డేనియల్ వెట్టోరి
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి, ఆసీస్ మాజీ దేశీవాళీ ఆటగాడు ఆండ్రీ బోరోవెక్‌లను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌లుగా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వీరిద్దరూ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం వెట్టోరికి ఉంది.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వెట్టోరి బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెట్టోరి పని చేశాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్‌లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి.
చదవండి: Ravichandran Ashwin: 'ప్రయోగాలు ఆపేసిన రోజు క్రికెట్‌పై ఫ్యాషన్ చచ్చిపోతుంది'
2️⃣ new assistant coaches for our men's national team!
— Cricket Australia (@CricketAus) May 24, 2022
Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE
Comments
Please login to add a commentAdd a comment