త్వరలోనే భారత హెడ్ కోచ్ ఎంపిక
న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం గత ఏడాది నవంబర్‌లో ముగిసింది.
అయితే అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న టి20 ప్రపంచకప్ కోసం ద్రవిడ్‌కు తాత్కాలిక పొడిగింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ఇదివరకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్వేషణ మొదలుపెట్టింది. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, స్రూ్కటినీ పూర్తయ్యాక చివరకు మిగిలిన ఇద్దరు గంభీర్, రామన్‌లలో గౌతీనే ఖాయం చేద్దామని బోర్డు సుముఖంగా ఉంది.
అయితే తుది ఇంటర్వ్యూ ముగించాకే సీఏసీ సిఫార్సు మేరకు నిర్ణయం వెలువరించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. మంగళవారం సీఏసీ హెడ్ అశోక్ మల్హోత్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో గంభీర్, రామన్‌లు తమ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు టీమిండియా కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా వెచి్చస్తాననేది, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment