Daniel Vettori
-
ఐపీఎల్ వేలం కోసం వెటోరి
పెర్త్: ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ డానియెల్ వెటోరి పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి టెస్టు మధ్యలోనే జట్టును వీడి ఐపీఎల్ మెగా వేలానికి బయలుదేరుతాడు. ఈ న్యూజిలాండ్ బౌలింగ్ దిగ్గజం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో 45 ఏళ్ల వెటోరి సౌదీ అరేబియాలోని రెండో పెద్ద నగరం జిద్దాలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే వేలంలో పాల్గొంటాడు. ఐదు టెస్టుల ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో తొలి టెస్టు 22 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. ‘ఐపీఎల్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్ అయిన వెటోరికి మద్దతిస్తాం. అతను మొదటి టెస్టు సన్నాహానికి చేయాల్సిందంతా (ట్రెయినింగ్) చేసే వేలానికి హాజరవుతాడు. ఇందులో మాకు ఏ ఇబ్బంది లేదు. మెగా వేలం ముగిసిన వెంటనే మళ్లీ మా జట్టుతో కలుస్తాడు’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సీఏ నేషనల్ డెవలప్మెంట్ కోచ్ లాచ్లన్ స్టీవెన్స్... తొలి టెస్టు కోసం వెటోరి పాత్రను భర్తీ చేస్తారని సీఏ తెలిపింది. కివీస్‌కు చెందిన వెటోరి మాత్రమే కాదు... ఆ్రస్టేలియన్ దిగ్గజాలు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లు సైతం జిద్దాకు పయనమవుతారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు, లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు హెడ్ కోచ్‌లుగా ఉన్నారు. దీంతో ‘చానెల్ సెవెన్’లో వ్యాఖ్యాతలు వ్యవహరించనున్న వీళ్లిద్దరు కూడా పెర్త్ టెస్టు మధ్యలోనే మెగా వేలంలో పాల్గొననున్నారు. -
చరిత్ర సృష్టించిన షకీబ్
బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన అనంతరం షకీబ్ ఖాతాలో వరల్డ్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన షకీబ్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో షకీబ్ న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీని అధిగమించాడు. షకీబ్ 482 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 707 వికెట్లు తీయగా.. వెటోరీ 498 ఇన్నింగ్స్‌ల్లో 705 వికెట్లు పడగొట్టాడు. ఈ విభాగంలో షకీబ్, వెటోరీ తర్వాత రవీంద్ర జడేజా (568 వికెట్లు), రంగన హెరాత్ (525), సనత్ జయసూర్య (440) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షకీబ్ 16వ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మురళీథరన్ (1347) టాప్‌లో ఉన్నాడు.పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్
ఎనిమిది.. ఎనిమిది.. పది.. గత మూడేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు. చెత్త ప్రదర్శనతో గతేడాది అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి అద్భుత ఆట తీరుతో సంచలనాలు సృష్టించింది.విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసి.. ఆరేళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించింది.కొత్త కోచ్ డానియల్ వెటోరి మార్గదర్శనంలో.. నూతన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ టైటిల్ వేటలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై విజయానంతరం ఎస్ఆర్హెచ్ సారథి కమిన్స్ మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు.మా బలం అదే‘‘ఈ సీజన్ ఆసాంతం మా వాళ్లు అదరగొట్టారు. ఆరంభం నుంచే ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాము. ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకున్నాము. మా బలం బ్యాటింగ్ అన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మా బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవజ్ఞులైన బౌలర్లు మా జట్టులో ఉన్నారు. భువీ, నట్టు, ఉనాద్కట్ నా పని మరింత సులువు చేశారు.ఆ నిర్ణయం నాది కాదుఇక ఈ రోజు షాబాజ్ అహ్మద్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావాలన్న నిర్ణయం డాన్ వెటోరీదే. ఈ లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జట్టులో ఎంత మంది వీలైతే అంత మంది లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్లను ఈరోజు ఆడించాలని అనుకున్నాడు.అతడొక సర్ప్రైజ్ఇక అభిషేక్ శర్మ ఈరోజు ఇలా బౌలింగ్(2/24) చేయడం నిజంగా ఓ సర్ప్రైజ్ లాంటిదే. మిడిల్ ఓవర్లలో అతడు ప్రభావం చూపాడు. వాస్తవానికి ఈ పిచ్ మీద 170 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేమీ కాదని తెలుసు.కాస్త మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశం ఉంటుందని తెలుసు. అయితే, వికెట్‌ను బట్టి పరిస్థితులను అంచనా వేయడంలో నేనేమీ దిట్ట కాదు. ఎందుకంటే వారం వారం ఇదంతా మారిపోతూ ఉంటుంది.ఇంకొక్కటి మిగిలి ఉందిమేము ఇక్కడిదాకా చేరడం వెనుక ఫ్రాంఛైజీకి చెందిన ప్రతి ఒక్కరి సహకారం ఉంది. దాదాపుగా 60- 70 మంది మనస్ఫూర్తిగా కఠిన శ్రమకోర్చి మమ్మల్ని ఈస్థాయిలో నిలిపారు.ఇంకొక్క అడుగు.. అందులోనూ సఫలమైతే ఇంకా బాగుంటుంది’’ అని కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించినందు వల్లే తాము ఫైనల్ చేరుకోగలిగామని జట్టులోని ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇచ్చాడు.ఇంపాక్ట్ చూపిన షాబాజ్కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్.. యశస్వి జైస్వాల్(42), రియాన్ పరాగ్(6), రవిచంద్రన్ అశ్విన్(0) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కీలక సమయంలో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ కెప్టెన్ సంజూ శాంసన్(10), షిమ్రన్ హెట్మెయిర్(4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు.క్వాలిఫయర్-2: సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉సన్‌రైజర్స్ స్కోరు: 175/9 (20)👉రాజస్తాన్ స్కోరు: 139/7 (20)👉ఫలితం: రాజస్తాన్‌పై 36 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం.. ఫైనల్‌కు అర్హత👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాబాజ్ అహ్మద్(18 పరుగులు, 3/23).చదవండి: T20 WC: టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన.. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 -
IPL 2024: కొత్త కొత్తగా సన్‌రైజర్స్.. రాత మారేనా?
ఎనిమిది, ఎనిమిది, పది... గత మూడు ఐపీఎల్ సీజన్ల పాయింట్ల పట్టికలో వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు ఇవి! 2023లోనైతే మరీ ఘోరంగా టీమ్ నాలుగే విజయాలు సాధించింది. 2020లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో మూడో స్థానంలో నిలిచిన తర్వాత జట్టు మళ్లీ కోలుకోలేదు. తర్వాతి ఏడాది విభేదాలతో వార్నర్‌ను ఎనిమిది మ్యాచ్‌లకే పరిమితం చేసిన టీమ్ మేనేజ్మెంట్ ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా ఏవీ కలిసి రాలేదు. విదేశీ ఆటగాళ్లు అక్కడక్కడా మెరవడం మినహా భారత క్రికెటర్లు ఎవరూ జట్టును గెలిపించలేకపోతున్నారు. అభిమానుల కోణంలో అయితే వారంతా అపరిచితుల్లా కనిపిస్తున్నారు. లీగ్‌లో ప్రతీ టీమ్ ఏదో ఒక దశలో విధ్వంసక ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుండగా సన్‌రైజర్స్ మాత్రం పాతకాలపు ఆటతోనే నడిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లు కూడా తమపై ఉన్న అంచనాలు, ఒత్తిడిని అధిగమించి ఏ మేరకు రాణిస్తారనేది చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో సీజన్‌కు జట్టు సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెపె్టన్ కమిన్స్ సారథ్యంలో, కొత్త హెడ్ కోచ్ డానియల్ వెటోరి పర్యవేక్షణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సన్‌రైజర్స్ టోర్నీలో ఎంత దూరం వెళుతుందనేది ఆసక్తికరం. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సౌతాఫ్రికా టి20 టోర్నీలో వరుసగా రెండేళ్లు టైటిల్స్ సాధించింది. ఈ రెండు సార్లూ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టును విజేతగా నిలిపాడు. అయినా సరే అతడిని కాదంటూ ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను రైజర్స్ ఈసారి కొత్త కెప్టెన్‌గా నియమించింది. వేలంలో కమిన్స్‌ను రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు కొనుక్కుంది. గత ఏడాది కాలంలో నాయకుడిగా ఆసీస్‌కు అసాధారణ విజయాలు అందించిన కమిన్స్ అగ్రశ్రేణి టి20 లీగ్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కమిన్స్ 2023లో ఐపీఎల్ ఆడలేదు. 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన అతను ఏకంగా 10.68 ఎకానమీతో 7 వికెట్లే తీశాడు. అంతకుముందు సీజన్లోనూ 7 మ్యాచ్‌లలో 9 వికెట్లే తీసి భారీగా పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా కమిన్స్‌కు టి20ల్లో అంత ఘనమైన రికార్డు ఏమీ లేదు. జట్టులో సమర్థులైన విదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కెపె్టన్ హోదాలో కమిన్స్ అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. ఇటీవల అతని బౌలింగ్ మెరుగైనా... తీవ్ర ఒత్తిడిలో జట్టుకు మంచి ఫలితాలు అందించడం కీలకం. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఈనెల 23న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. విదేశీ బృందం ఇలా... కమిన్స్‌ను మినహాయిస్తే మరో ముగ్గురు విదేశీయులకే తుది జట్టులో చాన్స్ ఉంది. ఇలాంటి స్థితిలో రైజర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి. బ్యాటర్లలో వరల్డ్‌కప్ ‘ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, గత ఏడాది టీమ్ టాప్ స్కోరర్ హెన్రిచ్ క్లాసెన్, దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ మార్క్రమ్, దూకుడుగా ఆడగల గ్లెన్ ఫిలిప్స్ అందుబాటులో ఉన్నారు. తాజా ఫామ్, గుర్తింపును బట్టి చూస్తే హెడ్, క్లాసెన్‌లు ఖాయంగా కనిపిస్తున్నారు. అప్పుడు బౌలింగ్‌లో అగ్రశ్రేణి లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లో మంచి రికార్డు ఉన్న హసరంగకు తుది జట్టులో చోటు ఖాయం. ఆల్‌రౌండర్‌గా మార్కో జాన్సెన్ కూడా సిద్ధంగా ఉన్నా అతడిని ఆడించడం కష్టంగా మారనుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కారణంగా హసరంగ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అప్పుడు జాన్సెన్కు అవకాశం లభించవచ్చు. మనోళ్లు సత్తా చాటుతారా... బ్యాటింగ్ కోణంలో భారత ఆటగాళ్లంతా అంతంతమాత్రం ప్రదర్శనే కనబరుస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ మినహా నిలకడే లేదు. మయాంక్ అగర్వాల్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలలో ఒక్కరు కూడా గత సీజన్లో కనీసం 300 పరుగులైనా చేయలేకపోయారు. సమద్, అన్మోల్ప్రీత్ ప్రభావం చూపలేకపోగా... ఉపేంద్ర, నితీశ్ కుమార్ రెడ్డి, సన్వీర్ ఏమాత్రం ఆడతారో చూడాలి. రెండేళ్ల క్రితమే భారత జట్టుకు దూరమైన భువనేశ్వర్‌పైనే ఇంకా పేస్ బౌలింగ్ భారం ఉంది. ఉమ్రాన్ మాలిక్ తన వేగం మాత్రమే కాక ఇతరత్రా బౌలింగ్ మెరుగుపర్చుకొని ఉంటే ప్రభావం చూపించగలడు. నటరాజన్‌లో నాటి పదును తగ్గిపోగా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్ జట్టులో ఉండటం ఉపయోగపడవచ్చు. జట్టు స్పిన్ బలహీనంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్ ఫర్వాలేదనిపించే ఆటగాళ్లే. ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క సీజన్లోనూ వీరిద్దరు ఎనిమిదికి మించి వికెట్లు తీయలేదు. మయాంక్ మార్కండే లెగ్‌స్పిన్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. జట్టు వివరాలు కమిన్స్ (కెప్టెన్), మార్క్రమ్, ఫిలిప్స్, క్లాసెన్, హెడ్, జాన్సెన్, హసరంగ, ఫజల్ హఖ్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్, వాషింగ్టన్ సుందర్, సనీ్వర్ సింగ్, జాతవేద్ సుబ్రహ్మణ్యం, ఆకాశ్ సింగ్, షహబాజ్ అహ్మద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, ఉమ్రాన్, మయాంక్ మర్కండే (భారత ఆటగాళ్లు). సాక్షి క్రీడా విభాగం -
IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్!
IPL 2024- SRH: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ! ఆ జట్టు బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా స్టన్‌గన్ డేల్ స్టెయిన్ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను కొంతకాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు స్టెయిన్ ఇప్పటికే ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. తాజా సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ సజావుగా సాగితే ‘‘సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది బౌలింగ్ కోచ్‌గా డేల్ స్టెయిన్ సేవలను కోల్పోనుంది. 2024 సీజన్‌కు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది అతడు మళ్లీ ఎస్ఆర్హెచ్ కోచింగ్ సిబ్బందిలో ఒకడిగా చేరతాడు’’ అని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. కాగా 40 ఏళ్ల డేల్ స్టెయిన్ సౌతాఫ్రికా స్టార్ పేసర్‌గా పేరొందాడు. ప్రొటిస్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 439, 196, 64 వికెట్లు తీశాడు. గతంలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు గతేడాది అదే జట్టుకు ఫాస్ట్‌బౌలింగ్ కోచ్‌గానూ సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో పదో స్థానం కోసం పోటీపడిన సన్‌రైజర్స్.. ఈసారి హెడ్‌కోచ్‌ను మార్చింది. బ్రియన్ లారా స్థానంలో డేనియల్ వెటోరీని తీసుకువచ్చింది. అయితే, స్టెయిన్ విషయంలో యాజమాన్యం నిర్ణయం తీసుకుందా.. లేదంటే అతడే బ్రేక్ తీసుకోవాలని భావించాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే! ఐపీఎల్-2024 ఎస్ఆర్హెచ్ జట్టు అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి.నటరాజన్, అన్మోల్ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీశ్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫారూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగ, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే.. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు? -
లారాకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆస్ట్రేలియా పురుషుల టీమ్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. గత సీజన్లో (2023) జట్టు పేలవ ప్రదర్శనకు లారాను బాధ్యున్ని చేస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు చేపట్టిన లారా.. ఆ సీజన్లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి ఆఖరి స్థానంతో ముగించింది. 🚨Announcement🚨 Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡 Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86 — SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 ఆరు సీజన్లలో నలుగురు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఆరు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2019, 2022 సీజన్లలో టామ్ మూడీ.. 2020, 2021 సీజన్లలో ట్రెవర్ బేలిస్.. 2023 సీజన్లో లారా.. తాజాగా వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు. గతంలో ఆర్సీబీ కోచ్‌గా వెటోరీ.. న్యూజిలాండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా పేరు గాంచిన డేనియల్ వెటోరీ.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్ పదవితో పాటు హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెటోరీ.. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ హెడ్ కోచ్‌గా, బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ హెడ్‌కోచ్‌గా, ఇంగ్లండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్సెక్స్ హెడ్‌కోచ్‌గా, బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టు స్పిన్ కన్సల్టెంట్గానూ పని చేశాడు. -
వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్ కెప్టెన్
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ సారధి టిమ్ సౌథీ ఓ రేర్ ఫీట్‌ను సాధించాడు. 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2nd on the list! Tim Southee (362 wickets) becomes the second highest wicket-taker in Tests for New Zealand. Southee (706) now has the most international wickets for a New Zealander 🏏 #StatChat #NZvSL pic.twitter.com/2oXxxKw5ty — BLACKCAPS (@BLACKCAPS) March 9, 2023 93 టెస్ట్‌ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్ వెటోరీని (112 టెస్ట్‌ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431 వికెట్లు) తొలి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్ (578), కెయిన్స్ (419), మిల్స్ (327), మోరిసన్ (286), చాట్‌ఫీల్డ్ (263), బాండ్ (259), వాగ్నర్ (258) టాప్-10లో ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే (50), కుశాల్ మెండిస్ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్ (47), దినేశ్ చండీమాల్ (39) పర్వాలేదనిపించారు. ఓపెనర్ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2, బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
NZ Vs Eng: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు
New Zealand vs England, 2nd Test: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 700 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ పేసర్‌గా ఈ రైట్ ఆర్మ్ సీమర్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా 34 ఏళ్ల టిమ్ సౌథీ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(9 పరుగులు)ను అవుట్ చేసి తన కెరీర్లో 700వ వికెట్ నమోదు చేశాడు. తద్వారా కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ డానియెల్ వెటోరి(705)తో పాటు 700 వికెట్ల క్లబ్లో చేరాడు. కాగా టిమ్ సౌథీ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరఫున మొత్తంగా 353 మ్యాచ్‌లు ఆడి.. టెస్టుల్లో 356, వన్డేల్లో 210, టీ20లలో 134 వికెట్లు కూల్చాడు. ఇక రెండు టెస్టుల సిరీస్ ఆడే నిమిత్తం ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంతా తొలి టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 267 పరుగుల తేడాతో స్టోక్స్ బృందం చిత్తు చేసింది. ఇక రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రూట్, బ్రూక్ సెంచరీలతో చెలరేగగా.. బజ్‌బాల్ విధానంతో మరోసారి దూకుడు ప్రదర్శించి పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో సౌథీ ఒకటి, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశారు. జో రూట్ 101 పరుగులు, హ్యారీ బ్రూక్ 184 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: WC 2023: కన్నీటి పర్యంతమైన హర్మన్... అక్కున చేర్చుకున్న అంజుమ్.. వీడియో వైరల్ Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! ENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా! View this post on Instagram A post shared by Spark Sport (@sparknzsport) #StatChat | Tim Southee joins Daniel Vettori (705) as the only New Zealanders to take 700 International wickets. Southee has represented the BLACKCAPS in 353 matches across the three formats 🏏 #NZvENG pic.twitter.com/sF3joTF1UN — BLACKCAPS (@BLACKCAPS) February 23, 2023 -
ఐసీసీలో వివిఎస్ లక్ష్మణ్‌కు కీలక పదవి
టీమిండియా మాజీ క్రికెటర్.. ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఐసీసీలో కీలక పదవి చేపట్టాడు. మెన్స్ క్రికెట్ కమిటీలో భాగంగా ఆటగాళ్ల ప్రతినిధిగా ఎంపిక చేసినట్లు మంగళవారం ఐసీసీ పేర్కొంది. లక్ష్మణ్‌తో పాటు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరిని కూడా ప్రతినిధిగా ఎంపిక చేశామని బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఎన్సీఏ అకాడమీ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు హెడ్‌కోచ్‌గా వ్యహరించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక మరో మాజీ క్రికెటర్ రోజర్ హార్పర్‌ను కూడా ప్రతినిధిగా అవకాశం ఇచ్చింది. అయితే రోజర్ హార్పర్ పాస్ట్ ప్లేయర్స్ రెండో ప్రతినిధిగా వ్యవహరించనున్నాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే ఇది వరకే ఐసీసీ మెన్స్ క్రికెట్లో పాస్ట్ ప్లేయర్ ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఇక ఇదే సమావేశంలో 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. చదవండి: భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్ -
విమర్శలు పట్టించుకోకు కోహ్లి.. నువ్వేంటో నిరూపించు.. అప్పుడే: అక్తర్
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు చేయడం సరికాదని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లి ఫామ్‌లేమి గురించి విమర్శించే వారు.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలన్నాడు. ఓ క్రికెటర్‌గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందేందుకు కోహ్లి అర్హుడని పేర్కొన్నాడు. కాగా గతేడాది నుంచి ఫామ్‌లేమితో ఈ ‘రన్‌మెషీన్’ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానన్న కోహ్లి.. మెగా టోర్నీలో ఘోర పరాభవంతో సారథ్య బాధ్యతలకు ముగింపు పలికాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సారథిగా వ్యవహరించిన కోహ్లి.. గతేడాది ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు. ఇక కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఈ సీజన్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2022లో పదహారు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు 341. సగటు 22.73. కేవలం రెండు అర్ధ శతకాలు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. అతడు అంతర్జాతీయ క్రికెట్లో 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. ‘‘110 సెంచరీలకు చేరువయ్యే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను తారస్థాయిలో విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు. నువ్వు దీపావళి గురించి ట్వీట్ చేసినా అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్‌కప్‌లో ఓడిపోతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీదైన శైలిలో ముందుకు సాగు. విరాట్ కోహ్లి అంటే ఏంటో వాళ్లకు ఒక్కసారి చూపించు’’ అని అక్తర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1 ఘోర పరాజయం -
ఆస్ట్రేలియా కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి, ఆసీస్ మాజీ దేశీవాళీ ఆటగాడు ఆండ్రీ బోరోవెక్లను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌లుగా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వీరిద్దరూ హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో కలిసి పనిచేయనున్నారు. కాగా గతంలో కోచ్‌గా పనిచేసిన అనుభవం వెట్టోరికి ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వెట్టోరి బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా వెట్టోరి పని చేశాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. చదవండి: Ravichandran Ashwin: 'ప్రయోగాలు ఆపేసిన రోజు క్రికెట్‌పై ఫ్యాషన్ చచ్చిపోతుంది' 2️⃣ new assistant coaches for our men's national team! Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE — Cricket Australia (@CricketAus) May 24, 2022 -
'అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంపై న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా అజామ్‌ని వెట్టోరి కొనియాడాడు. కాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో బాబర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇక ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ అద్భుతంగా రాణించాడు. బాబర్ మూడు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. "క్రికెట్లో మూడు ఫార్మాట్లు భిన్నంగా ఉంటాయి. మూడు ఫార్మాట్లలో ఒకే విధంగా రాణించాలంటే చాలా కష్టం. కానీ బాబర్ ఆజాం మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే బాబర్ అత్యుత్తమ ఆటగాడు"అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెట్టోరి పేర్కొన్నాడు. చదవండి: CSK VS DC: డెవాన్ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు -
ఆస్ట్రేలియా బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు స్పిన్ కన్సల్టెంట్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ధృవీకరించింది. పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా లాహోర్‌లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. ఈ వైట్‌బాల్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ సలహాదారుగా వెట్టోరి వ్యవహరించనున్నాడు. కాగా వెట్టోరి 2019 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. అదే విధంగా గతంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక వెట్టోరి తన అంతర్జాతీయ కెరీర్లో 705 వికెట్లు సాధించాడు. వాటిలో 365 టెస్టు, 305 వన్డే, 38 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి రెండు టెస్టులు డ్రా ముగిశాయి. ఇక సిరీస్‌లో అఖరి టెస్టు లాహోర్ వేదికగా జరుగుతోంది. మార్చి 29న లాహోర్ వేదికగా పాక్- ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. చదవండి: IPL 2022: చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు! -
'కోహ్లి మళ్లీ కెప్టెన్ కాలేడు.. ఆర్సీబీ కెప్టెన్‌గా అతడే సరైనోడు'
ఐపీఎల్-2022 సీజన్లో దాదాపు అన్ని ఫ్రాంచైజీలు కెప్టెన్లు నియమించుకోగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇంకా సారథిని నియమించకోలేదు. కాగా ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్లో మళ్లీ తిరిగి కోహ్లి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆర్సీబీ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ స్పిన్ లెజెండ్ డేనియల్ వెట్టోరి స్పందించాడు. విరాట్ కోహ్లి మళ్లీ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించే అవకాశమే లేదని అతడు తెలిపాడు. "విరాట్ కోహ్లి మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశం లేదు. ఈ విషయం గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క సారి తప్పుకున్నాక మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టడం ఆసాధ్యం. ఫ్రాంచైజీ క్రికెట్లో లేదా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరిగే అవకాశం లేదు. ఆర్సీబీ మెనేజేమెంట్ కోహ్లి వరసుడిగా మాక్స్వెల్, డు ప్లెసిస్, దినేష్ కార్తీక్ పేర్లును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాక్స్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అనుకుంటున్నాను. ఒక వేళ మాక్స్వెల్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే వారు ఖచ్చితంగా డు ప్లెసిస్ వైపే మొగ్గు చూపుతారని నేను భావిస్తున్నాను" అని వెట్టోరి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2022 షెఢ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైతో కేకేఆర్ తలపడనుంది. చదవండి: IPL 2022: షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్‌లో సీఎస్కేను ఢీకొట్టనున్న కేకేఆర్ -
ఆర్సీబీ కెప్టెన్ అయ్యేది ఆ ఆటగాడే.. కానీ
Daniel Vettori Picks His RCB Captain for IPL 2022: 2021 ఐపీఎల్ సీజన్ తర్వాత కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే సీజన్ నుంచి కోహ్లి ఆటగాడిగా మాత్రమే కొనసాగునున్నాడు. ఇక ఆర్సీబీకి తర్వాతి కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ మాజీ ఆటగాడు.. కోచ్ డేనియల్ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! ''కోహ్లి స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్లో బ్యాట్స్‌మన్‌గా మ్యాక్సీ దుమ్మురేపాడు. ఒకే సీజన్లో ఆర్సీబీ తరపున 500కు పైగా పరుగులు సాధించాడు. అందుకే రిటైన్ లిస్ట్‌లో మ్యాక్స్‌వెల్‌ను తమతోనే అట్టిపెట్టుకుంది. దీంతో మ్యాక్స్‌వెల్ కెప్టెన్ అయ్యే చాన్స్ ఉంది. దీనికి ఒక కారణం ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు మ్యాక్స్‌వెల్ నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అతని కెప్టెన్సీలో మెల్బోర్న్ స్టార్స్ 62 62 మ్యాచ్‌ల్లో 34 విజయాలు సాధించింది. కాకపోతే ఆర్సీబీ అతన్ని ఒక సీజన్‌కు కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. వచ్చే సీజన్లో అతని నాయకత్వంలో జట్టు ప్రదర్శన బాగుంటే భవిష్యత్తులో ఎక్కువకాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లికి అత్యధికంగా 15 కోట్లు వెచ్చించగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు రూ. 7 కోట్లు వెచ్చించారు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. కోహ్లికు ఎన్ని కోట్లంటే.. -
వెటోరీలా బౌల్ చేస్తున్నావన్నారు, గంగూలీకి బౌల్ చేయించారు, ఇప్పుడేమో..!
గువహాటీ: టీమిండియా 2003లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లక ముందు, నాటి జట్టు సారధి సౌరవ్ గంగూలీకి నెట్స్‌లో బౌలింగ్ చేసి సహాయపడిన అసోంకు చెందిన మాజీ క్రికెటర్ ప్రకాశ్ భగత్.. ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన దాల్ పూరి దుఖానాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాడు న్యూజిలాండ్ టూర్‌కి వెళ్లబోయిన భారత జట్టుకు స్పిన్నర్ డేనియల్ వెటోరీ ఫోబియా పట్టుకుంది. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో బంతుల్ని సంధించే వెటోరీ.. సొంతగడ్డపై భారత బ్యాట్స్మెన్లకి సవాల్ విసిరేలా కనిపించాడు. దాంతో నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీ.. బీసీసీఐతో చర్చల జరిపి వెటోరీలా బౌల్ చేసే ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగత్‌ను ఆగమేఘాల మీద బెంగళూరుకి పిలిపించాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గంగూలీతో పాటు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు ప్రకాశ్ భగత్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ప్రకాశ్ బౌలింగ్ యాక్షన్.. వెటోరీ బౌలింగ్ యాక్షన్‌ని పోలి ఉండటంతో భారత బ్యాట్స్మెన్లందరూ అతని బౌలింగ్‌లో కఠోర సాధన చేశారు. దీంతో టీమిండియా బ్యాట్స్మెన్లు న్యూజిలాండ్ టూర్లో వెటోరీపై ఎదురుదాడి చేయగలిగారు. ఇలా టీమిండియాకు ఉపయోగపడిన ఆ బౌలర్ ప్రస్తుతం రోడ్డు పక్కన దాల్ పూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చాలీచాలని సంపాదనతో బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. తనతో పాటు అసోంకు ఆడిన క్రికెటర్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని, తనకు మాత్రం బోర్డు నుంచి ఏ తోడ్పాటు అందకపోవడంతో ఇలా బతుకు బండిని నెట్టుకొస్తున్నాని ఈ 38 ఏళ్ల క్రికెటర్ వాపోతున్నాడు. తాజాగా ఇన్.కామ్ అనే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కాగా, అసోం తరఫున దాదాపు అన్ని స్థాయి పోటీల్లోనూ పాల్గొన్న ప్రకాశ్.. బీహార్‌తో జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ప్రకాశ్ చివరిసారిగా 2010-11లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత అతని తండ్రి చనిపోవడంతో క్రమంగా క్రికెట్‌కి దూరమై.. కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకున్నాడు. నాడు తన బౌలింగ్ ద్వారా లబ్ధి పొందిన గంగూలీ ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ప్రకాశ్ మాత్రం బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. -
పెద్ద మనసు చాటుకున్న వెటోరి
ఢాకా: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి పెద్ద మనసు చాటుకున్నాడు. తన జీతంలో కొంత భాగాన్ని కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డు సిబ్బందికి ఇవ్వాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును (బీసీబీ) కోరాడు. ఈ విషయాన్ని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ ప్రకటించారు. అయితే ఎంత మొత్తాన్ని వెటోరి విరాళంగా ప్రకటించాడో మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. టి20 ప్రపంచకప్ ముగిసేవరకు బంగ్లాదేశ్ కోచింగ్ బృందంలో ఉండనున్న 41 ఏళ్ల వెటోరికి బంగ్లాదేశ్ బోర్డు మొత్తం 2,50,000 డాలర్లు (రూ. కోటీ 88 లక్షలు) చెల్లించనుంది. -
షకిబుల్ ప్రాక్టీస్‌కు రాలేదు..!
మిర్పూర్: త్వరలో భారత్ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. భారత్‌తో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కొత్త బౌలింగ్ కోచ్ డానియెల్ వెటోరి పర్యవేక్షణలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్‌కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం మిర్పూర్లోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌కు దాదాపు అందరూ హాజరు కాగా సీనియర్ ఆటగాడు షకీబుల్ హసన్ మాత్రం గైర్హాజరీ అయ్యాడు. ఇటీవల తమ డిమాండ్లను నెరవేర్చాంటూ బంగ్లాదేశ్‌క్రికెటర్లు స్టైక్‌కు చేపట్టి విజయం సాధించారు. షకీబుల్ నేతృత్వంలోని బంగ్లా క్రికెటర్లు తమ నిరసన గళాన్ని బలంగా వినిపించింది. దాంతో బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ కోరిన 11 డిమాండ్లలో తొమ్మిదింటిని తీర్చడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ముందుకు రావడంతో సమ్మెకు ఫుల్స్టాప్ పడింది. ఆ క్రమంలోనే భారత్ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది. దాంతో సదరు క్రికెటర్లు తమ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కొన్ని రోజుల క్రితం బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన వెటోరీ.. ఆటగాళ్లకు బంతులు విసురుతూ ప్రాక్టీస్ చేయించాడు. భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి స్థానంలో వెటోరిని బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకూ వెటోరి బంగ్లా బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 30వ తేదీ నాటికి బంగ్లా క్రికెటర్లు.. భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. -
వెటోరి జెర్సీకి కివీస్ గుడ్‌బై
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) తమ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరీ సేవలకు చక్కని గుర్తింపునిచ్చింది. అతని జెర్సీ నంబర్ ‘11’కు రిటైర్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఏ కివీ క్రికెట్ర్ జెర్సీ మీద ఈ నంబర్ కనిపించదు. ‘200పైగా వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాం. వెటోరి 11 జెర్సీతో 291 మ్యాచ్‌లాడి అత్యధిక వన్డేలాడిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా నిలిచాడు’ అని ఎన్‌జడ్‌సీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కోసం తమ ఆటగాళ్ల జెర్సీ నంబర్లను ప్రకటించింది. రెండు టెస్టుల ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి గాలే (శ్రీలంక)లో జరుగుతుంది. ఇక్కడి నుంచే కివీస్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ మొదలవుతుంది. -
ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరి గౌరవార్థం అతను ధరించిన జెర్సీ నంబర్-11కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. డానియల్ వెటోరి జెర్సీ నంబర్ 11తో రెండొందలకు పైగా వన్డేలు ఆడటంతో ఇకపై ఆ జెర్సీ నంబర్‌ను ఎవ్వరికీ కేటాయించమని పేర్కొంది. ‘ ఎవరైతే కనీసం రెండొందల వన్డేలు ఒకే జెర్సీ నంబర్‌తో ఆడతారో ఆ జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ఇస్తున్నాం. జెర్సీ నంబర్-11తో వెటోరి 291 వన్డేలు ఆడాడు. దాంతో ఆ జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం’ అని కివీస్ బోర్డు పేర్కొంది. మరొకవైపు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ల నేపథ్యంలో ఆటగాళ్ల నంబర్లను న్యూజిలాండ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. విలియమ్సన్ -22 ఆస్టలే-60 బ్లండెల్-66 బౌల్ట్-18 గ్రాండ్‌హోమ్-77 లాథమ్-48 నికోలస్-86 పటేల్-24 రావల్-1 సోమర్విల్లే-28 సాంత్నార్-74 సౌథి-38 టేలర్-3 వాగ్నర్-35 వాట్లింగ్-47 -
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తరహాలో ఆడండి!
మాంచెస్టర్ : ప్రపంచకప్‌లో గత మ్యాచ్ తాలూకు పరాజయాలు నాకౌట్లో తమ జట్టును ప్రభావితం చేయలేవని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరి అభిప్రాయపడ్డాడు. మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించినట్లైతే కోహ్లి సేనను సులువుగా కట్టడి చేయవచ్చని బ్లాక్ క్యాప్స్‌కు సూచించాడు. బ్యాట్ లేదా బంతితో మొదటి పది ఓవర్లలో దూకుడు ప్రదర్శించినట్లైతే కివీస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియాను భారీ తేడాతో మట్టికరిపించిన ఇంగ్లండ్ జట్టును స్ఫూర్తిగా తీసుకుని సెమీస్‌లో దూకుడు ప్రదర్శించాలని విలియమ్సన్ సేనకు సూచించాడు. ఇంగ్లండ్ తరహాలో మ్యాచ్ ఆది నుంచి టీమిండియా బౌలర్లపై విరుచుకుపడితే విజయం వరించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం మెగాటోర్నీ తుది దశకు చేరిన క్రమంలో అందరి కళ్లూ భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న తొలి సెమీస్‌పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెటోరీ మాట్లాడుతూ..‘ న్యూజిలాండ్ ఔట్‌సైడర్‌గానే సెమీస్‌లో అడుగుపెట్టింది. బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏది ఎదురైనా సరే నాకౌట్లో తొలి పది ఓవర్లను ఘనంగా ఆరంభిస్తే చాలు. అలా అయితే గత మూడు మ్యాచ్‌ల్లో ఓడామనే నైరాశ్యం ఇట్టే ఆవిరైపోతుంది. జట్టుగా సమిష్టిగా పోరాడలేకపోతున్నాం అనుకున్న సమయంలో వ్యక్తిగతంగా మెరుగ్గా రాణించడంపై దృష్టి పెట్టాలి. అలా ప్రతీ ఒక్కరు అనుకుంటే టీమ్ మొత్తం ఉత్తేజంతో నిండిపోతుంది. కావాలంటే శనివారం నాటి దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను చూడండి. వరల్డ్‌కప్ ఆరంభం నుంచి సవాళ్లను ఎదుర్కొన్న ప్రొటీస్ జట్టు చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి టోర్నీ నుంచి నుంచి గౌరవంగా నిష్క్రమించింది. అదే విధంగా ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ ఘన విజయాన్ని గుర్తు చేసుకోండి. హార్ధిక్ పాండ్యా, షమీని వారు సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు గమనించండి. విలియమ్సన్, రాస్ టేలర్ ఫామ్‌లో ఉండటం కివీస్‌కు కలిసి వచ్చే అంశం’ అని తమ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ఇక గతంలో ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం దక్కింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండటం విశేషం. 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఏడు వికెట్లతో గెలిచింది. కాగా ప్రస్తుత ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక ఓటమి మినహా ఏడు సాధికారిక విజయాలతో సెమీస్ చేరిన జట్టు మనదైతే... పాక్‌తో సమానంగా ఐదు విజయాలే సాధించినా, వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కూడా రన్‌రేట్ రూపంలో అదృష్టం కలిసొచ్చి ముందంజ వేసిన టీమ్ న్యూజిలాండ్. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్న కోహ్లి సేనకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్ అంత సులువుగా లొంగుతుందా? అనేది నేటితో తేలనుంది. -
‘కివీస్‌కు అతనితోనే ప్రమాదం’
మాంచెస్టర్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో తొలి సెమీ ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ తలపడనున్న తరుణంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి కొన్ని సూచనలు చేశాడు. ప్రధానంగా తమ దేశ ఆటగాళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మెగా టోర్నీలో అత్యుత్తుమ ఎకానమీతో దుమ్మురేపుతున్న బుమ్రాను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నాడు. ఒకవేళ కాని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ జట్టు సభ్యులకు సుతి మెత్తగా సూచించాడు. మంగళవారం మాంచెస్టర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఐసీసీకి రాసిన ఒక కాలమ్‌లో బుమ్రా విషయాన్నే వెటోరి ప్రధానంగా ప్రస్తావించాడు. ‘ వరల్డ్‌కప్ లీగ్ దశ ముగిసే సరికి ఎకానమీ పరంగా బుమ్రా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఎకానమీ అత్యద్భుతంగా ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతీ ఒక్కర్నీ టార్గెట్ చేసినా బుమ్రా విషయంలో మాత్రం ఆచితూచి ఆడారు. స్సిన్నర్లతో పాటు హార్దిక్, షమీలపై ఎదురుదాడికి దిగారు. అయతే బుమ్రాను ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. భారత్‌కు బుమ్రా ఒక ప్రధాన ఆయుధం. అతని బౌలింగ్ స్పెల్‌ను ఎదుర్కోవడానికి కచ్చితమైన ప్రణాళికలు ఉంటాయి. ఇది నాకౌట్ స్టేజ్. బుమ్రా మరింత ప్రమాదకరమైన బంతులతో సిద్ధమవుతాడు. కివీస్‌కు అతనితోనే ప్రమాదం’ అని వెటోరి తెలిపాడు. -
అందుకు కోహ్లినే కారణం: వెటోరి
సెయింట్ మోరిట్జ్(స్విట్జర్లాండ్):ప్రస్తుతం భారత క్రికెట్లో తన స్పిన్ మంత్రంతో దూసుకపోతున్న యజ్వేంద్ర చాహల్ పూర్తిస్థాయిలో రూపాంతరం చెందడానికి కెప్టెన్ విరాట్ కోహ్లి కృషి ఎంతో ఉందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి స్పష్టం చేశాడు. ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్ చాహల్ తనదైన ముద్రవేయడానికి కారణం కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 'ప్రస్తుతం చాహల్ ఒక ధైర్యవంతమైన బౌలర్ మాత్రమే కాదు.. నమ్మశక్యమైన బౌలర్ కూడా. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్లే చాహల్ రాటుదేలాడు. చిన్నస్వామి స్టేడియం తరహా చిన్న స్టేడియాల్లో బౌలింగ్ చేయడం చాహల్‌కు బాగా కలిసొచ్చింది. దీని వెనుక విరాట్ కృష్టి ఎంతో ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడేటప్పుడు అతనికి కోహ్లి ధైర్యంగా బౌలింగ్ అప్పచెప్పడమే కాకుండా ముందుండి నడిపించేవాడు. దాంతో చాహల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడమే కాకుండా ఒక ఎటాకింగ్ బౌలర్‌గా రూపాంతరం చెందాడు. ఈ రోజు మ్యాచ్ విన్నింగ్ బౌలర్‌గా చాహల్ గుర్తింపు సాధించడానికి కోహ్లినే కారణం' అని వెటోరి పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతిగా తెలిపిన వెటోరి.. కోహ్లి సారథ్యంలో జట్టు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. -
వెటోరీనే హెడ్ కోచ్.. మెంటర్‌గా కిర్‌స్టన్
బెంగళూరు: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, సలహాదారు(మెంటర్)గా గ్యారీ కిర్‌స్టన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో హాబర్ట్ హరికేన్స్ జట్టుకు గ్యారీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో భారత జట్టుకు కోచ్‌గా వ్యహరించిన గ్యారీ.. మూడు ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సైతం కోచ్‌గా సేవలందించాడు. కాగా, ఈ సీజన్లో ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్‌గా, మెంటర్‌గా కిర్‌స్టన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా డానియల్ వెటోరీనే కొనసాగనున్నాడు. మరొకవైపు ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను వ్యవహరించనున్నాడు. ఈనెల 27, 28వ తేదీన ఐపీఎల్ ఆటగాళ్ల కోసం బెంగళూరులో వేలం జరుగనుంది. ఆర్సీబీకి తిరిగి హెడ్ కోచ్‌గా ఎంపికైన వెటోరీ మాట్లాడుతూ.. గ్యారీ కిరస్టన్, ఆశిష్ నెహ్రాలతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరి అనుభవం జట్టుకు మరింతగా కలిసి వస్తుందని వెటోరీ పేర్కొన్నాడు. -
భారత కోచ్ రేసులోకి వెటోరీ
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరీ భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు 2014 సీజన్ నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ పేరును ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ తన అభిప్రాయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. అయితే బోర్డు ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు.