ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆస్ట్రేలియా పురుషుల టీమ్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. గత సీజన్‌లో (2023) జట్టు పేలవ ప్రదర్శనకు లారాను బాధ్యున్ని చేస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు చేపట్టిన లారా.. ఆ సీజన్‌లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి ఆఖరి స్థానంతో ముగించింది.
🚨Announcement🚨
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86
ఆరు సీజన్లలో నలుగురు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఆరు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2019, 2022 సీజన్లలో టామ్ మూడీ.. 2020, 2021 సీజన్లలో ట్రెవర్ బేలిస్.. 2023 సీజన్‌లో లారా.. తాజాగా వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు.
గతంలో ఆర్సీబీ కోచ్‌గా వెటోరీ..
న్యూజిలాండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా పేరు గాంచిన డేనియల్ వెటోరీ.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్ పదవితో పాటు హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
వెటోరీ.. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ హెడ్ కోచ్‌గా, బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ హెడ్‌కోచ్‌గా, ఇంగ్లండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్‌సెక్స్ హెడ్‌కోచ్‌గా, బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టు స్పిన్ కన్సల్టెంట్‌గానూ పని చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment