శ్రీదేవిపై ఫీలింగ్స్‌.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత | Boney Kapoor: My Mother Asked Sridevi to Tie Me a Rakhi | Sakshi
Sakshi News home page

Boney Kapoor: శ్రీదేవితో నాకు రాఖీ కట్టించాలని చూసింది.. నా భార్యకు కూడా తెలుసు!

Published Mon, Apr 1 2024 7:42 PM | Last Updated on Mon, Apr 1 2024 8:18 PM

Boney Kapoor: My Mother Asked Sridevi to Tie Me a Rakhi - Sakshi

దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్‌ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్‌, అన్షులా కపూర్‌ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను.

రాఖీ కట్టించాలని చూసింది
శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్‌ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్‌ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: బాడీ షేమింగ్‌.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement