శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్‌తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో మరణించింది.
(ఇది చదవండి: ప్రభాస్ బర్త్‌డే నాడు ఏమైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారా..?)
హీరోల కంటే ఎక్కువ పారితోషికం
శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్‌లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది.
అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్‌స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్‌లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది.
(ఇది చదవండి: బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ)
Comments
Please login to add a commentAdd a comment