SL Vs AUS, 1st T20I: Australia Beat Srilanka In First T20 - Sakshi
Sakshi News home page

శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్‌.. ఆసీస్‌ ఘనవిజయం

Published Wed, Jun 8 2022 7:44 AM | Last Updated on Wed, Jun 8 2022 8:41 AM

Columbo: Australia Beat Srilanka In First T20 - Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్‌ (44 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు), ఫించ్‌ (40 బంతుల్లో 61 నాటౌట్‌; 4ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తొలుత లంక జట్టు 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌), గుణతిలక (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అసలంక (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్‌) తప్ప ఇంకెవరూ ఆసీస్‌ పేస్‌ ముందు నిలబడలేకపోయారు.

హాజల్‌వుడ్‌ (4/16), స్టార్క్‌ (3/26) నిప్పులు చెరిగారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి నెగ్గింది. ఇదే వేదికపై నేడు రెండో టి20 జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement