అనంతపురం న్యూసిటీ: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో శ్రీలంక జట్లు రాణించాయి. శనివా రం అనంతపురం క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో అనంతపురం జట్లపై శ్రీలంక జట్లు గెలుపొందాయి. శ్రీ లంక బ్యాట్స్‌మెన్ దిమంతు సెంచరీతో కదం తొక్కాడు.
సునాయాసంగా: అండర్ –12 విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీలంక జట్టు సునాయస విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జట్టులో భానుప్రకాష్ 81(12 బౌండరీలు), మనోజ్‌కుమార్ 52 పరుగులతో రాణించారు.
శ్రీలంక జట్టు 29.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో దిమంతు సెంచరీ 86 బంతుల్లో 15 బౌండరీలతో 109 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లలో సునీల్, సాత్విక్, ఆర్యన్ చెరో వికెట్ తీసుకున్నారు. శ్రీలంక జట్టు 4 వికెట్లు తేడాతో గెలుపొందింది.కుప్పకూలిన అనంతపురం: అండర్ –14 విభాగంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. జట్టులో స్వేత్ 35, ఓమెత్ 27, మోనీష్ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టు 26 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల తేడాతో అనంతపురంపై శ్రీలంక జట్టు గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment