Boney Kapoor
-
తప్పు అల్లు అర్జున్‌ది కాదు, వాళ్లది! : బోనీ కపూర్
సంధ్య థియేటర్ ఘటనకు హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ను బాధ్యుడిని చేయడం తప్పని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) అన్నారు. ఆ ఘటనలో అల్లు అర్జున్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. హీరోల సినిమాను ఫస్ట్ డే చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఒకసారేమైందంటే హీరో అజిత్ సినిమా తెల్లవారుజామున ఒంటి గంటకు థియేటర్లో ప్రదర్శించారు. ఆ సమయంలో కూడా థియేటర్ బయట దాదాపు 25 వేల మంది ఉన్నారు.థియేటర్ బయట వేలమంది జనంసినిమా చూసి బయటకు వచ్చేసరికి 3.30 నుంచి నాలుగైంది. అప్పుడు కూడా జనాలు అలాగే అక్కడే నిల్చున్నారు. అజిత్ సినిమా అనే కాదు, రజనీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్‌బాబు.. ఇలా స్టార్స్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద అభిమాని మృతి చెందిన ఘటనకు అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం సరికాదు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనాల వల్లే ఆ విషాదం జరిగింది అని బోనీ కపూర్ పేర్కొన్నారు.తొక్కిసలాట.. మహిళ మృతికాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు. అయితే బన్నీ రాకతో జనం అతడిని చూసేందుకు ఎగబడగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెలలో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుతో బన్నీ మరునాడే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పుష్ప నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు.పుష్ప 2 సినిమా..పుష్ప 2 సినిమా విషయానికి వస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1760 కోట్లమేర రాబట్టింది.చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ అర్మాన్ మాలిక్ -
ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్‌కు నాగవంశీ కౌంటర్
బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ! తాజాగా ఇదే అంశంపై నిర్మాతల రౌండ్ టేబుల్లో తెలుగు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi), హిందీ ప్రొడ్యూసర్ బోనీకపూర్ (Boney Kapoor) మాట్లాడారు. దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్‌పై ప్రభావం చూపించిందని, కానీ హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ముంబైకే పరిమితమైందని సెటైర్లు వేశాడు. అది బోనీకపూర్ ఒప్పుకోలేదు. 'రష్యాలో ఇప్పటికీ రాజ్‌కపూర్‌ను గుర్తు చేసుకుంటారు. ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఎగతాళి చేస్తున్నారేంటి?షారూఖ్, బిగ్‌బీకి 'ద కింగ్ ఆఫ్ మొరాకో' అన్న బిరుదు ఇచ్చారు'.. అని బోనీ చెప్పుకుంటూ పోతుండగా కూడా మధ్యలో నాగవంశీ కలగజేసుకున్నాడు. అతడిని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో దూరడంపై బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ సంజయ్ గుప్తా మండిపడ్డాడు. బోనీగారిని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఫైర్ అయ్యాడు. అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి సీనియర్ నిర్మాతల ముందు ఇలా దర్జాగా కూర్చుని ముఖానికి వేళ్లు చూపిస్తూ మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించాడు.బాలీవుడ్ అక్కడే ఆగిపోయిందిబాలీవుడ్ సినీ విశ్లేషకులు సుమిత్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ నాగవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు చిత్రపరిశ్రమ పాన్ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ ఇంకా మసాలా సినిమాల్నే నమ్ముకుంటూ ఎక్కడో ఆగిపోయింది. కానీ ఇక్కడ బోనీకపూర్ గారిని అగౌరవపర్చడం అనవసరం. చెప్పాలనుకున్నదేదో మర్యాదగా చెప్పుంటే అయిపోయేది. ఎంతోమంది దక్షిణాది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు, హీరోలు హిందీ సినిమాపై ఎనలేని ప్రేమ చూపిస్తారు.విమర్శ తప్పు కాదు, కానీ!అమితాబ్, ప్రకాశ్ మెహ్రా, యష్ చోప్రా, మన్మోహన్ దేశాయ్ వంటి గొప్పవాళ్ల సినిమాలను ఆదర్శంగా తీసుకునే కమర్షియల్ సినిమాలు తీస్తున్నామని చెప్తుంటారు. సౌత్ సినిమాల కలెక్షన్స్‌లో హిందీ బాక్సాఫీస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోవచ్చు. విమర్శ తప్పనడం లేదు, కానీ అవమానించడం మాత్రం తప్పే! ఇలా యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి వెళ్లిపోతారు జాగ్రత్త! ఇది ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది అని ట్వీట్ చేశాడు.మీరు నేర్పించనక్కర్లేదుదీనికి నిర్మాత నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పెద్దవారిని ఎలా గౌరవించాలనేది నువ్వు నేర్పించనక్కర్లేదు. బోనీగారిని మీకంటే ఎక్కువే గౌరవిస్తాం. ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపర్చలేదు. మేమంతా ఎంతో బాగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. ఇంటర్వ్యూ అయ్యాక ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నాం. కాబట్టి నువ్వు చూసినదాన్ని బట్టి అదే నిజమని డిసైడ్ అయిపోకండి అని రాసుకొచ్చాడు. You don’t need to teach us how to respect elders, we respect boney ji more than u guys do and there was no disrespect towards boney ji in that conversation it was a healthy discussion, me and boney ji had a nice laugh and hugged each other after the interview… So please dont…— Naga Vamsi (@vamsi84) December 31, 2024 చదవండి: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..? -
బాలీవుడ్‌పై నాగవంశీ అలాంటి కామెంట్స్.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, యానిమల్, జవాన్ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్ అని బోనీ కపూర్ అన్నారు. అయితే మలయాళ సినిమాకు గల్ఫ్‌లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్‌ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్, అల్లు అర్జున్, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు. -
శ్రీదేవి నాతో ఉన్నట్లే ఉంది.. అప్పుడెంతో ప్రయత్నించా, కానీ..: బోనీ కపూర్
ఇప్పటికీ నా భార్య నాతోనే ఉన్నట్లుంది అంటున్నాడు నిర్మాత బోనీ కపూర్. బరువు తగ్గడమే పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు 14 కిలోలు తగ్గిపోయాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మొదట్లో నాకు తెలియకుండానే కొంత బరువు తగ్గాను. దాదాపు 13-14 కిలోల మేర తగ్గానని తెలుసుకున్నప్పుడు మరింత బరువు తగ్గాలనిపించింది. పైగా కాస్త సన్నబడ్డాక నా శరీరాకృతి కూడా మారింది. అలా అధిక బరువు ఉన్న నేను 95 కిలోలకు వచ్చాను. నాకు నేనే నచ్చలేదునా ఎత్తూపొడుగుకు 87-88 ఉండాలట! అంటే ఇంకా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాల్సి ఉంది. తు ఝూటి మే మక్కర్ సినిమా సమయంలో అయితే బొద్దుగా ఎప్పటిలాగే ఉన్నాను. ఎప్పుడైతే నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నానో నాకు నేనే నచ్చలేదు. అందుకే ఆ సినిమా తర్వాత నేను సన్నబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య శ్రీదేవి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపించేది. తనతో కలిసి వాకింగ్‌కు వెళ్లేవాడిని, జిమ్‌కు వెళ్లేవాడిని.నా వల్ల కాలేదుఎప్పుడు, ఏం తినాలనే విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించేది. నేనూ ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కానీ గత రెండేళ్లుగా నన్ను నేను చూసుకున్నప్పుడు మార్పు అవసరం అనిపించింది. ఈ ప్రయాణంలో శ్రీదేవి నావెంటే ఉన్నట్లుగా ఉంది. బరువు తగ్గడానికి తను నన్ను ప్రేరేపిస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పుడు నా లుక్ చూసి పై లోకంలో ఉన్న నా భార్య కచ్చితంగా గర్వపడుతుంది అంటున్నాడు. కాగా శ్రీదేవి- బోనీకపూర్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషి కపూర్ సంతానం. 2018లో శ్రీదేవి మరణించింది.చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్ -
శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు మాత్రం రెండో పెళ్లి అంటేనే వింతగా చూసేవాళ్లు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా నిర్మాత బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. కాకపోతే ఆయనకు అప్పటికే పెళ్లయి కొడుకు కూతురు ఉన్నారు. ఆ కుర్రాడే అర్జున్ కపూర్. హిందీలో హీరోగా పలు సినిమాలు చేసిన ఇతడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తండ్రి రెండో పెళ్లి, తల్లితో బాండింగ్ గురించి బయటపెట్టాడు.'నాకు పదేళ్ల వయసున్నప్పుడు నాన్నఅమ్మ విడిపోయారు. అప్పుడు చాలా బాధపడ్డా. విడాకులు తీసుకునేప్పుడు నాన్న.. రెండు పెద్ద సినిమాలు చేస్తున్నారు. పని హడావుడిలో ఉండేవాళ్లు. దీంతో మా మధ్య మంచి రిలేషన్ లేదు. అలా మాటలు కూడా తగ్గిపోయాయి. మాది కాస్త పేరున్న కుటుంబం కావడంతో ఇంట్లోని విషయాలు తెలుసుకునేందుకు బయటవాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు. నా క్లాస్మేట్స్ కూడా నాన్న గురించి గుసగుసలాడేవారు. దీంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. సినిమాలపై ఆసక్తి పెరిగింది'(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్)'ఓ వయసొచ్చాక తొలి సినిమా చేశా. కానీ అది రిలీజ్ కావడానికి ముందే అమ్మ చనిపోయింది. జీవితంలో ఇలా ఎదురుదెబ్బలు తగిలేసరికి నన్ను నేను చాలా మార్చుకున్నా. బాగా ఆలోచించడం నేర్చుకున్నా. దీంతో రానురాను నాన్నతో మంచి బంధం ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి (శ్రీదేవితో పెళ్లి) ఆయన సంతోషంగా ఉన్నంత కాలం నేను దాన్ని తప్పు అనుకోను' అని అర్జున్ కపూర్ చెప్పాడు.1983లో బోనీకపూర్ - మోనా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు (అర్జున్, అన్షుల) పిల్లలు. 1996లో ఈ జంట విడిపోయింది. అదే ఏడాది బోనీకపూర్.. నటి శ్రీదేవిని వివాహమాడాడు. ఆ సమయంలో ఇది బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పొరపాటు చేసి క్షమాపణ చెప్పిన రష్మిక) -
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.టిఫిన్ దగ్గర గొడవదేవర ప్రమోషన్స్‌లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్‌లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్‌లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది. -
ఫేమస్ కావడానికే టార్గెట్ చేశాడు: అర్షద్ వార్సీపై బోనీ కపూర్ ఆగ్రహం
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో ప్రస్తుతం ఆ పేరు ఒక్కటే వినిపిస్తోంది. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేశాడు నటుడు అర్షద్ వార్సీ. అతను చేసిన కామెంట్స్ ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. అయితే అర్షద్ కేవలం ప్రభాస్‌ను మాత్రమే కాదు.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌పై సైతం విమర్శలు చేశారు. అతని సినిమా కోసం పని చేశానని.. కానీ సరైన పారితోషికం చెల్లించలేదని అర్షద్ వార్సీ ఆరోపణలు చేశారు.అయితే తాజాగా తనపై చేసిన కామెంట్స్‌పై బోనీ కపూర్ రియాక్ట్ అయ్యారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వింటే కామెడీగా ఉందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని.. ఇప్పుడు అతనికి నేను దొరికానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. శ్రీదేవి, అనిల్ కపూర్ జంటగా 1993లో వచ్చిన చిత్రం రూప్ కి రాణి చోరోన్ కా రాజా. ఈ సినిమాలోని ఒక పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు బోనీ కపూర్ ప్రొడక్షన్ హౌస్ తనకు రూ. 25 వేలు తక్కువగా చెల్లించిందని అర్షద్ వార్సీ ఇటీవల ఆరోపించాడు. తాజాగా వార్సీ ఆరోపణలపై బోనీ కపూర్ కౌంటరిచ్చారు.బోనీ మాట్లాడుతూ..'అర్షద్ స్టేట్మెంట్ చదివి నవ్వుకున్నా. 1992లో సినిమా పాటను షూట్ చేశాం. ఆ సమయంలో అతను పెద్ద స్టార్ కాదు. అతనికి అంత పెద్ద మొత్తం ఎవరు చెల్లించారు?. షూటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పడుతుందని అనుకున్నాం. కానీ మూడు రోజుల్లోనే పూర్తయింది. అర్షద్‌కు రోజుకు రూ.25 వేలు చెల్లించారు. మూడు రోజులకు కలిపి రూ.75,000 ఇచ్చారు. అసలు పారితోషికం విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదు' అని ప్రశ్నించారు. అంతకుముందు ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ..'ఆ సినిమా వర్క్ కోసం నన్ను సంప్రదిస్తే కొరియోగ్రఫీ చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని రూ.లక్ష పారితోషికం అడిగా. అప్పుడు ఓకే అన్నారు. కానీ పాటను త్వరగా పూర్తి చేయమని నన్ను అడిగారు. నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పా. మూడు రోజుల్లోనే పని పూర్తి చేశా. చెక్కు తీసుకోవడానికి వెళ్తే రూ.75 వేలే ఇచ్చారు. అదేంటని అడిగితే నాలుగు రోజులకు రూ.లక్ష కదా.. మూడు రోజుల్లోనే పూర్తయినందుకు అంతే అన్నారని' తెలిపారు. -
తనే ఆదర్శం.. 14 కిలోలు తగ్గా.. ఇంకా..: బోనీ కపూర్
దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ తన శరీరంపై దృష్టి పెట్టాడు. బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈపాటికే 14 కిలోల దాకా బరువు తగ్గాడు. తాజాగా తన ట్రాన్స్ఫర్మేషన్ను తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో కూడా షేర్ చేశాడు. సోమవారం (ఆగస్టు 19న) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో బోనీ బక్కచిక్కి కనిపించాడు.నా జుట్టు ఒత్తుగా కనిపిస్తోంది. ఇప్పుడు మరింత బెటర్‌గా కనిపిస్తున్నాను. ఇప్పటివరకు 14 కిలోలు తగ్గాను.. ఇంకా 8 కిలోల దాకా తగ్గాల్సి ఉంది. నా జాన్ (శ్రీదేవి)ను ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గే పని మొదలుపెట్టాను. ఆమె ఆలోచనలు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. తను నిత్యం నాతోనే ఉంటుంది అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. బోనీని ఇలా సన్నగా చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు అతడిని పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు.ఎప్పుడూ బట్టతలతో కనిపించే బోనీ కపూర్ ఇప్పుడు ఒత్తైన జుట్టుతో కనిపించడంతో పలువురూ షాక్‌కు గురవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. అందుకే బోనీకి బట్టతల కనిపించకుండా పోయింది. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) -
అమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్.. ఆమె ఏమన్నారంటే?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఉలజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించారు.జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.సీక్వెల్‌పై బోనీ కపూర్కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌పై హింట్ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై బోనీ కపూర్, సురీందర్ కపూర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు. -
గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్
ఒక టైమ్ మెషీన్లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్‌ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఎవరైనా దేని గురించైనా ఆరా తీస్తే చాలు.. కొందరు ఏదీ దాచుకోకుండా ఉన్నదంతా కక్కేస్తారు. దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా అంతే! మీడియా అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా బదులిస్తుంటాడు. ఇంటి విషయాలను కూడా పూసగుచ్చినట్లు చెప్తుంటాడు. ఈ వైఖరి వల్ల పిల్లలు ఇబ్బందిపడుతున్నారట! ఈ విషయాన్ని బోనీ కపూరే వెల్లడించాడు.నా కుటుంబం గురించి అడగొద్దుతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్‌కు.. పబ్లిక్‌గా కుటుంబం గురించి పొరపాటున ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? దీనివల్ల ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చాయా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు 'ఇది చాలాసార్లు జరిగింది. అందుకే ఇంటర్వ్యూకి కూర్చునే ముందు అక్కడున్నవారికి కేవలం నా గురించి మాత్రమే అడగండి, నా కుటుంబం గురించి అడగొద్దు అని మరీ మరీ చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటాను. వాళ్లకు నచ్చదుఅది నా పిల్లలకు అస్సలు నచ్చదు. ఎందుకలా ప్రతీది చెప్తావని కోప్పడతారు. ముఖ్యంగా యాక్టింగ్‌కు సంబంధించిన విషయాలను జనాలే తెలుసుకోవాలి తప్ప తమంతట తాముగా చెప్పకూడదంటారు. నేనేమో అవన్నీ ముందే లీక్ చేస్తుంటాను. వారు హర్ట్ అయ్యారని అర్థమవగానే తప్పయిపోయిందంటూ సారీ చెప్పేస్తాను' అని బదులిచ్చాడు.అందరం ఏడ్చేశాంఈ మధ్య అలాంటిదేమైనా జరిగిందా? అన్న ప్రశ్నకు.. 'ఇప్పట్లో ఏమీ జరగలేదు కానీ గతంలో నేను మీడియా ముందు ఉన్నదంతా మాట్లాడటం వల్ల వాళ్లు చాలా అప్సెట్ అయ్యారు. నన్ను తిట్టారు. నేను బాధపడేసరికి ఏడ్చేశారు. నేనూ ఏడ్చేశాను. సారీ చెప్తుంటే అలా మాట్లాడొద్దని వాళ్లే బుజ్జగించారు' అని బోనీకపూర్ చెప్పుకొచ్చాడు.చదవండి: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది! -
స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్!
అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిత్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే బోనీ కపూర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. "ప్రియమణి లాంటి అందరికీ బాగా తెలిసిన హీరోయిన్‌తో అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. బోనీ కపూర్ జీ మీరేమైనా ఇండియాలో హార్వే వైన్స్టెయిన్ అనుకుంటున్నారా? లేదా ఆ బహుమతిని తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాగా.. బోనీ కపూర్ మహిళలతో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మొదటిసారి కాదని నెటిజన్లు అంటున్నారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై చేతులు వేసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు కూడా నెటిజన్లు విమర్శలు చేశారు. అంతే కాదు ఓ కార్యక్రమంలో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు -
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. -
స్టైయిలిష్ లుక్‌లో స్లిమ్‌గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్‌లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్‌కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్‌కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
శ్రీదేవిపై ఫీలింగ్స్.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత
దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్, అన్షులా కపూర్ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను. రాఖీ కట్టించాలని చూసింది శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్‌గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్‌ను సెట్ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్‌లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్‌నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్‌తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్‌గారి టీమ్‌లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్‌చరణ్‌గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
68 ఏళ్ల వయసులో శ్రీదేవి భర్త హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య జుట్టు ఊడటం. ఎన్నిరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా జుట్టు కాపాడుకోవడం గగనమైపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇదే పరిస్థితి. ఇక వయసు పైబడినవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బట్టతలతోనే నెట్టుకువస్తున్నారు. చాలామంది జుట్టు ఊడటాన్ని ఆపలేక హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. బట్టతలను కప్పిపుచ్చుకోవడానికి ఇది చక్కటి మార్గం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తాజాగా దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బోనీ కపూర్ అదే క్లినిక్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇంకేముంది, అతడి బట్టతలను కాస్తా నిండైన ఒత్తైన వెంట్రుకలతో నింపేశారు. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్.. ఇది చూసిన బోనీ కపూర్.. నా తలపై వెంట్రుకలు వచ్చాయ్. ఇది నా లుక్కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి అని చెప్పుకొచ్చాడు. 68 ఏళ్ల వయసులో జుట్టు కోసం ఆరాటపడుతుండటం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన బోనీ కపూర్ గతేడాది 'తు జూటీ మై మక్కర్' సినిమాతో నటుడిగా మారాడు. ఇందులో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చదవండి: షణ్ముఖ్ అన్న ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో.. -
రామ్ చరణ్‌తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ
రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న (బోనీ కపూర్) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా ఉంది. దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్‌ను ప్రశ్నించగా.. రామ్ చరణ్‌తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ, బోనీకపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్‌గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్సీ 16’ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. -
చరణ్ సినిమాలో జాన్వీ కన్ఫర్మ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ చాలామందికి తెలుసు. చిన్నప్పటి నుంచి ఈమెని అభిమానులు చూస్తూ వచ్చారు. అయితే బాలీవుడ్‌లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ అయితే లేవు. కానీ 2024లో మాత్రం ఈమె దశ మారిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా రామ్ చరణ్ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్గా ఖరారైందని ఈమె తండ్రి బోనీ కపూర్ చెప్పేశారు. (ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో) హిందీ సినిమాల వల్ల జాన్వీకి అంతంత మాత్రంగానే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ 'దేవర'లో ఈమెనే హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందో ఈమె లక్ కాస్త మారిందని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలైతే ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ దీనికంటే ముందే రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీనే హీరోయిన్గా చేయబోతుంది. తాజాగా ఈమె తండ్రి బోనీ కపూర్.. ఈ విషయాన్ని ఖరారు చేశారు. అయితే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడమే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ కొన్ని కండీషన్స్ పెడుతోందట. దాదాపు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. తెలుగులో స్టార్ హీరోయిన్ లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఇది. ఇక్కడ ఒక్క మూవీ చేయకుండానే ఇంత డిమాండ్ చేస్తోంది. అలానే తెలుగులో స్టార్ హీరోలవి తప్పితే మిగతా చిత్రాల్లో నటించకూడదని కూడా ఫిక్సయిందట. ఇప్పుడు ఈ విషయాలే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. (ఇదీ చదవండి: అనుపమ అభిమాని వీడియో.. ఎందుకు ఇలా చేస్తున్నారని ఆవేదన) #JanhviKapoor Roped in for #RC16 as Female Lead - Confirms @BoneyKapoor !!@AlwaysRamCharan @BuchiBabuSana @arrahman pic.twitter.com/aotWNH9tOT — Trends RamCharan ™ (@TweetRamCharan) February 18, 2024 -
ఆస్తులు అమ్మేస్తున్న శ్రీదేవి భర్త!
సీనియర్ సినీ నిర్మాత బోనీ కపూర్, అతని కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ముంబైలోని అంధేరి శివారులో ఉన్న తమ నాలుగు అపార్ట్మెంట్లను విక్రయించినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్లను రూ. 6.02 కోట్లకు విక్రయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం 2023 నవంబర్ 2 నమోదైనట్లు తెలుస్తోంది. రెండు అపార్ట్మెంట్లు లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో ఉన్నాయి. రెండు ఫ్లాట్ల విస్తీర్ణం 1870.57 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్లు ఒక ఓపెన్ కార్ పార్కింగ్తో వస్తాయి. ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు సిద్ధార్థ్ నారాయణ్, అంజు నారాయణ్‌గా చెబుతున్నారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్లను వారు మరో రూ. 6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2023 అక్టోబర్ 12 న జరిగినట్లు సమాచారం. 1614.59 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు రెండు కార్ పార్కింగ్‌లతో వస్తాయి. వీటిని ముస్కాన్ బహిర్వానీ, లలిత్ బహిర్వానీలకు విక్రయించినట్లు సమాచారం. 2022లో బోనీ, జాన్వీ, ఖుషీలు 65 కోట్ల రూపాయల విలువైన బాంద్రాలో డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 6421 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఇందులో ఐదు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే.. గతంలో ఆస్తులు విక్రయించిన సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఖరీదైన ప్లాట్లను కొనుగోలు చేయడం, విక్రయించడం కొత్తేమీ కాదు. కొన్ని నెలల క్రితం నటుడు 'రణవీర్ సింగ్' ముంబైలోని ఒక లగ్జరీ టవర్లోని రెండు ఫ్లాట్లను రూ.15.24 కోట్లకు విక్రయించాడు. నవంబర్‌లో నటి 'ప్రియాంక చోప్రా' ఓషివారాలోని లోఖండ్వాలా కాంప్లెక్స్‌లో 2,292 చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను రూ. 6 కోట్లకు విక్రయించింది. -
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్‌తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్‌డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్‌స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) -
కోట్ల బడ్జెట్.. రిలీజ్‌కు నోచుకొని స్టార్ హీరో సినిమా!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల రిలీజ్‌కు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయితే... కావాల్సినన్ని థియేటర్స్ లభించవు. సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా తక్కువకే అడుగుతుంటారు. ఇలా చిన్న సినిమాల కష్టాలు చాలా ఉంటాయి. కొన్ని సినిమాలు అయితే అసలు రిలీజ్‌కే నోచుకోవు. కానీ పెద్ద సినిమాలకు అలాంటి కష్టాలు ఉండవని అంటారు. ఎప్పుడు అంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. ముందస్తు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. రిలీజ్ తర్వాత అట్టర్ ఫ్లాప్ టాక్ వస్తే తప్ప.. బడా సినిమాల మేకర్స్‌కు పెద్ద కష్టాలేమి ఉండవని అనుకుంటారు. కానీ వందల కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కించిన చిత్రాలు కూడా అప్పుడప్పుడు విడుదలకు నోచుకోవు. దానికి ‘మైదానం’ చిత్రమే అతి పెద్ద ఉదాహారణ అని చెప్పొచ్చు. మూడేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి.. ఆర్ఆర్ఆర్తో పోటీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా, బోనికపూర్ నిర్మించిన చిత్రమే ఈ ‘మైదానం’. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్, మేనేజర్ (1950 –1963 సమయంలో) సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్. కరోనా కంటే ముందే అంటే 2019లో ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020లో ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. 2021లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఇక 2022లో ఆర్ఆర్ఆర్తో పోటీగా బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు కానీ మళ్లీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. రిలీజ్ కష్టమేనా బోనీ కపూర్ భారీ బడ్జెట్‌తో మైదాన్ చిత్రాన్ని నిర్మించాడు. కరోనా కారణంగా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఈ చిత్రానికి ఖర్చు చేశారట. ఈ చిత్రం కోసం ఒక పెద్ద గ్రౌండ్ ని అద్దెకు తీసుకుని దాంట్లో నిజమైన గడ్డిని పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రోజుకు దాదాపు 500 మందితో షూటింగ్ చేశారట. గ్యాలరీలు, స్టాండ్లు అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ వేశారు. అయితే లాక్‌డౌన్‌తో పాటు 2021లో వచ్చి తుపాను కారణంగా దాదాపు రూ.30 కోట్లతో నిర్మించిన సెట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయట. ఇన్సురెన్స్ సొమ్ము కూడా రాకపోవడంతో నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పటికే సినిమాకు కోట్ల ఖర్చు పెట్టారు. రెండేళ్ల క్రితమే రిలీజ్ అయితే భారీగా నష్టాలు వచ్చే కావు. కానీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి నిర్మాత కూడా ఇష్టపడడం లేదు. ఈ చిత్రం గురించి బోనీ కపూర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారి పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక సినిమా విషయంలో ఇంతగా ఎదురు దెబ్బ తింటానని ఊహించలేదు’అని అన్నారు. దీన్ని బట్టి ‘మైదానం’ సినిమా థియేటర్స్‌లోకి రావడం కష్టమే. -
పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
అలనాటి అందాల నటి శ్రీదేవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జాన్వీ కపూర్ పుట్టిన రోజుపై వస్తోన్న రూమర్స్‌పై ఆయన స్పందించారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) గతంలో కూడా జాన్వీకపూర్ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నోరు విప్పారు. ఆ రూమర్స్ ఎలా వచ్చాయో స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే శ్రీదేవి-బోనీ కపూర్ వివాహంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మాట్లాడుతూ..'నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. కొద్ది నెలలకే మా పెళ్లి విషయాన్ని బయటికి చెప్పాం. ఆ తర్వాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాం కూడా. మాకు జాన్వీ కపూర్ 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవీ ఇప్పటీకీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. తన పుట్టినరోజు గురించి స్వయంగా నేను చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు' అంటూ వెల్లడించారు. అలాగే శ్రీదేవికి దైవభక్తి ఎక్కువని అన్నారు. తన పుట్టినరోజున కచ్చితంగా తిరుమల వెళ్లేవారని తెలిపారు. (ఇది చదవండి: 'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!) -
శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!
అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి.. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఏం జరిగింది? 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) బోనీ ఏం చెప్పారు? 'స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది' 'దీంతో దుబాయి పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు తర్వాత నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు' అని బోనీ కపూర్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో రతిక రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?)