మాంచెస్టర్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో తొలి సెమీ ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ తలపడనున్న తరుణంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి కొన్ని సూచనలు చేశాడు. ప్రధానంగా తమ దేశ ఆటగాళ్లు టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మెగా టోర్నీలో అత్యుత్తుమ ఎకానమీతో దుమ్మురేపుతున్న బుమ్రాను ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నాడు. ఒకవేళ కాని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ జట్టు సభ్యులకు సుతి మెత్తగా సూచించాడు.
మంగళవారం మాంచెస్టర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ జరుగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఐసీసీకి రాసిన ఒక కాలమ్‌లో బుమ్రా విషయాన్నే వెటోరి ప్రధానంగా ప్రస్తావించాడు. ‘ వరల్డ్‌కప్ లీగ్ దశ ముగిసే సరికి ఎకానమీ పరంగా బుమ్రా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఎకానమీ అత్యద్భుతంగా ఉంది. భారత్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతీ ఒక్కర్నీ టార్గెట్ చేసినా బుమ్రా విషయంలో మాత్రం ఆచితూచి ఆడారు. స్సిన్నర్లతో పాటు హార్దిక్, షమీలపై ఎదురుదాడికి దిగారు. అయతే బుమ్రాను ఆడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. భారత్‌కు బుమ్రా ఒక ప్రధాన ఆయుధం. అతని బౌలింగ్ స్పెల్‌ను ఎదుర్కోవడానికి కచ్చితమైన ప్రణాళికలు ఉంటాయి. ఇది నాకౌట్ స్టేజ్. బుమ్రా మరింత ప్రమాదకరమైన బంతులతో సిద్ధమవుతాడు. కివీస్‌కు అతనితోనే ప్రమాదం’ అని వెటోరి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment