడిన జట్టుకు దాసున్ షనక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దనుంజయ డిసిల్వా, వనిందు హసరంగా, దుష్మంత చమీరా, చమిక కరుణరత్నే , పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్, బానుక రాజపక్సలు పేరున్న ఆటగాళ్లు కాగా.. ఐపీఎల్ ద్వారా 'బేబీ మలింగ'గా పిలవబడిన మతీషా పార్థీరానా కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. వాస్తవానికి ఆసియా కప్ మొదట శ్రీలంక వేదికగా జరగాల్సింది. కానీ దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో తలెత్తడంతో వేదికను లంక నుంచి యూఏఈకి మార్చారు. ఇక ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టోర్నీలో ఆరు జట్లు పాల్గొనునుండగా.. ఇప్పటికే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లు ఖరారు కాగా.. మిగతా రెండు స్థానాలు కోసం హాంకాంగ్, కవైట్, సింగపూర్, యూఏఈలు పోటీ పడుతున్నాయి. ఆసియాకప్‌కు శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), ధనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), భానుక రాజపక్స (వికెట్ కీపర్), అషెన్ బండార, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫరీ వాండర్సే, ప్రవీణ్ ద్వండర్సే చమీర, బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, దినేష్ చందిమల్ (వికెట్ కీపర్), నువానిందు ఫెర్నాండో, కాసున్ రజిత -
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం(ఫోటోలు)
-
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్ (44 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), ఫించ్ (40 బంతుల్లో 61 నాటౌట్; 4ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తొలుత లంక జట్టు 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), గుణతిలక (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అసలంక (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఇంకెవరూ ఆసీస్ పేస్ ముందు నిలబడలేకపోయారు. హాజల్‌వుడ్ (4/16), స్టార్క్ (3/26) నిప్పులు చెరిగారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి నెగ్గింది. ఇదే వేదికపై నేడు రెండో టి20 జరుగుతుంది. -
లంక కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మికీ ఆర్థర్
Mickey Arthur To Resign As Sri Lanka Head Coach.. శ్రీలంక కోచ్ పదవి బాధ్యతల నుంచి నుంచి మికీ ఆర్థర్ తప్పుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ మికీ ఆర్థర్‌కు లంక కోచ్‌గా చివరిది కానుంది. కాగా ఆర్థర్ డెర్బీషైర్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆర్థర్ తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలిసింది. కాగా లంక బోర్డు ఆర్థర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆర్థర్ తన ఈమెయిల్లో రాజీనామా విషయాన్ని ప్రకటించాడు. ''లంక క్రికెట్‌తో నా బంధం త్వరలో ముగియనుంది. డెర్బిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు డైరెక్టర్‌గా కొనసాగేందుకు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నా. వెస్టిండీస్‌తో జగరనున్న రెండు టెస్టుల సిరీస్ లంక్ కోచ్‌గా నాకు ఆఖరిది కానుంది. ఇంతకాలం నాకు సహకరించిన లంక క్రికెట్ బోర్డుతో పాటు సపోర్ట్ స్టాప్‌కు నా కృతజ్క్షతలు. ఇక లంక క్రికెటర్లతో నాకు మంచి అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో శ్రీలంకకు కోచ్‌గా పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మికీ ఆర్థర్ ఫిబ్రవరి 2020న లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు; ఇక ఎవరికి సాధ్యం
Lasit Malinga Retirement.. శ్రీలంక స్టార్ క్రికెటర్ లసిత్ మలింగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మలింగ సాధించిన రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక రికార్డు మాత్రం ఇప్పటివరకు పదిలంగానే ఉంది. అదే నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు.. అందునా ఒకే రికార్డును రెండుసార్లు సాధించడం ఒక్క మలింగకే చెల్లింది. మరి ఆ రికార్డు ఇక ఎవరికి సాధ్యమవుతుందో చూడాలి. ఇక మలింగ సాధించిన 'నాలుగు బంతుల్లో.. నాలుగు వికెట్ల' రికార్డును ఒకసారి పరిశీలిద్దాం. 2007 వన్డే ప్రపంచకప్ .. 2019లో మలింగ చదవండి: మలింగ తరహాలో అరుదైన ఫీట్.. అయినా ఓడిపోయారు 12 ఏళ్ల బంధానికి ముంబై ఇండియన్స్ గుడ్‌బై 2007 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ప్రొవిడెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 45వ ఓవర్ చివరి రెండు బంతుల్లో పొలాక్, హాల్‌లను అవుట్ చేసిన అతను, 47వ ఓవర్ తొలి రెండు బంతుల్లో కలిస్, ఎన్తినిలను పెవిలియన్ పంపించాడు. అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మలింగ రికార్డును దాదాపు 12 ఏళ్ల పాటు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మరోసారి అదే రిపీట్ చేశాడు. 2019లో పల్లెకెలెలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ మూడో ఓవర్లో మలింగ వరుసగా మున్రో, రూథర్‌ఫర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను అవుట్ చేయడం విశేషం. మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 టి20లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20లలో 107 వికెట్లు కలిపి మొత్తం 546 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతడిదే పైచేయి. అంతేకాదు, పొట్టి ఫార్మాట్లో 100 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ కూడా అతడే. చదవండి: Lasith Malinga: ఇకపై ఆ యార్కర్లు కనిపించవు 4️⃣ in 4️⃣ v SA, 2007 (ODI) 4️⃣ in 4️⃣ v NZ, 2019 (T20I) Lasith Malinga is the only bowler to have taken four wickets in four balls twice! On his birthday, relive his spell against South Africa at the 2007 @CricketWorldCup 📹 pic.twitter.com/ofPAI9YjPM — ICC (@ICC) August 28, 2020 -
అమ్మాయిలు అజేయంగా...
మెల్బోర్న్: టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో తమ విజయయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన భారత్ గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. శ్రీలంకతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండిమా ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 113 పరుగులు చేసింది. భారత్ 14.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ (4/23)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ గెలుపుతో భారత్ 8 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానం సంపాదించింది. స్పిన్ మ్యాజిక్... టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు ఉపక్రమించింది. మూడో ఓవర్ తొలి బంతికే స్పిన్నర్ దీప్తి శర్మ లంక ఓపెనర్ థిమాషినిని అవుట్ చేసింది. ఆ తర్వాత జయాంగని, హర్షిత కొంచెంసేపు వికెట్లను కాపాడుకున్నారు. అయితే హర్షితను బౌల్డ్ చేసి స్పిన్నర్ రాజేశ్వరి ఈ జోడిని విడగొట్టింది. అనంతరం మరో స్పిన్నర్ రాధా యాదవ్ తన మాయాజాలాన్ని ప్రదర్శించింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. మరో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఒక వికెట్ తీసింది. మొత్తం శ్రీలంక కోల్పోయిన తొమ్మిది వికెట్లలో ఎనిమిది వికెట్లు స్పిన్నర్లకే రావడం విశేషం. ఆడుతూ... పాడుతూ... 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి మెరిసింది. లంక బౌలర్ల భరతం పట్టింది. ఏడు బౌండరీలు కొట్టింది. మరోవైపు స్మృతి (12 బంతుల్లో 17; 3 ఫోర్లు) కూడా తన జోరు కొనసాగించింది. తొలి వికెట్‌కు 34 పరుగులు జోడించాక స్మృతి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్)తో షఫాలీ రెండో వికెట్‌కు 47 పరుగులు జత చేసింది. హర్మన్‌ప్రీత్, షఫాలీ అవుటయ్యాక... జెమీమా (15 నాటౌట్; ఫోర్), దీప్తి శర్మ (15 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అజేయంగా 28 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇనింగ్స్: థిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి శర్మ 2; జయాంగని (సి) శిఖా పాండే (బి) రాధా యాదవ్ 33; హర్షిత (బి) రాజేశ్వరి 12; హన్సిమ (సి) వేద (బి) రాధా యాదవ్ 7; హాసిని (సి) తానియా (బి) రాధా యాదవ్ 7; శశికళ సిరివర్దనె (సి) వేద (బి) రాజేశ్వరి 13; నీలాక్షి డిసిల్వా (సి) హర్మన్ (బి) పూనమ్ 8; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) రాధా యాదవ్ 1; దిల్హారీ (నాటౌట్) 25; సత్య (బి) శిఖా పాండే 0; ప్రబోధని (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–12, 2–42, 3–48, 4–58, 5–75, 6–78, 7–80, 8–104, 9–104. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–16–1; శిఖా పాండే 4–0–35–1; రాజేశ్వరి 4–1–18–2; పూనమ్ యాదవ్ 4–0–20–1; రాధా యాదవ్ 4–0–23–4. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 47; స్మృతి (సి) దిల్హారీ (బి) ప్రబోధని 17; హర్మన్‌ప్రీత్ (సి) హన్సిమ (బి) శశికళ 15; జెమీమా (నాటౌట్) 15; దీప్తి శర్మ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 116 వికెట్ల పతనం: 1–34, 2–81, 3–88. బౌలింగ్: ప్రబోధని 4–0–13–1; శశికళ 4–0–42–1; సత్య సాందీపని 1–0–11–0; జయాంగని 2–0–21–0; దిల్హారీ 3–0–18–0; థిమాషిని 0.4–0–7–0. -
టీ20 మ్యాచ్: గువాహటి.. యూ బ్యూటీ!
గుహవాటి: ఈ ఏడాదిలో టీమిండియా ఆడే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ బార్సపర స్టేడియంలో ఆదివారం జరగాల్సింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ రద్దైనప్పటికీ స్టేడియంలో చోటు చేసుకున్న భావోద్వేగ సంఘటన ప్రతి ఒక్కరి రోమాలను నిక్కపొడిచేలా చేసింది. టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంచనాలను పటాపంచలు చేస్తూ వర్షం అడ్డుపడింది. అయితే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి టీమిండియా అభిమానులంతా జాతీయ గేయమైన ‘వందేమాతరం’ను ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు(బీసీసీఐ).. ‘గువాహటి.. యూ బ్యూటీ’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వర్షం పడుతూ ఉంటే టీమిండియా అభిమాలంతా ఒక్కసారిగా లేచి నిలబడి.. జాతీయ గేయాన్ని ఆలపించి ఆటగాళ్లలో విశ్వాసాన్ని నింపిన దృశ్యం మమ్మల్ని ఆకట్టుకుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి టాస్ గురించి మాట్లాడుతూ.. బార్సపరా స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు బాగా రాణించాయని.. అందుకే తాను మొదట ఫీల్డింగ్‌కే మొగ్గు చూపినట్లు చెప్పాడు. ‘ గత కొంత కాలం ఇక్కడ ఆడలేదు. అయితే చివరి మ్యాచ్ అస్ట్రేలియాతో ఆడినప్పుడు మొదట బ్యాటింగ్ చేశాం. అప్పుడు మేము బాగానే రాణించాం’ అంటూ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు కాగా తదుపరి మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇండోర్‌కు చేరుకోనున్నాయి.(చదవండి: డ్రయర్‌తో ఆరబెట్టి.. ఐరన్ బాక్స్‌తో ఇస్త్రీ చేశారు!) Guwahati, you beauty 😍#INDvSL pic.twitter.com/QuZAq7i1E3 — BCCI (@BCCI) January 5, 2020 -
బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్
కొలంబో: ఒక సిరీస్ గెలిచిన తర్వాత ఆటగ్లాళ్లు గ్రౌండ్‌లోనే సెలబ్రేషన్స్ చేసుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా బైక్‌పై తమ విజయోత్సావాన్ని జరుపుకునే క్రమంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ మెండిస్ కిందపడ్డాడు. బైక్‌పై చక్కర్లు కొడుతుండగా అది కాస్తా అదుపు తప్పడంతో మెండిస్ పడిపోయాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తోజరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంకేయులు 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. తొలి వన్డేలో 91 పరుగుల తేడాతో విజయం సాధించిన శ్రీలంక, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మూడో వన్డేలో ఏకంగా 122 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగేళ్ల తర్వాత వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టకున్నాడు. నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సందర్భంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కుశాల్ మెండిస్ బైక్‌పై జట్టులోని సహచర ఆటగాడిని ఎక్కించుకుని స్టేడియంలో చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది, జట్టు సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బైక్‌ను పైకి లేపారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
గ్రౌండ్లో బైక్‌పై చక్కర్లు.. కిందపడ్డ క్రికెటర్
-
శ్రీలంక క్లీన్‌స్వీప్
కొలంబో: ఈ మధ్యే జరిగిన ప్రపంచకప్ గుర్తుందిగా! బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కివీస్ చేతిలో ఓడినా... ఆఖరిదాకా వణికించింది. ఇలా పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్... నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. మూడో వన్డేలోనూ ఓడింది. దీంతో శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 122 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. మాథ్యూస్ (90 బంతుల్లో 87; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కరుణరత్నే (46), కుశాల్ పెరీరా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (86 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. టెయిలెండర్ తైజుల్ ఇస్లామ్ (39 నాటౌట్) మెరుగనిపించాడు. లంక బౌలర్లలో షనక 3, రజిత, లహిరు చెరో 2 వికెట్లు తీశారు. -
శ్రీలంక విజయకేతనం
అనంతపురం న్యూసిటీ: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో శ్రీలంక జట్లు రాణించాయి. శనివా రం అనంతపురం క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో అనంతపురం జట్లపై శ్రీలంక జట్లు గెలుపొందాయి. శ్రీ లంక బ్యాట్స్‌మెన్ దిమంతు సెంచరీతో కదం తొక్కాడు. సునాయాసంగా: అండర్ –12 విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీలంక జట్టు సునాయస విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జట్టులో భానుప్రకాష్ 81(12 బౌండరీలు), మనోజ్‌కుమార్ 52 పరుగులతో రాణించారు. శ్రీలంక జట్టు 29.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో దిమంతు సెంచరీ 86 బంతుల్లో 15 బౌండరీలతో 109 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లలో సునీల్, సాత్విక్, ఆర్యన్ చెరో వికెట్ తీసుకున్నారు. శ్రీలంక జట్టు 4 వికెట్లు తేడాతో గెలుపొందింది.కుప్పకూలిన అనంతపురం: అండర్ –14 విభాగంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టులో స్వేత్ 35, ఓమెత్ 27, మోనీష్ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టు 26 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల తేడాతో అనంతపురంపై శ్రీలంక జట్టు గెలుపొందింది. -
మాథ్యూస్ సెంచరీ వృథా.. తప్పని ఓటమి
మొహాలి: తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో శ్రీలంకను చిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంకను 141 పరుగుల తేడాతో ఓడించింది. రోహిత్ సేన నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు సాధించింది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లంకను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఏ ఒక్కరూ అతడికి తోడుగా నిలబడలేకపోయారు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. వన్డేల్లో అతడికిది రెండో సెంచరీ. 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 392 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చెలరేగి ఆడి అజేయ డబుల్ సెంచరీ(208) సాధించాడు. శ్రేయస్ అయ్యర్(88), శిఖర్ ధవన్(68) అర్ధసెంచరీలు చేశారు. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. -
స్లిప్ ఫీల్డింగ్ మెరుగవ్వాలి
సునీల్ గావస్కర్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు ఆడిన తీరు అమోఘం. బంతి గమనాన్ని చక్కగా అర్థం చేసుకున్న కుశాల్ మెండిస్, కరుణరత్నే జోడి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఇద్దరూ శతకాలతో చెలరేగినా మిగతా వారి నుంచి మాత్రం అలాంటి ఆటతీరు కనిపించలేదు. ఇక మూడో టెస్టు జరిగే కాండీ మైదానంలో మెండిస్‌కు మెరుగైన రికార్డు ఉంది. గతేడాది ఆసీస్‌పై అతను 176 పరుగులు సాధించి లంక విజయానికి కారకుడయ్యాడు. మరోసారి ఆతిథ్య జట్టు అతడి నుంచి కీలక ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. అయితే లంక బౌలర్లకు భారత బ్యాటింగ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసే సామర్థ్యం లేదు. ఒకవేళ అవుట్ చేసినా స్వల్ప స్కోరును కాపాడే సత్తా భారత బౌలర్లకు ఉంది. ఇక భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది. ఆటగాళ్లందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పుజారా ఆటతీరు అలా సాగిపోతూనే ఉంది. మున్ముందు క్లిష్టమైన సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో తాము కూడా అతడిలాగే క్రీజులో వీలైనంత ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని ఇతర ఆటగాళ్లు గ్రహించా లి. ఈ మ్యాచ్ కు జడేజా దూరం కానుండడంతో కుల్దీప్కు చోటిస్తే జట్టుకు ఉపయోగపడగలడు. అతడికి ఎన్ని అవకాశాలిస్తే అంత మెరుగవుతాడు. స్లిప్ క్యాచింగ్ విషయంలో భారత ఆటగాళ్లు చాలా మెరుగవ్వాలి. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ విషయంలో తమ లోపాలను అధిగమిస్తే రెండు రోజుల ముందే మ్యాచ్‌ను ముగించి విశ్రాంతి తీసుకోవచ్చు. -
ప్రాక్టీస్ మ్యాచ్‌లో లంకపై ఆసీస్ విజయం
ఓవల్: చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 318 పరుగులు చేసింది. మాథ్యూస్ (95), గుణరత్నె (70 నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఆరన్ ఫించ్ (109 బంతుల్లో 137; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ట్రావిస్ హెడ్ (85 నాటౌట్) అజేయంగా నిలిచి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
ప్రపంచ కప్ నుంచి మలింగ అవుట్
టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో మలింగ ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
ఫాలోఆన్‌లో శ్రీలంక
⇒ రెండో ఇన్నింగ్స్ 84/0 ⇒ కివీస్ తొలి ఇన్నింగ్స్ 441 క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండ్ షో ముందు శ్రీలంక జట్టు ఉక్కిరిబిక్కిరవుతోంది. తొలి రోజు ఆటలో మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా... రెండో రోజు బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా శనివారం లంక జట్టు రెండుసార్లు బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ముందుగా తమ తొలి ఇన్నింగ్స్‌లో 42.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌కు 303 పరుగుల భారీ ఆధిక్యం అందింది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (3/25), నీల్ వాగ్నర్ (3/60) ధాటికి శ్రీలంక కుప్పకూలింది. సౌతీ, నీషమ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (85 బంతుల్లో 50; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన లంక రెండో రోజు ముగిసే సమయానికి 35 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అంతకుముందు 429/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆట ప్రారంభించిన కివీస్ 85.5 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటయ్యింది. -
వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
రాంచీ: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 5-0 తేడాతో సిరీస్ కైవశం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 3 వికెట్లతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 8 బంతులు మిగులుండగానే చేరుకుంది. 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. 126 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. అంబటి రాయుడు అర్థసెంచరీ(59)తో రాణించాడు. జాదవ్ 20 ఊతప్ప 19, బిన్నీ 12, అక్షర్ పటేల్ 12 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మెండిస్ 4 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. లంక కెప్టెన్ మాథ్యూస్ సెంచరీ(139)తో నాటౌట్ గా నిలిచాడు. -
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
రాంచీ: ఓవైపు అద్వితీయ ప్రదర్శనతో చెలరేగిపోతున్న భారత్ జట్టు...మరోవైపు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతున్న శ్రీలంక టీమ్... సిరీస్‌లో ఆఖరిదైన ఐదో వన్డే కోసం సిద్ధమయ్యాయి. ఆదివారం జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనేది భారత లక్ష్యం. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనేది లంక ఆరాటం. ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ఎప్పుడూ 0-5తో ఓడిపోలేదు. ఐదో వన్డేలోనూ ఓడితే మ్యాథ్యూస్ సేన ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వస్తుంది. వరుస విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో రైనాకు విశ్రాంతినిచ్చింది. దీంతో మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. కోచ్ ఫ్లెచర్ పర్యవేక్షణలో జాదవ్ శనివారం ఎక్కువసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బ్యాట్స్‌మెన్ అంతా ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విషయానికొస్తే ఉమేశ్ నెట్స్‌లో పాల్గొనకుండా వెన్ను కండరాలను పటిష్టం చేసుకునే పనిలో పడ్డాడు. దీంతో వినయ్ కుమార్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావొచ్చు. బిన్నీ, కులకర్ణీ, అక్షర్ పటేల్‌లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండటం భారత్‌కు అనుకూలాంశం. మరోవైపు లంక జట్టు బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్ సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. మలింగ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో వన్డేలో ఆడిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ పెద్దగా ప్రభావం చూపకపోవడం, మిగతా బౌలర్లు ఆశించిన మేరకు రాణించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీంతో పాటు ఫీల్డింగ్‌లోనూ లంకేయులు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. తగ్గిన సందడి లోకల్ హీరో ధోని లేకపోవడంతో ఈ మ్యాచ్‌పై రాంచీ అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. టిక్కెట్ల అమ్మకం ఆశించిన స్థాయిలో లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. 20 వేల మంది మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి. జార్ఖండ్‌లో ఈనెల 25 నుంచి ఎన్నికలు జరుగుతుండటం కూడా ఓ కారణమని అసోసియేషన్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు హాజరుకానున్న ధోని... జట్టు సహచరులకు తన బంగ్లా హర్మూలో విందు ఇవ్వనున్నట్లు సమాచారం. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), రహానే, రోహిత్, రాయుడు, జాదవ్, ఉతప్ప, బిన్నీ, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, ఉమేశ్ / వినయ్, కులకర్ణి. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కె.పెరీరా, దిల్షాన్, చండిమల్, జయవర్ధనే, తిరిమన్నే, టి.పెరీరా, ప్రసన్న, కులశేఖర, మెండిస్, ఎరంగా, పిచ్, వాతావారణం వికెట్‌పై కాస్త బౌన్స్ ఉంటుంది. మొదట పేసర్లకు తర్వాత స్పిన్నర్లకు అనుకూలం. మంచు ప్రభావం ఉంది. వర్షం పడే అవకాశాల్లేవు. మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం