Head Coach
-
‘మా జట్టు ఆసీస్‌లా మారాలి’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా తరహాలో ఎదురులేని జట్టులా భారత బృందం మారాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటామని భారత మహిళల అండర్–19 టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్ వ్యాఖ్యానించింది. మలేసియాలో విశ్వవిజేతలుగా నిలిచిన అనంతరం జట్టు సభ్యులు గొంగడి త్రిష, కేసరి ధృతి, ట్రెయినర్ షాలినిలతో కలిసి నూషీన్ మంగళవారం నగరానికి చేరుకుంది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళలు అండర్–19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఆమెనే హెడ్ కోచ్‌గా ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు తీసిన నూషీన్ ఖాతాలో ఇప్పుడు కోచ్ హోదాలో వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ చేరాయి. ‘మా అమ్మాయిల నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. ఇదంతా సమష్టిగా సాధించిన విజయం. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ టోర్నీ కోసం ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడ్డాం. దాని ఫలితమే ఇప్పుడు కనిపించింది. మా విజయంలో టీమ్ సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు మాత్రమే కాకుండా ట్రెయినర్, ఫిజియో కూడా ఎంతో శ్రమించారు’ అని నూషీన్ పేర్కొంది. తమకు అందించిన బాధ్యతలకు అనుగుణంగా అమ్మాయిలు స్పందించిన తీరును హెడ్ కోచ్ ప్రశంసించింది. ‘పరిస్థితులను బట్టి తమను తాము మార్చుకునే విషయంలో మా అమ్మాయిలు సరైన రీతిలో స్పందించారు. డిమాండ్ ప్రకారం తమ ఆటను మార్చుకున్నారు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటం వల్ల ప్లేయర్లందరి మధ్య మంచి బంధం ఏర్పడింది. పైగా తమకు అందించిన బాధ్యతలపై ప్రతీ ప్లేయర్‌కు స్పష్టత ఉండటం కూడా ఎంతో మేలు చేసింది. అందుకే వరల్డ్ కప్‌లో కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి అంత గొప్పగా ఆడగలిగాం’ అని కోచ్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం సాధించిన విజయం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని... అయితే దాంతో పోలిస్తే ఈ టైటిల్ మరింత ప్రత్యేకమని నూషీన్ పేర్కొంది. ‘2023లో సాధించిన విజయంతో పోలిస్తే ఈసారి మేం మరింత నిలకడగా, దూకుడుగా, సంపూర్ణ ఆధిపత్యంతో ఆడాం. మానసికంగా కూడా అమ్మాయిలు ఈసారి దృఢంగా ఉన్నారు. అందుకే ఈ గెలుపుపై మాకు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. సెమీస్‌లో ఇంగ్లండ్ రూపంలో మాకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి. కానీ అక్కడా మనోళ్లు జోరు కొనసాగించడం జట్టు బలాన్ని చూపించింది. మహిళల క్రికెట్లో వన్డేలు, టి20లు కలిపి ఆ్రస్టేలియా 13 వరల్డ్ కప్‌లు గెలిచింది. మా జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, అంతే బలంగా మారాలని కోరుకుంటున్నాం. మా తర్వాతి లక్ష్యం కూడా అదే’ అని ఈ మాజీ స్పిన్నర్ సగర్వంగా చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన తెలంగాణ అమ్మాయి త్రిషను కోచ్ ప్రత్యేకంగా అభినందించింది. ‘త్రిష అనుభవాన్ని బట్టి ఆమెను ఓపెనర్‌గా పంపాలని వరల్డ్ కప్‌నకు ముందే నిర్ణయించాం. నిజాయితీగా చెప్పాలంటే ఆమె దూకుడైన బ్యాటింగ్ శైలి మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. త్రిష తన షాట్లను మెరుగుపర్చుకోవడంలో ఎంతో కష్టపడింది’ అని నూషీన్ అభిప్రాయపడింది. వరుసగా రెండు అండర్–19వరల్డ్ కప్ టైటిల్స్ భారత్‌లో మహిళల క్రికెట్‌కు మరింత ఊతం ఇస్తాయని... ఈ స్థాయిలో అమ్మాయిలకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించి భవిష్యత్తులో వారిని మరింత బలమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బోర్డుదేననే నూషీన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా వరల్డ్ కప్‌తో కోచ్‌గా నూషీన్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. -
పరిస్థితి గంభీరం!
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్‌స్వీప్... ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్... ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి. ఒక్క బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ విజయం మినహా హెడ్ కోచ్‌గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్‌లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే. అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్... గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్‌గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగంభారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపిక కాకముందు గంభీర్ ఏ స్థాయిలో కూడా కోచ్‌గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత మూడు ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లకు మెంటార్‌గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్‌గా వ్యవహరించినప్పుడు కోల్‌కతా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్‌లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు. ప్రాక్టీస్ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్ చూపించలేదు. ఒక టి20క్లబ్ టీమ్‌కు మెంటార్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్‌గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు. అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది. ఆ ముగ్గురు ఏం పని చేశారో?నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్‌గా పని చేయలేదనే విషయం గంభీర్‌కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), అభిషేక్ నాయర్ (భారత్), టెన్ డస్కటే (నెదర్లాండ్స్) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్‌కు అవకాశం ఇచ్చింది. అయితే ఆటగాడిగా మోర్కెల్‌కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్ సిరీస్‌లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్ మొదలు ఆడే షాట్ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్‌గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు. దిగితే కానీ లోతు తెలీదు... కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్‌గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్‌గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు. ‘అడిలైడ్ 36 ఆలౌట్’ తర్వాత టీమ్ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్ స్పీచ్’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.కోచ్‌గా ఎంత వరకు! గంభీర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్‌లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్‌కు అలవాటుగా మారింది. కోచ్‌గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా. 140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్‌పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది. అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్‌పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్ 2027 వరల్డ్‌కప్ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌ను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీ కోచ్‌గా గంభీర్‌కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ -
సంధి కాలం కాదు... సత్తా చాటాల్సిన సమయం!
సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా చిత్తయిన తర్వాత భారత క్రికెట్ జట్టు అతి పెద్ద సమరానికి సిద్ధమైంది. ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఆ్రస్టేలియాకు బయలదేరింది. స్వదేశంలో ప్రదర్శన తర్వాత జట్టుపై అంచనాలు తక్కువగానే ఉన్నా... కంగారూ గడ్డపై గత రెండు సిరీస్‌లూ నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన తమ ఆటతీరు స్ఫూర్తిగా కొత్త ఆశలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఓటమిని మరచి ఆసీస్‌పై సత్తా చాటుతామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెబుతున్నాడు. రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వచ్చి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తారని అతను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. విరాట్ కోహ్లితో కలిపి జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ముందే ఆ్రస్టేలియాకు చేరుకోగా... కెపె్టన్ రోహిత్ శర్మ మినహా మిగతా వారంతా సోమవారం బయలుదేరి వెళ్లారు. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరుగుతుంది. ముంబై: భారత జట్టు సంధి దశలో ఉందా లేదా అనే విషయాన్ని తాను పట్టించుకోనని, ప్రస్తుతానికి ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే తన దృష్టి ఉందని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అంశాన్ని కూడా పట్టించుకోవడం లేదని అతను వ్యాఖ్యానించాడు. కోచ్‌గా తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్న గంభీర్ ఆ్రస్టేలియాకు బయలుదేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్‌గా ఒత్తిడి ఎదుర్కోవడంపై... న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై నన్ను విమర్శించ డంలో తప్పు లేదు. వాటిని స్వీకరించేందుకు నేను సదా సిద్ధం. మా ఓటమికి సాకులు వెతకడం లేదు. కివీస్ అన్ని రంగాల్లో చాలా బాగా ఆడింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాపై విరుచుకుపడటంలో అర్థం లేదు. దాని వల్ల మా జీవితాల్లో ఏమైనా తేడా వస్తుందా? నేను ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడే చాలా కష్టమైన పని అని తెలుసు. ఒత్తిడి బాగా ఉంటుందనేది కూడా తెలుసు. నా బాధ్యతను నేను నిజాయితీలో నిర్వర్తిస్తున్నా. కాబట్టి ఒత్తిడి నాకు సమస్య కాదు. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రోహిత్, కోహ్లి ఫామ్‌పై... ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు. వారిద్దరూ మానసికంగా చాలా దృఢమైన వారు. ఇప్పటికే భారత్ తరఫున ఎంతో సాధించిన వారిద్దరు మరిన్ని ఘనతలకు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇంకా ఎంతో తపన మిగిలి ఉంది. దాని కోసం చాలా కష్టపడుతున్నారు. గత సిరీస్ వైఫల్యం తర్వాత పరుగులు సాధించాలనే కసి వారిలో కనిపిస్తోంది. దేశం తరఫున వారి అంకితభావాన్ని ఎప్పుడూ ప్రశి్నంచవద్దు. ఇది పూర్తిగా కొత్త సిరీస్. కాబట్టి అక్కడ బాగా ఆడి సిరీస్ గెలవడమే అందరి లక్ష్యం. టీమిండియా సంధి దశపై... ఎంతో సాధించాలనే ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. జట్టుకు సంబంధించి ఇది సంధి కాలం అనే మాటను నేను నమ్మను. బయటి వారు ఎలా అనుకున్నా నేను అలాంటి పదాలను వాడను. పేరు ఏం పెట్టుకున్నా మార్పు అనేది సహజం. గతంలోనూ భారత జట్టులో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇక ముందూ జరుగుతాయి. నా ధ్యాసంతా ప్రస్తుతం ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే ఉంది. ఇప్పుడు నాకు అన్నింటికంటే అదే ముఖ్యం. ఆసీస్‌లో పరిస్థితులపై... మా ముందు అన్నింటికంటే పెద్ద సవాల్ అక్కడి పరిస్థితులకు అలవాటు పడటమే. వచ్చే పది రోజులు అందుకే చాలా కీలకం. ఈ సమయంలో తగిన విధంగా సన్నద్ధమైతే తొలి మ్యాచ్‌కు ముందు అంతా బాగుంటుంది. గతంలో ఆ్రస్టేలియాలో ఆడిన అనేక మంది అనుభవజు్ఞలు జట్టులో ఉండటం సానుకూలాంశం. వారి అనుభవం యువ ఆటగాళ్లకు కూడా పనికొస్తుంది. ఈ పది రోజులు సన్నాహాలు బాగా సాగితే 22న ఉదయం తొలి బంతి నుంచే చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. వారు ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది అనవసరం. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. పిచ్ ఎలా ఉన్నా మా సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఎవరినైనా ఓడించగలం. జట్టులోని యువ ఆటగాళ్లపై... గతాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడం అవసరం కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వీరిని ఎంపిక చేశారు. విజయానికి ఉపయోగపడగలరనే నమ్మకంతో అత్యుత్తమ జట్టునే ఎంపిక చేశాం. వ్యక్తిగత రికార్డులకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని జూనియర్లకు గట్టిగా చెప్పాను. నితీశ్ కుమార్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు. అవకాశం లభిస్తే అతను సత్తా చాటగలడు. సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు పేసర్లు అలసట లేకుండా ఉండాలనే కారణంతోనే హర్షిత్ రాణాను ‘ఎ’ జట్టుతో పంపలేదు. రంజీ ట్రోఫీలో అతను తగినంత బౌలింగ్ కూడా చేశాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఐదుగురు పేసర్లూ భిన్నమైన శైలి కలవారు కాబట్టి బౌలింగ్‌లో మంచి పదును ఉంది. ఓపెనర్‌గా రాహుల్! కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడటంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్ సమయానికే దీనిపై స్పష్టత వస్తుంది. అయితే ఓపెనర్‌గా భారత్‌కు తగినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని గంభీర్ చెప్పాడు. అయితే అభిమన్యు ఈశ్వరన్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన రాహుల్‌కే అవకాశం దక్కవచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ‘అటు ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్లోనూ ఆడగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్లు ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఉంటారు. రాహుల్ అలాంటి వారిలో ఒకడు. తనకు ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ
పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా జేసన్ గిల్లెస్పీ నియమితుడయ్యాడు. పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గిల్లెస్పీ ఎంపిక జరిగింది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా ఎంపిక కాకముందు గిల్లెస్పీ కేవలం టెస్ట్‌లకు మాత్రమే కోచ్‌గా వ్యవహరించే వాడు. గిల్లెస్పీ త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించబోయే పాక్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఆటగాళ్లతో, క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా కిర్‌స్టన్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. హై పెర్ఫార్మెన్ కోచ్‌గా డేవిడ్ రీడ్‌ను నియమించాలని కిర్‌స్టన్ కోరగా.. పాక్ క్రికెట్ బోర్డు అందుకు నిరాకరించినట్లు సమాచారం.కాగా, ఇటీవలికాలంలో పాక్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు నెలల కాలంలో మూడు సార్లు సెలక్షన్ ప్యానెల్లో మార్పులు చేసిన పీసీబీ.. తాజాగా గ్యారీ కిర్‌స్టన్ హెడ్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇటీవలే బాబర్ ఆజమ్ పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో నిన్ననే బాబర్ స్థానంలో పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలను తప్పించారు. ఈ అంశం అప్పట్లో పాక్ క్రికెట్‌ను కుదిపేసింది. అయితే ఈ ముగ్గురు స్టార్లు లేకపోయినా పాక్ ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో గెలవడం కొసమెరుపు. -
టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు
టీమిండియా చేతిలో ఘోర ఓటముల నేపథ్యంలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురుసింఘేపై వేటు పడింది. హతురుసింఘే తక్షణమే హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. హతురుసింఘే స్థానంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. సిమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ అయిన హతురుసింఘే రెండు సార్లు బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2014-17 మధ్యలో తొలిసారి.. 2023 జనవరి-2024 అక్టోబర్ మధ్యలో రెండోసారి బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. కొత్త కోచ్ సిమన్స్ త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడు.కాగా, బంగ్లాదేశ్ తాజాగా భారత్‌తో ఆడిన టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. ఈ రెండు సిరీస్‌లలో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిన బంగ్లా జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-3 తేడాతో పరాజయం పాలైంది. దీనికి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. బంగ్లా టైగర్స్ పాక్‌ను వారి సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో మట్టికరిపించారు. పాక్‌పై విజయంతో భారీ అంచనాలతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ రెండు సిరీస్‌ల్లో తేలిపోయింది. ఈ నెల 21 నుంచి సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 21న ఢాకా వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ చట్టోగ్రామ్ వేదికగా అక్టోబర్ 29న ప్రారంభంకానుంది. చదవండి: సంపన్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించిన అజయ్ జడేజా -
IPL 2025: పంజాబ్ కింగ్స్ రాత మారేనా!
అన్నట్లు’... మెరుగైన ప్లేయర్లు, అంతకుమించిన సహాయక సిబ్బంది, ప్రతి మ్యాచ్‌లో దగ్గరుండి ప్రోత్సహించే ఫ్రాంచైజీ యాజమాన్యం, అన్నీటికి మించి జట్టు ఎలాంటి ప్రదర్శన చేసినా వెన్నంటి నిలిచే అభిమాన గణం ఇలా అన్నీ ఉన్నా... పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. గత ఏడేళ్లుగా కనీసం టాప్–5లో కూడా నిలవలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త హెడ్ కోచ్‌గా ఆ్రస్టేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రాకతోనైనా పంజాబ్ రాత మారుతుందా లేదా వేచి చూడాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్ ఒకటి. కొన్నేళ్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరుతో లీగ్‌లో ఆడింది. ఆ తర్వాత ఈ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చుకుంది. అయితేనేం ఐపీఎల్ విన్నర్స్ ట్రోఫీ మాత్రం పంజాబ్ జట్టుకు అందని ద్రాక్షగానే ఉంది. క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, షాన్ మార్‡్ష, డేవిడ్ మిల్లర్, మ్యాక్స్‌వెల్, శిఖర్ ధావన్ వంటి విధ్వంసక బ్యాటర్లు ప్రాతినిధ్యం వహించినా... టామ్ మూడీ మొదలుకొని అనిల్ కుంబ్లే వరకు ఎందరో దిగ్గజాలు హెడ్ కోచ్‌లుగా పనిచేసినా పంజాబ్ రాత మాత్రం మారడంలేదు. చివరిసారిగా 2014లో ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు... గత ఏడు సీజన్లలో కనీసం టాప్–5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట ఓడి 10 పాయింట్లు మాత్రమే సాధించింది. గాయం కారణంగా ధావన్ కొన్ని మ్యాచ్‌లకే అందుబాటులో ఉండటం... భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ పేస్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఇలాంటి దశలో జట్టు ప్రక్షాళన చేపట్టిన పంజాబ్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. తన ముద్ర వేస్తాడా? గత పదేళ్లలో తరచూ ప్లేయర్లను మార్చడం... కెప్టెన్లను మార్చడం... కోచ్‌లను మార్చడం ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఆటగాడిగా, శిక్షకుడిగా అపార అనుభవం ఉన్న పాంటింగ్ మార్గనిర్దేశకత్వంలో పంజాబ్ ప్రదర్శన మారుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆటగాడిగా, కోచ్‌గా కొనసాగుతున్న రికీ పాంటింగ్... గత ఏడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రతిభను గుర్తించి సానబెట్టడం, యువ ఆటగాళ్లకు అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసిన పాంటింగ్... ఢిల్లీ జట్టును 2020 సీజన్లో ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ వంటి స్టార్లతో కూడిన జట్టుకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఉన్న పాంటింగ్... పంజాబ్ జట్టును గాడిన పెడతాడని యాజమాన్యం బలంగా విశ్వసిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికలో భాగంగానే పాంటింగ్‌ను నాలుగేళ్లకు కోచ్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ సీఈవో సతీశ్ మీనన్ పేర్కొన్నాడు. వారికి భిన్నంగా.. ఇప్పటి వరకు పంజాబ్ జట్టుకు టామ్ మూడీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, అనిల్ కుంబ్లే, ట్రెవర్ బేలిస్ కోచ్‌లుగా వ్యవహరించారు. వీరందరికీ భిన్నంగా పాంటింగ్ జట్టును నడిపిస్తాడని యాజమాన్యం ఆశిస్తోంది. అందుకు తగ్గట్లే పంజాబ్ జట్టుతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పాంటింగ్ వెల్లడించాడు. ‘కొత్త సవాల్ స్వీకరించడం ఆనందంగా ఉంది. ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నా. ఎన్నో ఏళ్లుగా జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు... భిన్నమైన జట్టును చూపిస్తా’ అని పాంటింగ్ అన్నాడు. జట్టులో సమూల మార్పులు ఆశిస్తున్న పాంటింగ్... త్వరలోనే సహాయక బృందాన్ని ఎంపిక చేయనున్నాడు. ప్రస్తుతం బంగర్ పంజాబ్ ఫ్రాంచైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్‌గా కొనసాగుతుండగా... లాంగ్‌వెల్ట్ ఫాస్ట్ బౌలింగ్, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ కోచ్‌లుగా ఉన్నారు. కోర్ గ్రూప్‌పై దృష్టి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ ఈ ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అర్‡్షదీప్, జితేశ్ శర్మ, రబడ, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో వంటి పలువురు నాణ్యమైన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వచ్చే ఐపీఎల్‌కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టు కోవాలా లేదా అనే విషయంపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఏడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించిన పంజాబ్ కింగ్స్... అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ ద్వారా పంజాబ్ జట్టుకు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ వంటి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు లభించినట్లైంది. తాజా సీజన్లో అతి క్లిష్ట పరిస్థితులను సైతం ఈ జోడీ సమర్థంగా ఎదుర్కొని భవిష్యత్తుపై భరోసా పెంచింది. ఇలాంటి వాళ్లను సానబెట్టడంలో సిద్ధహస్తుడైన పాంటింగ్ వేలం నుంచే తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు. -
భారత మాజీ క్రికెటర్‌కు షాక్.. నెల రోజులకే హెడ్‌కోచ్ పోస్ట్ ఊస్ట్?
కెన్యా క్రికెట్ బోర్డు గత నెలలో తమ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డా గణేష్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే నెలల రోజుల తిరిగకముందే కెన్యా క్రికెట్ దొడ్డా గణేష్‌కు ఊహించని షాకిచ్చింది. గణేష్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కెన్యా క్రికెట్ బోర్డు రద్దు చేసింది.ఈ నెల ఆఖరిలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2027 ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో కెన్యా జట్టు హెడ్కోచ్లగా లామెక్ ఒన్యాంగో, జోసెఫ్ అంగారా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా దొడ్డా గణేష్ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గణేష్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని క్రికెట్ కెన్యా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఆగస్టులో నైరోబీలోని సిక్కు యూనియన్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో దొడ్డా గణేష్‌తో ఏడాది పాటు తమ జట్టు హెడ్‌కోచ్‌గా కెన్యా క్రికెట్ ఒప్పందం కుదుర్చుకుంది. వన్డే ప్రపంచకప్‌లో కెన్యా మళ్లీ భాగమయ్యేలా కృష్టి చేస్తానని గణేష్ హామీ ఇచ్చాడు. కానీ అంతలోనే అతడి కాంట్రాక్‌ను కెన్యా క్రికెట్ రద్దు చేసింది.ఎవరీ దొడ్డ గణేష్..?కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు. భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు.అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.చదవండి: #Shreyas Iyer: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ' -
మొన్న టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్..!
హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఆథ్వర్యంలో శ్రీలంక క్రికెట్ జట్టు సంచలన విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే భారత్‌కు వన్డే సిరీస్‌లో షాకిచ్చిన (0-2 తేడాతో) శ్రీలంక.. తాజాగా ఇంగ్లండ్‌కు వారి సొంతగడ్డపై ఓటమి రుచి చూపించింది. జయసూర్య హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక శ్రీలంక ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు ప్రతి ఒక్కరూ రాణిస్తున్నారు. జయసూర్య పర్యవేక్షణలో కమిందు మెండిస్, పథుమ్ నిస్సంక, మిలన్ రత్నాయకే లాంటి యువ ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ.. యువ ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉండింది. మూడో టెస్ట్‌లో నిస్సంకకు అవకాశం ఇచ్చి జయసూర్య పెద్ద సాహసమే చేశాడు. సత్ఫలితం రాబట్టాడు. మూడో టెస్ట్‌లో నిస్సంక తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ.. ఛేదనలో మెరుపు సెంచరీ చేసి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొత్తంగా జయసూర్య శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు.కాగా, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది.నిస్సంక సూపర్ సెంచరీ219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక సూపర్ సెంచరీతో (127 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. నిస్సంక.. ఏంజెలో మాథ్యూస్‌తో (32 నాటౌట్; 3 ఫోర్లు) కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు.పోప్ భారీ శతకంఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఓలీ పోప్ భారీ శతకంతో (154) కదంతొక్కాడు. బెన్ డకెట్ (86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. నిస్సంక (64), ధనంజయ డిసిల్వ (69),కమిందు మెండిస్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.ఆతర్వాత లంక బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. లహీరు కుమార 4, విశ్వ ఫెర్నాండో 3, అశిత ఫెర్నాండో 2, మిలన్ రత్నాయకే ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ జేమీ స్మిత్ (67) ఒక్కడే అర్ద సెంచరీ చేశాడు. -
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ నూతన హెడ్ కోచ్‌ను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ శనివారం ఆర్ఆర్ మేనేజ్మెంట్ తమ నూతన హెడ్ కోచ్‌గా టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయల్స్ 2024 ఎడిషన్‌లో డెడికేటెడ్ హెడ్ కోచ్ లేకుండానే బరిలో నిలిచింది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా.. ట్రెవర్ పెన్నీ, షేన్ బాండ్లు అసిస్టెంట్ కోచ్‌లుగా వ్యవహరించారు. రాయల్స్ గత సీజన్ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడింది.కాగా, ద్రవిడ్ 2011-2013 మధ్యలో రాయల్స్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2014 ఎడిషన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. అనంతరం అతను భారత అండర్-19, ఇండియా-ఏ, ఎన్సీఏలో హెడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా హెడ్ కోచ్ వంటి హోదాల్లో పని చేశాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలోనే టీమిండియా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ను చేజిక్కించుకుంది. అలాగే ద్రవిడ్ హయాంలో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా చేరింది. తాజా సమాచారం మేరకు ద్రవిడ్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికవుతాడని తెలుస్తుంది. కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగే అవకాశం ఉంది. -
ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్ల హెడ్ కోచ్‌గా మెక్కల్లమ్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్ల హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇవాళ (సెప్టెంబర్ 3) అధికారికంగా ప్రకటించింది. మెక్కల్లమ్ 2022 నుంచి ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అతని కాంట్రాక్ట్‌ను ఈసీబీ 2027 వరకు పొడిగించింది. మెక్కల్లమ్ పూర్తి స్థాయి ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా వచ్చే ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపడతాడు. భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి మెక్కల్లమ్ ప్రస్తానం మొదలుకానుంది. అనంతరం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మెక్కల్లమ్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల తాత్కాలిక హెడ్ కోచ్‌గా మార్కస్ ట్రెస్కోథిక్ వ్యవహరిస్తాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు, ఆతర్వాత విండీస్ పర్యటనకు ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పని చేస్తాడు. కాగా, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా ఉన్న మాథ్యూ మాట్స్ ఇటీవలే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మాట్స్ ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022లో ఛార్జ్ తీసుకున్నాడు. అయితే అతను అనివార్య కారణాల వల్ల తన నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగాడు. మాట్స్ వైదొలిగిన నెల వ్యవధిలోనే ఈసీబీ మెక్‌కల్లమ్‌ను వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా నియమించింది. మాట్స్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
కెన్యా క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
కెన్యా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ నియమితుడయ్యాడు. కెన్యా క్రికెట్ బుధవారం ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్ సమీపిస్తున్న తరుణంలో కొత్త కోచ్‌ను నియమించుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దొడ్డ గణేశ్ మాట్లాడుతూ.. కెన్యా జట్టును ప్రపంచకప్ పోటీలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చాంపియన్లు ఉన్నారుగతంలో ఏం జరిగిందన్న విషయంతో తనకు సంబంధం లేదని.. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారని గణేశ్ అన్నాడు. కెన్యాలో చాంపియన్లకు కొదవలేదని.. వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ 1997లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అదే ఏడాది తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడేశాడు.భారత్ తరఫున మొత్తంగా నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 25, వన్డేలో నాలుగు పరుగులు చేశాడు. అదే విధంగా టెస్టుల్లో ఐదు, వన్డేలో ఒక వికెట్ తీశాడు. అయితే, దొడ్డ గణేశ్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఘనమైన రికార్డు ఉంది. మొత్తంగా 193 దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన గణేశ్ 493 వికెట్లు తీయడంతో పాటు 2548 పరుగులు సాధించాడు.ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2026కు అర్హత సాధించే క్రమంలో కెన్యా తొలుత ఆఫ్రికన్ దేశాల జట్లతో పోటీపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో జరుగనున్న ఐసీసీ డివిజన్ 2 చాలెంజ్ లీగ్ సందర్భంగా కెన్యా హెడ్‌కోచ్‌గా దొడ్డ గణేశ్ ప్రయాణం మొదలుకానుంది. ఇక అక్టోబరులో తొలుత పపువా న్యూగినియా, ఖతార్, డెన్మార్క్ జట్లతో ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో తలపడనున్న కెన్యా జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.గతంలోనూకాగా గతంలోనూ భారత క్రికెటర్లు విదేశీ జట్లకు కోచ్‌లుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్, ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్, ఒమన్ కోచ్‌గా సునిల్ జోషి తదితరులు పనిచేశారు. ఇక టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌గా మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టును గైడ్ చేసిన రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ఆ పగ్గాలను చేపట్టాడు.చదవండి: పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!Cricket Kenya unveil former aindian International cricketer Dodda Ganesh as the new men's National Team head coach. Kenya will face Papua New Guinea, Qatar, Denmark and Jersey in the ICC Division 2 Challenge League in September and T20 World Cup Africa Qualifiers in October. pic.twitter.com/om0jahHMIy— Nami Nation (@namination254) August 13, 2024 -
‘భారత్‌కు స్వదేశీ కోచ్ ఉంటేనే మేలు’
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్ కోచ్ మనొలొ మార్క్వెజ్ అభిప్రాయపడ్డారు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్ను ఇటీవల హెడ్ కోచ్‌గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్‌లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్‌కు హెడ్ కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. అయితే భారత్ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్ వివరించారు. ‘భారత్ కోచ్‌గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత్ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని అన్నారు. -
ఆండ్రూ ఫ్లింటాప్ కాదు.. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక లెజెండ్!?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మాథ్యూ మోట్పై వేటు వేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024లో ఇంగ్లండ్ జట్టు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాథ్యూ మోట్‌ను హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించాలని ఈసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కరను తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అతడితో ఈసీబీ చర్చలు కూడా జరిపినట్లు వినికిడి. కుమార్ సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. అయితే ఆ పదవిని భారత మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు హెడ్‌కోచ్‌గా సంగక్కర వెళ్లనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తొలుత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఆ దేశ క్రికెట్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపించాయి.కానీ ఫ్లింటాప్ మాత్రం హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి చూపలేదంట. ఈ నేపథ్యంలోనే ఈసీబీ పెద్దలు చర్చలు సంగక్కరతో జరిపినట్లు తెలుస్తోంది. ఇక వన్డే ప్రపంచకప్-2023, టీ20 వరల్డ్‌కప్-2024 రెండింటిలోనూ ఫైనల్‌కు ఇంగ్లండ్‌ను చేర్చడంలో విఫలమైనప్పటకీ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు బోర్డు మొగ్గు చూపినట్లు సమాచారం. -
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. హెడ్‌కోచ్‌గా భారత్‌కు టీ20 వరల్డ్‌కప్ అందించిన రాహుల్ ద్రవిడ్‌పై రాజస్తాన్ రాయల్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు అతడిని తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని రాయల్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రాజస్తాన్ యాజమాన్యం ద్రవిడ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ కూడా రాజస్తాన్ ఆఫర్‌పై సముఖంగా ఉన్నట్లు వినికిడి. కాగా ఈ మిస్టర్ డిఫెండ్బుల్కు రాజస్తాన్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో రాజస్తాన్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా ద్రవిడ్ పనిచేశాడు. 2012, 2013 సీజన్లలో రాజస్తాన్ సారథిగా ద్రవిడ్ వ్యవహరించాడు.అనంతరం 2014. 2015 సీజన్లలో రాజస్తాన్ మెంటార్‌గా తన సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి మరోసారి రాయల్స్‌తో జత కట్టేందుకు మిస్టర్ వాల్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. .కాగా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌కు కుమార సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంగ్కర నుంచి కోచింగ్ బాధ్యతలు ద్రవిడ్ తీసుకునే అవకాశముంది. కాగా కోచ్‌గా కూడా ద్రవిడ్‌కు అపారమైన అనుభవం ఉంది. 2016, 2017 సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్( ఢిల్లీ క్యాపిటల్స్)కు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పనిచేశాడు. ఆ తర్వాత 2019 వరకు భారత అండర్-19 జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ కొనసాగాడు. ఆ తర్వాత 2021-2024 వరకు టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తించాడు. -
సీనియర్లు అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందే
సూటిగా, మొహమాటానికి తావు లేకుండా... భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో భవిష్యత్తు గురించి తన ఆలోచనలేమిటో చెప్పేశాడు. సీనియర్ ఆటగాళ్లయినా సరే తమకు నచ్చినట్లుగా సిరీస్‌లు ఆడతామంటే కుదరదని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్నాను అని చెబుతూ ఫిట్నెస్ ఉంటేనే అంటూ అది సాధ్యమవుతుందని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చే ఫలితాలు రాబడతానన్న గంభీర్... విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించాడు. న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు. శనివారం నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అతను బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తొలిసారి మీడియాతో అన్ని విషయాలపై మాట్లాడాడు. టీమిండియా భవిష్యత్తు, తన ప్రణాళికల గురించి వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్‌గా తన ఆలోచనలపై... నేను ఒక విజయవంతమైన జట్టు బాధ్యతలు తీసుకుంటున్నాను. టి20 వరల్డ్ చాంపియన్, వన్డేలు, టెస్టుల్లో రన్నరప్ టీమ్ ఇది. అనూహ్య మార్పులతో నేను పరిస్థితిని చెడగొట్టను. ఒక హెడ్ కోచ్, ఆటగాడి మధ్య ఉండే బంధం తరహాలో కాకుండా వారికి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. పరస్పర నమ్మకంతోనే ఫలితాలు వస్తాయి. నేను అన్ని సమయాల్లో ఆటగాళ్లకు అండగా నిలుస్తా. ఏం చేసినా జట్టు గెలుపే లక్ష్యం కావాలి. వేరే మాటకు తావు లేదు. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శించాలి. విజయాలు లభిస్తేనే డ్రెస్సింగ్ రూమ్ మొత్తం సంతోషంగా ఉంటుంది. నేను అడిగిన సహాయక సిబ్బందిని ఇచి్చన బోర్డుకు కృతజ్ఞతలు. ఆటగాళ్లు సిరీస్‌లు ఎంచుకోవడంపై... నా దృష్టిలో బుమ్రాలాంటి బౌలర్లకు మాత్రమే విశ్రాంతి అవసరం. ప్రతీ ఒక్కరు జట్టులో ఉండాలనుకునే బుమ్రా ఒక అరుదైన బౌలర్. కాబట్టి అతడిని, ఇతర పేసర్లకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే గానీ బ్యాటర్లకు పని భారం అనేది ఉండదు. నిలకడగా ఆడుతూ ఫామ్‌లో ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడవచ్చు. రోహిత్, కోహ్లి ఇప్పుడు రెండు ఫార్మాట్లే ఆడుతున్నారు కాబట్టి వారు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండవచ్చు. ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఒక సిరీస్‌లో ఆడతామని, మరో సిరీస్‌లో ఆడమని అంటే కుదరదు. రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై... వారిద్దరిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని నా భావన. వారు జట్టుకు ఎంత విలువైన ఆటగాళ్లో అందరికీ తెలుసు. ఏ జట్టయినా తమకు అలాంటి ఆటగాళ్లు కావాలని కోరుకుంటుంది. ఫిట్‌గా ఉంటే మాత్రం రోహిత్, కోహ్లి 2027 వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఆడవచ్చు. జట్టుకు ఉపయోగపడగలమనే భావన వారిలో ఉంటే ఎప్పటి వరకు ఆడగలరనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే చివరికి ఏదైనా జట్టు కోసమే. కోహ్లితో విభేదాలపై... నాకు, విరాట్‌కు మధ్య ఎలాంటి బంధం ఉందనేది మా ఇద్దరికీ బాగా తెలుసు. ఇది జనం ముందు చూపించేది కాదు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చెప్పుకోవచ్చు. మైదానంలో తన జట్టు కోసం పోరాడే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు మేం భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాం. జట్టు గెలుపు కోసమే ప్రయతి్నస్తాం. అది మా బాధ్యత. నేను కోచ్‌గా ఎంపికయ్యాక, అంతకుముందు కూడా చాలా మాట్లాడుకున్నాం. అత్యుత్తమ ఆట గాడైన కోహ్లి అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘సూర్యను అందుకే కెప్టెన్ ను చేశాం’ భారత టి20 కెప్టెన్ గా అయ్యే అర్హత అతనికి అన్ని విధాలా ఉంది. ఈ ఫార్మాట్లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్. గత ఏడాది కాలంగా అతని గురించి, నాయకత్వ లక్షణాల గురించి డ్రెస్సింగ్ రూమ్ సహచరులు కూడా గొప్పగా చెప్పారు. జట్టు సారథి అన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటాం. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక ఆటగాడే. ఆల్‌రౌండర్‌గా అతని సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఫిట్నెస్ సమస్యలే ప్రధాన బలహీనత. గత కొంత కాలంగా అతను వీటిని ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్లు ఆడే నైపుణ్యంతో పాటు శుబ్‌మన్ గిల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకే వైస్‌కెప్టెన్ ను చేశాం. అతను మరింత నేర్చుకుంటాడు. అక్షర్‌కు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇవ్వడం కోసమే జడేజాకు విరామం ఇచ్చాం తప్ప అతడిని తప్పించలేదు.పంత్, రాహుల్ ఉన్నాక మరో కీపర్ అవసరం లేదు కాబట్టి సామ్సన్ను పక్కన పెట్టక తప్పలేదు. రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్ కప్ కోణంలో కొన్ని ప్రయోగాలతో కొత్తగా ప్రయతి్నస్తున్నాం. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. –అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ చైర్మన్ -
భారత ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్‌గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్‌బాల్ టీమ్‌కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్‌సీ గోవా కోచ్‌గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్‌గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్‌లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్‌గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. స్పెయిన్‌లో కోచ్‌గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్‌లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్‌గా పని చేశారు. -
అతడికి మాత్రమే ఆ అర్హత.. గౌతం గంభీర్ భార్య నటాషా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ముంబై: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇకపై కొత్త పాత్రలో టీమిండియాతో కలిసి పని చేయనున్నాడు. 43 ఏళ్ల గంభీర్‌ను భారత హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. ఇదే సిరీస్ నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది. కొత్త కోచ్ కోసం మే 13 నుంచి బీసీసీఐ దరఖాస్తులు కోరింది. అంతకుముందే కోచ్ పదవిని స్వీకరించమంటూ మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ కోరినా... అతను తిరస్కరించాడు.తన ఆసక్తిని బహిరంగంగానే ప్రకటిస్తూ గంభీర్ కూడా దరఖాస్తు చేసుకోగా, ఒక్క డబ్ల్యూవీ రామన్ మాత్రమే అతనితో పోటీ పడ్డాడు. ఎలాగూ ముందే నిర్ణయించేశారనే భావన వల్ల కావచ్చు, విదేశీ కోచ్‌లు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు ఊహించినట్లుగా గంభీర్‌కు పగ్గాలు లభించాయి. ఆటగాడిగా ఘనమైన రికార్డు... 2004–2012 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలో గంభీర్ ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 58 టెస్టుల్లో 41.95 సగటుతో 4154 పరుగులు చేసిన అతను 9 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 37 అంతర్జాతీయ టి20ల్లో 119.02 స్ట్రయిక్ రేట్, 7 హాఫ్ సెంచరీలతో 932 పరుగులు పరుగులు సాధించాడు. అన్నింటికి మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్ రెండు అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో వచ్చాయి. పాకిస్తాన్‌తో 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులతో, శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నేపియర్‌లో న్యూజిలాండ్‌తో 11 గంటల పాటు క్రీజ్‌లో నిలిచి 436 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి కాపాడటం టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్లో ముందుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారాడు. 2012, 2014లలో కెపె్టన్‌గా కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. కోచ్‌గా తొలిసారి... రిటైర్మెంట్ తర్వాత చాలామందిలాగే గంభీర్ కూడా కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా పని చేశాడు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయిన అతను పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అధికారికంగా కోచ్ హోదాలో పని చేయడం గంభీర్‌కు ఇదే తొలిసారి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు 2022, 2023 సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించగా, రెండుసార్లు కూడా లక్నో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. అయితే 2024 సీజన్లో కోల్‌కతాకు మెంటార్‌గా వెళ్లిన అతను టీమ్‌ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సాఫల్యమే అతడిని భారత జట్టు కోచ్ రేసులో ముందంజలో నిలిపింది. మరోవైపు టి20 వరల్డ్ కప్ వరకు జట్టుతో పని చేసిన విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్ ), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) పదవీ కాలం కూడా ముగిసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త బృందాన్ని ఎంచుకునే అధికారం గంభీర్‌కు ఉంది. -
భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ పదవికి 291 దరఖాస్తులు
ఖాళీగా ఉన్న భారత సీనియర్ పురుషుల హెడ్ కోచ్ పదవి కోసం 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ సభ్యుడు, గతంలో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్న స్టాన్లీ రొజారియో... నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ అసిస్టెంట్ కోచ్ నౌషాద్ మూసా కూడా ఉన్నారు. 64 ఏళ్ల రొజారియో సరీ్వసెస్‌తో తన కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టి 2006 నుంచి 2008 వరకు టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ నెలాఖరుకు కొత్త కోచ్‌ను నియమిస్తారు. -
భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో శ్రీలంక దారుణ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్కమ్రించింది. దీంతో అప్పటివరకు లంక హెడ్‌కోచ్‌గా పని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త హెడ్‌కోచ్‌ను భర్తీ చేసే పనిలో శ్రీలంక క్రికెట్ బోర్డు పడింది. అయితే కొత్త కోచ్ వచ్చే అంతవరకు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనిచేయనున్నాడు. కాగా జయసూర్య ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా డు. ఇప్పుడు ప్రమోషన్ పొంది హెడ్‌కోచ్‌గా సేవలు అందించున్నాడు ఈ లెజండరీ క్రికెటర్. స్వదేశంలో ఈ నెల 27 నంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య ప్రయాణం మొదలు కానుంది. లంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. కాగా ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: #Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా -
'ది గ్రేట్ వాల్'.. కప్పు కొట్టించాడు! తన ప్రస్ధానాన్ని ముగించాడు
టీ20 వరల్డ్‌కప్-2024 ఘనంగా ముగిసింది. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా ఎగురేసుకోపోయింది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కీలకమైన ఫైనల్లోనూ సత్తాచాటింది. శనివారం బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత జట్టు.. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.భారత జట్టుకు సారథిగా వరల్డ్‌కప్ ట్రోఫీని అందించాలన్న రోహిత్ శర్మ కల ఎట్టకేలకు నేరవేరింది. అదే విధంగా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి తన ప్రస్ధానాన్ని ముగించాలన్న రాహుల్ ద్రవిడ్ కోరిక కూడా ఈ విజయంతో తీరింది. వీరిద్దరితో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం తన కెప్టెన్ సాధించలేకపోయిన ట్రోఫీని.. కనీసం ఆటగాడిగానైనా దక్కించుకున్నందుకు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ గుడ్ బై చెప్పగా.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత జట్టుతో తన ప్రయాణాన్ని ముగించాడు.ముగిసిన రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం..భారత పురుషల జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రస్ధానం ముగిసింది. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నద్రవిడ్.. తన మార్క్‌ను కోచింగ్‌లోనూ చూపించాలనుకున్నాడు.ఈ క్రమంలోనే 2021 నవంబరులో రవి శాస్త్రి నుంచి భారత హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. 2013 నుంచి భారత్‌ను ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని సాధించడమే లక్ష్యంగా ద్రవిడ్ పెట్టుకున్నాడు.ఇది అతడి లక్ష్యం మాత్రమే కాదు అతడి ముందు ఉన్న సవాలు కూడా. ఎందుకంటే ద్వైఫాక్షిక సిరీస్‌లలో మాత్రమే అదరగొడుతుందని, ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుందన్న ఆపఖ్యాతి అప్పటికే భారత్ మూటకట్టుకుంది. ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి.2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లోద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ చేరినప్పటకి.. అక్కడ కూడా మళ్లీ నిరాశే. ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఎంతమంది కోచ్‌లు మారిన ఐసీసీ టోర్నీల్లో భారత్ తల రాత మారలేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ద్రవిడ్ ఎక్కడా కుంగిపోలేదు. ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ జట్టును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తాచాటిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఆ మెగా టోర్నీలో భారత్ ప్రదర్శన చూసి అంతా కప్ మనదే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఆసీస్ చేతిలో తుది మెట్టుపై భారత్ బోల్తా పడింది. మళ్లీ ద్రవిడ్‌కు నిరాశే మొదలైంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో తన పదవీ కాలం ముగిసినప్పటికి మరో ఏడాది తన కాంట్రాక్ట్‌ను పొడిగించాడు. ఈ సారి ఎలాగైనా కప్ కొట్టే తన ప్రస్ధానాన్ని ముగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మిషన్ టీ20 వరల్డ్‌కప్ 2024ను ద్రవిడ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకప్పుడు మైదానంలో బౌలర్ల ఓపికను పరీక్షించిన ద్రవిడ్‌కు.. ఈ నిరీక్షణ పెద్ద లెక్కేమి కాదు. గతం గతహా అన్నట్లు ఆటగాళ్లను పొట్టి ప్రపంచకప్ కోసం అన్ని విధాలగా సన్నద్దం చేశాడు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్ 24 మంది ఆటగాళ్లతో కూడిన ఒక పూల్న్ని సిద్దం చేశాడు. ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే. ఇందులో నుంచి 15 మంది అత్యుత్తమ ఆటగాళ్లను టీ20 వరల్డ్‌కప్-2024కు ఎంపిక చేశారు. ఈ 15 మంది సభ్యుల బృందం వరల్డ్‌కప్‌లో తలపడేందుకు అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్ నుంచే ద్రవిడ్ తెర వెనుకుండి జట్టును నడిపించాడు. రోహిత్‌కు విలువైన సూచనలు ఇస్తూ ఫైనల్‌కు చేర్చాడు.ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటూ కప్పు కొట్టేలా చేశాడు. ఆఖరికి పట్టువదలని విక్రమార్కుడిలా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడి హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ముగించాడు. ఆఖరిగా తన కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్‌గా సాధించని వరల్డ్‌కప్ టైటిల్‌ను కోచ్‌గా సాధించి ద్రవిడ్ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయం సాధించిన అనంతరం ద్రవిడ్ కప్‌ను పట్టుకుని చిన్న పిల్లాడిలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కోచ్‌గా ద్రవిడ్ రికార్డులు ఇవే..భారత్ 24 టెస్టుల్లో 14 గెలిచి మూడింట్లో ఓడింది.13 వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ పదింటిని గెలుచుకుంది. అలాగే రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్లో ఆడిన 56 మ్యాచ్‌ల్లో 41 విజయాలున్నాయి.77 టీ20 మ్యాచ్‌ల్లో 56 గెలిచింది. Never expected idhi #RahulDravid 😂❤️pic.twitter.com/n7o3Ffa83O— Harsha... (@harshatweets03) June 29, 2024 -
టీమిండియాతో టీ20 సిరీస్.. జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పురుషుల జట్టు హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జస్టిన్ సామన్స్ను జింబాబ్వే క్రికెట్ బోర్డు నియమించింది.ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2024కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో జింబ్వాబ్వే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి డేవ్ హౌటన్ ఈ ఏడాది ఆరంభంలో తప్పుకున్నాడు. అప్పటి నుంచి జింబ్వాబ్వే ప్రధాన కోచ్లేకుండానే పలు టీ20 సిరీస్‌లు ఆడింది.ఈ నేపథ్యంలోనే తమ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా సామన్స్ను జింబాబ్వే క్రికెట్ ఎంపిక చేసింది. సామన్స్తో పాటు ఆ దేశ మాజీ ఆటగాడు డియోన్ ఇబ్రహీమ్‌కు సైతం జింబాబ్వే క్రికెట్ కీలక బాధ్యతల అప్పగించింది. జింబాబ్వే అసిస్టెంట్ కోచ్‌గా డియోన్ ఇబ్రహీమ్ పనిచేయనున్నాడు. కాగా సామన్స్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. సామన్స్ గతంలో సౌతాఫ్రికా హైఫెర్మెమెన్స్ సెంటర్లో కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా 2021 నుంచి 2023 వరకు ప్రోటీస్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుని కూడా పనిచేశాడు.ఇక స్వదేశంలో భారత్‌తో 5 మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో జింబ్వావ్వే తలపడనుంది. ఈ సిరీస్ జూలై 6న ప్రారంభమై జూలై 14తో ముగియనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. -
ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్లైన్లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం గత ఏడాది నవంబర్‌లో ముగిసింది. అయితే అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న టి20 ప్రపంచకప్ కోసం ద్రవిడ్‌కు తాత్కాలిక పొడిగింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ఇదివరకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్వేషణ మొదలుపెట్టింది. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, స్రూ్కటినీ పూర్తయ్యాక చివరకు మిగిలిన ఇద్దరు గంభీర్, రామన్లలో గౌతీనే ఖాయం చేద్దామని బోర్డు సుముఖంగా ఉంది. అయితే తుది ఇంటర్వ్యూ ముగించాకే సీఏసీ సిఫార్సు మేరకు నిర్ణయం వెలువరించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. మంగళవారం సీఏసీ హెడ్ అశోక్ మల్హోత్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో గంభీర్, రామన్‌లు తమ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు టీమిండియా కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా వెచి్చస్తాననేది, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ తెలిపాడు. -
హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్‌కు ఉద్వాసన పలికారు. 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియా మూడో రౌండ్‌కు అర్హత సాధించలేకపోవడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్టిమాక్ సేవలకు మంగళం పాడింది. క్రొయేషియాకు చెందిన ఈ మాజీ ఫుట్‌బాలర్‌ను 2019లో కోచ్‌గా నియమించారు. ఆయన శిక్షణలో భారత జట్టు నాలుగు మేజర్ ట్రోఫీలను సాధించింది. ఇందులో రెండు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ టైటిళ్లు కాగా, ఇంటర్కాంటినెంటల్ కప్, ముక్కోణపు సిరీస్ ఉన్నాయి. దీంతో గత అక్టోబర్‌లో ఆయనకు 2026 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే సునీల్ ఛెత్రి (ప్రస్తుతం రిటైరయ్యాడు) నేతృత్వంలోని భారత్ క్వాలిఫయర్స్‌లో ఎప్పటిలాగే రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శన సరిగాలేని కారణంతో గడువుకు ముందే స్టిమాక్‌ను తొలగించారు. ఒప్పందం ప్రకారం ఇలా అర్ధంతరంగా సాగనంపితే స్టిమాక్‌కు 3,60,000 డాలర్లు (రూ. 3 కోట్లు) ఏఐఎఫ్ఎఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తం చెల్లించేందుకు సమాఖ్య సిద్ధమైంది. హెప్టాథ్లాన్‌లో శ్రీతేజకు కాంస్య పతకం జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి థోలెం శ్రీతేజ కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం ముగిసిన ఈ టోర్నీలో శ్రీతేజ ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మూడో స్థానంలో నిలిచింది.శ్రీతేజ ఓవరాల్‌గా 4136 పాయింట్లు సాధించింది. రినీ ఖాతూన్ (పశి్చమ బెంగాల్; 4357 పాయింట్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. స్నేహిత్‌కు కాంస్యం సాక్షి, హైదరాబాద్: బ్రిక్స్ గేమ్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ కాంస్య పతకాన్ని సాధించాడు. రష్యాలోని కజాన్ పట్టణంలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్నేహిత్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఓడిపోయాడు. కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)తో జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 9–11, 8–11, 6–11తో ఓటమి చవిచూశాడు. -
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్..?
టీమిండియా తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ ఎంపిక కాబోతున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో అతని కోచింగ్ బృందంలోని సభ్యులను కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రాహుల్ బృందంలో ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నాడు. ఒకవేళ ద్రవిడ్‌తో పాటు అతని సహాయ బృందం మొత్తం తప్పుకుంటే.. బీసీసీఐ కొత్త కోచింగ్ టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన సపోర్టింగ్ స్టాఫ్ ఎంచుకునే విషయంలో గంభీర్ పూర్తి స్వేచ్చను ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఇందులో భాగంగా గంభీరే రోడ్స్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. గంభీర్, రోడ్స్ 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సేవలందించారు. గంభీర్ మెంటార్, రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా లక్నో ఫ్రాంచైజీకి పని చేశారు. కోచ్‌గా తొలిసారి..గంభీర్ భారత ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా నియమితుడైతే ఇదే అతనికి హెడ్ కోచ్‌గా మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రధానంగా వినిపిస్తుంది. -
టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్..?
-
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఖరారు
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెల (జూన్) చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో బీసీసీఐ అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించవచ్చని సమాచారం.ఒకవేళ ఇదే నిజమైతే 42 ఏళ్ల గంభీర్‌కు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్ హెడ్ కోచ్‌గా పని చేయలేదు. అయితే అతను మూడు సీజన్ల పాటు ఐపీఎల్లో మెంటార్‌గా వ్యవహరించాడు. 2022, 2023లో లక్నోతో.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా పని చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతోనే గంభీర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా అవకాశం వచ్చింది.టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్‌ను తనే ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు బీసీసీఐ అంగీకరిస్తే ప్రస్తుతమున్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రవిడ్‌తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్‌గా పరస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.టీ20 వరల్డ్‌కప్ 2024 తర్వాత భారత్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్‌గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలవుతాయి. జులై 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్‌కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్‌మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్‌కప్ 2024తో భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్‌కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే సరైనోడు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ వేటలో ఉంది. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే నాటికి రాహుల్ ద్రవిడ్ వారసుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం టీమిండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి సరైన వ్యక్తి ఇతడేనంటూ ఓ మాజీ క్రికెటర్ పేరును ప్రతిపాదించాడు. ఇంతకీ అతడు ఎవరు?..టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలగగా.. టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ద్రవిడ్ మార్గదర్శనంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచింది.అయితే, టీ20 ప్రపంచకప్-2022, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది.ఇక వన్డే వరల్డ్‌కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసినప్పటికీ పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో అతడిని కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే, ఈ మెగా టోర్నీ అనంతరం అతడు తన పదవి నుంచి తప్పుకోనుండగా.. అభ్యర్థుల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.మరోవైపు.. విదేశీ కోచ్‌ల నియామకానికి బీసీసీఐ సుముఖంగా ఉందన్న వార్తల నేపథ్యంలో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టీమిండియా హెడ్‌కోచ్‌గా అత్యుత్తమ వ్యక్తి ఎవరంటే గౌతం గంభీర్ అనే చెప్తా. గౌతం ఈ బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది అతడి ఇష్టం.నిజానికి గౌతం ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశాడు. తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక హెడ్‌కోచ్ విషయానికొస్తే.. ఎప్పుడూ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తను ఇది ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాలి.గౌతం గంభీర్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తాను చెప్పాలనుకున్నది ఏదైనా సరే.. రెండో మాటకు తావులేకుండా సూటిగా చెప్తాడు. నిజానికి టీమిండియా క్రికెట్ కల్చర్‌కు ఇది విరుద్ధం.కానీ గంభీర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఏదేనా ముఖం మీదే చెప్పేస్తాడు. అతడికి దూకుడు ఎక్కువ. జట్టును కూడా తనలాగే అగ్రెసివ్‌గా తయారుచేయగలడు. నిజంగా తను కోచ్‌గా వస్తే బాగుంటుంది. కానీ అందుకు అతడు ఒప్పుకొంటాడో లేదో?!’’ అని వసీం అక్రం స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.కాగా గంభీర్ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక కేకేఆర్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. -
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్‌కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే!
ముంబై: టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. దాని కోసం మరికొద్ది రోజుల్లోనే దరఖాస్తులు కోరతామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత జట్టు వరల్డ్ కప్‌కు బయల్దేరే ముందే ఈ ప్రక్రియ మొదలవుతుందని కూడా జై షా చెప్పారు. గత ఏడాది రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త కోచ్‌పై చర్చ జరగడంతో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ద్రవిడ్‌నే మరో ఏడాది కొనసాగించారు. ఈసారి అలాంటి స్థితి రాకుండా బోర్డు ముందే జాగ్రత్త పడుతోంది. ఒప్పందం ప్రకారం వచ్చే జూన్‌లో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ మళ్లీ కోచ్‌గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని... కొన్ని ఇతర జట్ల తరహాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లను ఎంపిక చేసే ఆలోచన లేదని కూడా షా పేర్కొన్నారు. కొత్త హెడ్ కోచ్‌కు మూడేళ్ల పదవీ కాలం ఇస్తామని, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కొనసాగుతాడని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. కోచ్ ఎంపిక విషయంలో క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)దే తుది నిర్ణయమన్న షా... విదేశీ కోచ్ అయినా అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరని జట్లలో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కలిసి మే 24న తొలి బృందంగా టి20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరతారని జై షా వెల్లడించారు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగానే పెట్టామని, అవసరమైతే దీనిపై మళ్లీ చర్చించి కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో చేర్చకపోవడంలో తన పాత్ర ఏమీ లేదని... ఇది పూర్తిగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయమని ఆయన సందేహ నివృత్తి చేశారు. -
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో కిర్‌స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్‌కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్‌కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్‌గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్‌ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా నియమించింది.కిర్‌స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్‌టైమ్ కోచ్‌గా సెటిల్ అయిన కిర్‌స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్‌గా పని చేశాడు. కిర్‌స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్‌స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్‌లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్‌స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్‌గా పని చేశాడు. -
ఉగాండ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఉగాండ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అభయ్ శర్మ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. 54 ఏళ్ల అభయ్ శర్మ ఉగాండ క్రికెట్ జట్టుతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఏ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తమ జట్టుకు అభయ్ అనుభవం, క్రికెట్ పరిజ్ఞానం మేలు చేకూరుస్తుందని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఉగాండ క్రికెట్ జట్టు పొట్టి ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించింది. జూన్ 1 నుండి యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024లో ఉగాండ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లలో ఉగాండ ఒకటి. గతేడాది కాలంలో ఆట పరంగా చాలా మెరుగుపడిన ఉగాండ.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే వరల్డ్‌కప్‌లో ఉగాండ గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మేటీ జట్లతో పోటీ పడనుంది. ఉగాండ ఉండే గ్రూప్‌లో మరో పసికూన (పపువా న్యూ గినియా) కూడా ఉంది.అభయ్ శర్మ విషయానికొస్తే.. ఈ మాజీ ఢిల్లీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ, దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాడు. అభయ్ ఢిల్లీతో పాటు రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అభయ్ తన కెరీర్లో 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో దాదాపు 5000 పరుగులు చేసి 230 వరకు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. అభయ్ తన కెరీర్లో 9 శతకాలు, 21 అర్దశతకాలు సాధించాడు. ఆటగాడిగా కెరీర్‌కు వీడ్కోలు పలికాక అభయ్ కోచింగ్ బాధ్యతల్లోకి వచ్చాడు. అభయ్.. భారత-ఏ, భారత అండర్-19 జట్టు, ఢిల్లీ రంజీ జట్టు, భారత మహిళా క్రికెట్ జట్లకు కోచింగ్ అందించాడు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ కూడా అయిన అజహర్.. పాక్ త్వరలో న్యూజిలాండ్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అజహర్‌ను ప్రస్తుతం ఈ సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌కు టీమ్ మేనేజర్‌గా పాక్ మాజీ బౌలర్ వహాబ్ రియాజ్ నియమించబడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఫుల్‌టైమ్ హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్ పాక్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్ లేడు. ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్ మహమూద్‌కు గతంలోనూ కోచింగ్ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజహర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడిన అజహర్.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్ టెస్ట్‌ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్లో పాల్గొన్న అజహర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ తరఫున ఆడాడు. ఐపీఎల్లో 23 మ్యాచ్‌లు ఆడిన అజహర్ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్ ఐపీఎల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం.. !?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచి బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫర్‌పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోంచి ప్రస్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఒకవేళ పీసీబీ ఆఫర్‌ను అతడు అంగీకరిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహమ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ జట్టు హెడ్‌కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పీసీబీ పడింది. ఇప్పటికే ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్, విండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామిని హెడ్‌కోచ్ పదవి కోసం పీసీబీ సంప్రదించింది. కానీ పీసీబీ ఆఫర్‌ను వారిద్దరూ రిజక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ల్యూక్ రోంచితో పీసీబీ చర్చలు జరపుతోంది. Luke Ronchi in talks with PCB for Pakistan's head coach position.#PakistanCricket pic.twitter.com/nelmZvVm2b — Nawaz 🇵🇰🇦🇪 (@Rab_Nawaz31888) March 26, 2024 -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
యూఏఈ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్‌పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రాజ్‌పుత్ నియామకానికి ముందు యూఏఈ తాత్కాలిక కోచ్‌గా పాక్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ వ్యవహరించారు. భారత మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం నాజర్ కొన్ని రోజుల పాటు తాత్కాలిక కోచ్‌గా పని చేశాడు. 62 ఏళ్ల రాజ్‌పుత్‌కు గతంలో అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. టీమిండియా 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పుడు ఇతనే భారత జట్టు కోచ్‌గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు టెస్ట్ హోదా లభించడంలో రాజ్‌పుత్ కోచ్‌గా క్రీయాశీలకపాత్ర పోషించాడు. 2018-2022 వరకు అతను జింబాబ్వే హెడ్‌కోచ్‌గా పని చేశాడు. యూఏఈ కోచ్‌గా నియమితుడైన అనంతరం రాజ్‌పుత్ ఇలా అన్నాడు. ఇటీవలికాలంలో యూఏఈ బలమైన అసోసియేట్ దేశంగా ఎదిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో యూఏఈ ఆటగాళ్లు టెస్ట్ హోదా కలిగిన దేశాల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కాగా, లాల్‌చంద్ రాజ్‌పుత్ 1985-87 మధ్యలో భారత తరఫున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడాడు. -
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్‌తో సహా బస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్‌లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్‌సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్‌కోచ్‌గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా
బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్‌కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. వరల్డ్‌కప్ ముగిశాక ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కావడంతో ద్రవిడ్‌తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్‌కోట్ టెస్ట్‌కు ముందు ద్రవిడ్‌తో మాట్లడే అవకాశం దొరికింది. టీ20 వరల్డ్‌కప్ వరకు అతన్నే కోచ్‌గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ కూడా సానుకూలంగానే స్పందించాడు. అనుభవజ్ఞుడైన ద్రవిడ్ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్‌తో పాటు సహాయక కోచింగ్ సిబ్బంది మొత్తం వరల్డ్‌కప్ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టుతో రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్‌గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, రాజ్‌కోట్ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పాటిదార్ (5) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (97 నాటౌట్), రవీంద్ర జడేజా (68 నాటౌట్) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టారు. -
గుజరాత్ జెయింట్స్ జట్టు హెడ్ కోచ్‌గా క్లింగర్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తలపడే గుజరాత్ జెయింట్స్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ క్లింగర్‌ను నియమించారు. తొలి సీజన్లో ఆస్ట్రేలియాకే చెందిన రాచెల్ హేన్స్ కోచింగ్‌లో బరిలోకి దిగిన జెయింట్స్ అట్టడుగున నిలిచింది. 2017లో ఆ్రస్టేలియా తరఫున మూడు అంతర్జాతీయ టి20 లు ఆడిన క్లింగర్ తదనంతరం మహిళల బిగ్‌బా‹Ùలో సిడ్నీ థండర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారు. డబ్ల్యూపీఎల్–2 ఈ నెల 25న మొదలవుతుంది. -
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు మరో భారీ షాక్
వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్‌లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్ డేవ్ హటన్ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. డేవ్ హటన్ కెప్టెన్‌గా, కోచ్‌గా ఉన్న కాలంలో జింబాబ్వే స్వర్ణ యుగాన్ని చవిచూసింది. ఒక సమయంలో డేవ్‌తో కూడాని జింబాబ్వే.. ఆస్ట్రేలియా, భారత్ లాంటి జట్లను సైతం గడగడలాడించింది. అలాంటి జట్టు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో హటన్ తన గట్టెక్కించేందుకు విఫలయత్నం చేసి చేత కాక తప్పుకున్నాడు. జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్‌గా నియమితుడైన సికందర్ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. పరాయి దేశస్తుడిని తీసుకు వచ్చి కెప్టెన్‌గా చేయడం వల్లే, జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ద్రవిడ్ బృందానికే జై
ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వరుస విజయాలతో ఫైనల్ వరకు చేర్చిన శిక్షణా బృందంపై బీసీసీఐ నమ్మకముంచింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా ఇతర ముగ్గురు కోచ్‌ల కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు కూడా మళ్లీ అవకాశం దక్కింది. వీరందరి కాంట్రాక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. పొడిగింపుపై అప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బృందాన్ని మరికొంత కాలం కొనసాగించడమే సరైందిగా బోర్డు భావించింది. ముందుగా దీనికి సంబంధించి ద్రవిడ్‌కు సమాచారం అందించింది. ద్రవిడ్ అంగీకరించకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు బోర్డు చూసే ఆలోచనలో ఉండగా...ద్రవిడ్ కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. వీరి కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినా... వచ్చే ఏడాది జూన్–జూలైలో జరిగే టి20 ప్రపంచ కప్ వరకు ఉండే అవకాశం ఉంది. మరో వైపు వన్డే, టి20లకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేరుపై కూడా చర్చ జరిగినా...నెహ్రా విముఖత చూపడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం. అందుకే కొనసాగింపు... గత రెండేళ్లుగా ద్రవిడ్, అతని సహచర కోచింగ్ బృందం భారత జట్టులో తీసుకొచ్చిన మార్పులు, ఏర్పరచిన మంచి వాతావరణం మున్ముందూ కొనసాగించాలని బీసీసీఐ అనుకుంది. కొత్తగా వచ్చే కోచ్‌తో ఇవన్నీ ఒక్కసారి మారిపోతే కష్టమని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కోచ్ మారితే అతనితో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవిడ్ బృందం భవిష్యత్తులో ఎప్పటి వరకు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఇదే జట్టు సహకారంతో కనీసం మరో ఐసీసీ టోర్నీలో జట్టు పాల్గొనడమే సరైందని వారు భావించారు. ‘రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ అగ్రస్థానంలో ఉంది. ద్రవిడ్ దూరదృష్టి, ఆలోచన, ప్రణాళిక అందుకు కారణం. వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు ముందు వరుసగా పది మ్యాచ్‌లు గెలవడం అసాధారణ ప్రదర్శన. అందుకు హెడ్‌కోచ్‌ను తప్పకుండా అభినందించాలి. మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు వారికి అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. తనకు కొనసాగింపు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టుతో నా ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో విజయాలు, పరాజయాలతో ఎత్తుపల్లాలు చవిచూశాం. ఆటగాళ్లు, మా శిక్షణా బృందం మధ్య మంచి అనుబంధం ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేం నెలకొల్పిన మంచి సంస్కృతి పట్ల గర్వంగా ఉన్నాం. అద్భుతమైన ప్రతిభ ఉన్న మా జట్టుకు సరైన మార్గనిర్దేశనం చేసి మంచి ఫలితాలు సాధించేలా చేయడంలో సఫలమయ్యాం. నాపై నమ్మకం ఉంచి మళ్లీ అవకాశం కల్పించిన బోర్డుకు కృతజ్ఞతలు. ప్రపంచకప్ తర్వాత రాబోయే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ద్రవిడ్ తన స్పందనను తెలియజేశాడు. -
ద్రవిడ్ తనేంటో నిరూపించుకున్నాడు.. వరల్డ్‌కప్‌లో కూడా: జై షా
మిండియా హెడ్ కోచ్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. భారత జట్టు హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కాంట్రాక్ట్‌లను కూడా బీసీసీఐ పెంచింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా మాట్లాడుతూ.. భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ద్రవిడ్‌కు ఉంటుందని తెలిపాడు. కాగా ద్రవిడ్ కొత్త కాంట్రాక్ట్ వివరాలను మాత్రం బోర్డు బహిర్గతం చేయలేదు. అయితే వచ్చ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ద్రవిడ్ హెడ్‌కోచ్ పదవిలో కొనసాగే ఛాన్స్ ఉంది. "భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌ను మించిన గొప్ప వ్యక్తి లేడని నేను ముందే చెప్పాను. ద్రవిడ్ మరోసారి తన నిబద్ధతతో జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ద్రవిడ్ తన కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు ఒప్పుకోవడంతో టీమిండియా యూనిట్ మరింత బలంగా మారనుంది. ఇప్పటికే అతడి నేతృత్వంలో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెం1 జట్టుగా అవతరించింది. ఇది ఒక్కటి చాలు అతడి కోచింగ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కోచ్‌గా తనంటో ద్రవిడ్ నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో కూడా భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమిపాలైంది. హెడ్‌కోచ్ ద్రవిడ్‌కు బోర్డు నుంచి ఎల్లప్పడూ సపోర్ట్ ఉంటుంది. భారత జట్టును అంతర్జాతీయ స్దాయిలో మరింత అద్బుతంగా ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాని" జై షా పేర్కొన్నాడు. కాగా ద్రవిడ్ తిరిగి మళ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జట్టుతో కలవనున్నాడు. -
CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్ 19న వరల్డ్‌కప్ ఫైనల్‌తో ముగిసింది. టైటిల్ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్ వివరించాడు. ‘అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్ కోసం నాయకుడిగా రోహిత్ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్ కోచ్‌గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్‌పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్ వివరించాడు. -
ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్
డబ్ల్యూపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. కాగా మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో ఆర్సీబీ జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి ఎడిషన్ ప్రధాన కోచ్‌గా బెన్ సాయర్పై ఆర్సీబీ వేటు వేసింది. బెన్ సాయర్ స్ధానాన్ని ల్యూక్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. కాగా కోచ్‌గా విలియమ్స్‌కు ఆపారమైన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీలకు అతడు కోచ్‌గా పనిచేశాడు. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు నాలుగు సీజన్ల పాటు విలియమ్స్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా ది హాండ్రడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అతడు పనిచేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్ జట్టుకు కూడా తన సేవలు అందించాడు. చదవండి: Asian Games 2023: మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా -
లారాకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆస్ట్రేలియా పురుషుల టీమ్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. గత సీజన్లో (2023) జట్టు పేలవ ప్రదర్శనకు లారాను బాధ్యున్ని చేస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు చేపట్టిన లారా.. ఆ సీజన్లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి ఆఖరి స్థానంతో ముగించింది. 🚨Announcement🚨 Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡 Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86 — SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 ఆరు సీజన్లలో నలుగురు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఆరు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2019, 2022 సీజన్లలో టామ్ మూడీ.. 2020, 2021 సీజన్లలో ట్రెవర్ బేలిస్.. 2023 సీజన్లో లారా.. తాజాగా వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు. గతంలో ఆర్సీబీ కోచ్‌గా వెటోరీ.. న్యూజిలాండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా పేరు గాంచిన డేనియల్ వెటోరీ.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్ పదవితో పాటు హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెటోరీ.. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ హెడ్ కోచ్‌గా, బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ హెడ్‌కోచ్‌గా, ఇంగ్లండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్సెక్స్ హెడ్‌కోచ్‌గా, బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టు స్పిన్ కన్సల్టెంట్గానూ పని చేశాడు. -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా ఫ్లవర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. జట్టు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెపె్టన్, కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్‌ను ఎంపిక చేసింది. దాంతో ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌తో పాటు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో టీమ్‌ను పూర్తి స్థాయిలో నడిపించిన మైక్ హెసన్‌పై వేటు పడినట్లయింది. నాలుగు సీజన్ల పాటు హెసన్ డైరెక్టర్‌గా పని చేయగా... మూడుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు 2023 సీజన్లో ఆరో స్థానంతో ముగించింది. అయితే ఈ ప్రదర్శన ఆర్సీబీ యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదు. -
'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!'
టీమిండియా మహిళా జట్టు ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే సిరీస్‌లు ఆడుతోంది. గతేడాది డిసెంబర్లో రమేశ్ పవార్‌ను ఎన్సీఏకు పంపించినప్పటి నుంచి మహిళల హెడ్‌కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో భారత మహిళల జట్టు కోచ్ లేకుండానే టి20 వరల్డ్‌కప్ ఆడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను కూడా కోచ్ లేకుండానే ఆడుతుంది. సరైన వ్యక్తి కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహిళల జట్టుకు కొత్త కోచ్ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాన కోచ్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటివరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. కీలకమైన మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన మీడియా సమావేశంలో పాల్గొంది. మంధాన మాట్లాడుతూ.. ''సరైన ప్రధాన కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. జట్టు కోసం సుధీర్ఘంగా సేవలు అందించే కోచ్‌ను ఎంపిక చేయాలనేది బోర్డు ఉద్దేశం. ఆటగాళ్ల నుంచి చూస్తే మాకు కోచ్ లేకపోవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నాణ్యమైన క్రికెట్ ఆడినంత కాలం కోచ్ లేకపోయినా టీమిండియా మహిళా జట్టుకు గెలిచే సత్తా ఉంటుంది. ప్రధాన కోచ్ లేకపోయినప్పటికి ఇతర కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారి సూచనలు తీసుకుంటూ ముందు సాగుతున్నాం. వారిచ్చే సూచనలు మాకు ఉపయోగపడుతున్నాయి. మా చుట్టూ ఏం జరుగుతుందనేది జట్టుగా మాకు ముఖ్యం కాదు. మైదానంలో ఎలా ఆడుతున్నామన్నదే కీలకం. ఈ సిరీస్ ముగిసేలోగా జట్టు ప్రధాన కోచ్ విషయమై బీసీసీఐ నుంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. ప్రధాన కోచ్‌గా ఎవరొచ్చినా వారి సూచనలు, సలహాలు తీసుకొని జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ తెలిపింది. చదవండి: Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది' దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! -
IPL 2024: సన్‌రైజర్స్‌లో కీలక పరిణామం.. హెడ్ కోచ్‌కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్‌ను తప్పించి లాంగర్‌ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్‌కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్‌గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్‌ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్‌తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. -
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడే అవకాశం కలి్పంచాలని కోరుతూ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఐగర్ స్టిమాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సెపె్టంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో ఫుట్‌బాల్ క్రీడాంశంలో వివిధ దేశాలకు చెందిన అండర్–23 స్థాయి టీమ్‌లు పాల్గొంటాయి. ఈ జట్లలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఆడే వెసులుబాటు కలి్పస్తారు. అయితే టీమ్ ఈవెంట్లలో ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉంటేనే మన జట్లను పంపిస్తామని భారత క్రీడా శాఖ మాత్రం విధానం రూపొందించుకుంది. ప్రస్తుతం ఆసియాలో భారత ఫుట్‌బాల్ జట్టు 18వ ర్యాంక్‌లో ఉంది. దాంతో ఫుట్‌బాల్ టీమ్‌ను పంపడానికి అవకాశం లేదు. దీనిపైనే ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ స్టిమాక్ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ రాస్తూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత్ 2017లో అండర్–17 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాటి జట్టులో ఆడినవారే ఇప్పుడు అండర్–23 క్వాలిఫయర్స్‌లో మెరుగ్గా రాణించారు. ఈ కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అడ్డు చెబుతున్నారు. ఈ టీమ్‌లో అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలి. జట్టును పంపకుండా ఉండేందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. అందుకే భారత్ కోచ్‌గా ఈ విషయాన్ని మీ దృష్టికి, కేంద్ర క్రీడాశాఖ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు జోక్యం చేసుకొని జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చేయాలి అని స్టిమాక్ అన్నారు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా మన జట్టుకు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ర్యాంకింగ్ పేరు చెప్పి మన క్రీడా శాఖనే జట్టు పాల్గొనకుండా చేస్తోంది. నిజానికి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న కొన్ని ఇతర క్రీడల టీమ్‌ల కంటే మన ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ మెరుగ్గానే ఉంది. పైగా తమకంటే బలమైన జట్లపై చిన్న టీమ్‌లు సంచలన విజయాలు సాధించడం ఫుట్‌బాల్‌లో అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది’ అని స్టిమాక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి స్టార్ ఆటగాడు కిలియాన్ ఎంబాపె భారత్‌లో సూపర్‌హిట్ అని, అతనికి అక్కడికంటే మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని స్టిమాక్ గుర్తు చేశారు. ‘ఫ్రాన్స్ పర్యటనలో ఎంబాపె గురించి మీరు చేసిన వ్యాఖ్య భారత ఫుట్‌బాల్‌ను అభిమానించేవారందరికీ సంతోషం కలిగించింది. మన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చూడాలని భారత టీమ్ తరఫున మిమ్మల్ని కోరుతున్నా. క్రీడాశాఖ సూచనల్లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. టాప్–8లో లేకపోయినా సరైన కారణంతో నిపుణుల బృందం సిఫారసు చేస్తే ఆ టీమ్‌ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. దీని ప్రకారం అవకాశం కలి్పంచండి’ అని స్టిమాక్ కోరారు. భారత ఫుట్‌బాల్ జట్టు 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు... 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పలుమార్లు భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమించింది. -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి
వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్‌తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్‌తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్‌లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్‌కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్‌లో బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్‌లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఓపెనర్..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. ఈ పదవి కోసం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్ఎస్జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్ఎస్జీ హెడ్ కోచ్‌గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్‌కు చేదు అనుభవం..
యాసెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. మూడోరోజు ఆటలో రెండు సెషన్లు దాదాపు వర్షంతో తుడిచిపెట్టుకుపోయినప్పటికి.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. కేవలం ఆఖరి సెషన్లోనే మిగతా ఆరు వికెట్లు కూల్చిన ఇంగ్లండ్.. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ముందు 251 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడంతో ఇంగ్లండ్ గెలుస్తుందా.. లేక ఆసీస్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా అనేది చూడాలి. కాగా లార్డ్స్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు సహా సిబ్బందికి ఏదో ఒక రకంగా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ అభిమానుల దృష్టిలో అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. ఇక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌కు కూడా లీడ్స్‌లోని హెడ్డింగ్లే స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎంట్రీ పాస్ లేదని ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను స్టేడియం లోపలికి అనుమతించలేదని సమాచారం. ఇంగ్లండ్ మీడియాలో దీని గురించి కథనాలు వెలువడ్డాయి. ఆ కథనాల ప్రకారం.. సరైన ఎంట్రీ పాస్ లేకపోవడంతో మెక్‌కల్లమ్‌ను భద్రతా సిబ్బంది గేటు వద్ద ఆపేశారు. డ్యూటీలో ఉన్న సెక్యురిటీ గార్డ్ మెక్‌కల్లమ్‌ను గుర్తుపట్టలేదు. అంతేకాకుండా అతడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సెక్యురిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెక్కల్లమ్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించి అక్కడి నుంచి ముందుకుసాగాడు. ఇక మెక్కల్లమ్ న్యూజిలాండ్ తరపున 101 టెస్టులు, 260 వన్డేలు, 71 టి20 మ్యాచ్‌లు ఆడి.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 14,676 పరుగులు సాధించాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరు పొందిన మెక్కల్లమ్ ఖాతాలో 19 సెంచరీలు, 76 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
Rahul Dravid Rare Photos : టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అరుదైన ఫొటోలు
-
బంగ్లాదేశ్ టూర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్!
బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 9న జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌తో భారత పర్యటన ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌కు హర్మన్ సేన పయనం కానుంది. భారత జట్టు హెడ్ కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్ కాగా గత డిసెంబర్లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్‌కోచ్ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే, అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముంబై దిగ్గజ ఆటగాడు అమోల్ ముజుందార్ పేరును క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ఫైనల్ చేసిందని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. అయితే బంగ్లా టూర్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మాజీ భారత క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్‌ను తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బోర్డు నియమించింది. కోచ్‌గా ఖదీర్‌కు అపారమైన అనుభవం ఉంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు నూషిన్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించింది. చదవండి: Online Betting: మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే! -
పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను నియమించింది. వచ్చే రెండేళ్ల పాటు బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని పీసీబీ ఇవాళ (మే 13) అధికారికంగా ప్రకటించింది. బ్రాడ్‌బర్న్.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కన్సల్టెన్సీ ప్రాతిపదికన పాక్ ప్రధాన కోచ్‌గా పని చేశాడు. దీనికి ముందు బ్రాడ్‌బర్న్ స్కాట్లాండ్ జట్టు ప్రధాన కోచ్‌గా, 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.హెడ్ కోచ్ పదవితో పాటు పీసీబీ మరో రెండు ఖాళీలను సైతం భర్తీ చేసింది. బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూ పుట్టిక్ (రెండేళ్ల పాటు)ను, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా డ్రికస్ సైమాన్ను నియమించింది. అలాగే క్లిఫ్ డీకన్‌ను ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగించింది. ఇదిలా ఉంటే, బ్రాడ్‌బర్న్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించిన పీరియడ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుని, వన్డే సిరీస్‌ను 4-1 కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే అనంతరం పాక్ తొలిసారిగా వన్డేల్లో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. చదవండి: World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..! -
ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి
2023-24 దేశీయ సీజన్‌కు గాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఓంకార్ సాల్విని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. ఓంకార్ సాల్వి ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఓంకార్ ముంబై పురుషుల జట్టుతో చేరనున్నాడు. కాగా గతంలో ముంబై బౌలింగ్ కోచ్‌గా కూడా ఓంకార్ సాల్వి పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ అమోల్ ముజుందార్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ కోచ్‌గా ఆజట్టు మాజీ ఆటగాడు వినిత్ ఇందుల్కర్ నియమితులు కాగా, మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఓంకార్ గురవ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించనున్నాడు. ముంబై తరపున 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఓంకార్ గురవ్.. 434 పరుగులు చేశాడు. ఓంకార్ కంటే వినిత్ ఇందుల్కర్కు ఎక్కువ దేశీవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇందుల్కర్ ముంబై తరపున 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 32 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: WTC FINAL 2023: కిషన్ కంటే అతడు చాలా బెటర్.. ఎందుకు సెలక్ట్ చేశారో అర్ధం కావడం లేదు! -
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం
భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 60 ఏళ్లలోపు వారై ఉండి... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌గానీ, 50 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉన్నాకానీ లేదంటే ఎన్సీఏ లెవల్ ‘సి’ కోచింగ్ సర్టిఫికెట్, అంతర్జాతీయ టి20 జట్టుకు కనీసం ఒక్క సీజన్‌కైనా కోచింగ్ చేసి ఉండాలి. ఇందులో ఏ ఒక్క అర్హత ఉన్నా ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరింది. -
IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా..
క్రికెట్లో అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు పేరుంది. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ 16వ సీజన్‌తో ముందుకు వచ్చేసింది. గత సీజన్లతో పోలిస్తే మరిన్ని కొత్త రూల్స్‌తో సరికొత్తగా కనిపిస్తుంది. ఇక సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. అయితే ప్రత్యక్షంగా జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ ఎంత ముఖ్యమో.. తెర వెనుక హెడ్ కోచ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా చీఫ్ కోచ్ జట్టు విజయాలలో ప్రముఖపాత్ర పోషిస్తుంటాడు. జట్టులో ఎవరు ఆడాలి, ఏ మ్యాచ్‌లో ఎవరిని ఆడించాలి, ఎపుడు..ఎవరికి విశ్రాంతి ఇవ్వాలి, ఏ మ్యాచ్‌లో ఎలాంటి జట్టును బరిలోకి దింపాలి అనే విషయాల్లో చీఫ్ కోచ్ కీలకం. అటువంటి ముఖ్య పదవిలో బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడమంటే ఆషామాషీ కాదు. జట్టు జయాపజయాలకు కోచ్కూడా చాలవరకు కారణమే. అందుకే ఆటగాళ్ల కొనుగోలు తరువాత చీఫ్ కోచ్ నియామకంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. అటువంటి పదవిలో ఉన్న ఐపీఎల్ ఫ్రాంచైజీల చీఫ్ కోచ్‌ల గురించి తెలుసుకుందాం. మార్క్ బౌచర్(ముంబై ఇండియన్స్) అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్(5సార్లు చాంపియన్) ఈ యేడాది కొత్తగా సౌతాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న మహేల జయవర్ధనె ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్వహణలోని మూడు జట్లకు(ఐపీఎల్, ఐఎల్టి20, ఎస్ఎటి20) ఫర్ఫార్మెన్స్ హెడ్‌గా నియమితుడవడంతో బౌచర్‌కు ఈసారి హెడ్‌కోచ్‌గా అవకాశం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగిన గత ఐసీసీ టి20 ప్రపంచకప్ అనంతరం బౌచర్ దక్షిణాఫ్రికా జట్టు కోచ్ పదవికి గుడ్‌బై చెప్పి ఇపుడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. అయితే బౌచర్‌కు ఐపీఎల్ కొత్తేమీ కాదు. గతంలో 2016లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీపింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక ఆటగాడిగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 46 ఏళ్ల బౌచర్ దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 147 టెస్టులు, 295 వన్డేలు, 25 టి20లలో ప్రాతినిథ్యం వహించి 10వేలకుపైగా పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్, ఫీల్డర్‌గా 900కుపైగా క్యాచ్‌లు పట్టి 46 స్టంపింగ్‌లు చేశాడు. గత సీజన్లో అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్‌ను బౌచర్ ఈసారి ఏ స్థాయికి చేరుస్తాడో చూడాలి. స్టీఫెన్ ఫ్లెమింగ్(చెన్నై సూపర్ కింగ్స్) ఐపీఎల్లో రెండో అత్యంత విజయవంతమైన జట్టు(4సార్లు చాంపియన్) చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టు హెడ్ కోచ్ ఫ్లెమింగ్కూడా విజయవంతమైన కోచ్‌గా నిలిచాడు. అతడు కోచ్‌గా ఉన్న నాలుగు సీజన్లలో చెన్నై టైటిల్ సాధించడం గమనార్హం. న్యూజిలాండ్ అందించిన గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఘనత వహించిన ఫ్లెమింగ్ తొలి సీజన్(2008)లో చెన్నైకు ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించాడు. అయితే 2009 సీజన్లో ఆటగాడినుంచి కోచ్‌గా మారాడు. వరుసగా రెండు సంవత్సరాలు జట్టును చాంపియన్‌గా నిలిపాడు. బెట్టింగ్ ఆరోపణలపై 2017, 2018 సంవత్సాలలో చెన్నై జట్టు సస్పెండ్ అయిన తరుణంలో ఫ్లెమింగ్ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటనే తిరిగి చెన్నై జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టి మళ్లీ చాంపియన్‌ను చేశాడు. మళ్లీ 2021లో అతని కనుసన్నల్లోనే చెన్నై తిరిగి టైటిల్‌ను గెలుచుకుంది. ఇలా చెన్నై జట్టు టైటిల్ గెలిచిన నాలుగుసార్లు కోచ్‌గా ఉండి ఐపీఎల్లో ఉత్తమ కోచ్‌గా ప్రశంసలందుకున్నాడు. చంద్రకాంత్ పండిట్(కోల్‌కతా నైట్‌రైడర్స్) చీఫ్ కోచ్‌లలో అత్యంత పెద్ద వయస్కుడు. కీపర్ బ్యాట్స్‌మన్ అయిన చంద్రకాంత్ దేశవాళీ క్రికెట్లో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. కోచ్‌గా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌కు 2021-22లో తొలిసారి రంజీ ట్రోఫీ అందించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ట్రోఫీ నెగ్గిన ఆరు జట్లకు అతడు కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా నియమితుడైన తొలి భారతీయుడు. ఐపీఎల్ చరిత్రలో సంజయ్ బంగర్, ఆశిష్ నెహ్రా తరువాత కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడో భారతీయుడు. కోల్‌కతా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న బ్రెండన్ మెకల్లమ్‌కు ఇంగ్లండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా అవకాశం రావడంతో ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. దానితో కెకేఆర్ చంద్రకాంత్ పండిట్‌ను తమ కోచ్‌గా నియమించుకుంది. రెండుసార్లు టైటిల్ నెగ్గిన కోల్‌కతా ఎనిమిదేళ్లుగా మూడో టైటిల్కోసం ఎదురు చూస్తున్నది. ఆట విషయంలో చంద్రకాంత్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అంతగా పేరులేని ఆటగాళ్లతో అద్భుతాలు సృష్టిస్తుంటాడు. మరి ఈసారి కోల్‌కతాను ఏ స్థాయికి తీసుకెళతాడో వేచి చూద్దాం. కుమార సంగక్కర(రాజస్థాన్ రాయల్స్) తొలి సీజన్లో చాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ మళ్లీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడంలో గత సీజన్‌వరకు విఫలమైంది. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. అటువంటి జట్టును తిరిగి చాంపియన్‌గా నిలపాలని సంగక్కర కంకణం కట్టుకున్నాడు. అయిదు సీజన్లలో డక్కన్ చార్జర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడిన సంగక్కర తరువాత కోచ్‌గా అవతారమెత్తాడు. 2021లో హెడ్‌కోచ్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కూడా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే గత సీజన్లో రాజస్థాన్‌ను రెండో స్థానంలో నిలిపాడు. మరోసారి రాజస్థాన్ చాంపియన్ అవ్వాలంటే అది సంగక్కరకే సాధ్యం. బ్రియాన్ లారా(సన్‌రైజర్స్ హైదరాబాద్) వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఐపీఎల్లో ఆడనప్పటికీ అతడు సహాయ సిబ్బందిలో ఉండడం ఏ జైట్టెనా గౌరవంగా భావిస్తుంది. లారా గతంలో సన్‌రైజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, సలహాదారుగా వ్యవహరించిన అనుభవముంది. లారా తక్షణ కర్తవ్యం మరోసారి హైదరాబాద్ జట్టును చాంపియన్‌గా నిలపడమే. కొత్త యాజమాన్యంలో 2016లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ మళ్లీ వెనుకబడింది. గత సీజన్లో పది జట్లలో 8వ స్థానంలో నిలిచింది. ఇపుడు జట్టుకు మార్కరమ్ రూపంలో కొత్త కెప్టెన్ రావడంతో లారా పని మరింత క్లిష్టం కానున్నది. అయితే సౌతాఫ్రికా టి20 లీగ్‌లో మార్కరమ్ సన్‌రైజర్స్ జట్టును విజేతగా నిలపడం కలిసొచ్చే అంశం. లారా-మార్కరమ్ కలిసి సన్‌రైజర్స్ జట్టును చాంపియన్‌గా నిలపడమే ఇపుడు వారి ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ లక్ష్య సాధనలో లారా ఎంతవరకు సఫలీకృతమౌతాడో చూడాలి. ఆశిష్ నెహ్రా(గుజరాత్ టైటాన్స్) హెడ్ కోచ్‌లలో అతి పిన్న వయస్కుడు నెహ్రా. వయసులో చిన్నవాడైనా ఫలితాల్లో మేటి అని గత సీజన్లో నిరూపించాడు. లీగ్‌లో పాల్గొన్న తొలిసారే గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఆటగాడిగా, కోచ్‌గా వివిధ జట్లతో పనిచేసిన అనుభవం నెహ్రా సొంతం. ఆటగాడిగా ఢిల్లీ, హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై జట్లకు సేవలందించిన నెహ్రా 2018, 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బౌలింగ్ కోచ్గాకూడా వ్యవహరించాడు. ఆటగాడిగా 2017లో రిటైర్మెంట్ ప్రకటించిన నెహ్రా గత సీజన్లో కోచ్‌గా కూడా సత్తా చాటాడు. చెన్నై, ముంబై జట్ల తరువాత టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్న గుజరాత్ టైటాన్స్‌ను ఆశలను నెహ్రా తీరుస్తాడేమో చూడాలి. రికీ పాంటింగ్(ఢిల్లీ క్యాపిటల్స్) ఆస్ట్రేలియా, అంతర్జాతీయ క్రికెట్లో పేరెన్నికగన్న రికీ పాంటింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను చాలావరకు తీర్చిదిద్డాడు. అతని నేతృత్వంలోనే శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ మేటి ఆటగాళ్లుగా రాటుదేలారు. 2018లో ఢిల్లీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్ మరుసటి యేడాది మూడో స్థానంలో నిలిచింది. తరువాత ఏడాది రన్నర్ప్ స్థానానికి ఎదిగింది. అయితే తరువాతి యేడాది మళ్లీ మూడో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవకపోయినా మేటి జట్లకు పోటీ ఇచ్చేదిగా ఎదిగింది. ఇదంతా పాంటింగ్ చలవే. ఢిల్లీ హెడ్‌కోచ్‌గా రాకముందు పాంటింగ్ మూడేళ్లపాటు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతని నేతృత్వంలోనే ముంబై 2015లో టైటిల్ దక్కించుకుంది. ఆటగాడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పాంటింగ్ కోచ్‌గా తనదైన ముద్రను వేసుకోవాలని, అందుకు ఢిల్లీని చాంపియన్‌గా చూడాలని ఆశిస్తున్నాడు. ఆండీ ఫ్లవర్(లక్నో సూపర్ జెయింట్స్) జింబాబ్వేకు అంతర్జాతీయ క్రికెట్లో పేరు తెచ్చిన వన్నెగాడు ఆండీ ఫ్లవర్. అటగాడిగా సొగసరి ఆటతో అందరి మన్ననలు అందుకున్న ఆండీ కోచ్‌గా ఇపుడిపుడే రాణిస్తున్నాడు. 2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించి గత సీజన్లో కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్లోనే లక్నోను మూడో స్థానంలో నిలబెట్టి తన ప్రాధాన్యతను తెలిసేలా చేశాడు. ఈసారి మరో మెట్టు ఎక్కాలని కోచ్ ఆండీ, కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆశిస్తున్నారు. ఆండీ ఫ్లవర్ గతంలో ఇంగ్లండ్‌కు అసిస్టెంట్ కోచ్, టీమ్ డైరెక్టర్, హెడ్‌కోచ్‌గా పుష్కరకాలంపాటు సేవలందించాడు. ఇంగ్లండ్‌ను టెస్టు ర్యాంకింగ్‌లో నంబర్‌వన్‌గా నిలపడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అంతటి అనుభవమున్న ఆండీఫ్లవర్ లక్నోను చాంపియన్‌గా చూడాలనుకుంటున్నాడు. ట్రెవర్ బేలిస్(పంజాబ్ కింగ్స్) గత 15 ఏళ్లుగా టైటిల్కోసం పోరాడుతున్న పంజాబ్ జట్టుకు బేలిస్ తొలి టైటిల్ అందించాలని యోచిస్తున్నాడు. కోచ్‌గా పేరుప్రఖ్యాతులున్న బేలిస్ 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. 2015లో ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా నియమితుడైన బేలిస్ ఇంగ్లండ్‌ను ప్రపంచ వన్డే చాంపియన్‌గా చేశాడు. పంజాబ్ జట్టుకు కొత్తగా కోచ్‌గా నియమితుడైన బేలిస్ తక్షణ కర్తవ్యం ఆ జట్టును వీలైనంత మెరుగైన స్థానానికి చేర్చడమే. ఇప్పటివరకు ఒకేసారి ఫైనల్‌కు చేరిన పంజాబ్ బేలిస్పైనే ఆశలు పెట్టుకుంది. డెత్ ఓవర్స్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయడం, మిడిల్ ఓవర్లలో వికెట్లు రాబట్టడంలో రాణిస్తే పంజాబ్‌కు టైటిల్ దక్కుతుందని బేలిస్ ఆశిస్తున్నాడు. అందులో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. సంజయ్ బంగర్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్లో అత్యంత విఫలమైన జట్టుగా పేరున్న బెంగళూరు జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరించడమంటే మాటలుకాదు. హేమాహేమీలున్నా కీలక దశలో ఓటమి పాలవడం రాయల్ చాలెంజర్స్‌కు అలవాటుగా మారింది. అటువంటి జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న బంగర్ ఏ మేరకు జట్టును నడిపిస్తాడన్నది ఆసక్తికరం. బంగర్‌కు 2010నుంచి ఐపీఎల్‌తో అనుభవముంది. తొలుత కొచ్చి టస్కర్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న బంగర్ తరువాత పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వెళ్లి ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2016లొ జింబాబ్వేలో పర్యటను వెళ్లిన భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ రాణింపులో బంగర్ పాత్ర మరువలేనిదని కితాబివ్వడం గమనార్హం. 2021లో హెడ్ కోచ్‌గా నియమితుడైన బంగర్ తదుపరి యేడాది బెంగళూరు జట్టును 4వ స్థానంలో నిలిపాడు. ఆర్సీబీని చాంపియన్‌గా నిలిపి ఆ ఘనత సాధించిన తొలి కోచ్‌గా పేరుగాంచాలని భావిస్తున్నాడు. -
టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?
ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022లో ఘోర పరాభావం తర్వాత భారత జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20లకు హెడ్‌కోచ్‌గా భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రాను నియమించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. ఎందుకంటే గతేడాది ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన నెహ్రా.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్లోనే టైటిల్‌ను అందించాడు. తన వ్యూహాలతో జట్టును విజయ పథంలో నడిపించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన అనంతరం ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్‌ను బీసీసీఐ నియమించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. టీ20లకు కోచ్‌గా ద్రవిడ్ సెట్ కాడని, పొట్టి ఫార్మాట్‌ను అర్ధం చేసుకునే మైండ్‌సెట్ ఉన్న వారు కోచ్‌గా రావాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత్ హెడ్ కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాలో ఎవరినైనా నియమించాలని హర్భజన్ సూచించాడు. "భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పుడు, ఇద్దరు కోచ్‌లు ఉంటే తప్పు ఏమి ఉంది. ఎవరి ప్రణాళికలు వారివి. ఊదాహరణకు ఇంగ్లండ్ జట్టును చూస్తే మనకు అర్ధమవుతుంది. బ్రెండన్ మెకల్లమ్ తన ఆలోచనలతో టెస్టు క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాడు. కాబట్టి అదే దూకుడు మైండ్ కలిగిన వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాను భారత టీ20 జట్టుకు హెడ్ కోచ్‌గా నియమించిండి. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా ఆశిష్ ఏ విధంగా రాణించాడో మనం చూశం. హార్దిక్ పాండ్యాతో కలిసి తమ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. నా వరకు అయితే టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకునేవారిని కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. ద్రవిడ్‌ను టెస్టులు, వన్డేల్లో కోచ్‌గా కొనసాగించాలి. ద్రవిడ్ మైండ్ సెట్ వన్డే, టెస్టు ఫార్మాట్లకు సెట్ అవుతుంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటి నుంచే మంచి జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను టీ20లకు ఎంపిక చేయకుండా.. హార్దిక్ పాండ్యా కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది. చదవండి: NZ Vs Eng: జాక్ లీచ్ మాయాజాలం.. దెబ్బకు బౌల్డ్.. బిత్తరపోయిన బ్యాటర్! వీడియో వైరల్ -
Nepal Head Coach: నేపాల్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సోమవారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటిచింది. మాంటీ దేశాయ్ గతంలో ఐపీఎల్లో పాటు వెస్టిండీస్ పురుషల క్రికెట్ జట్టుకు కూడా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. "భారత్ మాజీ క్రికెటర్, చాలా అనుభవజ్ఞుడైన మాంటి దేశాయ్‌ను నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించడం జరిగింది. నేపాల్ జట్టును ఉన్నతమైన జట్టుగా తీర్చుదిద్దుతారని ఆశిస్తున్నాము" అని క్రికెట్ నేపాల్ ట్విటర్లో పేర్కొంది. కాగా గతేడాది నేపాల్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మనోజ్ ప్రభాకర్ స్థానాన్ని దేశాయ్ భర్తీ చేయనున్నాడు. ఇక స్వదేశంలో ఫిబ్రవరి 14 నుంచి నమీబియా,స్కాట్లాండ్తో జరగనున్న ట్రై సిరీస్‌లో నేపాల్ తలపడనుంది. ఈ సిరీస్ నుంచి నేపాల్ హెడ్‌కోచ్‌గా మాంటి దేశాయ్ ప్రయాణం ప్రారంభం కానుంది. Mrugng (Monty) Desai, a very experienced high performance coach from India, has been appointed as the head coach of the Nepal National Cricket Team. pic.twitter.com/oEHBQ69yQn — CAN (@CricketNep) February 6, 2023 చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ -
ముంబై జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. . 2017లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 43 ఏళ్ల చార్లెట్‌కు కోచింగ్‌లో విశేష అనుభవం ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన చార్లెట్ 10,273 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో సదరన్ వైపర్స్ జట్టుకు, సదరన్ బ్రేవ్ (హండ్రెడ్ టోర్నీ) జట్టుకు, ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేసిన చార్లెట్ అమెరికా క్రికెట్ జట్టుకు కూడా కొంతకాలం శిక్షణ అందించారు. మరోవైపు డబ్ల్యూపీఎల్ వేలం కార్యక్రమం ఈనెల 13న ముంబైలో జరుగుతుంది. ఒక్కో జట్టు కనిష్టంగా 15 మందిని గరిష్టంగా 18 మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుంది. ఒక్కో జట్టు వేలంలో రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా భారత బౌలింగ్ దిగ్గజం జులన్ గోస్వామిని తమ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా ముంబై నియమించుకుంది. మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. చదవండి: టాపార్డరే కీలకం: మిథాలీ -
‘జెయింట్స్’ హెడ్ కోచ్‌గా రేచల్ హేన్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్‌ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్ ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఇటీవలే మెంటార్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రేచల్ హేన్స్ ‘జెయింట్స్’కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్‌బై చెప్పిన హేన్స్ ఆసీస్ తరఫున ఆరు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్‌కప్ నెగ్గిన భారత మహిళల అండర్–19 టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా... తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నెగ్గిన ‘సూపర్ నోవాస్’కు కోచ్‌గా పని చేసిన అనుభవం నూషీన్కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్ తుషార్ భారత సీనియర్ మహిళల టీమ్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
పాకిస్తాన్ క్రికెట్లో వినూత్న ప్రయోగం.. చరిత్రలో తొలిసారి..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు రికార్డుల్లోకెక్కనుంది. ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ (ఆస్ట్రేలియా).. నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్ హెడ్ కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పాక్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పీసీబీ బాస్ నజమ్ సేథీ గతవారం ఓ క్లూ వదిలాడు. ఆర్థర్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని సేథీ గతవారం ఓ ప్రెస్మీట్లో వెల్లడించాడు. ప్రస్తుత పాక్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో నూతన హెడ్ కోచ్‌ను నియమించుకునేందుకు పీసీబీ వేగంగా పావులు కదుపుతోంది. ఆర్థర్.. పీసీబీ తొలి దశ ప్రయత్నాల్లో పాక్ కోచ్‌గా వ్యవహరించేందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆర్థర్.. మెజార్టీ శాతం పాక్ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని సమాచారం. కాగా, మిక్కీ ఆర్థర్ ఆథ్వర్యంలో పాకిస్తాన్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఆన్లైన్ కోచ్ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్‌లు లేకనా అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. -
రాహుల్ ద్రవిడ్‌కు అస్వస్థత
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉదయం ద్రవిడ్ చికిత్స కోసం కోల్‌కతా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. అదే సమయంలో భారత ఆటగాళ్లతో పాటు శ్రీలంక జట్లు, సహాయక సిబ్బంది మూడో వన్డే కోసం తిరువనంతపురం బయలుదేరింది. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శుక్రవారం తెల్లవారు జామున కోల్‌కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయలుదేరాడు. ద్రవిడ్ బ్లడ్ ప్రెజర్(బీపీ) సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. కోల్‌కతాలో వైద్యులు పరీక్షించిన అనంతరం అతను బెంగళూరుకు బయలుదేరాడు. ప్రస్తుతం ద్రవిడ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడని..పరీక్షల అనంతరం శనివారం జట్టుతో చేరే అవకాశాలున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు విమానంలో ద్రవిడ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న టీమిండియా తిరువనంతపురం వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తుంది. మరోవైపు షనక నేతృత్వంలోని లంక మాత్రం కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆశిస్తుంది. -
టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు త్వరలోనే గుడ్‌బై!
స్వదేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీయస్ లక్ష్మణ్‌ను నిమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ద్రవిడ్ పదవీ కాలన్ని పెంచే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా గతేడాది జరిగిన ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత ద్రవిడ్‌ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో భారత- ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ అత్యంత విజయవంతమయ్యాడు. అదే విధంగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా కూడా వీవీయస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ తొలి భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం జింబాబ్వేతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టు ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్ పనిచేశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మినహా.. మిగితా అన్ని సిరీస్‌లో భారత్ విజయం సాధించింది. ఇక లక్ష్మణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్‌గా ఉన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
సిరీస్ ఓటమిపై ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశాడు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అయితే డొమింగో ఉన్నపళంగా రాజీనామా చేయడం వెనుక బంగ్లా క్రికెట్ బోర్డు ఆపరేషన్స్ హెడ్ జలాల్ యూనస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లా ఓడిపోగానే జలాల్ యూనస్ స్పందిస్తూ.. ''మాకు జట్టుపై ప్రభావం చూపగల కోచ్ అవసరం. తమకు కోచ్ కావాల్సిన అవసరం ఉందని.. మెంటార్ కాదు" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. జలాల్ వ్యాఖ్యలు డొమింగోకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.దీనికి తోడు రాజీనామా లేఖను పంపిన వెంటనే బంగ్లా బోర్డు ఆమోదించడం గమనార్హం. అయితే రస్సెల్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లా ఆటతీరులో చాలా మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. డొమింగో హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో బంగ్లా జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లను కైవసం చేసుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌లో మొదటిసారి టెస్ట్ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా, భారత్‌లపై వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. అయితే వరల్డ్‌కప్‌కు ముందు డొమింగోను టి20 కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించి శ్రీధరన్ శ్రీరామ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుంచి టి20 కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ ఉన్నాడు. ఇక వచ్చే మార్చిలోగా కొత్త కోచ్‌ను నియమించనున్నట్లు బంగ్లా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మార్చిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో ఆడనున్నది. కొత్త కోచ్‌గా శ్రీలంకకు చెందిన చండికా హతురుసింఘే ఎంపికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇకపై టెస్టులు, వన్డేలకు ఒక కోచ్.. టి20లకు సెపరేట్ కోచ్ ఉంటారని స్పష్టం చేసింది. చదవండి: క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసిన మహ్మద్ రిజ్వాన్.. అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. -
'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్‌ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్ జస్టిన్ లాంగర్. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్‌దే ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉంది. ఎంత కాదన్నా కోచ్, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్లు సాధించిన కోచ్‌గా లాంగర్ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్‌ను తొలగించి ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. అలా లాంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్‌గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు. కోచ్‌కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్. నాకు తెలియకుండా పాట్ కమిన్స్ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్‌వన్‌లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయకుండానే నన్ను కోచ్ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు సరికొత్త ఫార్మాట్లో 2024 టి20 వరల్డ్‌కప్ -
IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టిన టీమిండియా.. ఇప్పుడు మరో పర్యటనకు సిద్దమవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన షూరూ కానుంది. కాగా ఈ పర్యటనకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి ఇవ్వాలి అని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి భారత తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: T20 WC 2022: "అతడొక అద్భుతం.. ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది' -
బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్
Hashan Tillakaratne: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ హసన్ తిలకరత్నే నియమితుడయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక మహిళా జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న తిలకరత్నే.. వచ్చే రెండేళ్ల కాలానికి బంగ్లాదేశ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (మహిళల క్రికెట్) చైర్మన్ నాదెల్ చౌధురీ వెల్లడించారు. తిలకరత్నే ఈ ఏడాది నవంబర్ నుంచి బాధ్యతలు చేపడతాడని నాదెల్ ప్రకటించారు. కాగా, బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ గత కొంతకాలంగా స్థానిక కోచ్‌లతో ప్లేయర్లకు శిక్షణ ఇప్పించేది. వీరి పర్యవేక్షణలో జట్టు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోవడంతో అనుభవజ్ఞుడైన విదేశీ కోచ్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే హసన్ తిలకరత్నేతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన మహిళల ఆసియా కప్‌లో బంగ్లా జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. భారత్.. ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. చదవండి: న్యూజిలాండ్‌కు ఊహించని షాక్.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ రద్దు -
ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్ హెడ్ కోచ్ రాజీనామా
వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో విండీస్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా దృవీకరించింది. కాగా ఈ ఏడాది అఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నాడు. "వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన కరీబియన్ అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ అనంతరం వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను" అని విలేకరుల సమావేశంలో సిమన్స్ పేర్కొన్నాడు. కాగా 2016లో టీ20 ప్రపంచకప్‌ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు. ఐర్లాండ్, స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయం ఈ ఏడాది ప్రపంచకప్‌లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్-1లో విండీస్ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి వంటి పసికూనల చేతిలో కూడా విండీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్ నికోలస్ పూరన్‌పై కూడా వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: T20 WC 2022: టీమిండియా సెమీస్‌కు చేరడం నల్లేరుపై నడకే..! -
ఆస్ట్రేలియా జట్టు హెడ్‌కోచ్‌గా షెల్లీ నిట్ష్కే..
ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ షెల్లీ నిట్ష్కే ఎంపికయ్యంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది . షెల్లీ నిట్ష్కే నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా మహిళలల జట్టుకు హెడ్‌కోచ్‌గా పనిచేయనుంది. కాగా అంతకుముందు ఆసీస్ హెడ్ కోచ్‌గా పనిచేసిన మథ్యూ మాట్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది. ప్రపంచంలోనే అత్యత్తుమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన షెల్లీ నిట్ష్కే.. ఆస్ట్రేలియా తరపున 80 వన్డేలు, 36 టీ20లు, 6 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 3000 పైగా పరుగులతో పాటు, 150 వికెట్లు పడగొట్టింది. ఇక కోచ్‌గా కూడా షెల్లీ నిట్ష్కేకు అపారమైన అనుభవం ఉంది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె దేశీవాళీ జట్టు సౌత్ ఆస్ట్రేలియాకు కోచ్‌గా కూడా పని చేసింది. అదే విధంగా 2018లో ఆస్ట్రేలియా జట్టు మహిళలల ఆస్టెంట్ కోచ్‌గా ఆమె పనిచేసింది. మరోవైపు 2019 నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా ఆసీస్ కోచ్‌గా ఎంపిక కావడంతో పెర్త్ స్కార్చర్ జట్టు హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోనుంది. చదవండి: Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. -
ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా మార్క్ బౌచర్
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ శుక్రవారం(సెప్టెంబర్ 16) తమ కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అందరు ఊహించనట్లుగానే దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్నే ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ పదవి వరించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్లో ప్రకటించింది. "మా కొత్త హెడ్ కోచ్‌ను పరిచయం చేస్తున్నాం. పల్టన్స్.. మన వన్ ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగతించండి" అంటూ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. మార్క్ బౌచర్ ఎంపికపై రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. '' ముంబై ఇండియన్స్‌లోకి మార్క్ బౌచర్‌ను స్వాగతించడానికి సంతోషిస్తున్నా. ఫీల్డ్‌లో ప్లేయర్‌గా, బయట కోచ్‌గా ఎంతో నైపుణ్యం సాధించి తన టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మార్క్ బౌచర్ రాకతో ముంబై ఇండియన్స్ బలోపేతమైంది. టీమ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకముంది" అని చెప్పుకొచ్చాడు. హెడ్‌కోచ్ పదవి రావడంపై మార్క్ బౌచర్ స్పందింస్తూ.. "ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా నియమితమవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ టీమ్ చరిత్ర, వాళ్ల ఘనతలు ప్రపంచంలోని బెస్ట్ స్పోర్టింగ్ ఫ్రాంఛైజీల్లో ఒకదానిగా ముంబై ఇండియన్స్‌ను నిలబెడతాయి. ఈ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నా. గొప్ప నాయకత్వం, గొప్ప ప్లేయర్స్‌తో ముంబై బలంగా ఉంది. ఈ టీమ్‌కు నా సలహాలు అందించడానికి ఎదురుచూస్తున్నా" అని తెలిపాడు. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు బౌచర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటి వరకూ హెడ్ కోచ్‌గా ఉన్న మహేల జయవర్దనె సెంట్రల్ టీమ్‌కు ప్రమోట్ కావడంతో ఆ స్థానం ఖాళీ అయింది. జయవర్దనేతో పాటు జహీర్‌ఖాన్‌ను కూడా ఆ టీమ్ సెంట్రల్ టీమ్‌కు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ టీమ్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూడు టీమ్స్‌ను కలుపుతూ ఒక సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేశారు. వాటి బాధ్యతలనే జయవర్దనే, జహీర్‌ఖాన్‌లకు అప్పగించారు. కాగా బౌచర్ ఈ మధ్యే సౌతాఫ్రికా కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమితో బౌచర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు టీ20 వరల్డ్‌కప్ వరకూ ఆ టీమ్‌తో కొనసాగనున్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున దాదాపు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన మార్క్ బౌచర్ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ఎదిగాడు. ప్రొటిస్ తరపున బౌచర్ 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు. బౌచర్ కెరీర్లో ఐదు టెస్టు సెంచరీలు సహా ఒక వన్డే సెంచరీ ఉంది. ఇక వికెట్ కీపర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 999 స్టంపింగ్స్, 952 క్యాచ్‌లు తీసుకొని కొత్త చరిత్ర సృష్టించాడు. 2012లో సోమర్‌సెట్‌తో మ్యాచ్ ఆడుతుండగా.. పొరపాటున ఎడమ కంటిలోకి బెయిల్ దూసుకెళ్లింది. దీంతో కంటిచూపు దెబ్బతినడంతో బౌచర్ అర్థంతరంగా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. Presenting आपले नवीन Head Coach - 𝐌𝐀𝐑𝐊 𝐁𝐎𝐔𝐂𝐇𝐄𝐑 💙 Paltan, drop a 🙌 to welcome the 🇿🇦 legend to our #OneFamily 👏#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM — Mumbai Indians (@mipaltan) September 16, 2022 చదవండి: ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు -
SA T20 League: పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా జేపీ డుమిని
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా పార్ల్ రాయల్స్‌ను ఐపీఎల్ ఫ్రాంజైజీ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ జట్టు కోచింగ్ స్టాప్ సభ్యల పేర్లను పెర్ల్ రాయల్స్ ప్రకటించింది. పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని ఎంపికయ్యాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రాటజీ కోచ్‌గా ప్రోటిస్ మజీ ఆటగాడు రిచర్డ్ దాస్ నెవ్స్.. మార్క్ చార్ల్టన్ (బ్యాటింగ్ కోచ్), ఏటీ రాజమణి ప్రభు( మెంటల్ కండిషనింగ్ కోచ్), మాండ్లా మాషింబీ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), లిసా కీట్లీ( టాక్టికల్ కోచ్) రస్సెల్ ఆస్పెలింగ్(జట్టు కేటాలిస్ట్)గా నియమితులయ్యారు. ఇక 2020 జనవరిలో డుమిని అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. The team behind the team for our first ever #SA20 campaign. 🙌💗#RoyalsFamily pic.twitter.com/L25o4ZqUbT — Paarl Royals (@paarlroyals) September 15, 2022 ప్రోటిస్ తరపున 46 టెస్టులు..199 వన్డేలు, 81 టీ20ల్లో ఆడాడు. డుమిని ప్రస్తుతం బోలాండ్ దేశీవాళీ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా పార్ల్ రాయల్స్ ఇప్పటికే డేవిడ్ మిల్లర్, మెకాయ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఒప్పంతం కుదుర్చుకుంది. ఈ సరికొత్త దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
మాజీలు సైమన్ కటిచ్, హషీమ్ ఆమ్లాలకు కీలక పదవులు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్‌ను కీలక పదవి వరించింది. సౌతాఫ్రికా టి20 లీగ్‌లో భాగంగా ముంబై కేప్‌టౌన్‌ను.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై కేప్‌టౌన్‌కు కొత్త కోచ్‌లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఇక ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ పామెంట్‌ను.. అలాగే జట్టు జనరల్ మేనేజర్‌గా రాబిన్ పీటర్సన్‌ను ఎంపిక చేస్తూ ముంబై కేప్‌టౌన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కాగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం సైమన్ కటిచ్‌కు ట్విటర్ వేదికగా వెల్కమ్ చెప్పింది. ''సైమన్ కటిచ్ ముంబై కేప్‌టౌన్ కోచ్‌గా ఎంపికవ్వడం మాకు ఎంతో ఉత్సాహానిస్తుంది. ముంబై కేప్‌టౌన్ హెడ్‌కోచ్‌గా మీకు మా ఫ్యామిలీలోకి స్వాగతం'' అంటూ పేర్కొంది. ఇక సైమన్ కటిచ్ స్పందింస్తూ.. ''ముంబై కేప్‌టౌన్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకముంచి ఒక కొత్త జట్టుకు కోచ్‌గా పనిచేయాలని బాధ్యత అప్పగించారు. జట్టులో ఆటగాళ్ల నైపుణ్యతను, సమతుల్యతను పెంచేలా పనిచేస్తాను. లోకల్ ఆటగాళ్ల నైపుణ్యతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు'' అంటూ తెలిపాడు. ఇక జనవరిలో జరగనున్న ఆరంభ ఎడిషన్‌కు అంతా సిద్ధమవుతుంది. ఎంఐ కేప్‌టౌన్ వెల్లడించిన ఫస్ట్ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కగిసో రబడ, డెవాల్డ్ బ్రెవిస్(అన్క్యాప్డ్)తో పాటు ఫారిన్ ప్లేయర్లు రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), సామ్ కరన్(ఇంగ్లండ్), లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) ఉన్నారు. కాగా ఈ టీ20 లీగ్ వేలానికి ముందే నిబంధనల ప్రకారం ఐదుగురు ఆటగాళ్లతో ఎంఐ కేప్‌టౌన్ ఒప్పందం చేసుకుంది. WELCOME, COACH KATICH! 🙌 We are eXXcited to announce that Simon Katich has joined the #OneFamily and will be the Head Coach of MI Cape Town! 💙 Read more here: https://t.co/36VSv8n7F0 #OneFamily #MICapeTown #SA20 @SA20_League pic.twitter.com/BFBigOjVvv — MI Cape Town (@MICapeTown) September 15, 2022 చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి ప్రమోషన్
ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తమ నాన్ ప్లేయింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ జహీర్ ఖాన్‌కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 🚨 Head Coach ➡️ Global Head of Performance 🌏 We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance 🙌💙#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ — Mumbai Indians (@mipaltan) September 14, 2022 ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్‌ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 🚨 Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development 🌏 Let's welcome ZAK as our Global Head of Cricket Development 🙌#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J — Mumbai Indians (@mipaltan) September 14, 2022 జయవర్ధనే, జహీర్ ఖాన్ కొత్త బాధ్యతలేంటి.. ఎంఐ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, అలాగే న్యూ టాలెంట్ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. -
క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్
Mark Boucher To Step Down As SA Head Coach: ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ నిన్న (సెప్టెంబర్ 12) ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. 2019 డిసెంబర్లో సౌతాఫ్రికా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బౌచర్.. గత మూడేళ్ల కాలంలో సౌతాఫ్రికాకు అపురూప విజయాలు అందించాడు. సౌతాఫ్రికాను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో (ప్రస్తుతం) నిలిపాడు. బౌచర్ హయాంలో సఫారీ టీమ్ 11 టెస్టులు, 12 వన్డేలు, 23 టీ20ల్లో విజయం సాధించింది. ఇందులో ఈ ఏడాది టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ (2-1) విజయం కూడా ఉంది. సీఎస్ఏతో బౌచర్ కాంట్రాక్ట్ 2023 వరల్డ్ కప్ వరకు ఉన్నప్పటికీ.. త్వరలో ప్రారంభంకానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజీ కోచింగ్ బాధ్యతలు చేపట్టే నిమిత్తం సీఎస్ఏతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. బౌచర్ దక్షిణాఫ్రికా కోచ్‌గా తన చివరి ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌లో ఆడనున్నాడు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 11 వరకు జరుగనున్న 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు బౌచర్‌కు సౌతాఫ్రికా కోచ్‌గా ఆఖరివి. అనంతరం జరగనున్న టీ20 ప్రపంచకప్ (అక్టోబరు 16 నుంచి నవంబరు 13) తర్వాత అతను సౌతాఫ్రికా కోచ్ బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. -
Punjab Kings: కుంబ్లేపై వేటు.. సన్‌రైజర్స్ మాజీ కోచ్‌కు ఓటు
ఐపీఎల్ 2023 కోసం కొన్ని జట్లు ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇటీవలే సన్‌రైజర్స్ యాజమాన్యం హెడ్ కోచ్ టామ్ మూడీని తప్పిస్తూ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పగా.. తాజాగా పంజాబ్ కింగ్స్ సైతం పాత కోచ్ అనిల్ కుంబ్లేపై వేటు వేసి, సన్‌రైజర్స్ మాజీ కోచ్, 2019 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ (ఇంగ్లండ్) కోచ్ ట్రెవర్ బేలిస్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. స్వతహాగా ఆస్ట్రేలియన్ అయిన బేలిస్ 2020, 2021 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా.. అంతకుముందు 2012, 2014 ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్‌కు సపోర్టింగ్ స్టాఫ్ హెడ్‌గా వ్యవహరించాడు. 2019 నుంచి పంజాబ్ హెడ్ కోచ్‌గా, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలందిస్తున కుంబ్లేతో ఒప్పందం గడువు ముగియడంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆటగాడిగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా కోచ్‌గా ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పంజాబ్ బేలిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. కాగా, గత సీజన్లో కేఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ ఆఖరి నిమిషంలో మయాంక్ అగర్వాల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. 2021 సీజన్లో కెప్టెన్ మారినా పంజాబ్ ఫేట్ మాత్రం మారలేదు. వరుసగా నాలుగో సీజన్లోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కెప్టెన్‌గా మయాంక్ కూడా విఫలం కావడంతో పంజాబ్ మరో కొత్త కెప్టెన్ వేటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఫ్రాంచైజీ యాజమాన్యం కొద్ది రోజుల కిందట క్లారిటీ ఇచ్చింది. మయాంక్ 2023 సీజన్లోనూ పంజాబ్ కెప్టెన్‌గా కొనసాగుతాడని కన్ఫర్మ్ చేసింది. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. కెప్టెన్ ఎవరంటే..? -
IPL- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..
Indian Premier League- Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని తప్పించింది. అతడి స్ధానంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఎస్ఆర్హెచ్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ శనివారం ప్రకటించింది. కాగా బ్రియాన్ లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ లారాతో ఒప్పందం కుదుర్చకుంది. "క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు" అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. 🚨Announcement 🚨 The cricketing legend Brian Lara will be our head coach for the upcoming #IPL seasons. 🧡#OrangeArmy pic.twitter.com/6dSV3y2XU2 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 కాగా ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్..కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక టామ్ మూడీ విషయానికి వస్తే... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టీ20 లీగ్‌లో పాల్గొనున్న డెసర్ట్ వైపర్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. As his term with us draws to an end, we would like thank Tom for his contributions to SRH. It has been a much cherished journey over the years, and we wish him the very best for future endeavours. pic.twitter.com/aGKmNuZmq8 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
Punjab Kings: అనిల్ కుంబ్లేతో పంజాబ్ కటీఫ్! మయాంక్ విషయంలో మాత్రం..
మొహాలి: మూడు ఐపీఎల్ సీజన్లలో తమ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్ కుంబ్లేతో పంజాబ్ కింగ్స్ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్ యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్‌ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్‌ల ఐపీఎల్లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్ కోచ్ పదవి ఎవరికీ కలిసి రాలేదు. 2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్. వరుసగా సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, మైక్ హెసన్ కోచ్‌గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో పంజాబ్ 42 మ్యాచ్‌లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఓవరాల్‌గా కూడా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ వేలంలో బెయిర్‌స్టో, రబడ, లివింగ్‌స్టోన్, శిఖర్ ధావన్‌లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్‌ను తప్పించిన పంజాబ్ మరోవైపు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం -
తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
కీలకమైన ఆసియాకప్‌కు ముందు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడని సమాచారం. ప్రస్తుతానికి సహాయక కోచ్ పారస్ మాంబ్రే ఇన్చార్జి కోచ్‌గా వ్యవహరిస్తారు. ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను హరారే నుంచి నేరుగా అక్కడికి పంపే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కేఎల్ రాహుల్ నేతృత్వంలో టీమిండియా జింబాబ్వేతో ఆడిన వన్డే సిరీస్‌కు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ అంతకముందు శ్రీలంక పర్యటనలోనూ కోచ్‌గా సక్సెస్ అయ్యాడు. అందుకే ఆసియాకప్ వరకు ద్రవిడ్ స్థానంలో అతని ఎంపికే సరైనదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఆసియా కప్‌కు ఎంపికైన రోహిత్ శర్మ బృందంలో ముగ్గురు మినహా మెజారిటీ సభ్యులంతా మంగళవారం ఉదయం దుబాయ్‌కి పయనమయ్యారు. జింబాబ్వేలో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, రిజర్వ్ ప్లేయర్ అక్షర్ పటేల్‌లు హరారే నుంచే అక్కడికి బయల్దేరతారు. ఆసియా కప్ ప్రధాన టోర్నీ యూఏఈలో ఈనెల 27 నుంచి జరుగుతుంది. 28న జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. చదవండి: ద్రవిడ్‌కు కరోనా.. -
కొత్త కోచ్ వేటలో పంజాబ్ కింగ్స్.. కుంబ్లేకు మంగళం పాడనుందా!
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ షాకివ్వనున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ కోచ్‌గా అనిల్ కుంబ్లే స్తానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి పేరు కూడా పరిశీలినలో ఉంది. మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఫ్రాంచైజీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 42 మ్యాచ్‌ల్లో 19 విజయాలు అందుకుంది. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేని సాగనంపి, కొత్త హెడ్ కోచ్‌ని నియమించుకునేందుకు పంజాబ్ కింగ్స ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ కింగ్స్ 2014 మినహా ఒక్కసారి కూడా ఫైనల్ చేరిన దాఖలాలు లేవు. ఎంతమంది కెప్టెన్లు, కోచ్‌లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మెరుగపడడం లేదు. అంతేకాదు జట్టు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మెగావేలంలోనూ దూకుడు కనబరిచింది పంజాబ్ కింగ్స్. వేలంలో శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబడా లాంటి పేరున్న ఆటగాళ్లను తీసుకుంది. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లిపోవడంతో.. శిఖర్ ధావన్‌ను కాదని మయాంక్ అగర్వాల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్సీ ఒత్తిడిలో పడి మయాంక్ తన బ్యాటింగ్‌ను పూర్తిగా మరిచిపోయాడు. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నప్పటికి పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు.. ఏడు పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచి మరోసారి లీగ్ దశకే పరిమితమయింది. మరి కొత్త కోచ్ రాకతో పంజాబ్ కింగ్స్ దశ వచ్చే సీజన్లోనైనా మారుతుందేమో చూడాలి. -
'ఆ ఐడియా నాదే.. బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపిస్తున్నా'
ఐపీఎల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ బుధవారం తమ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా రంజీ దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆరుసార్లు రంజీ ట్రోపీ గెలిపించిన కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కొత్త చరిత్ర సృష్టించాడు. కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంతోనే కేకేఆర్ సగం సక్సెస్ అయిందని.. ఇక ఈసారి కచ్చితంగా కేకేఆర్ టైటిల్ కొట్టబోతుందని అభిమానులు పేర్కొన్నారు. కాగా చంద్రకాంత్ పండిట్ నియామకంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ నడిచింది. విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రంజీ ట్రోపీ-2022 విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్ర కీలకం. ఒకప్పుడు కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు.'' కంగ్రాట్స్ మధ్యప్రదేశ్.. రంజీ ట్రోపీ గెలిచినందుకు. చంద్రకాంత్ పండిట్ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అతనికి ఐపీఎల్ కోచ్‌గా కాంట్రాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. తాజాగా కేకేఆర్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ ఎంపికైన నేపథ్యంలో ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్... ఇర్ఫాన్ పఠాన్ పాత ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ''ఇర్ఫాన్ భయ్యా.. మీ మాటలు విన్నాం.. అందుకే'' అంటూ లాఫింగ్ ఎమోజీ షేర్ చేశాడు. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ.. ''హాహా.. వెంకీబాయ్ ఉన్నా.. మీకు(వెంకీ మైసూర్).. అలాగే కొత్త కోచ్‌గా వచ్చిన చందు భాయికి(చంద్రకాంత్ పండిట్) ఆల్ ది బెస్ట్. అలాగే చందు భయ్యాను కోచ్‌గా తీసుకోవాలనే ఐడియా నేనే ఇచ్చా.. అందుకే నా బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపతున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా! IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్! -
కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా!
రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్‌గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్‌రైడర్స్ యాజమాన్యం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్ రెగ్యులర్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ ఏడాది ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్ కోచ్‌గా తీసుకొచ్చింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాలి క్రికెట్లో దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 🚨 We have a new HEAD COACH! Welcome to the Knight Riders Family, Chandrakant Pandit 💜👏🏻 pic.twitter.com/Eofkz1zk6a — KolkataKnightRiders (@KKRiders) August 17, 2022 చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు -
నేపాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నేపాల్ జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. భారత జట్టు తరఫున 1984 నుంచి 1996 మధ్య కాలంలో 39 టెస్టులు, 130 వన్డేలు ఆడిన ప్రభాకర్ గతంలో ఢిల్లీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రంజీ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అఫ్గానిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. నేపాల్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారని.. తన శిక్షణతో వారిని ఉన్నతస్థితికి తీసుకెళ్తానని ప్రభాకర్ అన్నాడు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం!
ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ లీసా కీట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లండ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్‌కోచ్ పదవికి కీట్లీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీఫైనల్లో భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందింది. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన కాంస్య పతక పోరులోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్ విభాగంలో పతకం సాధించకుండానే ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని ముగించింది. కాగా కీట్లీ రెండున్నరేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పనిచేసింది. ఆమె నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా మహిళల ప్రపంచ కప్-2022లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషిచింది. ఇక కీట్లీకు కోచ్‌గా సెప్టెంబర్‌లో జరగనున్న ఇంగ్లండ్- భారత్ సిరీస్ అఖరిది కానుంది. ఈ సిరీస్ తర్వాత ఆమె తన బాధ్యతలనుంచి తప్పుకోనుంది. చదవండి: భారత్‌పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్ క్రికెటర్ -
జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్, కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా పసుపు రంగు జెర్సీని ధరించనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. జొహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా.. సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూస్నర్ను డర్బన్ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. చదవండి: Ind Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! -
బెంగాల్ జట్టు కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్
బెంగాల్ జట్టు కొత్త కోచ్ ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లాను బెంగాల్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్( క్యాబ్) మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.బెంగాల్ జట్టు కోచ్ అరుణ్ లాల్ కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 41 ఏళ్ల లక్ష్మీ రతన్ శుక్లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా వి రామన్‌ను నియమించారు. బెంగాల్ క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్‌గా అరుణ్ లాల్ గుర్తింపు పొందాడు. అతని పదవీకాలంలో, జట్టు 2019-20 రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ మధ్యప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో బెంగాల్ జట్టు ఓడిపోయింది. అయితే గత నెల వరకు అరుణ్ లాల్ జట్టు కోచ్‌గా కొనసాగాడు. అయితే తాజాగా రెండో పెళ్లి చేసుకుని కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కొత్త కోచ్ కోసం వెతుకుతోంది. అయితే కొత్తగా ఎంపికైన లక్ష్మీరతన్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రావాల్సింది. కానీ ఆయన బంగ్లాదేశ్ అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత అభిషేక్ నాయర్‌ను నియమించడంపై చర్చ జరిగింది. ఎట్టకేలకు బెంగాల్ క్రికెట్ జట్టు కోచ్‌గా లక్ష్మీ రతన్ శుక్లా నియమితులయ్యారు. లక్ష్మీ రతన్ శుక్లా భారత్ తరఫున 3 వన్డేలు ఆడి ఈసారి 18 పరుగులు చేశాడు. అలాగే 137 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 141 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. శుక్లా బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఐపీఎల్ 47 మ్యాచ్‌లాడిన శుక్లా 405 పరుగులు చేశాడు. -
మెక్కల్లమ్ పారితోషికం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇంగ్లండ్ నూతన టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. కోచ్ సిల్వర్‌వుడ్ స్థానంలో కొత్త కోచ్‌గా వచ్చిన మెక్కల్లమ్ జట్టును గాడిలో పెడతాడేమో చూడాలి. అసలే వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు ఇంగ్లండ్‌ను దెబ్బతీశాయి. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నాయకత్వ పగ్గాలు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అప్పగించింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ కలయికలో సరికొత్తగా కనిపిస్తున్న ఇంగ్లండ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌ను గెలిచి మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. మెక్కల్లమ్ నాలుగేళ్ల పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా పనిచేయనున్నాడు. అందుకు సంబంధించి నాలుగేళ్ల కాలానికి గానూ మెక్‌కల్లమ్‌కు ఈసీబీ భారీగా చెల్లించనుంది. టెలిగ్రాఫ్.యూకే కథనం ప్రకారం 2 యూరో మిలియన్ డాలర్లకు(భారత కరెన్సీలో దాదాపు రూ. 18.88 కోట్లు) మెక్కల్లమ్తో నాలుగేళ్ల కాలానికి ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక హెడ్‌కోచ్‌కు ఈసీబీ ఇంత మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి అని వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్లకు ఎంత చెల్లిస్తామనేది గ్రేడ్స్ ప్రకటించే క్రికెట్ బోర్డులు కోచ్‌లకు ఎంత చెల్లిస్తున్నామనేది ఎక్కడా బహిరంగపరచలేదు. అయితే మెక్కల్లమ్పై ఉన్న నమ్మకంతోనే ఈసీబీ అతనికి పెద్ద మొత్తం చెల్లిస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇంగ్లండ్ టెస్టు హెడ్‌కోచ్‌గా ఎంపికైన మెక్కల్లమ్ స్పందించాడు. ''ఇంగ్లండ్ క్రికెట్‌కు సేవలందించడానికి ఉవ్విళ్లూరుతున్నా. నాపై నమ్మకంతో బోర్డు నాకు అప్పగించిన బాధ్యతలను పాజిటివ్ ధోరణితో నిలబెట్టుకుంటా. ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టును గాడిలోపెట్టడానికి ప్రయత్నిసా. బెన్ స్టోక్స్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఒక ఆటగాడిగా అతను నాకు పరిచయం.. ఇకపై ఇద్దరి సమన్వయంతో జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత మాపై ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి: IPL 2022: క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు RCB Play-Off Chances: ఆర్సీబీకి ప్లేఆఫ్ అవకాశం ఎంత?.. కోహ్లిపై డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్..
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం వెల్లడించింది. ఇక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభావం తర్వాత క్రిస్ సిల్వర్ వుడ్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా టెస్టు కెప్టెన్సీ నుంచి జో రూట్ కూడా తప్పుకున్నాడు. అతడి స్థానంలో బెన్ స్టోక్స్ సారథిగా ఎంపికయ్యాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ నుంచే మెక్ కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక మెక్ కల్లమ్ ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్ని నియమించడం మాకు ఆనందంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం. మెక్ కల్లమ్ రాకతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి' -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్..!
లండన్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్‌ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్‌ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్ రాజీనామా చేశాక బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు).. టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ మాజీ సారధి, కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా, జూన్‌లో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్‌కల్లమ్‌కు డీల్ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది' -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహం థోర్ప్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ప్లేయర్స్ యూనియన్ మంగళవారం వెల్లడించింది. థోర్ప్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ప్రస్తుతం అతని కండీషన్ క్రిటికల్‌గా ఉందని యూనియన్ పేర్కొంది. థోర్ప్ కుటుంబం విజ్ఞప్తి మేరకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, గ్రహం థోర్ప్ ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. థోర్ప్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం థోర్ప్ ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. చదవండి: బీజేపీ మీటింగ్‌కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..? -
ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్ కాదు!
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి విఫలమైన సంగతి తెలిసిందే. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో రెండుసార్లు గోల్డెన్ డక్‌లు ఉండడం విశేషం. దీంతో కోహ్లి పని అయిపోయిందని.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇస్తే అన్ని సర్దుకుంటాయని మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి ఫామ్‌పై తమకు ఆందోళన లేదని.. ఇది మాకు అలవాటేనని ఆర్సీబీ హెడ్‌కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ''కోహ్లి ఫామ్‌పై ఆందోళన వద్దు. నిజానికి అతను ఒక గొప్ప క్రికెటర్. ఇంతకముందు కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు చాలానే చూశాడు. నేను కోహ్లిని చాలా దగ్గర్నుంచి గమనించాను. కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినప్పటికి ఫుంజుకునే అవకాశం ఉంది. ఈ మాత్రానికే జట్టు నుంచి తొలగించమనడం కరెక్ట్ కాదు. ఏమో చెప్పలేం.. రానున్న మ్యాచ్‌ల్లో కోహ్లి రాణించి మ్యాచ్‌లు గెలపించవచ్చేమో. అతని బ్యాటింగ్‌పై మాకు అనుమానం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ సమయంలో కోహ్లినే అందరికంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. అతని షాట్ల ఎంపికలో కూడా కచ్చితత్వం ఉంటుంది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. అంతకముందు ఓపెనింగ్ చేసిన అనూజ్ రావత్ ముంబై ఇండియన్స్‌పై 66 మినహా... మిగతా ఆరు మ్యాచ్‌లు కలిపి 63 పరుగులు సాధించాడు. కోహ్లికి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది.. డుప్లెసిస్‌కు సరైన జోడి కోహ్లినే అని అభిప్రాయపడి ఓపెనింగ్ స్థానంలో పంపించాం. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక కోహ్లి మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్, కార్తిక్, షాబాజ్ అహ్మద్ అంతా ఫామ్‌లో ఉన్నారు. ఏదో ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తప్పుబట్టనవసరం లేదు. మా జట్టులో ఇప్పుడు ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసే సమర్థులు ఉన్నారు. ఇది మాకు బలం అని చెప్పొచ్చు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా! -
భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అనారోగ్యంగా ఉన్న మొదటి భార్యను ఒప్పించి మరీ ఆయన ఈ కార్యానికి రెడీ అయ్యాడు. అరుణ్ లాల్.. తనకు చాలాకాలంగా పరిచయమున్న బుల్ బుల్ సాహ (బెంగాల్) అనే మహిళ (38)ను మే 2న మనువాడబోతున్నాడు. కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు అరుణ్ లాల్ ఇప్పటికే తనకు కావాల్సి వారికి ఆహ్వానం పంపాడు. Arun Lal shared the invitation for his second marriage with his long-time friend Bul Bul Saha on May 2nd, 2022 Congratulations Arun Lal #Cricket pic.twitter.com/CEybHsJDN1 — All About Cricket (@AllAboutCricke8) April 24, 2022 అరుణ్ లాల్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన మొదటి భార్య రీనాకు చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్నా మంచానికే పరిమితం కావడంతో ఆమె అరుణ్ లాల్‌తోనే జీవిస్తుంది. రీనాకు అరుణ్ లాల్ మనువాడబోయే బుల్ బుల్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అరుణ్ లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా అరుణ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాల సాయంతో 10421 పరుగులు సాధించాడు. చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్ -
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం..!
ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్, ప్రస్తుత నెదర్లాండ్స్ హెడ్ కోచ్ ర్యాన్ క్యాంప్‌బెల్ (50)కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని లండన్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ర్యాన్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ర్యాన్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దిగ్గజ వికట్కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సమకాలికుడైన ర్యాన్ క్యాంప్‌బెల్ 2002 సంవత్సరంలో ఆస్ట్రేలియా తరఫున రెండు వన్డేలు ఆడాడు. ఆస్ట్రేలియా జట్టులో గిల్‌క్రిస్ట్ పాతుకుపోవడంతో ర్యాన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అతను హాంగ్‌కాంగ్ జట్టుకు వలన వెళ్లాడు. హాంగ్‌కాంగ్ జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. అనంతరం 2017లో నెదర్లాండ్స్ హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. చదవండి: ఢిల్లీ జట్టులో కరోనా కలకలం.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌పై బిగ్ అప్డేట్ -
ఆసీస్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించారు. జస్టిన్ లాంగర్ తర్వాత ఈ ఫిబ్రవరిలో మెక్ డొనాల్డ్‌కు తాత్కాలికంగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. తాజా గా ఆయన్నే నాలుగేళ్ల పాటు పూర్తిస్థాయి కోచ్‌గా నియమించారు. ఆయన కోచింగ్‌లోని ఆస్ట్రేలియా ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో 1–0తో టెస్టు సిరీస్ గెలిచింది. వన్డేల్లో 1–2తో ఓడి ఏకైక టి20లో నెగ్గింది. ‘కీలకమైన బాధ్యతల కోసం మేం చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం. అయితే మెక్‌డొనాల్డ్ తానేంటో ఇదివరకే నిరూపించుకున్నారు. ఆయన పనితీరు, అంకితభావం నచ్చే నాలుగేళ్ల కాంట్రాక్టు ఇచ్చాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. గతంలో బిగ్‌బాష్ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన మెక్‌డొనాల్డ్ 2019లో ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో చేరారు. ఆస్ట్రేలియా తరఫున 2009లో నాలుగు టెస్టులు ఆడి మొత్తం 107 పరుగులు చేసి 9 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2022: ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్ -
Women World Cup 2022: సెమీస్ కూడా చేరలేదు.. హెడ్‌కోచ్ పదవికి రాజీనామా!
ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 టోర్నీలో న్యూజిలాండ్ వైఫల్యం నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్ బాబ్ కార్టర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైట్‌ఫెర్న్స్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరకుండానే మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాగా వుమెన్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్.. ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికే పరిమితమైంది. సోఫీ డివైన్ సారథ్యంలోని వైట్‌ఫెర్న్స్ సెమీస్ చేరకుండానే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్లో జట్టు పరాభవానికి బాధ్యత వహిస్తూ బాబ్ కార్టర్ తన హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఓటమి బాధించిందని, తను శిక్షణలో తమ జట్టు పలు విభాగాల్లో మెరుగైందని పేర్కొన్నారు. కాగా కార్టర్ ఇకపై న్యూజిలాండ్ క్రికెట్(పురుషులు, మహిళలు)కు హై పర్ఫామెన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
హెడ్ కోచ్‌గా క్రిస్ గేల్.. ఏ జట్టుకో తెలుసా?
వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తానని గేల్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కరాచీ కింగ్స్ ఒకే ఒక విజయం సాధించింది. కరాచీ కింగ్స్‌కు బాబర్ ఆజాం సారథిగా ఉన్నాడు. "వచ్చే సీజన్లో కరాచీ కింగ్స్‌కు నేను కొత్త ప్రధాన కోచ్‌ని అవుతాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు" అని గేల్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫార్చ్యూన్ బారిషల్ జట్టుకు యూనివర్స్ బాస్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022కు కూడా క్రిస్ గేల్ దూరంగా ఉన్నాడు. 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్ 1899 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా తన టీ20 కేరిర్‌లో 445 మ్యాచ్‌లు ఆడిన గేల్ 14,321 పరుగులు చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్లో కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి యూనివర్స్ బాస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి గేల్ తప్పుకోవాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: 19 ఫోర్లు..2 సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ ఆటగాడు! -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా పాల్ కాలింగ్‌వుడ్..
ECB Named Collingwood As Interim Head Coach: విండీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ నిమిత్తం ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ పాల్ కాలింగ్‌వుడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సోమవారం ప్రకటించింది. కాలింగ్‌వుడ్ నియామకం తాత్కాలిక ప్రాతిపదికన జరిగినట్లు ఈసీబీ పేర్కొంది. తాజాగా విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ కోసం ఇంచార్జ్ కోచ్‌గా వ్యవహరించిన కాలింగ్‌వుడ్.. సెలవు నిమిత్తం కరీబియన్ దీవుల్లోనే ఉన్నాడని, ఫిబ్రవరి 25న ఇంగ్లండ్ జట్టు అక్కడి చేరుకోగానే అతను బాధ్యతలు చేపడతాడని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ వెల్లడించాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ ఓ వార్మప్ మ్యాచ్‌తో పాటు 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మార్చ్ 1 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది. కాగా, తాజాగా జరిగిన టీ20 సిరీస్‌లో కాలింగ్‌వుడ్ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ జట్టు విండీస్ చేతిలో 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ 2021-22లో ఆసీస్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి(0-4) బాధ్యున్ని చేస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ సిల్వర్‌వుడ్‌కు ఈసీబీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..! -
సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియాన్ లారా...
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నిజం చెప్పాలంటే లీగ్‌లోనే చెత్త ప్రదర్శన సన్‌రైజర్స్‌ది. అందుకే అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యం మేలుకుంది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించింది. వ్యూహ వైఫల్యాలను లెక్కించింది. ఎక్కడ తగ్గామో... ఎందుకు ఓడామో తూర్పారబట్టి జట్టు సహాయ బృందాన్ని ప్రక్షాళన చేసింది. ఇప్పుడు... దిగ్గజాలతో సన్‌రైజర్స్‌ను పరిపుష్టిగా మార్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాను వ్యూహాత్మక సలహాదారుగా నియమిస్తూ అతనికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 52 ఏళ్ల లారా వెస్టిండీస్ తరఫున 1990 నుంచి 2007 వరకు ఆడి 131 టెస్టుల్లో 11,953 పరుగులు... 299 వన్డేల్లో 10,405 పరుగులు సాధించాడు. 38 ఏళ్ల స్టెయిన్ గత ఆగస్టులో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్టెయిన్ మొత్తం 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 97 వికెట్లు తీశాడు. ఇక దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి 265 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 699 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ సహాయ బృందాన్ని నడిపించనున్నారు. ఈ సీజన్లో జట్టు క్రికెట్ డైరెక్టర్ పాత్రకే పరిమితమైన మూడీని ఎస్ఆర్హెచ్ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ సీజన్లో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ట్రెవర్ బేలిస్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లడం ఫ్రాంచైజీ యాజమాన్యానికి ఏమాత్రం రుచించలేదు. అందుకే హైదరాబాద్‌ను మేటి ఫ్రాంచైజీగా తీర్చిదిద్దిన మూడీని సహాయ సిబ్బంది పూర్తిస్థాయి సేనానిగా నియమించింది. 2013 నుంచి 2019 వరకు మూడీ కోచింగ్‌లోని ఎస్ఆర్హెచ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచింది. 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్, ఐదుసార్లు ప్లేఆఫ్ దాకా పోరాడింది. మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ సైమన్ కటిచ్ సహాయ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇతను ఈ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక మేటి ముత్తయ్య మురళీధరన్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనుంది. మెగా వేలానికి ముందు రిటెయిన్ జాబితాలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అన్క్యాప్డ్ ఉమ్రాన్ మలిక్, అబ్దుల్ సమద్‌లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్ డాషింగ్ ఓపెనర్ వార్నర్ సహా అందరినీ విడుదల చేసింది. -
లంక కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మికీ ఆర్థర్
Mickey Arthur To Resign As Sri Lanka Head Coach.. శ్రీలంక కోచ్ పదవి బాధ్యతల నుంచి నుంచి మికీ ఆర్థర్ తప్పుకోనున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ మికీ ఆర్థర్‌కు లంక కోచ్‌గా చివరిది కానుంది. కాగా ఆర్థర్ డెర్బీషైర్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆర్థర్ తన నిర్ణయాన్ని వెల్లడించారని తెలిసింది. కాగా లంక బోర్డు ఆర్థర్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ఆర్థర్ తన ఈమెయిల్లో రాజీనామా విషయాన్ని ప్రకటించాడు. ''లంక క్రికెట్‌తో నా బంధం త్వరలో ముగియనుంది. డెర్బిషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు డైరెక్టర్‌గా కొనసాగేందుకు మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నా. వెస్టిండీస్‌తో జగరనున్న రెండు టెస్టుల సిరీస్ లంక్ కోచ్‌గా నాకు ఆఖరిది కానుంది. ఇంతకాలం నాకు సహకరించిన లంక క్రికెట్ బోర్డుతో పాటు సపోర్ట్ స్టాప్‌కు నా కృతజ్క్షతలు. ఇక లంక క్రికెటర్లతో నాకు మంచి అనుబంధం కొనసాగింది. ముఖ్యంగా టి20 ప్రపంచకప్ లాంటి మేజర్ టోర్నీలో శ్రీలంకకు కోచ్‌గా పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మికీ ఆర్థర్ ఫిబ్రవరి 2020న లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
Team India head Coach: రవిశాస్త్రి స్థానంలో ఆయనా?!
Tom Moody eyeing to replace Ravi Shastri?: టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాబోయే కోచ్‌లుగా అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరుల పేర్లు తెరమీదకు వచ్చాయి. తాజాగా... మరో కొత్త పేరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ డైరెక్టర్ టామ్ మూడీ భారత జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ దిశగా ఎస్ఆర్హెచ్ పెద్దలు పావులు కదుపుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘‘సన్‌రైజర్స్ వరుస వైఫల్యాల నేపథ్యంలో డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్ల పట్ల కఠిన వైఖరి అవలంబించడం సహా.. యువ ఆటగాళ్లతో జట్టును నింపాలని గట్టిగా వాదించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న టామ్ మూడీ.. టీమిండియా కోచ్‌గా వస్తే మెరుగైన ఫలితాలు తీసుకురాగలడు’’అని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై ప్రభావం చూపగల ఎస్ఆర్హెచ్ ఫ్రాంఛైజీ పెద్దలు అధికారుల వద్ద ప్రస్తావించినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది బీసీసీఐ ప్రకటన తర్వాతే తేలుతుంది. కాగా తొలి టైటిల్(2016) సాధించిపెట్టిన వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సహా తుది జట్టు నుంచి కూడా ఫ్రాంఛైజీ అతడిని తప్పించిన సంగతి తెలిసిందే. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించారు. ఈ నిర్ణయాల వెనుక టామ్ మూడీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు మార్పులు చేసినప్పటికీ హైదరాబాద్ ఈ సీజన్లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లలో కేవలం 3 మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఇక గతంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ తదితర విదేశీ కోచ్‌లు టీమిండియాకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! -
పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
వసీం అక్రమ్.. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్ ఏనాడు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ కోచ్ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్ కార్నర్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్కోర్స్.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు. పాకిస్తాన్ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్ చిరాకు కలిగిస్తాయి. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ మ్యాచ్‌లో కోచ్ ఆడడు.. ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు. కోచ్ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ జట్టుకు కోచ్ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్ క్రికెట్లో కోచ్ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ వసీం అక్రమ్ తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో పాక్ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇటీవలే పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిస్బాఉల్ హక్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్.. మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న టీమిండియాతో ఆడనుంది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!
Saqlain Mushtaq set to become Pakistan’s head coach టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా సక్లైన్ ముష్తాక్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించబోతున్నట్లు సమాచారం. అంతకముందు టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపికలో తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్ హెడ్‌కోచ్ మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ సిరీస్‌కు తత్కాలిక హెడ్ కోచ్‌గా ముష్తాక్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కివిస్ పాక్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో తత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న ముష్తాక్‌ను టీ20 ప్రపంచకప్ వరకు పొడిగించే యోచనలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పాక్ తరుపున 49 టెస్ట్‌లు, 169 వన్డేలు ఆడిన ముస్తాక్ వరుసగా 208, 288 వికెట్లు సాధించాడు. గతంలో ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. ఆదేవిధంగా ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... మౌనం వీడిన అశ్విన్.. వరుస ట్వీట్లు! -
అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను!
లండన్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం వచ్చే టి20 ప్రపంచకప్‌తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగించేందుకు అతను ఆసక్తి చూపించడం లేదు. కోచ్‌గా ఎంతో సాధించానని, గడువు పూర్తయిన తర్వాత ఆగిపోయే మనస్తత్వం తనది కాదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోచ్‌గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించాను. టెస్టుల్లో ఐదేళ్లు నంబర్‌వన్‌గా ఉండటం, ఆ్రస్టేలియాలో రెండుసార్లు సిరీస్ సాధించడం, కరోనా సమయంలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టులు గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవడంలాంటివి అద్భుతం. నా నాలుగు దశాబ్దాల క్రికెట్లో ఇది ఎంతో సంతృప్తికర క్షణం. వీటికి తోడు టి20 ప్రపంచకప్ కూడా గెలిస్తే అది అదనపు ఆనందాన్నిస్తుంది. గెలవగల సత్తా మా టీమ్‌కు ఉంది కూడా. మనకు ఇచ్చిన సమయంకంటే అదనంగా ఒక్క క్షణం కూడా ఆగవద్దని నేను నమ్ముతాను. అందుకే సరైన సమయంలోనే తప్పుకుంటున్నాను’ అని రవిశాస్త్రి వివరించాడు. -
ఆర్సీబీ కీలక నిర్ణయం.. ప్రధాన కోచ్‌గా మైక్ హెసన్
దుబాయ్: ఐపీఎల్-14వ సీజన్ రెండో అంచె పోటీల ప్రారంభానికి ముందు ఆర్సీబీ కీలక మార్పులు చేస్తుంది. శనివారం జట్టులోకి ముగ్గురు కొత్త ఆటగాళ్లను తీసుకున్న ఆర్సీబీ కోచ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్సీబీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ వ్యక్తిగత కారణాలతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. దాంతో టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసన్ ఈ సారి హెడ్‌కోచ్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇక ఆర్సీబీ తన జట్టులో మూడు మార్పులు చేసింది. తొలి దశ పోటీల్లో ఆడిన ఆడమ్ జంపా, ఫిన్ అలెన్, డానియెల్ స్యామ్స్ ఈ సారి లీగ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాలను జట్టు ఎంచు కుంది. సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ కూడా ఆర్సీబీ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. సింగపూర్‌కు చెందిన ఒక ఆటగాడు ఐపీఎల్లో అడుగు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ మంచి ప్రదర్శనే కనబరిచింది. 7 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: MS Dhoni: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా ఐపీఎల్ నుంచి బట్లర్ అవుట్! -
'భారత మహిళల హాకీ జట్టుతో నా ప్రయాణం ముగిసింది'
టోక్యో: భారత మహిళల హాకీ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జోర్డ్ మారిజైన్ స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ఓటమి అనంతరం మారిజైన్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ''బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్ నా చివరి అసైన్మెంట్. ఈరోజుతో భారత్ మహిళల హాకీ టీంతో నా ప్రయాణం ముగిసింది.ఇంతకాలం మాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఈరోజు ఒలింపిక్స్‌లో మెడల్ గెలవలేకపోవచ్చు.. కానీ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నాం. అదే అభిమానుల ప్రేమాభిమానాలు. ప్రాభవం కోల్పోతున్న స్థితి నుంచి పతకం కోసం పోరాడే స్థాయికి చేరుకున్నాం. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించింది. వారి ఆటతీరుతో ఈరోజు లక్షలాది అమ్మాయిల మనసు గెలుచుకున్నాం'' అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు. We did not win a medal, but I think we have won something bigger. We have made Indians proud again and we inspired millions of girls that dreams CAN come true as long as you work hard for it and believe it! Thanks for all the support! 🇮🇳 — Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021 కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని పనితీరుపై ముగ్దులైన భారత హాకీ సంఘం మెన్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించమని అడిగింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ టీమిండియా మహిళల హాకీ జట్టును మరింత మెరుగ్గా తయారు చేసే పనిలో పడ్డాడు. కరోనా విరామం అనంతరం.. 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6-5తో అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఒలింపిక్స్‌కుఅర్హత సాధించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి రాంపాల్ సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలిచింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తాజాగా శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు. -
ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం..
ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై జట్టు హెడ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్‌ను ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన ముంబై కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తదితర మాజీలు పోటీపడ్డా, చివరకు ఆ పదవి ముజుందార్‌నే వరించింది. ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. జతిన్ పరాంజ్పే, నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ కమిటీ ముజుందార్వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, ముంబై కొత్త కోచ్‌గా ఎంపికైన మజుందార్ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్ -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
రమేశ్ పొవార్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. రెండోసారి
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్ మరోసారి భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం తన ట్విటర్లో షేర్ చేసింది. టీమిండియా వుమెన్స్ హెడ్‌కోచ్ పదవికి మొత్తం 35 అప్లికేషన్స్ రాగా.. ఆర్పీ సింగ్, మదన్ లాల్, సులక్షణ నాయక్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ హెడ్‌కోచ్‌గా పొవార్‌కే ఓటు వేసింది. కమిటీ సిఫార్సు మేరకు బీసీసీఐ కూడా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా ప్రస్తుతం టీమిండియా మహిళల కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్ నుంచి పొవార్ బాధ్యతలు తీసుకోనున్నారు. 2018 డిసెంబర్లో పొవార్ నుంచే బాధ్యతలు తీసుకున్న రామన్ జట్టును విజయవంతంగా నడిపాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ సేన ఫైనల్‌దాకా వెళ్లడంలో రామన్ కీలకపాత్ర పోషించాడు. అంతకముందు పొవార్ 2018లో టీమిండియా మహిళల జట్టుకు కొంతకాలం పాటు హెడ్ కోచ్‌గా సేవలందించాడు. అప్పటి కోచ్ తుషార్ ఆరోతే పదవికి రాజీనామా చేయడంతో బాధ్యతలు తీసుకున్న పొవార్ నవంబర్ 30, 2018 వరకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇక పొవార్ టీమిండియా తరపున 31 వన్డే మ్యాచ్‌లాడి 34 వికెట్లు.. 2 టెస్టులాడి 6 వికెట్లు తీశాడు. గతంలో సీనియర్ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా పొవార్ గతంలో మూడు నెలల కాలనికి మాత్రమే కోచ్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత పొవార్‌ను కొనసాగించడానికి ఇష్టపడని బీసీసీఐ.. డబ్యూవీ రామన్‌ను కోచ్‌గా నియమించింది. కాగా, మళ్లీ తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న పొవార్.. అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసి భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా మరొకసారి ఎంపిక కావడం విశేషం. చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా... NEWS: Ramesh Powar appointed Head Coach of Indian Women’s Cricket team Details 👉 https://t.co/GByGFicBsX pic.twitter.com/wJsTZrFrWF — BCCI Women (@BCCIWomen) May 13, 2021 -
Sri Lanka Tour: హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్ పర్యటన లో భాగంగా బీసీసీఐ తుది జట్టును కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే మరోక వన్డే జట్టును శ్రీలంక పర్యటనకు పంపనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు విరాట్‌కోహ్లి సారథ్యంలో టీమిండియా ఈ నెల 29 న ఇంగ్లండ్‌కు పయనమవనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సమయంలోనే టీమిండియా శ్రీలంక పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో భారత వన్డే జట్టుకు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే మ్యాచులకు రాహుల్ ద్రవిడ్‌ను హెడ్ కోచ్‌గా పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)కు సంబంధించిన సిబ్బంది కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జూలై 13న తొలి వన్డే కొలంబో: శ్రీలంకలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించి మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాయి. ఈ టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హంబన్‌టోట, దంబుల్లాలను వేదికలుగా పరిశీలిస్తున్నారు. 2018 నిదాహస్ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో ఆడలేదు. చదవండి: క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి -
రామన్‌కే అవకాశం
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ప్లేయర్ డబ్ల్యూవీ రామన్ మరోసారి దరఖాస్తు చేయనున్నాడు. 2018 నుంచి మహిళల జట్టుకు కోచ్‌గా పని చేసిన రామన్ రెండేళ్ల ఒప్పందం ఇటీవల ముగిసింది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం కోచ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఆ పదవిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించాలి. దాంతో కోచ్‌గా మళ్లీ పని చేసేందుకు మొగ్గు చూపుతోన్న రామన్... దరఖాస్తును దాఖలు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రామన్ పర్యవేక్షణలో భారత జట్టు 2020లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు చేరింది. అండర్–19 ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో బీసీసీఐ కొత్త జూనియర్ సెలక్షన్ కమిటీని కూడా నియమించనుంది. -
'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'
సిడ్నీ: టీమిండియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో ఆసీస్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లతో లాంగర్‌కు పొసగడం లేదని.. అతని ప్రవర్తనతో వారు ఇబ్బందులకు గురవుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో లాంగర్ ఆటగాళ్లతో ముభావంగా ఉండడం... తాను ఏం చెబితే అది చేయాలని.. ముఖ్యంగా గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో బౌలింగ్ విషయంలో జోక్యం చేసుకొని అనవసర సలహాలు ఇచ్చేవాడని.. ఆసీస్ బౌలర్లు కూడా అతని తీరుతో సంతృప్తిగా లేరంటూ పేర్కొంది. ఈ విషయాలను తాను సీరియస్‌గా తీసుకున్నానని.. జట్టుతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తానని లాంగర్ అప్పట్లో స్పందించాడు. అయితే తాజాగా ఆటగాళ్లతో కోచ్‌గా తన ప్రవర్తన బాలేదంటూ మీడియాలో మరోసారి వార్తలు లీక్ అవడం తనను బాధించిందని లాంగర్ తెలిపాడు. ఈ వార్తలతో తాను మానసికంగా కుంగిపోతున్నానని.. నా ఫ్యామిలీకి ఈ విషయాలు తెలిసి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ''నా వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్నో ఏళ్లు ఆటగాడిగా జట్టుకు సేవలందించా. ఆటగాడిగా ఉన్నప్పుడు రాని విమర్శలు కోచ్ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాలకు ఆటగాళ్లతో నా ప్రవర్తన బాలేదంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆటగాళ్లు లేక అసిస్టెంట్ కోచ్ నా వద్దకు వచ్చి సమస్యను చెప్తే సరిపోతుంది. ఈ విషయం వాళ్లకు అప్పుడే చెప్పా. నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీతో ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బహుశా నేను ఏంచుకన్న దారి ఆటగాళ్లకు నచ్చలేదు. అందుకే వారు నాతో సరిగా ఉండలేకపోయారు. అయితే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ మీడియాలో కథనాలు లీక్ అవడం భాదించింది. చివరకు నా భార్య కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆసీస్ సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేయడం అవసరమా అని ప్రశ్నించింది. నేను మాట్లాడే మాటలు సూటిగా ఉండొచ్చు.. కానీ నాకు మనసు ఉంటుంది. పైకి అది గట్టిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా బాధ ఉంది. ఆటగాళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను ఎప్పటికి సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
మతపరమైన అంశాలను ముడిపెట్టడం దారుణం
ముంబై: ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్నప్పుడు మతం ప్రాతిపాదికన ఆటగాళ్లకు అవకాశమిచ్చినట్లు వస్తున్న ఆరోపణలను టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఖండించాడు. కాగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై చూపించిన పక్షపాతం కారణంగా వసీం జాఫర్ మంగళవారం ఉత్తరాఖండ్ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తేవడం చాలా బాధ కలిగించింది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నిజానికి జై బిస్టాను కెప్టెన్‌ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్‌ను కెప్టెన్‌ను చేయమని సూచించారు. ఇక్బాల్‌కు ఐపీఎల్లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్ చేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు.. ఆయన్ని రావాలంటూ నేను ఎప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్ అబ్దుల్లాతో నాతో పాటు మేనేజర్ అనుమతి కోరాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాకే మేము ప్రార్థనలు చేశాము. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్ చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ తెలిపారు. కాగా వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. చదవండి: 'ముందు మీ కమిట్మెంట్ చూపించండి' రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్‌లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్‌కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్‌లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్‌ను ఓడించిన భారత్‌ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్‌కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
‘మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది’
అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎదురైన ఘోర పరాభవంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించాడు. కనీస స్థాయిలో కూడా తాము బ్యాటింగ్ చేయలేకపోయామని, ఈ విషయంలో పిచ్‌లో సమస్యేమీ లేదని అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన మెకల్లమ్ ‘ నిజాయితీగా చెప్పాలంటే మేము పూర్తిగా విఫలమయ్యాం. ఈ వికెట్‌పై ఆడటం మరీ అంత కష్టమేం కాదు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి మోరిస్ కూడా తోడవ్వడంతో... మా బ్యాట్స్‌మెన్ ధైర్యంగా బంతులను ఎదుర్కొనలేక పోయారు. దూకుడుగా ఆడాలనే ప్రణాళికతో మేము మ్యాచ్‌ను ఆరంభించాం. కానీ అలా జరగలేదు. మా టాప్ ఆర్డర్ మరింతగా ఆడాల్సి ఉంది. ఇదొక పాఠంగా భావించి... మా తదుపరి మ్యాచ్ నుంచి మళ్లీ విజయాల బాట పడతాం. ఇప్పటికీ లీగ్‌లో మాకు మంచి అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించాడు. కోహ్లి మాట వినలేదు... వికెట్ తీశాడు! ఒకే ఒక్క మ్యాచ్‌తో ‘జీరో’ నుంచి ‘ హీరో’గా తనను తాను సిరాజ్ ప్రమోట్ చేసుకున్నాడు. కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం దక్కడంతో... చెలరేగిన సిరాజ్ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘డ్రీమ్ స్పెల్ (4–2–8–3)’తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. తీసిన మూడు వికెట్లలో నితీశ్ రాణా వికెట్ కోసం వేసిన ఇన్‌స్వింగ్ బంతి అయితే సూపర్ అనే చెప్పాలి. అయితే ఈ బంతి వేసే ముందు తాను కోహ్లి మాటను పెడ చెవిన పెట్టానని సిరాజ్ పేర్కొనడం విశేషం. రాణా బ్యాటింగ్‌కు రాగానే... బౌన్సర్ వేయమంటూ కోహ్లి తనకు సూచించాడని... అయితే రన్నప్ మొదలు పెట్టేముందు బౌన్సర్ వద్దు... ఫుల్ బాల్ వేయాలని నిర్ణయించుకొని బంతిని వేశానని సిరాజ్ తెలిపాడు. దాంతో ఆ బంతి లోపలికి వెళ్తూ వికెట్లను గిరాటు వేయడంతో... రాణా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. -
స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్
స్వీడన్ : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన స్వీడన్ తమ దేశంలో ఆట అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రోడ్స్... టోర్నీ ముగిసిన వెంటనే కుటుంబంతో సహా స్వీడన్లో స్థిరపడనున్నాడు. సఫారీ జట్టు తరఫున జాంటీ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. -
అశ్విన్‌ను అలా చేయనివ్వను!
న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ‘మన్కడింగ్’ ద్వారా జాస్ బట్లర్‌ను రనౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడగా...అది క్రీడా స్ఫూర్తినికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈ సారి 2020 ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. దానికి హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో తాను అశ్విన్‌తో ‘గట్టిగా’ మాట్లాడతానని పాంటింగ్ వ్యా ఖ్యానించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్ హామీ ఇచ్చాడు. ‘మా జట్టు అలాంటి తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఈ ఘటన జరిగినప్పుడు నేను మా ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్‌లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మాత్రం అలాగే భావిస్తాం’ అని పాంటింగ్ వివరించాడు. అయితే అశ్విన్ తరహాలో ‘మన్కడింగ్’ ద్వారా బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో పాంటింగ్ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టు లో పలు మార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు. -
'కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది'
ముంబై : భారత టెస్టు క్రికెట్ మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా జాఫరే పీటీఐ వార్త సంస్థకు వెల్లడించాడు. ఏడాది పాటు ఉత్తరాఖండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నట్లు పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక మొదటిసారి కోచ్‌గా పనిచేయనున్న జాఫర్ తన అంతరంగాన్ని పంచుకున్నాడు. 'నేను మొదటిసారి ఒక జట్టుకు కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి నాకు ఇప్పుడు కొత్తగాను, ఒక చాలెంజింగ్ అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక ఆటగాడిగా సేవలందించిన నేను ఇక జట్టును తీర్చిదిద్దేపనిలో ఉండడం అదృషంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్ జట్టు నాకు కొత్తైనా వారి ప్రదర్శన మాత్రం బాగానే ఉంది. 2018-19 రంజీ సీజన్లో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో విదర్భతో తలపడి ఓడిపోయింది. దీంతో వారు గ్రూఫ్-డి( ప్లేట్ గ్రూఫ్‌కు) పడిపోయారు. ప్రస్తుతం గ్రూఫ్-డిలో ఉన్న ఉత్తరాఖండ్ జట్టును టాప్‌లో నిలపడమనేది నా ముందున్న సవాల్.(‘భువీ చాలా అందంగా ఉన్నాడు.. హీ ఈజ్ హాటెస్ట్’) ఇప్పుడున్న తరుణంలో జట్టును కింద నుంచి పైస్థానానికి తీసుకురావడం అనేది కోచ్‌గా అనుభవాన్ని నేర్పిస్తుంది. జట్టులో మంచి టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిని మరింత రాటు దేల్చడమే నా లక్ష్యం. స్వతహగా నేను ముంబై, విదర్భ జట్లకు ఆడేటప్పుడు ఉత్తరాఖండ్ జట్టును పరిశీలించాను. గత ఐదారేళ్లలో క్రికెట్లోకి వచ్చిన ఎంతో మంది యువకులకు ఆటలో మెళుకువలు ఇస్తూ వారికి మార్గ నిర్దేశనం చేశా. ప్రస్తుతం కోచ్ అవకాశం రావడంతో మరింత మంది యువకులకు నా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా' అంటూ పేర్కొన్నాడు. వసీం జాఫర్ కొంతకాలం కిందట ఆటకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు.కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.1996-97 సీజన్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వసీం..మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేయగా.. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి. -
అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా అరుణ్
బెంగళూరు: ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్‌కు మంచి అవకాశం లభించింది. అమెరికా క్రికెట్ జట్టుకు అతను హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి... తనకు వీసా మంజూరు కాగానే అమెరికాకు వెళ్తానని అరుణ్ అన్నాడు. అరుణ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013–14; 2014–15 సీజన్లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్’ ఘనత సాధించింది. -
కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్‌పై వేటు
న్యూఢిల్లీ: కేరళ బ్లాస్టర్స్ హెడ్ కోచ్ ఈల్కో స్కాటోరిని తప్పించినట్లు ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ ఫ్రాంచైజీ తరఫున కేవలం ఒక సీజన్‌కు మాత్రమే పనిచేసిన ఈల్కో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. 2019–20 ఐఎస్ఎల్ సీజన్లో ఈల్కో పర్యవేక్షణలోని కేరళ జట్టు 19 పాయింట్లతో ఏడో స్థానానికే పరిమితమై నిరాశపరిచింది. ‘కేరళ బ్లాస్టర్ ఎఫ్‌సీతో హెడ్ కోచ్ ఈల్కో బంధం ముగిసింది. కోచ్‌గా అతను అందించిన సేవలకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. అతనికి భవిష్యత్‌లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’ అని కేరళ బ్లాస్టర్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన 48 ఏళ్ల ఈల్కో ఐఎస్ఎల్లో కేరళ కన్నా ముందు నార్త్ ఈస్ట్ యునైటెడ్(2018–19)కు హెడ్ కోచ్‌గా వ్యవహరించి ఆ జట్టు తొలిసారి సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
కరోనాపై గెలుపొందాలి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కోవిడ్–19పై విజయం ఓ మెగా ప్రపంచకప్ విజయం లాంటిదని అన్నారు. బుధవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రపంచకప్‌లకంటే పెద్దది ఈ మహమ్మారి. దీనిపై పోరాటం చేయాలి. గెలవాలి. ఇందులో గెలిస్తే ప్రపంచకప్‌ను సాధించినట్లే. దీని కోసం మనం రెండు లక్ష్యాలు పెట్టుకోవాలి... ఒకటి ఇంట్లోనే ఉండటం. రెండోది భౌతిక దూరం పాటించడం’ అని ఈ వీడియోలో పేర్కొన్నారు. శాస్త్రి ఓ కోచే కాదు... మాజీ ఆల్‌రౌండర్, ఆ తర్వా త మంచి వ్యాఖ్యాత కూడా! అం దుకే తనదైన కామెంటేటర్ శైలిలో వీడియో సందేశమిచ్చారు. ‘కరోనా మనల్ని ఇంట్లోనే కట్టేసింది. నాలుగ్గోడలకు పరిమితం చేసిన ఈ మహమ్మారిని ఛేదించడం ప్రపంచకప్ లక్ష్యాన్ని ఛేదించడం లాంటిది. అందుకే అందరం కలసికట్టుగా ఈ కప్ గెలవాలంటే... కరోనాను ఓడించాల్సిందే. నిజానికి ఇది మామూలు ప్రపంచకప్ కప్ కాదు సుమా! అందుకే దీన్ని ఓడించేందుకు ఫైనల్ ఎలెవన్ జట్టు సరిపోదు. కోట్ల మంది టీమిండియా తరఫున పోరాడాలి. అప్పుడే గెలుస్తాం. అందరూ దృఢ సంకల్పంతో ఉండండి. కరోనాను భారత్ నుంచి తరిమేయండి’ అని రవిశాస్త్రి ప్రజల్ని జాగృతం చేస్తున్నారు. -
హైదరాబాద్ ఎఫ్‌సీ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు
సాక్షి, హైదరాబాద్: తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ సీజన్లో వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్ ఫిల్ బ్రౌన్పై వేటు వేసింది. సీజన్‌లోని తదుపరి మ్యాచ్‌లకు ఆయనతో కలిసి పనిచేయడం లేదంటూ శనివారం ఒక ప్రకటన చేసింది. యాజమాన్యం, కోచ్ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హైదరాబాద్ కోచ్‌గా ఫిల్ అందించిన సేవలకు క్లబ్ తరఫున నుంచి అతడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్లో మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఫిల్ జట్టును నడిపిన తీరు అభినందనీయం. అతని భవిష్యత్తు గొప్పగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ హైదరాబాద్ జట్టు సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆ ప్రకటనలో తెలిపారు. పుణే స్థానంలో ఐఎస్ఎల్ ఆరో సీజన్లో ఘనంగా అరంగేట్రం చేసిన హైదరాబాద్... ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగిలిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడి టేబుల్ చివరి స్థానంలో ఉంది. -
దక్షిణాఫ్రికా హెడ్ కోచ్‌గా బౌచర్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా జట్టు హెడ్ కోచ్‌గా మాజీ టెస్టు వికెట్ కీపర్ మార్క్ బౌచర్ శనివారం నియమితులయ్యాడు. అతను ప్రొటీస్ జట్టుకు 2023 వరకు కోచ్‌గా పనిచేస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ తాత్కాలిక డైరెక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తెలిపాడు. బుధవారం తాత్కాలిక డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గ్రేమ్ స్మిత్ వెంటనే జట్టు కోచింగ్ సిబ్బంది నియామకంపై దృష్టి సారించాడు. హెడ్ కోచ్‌గా 43 ఏళ్ల మార్క్ బౌచర్‌తో పాటు, అసిస్టెంట్ కోచ్‌గా ఇనోచ్ ఎన్వే, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు కోచ్‌గా మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ యాష్వెల్ ప్రిన్స్‌ను నియమించాడు. మరో వారం రోజుల్లో సీనియర్ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్స్ను నియమిస్తానని తెలిపాడు. బౌచర్ 147 టెస్టులు, 290 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012లో కంటికి తీవ్ర గాయం కావడంతో అతను ఆటకు స్వస్తి పలికాడు. -
మార్క్ బౌచర్‌కు కీలక పదవి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక పదవిని కట్టబెట్టింది. బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్‌లో ఘోర ఓటమి, వరుస వైఫల్యాలు, బోర్డులో అంతర్గత సమస్యలతో దక్షిణాఫ్రికా క్రికెట్ సంక్షభంలో చిక్కుకుంది. దీంతో ప్రొటీస్ క్రికెటన్ చక్కదిద్దే బాధ్యతను మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌కు అప్పగించింది. దీనిలో భాగంగా దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మిత్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ నుంచి దక్షిణాఫ్రికాకు ప్రధాన కోచ్‌గా బౌచర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు 2023 వరకు బౌచర్‌తో క్రికెట్ సౌతాఫ్రికా కాంట్రాక్ట్ చేసుకుంది. అయితే తొలుత తాత్కాలిక కోచ్‌గా నియమించినట్టు అందరూ భావించారు. అయితే బౌచర్‌తో మూడేళ్లకు గాను కాంట్రాక్ట్ చేసుకున్నట్టు స్మిత్ తెలపడంతో అతడు పూర్తిస్థాయి కోచ్‌గా ఎంపికైనట్టు స్పష్టమైంది. మార్క్ బౌచర్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అష్వెల్ ప్రిన్స్‌ను అదనపు సహాయక కోచ్‌గా ఎంపిక చేశామని స్మిత్ పేర్కొన్నాడు. ప్రస్తుత సహాయక కోచ్‌గా ఉన్న ఎనోచ్ ఎంక్వేతో కలిసి ప్రిన్స్ పనిచేయనున్నాడు. ఇక 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బౌచర్ ఆతర్వాత 2016లో కోచ్ అవతారం ఎత్తాడు. దేశవాళీ క్రికెట్లో టైటాన్స్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవంగా ఈ దిగ్గజ వికెట్ కీపర్‌కు ఉంది. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్లో బెస్ట్ కోచ్‌గా బౌచర్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సత్కరించింది. ఇక వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికాకు సుదీర్ఘకాలం తన సేవలందించిన బౌచర్ ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రికార్డు ఛేజింగ్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరి బంతికి బౌండరీ సాధించిన సఫారీ జట్టుకు విజయాన్నందించింది బౌచరే అన్న విషయం తెలిసిందే. ఇక 147 టెస్టులు ఆడిన బౌచర్ ఓవరాల్ అంతర్జాతీయ కెరీర్లో 999 ఔట్లలో ఈ వికెట్ కీపర్ భాగస్వామ్యమయ్యాడు. -
శ్రీలంక జట్టు హెడ్ కోచ్‌గా ఆర్థర్
కొలంబో: ఈ ఏడాది ప్రపంచకప్‌లో పేలవమైన ఆటతీరుతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న శ్రీలంక క్రికెట్లో ప్రక్షాళన మొదలైంది. ఆ జట్టు హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం నియమించింది. అతనితో పాటు జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, ఆ్రస్టేలియాకు చెందిన డేవిడ్ సకేర్ను బౌలింగ్ కోచ్‌గా, షేన్ మెక్‌డెర్మట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. ఆర్థర్ గతంలో దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. -
ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలి మహిళా హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలిసారి మహిళా క్రికెటర్‌నే హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నియమించింది. ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీకి ఈ అవకాశం దక్కింది. 48 ఏళ్ల లీసా 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు మార్క్ రాబిన్సన్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అయితే యాషెస్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు వరల్డ్ చాంపియన్‌గా ఉండగా... టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం లీసా బిగ్ బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
సూపర్ ఛాన్స్ కొట్టేసిన మెక్‌డొనాల్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 కోసం అన్ని ఫ్రాంఛైజీలు తమ వేట మొదలుపెట్టాయి. గత సీజన్ అనుభవాలను, ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఆటగాళ్ల మార్పులు, కొత్త కొచింగ్ బృందాలను ఎంపిక చేయడంలో అన్నీ ఫ్రాంచైజీలు చాలా బిజీగా ఉన్నాయి. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు కొత్త హెడ్ కోచ్‌లను నియమించాయి. తాజాగా రాజస్తాన్ రాయల్స్ కూడా సోమవారం కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల పాటు మెక్‌డొనాల్డ్ కోచ్‌గా వ్యవహరిస్తారని రాజస్తాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తాకూర్ తెలిపారు. మెక్‌డొనాల్డ్‌కు ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున ప్రాతినథ్యం వహించాడు. అనంతరం 2012-2013లో ఆర్సీబీకి బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్, విక్టోరియా జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ కోచ్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నానని, అదేవిధంగా తనముందున్న సవాళ్లు కూడా తెలుసని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ఆలస్యం చేయకుండా ఐపీఎల్లో రాజస్తాన్‌ను చాంపియన్‌గా నిలపడం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు. అయితే ప్రధాన కోచ్ పదవి కోసం అనేకమంది దరఖాస్తు చేసుకన్నప్పటికీ మెక్‌డొనాల్డ్ ఆలోచనలు, ప్రణాళికలు నచ్చడంతోనే అతడిని ఎంపిక చేశామని రాజస్తాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ బరాక్ తెలిపాడు. -
కింగ్స్ ఎలెవన్ కోచ్‌గా కుంబ్లే
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్లో పాల్గొనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహరించనున్నాడు. శుక్రవారం ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. అసిస్టెంట్ కోచ్‌గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని నియమించారు. విండీస్ దిగ్గజ మాజీ బౌలర్ కొట్నీ వాల్‡్షకు ప్రతిభాన్వేషణ బాధ్యతలు అప్పగించారు. ఈ ముగ్గురే కాకుండా ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మేటి జాంటీ రోడ్స్, బ్యాటింగ్ కోచ్‌గా జార్జి బెయిలీ (ఆ్రస్టేలియా)లను ఎంపిక చేయడం దాదాపు ఖాయమైంది. 2016, 2017లలో భారత జట్టు కోచ్‌గా వ్యవహరించిన 48 ఏళ్ల కుంబ్లే వచ్చే ఐపీఎల్లో ఏకైక స్వదేశీ హెడ్ కోచ్‌గా ఉండబోతున్నాడు. మిగతా ఫ్రాంచైజీ జట్లకు విదేశీ క్రికెటర్లే కోచ్‌లుగా ఉన్నారు. -
అనిల్ కుంబ్లే మళ్లీ కోచ్ అవతారం
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మళ్లీ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్‌గా నియమించినట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కింగ్స్ పంజాబ్‌కు ప్రధాన కోచ్‌గా కుంబ్లే వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న మైక్ హెసన్ కాంట్రాక్ట్ ముగిసింది. అయితే అతని కోచింగ్‌లో జట్టు విజయాల్లో, ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో అతడికి ఉద్వాసన పలికింది. అయితే ఇప్పటివరకు కేవలం ప్రధాన కోచ్‌ను మాత్రమే ఎంపిక చేశామని ఇతర సహాయక సిబ్బంది గురించి ఆలోచించలేదని తెలిపింది. త్వరలో కుంబ్లేతో సమావేశమయ్యాక అతడి సూచనలతో ఇతర సహాయక సిబ్బందిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే ప్రస్తుత సారథి రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా సాగనంపాలనే ఉద్దేశంలో కింగ్స్ పంజాబ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుంబ్లే నిర్ణయంపైనే అశ్విన్ భవిత్యం ఉండబోతోంది. గత కొన్ని రోజులుగా కుంబ్లే ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుత సారథి రవిచంద్రన్ అశ్విన్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక 2016-2017లో టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కోచ్‌గా విజయవంతమైనా.. సారథితో పాటు ఆటగాళ్లతో పొసగకపోవడంతో కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. ఇప్పుడు ఐపీఎల్లో తొలి సారిగా కోచ్ అవతారం ఎత్తుతున్న కుంబ్లే కింగ్స్ పంజాబ్ రాత మారుస్తాడో లేదో చూడాలి. -
అత్యున్నతంగా నిలపడమే లక్ష్యం
కూలిడ్జ్ (అంటిగ్వా): భారత పురుషుల జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా నియామకం అనంతరం రవిశాస్త్రి తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు. కొత్త తరం వస్తున్నందున తాను వైదొలిగే లోపు జట్టు పునర్ నిర్మాణ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటం ప్రధానమైనదని పేర్కొన్నాడు. మరో నలుగురైదుగురు బౌలర్లను వెదికి పట్టుకోవడం ఇందులోని సవాల్‌గా అతడు తెలిపాడు. ‘26 నెలల నా పదవీ కాలం పూర్తయ్యేసరికి టీమిండియాను అత్యున్నత స్థానంలో నిలపపడమే లక్ష్యం. తద్వార రాబోయే తరానికి వారు ఘన వారసత్వం అందిస్తారు. ఈ జట్టు మున్ముందు అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం నాకుంది. మేం ఇప్పుడు ఆ దిశగానే వెళ్తున్నాం. పురోగమనానికి అంతుండదు. యువ ఆటగాళ్లను చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు శ్రద్ధ కూడా అదేవిధంగా ఉండాలి. ఫలితాలు రాకపోయినా నిరుత్సాహం చెందొద్దు. గత రెండు–మూడేళ్లుగా టీమిండియా స్థిరంగా విజయాలు సాధిస్తోంది. ఇకపై వాటిని మరింత పెంచుకుంటూ పోవాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా జట్టు పురోగతిని విశ్లేషించిన అతడు ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫీల్డింగ్‌లో సాధించిన ప్రగతిని నొక్కిచెప్పాడు. ఈ ప్రమాణాలను మరో మెట్టు ఎక్కించడమే తమ బృందం లక్ష్యమని వివరించాడు. -
కోల్‌కతా కోచ్‌గా మెకల్లమ్
కోల్‌కతా: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఐపీఎల్లో సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యాడు. తాను నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఇప్పుడు హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ సీజన్ అనంతరం చీఫ్‌కోచ్ జాక్వస్ కలిస్ సేవలకు మంగళం పాడిన ఫ్రాంచైజీ అతని స్థానంలో మెకల్లమ్‌కు కోచింగ్ బాధ్యతల్ని అప్పగించింది. ఇటీవల గ్లోబల్ టి20లో ఆడిన అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి చెందిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కూడా మెకల్లమ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. లీగ్‌లో మెకల్లమ్.. 2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మెకల్లమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతం కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రారంభ సీజన్ నుంచి 2018 వరకు కేకేఆర్‌తో పాటు, కొచ్చి టస్కర్ కేరళ, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 మ్యాచ్‌లాడిన మెకల్లమ్ 27.69 సగటుతో 2,880 పరుగులు చేశాడు. -
కోచ్ ప్రకటనకు ముహూర్తం ఖరారు!
ముంబై : ప్రపంచకప్ ముగిసిన అనంతరం అభిమానులను ఆసక్తిపరుస్తున్న మరో అంశం తదుపరి టీమిండియా కోచ్ ఎవరని?. ప్రస్తుత కోచింగ్ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించారు. అంతేకాకుండా కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నియామక ప్రక్రియ కోసం బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక చేపట్టనుంది. ఈ బృందం ఇప్పటివరకు అందిన దరఖాస్తుల నుంచి ఆరుగురిని షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ ఆరుగురిని శుక్రవారం(ఆగస్టు 16) ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూ చేయనుంది. అదే రోజున కోచ్ ఫలితాలు కూడా ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు ఉన్నారు. ఈ ఆరుగురికి మాత్రమే కపిల్ దేవ్ కమిటీ ఇంటర్వ్యూలు చేయనుంది. ఇక సారథి విరాట్ కోహ్లి రవిశాస్త్రి వైపే మొగ్గుచూపడంతో అతడినే మళ్లీ ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది. ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. కోచ్, కెప్టెన్ ఇష్టం మేరకు మిగతా సిబ్బందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మినహా మిగతా సిబ్బంది యథాతథంగా ఉంటారని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. -
కోచ్ మికీ ఆర్థర్‌కు పాక్ గుడ్‌బై
లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మికీ ఆర్థర్‌కు పొడిగింపు ఇవ్వరాదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. అతనితో పాటు బౌలింగ్ కోచ్ అజహర్ మహమూద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, ఫిట్నెస్ ట్రైనర్ ల్యూడెన్‌లను కూడా పీసీబీ తప్పించనుంది. ఈ నలుగురి కాంట్రాక్ట్ ఈ నెల 15తో ముగుస్తుంది. అయితే ఎవరినీ కొనసాగించకుండా వీలైనంత త్వరలో కొత్త సహాయక సిబ్బందిని ఎంపిక చేస్తామని బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించారు. వన్డే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో 5 గెలిచిన పాకిస్తాన్ 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమంగా నిలిచింది. అయితే రన్‌రేట్‌లో వెనుకబడటంతో సెమీస్ అవకాశం చేజార్చుకుంది. ఆర్థర్ 2016 టి20 ప్రపంచ కప్ తర్వాత పాక్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పదవీకాలంలో పాక్ వన్డేల్లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం పెద్ద ఘనత కాగా, టి20ల్లో నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. ‘పాక్ క్రికెట్‌ను బాగు చేసేందుకు నా శక్తిమేరా ప్రయత్నించాను. తాజా నిర్ణయంతో చాలా బాధపడుతున్నాను’ అని ఆర్థర్ స్పందించాడు. -
టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ : భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లిసేన పలు ఐసీసీ టోర్నీలు ఓడిందని, తదుపరి ప్రపంకప్‌కు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. ప్రధాన కోచ్ మార్పు కూడా అనివార్యమని చెప్పాడు. బీసీసీఐ ఆహ్వానం మేరకు ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న రాబిన్ సింగ్.. జట్టును నడిపించే సత్తా తనకుందని, తన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ‘ప్రస్తుత కోచ్ పర్యవేక్షణలో భారత్ రెండు వరుస ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌ల్లో కూడా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు 2023 ప్రపంచకప్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జట్టులో మార్పులు కూడా అవసరమే. క్షిష్ట పరిస్థితుల్లో కోచ్ పాత్ర కీలకం. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆటగాళ్లతో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. అది ఆటను సాంకేతికంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతోంది.’ అని రాబిన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచకప్-2019లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో తాను కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినో కూడా వివరించాడు. ‘ బంతి స్వింగ్ అవ్వడంతో రోహిత్ శర్మ త్వరగా ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లిని పంపించకుండా మరో టాపర్డర్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను ఆడించేవాడిని. నెం.4గా కోహ్లిని పంపించి నెం.5లో ధోనిని ఆడించేవాడిని. అప్పుడు కోహ్లి-ధోని మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారు. చివర్లో హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలు పవర్ హిట్టింగ్తో మిగతా పనిని పూర్తి చేసేవారు’ అని తన వ్యూహాన్ని రాబిన్ సింగ్ వెల్లడించాడు. భారత్ తరఫున 136 వన్డేలు, ఒక్క టెస్ట్‌కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ సింగ్‌కు కోచ్‌గా 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా పని చేసాడు. భారత అండర్-19, ఏ జట్లకు సైతం కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహాయ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం భారత హెడ్ కోచ్ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఏసీలో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవిశాస్త్రి బాగా పని చేశాడని అన్షుమన్ గైక్వాడ్ కితాబు ఇవ్వడంతో అతనికే మరోసారి కోచ్ పగ్గాలు అప్పచెబుతారానే ప్రచారం జోరందుకుంది. ఇక భారత ప్రధాన కోచ్ రేసులో రాబిన్‌సింగ్‌తో పాటు టామ్ మూడీ, మహేళ జయవర్ధనే, మైక్ హస్సెన్ తదితరులున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రవిశాస్త్రి వైపే మొగ్గు?) -
టీమిండియా కోచ్ రేసులో అతడు కూడా..
ముంబై : టీమిండియా ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ల పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. దీంతో ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే, సీనియర్ కోచ్‌లు టామ్ మూడీ, గ్యారీ కిరిస్టెన్‌లు ప్రదాన కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్టు అనధికారిక సమాచారం. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో ఇప్పటివరకు ఈ నలుగురు కోచ్ రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. అయితే మరో దిగ్గజ కోచ్ టీమిండియా ప్రధాన కోచ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ కూడా భారత్ ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. రెండుమూడు రోజుల్లోనే ఆయన బీసీసీఐకి దరఖాస్తు పంపించే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరేళ్లుగా కివీస్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌కు సేవలందించాడు. దీంతో భారత్‌లోని పరిస్థితుల, ఆటగాళ్ల గురించి అవగాహన ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన కోచింగ్‌లోనే కివీస్ 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. దీంతో అనుభవం, ప్రతిభ దృష్ట్యా హెస్సన్ కూడా టీమిండియా కోచ్‌గా అన్ని విధాల అర్హుడు అంటూ క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియ బాధ్యతను చేపట్టిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌గా ఎవరిని నియమిస్తుందా అని అందరిలోనూ అసక్తి రేకెత్తిస్తోంది. -
సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టును విశ్వ విజేతగా నిలిపి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు టామ్ మూడీ (ఆస్ట్రేలియా) హెడ్ కోచ్‌గా ఉన్నాడు. బేలిస్ సైతం ఆస్ట్రేలియాకు చెందినవాడే. కొంతకాలంగా ఇంగ్లండ్‌కు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలోనే ఆ జట్టు 2015 యాషెస్ సిరీస్‌ను 3–2 తేడాతో గెల్చుకుంది. 2016 టి20 ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. అనంతరం వన్డేల్లో నంబర్‌వన్‌గానూ అవతరించింది. తాజాగా వన్డే ప్రపంచ కప్‌నూ సాధించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌తో ఇంగ్లండ్ జాతీయ జట్టుతో బేలిస్ ఒప్పందం ముగియనుంది. దీనికిముందు 2010–11లో అతడు ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం శ్రీలంక జాతీయ జట్టుకు పనిచేశాడు. లంక 2011 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరినప్పుడు బేలిస్ ఆ దేశ కోచ్‌గా ఉన్నాడు. 2012–15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సందర్భంలోనూ అతడే శిక్షకుడు. బేలిస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ సైతం ప్రయత్నించాయి. కోల్‌కతాతో చర్చలు కూడా నడిచినా అవి ముందుకు సాగలేదు. మూడీ సేవలకు వీడ్కోలు సన్‌రైజర్స్ కోచ్‌గా టామ్ మూడీది విజయవంతమైన ప్రయాణమే. అతడు ఏడు సీజన్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందులో 2016లో హైదరాబాద్ లీగ్ విజేతగా నిలవగా, 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. ‘మూడీ స్థానంలో ఫ్రాంచైజీకి కొత్త హెడ్ కోచ్‌ను నియమించాలన్నది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జట్టు భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసేందుకు అతడు సరైనవాడు ’ అని సన్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. జట్టుపై మూడీ ప్రభావాన్ని ఈ సందర్భంగా కొనియాడింది. ‘సన్ రైజర్స్ పురోగతి, విజయాల్లో మూడీది చెరగని ముద్ర. లీగ్‌లో అత్యధిక కాలం కోచ్‌గా పనిచేశాడు. అయినా కొత్తవారికి కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది’ అని సన్‌రైజర్స్ సీఈవో షణ్ముగం తెలిపాడు. -
ఇంగ్లండ్ కోచ్‌కు సన్‌రైజర్స్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న ట్రెవర్ బేలిస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏడు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు సేవలందించిన టామ్ మూడీకి ధన్యవాదాలు తెలిపింది. ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంతో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ శిక్షణలో ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీపడ్డాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా బేలిస్ కోసం చివరి వరకు ప్రయత్నించింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో తమ జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు బేలిస్‌కు సన్‌రైజర్స్ భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇక కోచ్‌గా బేలిస్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో రెండు సార్లు విజేతగా నిలిచినప్పుడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా బేలిస్ ఉన్నాడు. అంతేకాకుండా సిడ్నీ సిక్సర్స్ బిగ్‌బాష్ లీగ్ గెలవడంలో కోచ్‌గా బేలిస్ పాత్ర మరవలేనిది. తాజాగా ఇంగ్లండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంతో అందరి దృష్టి ఇతడిపై పడింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు బేలిస్ కోసం పోటీపడ్డాయి. ఇక సన్‌రైజర్స్ కోచ్‌గా టామ్ మూడీకి ఘనమైన రికార్డే ఉంది. మూడీ కోచింగ్‌లోనే సన్‌రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో పాటు, ఐదు సార్లు ప్లే ఆఫ్‌కు చేరింది. 🚨Announcement🚨 Trevor Bayliss, England's WC Winning coach, has been appointed as the new Head Coach of SunRisers Hyderabad. #SRHCoachTrevor pic.twitter.com/ajqeRUBym5 — SunRisers Hyderabad (@SunRisers) July 18, 2019 -
కపిల్ త్రయం చేతిలో... హెడ్ కోచ్ ఎంపిక బాధ్యత!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్ త్రయాన్ని తాత్కాలిక (అడహక్) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది. సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనపై హెడ్ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్ శంకర్ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్ కోచ్ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
భారత కోచ్‌గా ఐగర్ స్టిమాక్
న్యూఢిల్లీ: క్రొయేషియాకు చెందిన ఐగర్ స్టిమాక్ భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. గురువారం ఇక్కడ సమావేశమైన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం స్టిమాక్‌తో పాటు లీ మిన్ సంగ్ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్ రోకా (స్పెయిన్), హకాన్ ఎరిక్సన్ (స్వీడన్)తో దరఖాస్తు చేశారు. వీరిలో స్టిమాక్ నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. మిగతావారు స్కైప్ ద్వారా మాట్లాడారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... స్టిమాక్ వైపు మొగ్గింది. 51 ఏళ్ల స్టిమాక్ సెంటర్బ్యాక్గా 53 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. 1996 యూరో కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012–13 మధ్య తమ దేశ జటు కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలోనే క్రొయేషి యా 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. స్టిమాక్ మూడేళ్ల పాటు భారత కోచ్‌గా ఉండనున్నాడు. థాయ్‌లాండ్‌లో జూన్ 5 నుంచి జరుగనున్న కింగ్స్ కప్‌తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది. -
ఎన్సీఏ హెడ్ కోచ్ రేసులో రాహుల్ ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ కోచ్‌గా నియమితులయ్యే ప్రక్రియ మొదలైంది. బీసీసీఐ కొత్తగా సృష్టించిన ఈ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ఇప్పటికే భారత్ ‘ఎ’, అండర్–19 జట్లకు ఇన్చార్జ్గా ఉన్న ద్రవిడే ఈ పదవి రేసులో ఉన్నాడని బోర్డు తెలిపింది. అయితే పారదర్శక నియామక ప్రక్రియలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తెలిపింది. దీంతో ద్రవిడ్ ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంటాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ‘బీసీసీఐలోని అన్ని పదవుల నియామకానికి చేపట్టినట్లే ఈ హెడ్ కోచ్ కోసం కూడా ప్రక్రియను కొనసాగించేందుకే దరఖాస్తుల్ని ఆహ్వానిస్తాం. ఈ పదవి రేసులో ద్రవిడే ముందు న్నాడు. ఇప్పటికే ఆయన జూనియర్ జట్లను విజయవంతంగా తీర్చిదిద్దుతున్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో రాహుల్ నామమాత్రంగా ఒక్కసారి దరఖాస్తు సమర్పిస్తే చాలు నియామకం వెంటనే జరిగిపోయే చాన్స్ ఉంది. గతంలో నేరుగా చేపట్టిన నియామకాలతో బోర్డుపై విమర్శలు రావడంతో ఇకపై ఏ నియామకమైనా పారదర్శకంగా చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. -
జింబాబ్వే కోచ్‌గా భారత మాజీ ఆటగాడు
క్రికెట్ పసికూన జింబాబ్వే జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆటగాడు, కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ నియమితులయ్యారు. ప్రస్తుతం జింబాబ్వేకు తాత్కాలిక కోచ్‌గా ఉన్న రాజ్‌పుత్‌ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు జింబాబ్బే క్రికెట్ బోర్డ్ ట్వీట్ చేసింది. ‘రాజ్‌పుత్ సేవలు జింబాబ్వే జట్టు వినియోగించుకోనుంది. అతని అనుభవం, కష్టపడేతత్వం, ఆటపై ఉన్న మక్కువ మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఇక కోచ్‌గా నియమిచండం పట్ల రాజ్‌పుత్ ఆనందం వ్యక్తం చేశారు. ‘నన్ను కోచ్‌గా నియమించింనందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. దీన్ని గౌరవంగా, ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాను. జట్టును మరో లెవల్‌కు తీసుకవెళ్లడానికి కృషి చేస్తాను. త్వరలోనే జింబాబ్వే ఆటలో మార్పులు చూస్తారు’ అంటూ రాజ్‌పుత్ పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్‌కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో కోచ్‌గా ఉన్న హీత్‌స్ట్రీక్‌ను తప్పించి రాజ్‌పుత్‌ను తాత్కాలిక కోచ్‌గా బోర్డు నియమించిన విషయం తెలిసిందే. 2007లో దక్షిణాఫ్రిలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు రాజ్‌పుత్ టీమ్ మేనేజర్‌గా వ్యవహరించారు. భారత్ తరపున 2 టెస్ట్‌లు, 4 వన్డేలు ఆడిన రాజ్‌పుత్ 2016లో అఫ్గనిస్థాన్ కోచ్‌గా పనిచేశారు. @ZimCricketv is thrilled to announce Lalchand Rajput has been appointed as the substantive head coach of our men’s national team. The former @BCCI international is a respected and successful coach reputed for his passion, hard work and intimate knowledge of the game #AllTheBest pic.twitter.com/nT3Tpt1NbZ — Zimbabwe Cricket (@ZimCricketv) August 24, 2018 -
పవార్‌కే ‘మహిళల’ పగ్గాలు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు అతను కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా కోచ్ తుషార్ అరోథే తప్పుకోవడంతో గత నెలలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే పవార్ పర్యవేక్షణలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో భారత జట్టు శిక్షణా శిబిరం కొనసాగింది. ప్రపంచకప్‌కంటే ముందు భారత జట్టు శ్రీలంకలో పర్యటించి 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టి20 సిరీస్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. మహిళల జట్టు కోచ్ పదవి కోసం ఈ నెల 10నే బీసీసీఐ దరఖాస్తులు కోరింది. 20 మంది దీని కోసం పోటీ పడ్డారు. డయానా ఎడుల్జీ, రాహుల్ జోహ్రి, సబా కరీం వీరందరినీ పది నిమిషాల చొప్పున ఇంటర్వ్యూ చేశారు. అనంతరం జాబితాను ఆరుగురికి కుదించారు. పవార్‌తో పాటు మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, అతుల్ బెదాడే, కోహ్లి తొలి కోచ్ రాజ్‌కుమార్ శర్మ, మహిళల జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సనత్ కుమార్ ఈ జాబితాలో నిలిచారు. చివరకు పవార్‌కే అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు ఇప్పటికే పవార్‌ను కోచ్‌గా ప్రకటించిన నేపథ్యంలో కొద్ది రోజులకే జరుగనున్న వరల్డ్ కప్ వరకు కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో అతడి ఎంపిక ఖరారైనట్లుగా సమాచారం. భారత్ తరఫున 2 టెస్టులు ఆడిన 40 ఏళ్ల రమేశ్ పవార్, 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 148 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతను 470 వికెట్లు పడగొట్టడం విశేషం. -
బంగ్లాదేశ్‌కు కొత్త క్రికెట్ కోచ్
ఢాకా: చండికా హతురుసింఘా కోచ్ పదవి నుంచి తప్పుకున్న ఎనిమిది నెలల అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన మాజీ కీపర్-బ్యాట్స్‌మన్ స్టీవ్ రోడ్స్‌ను నూతన ప్రధాన కోచ్‌గా ఎంపిక చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అతని ఎంపికను బీసీబీ గురువారం ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2020 టీ20 వరల్డ్ కప్ వరకూ స్టీవ్ రోడ్స్ తమ జట్టుకో హెడ్ కోచ్‌గా కొనసాగనున్నట్లు బీసీబీ చీఫ్ నజ్ముల్లా హసన్ తెలిపారు. రోడ్స్ పర్యవేక్షణలో బంగ్లాదేశ్ తిరిగి గాడిలో పడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్ని నెలలగా కోచ్ లేకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. సరైన పర్యవేక్షణ లేక ఆ జట్టు సిరీస్‌లను చేజార్చుకుంటూ వస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్ దిగ్గజ పేసర్ కోట్నీవాల్ష్.. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను సానబట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక కోచ్‌గా వాల్ష్ సేవలందిస్తూ వస్తున్నాడు. అయితే ప్రధాన కోచ్ అవసరాన్ని గుర్తించిన బీసీబీ.. ఎట్టకేలకు ఆ బాధ్యతను స్టీవ్ రోడ్స్‌కు అప్పగించింది. దీనిపై రోడ్స్ హర్షం వ్యక్తం చేశాడు. తన పేరు బంగ్లాదేశ్ క్రికెట్ కోచ్ రేసులో ముందంజలో నిలవడానికి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిరెస్టన్ ప్రధాన కారణమన్నాడు. బంగ్లాదేశ్ జట్టును ముందుకు తీసుకువెళ్లడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాననన్నాడు. -
ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఎంపిక
-
నష్ట నివారణలో సీఏ.. కొత్త కోచ్ ఆయనే!
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం నుంచి ఆస్ట్రేలియా జట్టును బయటపడేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో జట్టుకు కొత్త కోచ్‌గా జస్టిన్ లాంగర్‌ను నియమించింది. ఈ 47 ఏళ్ల ఈ మాజీ ఆటగాడు నాలుగేళ్ల పాటు మూడు ఫార్మట్లలో ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నాలుగెళ్లలో ఆసీస్ ప్రధానంగా ప్రతిష్టాత్మకమైన రెండు యాషెస్ సిరీస్‌లు, 2019 ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లు ఆడనుంది. ఆసీస్ ప్రధానకోచ్‌గా తనను ఎంపిక చేయడం పట్ల జస్టిన్ లాంగర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు నుంచి అభిమానులు ఎంతో కొంత ఆశిస్తుంటారు. ఇక నుంచి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉంటారని, మైదానంలో మర్యాదగా ప్రవర్తిస్తారని అనుకుంటున్నా. ఆటలో ప్రత్యర్థులు ఒకరినొకరు గౌరవించుకోవటం మంచి సంప్రదాయం. నా దృష్టిలో ప్రపంచంలో గౌరవాన్ని మించింది ఏది లేదు. నిషేధం ముగిశాక ముగ్గురు ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావటాన్ని తాను స్వాగతిస్తాను’ అని లాంగర్ మీడియా సమావేశంలో తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడగా.. ఒత్తిళ్ల నేపథ్యంలో కోచ్ డారెన్ లెహ్మన్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆపై కొత్త కోచ్ కోసం పలువురి పేర్లను సీఏ ప్రతిపాదించగా.. రాజకీయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం సీఏకు తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదరహితుడిగా పేరున్న లాంగర్‌ను నియమించటమే మంచిదని సీఏ భావించింది. -
మాకు రవిశాస్త్రే కావాలి..
ముంబై: భారత జట్టు ఆటగాళ్లు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రినే గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లు క్రికెట్ దిగ్గజం సచిన్ ముందు ఉంచడంతో రంగంలోకి దిగిన మాస్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి దరఖాస్తు చేయించాడనే ప్రచారం జరుగుతోంది. రవిశాస్త్రి 2014 నుంచి 2016 భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలిందించాడు. ఈ సమయంలో రవిశాస్త్రితో ఆటగాళ్లకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతోనే వారు రవిశాస్త్రిని కోచ్ గా కోరుకుంటున్నట్లు సమాచారం. రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉన్నపుడు భారత జట్టు అద్భుతంగా రాణించింది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ నెగ్గింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది. రవిశాస్త్రి గత సంవత్సరం కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని సలహాదారుల కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో రవిశాస్త్రి గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్దం బాహాటంగానే నడిచింది. తొలుత చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానించిన బీసీసీఐ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ గడవును జులై 9 కి పొడగించింది. ముందు కోచ్ పదవికి సుముఖత చూపని రవిశాస్త్రి సచిన్ సూచనతో దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. బీసీసీఐ గడువు కూడా రవిశాస్త్రి కోసమే పెంచిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు దరఖాస్తు చేసుకున్నారు. జులై 10 న సలహాదారుల కమిటి ఇంటర్వ్యూలు చేయనుంది. ఆరోజే ఈ కోచ్ పదవి సందిగ్ద వీడనుంది. -
కోచ్ పదవికి మరో దరఖాస్తు..?
ముంబై: భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. తాజాగా వెస్టిండీస్ మాజీ కోచ్ పిల్ సిమన్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. విండీస్ టీ20 ప్రపంచకప్ విజయంలో సిమన్స్ కోచ్ గా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ మాజీ ఆటగాడు ఐర్లాండ్, జింబాంబ్వే జట్లకు కూడా కోచ్ గా వ్యవహరించాడు. ఇక కోచ్ గా సిమన్స్ కు మంచి రికార్డు ఉంది. ఐర్లాండ్ జట్టుకు సిమన్స్ కోచ్ గా ఎనిమిదేళ్లు సేవలందించాడు. 2011, 2015 వరల్డ్ కప్ లో ఐర్లాండ్ సంచలన విజయాల్లో సిమన్స్ పాత్ర కీలకం. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కోచ్ పదవి కోసం మరన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ జూలై 9 వరకు గడువును పొడిగించింది. ఇప్పటికే కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సెహ్వాగ్, దొడ్డా గణేశ్, లాల్ చంద్ రాజ్ పుత్ లు ఉండగా విదేశీ మాజీ ఆటగాళ్లలో రిచర్డ్ పైబస్, టామ్ మూడీ, తాజాగా పిల్ సిమన్స్ చేరాడు. అయితే వీరందరిని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహామండలి ఇంటర్వ్యూలు చేయనుంది. జులై 10న కొత్త కోచ్ ను ప్రకటిస్తామని రెండు రోజుల క్రితం గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. -
కోహ్లీ ఎఫెక్ట్; కోచ్ పదవికి రవిశాస్త్రి అప్లికేషన్
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించిన రవిశాస్త్రి.. అందరూ ఊహించినట్లే యూటర్న్ తీసుకున్నాడు. హెడ్‌కోచ్ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతం నెగ్గినట్లయింది. పదవీకాలం పొడగింపునకు సుముఖంగా లేని అనిల్ కుంబ్లే.. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రాజీనామా చేయడంతో హెడ్ కోచ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ పదవి కోసం మే నెలలో దరఖాస్తులు కోరగా.. వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, పైబ్స్, రాజ్‌పుత్ తదితర దిగ్గజాలు అప్లికేషన్లు పంపారు. కుంబ్లే పదవీకాలం చివరిరోజుల్లోనే.. మరికొంత కాలం ఆయనను కొనసాగించాలని బోర్డు భావించింది. కానీ అందుకు కెప్టెన్ కోహ్లీ సుముఖంగా లేకపోవడం, అదే సందర్భంలో జట్టులోని విబేధాలు బయటపడటంతో కుంబ్లే రాజీనామాచేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీసీసీఐ రెండోసారి కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించి.. జూలై 9 తుది గడువుగా నిర్ణయించింది. దీంతో రవిశాస్త్రి కోసమే అప్లికేషన్ల ప్రక్రియను పొడగించారనే విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీ కోరితే అన్నీ జరిగిపోతాయా? కెప్టెన్ కోహ్లీ కోరికమేరకు రవిశాస్త్రి హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసినా.. ఎంపిక కావడం అంతసులువేమీ కాదు. ఎందుకంటే, ఈ సారికూడా శాస్త్రిని ఇంటర్వ్యూ చేయబోది సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సలహా మండలే! గతంలో కోచ్‌పదవికి శాస్త్రిని రిజెక్ట్ చేసింది కూడా ఈ మండలే కావడం గమనార్హం. కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ల ప్రమేయంపై మాజీ సీఓఏ రామచంద్రగుహ తీవ్రఅసహనం వెలిబుచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఎంపిక ఎలా ఉండబోతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.