అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి.. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్.
ఏం జరిగింది?
2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన‍్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
బోనీ ఏం చెప్పారు?
'స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది'
'దీంతో దుబాయి పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు తర్వాత నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్‌లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు' అని బోనీ కపూర్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో రతిక రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment