బాలీవుడ్‌లో రిచెస్ట్ స్టార్‌ కిడ్‌.. ఏకంగా షారుక్, అమితాబ్‌ను మించి! | Ranbir Kapoor-Alia Bhatt Daughter Raha Kapoor Richest Star Kid In Bollywood | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor-Alia Bhatt: ముద్దుల కూతురికి అత్యంత ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్లంటే?

Published Fri, Mar 29 2024 1:04 PM | Last Updated on Sat, Mar 30 2024 6:14 PM

Ranbir Kapoor-Alia Bhatt Daughter Raha Kapoor Richest Star Kid In Bollywood - Sakshi

గతేడాది యానిమల్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన హీరో రణ్‌బీర్ కపూర్. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. అయితే రణ్‌బీర్‌ కపూర్‌ బాలీవుడ్ హీరోయిన్‌ ఆలియా భట్‍ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. 

‍అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్‌, అమితాబ్ బచ్చన్‌ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. 

రిచెస్ట్  స్టార్ కిడ్.. 

ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్‌లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్‌బీర్‌, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్‌తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement