
క్రికెట్‌కు వెటోరి వీడ్కోలు
మెల్‌బోర్న్: సుదీర్ఘ కాలంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో భాగంగా ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ డానియెల్ వెటోరి తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే టెస్టులు, టి20లనుంచి తప్పుకున్న 36 ఏళ్ల వెటోరి...ప్రపంచకప్ ఫైనల్‌తో వన్డేలనూ ముగించాడు. 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను, న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా అనేక ఘనతలు సొంతం చేసుకున్నాడు. టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ వెటోరి... రిచర్డ్ హ్యడ్లీ తర్వాత ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన కివీస్ బౌలర్. బోథమ్, కపిల్ తర్వాత 4 వేల పరుగులు, 300 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు.
వెటోరి అంతర్జాతీయ కెరీర్ రికార్డు
మ్యాచ్‌లు పరుగులు సగటు వికెట్లు సగటు అత్యుత్తమ బౌలింగ్
టెస్టులు 113 4531 30.00 362 34.36 12/149
వన్డేలు 295 2253 17.33 305 31.71 5/7
టి20లు 34 205 12.81 38 19.68 4/20