Huma Qureshi Opens Up On Getting Body-Shamed In Latest Interview - Sakshi
Sakshi News home page

Huma Qureshi: స్టార్ హీరోయిన్‌కే ఇలా ఉంటే.. మిగతా వాళ్ల పరిస్థితి?

Published Fri, Jul 28 2023 4:07 PM | Last Updated on Fri, Jul 28 2023 4:18 PM

Actress Huma Qureshi Body Shaming Latest Interview - Sakshi

హీరోయిన్ల జీవితం పైకి కనిపించినంత అందంగా ఉండదు. బయటకు నవ్వుతూ, గ్లామర్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నట్లు కనిపిస్తారు కానీ కొందరికి మాత్రం చేదు అనుభవాలు ఎప్పటికప్పుడు ఎదురవుతుంటాయి. పనిగట్టుకుని మరీ కొందరు నెటిజన్స్, సదరు ముద్దుగుమ్మల్ని వేధిస్తుంటారు. సోషల్ మీడియా కల్చర్ పెరిగిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలానే ఓ స్టార్ హీరోయిన్ తనకెదురైన బాడీ షేమింగ్ గురించి బయటపెట్టింది. 

(ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే)

హిందీ సినిమాలు చూసేవాళ్లకు నటి-హీరోయిన్ హ్యుమా ఖురేషి తెలిసే ఉంటుంది. 'గ‍్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత బోల్డ్ రోల్స్‌తో ఫేమస్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. గతంలో ఈమె చేసిన ఓ సినిమా రిలీజ్ తర్వాత, యాక్టింగ్ గురించి పక్కనబెట్టి ఈమె బరువు గురించి ఓ రివ్యూయర్ కామెంట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పి హ్యుమా తెగ బాధపడింది. 

'మీకు సినిమా నచ్చకపోతే నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది మీ ఛాయిస్. కానీ కొందరు ఎందుకు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తారు? నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. ఓసారి నా మూవీ రిలీజైన తర్వాత ఓ రివ్యూయర్.. నా బరువు గురించి రాశారు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దీంతో నాలోనే ఏమైనా లోపం ఉందా అనే డౌట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాలకు రివ్యూల రాయట్లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ మమ్మల్ని కిందకు లాగుతున్నారు' అని హ్యుమా ఆవేదన బయటపెట్టింది.

(ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement