Interview
-
న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు
న్యూఢిల్లీ: భారతదేశం ఏకైక రాజకీయ పార్టీ ఆధిపత్యం చెలాయించే దేశంగా మారిపోతోందన్న వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్( DY Chandrachud) తిరస్కరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు సైతం బలంగా ఉన్నాయని చెప్పారు. తాను సీజేఐగా పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని స్పష్టంచేశారు. ఇండియాలో న్యాయ వ్యవస్థ చట్టపరిధిలోనే పనిచేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నట్లు తాను భావించడం లేదన్నారు. తాజాగా బీబీసీ ‘హర్డ్టాక్’ఇంటర్వ్యూ(BBC Hard Talk interview)లో జర్నలిస్టు స్టీఫెన్ సకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. పలు అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆధిపత్యం కింద ఇండియా ఏక పార్టీ రాజ్యంగా మారుతోందన్న వాదనను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు. ఈ మేరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వెలువడిన సంపాదకీయాన్ని ఖండించారు.అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలతోపాటు రాష్ట్రస్థాయిలో రాజకీయాలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పడానికి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయని, దేశంలో ప్రాంతీయ ఆకాంక్షలు, గుర్తింపునకు ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని వివరించారు. సుప్రీంకోర్టు పట్ల ప్రజల విశ్వాసంసొంత పార్టీ నాయకులను రక్షించుకోవడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి న్యాయ వ్యవస్థపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించడం సరైంది కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అలాంటి ఒత్తిళ్లేవీ తనకు ఎదురు కాలేదన్నారు. పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారని, ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందని గుర్తుచేశారు.ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం కల్పించిందని అన్నారు. పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఇండియా కోర్టులు స్థిరంగా పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఎన్నో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడేందుకే కోర్టులు ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసిందని వివరించారు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయినప్పటికీ పౌరుల స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ముందు వరుసలో ఉంటోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు సుప్రీంకోర్టు పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని వెల్లడించారు.లింగ వివక్ష, వారసత్వ జాడ్యం లేదుభారత న్యాయ వ్యవస్థపై ఆగ్రవర్ణ హిందూ పురుషులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇక్కడ కూడా వారసత్వ జాడ్యం కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఖండించారు. న్యాయ వ్యవస్థలో లింగ వివక్ష భారీగా తగ్గిపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో కొత్తగా చేరుతున్న వారిలో 50 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 60 నుంచి 70 శాతం ఉందన్నారు. న్యాయ విద్య మహిళలకు చేరువవుతోందని తెలిపారు. లా స్కూళ్లలో మహిళల ప్రవేశాలు పెరుగుతున్నాయని, వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని చెప్పారు.న్యాయవాదులు, న్యాయమూర్తులు వారసత్వంగా కోర్టుల్లో చేరుతున్నట్లు తాను అనుకోవడం లేదన్నారు. తన తండ్రి వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తుచేశారు. సీజేఐగా ఉన్నంత కాలం కోర్టులో అడుగుపెట్టొద్దంటూ తన తండ్రి తనకు చెప్పారన్నారు. దీంతో హార్వర్డ్ లా స్కూల్లో మూడేళ్లు చదివానని, తన తండ్రి రిటైర్ అయిన తర్వాతే మొదటిసారి కోర్టులో అడుగుపెట్టానని వెల్లడించారు.ఇండియాలో చాలామంది లాయర్లు, జడ్జిలకు ఎలాంటి న్యాయ నేపథ్యం లేదన్నారు. అయోధ్య రామమందిరం, ఆర్టీకల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి కీలక అంశాలపై నిబంధనల ప్రకారమే తీర్పులు ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజకీయ వాస్తవికతల మధ్య చక్కటి సమతుల్యత పాటిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అది మర్యాదపూర్వక కలయిక గత ఏడాది వినాయక చవితి సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైన సంగతి తెలిసిందే. సీజేఐ ఇంటికి ప్రధానమంత్రి రావడం అత్యంత అరుదు. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. సీజేఐని ప్రభావితం చేసేందుకు మోదీ ప్రయత్నిచారని మండిపడ్డాయి. ఈ అంశంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు.ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగానే తన నివాసానికి వచ్చారని చెప్పారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోని వ్యక్తుల మధ్య ఉండే కనీస మర్యాదలను అర్థం చేసుకొనేటంత పరిపక్వత మన వ్యవస్థకు ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మర్యాదపూర్వకమైన కలయికల ప్రభావం కేసుల విచారణపై ఎంతమాత్రం ఉండదన్నారు.ప్రధాని మోదీ తన నివాసానికి రాక ముందు, వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించిందని, ఇందులో ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిన తీర్పులు సైతం ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ పాత్ర పార్లమెంట్లో ప్రతిపక్షం పోషించే పాత్రలాంటిది కాదని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. కేసులను విచారించడం, చట్టబద్ధమైన పాలన కొనసాగేలా చూడడం మాత్రమే న్యాయ వ్యవస్థ బాధ్యత అని తేల్చిచెప్పారు. -
ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: భారత దేశానికి మహిళా ప్రపంచ క్రికెట్ కప్ సాధించడమే తన లక్ష్యమని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష పేర్కొన్నారు. నగరంలోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించిన సన్మాన సభలో ఆమె మాట్లాడారు. ‘అండర్ –19 టీ–20 ప్రపంచ కప్ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. క్రికెట్లో మిథాలిరాజ్ స్ఫూర్తి. ప్రతి మ్యాచ్ ఆడే ముందు ఒక్కటే ఆలోచన ఉంటుంది. బాగా ఆడాలి. టీం గెలవాలన్న లక్ష్యంతో గ్రౌండ్లోకి వెళతా. ఓవర్ కవర్ షాట్ నా ఫేవరెట్. నిద్రలో లేపి ఆడమన్నా ఆడతాను. ఆటలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు. నిత్యం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆరు, ఏడేళ్ల నుంచి ఫిట్నెస్, బ్యాటింగ్, ఆహారపు అలవాట్లలో కోచ్ సూచలను పాటిస్తున్నా. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను’ అన్నారు. లక్ష్యంతో పనిచేస్తేనే.. కేవలం డబ్బు సాయంతో విజయం సాధ్యం కాదు, కష్టపడి, నిర్థేశిత లక్ష్యంతో పనిచేస్తేనే జీవితంలో రాణించగలమని ఏఆర్కే ఫౌండర్ ఛైర్మన్ రామ్‌రెడ్డి అన్నారు. 2028లో లోకేష్ , వెన్నెల మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్రిష తండ్రి, హాకీ ప్లేయర్, ట్రైనర్ రామ్‌రెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఐటీసీలో ఉద్యోగం చేస్తూ త్రిషకు క్రికెట్లో శిక్షణ ఇప్పించాను. మెరుగైన కోచింగ్ కోసం 17 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశాం. చాలా కష్టనష్టాలను చూశానన్నారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ చిన్నతనంలో కరణం మల్లీశ్వరిని ప్రభుత్వం ఘనంగా సత్కరించినపుడు పోడియం ముందున్న నేను అలా సత్కారం పొందాలని అనుకున్నానని తెలిపారు. ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టడంతో ఎంతో మంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయడం, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తే విజయం సాధించడం తధ్యమని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్ ఆడని రోజు లేదని టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ జనార్థన్‌రెడ్డి అన్నారు. త్రిష నిత్యం తన ఆటను మెరుగుపరుచుకుని, వృద్ధిచెందాలని మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జాన్ మనోజ్, మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎంఎస్కే ప్రసాద్, మాజీ ఐఏఎస్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. -
నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను: నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా
‘‘స్క్రిప్ట్ చదివి, ఓ మంచి సినిమా తీయడం నిర్మాత బాధ్యత అని భావిస్తాను. అందుకే ప్రతి స్క్రిప్ట్‌ను నేనే చదివి నిర్ణయం తీసుకుంటాను. సినిమా ట్రైలర్, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ నా ట్రంప్కార్డ్స్. పరిమిత బడ్జెట్‌తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని నమ్ముతాను’’ అని అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka). ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham) లీడ్ రోల్స్‌లో నటించగా, మరో కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ– ‘‘తాత–మనవళ్ల కథ ఇది. తాను చేసిన తప్పులను తాత ఎలా రియలైజ్ అయ్యాడు? మనవడు తాను చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మూవీ ఉంటుంది. బ్రహ్మానందంగారు కథ ఓకే చేయకపోతే ఈ సినిమాయే లేదు.ఇందులో మూర్తి పాత్రలో బ్రహ్మానందంగారు, బ్రహ్మా పాత్రలో రాజా గౌతమ్, గిరి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. ముందుగా బ్రహ్మా పాత్రకు ‘వెన్నెల’ కిశోర్గారిని అడగ్గా, ఆయన హీరో ఫ్రెండ్ గిరి పాత్ర చేస్తానన్నారు. దీంతో రాజా గౌతమ్ పేరు ప్రస్తావనకు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఈప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం.. ఇక సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను పరిచయం చేయబోతున్న నాలుగో దర్శకుడు నిఖిల్. మా నెక్ట్స్‌ప్రాజెక్ట్ ‘వైబ్’. ఇందులో రాజా గౌతమ్ హీరోగా చేస్తున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద’ చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా సమయం ఉంది ’’ అని అన్నారు. -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్‌ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్‌ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్‌గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్‌కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను.. కొడతాను (ఫొటోలు)
-
నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చినట్లు ఉంటా!
సానియా అయ్యప్పన్.. నర్తకిగా అడుగుపెట్టి నటిగా స్థిరపడింది. తన అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. అవార్డులనూ అందుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..⇒చిన్న వయసులోనే బుల్లితెరపై మెరిసింది.. సూపర్ డాన్సర్ అనే రియాలిటీ షో విన్నర్‌గా! తర్వాత ఢీ2, ఢీ4 షోల్లోనూ పాల్గొని పాపులారిటీతోపాటు సినీ అవకాశాన్నీ అందుకుంది.⇒సానియా అయ్యప్పన్ సొంతూరు కేరళలోని కోచ్చి. నలంద పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.⇒‘బాల్యకాలసఖి’ మలయాళ చిత్రంతో బాలనటిగా ఎంటరై, ‘క్వీన్’తో హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఆమెకు బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ‘ఫిల్మ్‌ఫేర్’, ‘వనిత ఫిల్మ్ అవార్డ్స్’ ను తెచ్చిపెట్టింది. తర్వాత మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’లో నటించి, ఉత్తమ సహాయ నటిగా ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్’ను గెలుచుకుంది. అటుపై వచ్చిన ‘ద ప్రీస్ట్’, ‘ప్రేతమ్ 2’, ‘సెల్యూట్’, ‘సాటర్డే నైట్’ వంటి పలు సినిమాల్లో మాత్రం అతిథి పాత్రకే పరిమితమైంది.స్క్రిప్ట్‌ను నమ్మి చేసిన ‘కృష్ణన్‌కుట్టి పని తుడంగి’ హారర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ‘ఇరుగప్పట్రు’, ‘సొర్గవాసల్’లు కూడా ఫీల్‌గుడ్ మూవీస్‌గా మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఈ రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.⇒ చేతినిండా అవకాశాల కంటే గుర్తుండిపోయే పాత్రలతోనే మెప్పించాలని కొంత గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్‌లో వెబ్ దునియాలోకి అడుగుపెట్టి, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, ‘బిలవ్డ్’ ‘స్ట్రింగ్స్’ అనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.⇒ నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోను. అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోను. కొడతాను కూడా. నా జీవితం నా ఇష్టం.. నాకు నచ్చిన ట్లు ఉంటా!– సానియా అయ్యప్పన్ -
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్స్.. సందడే సందడి
-
70 గంటల పని: ప్రముఖ సీఈఓ ఏమన్నారంటే?
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమితా థాపర్ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.ఈ విషయం మీద షాదీ.కామ్ వ్యవస్థాపకుడు 'అనుపమ్ మిట్టల్' మీద స్పందిస్తూ.. నారాయణ మూర్తి మాటలతో ఏకీభవించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. తప్పకుండా కస్టపడి పనిచేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటల చొప్పున పని చేశానని పేర్కొన్నారు. మనిషి ఎదగాలంటే.. పనిగంటలతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. -
'సలార్' రిజల్ట్‌తో నేను హ్యాపీగా లేను: ప్రశాంత్ నీల్
ప్రభాస్ 'సలార్' సినిమా రిలీజై అప్పుడే ఏడాది పూర్తయిపోయింది. గతేడాది సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 22) థియేటర్లన్నీ సందడిగా మారిపోయింది. ఇప్పుడు అభిమానులు.. 'సలార్' గుర్తుల్ని నెమరవేసుకుంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బోలెడన్ని సంగతులు చెప్పాడు.'సలార్ ఫలితంతో నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. అయితే 'సలార్ 2' సినిమాని మాత్రం నా కెరీర్లో బెస్ట్ మూవీగా తీస్తాను. ప్రేక్షకులు ఊహలకు మించిపోయేలా ఆ మూవీ తీస్తాను. జీవితంలో కొన్ని విషయాలపై కాన్ఫిడెంట్‌గా ఉంటాను. 'సలార్ 2' అందులో ఒకటి' అని ప్రశాంత్ నీల్ చెప్పాడు.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' చూసేసిన సుకుమార్.. ఫస్ట్ రివ్యూ)ప్రశాంత్ నీల్ చెప్పింది కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది 'సలార్' మూవీ చూసిన చాలామంది 'కేజీఎఫ్'తో పోలికలు పెట్టారు. కానీ తర్వాత ఓటీటీలో మాత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఫైట్‌ని అయితే డార్లింగ్ ఫ్యాన్స్ రోజుకోకసారైనా చూడందే నిద్రపోరు.'సలార్ 2' విషయానికొస్తే కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుంది. లెక్క ప్రకారం 2026 సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు గానీ ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ. అంటే 2026 వేసవి తర్వాత 'సలార్ 2' షూటింగ్ మొదలవ్వొచ్చు. ఎలా లేదన్నా 2027-28లోనే ఇది వచ్చే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)I'm not completely happy with #Salaar’s performance in theatres, says Prashanth Neel pic.twitter.com/WXIBkdgMh5— Aakashavaani (@TheAakashavaani) December 22, 2024 -
నిఖిల్ గెలుపు పై గౌతమ్ షాకింగ్ కామెంట్స్..
-
ఎవరిని ఎలా పిలవాలి?
టేబుల్‌కు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానమే అన్న అంచనాతో (భ్రమతో?) ఇంటర్వ్యూ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే, ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని అనుకున్నప్పుడే, అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకు సందేహించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంపీలు, మంత్రులు, అధికారులను... మిస్టర్, మిసెస్, మిస్ అనో... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అనో సంబోధించడం ఉచితంగా ఉంటుంది. అదే సెలబ్రిటీలను చేసే ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారిపోతాయి. వాళ్లను ‘మిస్టర్’ అంటే దూరం జరిగినట్టు అవుతుంది. అప్పుడు పేరు పెట్టి పిలవడం ఉత్తమం.ఆ మధ్య నాకు ఒక లేఖ అందింది.అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటుంది. సమాధానం ఇలా బహిరంగంగానే ఇస్తే మేలు అనిపించింది. ‘‘ఇంటర్వ్యూ చేసే వారిని మీరు రకరకాలుగా సంబోధించడాన్ని గమనించాను’’ అంటూ మొదలైంది ఈ లేఖ. ‘‘కొంతమందిని మిస్టర్ ఎక్స్ అంటారు.. ఇంకొంతమందిని ‘మినిస్టర్’ అంటూ వారి పదవితో సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల పేరుతో పిలిచారు. కానీ ఎప్పుడూ ‘సర్’ అని పిలవడం మాత్రం చూడలేదు. ఎందుకలా? అసలు ఎవరిని ఎలా పిలవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు?’’సర్ అంటే వేరే!ఈ ప్రశ్నలు చూసిన వెంటనే నా ఆలోచనలు రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లాయి. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి ఓ ప్రము ఖుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తర్వాత బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి అయిన డేవిడ్ వాడింగ్టన్ ఇంటర్వ్యూ అది. 1983లో మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో ఇమ్మిగ్రేషన్ శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత ‘బీబీసీ’ ఛైర్మన్ సమీర్ షా అప్పట్లో నా బాస్. బీబీసీ కార్యక్రమం ‘ఐ విట్నెస్’ ప్రొడ్యూసర్ ఆయన.ఇంటర్వ్యూ కోసం స్టూడియోలోకి వెళుతూండగా సమీర్ మాట్లా డుతూ, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో కరణ్’’ అన్నారు. ‘‘ఆయన్ని మిస్టర్ వాడింగ్టన్ అనైనా పిలువు. లేదా మినిస్టర్ అను. సర్ అని మాత్రం పిలవొద్దు’’ అని సలహా ఇచ్చారు. బ్రిటిష్ ఇంగ్లీషులో ‘సర్’కు ఉన్న అర్థం వేరు కావడమే దీనికి కారణం. దానివల్ల ఇంటర్వ్యూలో వాడింగ్టన్ హోదాను ఇంటర్వ్యూ చేసేవాడికన్నా ఎక్కువ అనుకునేలా చేస్తుంది. ఇంటర్వ్యూ చేసేవాడు, ఇచ్చే మనిషి ఇద్దరూ సమానమే అన్న అంచనాతో(లేదా భ్రమ?) ఈ ఏర్పాటు అన్నమాట. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని తెలిస్తే అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకూ సందేహించాల్సిన అవసరం ఉండదు.వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల అంశంపై సాగింది. ఆనాటి నిబంధలు ఆసియా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా ఉండేవి. హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూ కూడా అదే స్థాయిలో ఉండటం సహజం. వాడింగ్టన్ సమాధానాలు నాకు సంతృప్తి కలిగించే అవకాశమే లేదు. అందుకే సమీర్ నన్ను పరోక్షంగా హెచ్చ రిస్తూ ఆ మాటలు అన్నారు. ఆయన్ని నేను సంబోధించే విధానం నా స్థితిని బలహీనం చేయకూడదన్నది సమీర్ ఉద్దేశం. కాబట్టి... సర్ అన్న సంబోధన లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సమీర్ మాటలే పరమ ధర్మంలా మిగిలాయి. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా... ఎంపీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రముఖులు ఎవరైనా సరే... మిస్టర్, మిసెస్, మిస్ అని కానీ... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అని కానీ సంబోధించడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాను. ఇలా ఎందుకో చెబుతాను.‘‘సర్... మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు’’ అని ప్రతిసారీ చెప్ప లేం. ‘సర్’ అని సంబోధిస్తూంటే... ఇలా చెప్పే అవకాశం గట్టిగా చెప్పలేకపోవచ్చు. అదే ‘మినిస్టర్’ అని సంబోధిస్తున్నాం అనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘‘సారీ, మీరు తప్పు చెబుతున్నారు’’ అనేయవచ్చు. ‘సర్’ అంటే ఒకపక్క ఉన్నత స్థానం కల్పిస్తూ... ఇంకో పక్క తప్పు అంటున్నాం. పరస్పర విరుద్ధం ఇవి. ‘మినిస్టర్’అంటున్నప్పుడు మీరు చెబుతున్నది తప్పు అనేందుకు పెద్దగా ఇబ్బంది పడనక్కరలేదు. సన్నిహిత సంభాషణల్లో... పేరుతో!అయితే... ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారి పోతాయి. అవతలి వ్యక్తి గ్లామర్, సెలిబ్రిటీ స్థాయిని బట్టి కదా ఇంటర్వ్యూకు ఎంచుకున్నాను. అది వర్తమాన అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. విధాన నిర్ణయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేది కాదు. వారి జీవిత ఘట్టాలు, జ్ఞాపకాలకు సంబంధించినది కాబట్టి, వారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే షో కాబట్టి... ‘మిస్టర్’, ‘మిస్’ అంటే వారికి దూరం జరిగినట్టు అవుతుంది. ఇది చర్చను ముందుకు పోనీయదు. అలాంటి సందర్భాల్లో వారిని పేరుతో పిలుస్తూంటాను. అందుకే జావేద్(అఖ్తర్), షారుఖ్(ఖాన్ ), మాధురీ (దీక్షిత్), షర్మిలా (ఠాగూర్), విక్రమ్(సేథ్), సచిన్ (టెండూల్కర్) అన్న పేర్లతో సంబోధన ఉంటుంది.ఒక్కోసారి పరిస్థితి వికటించే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్లలో కొంతమంది నాకు బాగా పరిచయమైన రాజకీయ నేతలు కూడా ఉంటూంటారు. ఉదాహరణగా చెబు తున్నా... అలాంటి వారిని ‘మిస్టర్ థరూర్’ అని సంబోధించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన శశిగానే తెలిసినప్పుడు ‘మిస్టర్ థరూర్’ అని పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలైనంత వరకూ పేరు పెట్టి పిలవకుండా, ఇంటిపేరుతో కలిపి పిలవడం ద్వారా బ్యాలెన్ ్స చేస్తూంటాను. ఇది ఫార్మల్‌గానూ ఉంటుంది, అలాగే వ్యక్తిగత సాన్ని హిత్యాన్ని సూచించేందుకూ ఇబ్బందిగా ఉండదు.నేను చేయని పనల్లా ఒక్కటే! మంత్రిని పేరు పెట్టి పిలవను. వాళ్లు నాకు తెలిసినప్పటికీ పీయూశ్, కపిల్ అంటూ పేర్లతో పిలవను. ఫార్మల్ ఇంటర్వ్యూలో ఇలా పిలవడం అంత మంచిది కాదు. వీక్షకులు వెంటనే సాన్నిహిత్యాన్ని పసిగట్టేస్తారు. నాకు వచ్చిన ప్రశ్నకు సమాధానం దక్కిందనే అనుకుంటున్నాను. ఇదెంత అర్థవంతంగా ఉందో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత -
అందుకే అంతగా ఏడ్చాను!
సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఖాయమైన తర్వాత దొమ్మరాజు గుకేశ్ ఎంతో భావోద్వేగానికి లోనైన వీడియోను అభిమానులంతా చూశారు. విజయానంతరం అతను కన్నీళ్లపర్యంతమయ్యాడు. దీనిపై ‘ఫిడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుకేశ్ మాట్లాడాడు. అందుకు కారణాన్ని వివరించాడు. ‘నేను ఈ పోరులో మొదటినుంచి ఆధిక్యం కనబర్చలేదు. కొన్ని గేమ్‌లలో విజయానికి దగ్గరగా వచ్చి కూడా ఆ అవకాశం ఉపయోగించుకోలేకపోయాను. అంతా సాఫీగా, ఏకపక్షంగా పోరు జరిగి నా గెలుపు కాస్త ముందే ఖాయమై ఉంటే నేనూ మామూలుగానే కనిపించేవాడినేమో. కానీ చివర్లో గెలిచిన తీరుతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అప్పటి వరకు గేమ్ డ్రా అవుతుందని, టైబ్రేక్‌కు వెళితే ఎలా సిద్ధం కావాలనే విషయం గురించి కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. కానీ అద్భుతం జరిగి గెలిచేశాను. పైగా ఎనిమిదేళ్ల వయసులో చెస్ నేర్చుకున్న రోజులు కూడా ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. అందుకే ఆ కన్నీళ్లు’ అంటూ గుకేశ్ వివరించాడు. తాను ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా...ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే ప్రతీ సవాల్‌కు తాను సిద్ధమేనని గుకేశ్ వ్యాఖ్యానించాడు. పైగా చదరంగంలాంటి ఆటలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్గా ఉండరని అతను అన్నాడు. ‘ఇప్పటి వరకు చెస్‌ను శాసించిన గొప్ప గొప్ప ఆటగాళ్లకు కూడా పరాజయాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఆటలో నేర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. నా వయసు కూడా అందుకు సహకరిస్తుంది. ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని గుకేశ్ చెప్పాడు. చాంపియన్‌షిప్ సమయంలో తనకు సరిగ్గా ఇంటి భోజనం తరహాలో దక్షిణాది వంటకాలు అందించిన చెఫ్‌కు అతను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
వాహ్.. వ్యాక్స్ మినియేచర్
ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్‌ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ట్‌లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్ చేస్తూ సెలిబ్రిటీస్ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి.. తన ఆర్ట్ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్బీలో ఉంటాను. స్కూలింగ్ సమయంలో పెయింటింగ్‌లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్‌ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టాను. సోషల్‌మీడియాతోనే గుర్తింపు.. నేను చేసిన డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్ వచ్చేవి.. నా ఆర్ట్స్‌కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్స్‌ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో నా ఆర్ట్‌కి సోషల్‌మీడియా చాలా హైప్ వచి్చంది. చిత్ర అఫీషియల్ టీం ఆ పెయింటింగ్‌ని తమ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్లో కొత్త కాన్సెప్ట్స్‌ని చేయడం మొదలుపెట్టాను.డిజిటల్ ఆర్ట్స్.. సోషల్ మీడియా, డిజిటలైజేషన్ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్ ఆర్ట్స్‌నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్‌ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్‌కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్ బొమ్మల్లా కార్టూన్ ఫార్మాట్లో ఫినిషింగ్‌తో డిజిటల్ వ్యాక్స్ పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను. -
అమ్మా.. నేనూ నీతో వచ్చేస్తా...
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక, వాళ్ల చిన్ననాటి సంగతులు తలచుకుని తల్లిదండ్రులు మురిసిపోతుండటం మామూలే. అయితే వారి హృదయాన్ని మెలిపెట్టి పశ్చాత్తానికి లోను చేసే జ్ఞాపకాలూ కొన్ని ఉంటాయి. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రాను ఇప్పటికీ బాధిస్తూ, కన్నీళ్లు పెట్టించే అలాంటి ఒక జ్ఞాపకం.. కూతురి చదువు విషయంలో తానెంతో కటువుగా ప్రవర్తించటం! ప్రియాంకను ఏడేళ్ల వయసులో బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు మధు చోప్రా‘‘నేను మంచి తల్లిని కాదేమో నాకు తెలీదు. ‘వద్దమ్మా.. ప్లీజ్..’ అని ఎంత వేడుకుంటున్నా వినకుండా నేను ప్రియాంకను బలవంతంగా బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. ప్రతి శనివారం సాయంత్రం నా డ్యూటీ అయిపోయాక ట్రెయిన్ ఎక్కి ప్రియాంకను చూడ్డానికి బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లే దాన్ని. ప్రియాంక అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. తను ఆ వాతావరణంలో ఇమడలేక పోయింది. ‘‘అమ్మా.. నేనూ నీతో ఇంటికి వచ్చేస్తా..’’ అని నన్ను చుట్టుకుపోయి ఏడ్చేది. ఆ ఏడుపు ఇప్పుడు గుర్తొస్తే నాకూ కన్నీళ్లొచ్చేస్తాయి. ‘లేదు, నువ్విక్కడ చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది’ అని చెప్పేదాన్ని. తనకేమీ అర్థమయ్యేది కాదు. తన కోసం నేను ఆదివారం కూడా అక్కడే ఉండిపోయేదాన్ని. అది చూసి ప్రియాంక టీచర్ ఒకరోజు నాతో ‘మీరిక ఇక్కడికి రావటం ఆపేయండి’ అని గట్టిగా చెప్పేశారు..‘ అని ‘సమ్‌థింగ్ బిగ్గర్ టాక్ షో’ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు మధు చోప్రా.ప్రియాంక తండ్రి అశోక్ చోప్రాకు ప్రియాంకను బోర్డింగ్ స్కూల్లో చేర్పించటం అస్సలు ఇష్టం లేదు. అయితే మధు చోప్రా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో వారిద్దరి మధ్య గొడవలయ్యాయి. కొంతకాలం ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు కూడా. (ఇప్పుడు ఆయన లేరు). ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ – ‘‘ప్రియాంక తెలివైన అమ్మాయి. ఆ తెలివికి పదును పెట్టించకపోతే తల్లిగా నా బాధ్యతను సరిగా నెరవేర్చినట్లు కాదు అనిపించింది. అందుకే లక్నోలోని లా మార్టినియర్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలనుకున్నాను. అందులో సీటు కోసం ప్రియాంక చేత ఎంట్రెన్స్ టెస్టు కూడా రాయించాను. తను చక్కగా రాసింది. అడ్మిషన్ వచ్చేసింది. ఆ విషయాన్ని నా భర్తకు చెబితే ఆయన నాపై ఇంతెత్తున లేచారు. ‘ఇదే నీ నిర్ణయం అయితే, వచ్చే ఫలితానికి కూడా నువ్వే బాధ్యురాలివి’ అని అన్నారు. ఏమైతేనేం చివరికి అంతా బాగానే జరిగింది. ప్రియాంక తన కాళ్లపై తను నిలబడింది’’ అని ΄ాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చె΄్పారు మధు చోప్రా.పిల్లల భవిష్యత్తు కోసం తల్లితండ్రులు వారిని దూరంగా ఉంచవలసి వచ్చినందుకు బాధపడటం సహజమే. అయితే పిల్లల్ని ప్రయోజకుల్ని చేసే యజ్ఞంలో ఆ బాధ ఒక ఆవగింజంత మాత్రమే. -
నాన్న ఇంటికి రావొద్దన్నారు.. చచ్చిపోదామనుకున్నా: రాజేంద్ర ప్రసాద్
రాజేంద్రప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేముంది. అప్పట్లో హీరోగా చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సహాయ పాత్రలు చేస్తూ నటికిరిటీ అనిపించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టారు. తండ్రి మాటల వల్ల ఓ దశలో చనిపోదామనుకున్న సందర్భంగా గురించి చెప్పారు.'మా నాన్న స్కూల్ టీచర్. చాలా కఠినంగా ఉండేవారు. ఇంజినీరింగ్ చేసిన తర్వాత నేను సినిమాల్లోకి వెళ్తానని ఆయనతో చెప్పా. నీ ఇష్టానికి వెళ్తున్నావ్, అక్కడ సక్సెస్ రావొచ్చు, ఫెయిల్యూర్ రావొచ్చు. అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే మాత్రం ఇంటికి రావొద్దని అన్నారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరా, గోల్డ్ మెడల్ కూడా సాధించా. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇంటికెళ్లా.. ఎందుకొచ్చావ్? రావొద్దనన్నానుగా అని నాన్న కోప్పడ్డారు'(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)'నాన్న తిట్టేసరికి చాలా బాధ అనిపించింది. దీంతో చచ్చిపోదానుకున్నా. చివరిసారిగా నా ఆత్మీయులందరిని చూడాలనిపించింది. వాళ్లని కలిసి మాట్లాడాను. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ 'మేలుకొలుపు' సినిమా విషయంలో ఏదో గొడవ జరుగుతుంది. అంతలో ఆయన రూమ్ నుంచి బయటకొచ్చి నన్ను చూసి.. సరాసరి డబ్బింగ్ రూంకి తీసుకెళ్లిపోయారు. ఓ సీన్‌కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది నచ్చడంతో.. సమయానికి భలే దొరికావ్ అని అన్నారు''మరో సీన్‌కి డబ్బింగ్ చెప్పమని అడగ్గానే.. తిని మూడు నెలలైంది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానన్నా. ఛాన్సులు రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా విషయాన్ని ఆయనకు చెప్పా. దీంతో చాలా కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. అలా మొదలైన నా డబ్బింగ్ ప్రయాణం.. తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. మద్రాసులో ఇల్లు కట్టాను. అక్కడే దర్శకుడు వంశీ పరిచయమయ్యాడు. అతడి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను' అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం! అదే సమయంలో అతిథి తనకిష్టమొచ్చింది మాట్లాడేందుకు ఇంటర్వ్యూ చేయరన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీవీ సంభాషణలకైతే ఒక సమయ పరిమితి ఉంటుంది. ఆ సమయంలోనే కావాల్సింది రాబట్టుకోవాలి. అతిథి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నా, విషయాన్ని సాగదీస్తున్నా వారి మాటలను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్డు తగలడం సరైన సమయంలో జరగాలి. అడ్డుకోవడం అవసరమేనన్న భావన వీక్షకులకూ కల్పించాలి.ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను అవతలి వాళ్ల మాటలకు తరచూ అడ్డుపడుతూంటా ననీ, ఇది చాలామంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందనీ చాలామంది నాతో చెబుతుంటారు. నువ్వు తలదూర్చే ముందు నీ అతిథి ఏం చెబు తున్నాడో వినాలని అనుకుంటున్నామన్న వాళ్లూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న. అడ్డుకోవడాన్ని ఎప్పుడు తప్పించవచ్చు? అతిథిని అస్సలు అడ్డుకోరాదా? అతడు మాట్లాడటం ఆపేంతవరకూ ఓపికగా ఎదురు చూడాలా? దీనికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదా?వాస్తవానికి ఇదంతా అవతలి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు బదు లుగా ఏం చెబుతున్నాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే... అతిథి తనకిష్టమొచ్చింది చెప్పేందుకు కాదు ఇంటర్వ్యూ అన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు, జవాబుల ఆధారమైన చర్చ ఇంటర్వ్యూ అంటే! అడిగే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఉండాలి. కాబట్టి... అడిగిన ప్రశ్నతో సంబంధం లేని సమాధానం వచ్చి నప్పుడు అడ్డుకోవడం అన్నది అత్యవసరం. తప్పించలేనిది కూడా! తనేం చెబుతున్నాడో తనకే తెలియని స్థితిలో అతిథి ఉన్నా... లేదా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చెబుతున్నా, కాలయాపన చేస్తున్నా అడ్డుకోవాల్సిందే. ఈ ఇంటర్వ్యూలన్నీ నిర్దిష్ట సమయం లోపల జరగాల్సినవి. కాబట్టి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూంటారు. లేదా మరిన్ని ప్రశ్నలను నివారించేందుకూ ప్రశ్నతో సంబంధం లేని సమాధానాలు చెబుతూంటారు.అలాగే అడ్డుతగలడం అనేది స్పష్టత కోసం గందరగోళాన్ని తొలగించేందుకూ అవసరమే. అంతగా తెలియని సంక్షిప్తనామాలు ఉపయోగిస్తూంటే... మనం అడ్డుకుని వాటి అర్థమేమిటో వివరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా... అతిథి చెప్పాలనుకున్న విషయం మాటల్లో తప్పిపోతే అతడిని మళ్లీ చర్చిస్తున్న అంశానికి తీసుకురావడం కోసం కూడా అడ్డుకోవడం అవసరమవుతుంది. చెప్పే విషయం ఏమిటన్న దానిపై అతిథికి స్పష్టత ఉండవచ్చు కానీ... వీక్షకులకు స్పష్టత లేదని అనిపిస్తే అడ్డుకుని వివరణ తీసు కోవాల్సిందే. విషయం అర్థమైనప్పుడు వీక్షకులకు ఈ అడ్డుకోవడం అన్నది చికాకుగానే ఉంటుంది కానీ అర్థం కాని వాళ్లు కూడా ఉంటా రన్నది మనం గుర్తుంచుకోవాలి. వివరణ తీసుకునేందుకు, స్పష్టత కోసం సమయానుకులంగా అడ్డు తగలాల్సిందే! అయితే, అతిథి వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు అనుకోండి... అప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరముంటుంది. వీక్షకులకు అందే సమాచారం కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత ఇంటర్వ్యూ చేసే వ్యక్తిది. లేదంటే, మర్యాదగానైనా లేదా నిశ్చయంతోనైనా అతిథిని అడ్డుకోవాలి. అతిథి దురుసుగా లేదా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అడ్డుకోవడం అవసరం. ఒక్కో సారి, విచక్షణ మీద ఉద్వేగానిది పైచేయి అయినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అడ్డుకోవాల్సి ఉంటుంది.చివరగా... వాగ్వాదం జోరుగా సాగుతున్నప్పుడూ అడ్డుకోవడం జరుగుతూంటుంది. వివాదాస్పదమైన, శక్తిమంతమైన వాదన జరుగు తున్నప్పుడు ఒకరిపై ఒకరు కేకలు పెట్టుకోవడం సహజం. ఇది సాధారణంగా జరుగుతూంటుంది. అయితే ఇలాంటి స్థితిలో ఏదో అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోరాదు. ఉద్వేగపూరిత వాతావరణంలోనే చర్చలు జరుగు తాయన్నది తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిపై అతిథి సవాళ్లు గట్రా విసురుతూంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిగ్రహంతో ఉండాల్సింది కూడా ఇక్కడే! ఇంటర్వ్యూలు చేసే వారికి ప్రధానంగా మూడు హెచ్చరికలు చేయాలి. మొదటిది–అడ్డుకోవడం దూకు డుగా ఉండకూడదు. సంయమనం కోల్పోరాదు. మన్నించమంటూ అడ్డుకోవడం మేలైన పద్ధతి. మన్నించమనడం వేడిని కొంతవరకూ చల్లారుస్తుంది. రెండోది–అడ్డుకోవడం అన్నది విజయవంతంగా పూర్తి చేయాలి. సగం సగం ప్రయత్నాలు చేయరాదు. మరీ తరచుగా అడ్డుకోకపోవడం మంచి పద్ధతి. అడ్డుకోలేక పోతే దానికి సార్థకతే ఉండదు. పదే పదే అడ్డుకుంటూవుంటే, చికాకు కలగడం సహజం.చివరగా... అతి ముఖ్యమైన అంశం... అడ్డుకోవడం అన్నది సరైన సమయంలో జరగాలి. సమర్థుడైన ప్రెజెంటర్ వీక్షకుల కంటే చాలా ముందుగానే ఎప్పుడు అడ్డుకోవాలో నిర్ణయించుకోగలడు. అయితే అనుకున్న వెంటనే అడ్డుకున్నాడనుకోండి, అది కొంచెం తొందరపాటు అవుతుంది. వీక్షకులు హర్షించరు. చూసేవాళ్లు కూడా అతిథి మాటలింకా కొనసాగితే బాగోదు అనుకునేంత వరకూ వేచి చూసి అప్పుడు అడ్డుకోవాలి. వాస్తవానికి అడ్డు తగలడానికి ఇదే కీలకం. అడ్డుకోవడం అవస రమైందన్న ఫీలింగ్ వీక్షకులకూ కల్పించాలి. ఎందుకంటే... వాళ్లకు ఇంటర్వ్యూ అనేది ఒక ‘ప్రదర్శన’ లాంటిది. అతిథికీ, ఇంటర్వ్యూ చేసేవాళ్లకూ ఇద్దరికీ వీక్షకుల మెప్పు కావాలి. అదే జరగకపోతే ఇంటర్వ్యూకు అర్థమే లేదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్ వైరల్
ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్‌గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్ తన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు. పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో అవాక్కయ్యానంటూ చెప్పుకొచ్చింది జాన్హవి. తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు లక్ష 20వేల వ్యూస్, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక మహిళ వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్‌లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో వినియోగదారు మద్దతివ్వడం గమనార్హం.This HR of an Indian company asked me how old I am and when I said 25, they asked me if I am looking to marry soon??? Is this still happening??— Janhavi Jain (@janwhyy) November 19, 2024 -
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
ప్రశాంత్ నీల్ ముందే సినిమా చూసి బ్లాక్ బస్టర్ అన్నాడు
-
ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలామంది 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ఓ మహిళ ఈ ఏఐ వల్లనే ఉద్యోగం కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఉద్యోగం ఎలా పోయిందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ప్రస్తుతం చాలా దేశాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలను నిర్వహించడానికి ఏఐ డిటెక్టర్లను వాడుతున్నారు. ఈ ఏఐ డిటెక్టర్ల కారణంగానే జాబ్ ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురయ్యానని పాకిస్థానీ మహిళ 'దామిషా ఇర్ఫాన్' లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించింది. నేను సొంతంగా కంటెంట్ క్రియేట్ చేసినప్పటికీ.. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించినట్లుగా ఏఐ డిటెక్టర్ నిర్దారించింది.ఏఐ సాధనాలు మానవ సృజనాత్మకతను, ఏఐ రూపొందించిన టెక్స్ట్ మధ్య తేడాను ఖచ్చితంగా గుర్తించలేకపోవడం వల్లనే.. ఇంటర్వూలో రిజెక్ట్ అయ్యాను. ఈ సంఘటన జరిగిన తరువాత, లోపభూయిష్ట సాంకేతికత కారణంగా మనం ప్రతిభను కోల్పోతున్నామా? అనే ప్రశ్నను దామిషా ఇర్ఫాన్ లేవనెత్తింది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏఐ ఎలా ఉపయోగపడుతుందో.. మళ్ళీ పరీశీలించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించింది.సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పోస్ట్ చర్చకు దారితీసింది. నెటిజన్లు దీనిపైన వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కంటెంట్ రైటర్‌గా పని చేయడం మానేయడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. డిజిటల్ వ్యాపార దిగ్గజాలు కంటెంట్ క్రియేటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించనివ్వండి అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధంఏఐ డిటెక్టర్లు.. దాదాపు 99 శాతం అసలు కంటెంట్‌ను కూడా ఏఐ క్రియేట్ చేసినట్లు ఫ్లాగ్ చేస్తున్నాయని మరొకరు పేర్కొన్నారు. కంటెంట్‌ను ఏఐ క్రియేట్ చేయడానికి, మానవులు క్రియేట్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉందని ఇంకొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్యూ: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్ పోలీసులపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్లో ప్రసారం చేశారు.కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో సిట్ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్ కస్టడీలో ఉండగా లారెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్ హోం శాఖ కార్యదర్శి గుర్కిరత్ కిర్పాల్ సింగ్ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
ఆయన్ని ఎప్పటికీ ఆ పని చేయనివ్వను..!
షబానా అజ్మీ జగద్విఖ్యాత ఫెమినిస్ట్. 74 ఏళ్ల ఈ వయసులోనూ ఆమె నవ్వులో హుషారు ఉంటుంది. ఆమె మంచి నటి, చురుకైన సోషల్ యాక్టివిస్ట్ కూడా అయినప్పటికీ.. పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో ఆమెను ఫెమినిజం గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటారు. బయట ఆమెకు తారసపడే యువతులు కూడా... ‘మేడమ్.. ఫెమినిజం అంటే మీ ఉద్దేశంలో ఏమిటి?‘ అని ప్రాథమిక స్థాయి ప్రశ్న వేస్తుంటారు. ఆ ప్రశ్నకు షబానా నవ్వేస్తుంటారు. ‘ఈ అమ్మాయిలున్నారే.. తాము ఫెమినిస్ట్లము కాదు అని గర్వంగా చెప్పుకుంటారు, మళ్లీ ‘బ్రా – బర్నింగ్‘ మూవ్ మెంట్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు’ అంటారు షబానా. (పితృస్వామ్య వ్యవస్థను నిరసిస్తూ, అందుకు సంకేతంగా 60 లలో ఆనాటి మహిళా యాక్టివిస్టులు బ్రా లను మంటల్లో వేసి తగలబెట్టిన మూవ్‌మెంటే ‘బ్రా బర్నింగ్‘ ఉద్యమం). ఫాయే డి సౌజా యూట్యూబ్ ఛానల్ కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిజానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు షబానా. ఓసారి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు జావేద్ (అఖ్తర్) కుర్తాను ఇస్త్రీ చేస్తూ ఉండగా చూసిన ఒక తెలిసినావిడ.. ‘మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటారు. మీరేమో మీ భర్త దుస్తుల్ని ఇస్త్రీ చేస్తున్నారు?!‘ అని అన్నారు. షబానా నవ్వుతూ, ‘దీనికి దానికీ సంబంధం ఏమిటి?!‘ అని అడిగారు. అందుకు ఆవిడ... ‘మరైతే మీ వారు మీ శారీని ఇస్త్రీ చేస్తారా?!‘ అన్నారు.‘లేదు. నేను ఎప్పటికీ ఆయన్ని ఆ పని చేయనివ్వను‘ అన్నారు షబానా. డిసౌజాకు ఈ సంగతి చెప్పినప్పుడు... డిసౌజా కూడా షబానాను ఇదే ప్రశ్న అడిగారు. ‘మరి మీ ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఏమిటి?! అని. ప్రపంచాన్ని మనం చూసే దృష్టిలో ఉండేదే ఫెమినిజం. స్త్రీ పురుషులు వేర్వేరు. అంతే తప్ప ఎక్కువా కాదు, తక్కువా కాదు. ‘ప్రపంచం అనాదిగా ప్రతి సమస్యకూ పురుషుడి దృష్టి కోణం నుంచే పరిష్కారం వెతుకుతూ వస్తోంది. పరిష్కారం కోసం స్త్రీ వైపు నుంచి కూడా ఆలోచించటమే ఫెమినిజం’ అని చెప్పారు షబానా. ఇంతకుమించిన నిర్వచనం ఉంటుందా స్త్రీవాదానికి? ఎంతైనా షబానా కదా! -
ముఖాముఖి సంభాషణల్లో మేటి
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్టాక్లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు. నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్నైట్లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ. అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే! విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా
బిగ్‌బాస్ 8లో విచిత్రమైన క్యారెక్టర్ అంటే మణికంఠనే. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడనేది అస్సలు అర్థం కాదు. వచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు. ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే.. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు. తీరా ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు. బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‌కే ఝలక్స్ ఇచ్చాడు.గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు.. కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ అడగ్గా.. విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని అన్నాడు. దీంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు. అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు. 'నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి. నా రెస్పెక్ట్ నాకు కావాలి' అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు. అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కేరింత' సినిమా హీరో)గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్మేట్స్ అభిప్రాయం.. దీనిపై ఏమంటావ్ అని అడగ్గా.. నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు. సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా.. నేను నాలా ఉండటమే పాజిటివ్ అని మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.. ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ ససేమిరా అన్నాడు. హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు. ఇక పృథ్వీ-విష్ణుప్రియ మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 'ఇది మాకు తెలీదయ్యో' అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నాగమణికంఠ పారితోషికం ఎంతంటే?) -
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
ఆస్పత్రిలో ఉంటే ఎవరు సాయం చేయలేదు: చలాకీ చంటి
చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు. గతేడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటికొచ్చేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇతడు.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు)గుండెపోటు వచ్చిన తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా సహాయం చేయలేదని చంటి చెప్పుకొచ్చాడు. 'నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరూ హెల్ప్ చేయలేదు. కనీసం పలకరించలేదు కూడా. కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారంతే. నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు. కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు' అని చంటి చెప్పుకొచ్చాడు.చంటి చెప్పిన దానిబట్టి చూస్తే 'జబర్దస్త్', సినిమాలు చేస్తున్న టైంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆపదలో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదే అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో రియాలిటీ ఏంటనేది కూడా చెప్పకనే చెప్పారు. అలానే జబర్దస్త్ షోలో వాళ్లే వద్దన్నారని, దానికి కారణం కూడా తెలీదని చెప్పాడు. వాళ్లు వద్దన్న తర్వాత ఇక తాను మళ్లీ అడగనని, అది కరెక్ట్ కాదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత) -
Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత
బిగ్‌బాస్ 8 హౌస్ నుంచి ఆరో వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. తన తమ్ముడు నబీల్ విజేతగా నిలవాలని కోరింది. అలానే స్టేజీపై బోలెడన్ని విశేషాలు పంచుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగే బజ్ ఇంటర్వ్యూలోనూ అర్జున్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మంచితనమే కొంపముంచిందా అనే దానికి కూడా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: సీత ఎలిమినేట్.. 'అతడు గెలిస్తే చూడాలనుంది')బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ అవకాశం, మీరు దాన్ని సరిగా ఉపయోగించానని అనుకున్నారా? అని అడగ్గా.. 100 శాతం అయితే నేను ఇచ్చానని సీత చెప్పింది. హౌసులో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా? అని అడగ్గా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లని పంపినప్పుడు డౌన్ అయ్యానని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.ఏడవటం స్ట్రాంగా? అని అడగ్గా.. మరి అరవడం స్ట్రాంగా? అని అర్జున్‌కే కౌంటర్ వేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత మంచితనమే కొంపముంచిందా అని మీకు అనిపించలేదా? అని అడగ్గా.. కొంప మునగదు కదా అని క్యారెక్టర్ మార్చుకోలేను కదా అని సీత ఆన్సర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: కిర్రాక్ సీత పారితోషికం ఎంతంటే?)ఇక హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. టేస్టీ తేజ చిరాకులా అనిపించాడని, వారం అయినా సరే పెద్దగా ఫెర్ఫార్మ్ చేసినట్లు, కాన్ఫిడెన్స్ పెద్దగా కనిపించలేదని సీత చెప్పింది. గౌతమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అనిపించిందని చెప్పింది. గేమ్ పరంగా చూస్తే నిఖిల్ ట్రాన్స్పరెన్సీతో లేడని అంది.మీ అమ్మ ఓ లెటర్ పంపించారు కదా అందులో ఏముంది? అని అర్జున్ అడిగేసరికి.. సీత ఎమోషనల్ అయిపోయింది. ఏం జరిగిందో పక్కనబెడితే, నాకు దాని గురించి ఆలోచించాలని లేదు. ఎందుకంటే నేను నాలానే ఉన్నాను, సంతోషంగా బయటకొచ్చాను. మా అమ్మని హౌసులో చూడాలనుకున్న ఒక్కటే కల. అది తీరలేదు అని సీత ఏడ్చేసింది. ఏడుస్తూ, హౌసులో కాస్త మెతకగా ఉండటమే సీత ఎలిమినేషన్‌కి కారణం అయ్యుండొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: Bigg Boss 8: తేజ చేతిలో సీత బలి.. ఈ వేట ఆగదా?) -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
మణికంఠ చెల్లి చెప్పిన సంచలన నిజాలు.. చిన్నప్పటి నుంచీ
ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్ టెలికాస్ట్ అవుతుంది. రీసెంట్‌గానే దాదాపు 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే అందరిలో కాస్త విచిత్రమైన క్యారెక్టర్ ఎవరా అంటే చాలామంది చెప్పే పేరు మణికంఠ. ఒక్కో టైంలో ఒక్కోలా ప్రవర్తించే ఇతడికి సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నట్లే.. విమర్శించేవాళ్లు కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు మరిన్ని నిజాలని మణికంఠ చెల్లి కావ్య బయటపెట్టింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్.. అమ్మాయిని గర్భవతి చేశాడు: పూనమ్ కౌర్)అనవసరంగా బిగ్‌బాస్ షోకి వెళ్లి ఫ్యామిలీ విషయాలన్నీ రోడ్డు మీద పెట్టేశాడని అనుకున్నారా? అని యాంకర్ అడగ్గా.. 'అవును ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే చెప్పాకుండా ఉండాల్సింది కదా అనిపించింది. రీసెంట్గా నాకు నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య వాళ్ల ఫ్యామిలీకి కూడా కాల్స్ రావడం, వాళ్ల బంధువులు ఫోన్ చేసి.. ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎందుకు అమ్మాయిని తెచ్చుకున్నారని అని అందరూ అడగడం మొదలుపెట్టారు''అంత లో క్లాస్ అయినప్పుడు ఎందుకు తెచ్చుకున్నారు ఇలాంటి అమ్మాయిని మా అత్తమ్మని అడిగారు. కానీ ఆమెకు నా గురించి ముందే తెలుసు కాబట్టి మాకు లేని ప్రాబ్లమ్ మీకేంటి అని వాళ్లని అడిగి, నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్' అని మణికంఠ చెల్లి కావ్య చెప్పింది.(ఇదీ చదవండి: నోరు జారిన టేస్టీ తేజ.. వెక్కివెక్కి ఏడ్చిన నయని పావని)'చిన్నప్పటి నుంచి వాడు(మణికంఠ) అంతే. నాదే, నా ఒక్కడితే బాధ అని అనుకుంటాడు. పక్కనోళ్లు బాధ గురించి వాడికి సంబంధం లేదు. ఇవన్నీ పక్కనబెడితే వాడు గెలిచి రావాలి. ఎందుకంటే వెళ్లిందే దానికోసం. మేమందరం ఇన్ని అవమానాలు తీసుకున్నాం. ఎందుకంటే వాడు గెలిచి వస్తాడనే కదా. బయటనే కాదు హౌసులో కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు' అని మణికంఠ చెల్లెలు తన ఆవేదన బయటపెట్టింది.మణికంఠ చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో.. ఇతడి తల్లి రెండో పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి వల్ల.. అలానే పెళ్లయి, పాప పుట్టిన తర్వాత భార్య తనకు విడాకులు ఇచ్చిందని.. ఈ రెండింటి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డాడని బిగ్‌బాస్ షోలో చెప్పాడు. ఇది విని బాధపడే వాళ్లు కొందరైతే. సింపతీ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేసేవాళ్లు లేకపోలేదు. దీని వల్ల మణికంఠనే కాదు ఇతడి తీరు వల్ల బయట ఉన్న చెల్లి, భార్య కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' గేమ్ కాదు ట్రామా?) -
కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్
గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్)అసలేం జరిగింది?కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్మీట్లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)కార్తిది తప్పు లేకపోయినా ఆయన చేత పవన్ కళ్యాణ్ సారి చెప్పించుకున్నాడు సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ Create చేసి సారీ చెప్పినట్లు ట్విట్టర్ లో ప్రచారం చేశారు -@prakashraaj 🔥🔥🔥 pic.twitter.com/1gFGL0vioV— MBYSJTrends ™ (@MBYSJTrends) October 7, 2024 -
యాక్షన్ సినిమా చేయాలని ఉంది:కావ్యా థాపర్
‘‘ఓ నటిగా నాకు యాక్షన్, సైకో కిల్లర్, డీ గ్లామరస్.. ఇలా విభిన్న తరహాపాత్రలు చేయాలని ఉంది. అయితే నాకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ వస్తున్నాయి. ‘విశ్వం’లో నాకు మంచి క్యారెక్టర్ దక్కింది’’ అని అన్నారు హీరోయిన్ కావ్యా థాపర్. గోపీచంద్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వంలో వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కావ్యా థాపర్ చెప్పిన విశేషాలు.⇒ ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ చేశాను. మోడ్రన్‌గా ఉండే అమ్మాయి. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుంది... ఫన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో సీనియర్ నరేశ్, పవిత్రగార్లు నా తల్లిదండ్రులు. శ్రీను వైట్లగారు మంచి నటన రాబట్టుకున్నారు. మంచి విజన్ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలోని ట్రైన్ ఎపిసోడ్లో నా క్యారెక్టర్లో కూడా ఫన్ ఉంటుంది. ఈ సినిమాలో పదిహేను మంది హాస్యనటులు నటించారు. ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కథలో ఎమోషన్, యాక్షన్ కూడా ఉన్నాయి.⇒ ‘విశ్వం’ సినిమాను మల్టిపుల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో సినిమా టీమ్ అందరూపాల్గొన్నాం. విదేశాల్లోనూ షూటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను నటించిన ‘ఈగిల్’కి కూడా విశ్వప్రసాద్‌గారే నిర్మాత. ఓ రకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీని హోమ్ బ్యానర్‌గా భావిస్తుంటాను. ఇక నాకు తెలుగు భాష అర్థం అవుతుంది. ఓ టీచర్‌ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. త్వరలో తెలుగులో మాట్లాడతాను. మూడు కొత్త సినిమాలకు సైన్ చేశాను. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. -
నాలుగు పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది: శ్రీవిష్ణు
‘‘నా కెరీర్లో ఎప్పుడూ ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ‘శ్వాగ్’ సినిమాలో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది సవాల్‌గా అనిపించింది. ఒక్కసారి గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక చాలా బాగా కుదిరింది’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘శ్వాగ్’. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు పంచుకున్న విశేషాలు.⇒ ‘శ్వాగ్’ ఒక వంశానికి సంబంధించిన కథ. మాతృ, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవత్సరంలో మొదలయ్యే కథ. పురుషులు గొప్పా? మహిళలు గొప్పా? అనే అంశంపై వినోదాత్మకంగా ఈ కథ సాగుతుంది. శ్వాగ్ అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని ‘శ్వాగ్’ అని పెట్టాం. కొత్త తరహా కథల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అదే ధైర్యంతో సరికొత్త కథాంశంతో మా సినిమా చేశాం. ఈ మూవీలో నా పాత్రకి మేకప్ వేసుకోవడానికి రోజుకి నాలుగున్నర గంటలు పట్టేది... తీయడానికి రెండు గంటలు పట్టేది.. ఇదంతా చాలా కష్టంగా అనిపించింది. ⇒ కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్లకి ఈ చిత్రం విపరీతంగా నచ్చుతుంది. అలాగే యువ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. నేటి యువత తెలుసుకోవాల్సిన చాలా విషయాల్ని చూపించాం. మన వంశంతో పాటు పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అనేది హసిత్ చాలా చక్కగా తెరకెక్కించాడు. చాలా పెద్ద కథ ఇది. రెండున్నర గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా? అని సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే వినోదం ఉంటుంది. నా కెరీర్లో పెద్ద హిట్‌గా నిలిచే చిత్రాల్లో ‘శ్వాగ్’ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ⇒పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌గారు నన్ను, హసిత్ని నమ్మి తొలిసారి ‘రాజ రాజ చోర’ సినిమా అవకాశం ఇచ్చి, చాలా ్రపోత్సహించారు. ఇప్పుడు ‘శ్వాగ్’ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమా చూశాక మహిళలను ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నటీనటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ వినోదాత్మక చిత్రం చేస్తున్నాను. -
సాఫ్ట్వేర్ టు ఐపీఎస్.. సేవలోనే సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్. ఆయన డాక్టర్. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్ అధికారి శరత్చంద్ర పవార్. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నా బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్‌లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్‌ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.సాఫ్ట్‌వేర్‌లో ఉంటూనే సివిల్స్‌పై దృష్టిస్టార్టప్లో ఉండగా సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సాఫ్ట్‌వేర్‌తో వచ్చే డబ్బులతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్‌గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్డీ, మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, సెంట్రల్ జోన్ డీసీసీగా, నార్కొటిక్స్ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తిఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్‌కు ప్రిపరేషన్లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్‌మేళా నిర్వహిస్తాం.కుటుంబ నేపథ్యం ఇదీ..ఎస్పీ శరత్చంద్ర పవార్ తండ్రి బాలాజీ పవార్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్‌లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్చంద్ర భార్య పూజ ఇంటీరియర్ డిజైనర్. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్చంద్ర పవార్.అధిక వేతనం.. అయినా లోటుఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సన్‌టెక్ బిజినెస్ సొల్యూషన్స్‌లో జాబ్ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్ అనలిస్ట్‌గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్ ప్రారంభించాం. ఫుడ్ ఎన్ బ్రేవరేజెస్ ఇండస్ట్రీలో (ఎఫ్ఎన్బీ) రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్ వైపు మళ్లాను. -
ఆ భయాన్ని గౌరవించాలి: దర్శకుడు కొరటాల శివ
‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్‌గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్‌గారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్‌గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు. ⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు. ⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్‌లో చూశాను. తన డైలాగ్ పేపర్స్‌ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్‌లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు. ⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్‌ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు. -
ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: కార్తీ
‘‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే నాకు ఇష్టం. కానీ, ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. అయితే ‘సత్యం సుందరం’ కథ చదివినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా రాస్తారా? అనిపించింది. ఈ సినిమా తప్పకుండా కె.విశ్వనాథ్‌గారి తరహా లాంటి ఒక మంచి చిత్రం అవుతుందనిపించింది’’ అని కార్తీ అన్నారు. ‘96’ మూవీ ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్ మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ‘సత్యం సుందరం’. నాకు కథ బాగా నచ్చడంతో అన్నయ్యకి(హీరో సూర్య) చె΄్పాను. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన(జ్యోతిక) నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాకి పారితోషికం ఎక్కువ అడగొద్దు అంటూ నా మార్కెట్ కంటే కొంచెం తగ్గించి ఇచ్చారు(నవ్వుతూ). నా తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’ సినిమా చూసి ఆ΄్యాయంగా హత్తుకున్న అన్నయ్య మళ్లీ ఇన్నేళ్లకు ‘సత్యం సుందరం’ లో చాలా బాగా నటించానంటూ గర్వంగా హత్తుకున్నారు. ⇒ బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది.‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో ‘సత్యం సుందరం’ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అయితే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. మా సినిమా కూడా అలాంటిదే. ఈ చిత్రం చూశాక అందరికీ తమ బాల్యం గుర్తొస్తుంది. ⇒ చిన్న పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిత్వం ఉండే పాత్ర నాది. ఈ మూవీలో అరవింద్ స్వామిగారు కాకుండా ఆయన పాత్రలో మరొకర్ని ఊహించలేం. ‘ఊపిరి’ సినిమాలో ఉన్నట్లు సంతోషకరమైన భావోద్వేగాలున్న కథ ఇది. మా సినిమా తమిళంలో ఈ నెల 27న విడుదలవుతోంది.అయితే అదేరోజు తెలుగులో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే మా సినిమాని 28న రిలీజ్ చేస్తున్నాం. ‘దేవర’ ఒక యుద్ధంలా ఉంటుంది. మాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా(నవ్వుతూ). ⇒ ‘సత్యం సుందరం’ కి గోవింద్ వసంత్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి. సునీల్, సురేశ్ బాబుగార్లు మా సినిమా రిలీజ్ చేయడం హ్యాపీ. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ సినిమా ఉంది. ‘ఖైదీ 2’ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. -
మా అమ్మానాన్నను భయపెట్టారు!
‘‘నేను నటి కావాలనుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. అయితే మా బంధువులు, ఇరుగు పోరుగు వాళ్లు సినిమా ఇండస్ట్రీ మంచిది కాదు. అక్కడికి వెళితే చెడు అలవాట్లకు బానిసవుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు’ అంటూ ఏవేవో చెప్పి మా అమ్మానాన్నను భయపెట్టారు’’ అన్నారు త్రిప్తీ దిమ్రి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ (2023) సినిమాలో చేసిన కీలక పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు త్రిప్తి. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిప్తీ దిమ్రి మాట్లాడుతూ– ‘‘చిన్నతనం నుంచే నాకు నటనంటే ఆసక్తి. నటి కావాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు కొంచెం కంగారుపడ్డారు. ఆ తర్వాత ధైర్యం చేసి ముంబై వచ్చాను.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. అవకాశాల్లేక బాధపడిన క్షణాలున్నాయి. కొన్ని సందర్భాల్లో నమ్మకం కోల్పోయాను. చివరకు హీరోయిన్గా ‘లైలా మజ్ను’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాను. నా విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ’’ అని పేర్కొన్నారు. -
తీస్తే 'దేవర' 8-9 గంటల సినిమా అయ్యేది: ఎన్టీఆర్
ఎన్టీఆర్ 'దేవర' మరో వారం రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ముంబై, చెన్నై ఇలా తిరిగేస్తున్న తారక్.. ప్రస్తుతం హైదరాబాద్‌కి తిరిగొచ్చేశాడు. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు 'దేవర' ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. కొన్నిరోజుల క్రితం ఆలియా భట్-కరణ్ జోహార్-ఎన్టీఆర్‌ది రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు హీరో తారక్-కొరటాలతో విశ్వక్, సిద్ధు చేసిన ఇంటర్వ్యూని ఇప్పుడు రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)దాదాపు అరగంట నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో తారక్ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. కథని తాము చాలా తక్కువగానే చెప్పాం అని.. మొత్తంగా తీస్తే 8-9 గంటల సినిమా అవుతుందని అన్నాడు. అలానే జాన్వీ కూడా అద్భుతమైన యాక్టర్ అని, భాష పెద్దగా తెలియనప్పటికీ ఓసారి రెండు పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పేసిందనే విషయాన్ని బయటపెట్టాడు.'ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాం. మేం కొంత చెప్పి ఆపుతున్నాం, తప్పలేదు. మొత్తం తీసుకుంటే పోతే దాదాపు 8-9 గంటలు సినిమా వచ్చేది' అని ఎన్టీఆర్ చెప్పారు.(ఇదీ చదవండి: మోసం చేస్తున్న మల్టీప్లెక్స్‌లు.. చెప్పేదొకటి చేస్తున్న మరొకటి)తారక్-కొరటాల ఇంకే ఏమేం చెప్పారో తెలియాలంటే దిగువన ఇంటర్వ్యూ చూసేయండి. -
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్‌కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్‌ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్‌లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్‌లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్‌సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్‌పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్‌లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్‌మేట్స్‌కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్‌సిరీస్‌లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్‌ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్‌శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
యాక్షన్ చేయడం సవాల్‌గా అనిపించింది: ఫరియా అబ్దుల్లా
‘‘మత్తు వదలరా 2’ చిత్రంలో నాపాత్ర పేరు సన్నిధి. ఇందులో నేను, శ్రీ సింహా, సత్య స్పెషల్ ఏజెంట్స్‌గా కనిపిస్తాం. అయితే వారిపాత్రలపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నాపాత్రలో యాక్షన్ ఉంటుంది. గన్స్ పట్టుకుని యాక్షన్ చేయడం సవాల్‌గా అనిపించినా చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మత్తు వదలారా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని నటీనటులు ఎదుర్కొనే ట్రాజెడీ నుంచి కామెడీ పుడుతుంది (నవ్వుతూ). రితేష్ రానాగారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. కాల భైరవగారి సంగీతం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓపాటకి లిరిక్స్ రాసి,పాడి, కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథిపాత్ర చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి థ్యాంక్స్. ప్రభాస్‌గారితో పెద్దపాత్ర ఉండే సినిమా చేయాలనుకుంటున్నాను.‘జాతి రత్నాలు’ చిత్రంలో నేను చేసిన చిట్టిపాత్ర నా ఇంటిపేరు అయి΄ోయింది. ఎక్కడికెళ్లినా ఇప్పటికీ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ‘జాతి రత్నాలు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అయితే నాకు రాలేదు. ‘మత్తు వదలరా 2’తో వస్తుందని నమ్ముతున్నాను. ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్యగార్లతో ప్రత్యేకపాట చేశాను. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయమని కొందరు అడిగారు... కానీ, చేయలేదు. తమిళంలో నేను నటించిన ‘వల్లి మయిల్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. తెలుగులో తిరువీర్‌కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను. అలాగే మరో తమిళ సినిమా ప్రారంభం కాబోతోంది’’ అన్నారు. -
ddos attack : మస్క్ - ట్రంప్ ఇంటర్వ్యూ.. ఎక్స్ వేదికపై సైబర్ దాడి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ను ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ ఆడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఎక్స్‌పై డీడీఓఎస్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులకు ఆ ఇంటర్వ్యూ అందుబాటులోకి రాలేదని మస్క్ తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని ఆడియో ఇంటర్వ్యూని అందరికి అందిస్తామని చెప్పారు. డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?డీడీఓస్‘డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ అటాక్’. సైబర్ నేరస్తులు డీడీఓఎస్ అటాక్‌ను ఎంపిక చేసిన సర్వర్,నెట్వర్క్ లపై దాడి చేస్తారు. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు స్తంభించి పోతాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ దీనిని సైబర్ క్రైమ్‌గా పరిగణలోకి తీసుకుంది. డీడీఓఎస్తో నిర్ధిష్ట వ్యక్తుల్ని,సంస్థల్ని టార్గెట్ చేస్తారు.ఉదాహరణకు ఎలోన్ మస్క్ - ట్రంప్ మధ్య ఆడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూని యూజర్లు యాక్సెస్ చేయకుండా అడ్డుకున్నట్లు చెప్పింది. We tested the system with 8 million concurrent listeners earlier today https://t.co/ymqGBFEJX0— Elon Musk (@elonmusk) August 13, 2024 -
క్రిటిసిజం పట్టించుకోను.. నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
భారీగా అభ్యర్థులు.. తొక్కిసలాట దిశగా ఇంటర్వ్యూ!
ఓ కెమికల్ కంపెనీ నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరైన కావటంతో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని భారుచ్ జిల్లాలో ఓ ప్రైవేట కెమికల్ కంపెనీ గురువారం 42 పోస్ట్‌లకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. 5 పోస్టులకు వెయ్యి మంది చొప్పున భారీగా అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించే అంకలేశ్వర్‌లో ఉన్న హోటల్‌కు తరలివచ్చారు. రెజ్యూమ్‌లు చేతపట్టుకొని పెద్ద ఎత్తున అభ్యర్థులు లైన్లో నిలబడటంతో హోటల్ రేయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది.Over Hundreds of Youths with BE Chemical Degree in Bharuch District of Gujarat crowd for Interview at a Hotel for Forty Job Vacancies in a Private Firm. Such is the State of Unemployment in India.#GujaratModel pic.twitter.com/es8vvMSrmb— Aniketh Brian 🇮🇳 (@aniketh_brian) July 11, 2024 అభ్యర్థుల తీవ్రమైన గందరగోళంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. భారీ అభ్యర్థులతో హోటల్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఈ కంపెనీలో షిఫ్ట్ ఇన్చార్జ్, ప్లాంట్ ఆపరేటర్,సూపర్వైజర్, మెకానికల్ ఫిట్టర్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల కోసం కెమికల్ ఇంజనీరింగ్ బీఈ, ఐటీఐ చదవినవారు హాజరయ్యారు. -
ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్లు గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆన్లైన్లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం గత ఏడాది నవంబర్‌లో ముగిసింది. అయితే అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న టి20 ప్రపంచకప్ కోసం ద్రవిడ్‌కు తాత్కాలిక పొడిగింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం ఇదివరకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్వేషణ మొదలుపెట్టింది. నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, స్రూ్కటినీ పూర్తయ్యాక చివరకు మిగిలిన ఇద్దరు గంభీర్, రామన్లలో గౌతీనే ఖాయం చేద్దామని బోర్డు సుముఖంగా ఉంది. అయితే తుది ఇంటర్వ్యూ ముగించాకే సీఏసీ సిఫార్సు మేరకు నిర్ణయం వెలువరించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. మంగళవారం సీఏసీ హెడ్ అశోక్ మల్హోత్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో గంభీర్, రామన్‌లు తమ ప్రజెంటేషన్ ఇచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు టీమిండియా కోసం వచ్చే మూడేళ్లపాటు తన అనుభవాన్ని ఎలా వెచి్చస్తాననేది, పూర్తిస్థాయిలో ఏమేరకు అందుబాటులో ఉంటాననేది గంభీర్ తెలిపాడు. -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
కిశోరీ లాల్ శర్మ.. అమేథీలో కాంగ్రెస్ తురుపు ముక్క. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఊహించని ప్రత్యరి్థ. రాజీవ్‌గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు నమ్మిన బంటు ఈ 63 ఏళ్ల కేఎల్ శర్మ. ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన శర్మ ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి బీజేపీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన బలం. గాం«దీలతో మైత్రి సహా.. పలు అంశాలపై ఆయన పంచుకున్న ముచ్చట్లివి.. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు తెరమీదకు వచ్చారు. ఈ మార్పు ఎలా ఉంది? ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పు లేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఏమీ చేయలేదు. 25–30 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నవారున్నారు. కాలం మారింది.. కొత్తగా చేయాలి. టీమ్ అదే.. పని తీరే మారింది. ఐదేళ్ల కిందట రాహుల్ ఓడిపోయిన చోట నుంచి పోటీని ఎలా చూస్తున్నారు? గతంలో పొరపాట్లు జరిగాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎలా? అన్న అంతర్మథనం జరిగింది. రెండు విషయాలు బలంగా పనిచేశాయి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిడితోపాటు మా వైపు నుంచి కూడా లోపాలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథుడు లేరని కార్యకర్తలు వాపోయారు. బీజేపీ గెలిచింది 55,000 ఓట్ల తేడాతోనే. అది పెద్ద నంబర్ కాదు. ఓటమికి కారణమైన వారినే అభ్యరి్థగా నిలబెట్టారని బీజేపీ ఆరోపణ కదా! 2019 ఎన్నికల్లో నేను అమేథీలో లేను. రాయ్‌బరేలీలో పోలింగ్, ఎన్నికల నిర్వహణ చూస్తున్నాను. ఇప్పుడు నేను, నా ప్రత్యేక బృందం ఇక్కడ పనిచేస్తోంది. తేడా అదే! ‘గాంధీ కుటుంబ చప్రాసి’ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు? నేనెవరినో అమేథీ, రాయ్‌బరేలీ ప్రజలందరికీ తెలుసు. 1980లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో రాజీవ్ గాంధీ జీ 20 ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడానికి కొంతమంది యువ నాయకులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకడిని. ఒకటిన్నర బ్లాకులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ‘అమేథీ మే దిల్ లగ్ గయా’ (అమేథీ మీద మనసు పారేసుకున్నా). ఇక్కడే ఉండిపోయాను. కొందరు నన్ను సోనియాగాం«దీకి పీఏ అంటారు. ఎవరేమనుకున్నా.. నేను ప్రజాప్రతినిధిని. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిని. స్టార్ క్యాంపెయినర్ని. 2013లో ఏఐసీసీ కార్యదర్శిగా, సీపీ జోషితో కలిసి బిహార్‌కు కో–ఇన్చార్జ్గా ఉన్నాను. బిహార్‌లో కూటమి ఏర్పాటు చేసినప్పుడు 27 స్థానాల్లో విజయం సాధించాం. ఏం తెలియకుండా మాట్లాడేవారికి నేనేం చెప్పగలను? మీ కుటుంబం? భార్య. ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఎంబీఏ చేసి మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కూతురు వ్యాపారవేత్త. మీ పోటీతో పారీ్టలో అంతర్గత విభేదాలు పెరిగాయని భావిస్తున్నారా? పారీ్టలో అంతర్గత పోరు ఉంది. కానీ నా విషయానికి వస్తే అది లెక్కలోకి రాదు. నేను వాళ్ళ అన్నయ్య లాంటివాడిని. తిట్టగలను, ప్రేమగా మాట్లాడగలను. వాళ్లూ నాతో అలాగే ఉంటారు. పోటీకి గ్రూపులు మంచివే. కానీ పార్టీని దెబ్బతీసే గ్రూపులు ఉండొద్దని చెబుతుంటా. ఎన్నికల్లో పోటీ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? అమేథీలోని ఇతర కార్యకర్తలు కోరుకున్నట్లే నేను కూడా రాహుల్జీ పోటీ చేయాలని కోరుకున్నా. కానీ నామినేషన్లకు ముందు ప్రియాంక ‘కిషోరీ జీ మా కుటుంబం కోసం మీరు ఎన్నో ఎన్నికల్లో పోరాడారు. ఈ ఎన్నికల్లో మేం మీకోసం పోరాడాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నేను అంగీకరించాను. మీ ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది! స్మృతి ఇరానీ ఎంత ప్రచారమైనా చేసుకోనీ. ఆమె అసలు నాకు పోటీయే కాదు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసు. ఇక నిర్ణయం ప్రజలది. స్మృతి ఇరానీ చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే, ఆమెను కించపరిచేలా నేనెప్పుడూ మాట్లాడలేదు. నాపై నోరు పారేసుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం జగన్‌లో ఆ ధీమా ఎలా వచ్చిందంటే.?
నాలుగు రోజుల్లో ఎన్నికలు. యావత్తు దేశం ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్న వేళ.. సీఎం జగన్ నిన్న టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెల్లలచెరువుతో మాట్లాడారు. వివిధ విషయాలపై తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వివరించారు. ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారన్నదానిపై వివరించిన సీఎం జగన్.. తానిచ్చిన మాటకు, చేసిన పనిని పోల్చి చూపించి తనకు ఎంత విశ్వసనీయత ఉందో స్పష్టంగా వివరించారు. Yes, why not 175 అని ధీమా వ్యక్తం చేశారు. వేర్వేరు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు.గెలిచేది వైఎస్సార్సిపీనే, తిరిగేదీ ఫ్యానేఇప్పుడు ఏపీలో జరుగుతున్నవి బై పోలార్ ఎన్నికలు 99% కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది ఎంతమంది కలిసి పోటీ చేసినా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అందుకే వైనాట్ 175 అంటున్నాంబీజేపీతో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి బీజేపీ, టీడీపీ పొత్తులపై వారికే క్లారిటీ లేదు మోదీ దేశానికి ప్రధాని.. నేను రాష్ట్రానికి సీఎం ఒక సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలుస్తాం బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొన్నింటికి మద్దతు ఇచ్చాము కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెస్తాం కేంద్రంలో ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తా నన్ను ఒంటరిగా ఎదుర్కోలేమని భయపడుతున్నారు దేశం మొత్తం ఏపీ మోడల్ ఫాలో మనసుపెట్టి పాలన చేస్తున్నాంకొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాంకొత్తగా నాలుగు ఓడరేవులు కడుతున్నాం10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాంమూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాంఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉన్నాంMSMEలపై పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదుMSMEలలో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి లభించిందిస్వయం ఉపాధి ఎంచుకున్న వారు దెబ్బతింటే అభివృద్ధి ఆగుతుందిగతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేశాంమా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులుపారిశ్రామికవేత్తలు క్యూ కట్టారునేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందిచూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదుపచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిశ్రీకాకుళంలో పోర్టు కడుతున్నాంశ్రీకాకుళం ముంబైలా అభివృద్ధి చెందుతుందితెలంగాణలో 60శాతం రెవెన్యూ హైదరాబాద్ దేతెలంగాణకు హైదరాబాద్..ఏపికి విశాఖ ఐకాన్ సిటీలుఅందుకే ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయివిద్యలో విప్లవాత్మక సంస్కరణలు3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి6వ తరగతి నుంచే డిజిటల్ బోధన8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇచ్చాంఅంతర్జాతీయవర్సిటీల కోర్సులు తీసుకొచ్చాంపిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనేది మా తాపత్రయంఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో 32 వేల ఉద్యోగాలు ఇచ్చారుకానీ మా హయాంలో ఏకంగా 2 లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాంవైద్యరంగంలో 54 వేల ఉద్యోగాల భర్తీ జరిగిందిఅన్నదాతకు అండగా నిలిచాంరైతు భరోసా సాగు ఖర్చులో 80 శాతంరైతులకు పెట్టుబడి సాయం గతంలో లేదువిశాఖ నుంచే పరిపాలనఅమరావతిలో డెవలప్మెంట్ ఎకరాకు రూ.2 కోట్లు అవసరంవిశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవువిశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తాపరిపాలన విశాఖ నుంచే జరుగుతుందిఆంధ్రప్రదేశ్లో విశాఖ అతిపెద్ద సిటీవిశాఖలో అతిపెద్ద సచివాలయం నిర్మిస్తాంఅతిపెద్ద కన్వెన్షన్ హాల్, స్టేడియం కడతాంవిశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంవిశాఖకు బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యంఅమరావతి అభివృద్ధి చేయాలంటే ఆలస్యం అవుతుందివీలైనంత త్వరగా విశాఖను హైదరాబాద్, చెన్నై స్ధాయికి తీసుకెళ్లాలిపారదర్శకంగా సంక్షేమంఅర్హులైన వారందరికి సంక్షేమం ఇస్తున్నాంలంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాంనేరుగా ఖాతాల్లోకి డబ్బు జమచేస్తున్నాంనాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ పెరుగుతుందిఅందుకే అమ్మఒడి ఇస్తున్నాంపిల్లలకు పెట్టే ప్రతిరూపాయి వారి అభివృద్ధికోసమేఆసరా లేకపోతే కోటి మంది మహిళలు నష్టపోతారునిలదొక్కుకోవడానికి సాయం చేస్తే వారిని సోమరిపోతులను చేసినట్టు కాదుDBT ద్వారా ఇచ్చేవేవీ ఉచితాలు కావుDBT లకు ఒక ప్రయేజనం ఉందినాలుగేళ్ల పాటు చేయూత అందించాంచంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారునేనుకూడా చంద్రబాబుకంటే ఎక్కువ హామీలు ఇవ్వగలనుఒకే అబద్ధాన్ని వందసార్లు చెబుతున్నారుచేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలిఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయిరాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలిప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదురాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారుసూపర్-6, సూపర్-7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారురాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలిచేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలివిశ్వసనీయత నా శ్వాసనా ప్రతి మాటకు విశ్వసనీయత ఉంటుందినేను చేసేవి విమర్శలే తప్ప... వాళ్లలాగే తిట్టలేనుగతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాఇప్పుడు జరుగుతున్నవి బైపోలార్90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉందిఎంత మంది కలిసి పోటీ చేసినా 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారుప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాంమంచినిచూసి ఓటువేయండని చంద్రబాబు అడగలేకపోతున్నారునా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి ఓట్లు అడుగుతున్నాపవన్ కల్యాణ్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలుపవన్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడుతారాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలిఐదేళ్లకోసారి భార్యలను మార్చడం సరికాదుఒకసారి జరిగితే పొరపాటు.. రెండోసారి జరిగితే గ్రహపాటుమూడు, నాలుగుసార్లు అయితే అలవాటుచంద్రబాబు, దత్తపుత్రుడు రాజకీయ పార్టనర్స్గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పవన్ భాగస్వామిచంద్రబాబు చేసిన ప్రతిపాపంలో దత్తపుత్రుడి వాటా ఉందిబీజేపీ తప్పులను కూడా నేను ప్రశ్నిస్తున్నాముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం తప్పు ప్రతిమతంలో ఓసీలు, బీసీలు ఉంటారు మతం వేరు.. రిజర్వేషన్లు వేరుముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారుముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ధర్మంముస్లింలలో వెనకబడిన వారికే రిజర్వేషన్లు ఉన్నాయిరిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్తాం పార్లమెంటులో కూడా గళమెత్తుతాం ప్రత్యేక హోదా వైఎస్సార్సీపీ ఎజెండాప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు? హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు చంద్రబాబు వల్ల రాష్ట్రం నష్టపోయింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదు హోదాను చట్టంలో చేర్చకపోవడం అతిపెద్ద అన్యాయంహోదాను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే అవకాశం ఉండేది చంద్రబాబు ట్రాప్‌లో పడితే ఏం చేయగలం?వివేకా కేసును తప్పుదోవ పట్టించారువివేకాహత్యను కడప సెంట్రిక్ గా మార్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్న ఓడిపోవాల్సింది కాదు అవినాష్ వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుంది తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనడం ఘోరం అవినాష్ తప్పు చేయలేదని వీడియోలు చూసిన వారు ఎవరైనా చెబుతారుచెల్లెళ్లకు న్యాయం చేసేందుకు మరొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు చిన్నాన్న రెండో భార్య గురించి అవినాష్ అడుగుతున్నది లాజికల్ గా కరెక్ట్ కాదా?సునీత మాటలు ఎన్నికలపై ప్రభావం చూపవు ఏం జరిగిందో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు అవినాష్ ఎలాంటివాడో జిల్లా ప్రజలకు తెలుసు అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కుటుంబం vs పార్టీప్రజా జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి 2019లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదు అయినా వైఎస్సార్సిపి ఓటు బ్యాంకును చీల్చాలని కాంగ్రెస్ పేరిట కుట్ర చేస్తున్నారు షర్మిల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందివందేళ్ల తర్వాత తొలిసారి సర్వే చేశాంభూ రికార్డులు సిద్ధం చేశాంభూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం ఏపీలో 17వేల గ్రామాల్లో రికార్డులు అప్డేట్ చేశాం టైటిల్స్ లో తప్పులు లేకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూములకు ఇన్సూరెన్స్ గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా మార్పు సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ ను పెట్టాం ల్యాండ్ టైటిలింగ్, రిజిస్ట్రేషన్ రెండూ ఒకటి కాదు అన్ని సర్వేలు పూర్తయ్యాకే యాక్ట్ వస్తుంది ఈ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు, పైగా అన్ని రకాల ప్రయోజనాలు -
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూను చూసింది.అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న వేర్వేరు సందేహాలను టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెళ్లలచెరువు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్‌ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న -
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్‌లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల ‘వైఎస్సార్సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్‌కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్‌పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్ అంటే ఇష్టం.. జగన్‌పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్‌లో ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి. హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్‌ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్ సవాల్‌నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్‌లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్‌ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్‌కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్‌గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను. -
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్‌కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...
రిపోర్టర్: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్, 5ట్రిలియన్ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్మోహన్రెడ్డి మతతత్వవాది కాదు… జగన్మోహన్రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు. -
అలాంటి సన్నివేశాలకు నో: మృణాళ్ ఠాకూర్
‘కథకి, పాత్రకి అవసరమైతే గ్లామర్ సన్నివేశాల్లో, ముద్దు సీన్స్‌లో నటించేందుకు సిద్ధం’ అనే మాటని ఎక్కువశాతం హీరోయిన్లు అంటుంటారు. అయితే అలాంటి సన్నివేశాలకు నో అనే కథానాయికలూ లేకపోలేదు. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా గ్లామర్ సన్నివేశాలు, ముద్దు సీన్స్‌లో నటించేందుకు నో చెబుతాను అంటున్నారు. ‘సీతా రామం’(2022) సినిమాతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఈ మరాఠీ బ్యూటీ. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు మృణాళ్. ఆ తర్వాత తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారామె.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ–‘‘ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. పైగా నేను అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేసేందుకు నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అందుకే మొహ మాటం లేకుండా నో చెబుతాను’’ అన్నారు. -
ఏపీలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న జిల్లా నెల్లూరు
-
ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు: హీరో విశాల్
♦ ‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు లోతుల్లో అనిపించిందే చెబుతున్నా.. ♦ జగన్ ప్రభుత్వంలో పల్లెల్లో విద్యా రంగంలో మార్పులు బాగా అనిపించాయి. ♦ ఏ నాయకుడైనా సరే... ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ♦ పొత్తు పెట్టుకోండి.. అయితే గతంలో ఇంత మంచి చేశామని ప్రజలకు చెప్పగలరా? ♦ ఈ ఐదేళ్లూ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేకపోయారని ధైర్యంగా మాట్లాడగలరా? ♦ ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. ♦ ఎవరెన్ని కూటములు కట్టినా... ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు అని నా భావన ♦ వీడెందుకు ఇంత మంచి చేస్తున్నాడనే మంటతో కొందరు కాళ్లు పట్టుకుని లాగాలని చూస్తారు. ♦ అలాంటి వాటికి వెరవని నేత జగన్ అనేది నా నమ్మకం..’ అని హీరో విశాల్ తన మనసులో మాటను బయటపెట్టారు. రత్నం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఆయనే సీఎం.. నేనెప్పుడూ మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజుల నుంచి జగన్‌ను గమనిస్తున్నాను. ట్రెడ్ మిల్‌పై రెండు కి.మీ వాకింగ్ చేస్తే అలసి పోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటిచెబుతోంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం. విద్యలో సంస్కరణలు భేష్ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చయినా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్‌ను ఇవ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వలంటీర్లు అలాంటి వారిని వెదికి చదివించడం చేస్తున్నారు. మంచి నేతను ఎవరూ ఆపలేరు ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం.. మంచి చేసేవాళ్లని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్‌పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరితరం కాదు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూచుని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. –సాక్షి, అమరావతి మనసులో ఉన్నదే చెబుతున్నా నాకు ఆంధ్రలో ఓటు లేకున్నా.. కొంతకాలంగా ఇక్కడి రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్సార్సీపీ ని సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీ లు జత కట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒకే మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈ ఐదేళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికే రెండు, మూడు తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి.. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారో ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరెన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో జగన్‌దే గెలుపు. -
జగన్ ఏలిక...ఆంధ్రావనికి ఏరువాక!
జనం బాధలు తమవిగా భావించే నేతలే ప్రజా సమస్యల పరిష్కారానికి తపిస్తారు. అలా తపించే నాయకులే నేటి సమాజానికి కావాలి. ఎవరికి ఏ కష్టమొచ్చినా చలించే మనసు ఉండాలి. చలించడంతో సరిపోదు... ఆ బాధలను తీర్చాలన్న పట్టుదల... ఆ కష్టం తీరేదాకా జనం వెన్నంటి ఉన్నప్పుడే రాజకీయ నాయకుడికి గుర్తింపు. అలాంటి గుర్తింపును తండ్రీ తనయులైన దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలోనూ అతి దగ్గరగా చూసిన ఒక వ్యవసాయ శాస్త్రవేత్త మనోగతమిది... రైతులకు ఏం చేస్తే వారి బతుకులు బాగుపడతాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తను సలహాలు అడిగారు. తాను చెప్పిన వాటన్నిటినీ తూచా తప్పకుండా ఆచరించడమే జగన్‌లోని ఆదర్శ నాయకుడిని చూపించాయని ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. జగన్‌లోని వినే గుణం, విన్న తర్వాత ఆచరణలోకి తీసుకురావడమనేది ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిన అదృష్టమని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వపు వీసీ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గవర్నింగ్ బాడీ మాజీ సభ్యుడు, ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు...ప్రొఫెసర్ పోలి రాఘవరెడ్డి కొనియాడారు... జగన్‌తో తన స్ఫూర్తిదాయక అనుభవాలను ఇలా ‘సాక్షి’ తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, అమరావతి ‘నాడు ఆ మహానేత వైఎస్సార్.. నేడు ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రైతుల కోసం ఆలోచించే విధానం.. స్పందించే తీరు ఒకే రీతిలో ఉంది. ప్రతీ అడుగులోనూ రైతులకు మేలు చేయాలన్న తపన వారిద్దరిలోనూ కన్పించింది. ఇద్దరి పాలనా తీరును దగ్గర నుంచి చూశాను. నాన్న ఒక అడుగు వేస్తే నేను నాలుగడుగులు వేస్తానన్న సీఎం వైఎస్ జగన్.. ఐదేళ్లలో రైతుల కోసం ఏకంగా వంద అడుగులు వేశారనే చెప్పాలి. మహానేత హయాంలో రైతులు ఎంత సుభిక్షంగా ఉన్నారో అంతకు రెట్టింపు సంతోషంగా ఈ ఐదేళ్లలో ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణుడిగా నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు..నాకు తెలిసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధికి బాటలు పడ్డాయని చెప్పొచ్చు. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ... రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గర నుంచి చూసిన నేతగా వైఎస్ జగన్ వారి ప్రతీ సమస్య పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రతీ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. సమస్యలను ఆకళింపు చేసుకోవడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే సాగుకు అవసరమైన పెట్టుబడి, సారవంతమైన నేల, అవసరమైన మేరకు నీరు, సాగు ఉత్పాదకాలు, సాంకేతిక బదలాయింపు, గిట్టుబాటు ధర కల్పన, సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు అవసరం. ఈ ఐదేళ్లలో వీటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతులకు మేలు చేయాలన్నదే ఆయన తపన మహానేత మాదిరిగానే వైఎస్ జగన్ రైతుకు మేలు చేసేందుకు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటున్నారు. అగ్రిమిషన్ తొలి సమావేశంలో పెట్టుబడి సాయం ఇచ్చేటప్పుడు ఎంత విస్తీర్ణం ఉండాలి. ఎవరిని రైతులుగా గుర్తించాలని అడిగారు. అప్పుడు నేను చెప్పిన రెండు సూచనలు ఆచరణలో పెట్టారు. తమలపాకు రైతులు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. పైగా మెజార్టీ సాగుదారులకు ఎకరం కంటే తక్కువ భూమే ఉందని చెప్పాను. ఒక రైతుకు ఇద్దరు ముగ్గురు కొడుకులుంటారు. పెళ్లయిన తర్వాత వారికి పొలాలు వాటాలు పంచినా ఒకే ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదన్నా.. అని చెప్పాను. అలా చెప్పిన మరుక్షణమే.. రైతుకు 15 సెంట్లున్నా పెట్టుబడి సాయం ఇవ్వాలని, పెళ్లయితే చాలు ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా వేర్వేరు కుటుంబాలుగా పరిగణించి రైతు భరోసా ఇద్దామని సీఎం జగన్ ప్రకటించి ఆచరణలో పెట్టారు. రైతులకు ఒక్క రూపాయి అయినా అదనంగా మేలు చేయాలన్న తపన, తాపత్రయం పెద్దాయనలో మాదిరిగానే వైఎస్ జగన్‌లోనూ చూశాను. పరిశోధనలకు పెద్ద పీట... మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నేను మార్టేరు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తగా ఉండేవాణ్ని. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలి నాళ్లలో మా పరిశోధనా స్థానానికి వచ్చినప్పుడు రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగారు. పరిశోధనలు బాగా పెరగాలి. వాటి ఫలాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరువ చేసిన రోజు కచ్చితంగా వారికి మేలు జరుగుతుందని చెప్పాను. అంతే.. క్షణం ఆలోచించకుండా పరిశోధనా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అక్కడికక్కడే రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఫలితంగా కొత్త రకాలు సృష్టించగలిగాం. ఉత్పత్తిని పెంచేందుకు బలమైన అడుగు వేయగలిగాం. ఆ తర్వాత డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా, వీసీగా ఆయన హయాంలో పనిచేసే అవకాశం కలిగింది. ఆ సమయంలో నేను ఇచ్చిన సలహాలు, సూచనలకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఆచరణలో పెట్టేందుకు కృషి చేశారు. ఆ మహానేత కంటే మిన్నగా నేడు సీఎం వైఎస్ జగన్ తాను అమలు చేసే ప్రతీ కార్యక్రమం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. -
ఇంగ్లిష్ వ్యతిరేకులను చీపుర్లతో స్వాగతించండి
‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశానికే దిక్సూచిలా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా విధానం భవిష్యత్తులో ప్రతీ ఒక్కరూ అనుసరించక తప్పదు. వద్దన్న వారికి చీపుర్లతో బుద్ధి చెప్పాలి’ అని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష అమలు, దాని ఫలాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. దేశాన్ని మార్చే విద్యా విధానం.. ఇంగ్లిష్ మీడియం కోసం 1990 నుంచి నేను గళం విప్పాను. మండలి బుద్ధప్రసాద్, ఏబీకే ప్రసాద్, చుక్కా రామయ్య.. వీళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అంటే నా మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో దాడి చేశారు. ఈ విషయంలో సీఎం జగన్ చేసిన పోరాటం చాలా గొప్పది. ఆయన దేశాన్ని మార్చే విద్యా విధానం తీసుకొచ్చారు. మొత్తం బీజేపీ ప్రభుత్వ అజెండాను కూడా మార్చే శక్తి దానికుంది. నిజానికి గ్రామాల్లో నుంచి వచ్చే పిల్లలతో నగరాల్లోని పిల్లలు పోటీ పడలేరు. గ్రామీణ పిల్లలకు కేవలం కమ్యూనికేషన్ ఒక్కటే సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల్ని బహిరంగ సభల్లో తెచ్చి మాట్లాడించిన నాయకుడ్ని నా జీవితంలో చూడలేదు. ఇంగ్లిష్ మీడియం విద్య జగన్‌ను గెలిపించబోతోంది. దీన్ని ఎవరూ ఆపలేరు. ఇటీవల రాహుల్ గాం«దీకి కూడా చెప్పా. దేశమంతా ఆంధ్ర మోడల్ తీసుకురండి.. బీజేపీని ఓడించగలుగుతారు అని. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియంలను నేను అంబేడ్కర్ గుడి అంటాను. 2002లో నేను మా ఊర్లో గుడ్ షెçపర్డ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టి.. లంబాడి కూలోళ్ల పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాను. ఇప్పుడు అద్భుతంగా వాళ్లు ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. మీ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తారా? వెంకయ్యనాయుడు, రమణ, చంద్రబాబు, పవన్‌కు చెబుతున్నా. మీ ఆధ్వర్యంలో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టించండి. మీ పిల్లల్ని, అగ్రకులాల పిల్లల్ని తెలుగు మీడియంలో బాగా చదివించండి. మేం మాత్రం దిక్కుమాలిన ఇంగ్లిష్‌లోనే చదువుకుంటాం. మీరు తెచ్చిన నారాయణ, చైతన్య, విజ్ఞాన్ స్కూల్స్‌ను తెలుగు మీడియంకు మార్చండి. ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి ఊరూరా మహిళలు చీపుర్లతో స్వాగతం చెప్పండి. అలాంటి మేధావులకు అంటిన మురికిని వదిలించడానికి చీపుర్లతో శుభ్రం చేయండి. తొలి మార్పు వైఎస్సార్ నుంచే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2006లో 6 వేల స్కూల్స్‌లో ప్యారలల్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే పలువురు వ్యతిరేకించారు. ఈ విషయం మీద తనని కలిసిన వారిని మీ పిల్లలు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు అని వైఎస్సార్ ప్రశ్నించాక నోరు మూసుకున్నారు. మన పిల్లలకు ఇంగ్లిష్ చదువులు కావాలా? బీదల పిల్లలకి అక్కర్లేదా? అని వారందర్నీ మందలించారు. బహుశా అదే జగన్‌కు స్ఫూర్తినిచ్చి ఉంటుంది. పాదయాత్రలో పిల్లల పరిస్థితి చూసిన జగన్.. మేనిఫెస్టోలో ఇంగ్లిష్ విద్య గురించి పెట్టారు. ఇచ్చింన మాట ప్రకారం ఆయన ఇంగ్లిష్ మీడియం తేవడానికి ప్రయత్నిస్తే వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్‌లాంటి వాళ్లంతా వ్యతిరేకించారు. నా దృష్టిలో వాళ్లంతా యూజ్లెస్. కమ్యూనిస్ట్‌లు, నాతో పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారు. ఆఖరికి అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న రమణ కూడా వీరికి జతకలిశారు. ఆయన తెలుగు భాష గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆయన అసలు ఏం తెలుగు రాశారని? వీళ్లందరికీ ఏం తెలుగు వచ్చని? లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌కు చెబుతున్నా. ఒక్కసారి ఆ పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడు. మేధావితనం ముసుగు మాత్రమేనని నీకే తెలుస్తుంది. -
ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!
తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం. ఎంతోమంది న్యూస్ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ చంద్ర తారార్కం...! 2014లో శాంతి స్వరూప్ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి సంభాషణ పాఠకుల కోసం.. టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా! తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే... అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్. పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..! వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’... ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు.. తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి. మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష. సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని. మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్‌కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు. మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది. ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్‌లో జోకర్లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు. తెలుగు దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్ని, న్యూస్ రీడర్ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను. నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. -
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
Taipi: చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
తైపీ: తైవాన్ తమ దేశంలో భాగమని అది ప్రత్యేకమైన దేశం కాదని చైనా మరోసారి స్పష్టం చేసింది. తాజాగా తైవాన్ విదేశీ వ్యవహారాల మంత్రి జోసఫ్ వూను భారత్‌కు చెందిన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన తైవాన్ స్వతంత్ర దేశం అని మాట్లాడారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయడంపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అభ్యంతరం తెలిపింది. భారత్ ‘వన్ చైనా’ అనే దౌత్య పాలసీని పాటిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగం అయినప్పుడు భారత మీడియా ఇలాంటి ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం సరికాదని చైనా ఎంబసీ పేర్కొంది. అయితే చైనా ఎంబసీ అభ్యంతరంపై తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, తైవాన్లు రెండు స్వతంత్ర దేశాలని, తాము ఎవరి చేతిలో తోలు బొమ్మలం కాదని ఘాటుగా సమాధానమిచ్చింది. రెండు దేశాల్లో నియంతృత్వంలో పనిచేసే మీడియా కాకుండా స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉందని ఘాటుగా సమాధానమిచ్చింది. ఇదీ చదవండి.. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ హవా -
రాణి రావడం ఖాయం
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘క్వీన్’కు సీక్వెల్‌గా ‘క్వీన్ 2’ని రూపొందించే చాన్స్ ఉందని ఈ చిత్రదర్శకుడు వికాస్ బాల్ చెబుతున్నారు. కంగనా రనౌత్ లీడ్ రోల్లో రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. 2014 మార్చి 7న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘క్వీన్’ సీక్వెల్ గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు వికాస్. ‘‘క్వీన్’ సినిమా విడుదలై దాదాపు పదేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను ‘క్వీన్ 2’ సినిమా గురించే అడుగుతున్నారు. ‘క్వీన్ 2’కి కథ రెడీగానే ఉంది. ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను కానీ క్వీన్ రావడం ఖాయం’’ అన్నారు వికాస్. ఇక ఈ సీక్వెల్లోనూ కంగనా రనౌత్‌నే కథాకానాయికగా తీసుకుంటారా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వికాస్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సైతాన్’ మార్చి 8న విడుదల కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే వికాస్ ‘క్వీన్ 2’ గురించి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. -
ఇంటర్వ్యూలో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ ముద్దులాట.. దారుణమైన ట్రోల్స్!
యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలు రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతున్నాయి. హద్దులు దాటేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో ఈ డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే మరీ డైరెక్ట్‌గానే భర్తతో ముద్దులాట లాంటిది చేయడం వింతగా అనిపించింది. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొన్న వాసంతి కృష్ణన్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంటని ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ చేశారు. మాట్లాడి వదిలేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండేది కాదు కానీ చేతులతో పట్టుకోకుండా ద్రాక్ష పళ్లు తినిపించడం అనే గేమ్ పెట్టారు. అయితే ఈ గేమ్ చూస్తుంటే లైవ్‌లోనే సరసాలు ఆడినట్లు కనిపించింది. ఇదే ఇంటర్వ్యూలో ఇలానే పలు గేమ్స్ పెట్టారు. తాజాగా వీటికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో.. వీళ్లపై ట్రోల్స్ దారుణంగా వస్తున్నాయి. ఇంటర్వ్యూలో ఇలాంటి పనులేంట్రా బాబు అని తిట్లు అందుకుంటున్నారు. యాంకర్ సంగతి అటుంచితే ఇంటర్వ్యూ ఇచ్చే వారైనా కనీసం ఆలోచించరా అని నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) Anchor ❌ Broker ✅ Telugu telivision shows Chala Devalop ainayi 🤮🤮🤮 pic.twitter.com/Hf73bAnQGY — 𝕋𝔼𝕄ℙ𝔼ℝ🐯 (@faruk97717430) February 17, 2024 -
నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో
'12th ఫెయిల్' సినిమా మీలో ఎంతమంది చూశారు? ఈ మూవీలో హీరో ఎన్నో కష్టాల్ని తట్టుకుని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. దీంతో సినిమా సూపర్‌హిట్ అయింది. అయితే ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మస్సే నిజ జీవితంలోనూ ఇలాంటి కష్టాలే పడ్డాడంట. స్వయంగా ఇతడే ఆ విషయాలన్నీ బయటపెట్టాడు. లక్షలు సంపాదించే స్థాయి నుంచి భార్య ఇచ్చిన డబ్బులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. ఓటీటీల్లో వచ్చిన పలు సినిమాలు-వెబ్ సిరీసుల వల్ల విక్రాంత్ మస్సే.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమయ్యాడు. అయితే మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇతడు పలు సీరియల్స్‌లో హీరోగా నటించాడు. అప్పట్లోనే నెలకు దాదాపు రూ.35 లక్షలకు పైనే సంపాదించాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా వెండితెరపై నటుడు కావాలనుకున్నప్పుడు అసలు కష్టాలు మొదలయ్యాయి. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే సీరియల్స్‌ని వదులుకున్నాడు. దీంతో ఇంట్లో ఖర్చులకు సరిపోలేదు. ఆడిషన్స్‌కి వెళ్దామంటే డబ్బుల్లేవు. ఇలాంటి టైంలోనే విక్రాంత్‌కి ప్రస్తుతం భార్యగా ఉన్న శీతల్ ఠాకుర్ సాయం చేసింది. దాదాపు నాలుగైదు నెలలు ఖర్చులకు డబ్బులిచ్చి ఆదుకుంది. అలా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే క్రమంలో ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డ విక్రాంత్.. ఓటీటీ ట్రెండ్ వల్ల మంచి మంచి పాత్రలు చేసి బోలెడంత పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య '12th ఫెయిల్' చిత్రంతో సినిమాల్లో హీరోగా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో నిజ జీవిత కష్టాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: అసిస్టెంట్ డైరెక్టర్‌తో శంకర్ కూతురి పెళ్లి.. అధికారిక ప్రకటన) -
అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష
బాడీ షేమింగ్ అనేది సినిమాల్లో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు షోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మాట పడిన కమెడియన్స్.. బయటకు నవ్వుతూ కనిపించినా సరే లోలోపల చాలా కుమిలిపోతుంటారు. అయితే ఇలాంటి అనుభవాల్ని ఎప్పుడో ఓసారి బయటపెడితే తప్పితే ఈ విషయాలు బయటకురావు. అలా కమెడియన్ వైవా హర్ష.. తన రంగు, శరీరాకృతిపై ఇండస్ట్రీలో పడ్డ మాటల్ని, ఎదుర్కొన్న అనుభవాల్ని బయటపెట్టాడు. తాజాగా 'సుందరం మాస్టర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవన్నీ రివీల్ చేశాడు. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) 'ఆస్తమా తగ్గడం కోసం చిన్నప్పుడు స్టెరాయిడ్ ఉపయోగించాల్లి వచ్చింది. ఫలితంగా నేను బొద్దుగా అయిపోయాను. స్కూల్ చదువుతున్న టైంలోనే లావుగా ఉన్నానని ఏడిపించేవారు. ట్రైన్లో పేరెంట్స్‌తో వెళ్లాలన్నా సరే చాలా భయంగా ఉండేది. ఎందుకంటే.. 'వాడు చూడు ఎంత నల్లగా ఉన్నాడోనని' అని నన్ను చూపించి.. ఎదురుగా ఉన్నవాళ్లు మాట్లాడుకుంటారని భయంగా ఉండేది' ''కలర్ ఫోటో' సినిమా చేసేంతవరకు కూడా.. అరె మనం ఇండస్ట్రీకి వచ్చిన ఏం చేస్తున్నాం అని అనుకునేవాడిని. కానీ బిల్స్ కట్టడం కోసం ఇష్టం లేకపోయినా సరే పిచ్చి పిచ్చి పాత్రలన్నీ చేశా. ఈ క్రమంలోనే అస్సలు ఇక్కడ ఉండాలనిపించేది కాదు, ఎక్కడికైనా పారిపోవాలనిపించేది.. ఏంటి ఇక్కడికి వచ్చింది ఇది చేయడానికి కాదు కదా అనిపించేది. అప్పట్లో సెట్స్ మీద నా కలర్, బాడీ గురించి జోకులు వేసేవారు. అయినా సరే డబ్బులు కోసం అవన్నీ భరించాను. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరేం కామెంట్ చేయనప్పటికీ.. డిజిటల్ మాధ్యమాల్లో మాత్రం నాపై ఇప్పటికీ జోకులు వేస్తుంటారు' అని వైవా హర్ష చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) -
సీఎం జగన్, చంద్రబాబు మధ్య తేడా ఇదే
ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్‌లో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనించారా? ఎంత అందంగా సాగింది! అందం అన్న పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే రాజ్ దీప్ ఆంగ్లంలో అడిగిన అన్ని ప్రశ్నలకు అందమైన ఆంగ్ల భాషలో చిరునవ్వుతో జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పడం విని సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు దేశ, విదేశాలలో తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో ఎదుటివారిని మెప్పించడం అంటే తేలికైన విషయం కాదు. అందులోను ప్రముఖ పాత్రికేయులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండాలి. వినడానికి కూడా హాయిగా ఉంటుంది. అలా అని తెలుగును విస్మరించాలని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు నేర్చుకుంటూనే ఆంగ్లం, హిందీ వంటి భాషలు అభ్యసిస్తే దేశంలోకాని, విదేశాలలోకాని ఎక్కడైనా సులువుగా ఉపాది అవకాశాలు పొందవచ్చు. జీవితం సాఫీగా సాగిపోతుంది. జగన్మోహన్రెడ్డి ఆంగ్ల మీడియంలో చదువుకోబట్టి దాని విలువను గుర్తుంచుకుని ఏపీలోని స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తేవడానికి యత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చీరాని ఆంగ్లంలో మాట్లాడుతుంటే వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోవడం తప్పుకాదు. కాని భాష రాకపోయినా తాను పండితుడినే అనుకుని మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఏమీ అనకపోయినా, ఎదురుగా మాట్లాడకపోయినా, ఆ తర్వాత నవ్వుకుంటారు. దానివల్ల ఆయన నాయకత్వం వహించే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చిన్నతనంగా ఉంటుంది. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్, లండన్ పర్యటనల సందర్భంగా ఆంగ్ల భాష పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారన్నది అర్ధం అవుతుంది. ఒక విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. బయటనుంచి వచ్చే ప్రముఖులకు తెలుగు రాదు. అందువల్ల వారు ఆంగ్లంలోనే మాట్లాడుతుంటారు. దానిని మనం అర్ధం చేసుకుని సమాధానం ఇవ్వకపోతే సంభాషణ గందరగోళంగా మారుతుంది. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తమకు వచ్చిన భాషలోనే మాట్లాడి అనువదించుకోవాలని చెప్పాలి. జగన్మోహన్రెడ్డికి ఆ ఇబ్బంది లేదు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో రాజ్ దీప్ సర్దేశాయి ఆంగ్లంలో అడిగిన ప్రశ్నలకు ఎక్కడా తడుముకోకుండా స్పష్టమైన జవాబులు ఇచ్చారు. గతంలో చంద్రబాబు ఇదే రాజ్ దీప్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ప్రధాని మోదీని ఆయన తీవ్రంగా విమర్శించేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఏమి చెబుతున్నది అర్ధం చేసుకోవడానికి రాజ్ దీప్ కష్టపడవలసి వచ్చింది. మోడీని ఫలానా విధంగా విమర్శిస్తున్నారా? అని రాజ్ దీప్ మళ్లీ అడిగి తెలుసుకోవలసి వచ్చింది. తిరుపతిలో జగన్మోహన్రెడ్డి చక్కగా మాట్లాడారు. అందుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ అంత నీట్‌గా జరిగింది. అంతేకాక రాజ్ దీప్తో పాటు ఇండియా టుడె ప్రతినిధి బృందం స్వయంగా తిరుపతిలో నాడు-నేడు కింద ఆధునీకరించిన కొన్ని స్కూళ్లను చూసి వచ్చారు. స్కూళ్లు మారిన తీరును గమనించి వారు ఆశ్చర్యపోయారు. స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మంచి మౌలిక వసతులు, స్టార్ హోటల్ స్థాయి టాయిలెట్లు, ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్‌కు చిన్నతనం నుంచే ట్రైనింగ్ వంటి విశేషాలు తెలుసుకుని ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు చేయడం ఎక్కడా చూడలేదని స్పష్టంగా చెప్పారు. ఇదే విధానం కొనసాగితే విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు స్కూల్ డ్రెస్‌ల మొదలు, వారు తినే గోరుముద్ద వరకు ఎంత శ్రద్ద తీసుకుంటున్నది వివరించారు. పిల్లలకు చదువే సంపద అని తన ప్రభుత్వం నమ్ముతోందని, అందుకే ఈ విదమైన మార్పులు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటివారు తెలుగు మీడియంకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా అని రాజ్ దీప్ అడిగినప్పుడు జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు తమ పిల్లలు, తమ మనుమళ్లు ఎక్కడ ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించుకోవాలని జవాబు ఇచ్చారు. ఏపీలో పుస్తకాలన్నిటిని రెండు భాషలలోను ముద్రించిన సంగతిని ఆయన వివరించారు. నిజంగానే వెంకయ్య నాయుడు కాని, చంద్రబాబు నాయుడు కాని, పవన్ కళ్యాణ్ కాని, రామోజీరావు కాని.. వీరెవ్వరూ తమ పిల్లలను, మనుమళ్లను తెలుగు మీడియంలో చదివించడం లేదు. కాని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఆంగ్ల మీడియానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. దీనిపై బహుశా దేశంలో ఎక్కడా జరగనంత చర్చ ఏపీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా జగన్మోహన్రెడ్డి వివరించారు. ఇంత మార్పు జరుగుతుంటే సరైన ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారని రాజ్ దీప్ ప్రశ్నించడం విశేషం. ఇంతకాలం కేరళ రాష్ట్రం విద్యారంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఏపీలో క్రమేపి ఆ స్థానానికి చేరుకుంటోంది. ఈ మద్య తెలంగాణకు చెందిన ప్రముఖ మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఒక సెమినార్లో మాట్లాడుతూ ఏపీలో స్కూళ్లలో తీసుకువచ్చిన విశేషమైన సంస్కరణలు, ఆంగ్ల మీడియంలో బోధన వంటివాటి గురించి ప్రస్తావించి వీటిని కొనసాగించాల్సిన అవసరం ఎంతగానో ఉందని అన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన అభినందిస్తూ ఒకవేళ అవి కొనసాగకపోతే ఏపీ వందేళ్లు వెనక్కి పోతుందని హెచ్చరించారు. విద్యార్ధులంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన పరోక్షంగా చెప్పారు. తాను ఇంతవరకు జగన్‌మోహన్‌రెడ్డిను కలవలేదని, కలవబోవడం లేదని, అయినా అక్కడ విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను గమనించి ఇలా వ్యాఖ్యానిస్తున్నానని కంచ ఐలయ్య అన్నారు. చంద్రబాబు కొడుకు, కోడలు, మనుమడు అంతా ఇంగ్లీష్‌లో చదవాలి కాని, దళిత, కమ్మరి, కుమ్మరి, కురుమ, మంగళి తదితర బీసీ వర్గాలు మాత్రం ఆంగ్లమాద్యమంలో చదువుకోరాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ తప్పనిసరిగా ఆంగ్ల బోధన ఉండాలని కోరుకున్నారని కూడా ఐలయ్య చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్మోహన్రెడ్డి ఏపీలో చేస్తున్న కృషికి ఇప్పుడిప్పుడే గుర్తింపు రావడం ఆరంభం అయింది. గత ఏడాది ఏపీ పిల్లలు అమెరికాకు వెళ్లడం, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడడం వంటివి చేయడంతో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించింది. ఈ నేపధ్యంలో ఈ సమ్మిట్ జరగడం, ఏపీలో విద్యారంగంలో సాగుతున్న సమూల మార్పులకు మంచి ప్రాధాన్యం రావడం శుభపరిణామం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో సీఎం జగన్
-
‘ప్రభుత్వ డిగ్రీ’తో ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ‘ప్లేస్మెంట్ల’లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్‌ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్–ప్రొఫెషనల్ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. మార్కెట్ ఓరియెంటెడ్ నైపుణ్యం దేశంలోనే నాలెడ్జ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యారి్థనిని ‘జాబ్ రెడీనెస్’ ఓరియెంటేషన్తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రొసెసింగ్, ఎల్రక్టానిక్స్, టూరిజం–హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్íÙప్, గ్రీన్‌జాబ్స్, రిటైల్ సెక్టార్ వంటి రంగాల్లో మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్‌ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను, యాప్‌ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్‌లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రిసోర్స్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్ సెల్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్ ట్యూటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో.. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్గ్రూప్, రిటైల్ విభాగంలో ఫ్లిప్‌కార్ట్, డీమార్ట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, స్టార్టెక్ హెల్త్‌తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్‌ప్లస్, బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బియం, హెచ్1హెచ్ఆర్తో పాటు ట్రాన్స్‌పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్‌సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్‌స్ట్రీట్ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటే ఉద్యోగం.. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎనలిటికల్ థింకింగ్ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. – పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య -
ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను
‘‘ప్రతి యాక్టర్ కెరీర్లో ఓ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఉంటుందంటుంటారు. నా కెరీర్లో ‘హను–మాన్’ని నా బెంచ్ మార్క్ ఫిల్మ్‌గా ఫీలవుతున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. క్లైమాక్స్‌లో ఓ సన్నివేశం కోసం రోప్ సాయంతో ఐదు రోజులు గాల్లోనే ఉన్నాను. రెండున్నరేళ్లు ఏ సినిమా ఒప్పుకోలేదు. యాక్టర్‌గా నా కెరీర్ పరంగా, నా వయసు పరంగా ఈ రెండున్నరేళ్ల కాలం చాలా కీలకమైనది. ‘హను–మాన్’ సక్సెస్ కావడం సంతోషంగా ఉంది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హను–మాన్’. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ‘హను–మాన్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతూ, శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో తేజ సజ్జా పంచుకున్న విశేషాలు. ∙తెలుగుతో పాటు హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా ‘హను–మాన్’ బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ రానంత స్పందన ఈ సినిమాకు హిందీలో వస్తోందని చెబుతున్నారు. మా సినిమాకు కాస్త సింపతీ వర్కౌట్ అయ్యిందని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా సినిమా ట్రైలర్, టీజర్ చూసి హిందీ, కన్నడవారు మమ్మల్ని అడిగి సినిమా తీసుకున్నారు. ఏం జరి గినా అంతిమంగా సినిమానే మాట్లాడుతుంది. సినిమానే నిలబడుతుంది. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు, ప్రశాంత్‌వర్మ ‘హను–మాన్’ సినిమాను బాగా చేశారు. ‘హను–మాన్’ సినిమా సమయంలో నేను ఇతర సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఆ సినిమాల ఇంపాక్ట్ ‘హను–మాన్’ పై పడకూడదని. ఈ సినిమా సక్సెస్ మా అందరిదీ. ఈ సినిమా యూనిట్ సభ్యులు వారి వారి డిపార్ట్మెంట్స్లోనే కాక, ఇతర క్రాఫ్ట్స్‌లో కూడా కలుగజేసుకుని బాధ్యతగా చేశారు. ఉదాహరణకు నా లుక్ లోని కొన్ని కాస్ట్యూమ్స్‌కు మా సినిమా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారు. ఈ సినిమా విషయంలో మొదట్నుంచి ఏదో ఆధ్యాత్మిక శక్తి మమ్మల్ని ముందుకు నడిపిందని నా నమ్మకం. ‘హను–మాన్’ సినిమాను మేం చేయలేదు. ‘హను–మాన్’ సినిమా మా చేత చేయబడింది. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని మేం అనుకుంటున్నాం. ‘హను–మాన్’ సినిమాలోని హనుమంతుని విగ్రహం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. గ్రాఫిక్స్ అలా చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. క్లైమాక్స్ చిత్రీకరణకు 60 రోజులకు పైగా సమయం పట్టింది. ‘హను–మాన్’ప్రాజెక్ట్ గురించి చిరంజీవిగారికి తెలుసు. ఈ సినిమాలోని హనుమంతుని పాత్ర గురించి ఆయనకు తెలుసు. మా ఇంటెన్షన్ హనుమంతుని పాత్రలో చిరంజీవిగారు అనే. ఆ సంగతి అలా ఉంచితే చిరంజీవిగారు ఇంకా ‘హను–మాన్’ సినిమా చూడలేదు. అయితే రిలీజైన రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపారు. -
'హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ ఎవరంటే'.. యావర్ కామెంట్స్ వైరల్!
బిగ్‌బాస్ సీజన్-7 రియాలిటీ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వినర్‌గా అవతరించాడు. టాప్-2లో ఉన్న అమర్దీప్, ప్రశాంత్ నిలవగా.. చివరికీ రైతుబిడ్డనే ట్రోఫీని సాధించాడు. అయితే అంతకుముందు టాప్-3 కంటెస్టెంట్, యావర్-4 స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే యావర్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఎలిమినేట్ అయ్యారు. అయితే షో ముగిసిన తర్వాత బయటకొచ్చిన యావర్ ఇంటర్వ్యూలో యాంకరప్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం) యావర్ మాట్లాడుతూ..' నేను నా ఫ్యామిలీ కోసమే రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని వచ్చేశా. టైటిల్ గెలవడమనేది పెద్ద విషయం కాదు. హౌస్‌లో మోస్ట్ కన్నింగ్ పర్సన్ శోభా అని.. మాస్క్ వేసుకుని ఉన్న వ్యక్తి అమర్దీప్. సింపతీ కోరుకునేది అశ్విని.. డబుల్ యాక్షన్ గౌతమ్.' అంటూ సమాధానలిచ్చాడు యావర్. అంతే కాకుండా నాకు తెలుగు రాదు అన్నమాటను నీకు అనుకూలంగా మార్చుకున్నావా? అని యాంకర్ ప్రశ్నించగా.. గట్టిగా నవ్వేశాడు యావర్. ఇదంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన శైలిలో ఆన్సరిచ్చాడు. -
ప్రయోగాలు చేసే సమయం ఇది!
‘‘నా కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. -
interview: శత్రువును ప్రేమించే గుణం నాది: కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
‘పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. నల్లగొండను కేసీఆర్ దత్తత తీసుకుని ఒక్క రోడ్డు వేసి ఇంకా దత్తత అయిపోలేదని మాయమాటలు చెబుతుండు. ఆ మాటలు నమ్మితే మళ్లీ మోసపోతాం. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా పని చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అందరి కష్టాలు తీరుస్తాం. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయడంతోపాటు పేదలకు ఇళ్లు నిర్మిస్తాం’ అని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. –నల్లగొండ అధికారంలోకి వస్తాం.. అందరి కష్టాలు తీరుస్తాం నల్లగొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో ఆదరించి 20 ఏళ్లు ఆశీర్వదించారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. గత ఎన్నికల్లో కేసీఆర్ దత్తత పేరుతో మాయమాటలు చెబితే ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ, నల్లగొండలో ఐదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడే నల్లగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశాను. అప్పటి సీఎం వైఎస్ఆర్ను ఒప్పించి శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను మంజూరు చేయించాను. 250 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్మించా. పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రైల్వే ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించాను. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్‌లా నియంతలా వ్యవహరిస్తూ తొక్కి చంపుతా అని బెదిరిస్తున్నారు. అంతేకాదు భూకబ్జాలు, అక్రమ దందాలు పెరిగిపోయాయి. నాకు అవకాశం ఇవ్వండి. నల్లగొండలో రౌడీయిజం లేకుండా చేస్తా. శత్రువును ప్రేమించే గుణం నాది. నా కొడుకు పేరున ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద వారిని ఆదుకుంటున్నా. మీ పిల్లల్లో నా కొడుకును చూసుకుంటా. నా కూతురు పెళ్లి అయిపోయింది. నాకు మీ సేవ తప్ప మరొకటి లేదు. నల్లగొండలోనే ఉంటా. మీతో బతకాలని వచ్చా. మరోసారి ఆశీర్వదించండి. నాతోపాటు ఎన్నికల్లో నా భార్య, కూతురు మీ వద్దకు ఓటు అడగడానికి వచ్చారు. సమయభావం వల్ల కొందర్ని కలువలేకపోయా. 30వ తేదీన చేయి గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలి. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇస్తుంది. గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు మిగతా ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం. విద్య వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల ఇస్తాం. నల్లగొండలో ఐటీ పార్కు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. పాటు ఇళ్లు లేని వారికి ఇల్లు, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తాం. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనమే. మాయ మాటలు నమ్మి బీఆర్ఎస్కు ఓటేసే గోస పడతాం. విజ్ఞులైన ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటేయాలి. కేసీఆర్‌ది దొంగ దీక్ష తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష, ఆస్పత్రిలో మెడిసన్ తీసుకుని ఆయన దీక్ష చేశారు. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. మణిపూర్‌లో ఒక మహిళ 13 ఏళ్లు మెడిసన్ తీసుకుని దీక్ష చేసింది. విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సాధించినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఏ మేలూ జరగలేదు. రైతు బంధు అమెరికాలో ఉన్న వారికి ఇస్తుంది. మంత్రి మల్లారెడ్డి కూడా తీసుకుంటున్నాడు. కేసీఆర్‌ది అంతా ఉన్న వారిని దోచి పెట్టడమే. ఇది చదవండి: ఓటు ఎవరికి అంటే.. కాకే మన ఆదర్శం! -
గెలిచినా, ఓడినా.. ప్రజల కోసమే పనిచేస్తా
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలిగా ఆమె కోడలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇప్పుడు హుజూర్నగర్ నుంచి సీపీఎం అభ్యర్థీగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. మల్లు స్వరాజ్యం రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 40 ఏళ్ల తర్వాత అదే కుటుంబం నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివిధ అంశాలపై మాట్లాడారు. ఆమె మాటల్లోనే.. మహిళల సంక్షేమం, అభివృద్ధిపై వివక్ష.. మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయి. పాలకులెవరైనా కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెబుతున్నాయే తప్ప ఆచరణలో పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. మల్లు స్వరాజ్యం కోడలిగా ఆమె చూపిన బాటలో నడుస్తున్నా. ప్రజా పోరాటాలు చేసినా, ప్రజాస్వామిక ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపించవచ్చనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలిచాను. గెలిచినా, ఓడినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతా. మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమానత్వం, మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా. అత్తామామల ప్రోద్బలంతోనే.. మా అత్తామామ మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నా భర్త నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. వివాహం అయ్యాక అత్తమామల ప్రోద్బలంతో కుటుంబాన్ని చూసుకుంటూనే చదువుకున్నా. డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశా. రాజకీయ అవగాహన ఉంది సీపీఎం అనుబంధ ప్రజా సంఘమైన ఐద్వాకు లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశా. ఐద్వా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. తెలంగాణ వచ్చిన తర్వాత ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి సీపీఎం తరఫున పోటీచేశా. పోరాటమే గెలిపిస్తుంది నిత్యం ప్రజల్లో ఉంటూ మహిళలు, కార్మిక సమస్యలపై పోరాడాను. సూర్యాపేట మండలం రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశాను. పోలీసుల లాఠీచార్జ్‌లకు గురయ్యా.. జైలుకు వెళ్లా. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడాను, ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నిరంతరం ప్రజల కోసం పోరాడా.. ఆ పోరాటమే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆశిస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఉపాధిహామీ పనులను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసేలా కృషిచేస్తా. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న మిర్చి, పత్తి పంటలకు వాటికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు. శీతల గిడ్డంగులు లేవు. హుజూర్‌నగర్‌లో మహిళా డిగ్రీ కళాశాల కావాలి. మండలానికి ఒక పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ ఉండాలి. సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్టులు సరిగా పనిచేయడం లేదు. పోడు భూములకు పట్టాలు లేవు. ఇలా నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తా. - చింతకింది గణేశ్ -
హోస్లో పాము, ఊసరవెల్లి లాంటి వాళ్లు ఉన్నారు.. అశ్విని కామెంట్స్ వైరల్!
సెల్ఫ్ గోల్ వేసుకుని బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని. డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పినా.. తనకు తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో హోస్ నుంచి బయటకి వచ్చేసింది. తాజాగా బిగ్‌బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విని ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి.. నాకు ఎవరితోనూ సెట్ కాలేదు.. దీనికంటే హౌస్ నుంచి వెళ్లిపోవడమే మేలని అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది. సరైన కారణాలు కనిపించక సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు ఏం ఉపయోగం అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కు బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని ఎమోషనల్ అయింది. నేను ఏం చేస్తే వాళ్లకేందుకుండి అంటూ బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శోభ, ప్రియాంక, అమర్ ఒక గ్రూప్ కాగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్‌గా తయ్యారని తెలిపింది. నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని.. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించానని వెల్లడించింది. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంకను ఊసరవెళ్లితో పోల్చింది అశ్విని. పైకి ఒకలా కనిపిస్తుంది.. కానీ లోపల ఆమె వేరేలా ఉంటుందని చెప్పింది. ప్రశాంత్‌కు భజన చేశారా? అని ప్రశ్నించగా.. భజనేంటండి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ పాములాంటి వారని తెలిపింది. అందుకే హౌస్‌లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చిందని పేర్కొంది. -
ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా
సాక్షి, నిజామాబాద్: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్ నగరం ఏ విధంగా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసని పేర్కొన్నారు. తనకన్న ముందు ఉన్నవారు నగరాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇందూరును దేశంలో మొదటి స్థానంలో ఉంచడానికి అనుక్షణం శ్రమిస్తానని హామీ ఇచ్చారు.' ఎన్నికల నేపథ్యంలో గణేశ్‌గుప్తాతో సాక్షి ఇంటర్వ్యూ.. – నిజామాబాద్ నాగారం నగర అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ► నిజామాబాద్ నగరాన్ని ఇప్పటి వరకు రూ.వేయి కోట్లతో అభివృద్ధి చేశాను. విశాలమైన రోడ్లు, డివై డర్లు, పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, మినీ ట్యాంక్‌బండ్, సమీకృత మార్కెట్ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే అండర్ బ్రిడ్జి, ఐటీ హబ్, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తి చేశాను. 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు నును చేయబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మోడల్ బుక్లెట్ పంపిణీ చేశా. దానిని ఐదేళ్లలో పూర్తి చేసి ప్రజల కళ్ల ముందు ఉంచాను. యూజీడీ పనులు పూర్తయ్యాయా? ► ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే జరిగా యి. రోడ్లను మధ్యలో తవ్వేయడంతో రాకపోకలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో సీఎం కేసీఆర్ ను అడిగి నిధులు తెచ్చి 2019లో యూజీడీ పనులు పూర్తి చేయించాను. ప్రతి ఇంటి నుంచి యూజీడీకి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి ఒక్కొక్కరికి రూ.8 వేలకు పై గా ఖర్చు అవుతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ను ఒప్పించి రూ.45కోట్ల నిధులు తెచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేయించాను. ఎన్నికలు పూ ర్తి కాగానే ఈ పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం నగరంలో తాగునీటి సమస్య ఉందా? ► నగరంలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు చెక్ పెట్టడానికే మిషన్ భగీరథ ద్వారా పైపులైన్లు వేశాం. 24గంటల పాటు మంచినీరు సరఫరా చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ► నేను అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. నగరంలో ఉన్న పరిస్థితులు, సమస్యలు పరిశీలించి పరిష్కరించా. నేను చేసిన అభివృద్ధిపై బుక్లెట్ ప్రింట్ చేసి ఇంటింటికి పంచుతూ ఓట్లు అడుగుతున్నా. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలే నా ధైర్యం, నమ్మకం.. మూడోసారి గెలిపిస్తారని నమ్ముతున్నా. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారం చేపట్టారు. అన్ని కులాలకు దగ్గరయ్యారా? ► నేను ఎల్లవేళలా ప్రజలతో ఉన్నా. నగరంలోని అ న్ని డివిజన్లలో పర్యటించాను. కులమతాలకు అతీతంగా కుల సంఘాలకు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు నిధులు ఇచ్చి భవనాలు పూర్తి చేయించాను. ఆత్మీయ సమ్మేళనాలతో నేను ఏం చేశానో ప్రజలకు వివరించాను. ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ► సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. మరోసారి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.5లక్షల కేసీఆర్ భీమా, సన్నబియ్యం, ఆసరా పెన్షన్ రూ.5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు, రైతు బంధు రూ.16వేలు, మహిళలకు రూ. 3 వేలు అందిస్తాం. చేసిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం చేస్తున్నాం. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ► ఎన్నికలు వస్తాయి, పోతాయి. రకరకాల పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక్కసారి గుండె మీద చె య్యి వేసి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. నేను తొమ్మిదిన్నర ఏళ్లలో నగరాన్ని ఎవరూ చేయని వి ధంగా అభివృద్ధి చేశా. నా కన్న ముందు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసినా అభివృద్ధి చేయలేదు. అ నుక్షణం ప్రజల్లో ఉండి ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తూ, సదుపాయాలు కల్పించా. నగరాన్ని రాష్ట్రంలో, దేశంలో నంబర్ వన్‌గా ఉంచడాని కి కష్టపడుతునే ఉన్నాను. ఏ కష్టం వచ్చినా ప్రజల కు అండగా ఉంటున్నా. అందుకే ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. ఇవి కూడా చదవండి: త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. -
అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తా..! : వడ్డి మోహన్‌రెడ్డి
సాక్షి, నిజామాబాద్: 'అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో, తానేంటో చూపిస్తానని బోధన్ బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందని గ్రహించిన ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బోధన్‌లో అవినీతి పేరుకు పోయిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని అన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీచేస్తున్నానని ప్రజలు ఆదరించి బీజేపీని గెలిపించాలని కోరారు.' అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వడ్డి మోహన్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. – బోధన్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? ► నియోజకవర్గంలో నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. యువగర్జన సభకు ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. నియోజకవర్గంలో రెండో రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా రానున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ సమాధానం? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అంతా అవినీతే జరిగింది. నియోజక వర్గంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట రుణమాఫీ, భూసమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే షకీల్ దృష్టి సారించలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది. పదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది? ► బోధన్ గత వైభవాన్ని కోల్పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. దీంతో చెరుకు రైతులు, వ్యాపార వర్గాలు, కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయి. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరగలేదు. ఎన్నికల పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యేనా..? ► ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలిచే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో విజయం. నిజాంషుగర్స్ పునరుద్ధరణపై మీరిచ్చే హామీ..? ► ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం. ఇచ్చిన హామీని బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే అన్న ఆరోపణపై..? ► బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు. ఆ పార్టీలే లోపాయి కారి ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయి. 2006లో నవీపేట జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు తనను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయి. ప్రజలకు మీరిచ్చే హామీలు? ► బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని హామీలను నెరవేరుస్తాం. మూతపడిన నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. రూ. పది లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆడపిల్లల వివాహాలకు రూ.2 లక్షలు అందిస్తాం. ప్రజల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా..? ► నేను 25 ఏళ్ల నుంచి రాజకీయ ప్రజా జీవితంలో కొనసాగుతున్నా.. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడిని. తొలిసారిగా బోధన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నా. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను గెలిపించిన ప్రజలు ఈ సారి బీజేపీకి అవకాశం కల్పించాలని కోరుకుంటన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఇవి చదవండి: ప్రజలే నా ధైర్యం.. నమ్మకం! : బిగాల గణేశ్‌గుప్తా -
ప్రజారవాణాపై ఎజెండా ఎక్కడ?
‘‘జన జీవనంలో రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. కానీ ప్రజారవాణాపై పాలకులకు గానీ రాజకీయపార్టీలకు గానీ ఎజెండా లేకుండా పోతోంది. మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాల గురించి చెప్పుకొస్తున్నా.. రవాణా వ్యవస్థపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకటించడం లేదు. సౌకర్యవంతమైన ప్రజారవాణా కల్పిస్తామని హామీ ఇవ్వడం లేదు. ప్రజలకు రవాణా వ్యవస్థ సౌకర్యవంతంగా ఉంటే..బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లే. అలాంటి ఆదాయం ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. రూ. వేల కోట్లతో మెట్రో, ఫ్లైఓవర్లు కడుతున్నా.. రోడ్లపై సురక్షితంగా నడించేందుకు ఫుట్‌పాత్‌లు లేని పరిస్థితి ఉంది..’’ అని రవాణారంగ నిపుణుడు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. జనాభా పెరుగుతున్నా.. సరిపడా బస్సులేవి? పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణాను అందించే విషయమై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష మంది జనా భాకు 60 బస్సులు అవసరం. ఆ లెక్కన కోటి జనాభా దాటిన హైదరాబాద్‌లో ఎన్ని బస్సులుండాలి..? ప్రస్తుతం రాష్ట్రం మొత్తం తిరుగుతున్న బస్సులను హైదరాబాద్‌లోనే తిప్పాల్సి ఉంటుంది. ప్రయాణికులు వీలైనంత మేర సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే పరిస్థితి రావాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇటు ప్రభుత్వానికి, అటు ప్రయాణికులకు మంచి జరుగుతుంది. కానీ మన దగ్గర అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర పురోగతిని ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోల్చే ముందు మన దగ్గర రవాణా వ్యవస్థ, రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. చంద్రబాబు ఆర్టీసీని దెబ్బ తీశారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీసీ కోలుకోని విధంగా దెబ్బతింది. చార్జీలు అడ్డగోలుగా పెంచుతూ పోయారు, ఫలితం.. ఆర్టీసీలో సమ్మెలకు దారితీసింది. పాదచారులు సురక్షితంగా నడిస్తేనే.. కేసీఆర్ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఆర్టీసీకి ఏవిధమైన ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ప్రజారవాణాకు ఇప్పటికీ ఆర్టీసీనే వెన్నెముక. కానీ దాని పట్ల ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫ్లైఓవర్ల మీద ఉన్న శ్రద్ధలో వందోశాతం కూడా ఫుట్‌పాత్‌ల మీద లేదు. దాంతో నడవడం, రోడ్లు దాటడం కూడా ప్రమాదకరంగా మారింది. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మూడు శాతం పాదచారులే బలవుతున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచే నగరాలనే ప్రపంచ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ఫుట్‌పాత్, బస్‌స్టాప్‌లు ఎక్కడ అనేక దేశాల్లో ఫుట్‌పాత్ అంటే రోడ్డులో ఒక భాగం. కానీ మన దగ్గర మాత్రం ప్రయాణికులు నడవాలంటే సరైన ఫుట్‌పాత్‌లే ఉండవు. ఒక్కసారి ఎర్రగడ్డ నుంచి ఎల్బీనగర్ వరకు చూస్తే ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. రూ.వేల కోట్లతో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా.. పాదచారుల కనీస అవసరమైన ఫుట్‌పాత్‌లను మాత్రం తీవ్రంగా విస్మరిస్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి వచ్చే నేతలు అక్కడి ఫుట్‌పాత్‌లను చూసి కూడా తీరు మార్చుకోకపోవటం విడ్డూరం. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి విస్తరిస్తున్న నగరాల్లో సైకిల్ ట్రాక్ కూడా అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చెందిన ఎన్నో నగరాల్లో జనం సైకిళ్లను విస్తృతంగా వాడుతున్నారు. ఇది వాహన రద్దీని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్ నగరం అలాంటి వ్యవస్థకు దూరంగా ఉంది. ఎక్కడో ఓ చోట నిర్మించాం చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నగరం చుట్టూ సైకిల్ ట్రాక్ ఉండాలి. పీక్ అవర్‌పై దృష్టి పెట్టాలి కీలక సమయాలుగా పేర్కొనే వేళల్లో రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు పక్కా ప్రణాళిక అవసరం. ఆయా వేళల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉండాలి. హైదరాబాద్‌లో చూడండి.. పీక్ అవర్స్‌లో సొంత వాహనాలు రోడ్లను ట్రాఫిక్ జామ్‌లతో నింపేస్తున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలను విస్మరించండి అంటూ అభివృద్ధి చెందిన దేశాల్లో సూచనలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా ఆ మార్గాల వైపే వెళ్లాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మనదగ్గర అలాంటి వ్యవస్థ లేదు. ఓట్ల కోసమే ఆరాటం తప్ప.. నేతలు కేవలం ఓట్ల కోసం మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఎలాంటి అంశాలు చేరిస్తే ఎక్కువ ఓట్లు వస్తాయన్న వాటిపైనే ఆలోచిస్తున్నారు. ప్రజా రవాణాను మెరుగుపరుస్తామని చెబితే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే మేనిఫెస్టోల్లో ఆ అంశాన్ని చేర్చటం లేదు. ప్రజా రవాణా వ్యవస్థపై రాజకీయ పార్టీలకు ఎంత చులకన భావం ఉందో ప్రస్తుత మేనిఫెస్టోలను చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు బయటికొస్తే ఆదాయం వచ్చినట్టే కదా ప్రజా రవాణా వ్యవస్థను గాలికొదిలేయడం వల్ల వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి.చాలా దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు అవసరాల నిమిత్తం రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ఆదాయం వచ్చినట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు చూడడంలేదో అర్థం కావడంలేదు. -గౌటే దేవేందర్ -
విధేయతే నా బలం.. సీఎల్పీ నేత భట్టి
రాష్ట్ర సంపదను ప్రజలకు పంపిణీ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఆ ఆలోచనతో ముందుకెళుతున్నామని అంటున్నారు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు బీఆర్ఎస్ ఓడిపోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారాయన. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం సీతానగరం, పెదబీరవెల్లి, చినబీరవెల్లి, నారాయణపురం, జానకీపురం, రావినూతల గ్రామాల్లో ఆయన ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు, కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహం, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల వైఖరి, అభివృద్ధి ప్రణాళికలతో పాటు తనకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలపై ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.! ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలెందుకు గెలిపించాలి? రాష్ట్ర సంపదను ప్రజలకు పంపిణీ చేయాలన్నదే కాంగ్రెస్ ఆలోచన. పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయం, సేవా రంగాల అభి వృద్ధి ద్వారా సంపదను సృష్టించి దానిని ఎలా పంచుతామో ఇప్పటికే ప్రజలకు చెప్పాం. ఇంటింటికీ మా గ్యారంటీ కార్డులు పంపిణీ చేశాం. ఆత్మగౌరవం, సంపద పంపిణీనే ఈ ఎన్నికల్లో ప్రచారా్రస్తాలు. ప్రజలు మా వాదనను అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈసారి గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారు 80కి పైగా స్థానాల్లో విజయం సాధించి ఈసారి అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్, బీజేపీల గురించి ఏం చెప్తారు? ఆ రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్ఎస్కు ఇక్కడ ఓటేయడమంటే నేరుగా ఢిల్లీలో బీజేపీకి ఓటేసినట్టే. ప్రజలు బీఆర్ఎస్కు ఓటేస్తే.. బీఆర్ఎస్ బీజేపీకి ఓటేస్తుంది. బీఆర్ఎస్–బీజేపీల బంధం గురించి కొత్తగా మేం చెపాల్సింది ఏమీ లేదు. గత పదేళ్ల చరిత్ర చెపుతోంది అదే. తెలంగాణకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువు అని కేసీఆర్ అంటున్నారు కదా? తెలంగాణ ప్రజల ప్రధాన శత్రువు కేసీఆర్. అడుగడుగునా దోపిడీలు, అక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఆయన తపనపడుతున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ పూర్తిగా నిర్విర్యం చేశారు. బాంచన్ దొర బతుకుల కోసమే కేసీఆర్ ప్రయత్నం. ఎంఐఎం మిమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నట్టుంది? బీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతిస్తే బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుంది. బీఆర్ఎస్ టూ బీజేపీ వయా ఎంఐఎం అన్నట్టుగా ఈ మూడు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. నిజమైన లౌకిక వాద పార్టీ కాంగ్రెస్ మాత్రమే. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేది మేమే. రాష్ట్రంలోని మైనార్టీలందరూ ఆలోచించాలి. కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా లౌకికవాద మనుగడకు వారంతా చేయూతనందించాలి. మీ పార్టీ నేతలపై ఐటీ దాడుల గురించి ఏమంటారు? బీఆర్ఎస్ చెపుతుంటే బీజేపీ మా నాయకులపై ఐటీ దాడులు చేస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు. ప్రతిపక్షాలను లొంగదీసుకుని, బీజేపీ ఇచ్చిన శక్తిని కూడగట్టుకుని రాష్ట్రంలో మనుగడ సాగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీసీల గురించి రాహుల్‌గాంధీ కూడా పదేపదే మాట్లాడుతున్నారు? దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందని ఇప్పటికే మా నాయకుడు రాహుల్‌గాంధీ చెపుతున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సమున్నతి కోసం మేం కట్టుబడి ఉన్నాం. అందుకే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని మేం మేనిఫెస్టోలో చెబితే, బీసీల జనగణన దేశమంతా చేస్తామని రాహుల్‌గాంధీ చెబుతున్నారు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడే సీఎంకు బీసీ సబ్‌ప్లాన్‌పై లేఖ రాశా. బీసీలకు గౌరవమిచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. పాదయాత్ర అనుభవాలు ఎన్నికల్లో ఉపయోగపడుతున్నాయా? నా పాదయాత్ర ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యకు తెచ్చా. నా పాదయాత్ర సందర్భంగానే మంచిర్యాల,జడ్చర్ల, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పడమే కాకుండా మా పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగాం. పాదయాత్ర సందర్భంగా ప్రజలు వివరించిన సమస్యలకు మా మేనిఫెస్టోలో స్థానం కల్పించాం. వాటికి పరిష్కారం చూపెడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారని అనుకుంటున్నారా.? నేను కాంగ్రెస్ మనిషిని. పార్టీకి విధేయుడిని. నా విధేయతే నాకు పెద్ద బలం. ఎన్ఎస్యూఐ, యూత్‌కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేశా. అసెంబ్లీలో చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ హోదాల్లో పాలనానుభవం సంపాదించా. సీఎల్పీ నాయకుడిగా రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల అభిమానం చూరగొన్నా. వారి అభిమానమే నాకు బలగం. పార్టీకి సంస్థాగత వారసుడిని. నాకు ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పేముంటుంది. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన పదవి విషయంలో పార్టీ అ«ధిష్టానం కూడా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు శిరోధార్యమే. జలగం వెంగళరావు లాంటి హోదా వస్తుందని అందుకే అన్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది. అనేక భావజాలాలు, ఆలోచనలు, పరిణతి చెందిన రాజకీయాలకు ఖమ్మం పెట్టింది పేరు. చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది. మా జిల్లాకు చెందిన జలగం వెంగళరావు సీఎల్పీ నాయకుడిగా పనిచేశారు. నేను కూడా సీఎల్పీ నాయకుడిగా చేశా. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే ఆయన లాంటి హోదా వచ్చే అవకాశం ఉందని నా నియోజకవర్గం, జిల్లా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అందుకే అలా చెప్పా. మీ ప్రచార సభల్లో సీఎం.. సీఎం అనే నినాదాలు వినిపిస్తున్నాయి? అది వారి మనసులో ఉన్న కోరిక కావొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే ముందు పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిగా ఎన్నికవ్వాలి. ఇప్పటికే నేను సీఎల్పీ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నా నియోజకవర్గ ప్రజలు ఆశతో ఉన్నారేమో. అందుకే అలాంటి నినాదాలు మీకు వినిపించి ఉంటాయి. పదవుల సంగతి ఎలా ఉన్నా పార్టీని గెలిపించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వం కలిసికట్టుగా పనిచేస్తోంది. -మేకల కళ్యాణ్ చక్రవర్తి -
అందుకే మమ్మల్ని కాంగ్రెస్ వదిలేసింది
బొల్లోజు రవి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తు కోసం ఇన్నాళ్లు ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ మిర్యాలగూడ స్థానం సహా రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే మద్దతు ఉంటుందని, లేకుంటే ఉండదని సీపీఎం తేల్చిచెప్పింది. దీంతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా బరిలోకి దిగింది. కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం, కాంగ్రెస్‌తో సీపీఐ వెళ్లిపోవడం, ఒంటరిపోరు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు విఫలమయినట్లేనా? ఇంకా ఏమైనా ఆశలున్నాయా? కాంగ్రెస్‌తో పొత్తు కథ ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక పొత్తు ఉండదు. ఎలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. మేం ప్రకటించిన 19 స్థానాల్లో అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడుగుతారు. మిర్యాలగూడను ఒకవేళ వాళ్లు మాకిచి్చనా కాంగ్రెస్ పార్టీ తన అభ్యరి్థని ఏదో రకంగా రంగంలోకి దింపేది. అయినా ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు లేకుండా పొత్తు ఎలా ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్‌కు నష్టమే కదా... అలాంటిది మీతో పొత్తు విషయంలో ఎందుకు ఇలా చేస్తుందని భావిస్తున్నారు? మాతో ప్రయోజనం లేదని కాంగ్రెస్ మమ్మల్ని వదిలేసింది. పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు నష్టమట. మాకు సీట్లు ఇస్తే ఓడిపోతామని, అదే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలుస్తారని వారి నమ్మకం. మేము పోటీ చేయడం వల్లే వారికి లాభమట. మాతో చర్చల సందర్భంగా కూడా కాంగ్రెస్ నాయకులు ఈ విధంగానే మాట్లాడారు. అందుకే పొత్తు విషయంలో ముందుకు రావడంలేదు. సీపీఐకి కొత్తగూడెం స్థానంలో మద్దతు ఇస్తారా? అలాగే మీరు పోటీ చేసే 19 స్థానాల్లో మద్దతు కోరతారా? కొత్తగూడెంలో సీపీఐ తరపున పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతు ఇస్తున్నాము. అయితే మేం పోటీ చేసే 19 చోట్ల సీపీఐ మద్దతు ఇస్తుందని నేననుకోను. ఎందుకంటే సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రవ్యాప్తంగా పొత్తులో భాగంగానే కొత్తగూడెం స్థానం కేటాయించారు. కాబట్టి సీపీఐ మాకు మద్దతు ఇవ్వదు. ఒకవేళ వారి ఓటర్లు ఎక్కడైనా మాకు మద్దతు ఇస్తే అది వారిష్టం. బీఆర్ఎస్ది అవకాశవాదమని మీరు భావిస్తున్నారా..? బీఆర్ఎస్గానీ, ఇతర ప్రాంతీయ పార్టీలుగానీ అవకాశవాదంతోనే వ్యవహరిస్తాయి. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదించడమే తమ లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని సృష్టించాలని భావించింది. ఆ సమయంలో కేసీఆర్‌కు మరో మార్గం లేదు. అందుకే బీజేపీని వ్యతిరేకించారు. ఆ తర్వాత కర్నాటక ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంది. కేసీఆర్ మూడ్ మారిపోయింది. బీజేపీతో ప్రమాదం లేదని అర్ధమైంది. ఈ ఎన్నికల తర్వాత సీట్లు తక్కువైతే బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్టుల అవసరం కేసీఆర్‌కు లేదు. అవకాశవాదంతో రాజకీయాలను మార్చారు. ఈ ఎన్నికల్లో ఒక్క సీటయినా సాధిస్తారా..? గెలుస్తామన్న నమ్మకంతోనే 19 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. అన్ని చోట్లా గెలవాలన్నదే మా లక్ష్యం.