Australia Team
-
ఆస్ట్రేలియా X శ్రీలంక
గాలె: ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కించుకున్న ఆ్రస్టేలియా జట్టు బుధవారం నుంచి శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆసీస్ జట్టు శ్రీలంకతో 2 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా... స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డుపడే అవకాశాలుండగా... ఆస్ట్రేలియా జట్టు సుదీర్ఘ ఫార్మాట్లోనూ ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్‌గా దింపాలని యోచిస్తోంది. ‘ట్రావిస్ టాపార్డర్‌లో బరిలోకి దిగుతాడు. భారత్‌లో అతడు ఓపెనర్‌గా రాణించిన అంశాన్ని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నారు. కొత్త బంతితో హెడ్ వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయగలడు. లంకలోనూ అదే చేస్తాడనే నమ్మకముంది’ అని స్మిత్ పేర్కొన్నాడు. హెడ్ ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకుంటే... టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో చక్కటి ప్రదర్శన కనబర్చిన 19 ఏళ్ల యువ ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌కు జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఇక చాన్నాళ్లుగా ఆసీస్ తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తున్న జోష్ ఇంగ్లిస్ ఈ సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు స్మిత్ సూచనలిచ్చాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించాలని ఆసీస్ భావించినా... వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని స్మిత్ వెల్లడించాడు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన శ్రీలంక... సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన చేసి కంగారూల విజయయాత్రకు చెక్ పెట్టాలని భావిస్తోంది.కాగా... గాయం కారణంగా తొలి టెస్టు నుంచి లంక ఓపెనర్ నిసాంక దూరమయ్యాడు. అతడి స్థానంలో ఒషాడా ఫెర్నాండో జట్టులోకి రానున్నాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ... ఈ సిరీస్‌ను 2–0తో గెలుచుకుంటే పట్టికలో మూడో స్థానంలో నిలిచే అవకాశం మా జట్టుకు ఉంది. అది మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది’ అని శ్రీలంక సారథి ధనంజయ డిసిల్వా అన్నాడు. -
ఆ్రస్టేలియా మహిళల ఘన విజయం
దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా జట్టు మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్ ‘ఎ’లో వరుసగా ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో ఆసీస్ అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. టాస్ నెగ్గిన ఆ్రస్టేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆలియా రియాజ్ (32 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, మిగతా ఎవరూ కూడా కనీసం 15 పరుగులైనా చేయలేకపోయారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లే గార్డ్నెర్ 4, అనాబెల్ సదర్లాండ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా కేవలం 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 83 పరుగులు చేసి గెలిచింది. ఈ గ్రూపులో మూడు విజయాలతో ఆసీస్ (6 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉంది. -
Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్ దిగ్గజం
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. ‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన. ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. -
అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్-గావస్కర్ ట్రోపీ షురూ కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్‌కు చేరుకొని తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయగా.. మరోవైపు శుక్రవారం నాగ్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా నేటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. కోహ్లి, రోహిత్, పుజారా సహా మరికొంతమంది ఇవాళ జట్టుతో కలిసే అవకావం ఉంది. ఇదిలా ఉంటే గత సిరీస్ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా స్పిన్ అటాకింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఆసీస్ జట్టు కర్ణాటకలోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఆసీస్ జట్టు కోరిక మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ఉన్న మూడు పిచ్‌లపై స్పిన్ ట్రాక్నే రూపొందించారు. భారత్ లాంటి ఉపఖండం దేశంలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందునా పిచ్ పాతబడేకొద్ది స్పిన్నర్లు ప్రభావం చూపడం చూస్తుంటాం. భారత్ లాంటి పిచ్‌లపై ఇదంతా సహజం. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది వారి గేమ్‌ప్లాన్. అయితే ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేస్తున్న పిచ్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఇదేంటి అన్నట్లుగా ముక్కున వేలేసుకున్నారు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు స్పిన్ బౌలింగ్‌కు ఇంత భయపడుతుందా.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తుంది.. ఈసారి ఆసీస్ తమ వ్యూహాలలో పదును పెంచినట్లుంది.. స్పిన్ బౌలింగ్ అంటే అంత భయమేలా.. భారత్ స్పిన్ బౌలింగ్ అంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందేలే అంటూ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియాకు కోల్పోయింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ 333 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒకఫీ 12 వికెట్లతో టీమిండియాను శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న టీమిండియా రెండు, నాలుగు టెస్టుల్లో గెలిచి.. మూడో టెస్టు డ్రా చేసుకొని 2-1 తేడాతో సిరీస్ గెలిచింది. స్పిన్ పిచ్‌లపై ఆడడంలో అప్పుడు ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా రహానే సారధ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. తాజాగా ఐదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా సిరీస్‌ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. అందుకే ఏరికోరి తమ ప్రాక్టీస్‌కు స్పిన్ ట్రాక్‌ను తయారు చేయించుకుంది. The spin pitch Australia is using to practice forBorder–Gavaskar Trophy. #INDvsAUS #CricketTwitter pic.twitter.com/kEvJHp2JOm — Himanshu Pareek (@Sports_Himanshu) January 29, 2023 Training pitches of Australia in Alur ahead of the Test series. (Source - Cricket Australia) pic.twitter.com/V4Xif64MLB — Johns. (@CricCrazyJohns) February 3, 2023 చదవండి: పిల్లనిచ్చిన మామకు అల్లుడి బౌలింగ్ 'భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది' -
టిమ్ పెయిన్ సంచలన ఆరోపణలు
-
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఆస్ట్రేలియా వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్.. తాజాగా వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలో ఆరోన్ ఫించ్ టి20లపై దృష్టి వన్డేల నుంచి రిటైర్ కావడంతో అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసీస్ క్రికెట్లో చర్చ నడిచింది. తాజాగా నిరీక్షణకు తెరదించుతూ కమిన్స్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇక టి20 జట్టును ఆరోన్ ఫించ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టి20 ప్రపంచకప్ తర్వాత ఫించ్ రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతో మరో కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కమిన్స్‌ను మూడు ఫార్మట్లకు కెప్టెన్‌ను చేస్తారా లేక టి20 కెప్టెన్‌గా మరొకరిని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చ జరిగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి అవసరమైన కోడ్ సవరణను సమీక్షించారు. కానీ కోడ్‌ను ఇంకా సవరించలేదు. దీంతో వార్నర్‌కు కెప్టెన్సీని అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కమిన్స్‌కే వన్డే బాధ్యతలను కూడా అప్పగించారు. జట్టులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లకు బదులు.. ఇద్దరు కెప్టెన్లు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆసీస్ బోర్డు కమిన్స్ వైపు మొగ్గు చూపింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్ కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్లన్నీ పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. రాబోయే ఆరు నెలల కాలంలో ఆస్ట్రేలియా జట్టు 15 టెస్టులు ఆడనుంది. Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP — Cricket Australia (@CricketAus) October 17, 2022 చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి -
శ్రీలంకతో తొలి టి20 మ్యాచ్.. ఆసీస్ ఘనవిజయం
కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు వార్నర్ (44 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), ఫించ్ (40 బంతుల్లో 61 నాటౌట్; 4ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తొలుత లంక జట్టు 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), గుణతిలక (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అసలంక (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఇంకెవరూ ఆసీస్ పేస్ ముందు నిలబడలేకపోయారు. హాజల్‌వుడ్ (4/16), స్టార్క్ (3/26) నిప్పులు చెరిగారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి నెగ్గింది. ఇదే వేదికపై నేడు రెండో టి20 జరుగుతుంది. -
ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి, ఆసీస్ మాజీ దేశీవాళీ ఆటగాడు ఆండ్రీ బోరోవెక్లను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌లుగా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వీరిద్దరూ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం వెట్టోరికి ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వెట్టోరి బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెట్టోరి పని చేశాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. చదవండి: Ravichandran Ashwin: 'ప్రయోగాలు ఆపేసిన రోజు క్రికెట్‌పై ఫ్యాషన్ చచ్చిపోతుంది' 2️⃣ new assistant coaches for our men's national team! Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE — Cricket Australia (@CricketAus) May 24, 2022 -
Shane Warne: మిస్ యూ షేన్ వార్న్
-
Shane Warne: ‘మాంత్రికుడు’ మరో లోకానికి
క్రికెట్ బంతి అతను చెప్పినట్లు మలుపులు తిరిగింది. స్పిన్ ఆనవాలు కూడా కనిపించే అవకాశం లేని పిచ్‌లపైనా బంతి గిర్రున బొంగరంలా మారిపోయింది. చక్కటి నియంత్రణ, కచ్చితత్వం అతని బౌలింగ్‌ను మరింత పదునుగా మార్చాయి. జట్టు ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా ఆ మాయాజాలం ముందు తలొంచినవారే... దశాబ్దంన్నర కాలంపాటు ఆస్ట్రేలియా క్రికెట్ ఆ మణికట్టును నమ్ముకొని ప్రపంచాన్ని ఏలింది. అతని మాయాజాలం కారణంగానే పుష్కర కాలం చిరకాల ప్రత్యర్థికి ‘బూడిద’ కూడా దక్కలేదు. అతని వల్లే ప్రపంచకప్ కంగారూల చెంత చేరింది. ఒకటా రెండా... లెక్క లేనన్ని అసాధారణ ఘనతలు ఖాతాలోకి అలవోకగా వచ్చి చేరాయి. ఆ బౌలింగ్ లయను చూస్తే అంకెలు మాత్రమే ఆ గొప్పతనాన్ని కీర్తించలేవని అర్థమవుతుంది. అంతకు మించిన ఆకర్షణ అందులో ఉంది. క్రికెట్‌పై ఎప్పటికీ చెరిగిపోలేని ఆ ముద్ర ఉంది. హీరోగా, విలన్‌గా తనకు నచ్చినట్లుగా జీవించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్‌కు చివరి గుడ్‌బై! –సాక్షి క్రీడా విభాగం అతను వేసిన బంతి పిచ్‌పై పడిన తర్వాత ఇరవై నాలుగు అంగుళాలు లోపలికి దూసుకొచ్చి స్టంప్స్‌ను ఎగరగొట్టేసింది. మణికట్టు స్పిన్ అంతర్ధానం అయిపోయిందనుకున్న రోజుల్లో అతని బంతి ఆటకు కొత్త జీవం పోసింది. లెగ్‌బ్రేక్, ఫ్లిప్పర్, జూటర్, స్లయిడర్, టాపీ, బ్యాక్ స్పిన్నర్... మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, అతని నుంచి దూసుకొచ్చిన బంతి బ్యాటర్‌ను క్రీజ్‌లో విగ్రహంలా మార్చేసింది. అతని బంతి ఎంతగా స్పిన్ అయిందో చూడాలంటే మైదానంలో కోణమానినితో కొలవాల్సిందే... సూదిమొనల ‘స్పైక్స్’ జుట్టు, రిస్ట్ బ్యాండ్, అరుదైన నీలి, ఆకుపచ్చ కళ్లతో హాలీవుడ్ నటుల లుక్‌ను తలపిస్తూ క్రికెట్లో అడుగుపెట్టిన 23 ఏళ్ల కుర్రాడు తర్వాతి రోజుల్లో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. అతని ‘తిప్పుడు’ బారిన పడకపోతే చాలు అంటూ అన్ని జట్ల ఆటగాళ్లు అనుకునేలా చేశాడు. నెమ్మదిగా నాలుగు అడుగులు, చక్కటి యాక్షన్‌తో లెగ్‌స్పిన్‌ను కూడా ఒక అందమైన కళగా చూపించడం అతనికే చెల్లింది. మెల్బోర్న్: ప్రపంచ క్రికెట్ అభిమానులను విషాదంలో ముంచిన అనూహ్య వార్త. స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ షేన్ వార్న్ శుక్రవారం హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురైన 52 ఏళ్ల వార్న్ మృతి చెందినట్లు అతని మేనేజర్ మైకేల్ కోహెన్ వెల్లడించాడు. ‘తన విల్లాలో వార్న్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించినా అతని ప్రాణాలకు కాపాడలేకపోయింది’ అని అతను వెల్లడించాడు. భార్య సిమోన్‌తో చాలా కాలం క్రితమే విడాకులు తీసుకున్న వార్న్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శుక్రవారం ఉదయమే మరో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రాడ్ మార్‡్ష మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన వార్న్... కొన్ని గంటల్లోనే దురదృష్టవశాత్తూ తానూ మరణించడం విషాదం. క్రికెట్ కామెంటేటర్‌గా చురుగ్గా బాధ్యత లు నిర్వహిస్తూ వచ్చిన వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వనే ్డల్లో 293 వికెట్లు తీసి వార్న్ ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ‘బాల్ ఆఫ్ ద సెంచరీ’... జూన్ 4, 1993... మాంచెస్టర్‌లో తొలి యాషెస్ టెస్టు... ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. షేన్ వార్న్ వేసిన మొదటి బంతి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఎక్కడో లెగ్‌స్టంప్ బయట పడిన బంతి ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి ఆఫ్‌స్టంప్ బెయిల్‌ను తాకింది. ఏం జరిగిందో అంపైర్‌కు అర్థం కాలేదు. తానే కాస్త తలవంచి చూస్తుండిపోయాడు. అటు గ్యాటింగ్ అయితే అసలు నమ్మలేకపోయాడు. షాక్‌కు గురై ఆగిపోయిన అతడిని ‘బౌల్డ్’ అంటూ గుర్తు చేసి పెవిలియన్‌కు పంపించాల్సి వచ్చింది. ఈ అద్భుత దృశ్యం వార్న్ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించింది. క్రికెట్ చరిత్రలో ‘బాల్ ఆఫ్ సెంచరీ’గా నిలిచిపోయిన ఈ బంతితో వార్న్ ఘన ప్రస్థానం మొదలైంది. తొలి టెస్టులో 45 ఓవర్లు వేస్తే దక్కింది ఒక వికెట్! తర్వాతి మ్యాచ్‌లో 23 ఓవర్లలో అదీ లేదు. స్పిన్‌కు అనుకూలించే తర్వాతి టూర్ శ్రీలంకలోనూ దాదాపు అదే పరిస్థితి. విండీస్‌లో మెల్బోర్న్లో 7 వికెట్లు తీయడం మినహా తొలి 18 టెస్టుల్లో వార్న్ బౌలింగ్‌లో ప్రమాదకర ఛాయలు ఏమీ కనిపించలేదు. కానీ తర్వాతి యాషెస్ సిరీస్ అసలైన వార్న్‌ను ప్రపంచానికి చూపించింది. అద్భుత బంతితో చిరకాల ఖ్యాతిని అందుకున్న అతను ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ 12 ఏళ్ల పాటు వార్న్ బంతిని అర్థం చేసుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదు. వార్న్ దెబ్బతో 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ ‘యాషెస్’ అందుకోలేకపోయింది. చివరకు 2005లో సాధించినా ఆ సిరీస్‌లోనూ 40 వికెట్లతో వార్న్ పైచేయి ప్రదర్శించడం విశేషం. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్... ఇలా ప్రతీ జట్టుపై ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ విజయాల్లో అతను కీలకపాత్ర పోషించాడు. భారత్ మినహా (14 టెస్టుల్లో 43 వికెట్లు, 47.18 సగటు) ప్రతీ జట్టుపై ఈ స్టార్ బౌలర్ ఆధిపత్యం కనబర్చాడు. అయితే చివరకు 2004లో ‘ఫైనల్ ఫ్రాంటియర్’ అంటూ భారత్‌లో అడుగు పెట్టిన ఆసీస్... సిరీస్‌ను గెలుచుకోవడంతో వార్న్ సంతృప్తిగా ముగించాడు. టెస్టు క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్‌గా నిలిచిన వార్న్... సొంతగడ్డపై యాషెస్‌లో ఇంగ్లండ్‌ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. వన్డేల్లోనూ సూపర్... వార్న్ ఘనతలను టెస్టు కోణంలోనే ఎక్కువగా చూడటం వల్ల అతని వన్డే ఘనతల ప్రస్తావన తక్కువగా వినిపిస్తుంది. అయితే 12 ఏళ్ల వన్డే కెరీర్లో ఎన్నో అసమాన విజయాలు అతను అందించాడు. ముఖ్యంగా 1996 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను పదునైన బౌలింగ్‌తో (4/36) జట్టును గెలిపించి ఫైనల్ చేర్చాడు. అయితే వార్న్ చిరస్మరణీయ ప్రదర్శన 1999 ప్రపంచకప్‌లో వచ్చింది. ఈ టోర్నీ ఫైనల్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (4/33)గా నిలిచిన వార్న్... అంతకంటే అద్భుత బౌలింగ్‌ను అంతకుముందు సెమీస్‌లో నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాతో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ ’ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే మ్యాచ్’లో కిర్‌స్టెన్, గిబ్స్, క్రానే, కలిస్ వికెట్లతో వార్న్ పండగ చేసుకున్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వివాదాలతో సహవాసం... షేన్ వార్న్ అద్భుత కెరీర్లో మరో పార్శ్వంలో పలు వివాదాలు కనిపిస్తాయి. పిచ్ వివరాలను అందించి బుకీ నుంచి డబ్బులు తీసుకోవడం, రణతుంగపై తీవ్ర వ్యాఖ్యలు చేసి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే అతని కెరీర్లో పెద్ద దెబ్బ 2003 ప్రపంచకప్‌కు ముందు తగిలింది. నిషేధిత ఉత్ప్రేరకం డ్యురెటిక్ను తీసుకున్న అతను డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. దాంతో ఏడాది పాటు సస్పెండ్‌కు గురై వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తప్పుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాష్ లీగ్‌లో కూడా సామ్యూల్స్తో గొడవ పడి మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే అన్నింటికి మించి అతని వ్యక్తిగత జీవితంలో అమ్మాయిల వ్యవహారాలకు సంబంధించే పలు వివాదాలు ఉన్నాయి. వేర్వేరు మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు పంపడం, అసభ్యకర చిత్రాలతో కనిపించడం వంటివి చెడ్డపేరు తేవడంతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా నష్టపరిచాయి. పదేళ్ల వివాహం బంధం తర్వాత తన భార్య సిమోన్‌తో 2005లోనే విడిపోయిన వార్న్... బ్రిటిష్ నటి ఎలిజబెత్ హర్లీతో పెళ్లికి ప్రయత్నించినా చివరకు అది సాధ్యం కాలేదు. గొప్ప నాయకత్వ లక్షణాలతో కెప్టెన్సీకి సరిగ్గా సరిపోయే అర్హతలున్నా ఆస్ట్రేలియాకు టెస్టు సారథిగా వ్యవహరించే అవకాశం అతనికి ఈ కారణాల వల్లే ఎప్పటికీ రాలేదు. ఐపీఎల్ తొలి విజేతగా... రిటైర్మెంట్ తర్వాత కూడా షేన్ వార్న్ విలువ తగ్గలేదు. అందుకే 2008లో జరిగిన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ అతడిని కెప్టెన్‌గా ఎంచుకుంది. పెద్దగా పేరు లేని కుర్రాళ్లు, అనామక ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు తొలి టైటిల్ సాధించిందంటే అది పూర్తిగా వార్న్ చలవే. తన అంతర్జాతీయ అనుభవాన్నంతా రంగరించి అతను యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ప్రతీ దశలోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ విజయం దిశగా నడిపించడం విశేషం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) షేన్ వార్న్ కెరీర్ గ్రాఫ్ టెస్టులు 145 వికెట్లు 708 ఉత్తమ బౌలింగ్ 8/71 ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 37 సార్లు మ్యాచ్‌లో 10 వికెట్లు 10 సార్లు చేసిన పరుగులు 3,154 అత్యధిక స్కోరు 99 వన్డేలు 194 వికెట్లు 293 ఉత్తమ బౌలింగ్ 5/33 చేసిన పరుగులు 1,018 అత్యధిక స్కోరు 55 708 టెస్టుల్లో షేన్‌వార్న్ వికెట్ల సంఖ్య. మురళీధరన్ (800) తర్వాత రెండో స్థానం. 96 2005లో వార్న్ తీసిన వికెట్ల సంఖ్య. ఒక ఏడాదిలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు 3154 టెస్టుల్లో వార్న్ పరుగులు. కెరీర్లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు -
క్రికెట్ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్ షేన్ వార్న్
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఎందరో ఉంటారు.. కానీ తమ ఆటతో ప్రత్యర్థులనే ఓ ఆటాడించి, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని లెజెండ్‌గా మారేది మాత్రం కొందరే. అటువంటి దిగ్గజ ఆటగాళ్లలో ఆస్ట్రేలియా స్పిన్నింగ్ దిగ్గజం షేన్ వార్న్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వార్న్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాయిలు అధిగమించాడు. అలానే చెరిగిపోని రికార్డులు మరెన్నో తన పేరుమీద లిఖించుకున్నాడు. ఇలాంటివి బోలెడు ఉన్నా షేన్ వార్న్‌కి క్రికెట్ కెరీర్లో మర్చిపోలేని రోజు ఏదైనా ఉందంటే 2006 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 700వ వికెట్ సాధించడమనే చెప్పాలి. విక్టోరియన్ గ్రౌండ్లో 89,155 మంది ప్రేక్షకుల మధ్య ఇంగ్లాండ్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ వికెట్ తీసి అంతవరకు ఎవరికీ సాధ్యపడని ఘనతను సాధించి చూపాడు. ఆ వికెట్‌తో ప్రపంచ క్రికెట్ చరిత్రోలో 700 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా ఈ మైలురాయిని చేరుకున్నాడు. అనంతరం అదే మ్యాచ్‌లో వార్న్ నలుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్‌కు తన టెస్ట్ కెరీర్లో ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా 37వ చివరి ఐదు వికెట్ల హాల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
దక్షిణాఫ్రికాకు వెళ్లలేం...
మెల్బోర్న్: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడాల్సిన ఆస్ట్రేలియా జట్టు ఆ పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకుంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి తేదీలు కూడా ప్రకటించకపోవడంతో ఈ టెస్టు సిరీస్ దాదాపుగా రద్దయినట్లే. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ టూర్ కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించిన కంగారూ టీమ్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదే కారణమా... అయితే ఆసీస్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన రద్దు విషయంలో కరోనాకంటే కూడా ఇతర విషయాలు కారణమని వినిపిస్తోంది. భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి ఆ జట్టు కోలుకోలేదు. పైగా ఆటగాళ్లకు, కోచ్ లాంగర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ప్రస్తుత స్థితిలో రబడ, నోర్జే, ఇన్గిడిలాంటి బౌలర్లను ఎదుర్కొని అక్కడ గెలవడం సులువు కాదు. మరొక్క సిరీస్ ఓడినా టీమ్ మేనేజ్మెంట్లో సమూల మార్పులు ఖాయమనే భావన అందరిలో ఉండటమే వెళ్లకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కరోనా కాలంలోనూ ఇటీవల దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆతిథ్య మిచ్చింది. ఇరు జట్ల మధ్య బయో బబుల్‌లో రెండు టెస్టులు జరిగాయి. అవే ఏర్పాట్లు ఇప్పుడు చేయడం కూడా కష్టం కాదు. మరో వైపు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పర్యటన కూడా సాఫీగా కొనసాగుతోంది. పాపం ఆసీస్! ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలకు భారత్‌తో సిరీస్ సందర్భంగా దెబ్బ పడింది. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానాతో పాటు ఐసీసీ నాలుగు పాయింట్ల కోత కూడా విధించింది. అది జరగకపోయి ఉంటే ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌తో సమంగా 70 పాయింట్ల శాతంతో ఉండేది. అప్పుడు ఒక్కో వికెట్‌కు చేసిన పరుగులు, ఇచ్చిన పరుగుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. ఈ అంశంలో కివీస్ (1.28) కంటే మెరుగ్గా ఉన్న ఆసీస్ (1.39)కు మంచి అవకాశం ఉండేది. -
సిడ్నీ టెస్టుకు డేవిడ్ వార్నర్ రెడీ
పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బందులు పడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు కాస్త ఊరట! గజ్జల్లో గాయంతో ఆటకు దూరమైన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా కోలుకొని అందుబాటులోకి వచ్చాడు. మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. అతనితో పాటు విల్ పకోవ్‌స్కీ, సీన్ అబాట్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరంతా గురువారం సాయంత్రం ఆసీస్ జట్టుతో చేరి సిడ్నీ టెస్టు కోసం ప్రాక్టీస్ మొదలు పెడతారు. తొలి రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైన ఓపెనర్ జో బర్న్స్‌పై వేటు పడింది. మూడో టెస్టు వేదికగా సిడ్నీ ఖరారు అయినా... సిడ్నీలో ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షల కారణంగా భారత్, ఆసీస్ జట్లు వెంటనే అక్కడికి వెళ్లడం లేదు. జనవరి 4 వరకు ఆటగాళ్లంతా మెల్బోర్న్లో ఉండి ప్రాక్టీస్ కొనసాగిస్తారని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ వెల్లడించారు. -
గెలుపు ‘గులాబీ’ బాట కాదు
రెండేళ్ల క్రితం భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటించినప్పుడే ఇదే అడిలైడ్ మైదానంలో తొలి టెస్టును ‘డే అండ్ నైట్’గా ఆడదామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన ప్రతిపాదనను బీసీసీఐ మరో మాటకు తావు లేకుండా తిరస్కరించింది. అప్పటికే ఆస్ట్రేలియాకు నాలుగు ‘పింక్ బాల్’ టెస్టులు ఆడిన అనుభవం ఉండగా... భారత్ ఒక్క ‘పింక్’ మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో తమ సిరీస్ గెలుపు అవకాశాలు దెబ్బ తింటాయని భారత బోర్డు భావించింది. ఇప్పుడు కూడా దాదాపు పరిస్థితి అలాగే ఉంది. ఓవరాల్‌గా ఆసీస్ జట్టు 7 డే–నైట్ టెస్టులు స్వదేశంలోనే ఆడి అన్నీ గెలవగా... భారత్ తమ ఒకే ఒక మ్యాచ్‌ను సొంతగడ్డపై బలహీనమైన బంగ్లాదేశ్‌తో ఆడి మమ అనిపించుకుంది. ఈసారి మాత్రం డే–నైట్ సవాల్‌కు టీమిండియా ‘సై’ అంది. అయితే తొలి టెస్టులో భారత జట్టుకు ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి... నిజంగానే పింక్ బంతితో టెస్టు ఆడటం అంత కష్టమా! సాక్షి క్రీడా విభాగం: 2015లో నవంబర్ 27–డిసెంబర్ 1 మధ్య ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లోనే తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగింది. ఆ తర్వాత ఇదే వేదికపై ఆ్రస్టేలియా జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్లను ఓడించింది. మరో రెండు టెస్టులు బ్రిస్బేన్‌లో, ఒక టెస్టు పెర్త్‌లో ఆడిన ఆ్రస్టేలియా అవి కూడా గెలిచి తమ ‘పింక్ బాల్’ రికార్డును 7–0గా మెరుగుపర్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో భారత్ తమ ఏకైక టెస్టు ఆడి ఇన్నింగ్స్ విజయం అందుకుంది. ఇప్పుడు మరోసారి తమకు అచ్చొచ్చిన వేదిక అడిలైడ్‌లో ఆ్రస్టేలియా టీమ్ పర్యాటక జట్టు కోసం సిద్ధంగా ఉంది. బంతి మారింది భారత జట్టు తమ టెస్టును ‘ఎస్జీ’ బంతితో ఆడింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘కూకాబుర్రా’ బంతిని వాడతారు. భారత జట్టు గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఇదే తరహా బంతిని ఎదుర్కోవడం సానుకూలాంశం. సాధారణ ఎరుపు బంతితో పోలిస్తే కూకాబుర్రా గులాబీ బంతి సాయంత్రం కాగానే భిన్నంగా స్పందిస్తోంది. ఒక్కసారిగా బంతి వేగం పెరిగిపోతోంది. గాల్లో స్వింగ్ కావడంతో పాటు పిచ్‌పై పడిన తర్వాత కూడా ఈ తేడా కనిపిస్తోంది. దీనిని మన బ్యాట్స్‌మన్ గుర్తించి అందుకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని డేవిడ్ వార్నర్‌కు డే అండ్ నైట్ టెస్టుల్లో మంచి అనుభవం ఉంది. ‘ట్రిపుల్ సెంచరీ’ సహా గులాబీ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన వార్నర్ చెప్పినట్లుగా... పింక్ బాల్‌ను ఎదుర్కొనే విషయంలో కొంత సమయం ఇబ్బంది పడ్డా దానిని సానుకూలంగా కూడా మార్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. దానిని సరిగ్గా అంచనా వేయగలిగితే పరుగుల వరద పారుతుంది. పేస్ పదును... ఆ్రస్టేలియాతో పోలిస్తే భారత పేస్ బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తున్నా ప్రత్యేకంగా డే–నైట్ టెస్టుల అనుభవం విషయంలో ప్రత్యర్థి జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. 7 ‘పింక్’ టెస్టులూ ఆడిన స్టార్క్ 42 వికెట్లు తీస్తే 6 మ్యాచ్‌లలో హాజల్‌వుడ్ 28, కమిన్స్ 4 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ త్రయం భారత బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు సిద్ధంగా ఉంది. అయితే అడిలైడ్‌లో పడిన మొత్తం వికెట్లలో పేస్ బౌలర్లే 101 తీయడం మన జట్టులో కూడా ఆశలు రేపుతోంది. కానీ స్పిన్ విభాగంలో మాత్రం ఆ్రస్టేలియా బౌలర్ నాథన్ లయన్ మినహా విదేశీ స్పిన్నర్లు ఎవ్వరూ కూడా ఇక్కడ రాణించలేదు. లయన్ ఒక్కడే 18 వికెట్లు తీయగా... ఇతర బౌలర్లెవరూ రెండు వికెట్లకు మించి తీయలేదు. కాబట్టి లయన్ నుంచి కూడా భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. టీమిండియా తుది జట్టులో అశ్విన్, కుల్దీప్లలో ఎవరికి చోటిస్తుందో చెప్పలేం. విదేశీ జట్ల పేలవ ప్రదర్శన రికార్డు చూస్తే ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి ఇబ్బంది పెట్టలేకపోయింది. కంగారూలు రెండు మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, ఒక మ్యాచ్‌లో 296 పరుగులతో నెగ్గారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్‌కు 30 పరుగులకు మించి లేదు. ఒకసారి దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్‌లలోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే–నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్‌లో శుభారంభం చేయాల్సి ఉంది. ఆ 40–50 నిమిషాలే కీలకం! సహజ వెలుతురు నుంచి లైట్ల వెలుగులోకి... వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడం... గాలి వేగంలో మార్పు... పూర్తిగా చీకటి కమ్ముకోవడానికి కాస్త ముందు సూర్యాస్తమయ సమయంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. పింక్ టెస్టులో ఇదే సమయం కీలకంగా మారిపోతోంది. రెండో సెషన్ చివర్లో కొద్దిసేపు, మూడో సెషన్ ఆరంభంలో మరికొంత సేపు ఉండే ఈ సమయంలోనే బ్యాట్స్‌మన్ ఏకాగ్రత చెదరడం, ప్రత్యర్థి జట్టు వికెట్ల వేటలో పడటం కనిపిస్తున్నాయి. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడు. ‘ఆ 40–50 నిమిషాల సమయంలోనే ఎంతో ఓపిక అవసరం. అప్పుడు బాగా ఆడగలిగితే ఆ తర్వాత తిరుగుండదు. కాబట్టి కొత్త ఆటగాడు వచ్చి ఇబ్బంది పడటంకంటే అప్పటికే క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పట్టుదల కనబరిస్తే మంచిది’ అని రహానే అభిప్రాయపడ్డాడు. -
‘టెస్టు మ్యాచ్‌లు ఆడటం ఇక అనుమానమే’
డెర్బీ: ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో ఆడేది అనుమానమేనని వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. దాదాపుగా తన టెస్టు కెరీర్ ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు. 3 వన్డేలు, 3టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఫించ్... కెరీర్ ముగిసేలోగా చివరగా ఒక టెస్టు మ్యాచ్ ఆడాలని ఉందంటూ తన ఆసక్తిని బయట పెట్టాడు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ తనకు చివరి సిరీస్ అవుతుందని చెప్పాడు. ‘నేనింకా టెస్టులు ఆడే అవకాశం ఉందని అనుకోవట్లేదు. ఎరుపు బంతితో ఆడతానని చెప్తే అది అబద్ధమే అవుతుంది. టెస్టు జట్టులో చోటు కోసం ఇప్పట్లో నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడలేను. మరోవైపు యువకులు దూసుకొస్తున్నారు. టాపార్డర్‌లో ఇమిడిపోయే యువకులే అధికంగా వెలుగులోకి వస్తున్నారు’ అని ఫించ్ చెప్పాడు. ఇప్పటివరకు కేవలం 5 టెస్టుల్లోనే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన 33 ఏళ్ల ఫించ్... 126 వన్డేలు, 61 టి20లు ఆడాడు. (చదవండి: ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్) -
ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన భారత్
బ్రెడా (నెదర్లాండ్స్): చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జోరుకు బ్రేక్ పడింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–3 గోల్స్ తేడాతో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. అయితే ఆసీస్ పైచేయి సాధించడంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి తప్పలేదు. టీమిండియా తరఫున వరుణ్ కుమార్ (10వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (58వ ని.) చెరో గోల్ చేశారు. ఆస్ట్రేలియా జట్టులో లచ్లాన్ షార్ప్ (6వ ని.), టామ్ క్రెయిగ్ (15వ ని.), ట్రెంట్ మిటన్ (33వ ని.) తలా ఒక గోల్ చేశారు. నేడు జరిగే పోరులో బెల్జియంతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌ను రాత్రి గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
ఆస్ట్రేలియా జట్టు: మరింతమందిపై వేటు..!
సిడ్నీ, ఆస్ట్రేలియా : దక్షిణాఫ్రికా పర్యటన డిజాస్టర్‌గా మారిన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని మరింత మందిపై వేటు పడాలని, ముఖ్యంగా దేశ క్రికెట్ అధినాయకత్వం ఇందుకు బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ జట్టు 3-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో టెస్టులో 492 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చిత్తయింది. 1960 దశకం తర్వాత సఫారీ జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఉదంతం వెలుగుచూడటం, ఈ వివాదంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం జట్టు కోచ్ డారెన్ లీమన్ కూడా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా క్రికెట్లో ఈ సంక్షోభం ఇద్దరు లేదా ముగ్గురు దిగిపోవడం వల్ల సమసిపోదని పెద్దస్థాయిలోని వ్యక్తులు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిందేనని వార్న్ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా జట్టు మరోసారి ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సరైన వ్యక్తులు రంగంలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పుడు కొత్తవారికి ఆటతోపాటు క్రికెట్ నాయకత్వంలోనూ అవకాశాలు ఉన్నాయి. (బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో) అన్ని హోదాల్లో ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు. పెద్ద తలకాయలు దిగిపోవాల్సింది’ అని షేన్ వార్న్ విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్, టీమ్ మేనేజర్ ప్యాట్ హోవార్డ్ తమ పదవుల నుంచి దిగిపోవాల్సిందేనని పరోక్షంగా వార్న్ పేర్కొన్నట్టు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. కోచ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్‌లు కూడా బాధ్యత వహించాలని, ఇంకెప్పుడు ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను జట్టుకు అందిస్తారని ప్రశ్నించారు. -
స్పీకర్‌ను కలసిన ‘ఆస్ట్రేలియా’ బృందం
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా–తెలంగాణ పార్లమెంట్ సంబంధాల అధ్యయన యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రతినిధుల బృందం శాసనసభా స్పీకర్ మధుసూదనాచారిని కలిసింది. శుక్రవారం స్పీకర్ చాంబర్లో ఆస్ట్రేలియా ఎంపీ ఆంథోని అల్బెన్స్ నేతృత్వంలోని బృందం ఆయనను కలసి వివిధ అంశాలపై చర్చించింది. చట్టసభల కార్యకలాపాల గురించి ఆ బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం ప్రతినిధుల బృందాన్ని స్పీకర్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు సత్కరించారు. -
ఫాల్క్‌నర్‌కు చోటు
మెల్బోర్న్: వచ్చే నెలలో భారత్‌తో జరిగే ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. పేస్ ద్వయం జేమ్స్ ఫాల్క్‌నర్, నాథన్ కౌల్టర్ నైల్ తిరిగి జట్టులోకి వచ్చారు. మరో పేసర్ మిషెల్ స్టార్క్ గాయం కారణంగా దూరమయ్యాడు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 13 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు జట్లకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఇండోర్, కోల్‌కతాలో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక హైదరాబాద్, రాంచీ, గువాహటిలో మూడు టి20లు నిర్వహిస్తారు. -
ఆ పిచ్ చూస్తే.. వణికిపోతారు
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మధ్య జరిగే చిట్టచివరి, నాలుగో టెస్టు గురించి ఆస్ట్రేలియా చాలా ఆశాభావంతో ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో రెండు జట్లు తలో విజయం సాధించగా, మూడో టెస్టు డ్రా అయింది. ఇప్పుడు నాలుగో టెస్టు వేదిక అయిన ధర్మశాల పిచ్ గురించి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ మంచి ఆశాభావంతో ఉన్నాడు. ఇక్కడ పేస్‌బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌ను చూస్తే భారత జట్టు వణికిపోతుందని వ్యాఖ్యానించాడు. ''ధర్మశాల చాలా అద్భుతమైన గ్రౌండ్. చాలా తక్కువసార్లు మాత్రమే పిచ్ మీద గడ్డి కనిపిస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియన్లు మంచి విశ్వాసంతో ఉంటే, టీమిండియా మాత్రం వణుకుతోంది. ఈ సిరీస్‌లో వాళ్లు అతి విశ్వాసంతో ఉన్నట్లున్నారు. వాళ్ల స్కోర్‌లైన్ దాన్ని చూపిస్తోంది'' అని జాన్సన్ అన్నాడు. జాక్సన్ బర్డ్‌కు బదులు ఇలాంటి పిచ్ మీద పుణె టెస్టు హీరో స్టీవ్ ఓకీఫ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపాడు. నాలుగో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొత్తమ్మీద స్పిన్నర్లు మంచి పెర్ఫామెన్స్ చూపించారని, ఇంతకుముందు వాళ్లను జట్టులో ఉంచుతారా లేదా అన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు తమ ప్రదర్శనతో ఎలాంటి పిచ్‌ల మీదైనా ఫలితాలు సాధించగలమని చూపించుకున్నారని జాన్సన్ చెప్పాడు. నాథన్ లయన్‌కు ఈసారి మంచి బౌన్స్ వస్తుందని, అతడు బాల్‌ను చాలా బాగా టర్న్ చేస్తున్నాడని అన్నాడు. అయితే.. రైట్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త పడాల్సిందేనని తెలిపాడు. ధర్మశాల లాంటి పిచ్‌ల మీద బర్డ్ బాగా ఉపయోగపడతాడని చెప్పాడు. -
ఆసీస్ క్రికెటర్లు భారత్‌పై నోరు పారేసుకుంటే..!
న్యూఢిల్లీ: తాజాగా జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు పుజారా. వచ్చే ఫిబ్రవరి నుంచి 13 టెస్టులకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. ఆసీస్ ఆటగాళ్లు తమపై నోరు పారేసుకుంటే (స్లెడ్జింగ్ చేసినా) ఏం చేయాలన్న ప్లాన్స్ టీమిండియాకు ఉన్నాయని పుజారా తెలిపాడు. గతంలో ఆసీస్ గడ్డపై వారు స్లెడ్జింగ్ చేశారని, ఇప్పుడు భారత్‌లో అలాంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయన్నాడు. వాళ్లు స్లెడ్జింగ్ చేస్తే.. మేము కూడా మా శైలిలో అదే దూకుడు ప్రదర్శించి, ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పాడు. భారత్ 120 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆసీస్ 109 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. 'కేవలం మూడో స్థానానికి తాను పరిమితం కాదని, డొమెస్టిక్ క్రికెట్లో ఈ స్థానంలో ఎన్నో విలువైన పరుగులు సాధించాను. కోచ్ అనిల్ కుంబ్లే కమిట్ మెంట్, క్రమశిక్షణతో టెస్టుల్లో అగ్రస్థానాన్ని సాధించాం. దాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. పాజిటీవ్ ధృక్పథంతో ఉండి స్టైక్ రేట్‌ను పెంచుకోవడంపై దృష్టిపెడతాం. దీంతో ఆసీస్ బౌలర్లు కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి చూస్తారు. మా పని సులువు అవుతుంది' అని పుజారా వివరించాడు. బౌలర్లు రాణించడంతో పాటు లోయర్ మిడిలార్డర్ గతంలో లాగానే మరిన్ని పరుగులు జతచేస్తే ఆసీస్ పై విజయం నల్లేరుపై నడకేనని పుజారా అభిప్రాయపడ్డాడు. -
అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ఆస్ట్రేలియా టీం
రియో డీ జెనీరో: ఒలంపిక్స్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ చేరుకున్న ఆస్ట్రేలియా అథ్లెట్ల బృందం అగ్నిప్రమాదం నుంచి బయటపడింది. రియో 2016 ఒలంపిక్ విలేజ్‌లో అస్ట్రేలియా అథ్లెట్లు ఉన్న అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అపార్ట్మెంట్లో పొగలు వ్యాపించడంతో.. అథ్లెట్లను అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారని ఆస్ట్రేలియా జట్టు స్పోక్స్ పర్సన్ మైక్ టాంక్రెడ్ వెల్లడించారు. ఫైర్ అలారం మోగటంతో ఆటగాళ్లను అపార్ట్మెంట్ నుంచి బయటకు పంపినట్లు జిన్హువా మీడియా సంస్థ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆటగాళ్లు తిరిగి అపార్ట్మెంట్లోకి వెళ్లారు. బిల్డింగ్ బేస్‌మేట్ ప్రాంతంలో మంటలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. -
స్పిన్నర్ లియోన్‌కు పిలుపు
► చివరి రెండు వన్డేలకు ఆసీస్ జట్టు ► టి20లకు టెయిట్, వాట్సన్ మెల్బోర్న్: భారత్‌తో మిగిలిన రెండు వన్డేలు ఆడే ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కింది. పేసర్ పారిస్ స్థానంలో లియోన్ 13 మంది సభ్యుల జట్టులోకి వచ్చాడు. 2014లో చివరిసారి వన్డే ఆడిన లియోన్... ప్రస్తుత సీజన్ బిగ్‌బాష్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. 20, 23 తేదీల్లో చివరి రెండు వన్డేలు జరుగుతాయి. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన షేన్ వాట్సన్‌తో పాటు షాన్ టెయిట్ కూడా ఆస్ట్రేలియా టి20 జట్టులోకి ఎంపికయ్యారు. భారత్‌తో సిరీస్‌కు అనేక మంది కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్లు బెయిలీ, మిషెల్ మార్ష్‌లను ఎంపిక చేయలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఏకంగా 17 మందితో జట్టును ప్రకటించడం విశేషం. ఆస్ట్రేలియా టి20 జట్టు: ఫించ్ (కెప్టెన్), బోలాండ్, బోయ్స్, ఫాల్క్‌నర్, హేస్టింగ్స్, హెడ్, నాథన్ లియోన్, క్రిస్ లిన్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, షాన్ టెయిట్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్. -
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో బ్రియాన్ లారా (11,953 పరుగులు) తర్వాత చందర్‌పాల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరో 87 పరుగులు చేస్తే చందర్‌పాల్ టాప్ స్కోరర్ ఘనతను సాధిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చందర్‌పాల్ సగటు 15.33 మాత్రమే ఉండటంతో సెలక్టర్లు అతని ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆసీస్‌తో ఒక్క సిరీస్‌కు అవకాశం ఇస్తే బాగుండేదని చందర్‌పాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. 1994లో జాతీయ జట్టులోకి వచ్చిన చందర్‌పాల్ ఇప్పటివరకు 164 టెస్టులు ఆడి 51.37 సగటుతో 11,867 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. సెలక్టర్ల తాజా నిర్ణయంతో చందర్‌పాల్ టెస్టు కెరీర్ ముగిసినట్టేనని భావించాలి. -
మార్ష్ స్థానంలో బర్న్స్
‘బాక్సింగ్ డే’ టెస్టుకు ఆసీస్ జట్టు బ్రిస్బేన్: ఊహించని విధంగా క్వీన్స్లాండ్ బ్యాట్స్‌మన్ జో బర్న్స్‌కు ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. భారత్‌తో జరగబోయే మూడో టెస్టు (బాక్సింగ్ డే) కోసం ఎంపిక చేసిన 13 మందిలో అతనికి స్థానం కల్పించారు. గాయపడిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో జో బర్న్స్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది షీఫీల్డ్ షీల్డ్ టోర్నీలో బర్న్స్ 55 సగటుతో 439 పరుగులు చేయడం అతనికి కలిసొచ్చింది. ఈ క్వీన్స్‌లాండర్ ఫస్ట్‌క్లాస్ స్థాయిలో 42.54 సగటుతో 2978 పరుగులు సాధించాడు. క్రిస్మస్ పండుగ వేళ తనకు ఊహించని అవకాశం దక్కిందని బర్న్స్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు వివరాలు: స్మిత్ (కెప్టెన్), వార్నర్, రోజర్స్, వాట్సన్, షాన్ మార్ష్, జో బర్న్స్, హాడిన్, జాన్సన్, స్టార్క్, లయోన్, హాజల్‌వుడ్, హారిస్, సిడిల్. -
ఇక నేను ఆడలేనేమో: క్లార్క్
గాయం కారణంగా సిరీస్‌కు దూరం అడిలైడ్: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరమయ్యాడు. తొలి టెస్టు చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కుడి మోకాలి కండరాలు పట్టేయడంతో క్లార్క్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన కుడి కండర ంలో చీలిక వచ్చినట్టు తేలింది. ఆ తర్వాత మైదానంలో కనిపించినప్పటికీ కుంటుతూనే నడిచాడు. దీంతో మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. క్లార్క్ స్థానంలో నాయకత్వ బాధ్యతలను వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్‌కు అప్పగించే అవకాశం ఉంది. రెండో టెస్టుకు మార్ష్: క్లార్క్ సిరీస్‌కు దూరం కావడంతో రెండో టెస్టుకు షాన్ మార్ష్ జట్టులోకి రానున్నాడు. ఈనెల 17 నుంచి బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. మార్ష్‌తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్‌ను కూడా ఎంపిక చేశారు. ‘వైద్య నిపుణులు నా గాయానికి సంబంధించిన స్కాన్లను పరిశీలిస్తున్నారు. ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటానో నాకు తెలీదు. వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాను. మా తొలి ప్రాక్టీస్ గేమ్‌కు ఇంకా ఎనిమిది వారాల సమయం ఉంది. ముక్కోణపు సిరీస్‌లో ఆడాలని ఆశిస్తున్నాను. కానీ ఇక ముందు ఎప్పటికీ ఆడలేనేమో.. అలా జరక్కూడదనే అనుకుంటున్నాను. నా శక్తిమేరా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. అలా అని వాస్తవ పరిస్థితిని విస్మరించలేం కదా. ఆసీస్ తరఫున ఒక్క మ్యాచ్‌కు దూరమైనా అది నా హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఇంకా నాలో క్రికెట్ మిగిలే ఉంది. ఇక భారత్‌పై తొలి టెస్టు విజ యం మాకు చాలా ‘ప్రత్యేకమైంది’. మా కెరీర్ మొత్తం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది. నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన టెస్టు ఇది’ - మైకేల్ క్లార్క్ (ఆసీస్ కెప్టెన్) -
ఇక ఆటపై దృష్టి: హాడిన్
వరుసగా రెండో రోజు ఆసీస్ జట్టు ప్రాక్టీస్ జట్టుతో కలిసిన క్లార్క్ అడిలైడ్: గత రెండు వారాలుగా భావోద్వేగ పరిస్థితుల తర్వాత మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. ఎక్కువగా ఆలోచించి సమస్యలను జటిలం చేసుకోదల్చుకోలేదన్నాడు. వరుసగా రెండో రోజు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఆసీస్ జట్టు నెట్స్‌లో బౌన్సర్లు వేయడం కాస్త తగ్గించింది. ‘ఇప్పుడే మళ్లీ క్రికెట్లోకి వచ్చాం. ప్రాక్టీస్ చేయాలని ఆటగాళ్లందరూ కోరుకున్నారు. రాబోయే రెండు రోజులు బాగా శ్రమిస్తాం. ఆదివారం మాకు అత్యంత కీలకమైన రోజు’ అని హాడిన్ పేర్కొన్నాడు. శుక్రవారం సిడ్నీలో ఉన్న కెప్టెన్ క్లార్క్... శనివారం జట్టుతో పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతని ఫిట్‌నెస్‌పై మాత్రం సందేహాలు వీడటం లేదు. మరోవైపు తొలి టెస్టుకు తాను సారథ్యం వహించడంపై ఆలోచించడం లేదని హాడిన్ వెల్లడించాడు. ‘మధ్యాహ్నం క్లార్క్ ప్రాక్టీస్‌కు వచ్చాడు. సెషన్లో బాగా ఆడాడు. కాబట్టి నాకు కెప్టెన్సీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. సుదీర్ఘకాలంగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన కెప్టెన్ కూడా. తొలి టెస్టులో తొలి గంట క్లార్క్ కెప్టెన్‌గా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని హాడిన్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టు అడిలైడ్‌లో ఆడటంపై మాట్లాడుతూ... ‘వేదిక మారినప్పుడు ప్రణాళికలు కూడా మారుతాయి. ఈ పిచ్ కూడా బాగుంది. వేదిక గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని నా భావన. పరిస్థితులు ఎలా ఉన్నా ఆడటం మన బాధ్యత కాబట్టి. దాన్ని సమర్థంగా నిర్వహించాలి. మా తరహా క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. బౌన్సర్లు వేయాలా? వద్దా? అనేది క్లిష్టమైన అంశం. అయితే మాపై ఒత్తిడి ఉన్నా ప్రణాళిలకను మాత్రం అమలు చేస్తాం. మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను చూపిస్తాం’ అని వైస్ కెప్టెన్ వివరించాడు. క్లార్క్‌కు మినహాయింపు తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడే అంశంలో క్లార్క్‌కు మినహాయింపు ఇచ్చారు. హ్యూస్ మృతితో కాస్త ఒత్తిడిలో ఉన్న అతను తొలి టెస్టులో ఆడతాడో లేదోనన్న సందిగ్ధం కూడా నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. టెస్టుకు ముందు రోజు కెప్టెన్లు మీడియాతో మాట్లాడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం క్లార్క్‌కు బదులుగా పేసర్ జాన్సన్ మాట్లాడతాడు. ఆసీస్ జట్టు జెర్సీపై ‘408’ ఇటీవల మృతి చెందిన హ్యూస్కు నివాళిగా... భారత్‌తో జరిగే తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ జెర్సీపై ‘408’ నంబర్‌ను ధరించనున్నారు. తమ సహచరుడి జ్ఞాపకాలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో హ్యూస్ 408 ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. సాధారణంగా ప్రతి టెస్టు ఆటగాడికి వాళ్లు ధరించే జెర్సీపై వ్యక్తిగత నంబర్ ఉంటుంది. కానీ మంగళవారం మొదలయ్యే తొలి టెస్టులో ప్రతి ఆసీస్ ప్లేయర్ హ్యూస్ టెస్టు క్యాప్ నంబర్‌ను ధరించనున్నారు. హ్యూస్ మృతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా అభిమానులు అతడిని గుర్తు చేసుకుంటూ తమ ఇంటి ముందు క్రికెట్ బ్యాట్లను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అయితే ఓ దొంగకు మాత్రం ఇదేమీ పట్టలేదు. ఒక ఇంటి ముందు ఉంచిన బ్యాట్‌ను ఎత్తుకుపోయాడు. ఇది సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. -
బ్రెజిల్లో అడుగుపెట్టిన ఆసీస్ జట్టు
‘ఫిఫా’ వరల్డ్‌కప్ కర్టిబా (బ్రెజిల్): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు బ్రెజిల్లో అడుగుపెట్టింది. టోర్నీ కోసం ఇక్కడికి వచ్చిన మొదటి జట్టు ఇదే. రాత్రి వేళలో విటోరియా విమానాశ్రయానికి చేరుకున్న జట్టును కటుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య టౌన్ సెంటర్ హోటల్‌కు తరలించారు. దాదాపు 100 మంది బ్రెజిల్ అభిమానులు... ఆటగాళ్లను చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అయితే ప్లేయర్లు విమానం నుంచి నేరుగా తమకు కేటాయించిన బస్‌లోకి వెళ్లడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. సూట్లో వచ్చిన ఆటగాళ్లను కొంత మంది తమ కెమెరాల్లో బంధించారు. వరుసగా మూడోసారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఆసీస్... గ్రూప్-బిలో స్పెయిన్, నెదర్లాండ్స్, చీలి జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 3న క్రొయేషియా, ఇరాన్ జట్లు ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి. అన్నింటికంటే చివరన జూన్ 11న దక్షిణ కొరియా, ఘనా, పోర్చుగల్ జట్లు ఇక్కడికి చేరుకుంటాయి. మరోవైపు ఆతిథ్య జట్టు బ్రెజిల్ సోమవారం నుంచి తమ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య పరీక్షల తర్వాత బుధవారం తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. -
ఆసీస్‌కు ఊరట
బంగ్లాదేశ్‌పై విజయం ఆతిథ్య జట్టుకు పూర్తి నిరాశ రాణించిన ఫించ్, వార్నర్ సాక్షి, ఢాకా: స్థాయికి తగ్గ ఆటతీరును క నబరచలేక అన్ని పెద్ద జట్ల చేతిలో ఓడి సెమీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా జట్టు... బలహీనమైన ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో ఊరట పొందింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహిస్తున్న బంగ్లాదేశ్... ఆట పరంగా మాత్రం పూర్తి నిరాశతోనే టోర్నీని ముగించింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు సాధించింది. షకీబ్ అల్ హసన్ (52 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (36 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్ రెండు, స్టార్క్, బొలింజర్, వాట్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు 17.3 ఓవర్లలో మూడు వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఫించ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), వార్నర్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... వైట్ (15 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), బెయిలీ (7 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్‌కు రెండు, తస్కిన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
‘పాంచ్’ పటాకా...
సిడ్నీ: ‘యాషెస్ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇద్దరు కెప్టెన్లు ఎవరో తెలుసా?’... ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టు సారథి మైకేల్ క్లార్క్‌కు ఎదురైన ప్రశ్న ఇది. అయితే దీనికి తడముకోకుండా వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, రికీ పాంటింగ్ అని ఠక్కున సమాధానమిచ్చాడు. కానీ మూడు రోజులు ముగిసేసరికి ఈ సంఖ్య ముగ్గురికి చేరుకుంది. ఇంగ్లండ్ చివరి బ్యాట్స్‌మన్ రాన్‌కిన్ క్యాచ్‌ను క్లార్క్ అద్భుతంగా అందుకోవడంతో ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (5-0) చేసింది. సూపర్ సారథిగా క్లార్క్ చరిత్రలో భాగమయ్యాడు. వెనువెంటనే ఆసీస్ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. బ్రిస్బేన్‌లో మొదలైన క్లార్క్ సేన జైత్రయాత్ర సిడ్నీలో దిగ్విజయంగా ముగించింది. కేవలం 21 రోజుల్లోనే సిరీస్‌ను స్వీప్ చేసింది. 2006-07లో పాంటింగ్ బృందానికి 22 రోజులు పట్టగా... 1920-21లో ఆర్మ్‌స్ట్రాంగ్ జట్టుకు 24 రోజుల సమయం అవసరమైంది. ఆసీస్ నిర్దేశించిన 484 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారం మూడో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 31.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో 200లోపు పరుగులకు అవుట్‌కావడం పర్యాటక జట్టుకు ఇది ఆరోసారి. కార్‌బెరీ (63 బంతుల్లో 43; 8 ఫోర్లు) టాప్ స్కోరర్. బ్రాడ్ (36 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టోక్స్ (16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 140/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 61.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. రోజర్స్ (119; 15 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీ సాధించాడు. బెయిలీ (74 బంతుల్లో 46; 6 ఫోర్లు), హాడిన్ (28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రోజర్స్, బెయిలీ ఐదో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. బోర్త్విక్ 3, అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. టప..టపా.. లంచ్ తర్వాత కొద్దిసేపటికి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ షరా మామూలుగానే సాగింది. ఆసీస్ బౌలింగ్‌కు ఎదురు నిలువలేక చకచకా వికెట్లు కోల్పోయింది. కార్‌బెరీ నిలబడే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్‌లో కుక్ (7), బెల్ (16), పీటర్సన్ (6) పూర్తిగా నిరాశపర్చారు. దీంతో టీ విరామానికి ఇంగ్లండ్ 87 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే టీ తర్వాత కంగారూలు మరోసారి అద్భుత బౌలింగ్, ఫీల్డింగ్‌తో చెలరేగారు. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలో కార్‌బెరీ, బాలెన్సీ (7), బెయిర్‌స్టో (0), బోర్త్విక్ (4)లను అవుట్ చేసి ఓటమి అంచుల్లోకి నెట్టారు. అయితే బ్రాడ్, స్టోక్స్ వేగంగా ఆడుతూ ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రాన్‌కిన్ (0) అవుట్ కావడంతో 166 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 52 నిమిషాల్లో కోల్పోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హారిస్ 5, జాన్సన్ 3, లియోన్ 2 వికెట్లు తీశారు. ఈ సిరీస్ మొత్తంలో జాన్సన్ 37 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్నాడు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 326; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 155; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 276 (రోజర్స్ 119, బెయిలీ 46, బోర్త్విక్ 3/33); ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 166 (కార్‌బెరీ 43, హారిస్ 5/25, మిచెల్ జాన్సన్ 3/40, లియోన్ 2/70). ఏం చేయాలో తెలుసు... ‘నా మీద ఇంగ్లండ్ బోర్డుకు నమ్మకం ఉంది. కెప్టెన్‌గా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి భవిష్యత్‌లో జట్టును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ఇందుకు సరైన వ్యక్తిని నేనే. ఓ ఆటగాడిగా నాకు చాలా అనుభవం ఉంది. గతంలో కూడా ఇలాంటి పరాజయాలు చవిచూశా. తర్వాత పట్టుదలతో ఆడి గాడిలో పడ్డాం. కాబట్టి ఈసారి ఏం చేయాలో కూడా తెలుసు. ప్రతి ఆటగాడు వ్యక్తిగతంగా తన టెక్నిక్ గురించి తెలుసుకోవాలి. అలా చేస్తే జట్టును పునర్ నిర్మించడం చాలా సులువు. జట్టులో సమతుల్యం ఉన్నా... సరైన సమయంలో వినియోగించుకోలేకపోయాం. ఈ పర్యటన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రాథమికాంశాలకు కట్టుబడాలన్న నిర్ణయానికి వచ్చాం. సిరీస్ ఫలితంపై కోపం, ఆవేశం వస్తున్నా నియంత్రించుకుంటున్నా.’ - కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్) మూడో ర్యాంక్‌లో ఆసీస్ దుబాయ్: యాషెస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంక్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఐదో ర్యాంక్‌తో సిరీస్‌ను మొదలుపెట్టిన క్లార్క్‌సేన తాజా ర్యాంకింగ్స్‌లో 10 రేటింగ్ పాయింట్లు సంపాదించి మూడో స్థానానికి (111) ఎగబాకింది. 9 రేటింగ్ పాయింట్లను కోల్పోయిన ఇంగ్లండ్ (107) నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. నిలకడగా రాణించాలి ‘ప్రపంచ క్రికెట్లో ఆసీస్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. కాబట్టి దక్షిణాఫ్రికా టూర్‌కు మేం సిద్ధం. మా బౌలింగ్ రుచి వాళ్లకు చూపిస్తాం. విదేశాల్లో ఆడుతూ సరైన ఫలితాలు రాబట్టడం కష్టంతో కూడుకున్నది. అయితే మేం విజయవంతం అవుతామనే భావిస్తున్నా. ఒక్క సిరీస్‌తో సరిపెట్టుకోకుండా సుదీర్ఘ కాలం ఇంటా, బయటా నిలకడగా రాణించాలి. గతేడాదితో పోలిస్తే ఈసారి మా ప్రదర్శన బాగుంది. గతంలో యాషెస్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్లకంటే మేం మరింత మెరుగ్గా ఆడాం. అయితే అప్పటి సమయం, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ జట్టు కెప్టెన్‌గా నాకు ఇది చాలా ప్రత్యేకమైంది’. -క్లార్క్ (ఆసీస్ కెప్టెన్) -
స్మిత్ సెంచరీతో ఆసీస్‌కు ఊరట, స్కోరు: 326/6
పెర్త్ : తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా, మూడో టెస్ట్ లోనూ తన లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ కు మధ్య శుక్రవారం జరిగిన మూడో టెస్ట్ తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అధ్బుతమైన ప్రదర్శనతో దూకుడుగా ఆడి 191 బంతుల్లో 13ఫోర్లు, 2 సిక్స్ లతో 103 పరుగులు చేశాడు. అప్పటికే కష్టాలో పడిన ఆసీస్ స్మిత్ దూకుడుతో తిరిగి పుంజుకుంది. ఆసీస్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోజర్స్ 11 పరుగులకే చేతులెత్తెయడంతో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ 60 పరుగులు చేయడంతో ఆసీస్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఇంతలో స్వాన్ విసిరిన బంతిలో కార్ బెర్రీ క్యాచ్ పట్టడంతో వార్నర్ కూడా పెవెలియన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన వాట్సన్(18), క్లార్క్(24), వీరి పేలవ ప్రదర్శనతో ఆసీస్ పీకల్లోతు కష్టాలో పడింది. దీంతో ఆసీస్ పని అయిపోయిందనకున్న తరుణంలో స్మిత్ రాకతో ఆసీస్ లో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపించింది. స్మిత్ వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీలను దాటించాడు. ఆసీస్ కెప్టెన్ బ్రాడ్ హద్దీన్(55) భాగస్వామ్యంతో స్మిత్ చెలరేగాడు. అండ్రసన్ క్యాచ్ తో హద్దీన్ కూడా వెనుతిరిగాడు. అప్పటికీ ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. కాగా, స్మిత్ 103, మిచ్చెల్ జాన్సన్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
భారతజట్టు వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ, భారత ఆటగాడు విరాట్ కోహ్లి రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ లో టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు. ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్‌లో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. భారత్ 120 రేటింగ్ తో మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు 114 రేటింగ్ తో రెండో ర్యాంక్ లో నిలిచింది. ఆ తరవాత స్థానాల్లో ఇంగ్లండ్(111), శ్రీలంక (111), దక్షిణాఫ్రికా (110), పాకిస్తాన్(100) వరుసగా నిలిచాయి. టాప్ 10 ప్లేయర్ ర్యాంకింగ్‌లో.. సెంచురియన్ లో భారత్ తో జరిగిన మూడో చివరి వన్డే సిరీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ నెంబర్ వన్ గా రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాకింగ్ బోర్డు పేర్కొంది. దీంతో వన్డేమ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసినా బ్యాట్స్ మెన్ గా డివిలియర్స్ ప్రసిద్ధికెక్కాడు. ఆ తరువాత భారత ఆటగాడు విరాట్ కోహ్లి రెండవ ర్యాంక్ లో నిలిచాడు. కెప్టెన్ ధోనీ ఆరో ర్యాంకు, శేఖర్ ధావన్ పదవ ర్యాంకులో నిలిచాడు. ఆ తరువాత రోహిత్ శర్మ 18వ ర్యాంకులో నిలిచాడు. టాప్ 10 బౌలర్ ర్యాంకింగ్‌లో... మొదటి ర్యాంకులో పాకిస్తాన్ స్పీన్ బౌలర్ సయిద్ అజ్మల్ కొనసాగుతున్నట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ తెలిపింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రెండవ ర్యాంక్ లో ఉన్నాడు. భారత్ బౌలర్ రవీంద్రా జడేజా టాప్ 10లో ఉండగా, ఆశ్విన్ 17వ ర్యాంకుతో టాప్ 20లో ఉన్నాడు. భారత్ ఈ సిరీస్ లలో 0-2 సిరీస్ లను రెండు రేటింగులు కోల్పోయి 120 రేటింగ్ పాయింట్స్ తో ముగిసింది. దక్షిణాఫ్రికా 5వస్థానంలో కొనసాగుతూ 110 రేటింగ్ పాయింట్స్ తో 3 పాయింట్స్ సొంతం చేసుకుంది. టాప్ 10 ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో... బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ ఆల్ హాసన్ మొదటి ర్యాంకులో ఉండగా, వాట్సన్ రెండవ ర్యాంకులో ఉన్నాడు. భారత ఆటగాడు రవీంద్రా జడేజా 5వ ర్యాంక్ లో నిలిచినట్టు రిలయన్స్ ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్ తన జాబితాలో వెల్లడించింది. -
ఇంగ్లండ్ లక్ష్యం 561
బ్రిస్బేన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముందు 561 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (154 బంతుల్లో 124; 13 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ మైకేల్ క్లార్క్ (130 బంతుల్లో 113; 9 ఫోర్లు; 1 సిక్స్) శతకాలతో హోరెత్తించడంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 7 వికెట్లకు 401 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వార్నర్‌కు ఇది తొలి యాషెస్ టెస్టు సెంచరీ కాగా ఓవరాల్‌గా మూడోది. అటు క్లార్క్ కెరీర్లో 25వ శతకాన్ని అందుకున్నాడు. వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ (55 బంతుల్లో 53; 5 ఫోర్లు), మిచెల్ జాన్సన్ (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) మరోసారి రాణించారు. దీంతో ఇంగ్లండ్‌పై 560 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించినట్టయ్యింది. ట్రెమ్లెట్‌కు మూడు, బ్రాడ్, స్వాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం 561 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 24/2 స్కోరుతో ఉంది. క్రీజులో కెప్టెన్ కుక్ (50 బంతుల్లో 11 బ్యాటింగ్; 1 ఫోర్), పీటర్సన్ (3 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి మ్యాచ్‌ను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ పర్యాటక జట్టు అసాధారణ ఆటతీరును కనబరిస్తే మాత్రం ప్రపంచ రికార్డును సృష్టించినట్టవుతుంది. ఇప్పటిదాకా 2003లో ఆసీస్‌పైనే 418 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు ఛేదించి విజయం సాధించింది. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 295; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 136; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 401/7 డిక్లేర్డ్ (94 ఓవర్లలో) (వార్నర్ 124, క్లార్క్ 113, హాడిన్ 53, బెయిలీ 34, మిచెల్ జాన్సన్ 39 నాటౌట్, ట్రెమ్లెట్ 3/69, బ్రాడ్ 2/55) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 24/2 (కుక్ 11 బ్యాటింగ్, పీటర్సన్ 3 బ్యాటింగ్). -
సిరీస్ భారత్ కైవసం
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది. అంతకముందు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌కు 384 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. -
చివరి వన్డేలో భారత్ ఉత్కంఠభరిత విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది. అంతకముందు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌కు 384 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 45.1 ఓవర్లలో 326 పరుగులకే ఆల్ ఔటైంది. దీంతో ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆసీస్ ఓపెనర్ ఫించ్ పేలవంగా ఆడి ఆదిలోనే తుస్సమనిపించాడు, హుగ్గీస్ 23 పరుగులు చేసి ఆశ్విన్ బౌలింగ్‌లో యువరాజ్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన హద్దీన్ 40 పరుగుల మోత పరవాలేదని అనిపించింది. హద్దీన్ రాక కొంతమేరకు ఆసీస్ జట్టులో ఉత్సాహం కనిపించినట్టే కనిపించి అంతలోనే ఆశ్వీన్ బౌలింగ్‌లో తుస్సమంది. అప్పటికే స్వల్పస్కోరు చేసినా ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆటగాళ్లు బెయిలీ 4, వోగస్ 4, పరుగలతో సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక ఆసీస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో మాక్స్వెల్ 60 పరుగుల టపాసుల మోత బాగా పేలి అంతలోనే తుస్సమని అనిపించాడు. ఆ తరువాత వచ్చిన వాట్సన్ 49, కల్టర్ నైల్ 3, మెకె 18 పరుగలకే ఒకరితరువాత ఒకరు వెనుతిరిగారు. ఫాల్కనర్ 116 పరుగులు చేయడంతో ఒక దశలో మ్యాచ్ భారత జట్టు చేజారుతుందని అనిపించినా, చివర్లో మాక్స్ వెల్ తో పాటు అతడు కూడా ఔట్ కావడంతో మ్యాచ్ తో పాటు సిరీస్ కూడా భారత వశమయ్యాయి. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తనదైనా శైలిలో ధీటుగా ఆడుతూ 158 బంతుల్లో 12ఫోర్లు, 16 సిక్స్‌లతో 209 పరుగుల అధ్బుతమైన ఇన్నింగ్ ఆడి తొలి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. -
రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ, ఆసీస్ టార్గెట్ 384
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారమిక్కడ జరుగుతున్న ఏడవ ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భారత్ దీపావళి టపాసు గట్టిగానే పేలింది. భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసి ఆసీస్‌కు 384 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ సిరిస్‌లో ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తనదైనా శైలిలో ధీటుగా ఆడుతూ 158 బంతుల్లో 12ఫోర్లు, 16 సిక్స్‌లతో 209 పరుగుల అధ్బుతమైన ఇన్నింగ్ ఆడి తొలి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆసీస్ వేసిన చెత్తబంతులను ఆడిందే తడువుగా వచ్చిన బంతి వచ్చినట్టుగా రోహిత్ బౌండరీలను దాటించాడు. రోహిత్ శర్మ ఆది నుంచి నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో విమర్శకులను సైతం అబ్బురపరిచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోహిత్ శర్మ క్రికెట్ అభిమానులకు మంచి `దీపావళి ధమాకా` అందించాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్ శేఖర్ ధావన్, రోహిత్ శర్మ భాగస్వామ్యంతో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. శేఖర్ ధావన్ అదేరీతిలో మెరుపువేగంతో దూకుడుగా ఆడుతూ పరుగుల పటాసులు పేల్చాడు. ధావన్ 57 బంతుల్లో 9ఫోర్లతో 60 పరుగులు చేసి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. అంతలో దోహిర్తి బౌలింగ్‌లో ఎల్బిడబ్య్లూ తో పెవిలీయన్‌కు వెళ్లక తప్పలేదు. శేఖర్ ధావన్ ఔట్ కావడంతో వీరాట్ కోహ్లి రంగప్రవేశం చేశాడు. పరుగు తీసేందుకు విపలయత్నం చేశాడు. దీంతో కోహ్లి కూడా పెవిలీయన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు వరుసుగా సురేష్ రైనా (30బంతుల్లో 2 ఫోర్లుతో) 28 పరుగులు, యువరాజ్ సింగ్ (14బంతుల్లో 1 సిక్స్‌తో) 12 పరుగులకే పరిమితమైయ్యారు. వీరిద్దరి టాపాసులు ఒకరితరువాత ఒకరివి క్రీజులో వరుసుగా తుస్సుమన్నాయి. అప్పటికే ఆరంభం నుంచి విజయుడై దూసుకెళ్తున్న రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించాడు. రోహిత్‌కు తోడుగా బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ ధోనీ (38బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్) 62 పరుగులు చేసి ఔటైయ్యాడు. అయితే ఆసీస్ బౌలర్ మెకె బౌలింగ్‌లో హెన్రిక్యివ్స్ క్యాచ్ పట్టుకోవడంతో రోహిత్ ఔట్ కాగా, ధోనీ రన్ ఔట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లు మెకె, పల్కనర్ తలో వికెట్ తీసుకోగా, దొహర్తీ 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణుడు సహాకరించలేదు. ఈ సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కాగా, నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను ఆసీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. -
భారీ స్కోరు దిశగా భారత్: రోహిత్ శర్మ సెంచరీ
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరుగుతున్న ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భారత్ దీపావళి టపాసు గట్టిగానే పేలింది. భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ సెంచరీతో అధ్బుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడాడు. 41 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 123 బంతుల్లో 5ఫోర్లు, 7 సిక్స్‌లతో 113 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో సెంచరీ చేయడం ఇది రెండోసారి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 17 ఓవర్లు ముగిసే సరికి వర్షం అడ్డంకిగా మారడంతో 17ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్‌లో రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించిన ధోనిసేన తుది మెట్టుపై ఫోరును సాగిస్తుండగా అంతలోనే వరుణుడు కాస్తా అడ్డుపడ్డాడు. మ్యాచ్‌ను చూసి ముచ్చటెసినా వరుణుడికి ఈ మ్యాచ్‌ను చివరకు వీక్షించాలనే అనకున్నాడోమో.. బహుషా పక్కకు తప్పుకున్నాడు. అప్పటి వరకూ నిరాశ అవహించినా ఆసీస్‌కు కాస్తా ఊపిరిపోసినట్టైంది. -
చివరి వన్డేకి వర్షం అడ్డంకి: భారత్ స్కోరు 107
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరగుతున్న ‘ఫైనల్’ వన్డేలో భారత్‌కు దీపావళి టపాసుకు వర్షం అడ్డంకిగా మారడంతో భారత్ 17ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్‌లో రెండుసార్లు భారీ లక్ష్యాలను ఛేదించిన ధోనిసేన తుది మెట్టుపై ఫోరును సాగిస్తుండగా అంతలోనే వరుణుడు కాస్తా అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గాలన్న ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లినట్టైయింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్లు శేఖర్ ధావన్, రోహిత్ శర్మలు చక్కని భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. భారత్ ఓపెనర్ బ్యాట్సమెన్ శేఖర్ ధావన్ మెరుపువేగంతో దూకుడుగా ఆడి పరుగుల పటాసులు పేల్చాడు. ఆసీస్ వేసిన చెత్తబంతులను ఆడిందే తడువుగా వచ్చిన బంతి వచ్చినట్టుగా బౌండరీలను దాటించాడు. ధావన్ 51 బంతుల్లో 9ఫోర్లతో 58 పరుగులు చేయగా, రోహిత్ శర్మ కూడా అదే దూకుడుతో ఆడి 51బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్ తో 37పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీనికి తోడూ దీపావళి పండుగ కూడా కలిసిరావడంతో ఇక క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. అంతకముందు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నతరుణంలో వరుణుడు సహాకరించలేదు. ఈ సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను ఆసీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. -
వార్నర్ రికార్డు సెంచరీ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోయిన డేవిడ్ వార్నర్ తమ దేశవాళీ వన్డే టోర్నీ ర్యోబి కప్‌లో చెలరేగాడు. న్యూసౌత్‌వేల్స్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వార్నర్ (141 బంతుల్లో 197; 20 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆసీస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు జిమ్మీ మహెర్ (187) పేరిట ఉంది. వార్నర్ దూకుడుతో న్యూసౌత్‌వేల్స్ 4 వికెట్ల తేడాతో విక్టోరియాను ఓడించి ర్యోబి కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్రిస్టియాన్ (117) సెంచరీ సహాయంతో విక్టోరియా 321 పరుగులు చేసినా... న్యూసౌత్‌వేల్స్ లక్ష్యాన్ని ఛేదించింది. -
యువరాజ్ విజృంభణ.. ఆసీస్‌పై భారత్ ఘనవిజయం
రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి-20 మ్యాచ్ యువరాజ్ విజృంభణతో భారత్ వశమైంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ కాస్తా యువీ వీరకొట్టుడుతో భారత్ ఖాతాలో పడింది. చాలాకాలం తర్వాత మళ్లీ టి-20 మ్యాచ్ ఆడిన యువరాజ్.. కెరీర్ లోనే అత్యధిక స్కోర్ సాధించి ఒంటిచేత్తో టీమిండియాకు విజయం అందించాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆసీస్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే కష్టాల్లో పడింది. అప్పటివరకూ భారత్ పని అయిపోయిందనుకుంటున్న ప్రేక్షకుల్లో.. యువరాజ్ సింగ్ రంగప్రవేశంతో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలెత్తింది. యువరాజ్ 35 బంతుల్లో (8 ఫోర్లు, 5 సిక్స్‌లు) 75 పరుగులు చేశాడు. భారత్ ఓపెనర్ శర్మ 8 బంతుల్లో (1సిక్స్)తో 8 పరుగులు చేసి చేతులెత్తేశాడు. పోటుగాడు శిఖర్ ధావన్ కూడా 19 బంతుల్లో (5 ఫోర్లు) 32 పరుగులు చేసి దోహర్తీ బౌలింగ్‌లో కుప్పకూలిపోయాడు. తరువాత వచ్చిన సురేష్ రైనా 19 పరుగులకే ఔటై అభిమానులను నిరాశపరిశాడు. విరాట్ కోహ్లీ (29) జోరుగా ఆడటంతో భారత్‌కు కొంత ఊరట కలిగినట్టయింది. అంతలోనే సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ వద్ద కోహ్లీ దొరికేశాడు. సరిగ్గా ఆప్పుడే యువరాజ్ సింగ్ బరిలోకి దిగాడు. చెత్తబంతి దొరకడమే పాపం, సిక్సులు, ఫోర్లతో స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. చక్కని ఇన్నింగ్ ఆడి యువరాజ్ సింగ్ (77) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతనికి భాగస్వామ్యాన్ని అందించిన భారత్ కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో (24) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఆసీస్ బౌలర్లు మెకే 2 వికెట్లు తీయగా, కౌల్టర్ నైలి, దొహర్టీ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్ ఫించ్ 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మిడ్డిన్ సన్ (34) పరుగులు చేశాడు. ఫించ్ మంచి ఆటతీరును ప్రదర్శించడంతో అతన్ని పెవిలీయన్ పంపేందుకు భారత్ బౌలర్ల ప్రయత్నాలను తిప్పికొడుతూ ముచ్చెటములు పట్టించాడు. భారత్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ చక్కని బంతి వేయడంతో ఫించ్‌కు కాస్తా పంచ్ పడినట్టైంది. -
టైటాన్స్ గెలుపు
మొహాలీ: బ్రిస్బేన్ హీట్స్‌కు మరో పరాభవం...తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈ ఆస్ట్రేలియా జట్టు మళ్లీ చతికిల పడింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 4 పరుగుల తేడాతో బ్రిస్బేన్‌ను ఓడించి సీఎల్‌టి20లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 18.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా...హీట్స్ 20 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. చెలరేగిన గాలే ఓపెనర్ రుడాల్ఫ్ (1) తొందరగానే అవుటైనా, డేవిడ్స్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), కున్ (27 బంతుల్లో 31; 6 ఫోర్లు) కలిసి టైటాన్స్‌ను నిలబెట్టారు. ఆ తర్వాత డివిలియర్స్ (19 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. అయితే డివిలియర్స్ అనూహ్యంగా రనౌట్ కావడంతో జట్టు ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. 16 పరుగుల తేడాతో టైటాన్స్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. మ్యాథ్యూ గాలే (4/10) చెలరేగి టైటాన్స్‌ను దెబ్బ తీశాడు. రాణించిన లాంజ్ స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా బ్రిస్బేన్ హీట్స్ ఛేదించలేకపోయింది. కెప్టెన్ జేమ్స్ హోప్స్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. క్రిస్టియాన్ (24 బంతుల్లో 21; 1 సిక్స్), సబర్గ్ (7 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మర్చంట్ డి లాంజ్ (3/13), రిచర్డ్స్ (2/20) చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో హీట్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయం కోసం చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా మెక్‌డెర్మట్ క్లీన్ బౌల్డ్ కావడంతో హీట్స్ ఓటమిపాలైంది. -
ఆసీస్ ఘనవిజయం
మాంచెస్టర్: యాషెస్‌ను ఘోరంగా ఓడినప్పటికీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘనంగానే ఆరంభించింది. తొలి వన్డే వర్షార్పణం కాగా కెప్టెన్ మైకేల్ క్లార్క్ (102 బంతుల్లో 105; 14 ఫోర్లు) మెరుపు సెంచరీ సహాయంతో రెండో వన్డేను 88 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి ఓవర్లోనే షాన్ మార్ష్ వెనుదిరిగినా ఆసీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. క్లార్క్, జార్జి బెయిలీ (67 బంతుల్లో 82; 5 ఫోర్లు; 4 సిక్స్) తుఫాన్ ఆటతీరుతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 155 పరుగుల భారీ స్కోరు లభించింది. ఫిన్, రాన్‌కిన్, బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. -
చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం
లండన్: చివరి యాషెస్ టెస్ట్ కు వర్షం గండం ఎదురైంది. ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో నాలుగో రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. క్రితం రోజు ఆట నిలిచే సమాయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో రూట్ 60 పరుగులు చేయగా, పీటర్సన్ 50 పరుగులు చేయడం విశేషం. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 492 పరుగుల భారీ స్కోరు చేసి ఈ టెస్టుపై పట్టు సాధించింది. అయితే వర్ష ప్రభావం ఈ టెస్టు పడటంతో ఇంగ్లాండ్ డ్రా కోసమే ప్రయత్నించే చాన్స్ వుంది. ఇప్పటికే 5 టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0 తేడాతో గెలిచింది. -
నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
మధ్యాహ్నం గం.3.30 నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం చెస్టర్ లీ స్ట్రీట్: వరుసగా రెండు పరాజయాలు... మూడో టెస్టులో కాస్త మెరుగైన ప్రదర్శనతో ‘డ్రా’తో గట్టెక్కిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రతిష్ట కోసం పాకులాడుతోంది. కనీసం యాషెస్‌లో చివరి రెండు టెస్టుల్లోనైనా గెలిచి పోయిన పరువును కాస్త అయిన కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. సిరీస్ డ్రా గా ముగిసినా కప్ రాదు కాబట్టి... ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సమం చేస్తే కంగారూల ప్రతిష్ట నిలబడుతుంది. దీని కోసం జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెనర్‌గా వాట్సన్ విఫలమవుతున్నా.. మాజీలు మాత్రం అతన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మిడిలార్డర్లో వార్నర్ ఇంకా గాడిలో పడకపోవడం ఆసీస్‌ను ఆందోళన పెడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. క్లార్క్‌పై మరోసారి బ్యాటింగ్ భారం పడనుంది. హాడిన్, స్టార్క్‌లు లోయర్ ఆర్డర్లో పరుగులు చేస్తుండం కలిసొచ్చే అంశం. వన్‌డౌన్‌లో ఉస్మాన్ ఖాజా స్థానంలో కొత్త వారికి అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్‌లో పేస్ త్రయం ప్రణాళికల మేరకు రాణిస్తున్నా.... స్పిన్నర్ లియోన్ కుదురుకోవాల్సి ఉంది. వాట్సన్ కూడా బౌలింగ్‌లో సత్తా చూపాల్సి ఉంది. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కనబర్చాలని ప్రయత్నిస్తోంది. బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. పేసర్ గ్రాహం ఆనియన్స్‌కు అవకాశం దక్కొచ్చు. రూట్, ట్రాట్‌లు భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టారు. బెయిర్‌స్టో విఫలమవుతున్నా... ప్రయర్, బ్రాడ్ పరుగులు చేస్తుండటం జట్టుకు లాభిస్తోంది.